సాక్షి, న్యూఢిల్లీ : గూఢచర్య ఆరోపణలపై పాక్ జైల్లో బంధీగా ఉన్న కులభూషణ్ జాదవ్‌ను ఎట్టకేలకు ఆయన కుటుంబ సభ్యులు కలుసుకోవటంతో కాస్త ఊరట పొందారు. అయితే ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిస్థితులే తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జాదవ్ తల్లి అవంతి, భార్య చేతన్‌కుల్ ను పాక్ అధికారులు అవమానించటం.. మన రాజకీయ పక్షాలెన్నీ ఏకమై పాక్ తీరుకు వ్యతిరేకంగా గళం వినిపించటం చూశాం.
కానీ, పాక్ గురించి తెలిసి కూడా కేంద్రం ముందుకు వెళ్లటాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబడుతోంది. ఇదో దౌత్యపరమైన అపజయంగా ఇప్పటికే అభివర్ణించిన కాంగ్రెస్ తాజాగా ప్రభుత్వంపై ప్రశ్నలు గుప్పించింది. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత మనీష్ తెవారి జాదవ్ కుటుంబానికి జరిగిన అవమానాన్ని ఖండిస్తూనే.. ఓ సందేశం ఉంచారు.
1. ఏ ఒప్పందం మేరకు భారత్-పాక్ ఈ కలయికకు ఏర్పాటు చేశారు.
2. పాక్ కుటిలబుద్ధి తెలిసి కూడా దౌత్యానికి భారత్ ఎందుకు మొగ్గుచూపింది?. అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీఆర్‌సీ పద్ధతి) ద్వారానో లేదా కనీసం, ఐక్యరాజ్యసమితి ద్వారానో ముందుకు వెళ్లాలే తప్ప.. ఇలాంటి మార్గం ఎందుకు ఎంచుకుంది?
ఈ రెండు ప్రశ్నలకు జవాబు చెప్పాలంటూ ఆయన తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
Pak’s mistreatment of Jadhav’s family unequivocally condemnable but-1.What were ground rules settled between India&Pak about the meeting?2 Knowing Pak’s perfidy fully well why did India not ask ICJ to facilitate meeting through ICRC or any other UN body rather than bilaterally???
— Manish Tewari (@ManishTewari) December 29, 2017
ఇక పాక్ విదేశాంగ కార్యాలయం వెలుపల కులభూషణ్ జాదవ్ తల్లి, భార్యలను పాక్ మీడియా ఎలా వేధించాయో కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మీరు ఓ టెర్రరిస్టుకు తల్లిగా ఎలా ఫీలవుతున్నారు? అంటూ ఇబ్బందికర ప్రశ్నలతో జాదవ్ తల్లిపై పాక్ మీడియా ప్రశ్నలు గుప్పించాయి.
Comments
Please login to add a commentAdd a comment