kulabhushan jadhav
-
కులభూషణ్ జాదవ్.. భారత్‌కు పాక్ కోర్టు గడువు
Kulbhushan Jadhav Case: పాక్‌లో బంధీగా ఉన్న కులభూషణ్ జాదవ్ మరణ శిక్ష వ్యవహారంలో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏప్రిల్ 13 లోగా జాదవ్ తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాదిని నియమించాలని, సదరున్యాయవాది వాదనలకు హాజరు కావాల్సి ఉంటుందని ఇస్లామాబాద్ హైకోర్టు, భారత్‌కు స్పష్టం చేసింది. అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యంతో కులభూషణ్ జాదవ్ తన మరణశిక్షకు వ్యతిరేకంగా అభ్యర్థన పిటిషన్ దాఖలు చేసిన అవకాశం దొరికిన విషయం తెలిసిందే. తదనంతరం జాదవ్ తరపున వాదనలు వినిపించాల్సిన న్యాయవాది విషయంపై ప్రతిష్టంభన ఏర్పడింది. జాదవ్ తరపున వాదనలు వినిపించే న్యాయవాది అంశంపై పాక్ డ్రామాలు మొదలుపెట్టింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ఇస్లామాబాద్ హైకోర్టు ధర్మాసనం 2020 ఆగష్టులో.. పాక్ నుంచే న్యాయవాది నామినేట్ చేయాలని తీర్పు ఇచ్చింది. అయితే భారత్ మాత్రం ఆ తీర్పును వ్యతిరేకించింది. మొదటి నుంచి జాదవ్ విషయంలో పాక్ మిలిటరీ ఆడుతున్న డ్రామాలు అందరికీ తెలుసని, అందుకే తమ దేశం తరపున న్యాయవాదినే నియమిస్తామని పాక్‌పై ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ హైకోర్టు భారత్‌కు గడువు విధించడం విశేషం. భారత్ కావాలనే జాప్యం చేస్తోంది: పాక్ ఇస్లామాబాద్ హైకోర్టులో వాదనల సందర్భంగా అటార్నీ జనరల్ ఆఫ్ పాకిస్థాన్ ఖలీద్ జావెద్ మాట్లాడుతూ.. భారత్ ఈ వ్యవహారంలో కావాలనే జాప్యం చేస్తోంది. తద్వారా మరోసారి పాక్ ఉల్లంఘనలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది అంటూ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. నవంబర్ 2021లో పాక్ పార్లమెంట్ జాదవ్‌కు రివ్యూ పిటిషన్‌కు హక్కు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. భారత నావికాదళంలో పదవీ విరమణ చేసిన కుల్‌భూషణ్ జాదవ్‌కి, గూఢచర్యం, ఉగ్రవాద ఆరోపణలతో పాకిస్తాన్ మిలిటరీ కోర్టు 2017లో మరణశిక్ష విధించింది. అయితే 2019లో అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యం తర్వాత జరిగిన పరిణామాలతో మరణ శిక్ష తీర్పును సమీక్షించడానికి ఇస్లామాబాద్ హైకోర్టు కేసు విచారణ చేపట్టింది. -
Kulbhushan Jadhav Case : కీలక పరిణామం
ఇస్లామాబాద్: భారతీయ నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్(51) కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాక్ తాజా చర్యతో ఆయనకు భారీ ఊరట లభించింది. తన శిక్షపై అప్పీల్ చేసుకునే హక్కు ఆయనకు ఇప్పుడు లభించింది. అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తీర్పు మేరకు పాక్ జాతీయ అసెంబ్లీలోని దిగువ సభ, ఐసీజే (రివ్యూ అండ్ రీ కన్సిడరేషన్) బిల్లు–2020ను గురువారం ఆమోదించింది. జాదవ్‌ని గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై 2017 ఏప్రిల్‌లో పాక్ మిలటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. జాదవ్‌కు ఎలాంటి దౌత్యసాయం కల్పించకుండా, న్యాయవాదులు కలవడానికి వీల్లేకుండాచేసి, ఆయన వాదనలు వినకుండా ఉరికంబం ఎక్కించాలని పాక్ కుట్ర పన్నింది. భారత్ పంపిన దౌత్యాధికారులను జాదవ్‌ను కలవనివ్వకుండా పాక్ ప్రభుత్వం అడ్డుకుంది. దీంతో భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంలో జాదవ్ మరణ శిక్షపై సవాల్ చేసింది. ఐసీజే చొరవతో.. వాదోపవాదాలు విన్న ఐసీజే జాదవ్ మరణశిక్షపై పాకిస్తాన్ పునఃపరిశీలన చేయాలని, ఏ మాత్రం జాప్యం లేకుండా ఆయనకు న్యాయవాదుల్ని నియమించుకునే అవకాశం ఇవ్వాలంటూ ఆదేశాలిచ్చింది. దీంతో పాక్ ప్రభుత్వం ఇప్పుడు ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. దీనికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆర్డినెన్స్ 2020 అని పేరు పెట్టింది. సంవత్సరం సాగదీత తర్వాత గురువారం విపక్ష పార్టీల గందరగోళం, సభ నుంచి వాకౌట్ల నడుమ పాక్ ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. దీంతో తనకు విధించిన మరణ శిక్షపై జాదవ్ ఏ హైకోర్టులోనైనా అప్పీలు చేసుకోవచ్చు. ఈ చర్య ద్వారా తాము ఎంత బాధ్యతాయుతంగా ఉంటామో ప్రపంచ దేశాలకు తెలిసిందని పాక్ న్యాయశాఖ మంత్రి ఫరోగ్ నసీమ్ వ్యాఖ్యానించారు. ఇక ఇరుదేశాలకు ఆమోదయోగ్యమైన లాయర్లతో జాదవ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకునే వీలు కల్పించింది. అయితే భారత్ మాత్రం ఇక్కడి లాయర్‌ను నియమించాలని ప్రయత్నిస్తోంది. కాగా, గూఢచర్యం ఆరోపణలతో జాదవ్‌ను బలూచిస్థాన్‌లో పాక్ అరెస్ట్ చేసిందని ప్రకటించుకోగా.. కాదు జాదవ్‌ను ఇరాన్‌లోని చబాహర్ పోర్టులో అరెస్ట్ చేశారని భారత్ పేర్కొంది. నిజానికి ఐసీజే ఈ ఆదేశాలిచ్చి ఏడాదికి పైనే గడుస్తున్నా.. పాక్ వక్రబుద్ధి ప్రదర్శిస్తూ ఆలస్యం చేస్తూ వచ్చింది. తన కొడుకు విషయంలో ఇది ఊరట కలిగించే విషయమని, పాక్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు జాదవ్ తండ్రి సుధీర్ పేర్కొన్నాడు. ఇది మన దౌత్య విభాగం సాధించిన విజయమని జాదవ్ స్నేహితుడు అరవింద్ మీడియాకు తెలిపాడు. చదవండి: పాక్ కొత్త కుట్ర -
ఎట్టకేలకు న్యాయసహాయం!
-
జాదవ్ కేసులో విచారణ షురూ
-
జాదవ్ కేసులో విచారణ షురూ
హేగ్ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నెలకొనగా, ఇదే సమయంలో కుల్ భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్ధానంలో విచారణ ప్రారంభమైంది. గూఢచర్యం ఆరోపణలపై 2016లో బెలూచిస్తాన్‌లో అరెస్టైన జాదవ్‌కు పాక్ సైనిక కోర్టు మరణ శిక్ష విధించింది. పాక్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ భారత్ అంతర్జాతీయ న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. ఈ కేసులో తీర్పు వెలువరించే వరకూ శిక్ష అమలును నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్ధానం స్పష్టం చేసింది. జాదవ్ భారత్ గూఢచారిగా పాక్ పేర్కొంటుండగా, రిటైర్డ్ నేవీ అధికారి జాదవ్‌ను కిడ్నాప్ చేశారని భారత్ పేర్కొంటోంది. కాగా జాదవ్ కేసులో భారత్ తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే అంతర్జాతీయ న్యాయస్ధానంలో వాదనలు వినిపిస్తున్నారు. భారత్‌పై పాక్ దుష్ర్పచారం భారత్‌కు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసేందుకు పాకిస్తాన్ న్యాయస్ధానాన్ని వాడుకుంటోందని సాల్వే ఆరోపించారు. జాదవ్‌కు మరణ శిక్ష విధిస్తూ పాకిస్తాన్ సైనిక కోర్టు చేపట్టిన విచారణ సరైన పద్ధతిలో సాగలేదని స్పష్టం చేశారు. కాన్సులర్ కస్టడీ లేకుండా జాదవ్ కస్టడీ కొనసాగింపు చట్టవిరుద్ధమని ప్రకటించాలని సాల్వే కోరారు. వాస్తవాలను వక్రీకరించడంలో పాకిస్తాన్ ఘనత విస్మరించలేనిదని చురకలు అంటించారు. జాదవ్‌ను దోషిగా తేల్చే ప్రక్రియలో ప్రత్యేక దశలను నిర్ధిష్టంగా వెల్లడించేందుకు పాకిస్తాన్ విముఖత వ్యక్తం చేస్తోందని సాల్వే అభ్యంతరం వ్యక్తం చేశారు. -
పాక్ లేఖాస్త్రం.. మరో కుట్ర!
ఇస్లామాబాద్ : భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ వ్యవహారంలో పాకిస్థాన్ వేగంగా పావులు కదుపుతోంది. జైల్లో ఉన్న జాదవ్ ‘భారత గూఢాచారి’ అని నిరూపించేందుకు బలమైన సాక్ష్యాలను సేకరించే పనిలో ఉన్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ న్యాయస్థానం లభించిన క్లియరెన్స్‌తో భారత్ నుంచి జాదవ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖకు ఓ లేఖ రాసింది. ‘పట్టుబడే సమయంలో జాదవ్ భారత నేవీ అధికారిగా కొనసాగుతున్నారు’’ ఇది పాక్ బలంగా వినిపిస్తున్న ఆరోపణ. దీనిని నిరూపించేందుకు తగిన సమాచారం సేకరించేందుకు ఐసీజే నుంచి ప్రత్యేక అనుమతిని పొందింది. దీంతో తాజాగా పాక్ భారత విదేశాంగ శాఖకు ఓ లేఖ రాసింది. ‘జాదవ్ వ్యక్తిగత విషయాలు, ఆయన ఉద్యోగంలో చేరిన తేదీ-విరమణ పొందిన తేదీ, పాస్‌పోర్ట్ వివరాలు, బ్యాంక్ అకౌంట్, పెన్షన్ తదితర అంశాలపై పూర్తి వివరాలను తమకు ఇవ్వాలి’’ అని పాక్ కోరింది. ఆ లెక్కన్న పట్టుబడిన సమయంలో జాదవ్ విధుల్లో ఉన్నాడా? లేదా? అన్నది ఈ రకంగా ధృవీకరించుకోవాలని పాక్ భావిస్తోంది. పాస్ పోర్టే కీలకం... మరీ ముఖ్యంగా పాస్ పోర్టు అంశంపైనే పాక్ ప్రధానంగా దృష్టిసారించినట్లు సమాచారం. హుస్సేన్ ముబాకర్ పటేల్ పేరు మీద ఉన్న పాస్పోర్టుతో జాదవ్ పుణే నుంచి ఇరాన్ కు ఆయన ప్రయాణించారనే పాక్ ఆరోపిస్తోంది. అంతేకాదు ముంబై, దుబాయ్ ఇలా 18 ప్రాంతాల్లో ఆయన ఇదే పాస్ పోర్టు మీద ప్రయాణించారంటోంది. అలాంటప్పుడు అది ఆయన ఒరిజినల్ పాస్‌పోర్టు అవునా? కాదా? అన్నది భారత్ నిర్ధారించాల్సి ఉంటుంది. వీటితోపాటు ఆస్తుల వివరాలను కూడా కోరినట్లు తెలుస్తోంది. ముంబై, పుణే, మహారాష్ట్రంలో హుస్సేన్ ముబారక్ పేరు మీద ఉన్న ఆస్తులు జాదవ్‌కు చెందినవేనని పాక్ అనుమానిస్తోంది. 13 మంది ఇండియన్ అధికారుల పేర్లను ఈ లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా, ఓ ‘రా’ మాజీ అధికారి(వీరిద్దరే జాదవ్ వ్యవహారాలను దగ్గరుండి చూసుకున్నారని పాక్ ఆరోపణ), నిఘా, బ్యాంక్, పాస్‌పోర్టు అధికారులకు పేర్లను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే ఈ లేఖల వ్యవహారంపై విదేశాంగ శాఖ మాత్రం స్పందించటం లేదు. 2016 మార్చిలో బెలూచిస్తాన్ ప్రాంతంలో తమ దేశానికి వ్యతిరేకంగా ఉగ్ర కుట్రలు పన్నారన్న ఆరోపణలపై పాక్ ఆయన్ని అరెస్ట్ చేసింది. ఆ సమయంలోనూ ఆయన విధుల్లో ఉన్నారంటూ పాక్ వాదిస్తూ వస్తోంది. కానీ, ఆయన పదవీ విరమణ పొందారని.. వ్యాపారం నిమిత్తం ఇరాన్ వెళ్లిన అతన్ని కిడ్నాప్ చేసి మరి పాక్ జైల్లో బంధీగా ఉంచారని భారత్ చెబుతోంది. జాదవ్‌పై మరో కేసు... అంతర్జాతీయ న్యాయస్థానం ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేయటంతో మరో కుట్రకు పాక్ తెరలేపింది. జాదవ్‌పై మరో కేసును బనాయించింది. ఉగ్రవాదం, మోసం, విద్రోహ చర్యలు కింద జాదవ్‌పై తప్పుడు కేసులు బనాయించి దర్యాప్తు ప్రారంభించింది. -
భారత్ కోసమే పనిచేస్తున్నా!
ఇస్లామాబాద్: భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(47)కు సంబంధించిన మరో వీడియోను పాకిస్తాన్ గురువారం విడుదల చేసింది. పాక్ పర్యటన సందర్భంగా జాధవ్ కుటుంబసభ్యులతో ఆ దేశ అధికారులు వ్యవహరించిన తీరును భారత్ తీవ్రంగా నిరసించిన నేపథ్యంలో.. పాక్‌కు మద్దతుగా జాధవ్ మాట్లాడుతున్నట్లుగా ఉన్న వీడియోను విడుదల చేయడం గమనార్హం. తాను భారత నిఘా విభాగంలోనే విధుల్లో ఉన్నానని, ఈ విషయంలో భారత్ అబద్ధాలు చెబుతోందని అందులో జాధవ్ పేర్కొన్నారు. అయితే బలవంతంగా జాధవ్‌తో ఆ మాటలు చెప్పించినట్లు స్పష్టంగా తెలుస్తోందని, ఆ వీడియోకు ఎలాంటి విశ్వసనీయత లేదని భారత్ ఘాటుగా స్పందించింది. ఆ వీడియోలో.. ‘భారత ప్రజలకు, ప్రభుత్వానికి, నేవీకి నేను ఓ విషయం స్పష్టం చేయదలచుకున్నా. నేనింకా భారత నావికాదళంలో ఉద్యోగినే. నేను విధుల్లోంచి తప్పుకోలేదు. నేను నిఘా వర్గాలతో కలిసి పనిచేస్తున్నానన్న విషయంలో మీరు(భారత ప్రభుత్వం) ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు?’ అని ప్రశ్నించారు. ‘సమావేశపు గది నుంచి బయటకు వెళ్లగానే మా అమ్మపై భారత దౌత్యాధికారి గట్టిగా అరవడంతో పాటు తీవ్రంగా కోప్పడ్డారు. ఆమె కళ్లలో నేనప్పుడు భయం చూశాను. నా కుటుంబ సభ్యులతో భేటీ సానుకూలంగా సాగింది. ఏమాత్రం ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా నేను మా అమ్మకు చెప్పాను. ఈ భేటీ తర్వాత నేను, నా తల్లి ఆనందంగా ఉన్నాం’ అని జాధవ్ వీడియోలో వెల్లడించారు. అయితే జాధవ్‌ను జైష్–ఉల్–అదిల్ ఉగ్రసంస్థ ఇరాన్‌లోని సర్బాజ్ నుంచి కిడ్నాప్ చేసిందని భారత వర్గాలు తెలిపాయి. ఈ సంస్థకు చెందిన ముల్లా ఒమర్ ఇరానీ జాధవ్‌ను అపహరించి పాక్ సైన్యానికి అప్పగించినట్లు వెల్లడించాయి. బలోచ్ వేర్పాటువాదుల్ని ఏరివేసేందుకు పాక్ ఆర్మీ ఈ సంస్థను వినియోగించుకుంటోందని పేర్కొన్నాయి. ఎలాంటి విశ్వసనీయత లేదు పాక్ జాధవ్ నేరాంగీకార వీడియోను విడుదల చేయడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ విషయమై భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘పాక్ చర్యలు మాకు ఆశ్చర్యం కలిగించలేదు. బందీల చేత బలవంతంగా వాంగ్మూలం ఇప్పించే సంప్రదాయాన్ని ఆ దేశం కొనసాగిస్తోంది. కేవలం ప్రచారం కోసం చేసే ఇలాంటి పనులకు ఎలాంటి విశ్వసనీయత ఉండదన్న విషయాన్ని పాక్ అర్థం చేసుకోవాలి’ అని హితవు పలికారు. బందీల చేత తమ ఆరోపణల్ని వల్లె వేయించడంతో పాటు వారు క్షేమంగా ఉన్నట్లు విడుదల చేసే వీడియోలతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. -
భారత్ తప్పు చేసిందా?
సాక్షి, న్యూఢిల్లీ : గూఢచర్య ఆరోపణలపై పాక్ జైల్లో బంధీగా ఉన్న కులభూషణ్ జాదవ్‌ను ఎట్టకేలకు ఆయన కుటుంబ సభ్యులు కలుసుకోవటంతో కాస్త ఊరట పొందారు. అయితే ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిస్థితులే తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జాదవ్ తల్లి అవంతి, భార్య చేతన్‌కుల్ ను పాక్ అధికారులు అవమానించటం.. మన రాజకీయ పక్షాలెన్నీ ఏకమై పాక్ తీరుకు వ్యతిరేకంగా గళం వినిపించటం చూశాం. కానీ, పాక్ గురించి తెలిసి కూడా కేంద్రం ముందుకు వెళ్లటాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబడుతోంది. ఇదో దౌత్యపరమైన అపజయంగా ఇప్పటికే అభివర్ణించిన కాంగ్రెస్ తాజాగా ప్రభుత్వంపై ప్రశ్నలు గుప్పించింది. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత మనీష్ తెవారి జాదవ్ కుటుంబానికి జరిగిన అవమానాన్ని ఖండిస్తూనే.. ఓ సందేశం ఉంచారు. 1. ఏ ఒప్పందం మేరకు భారత్-పాక్ ఈ కలయికకు ఏర్పాటు చేశారు. 2. పాక్ కుటిలబుద్ధి తెలిసి కూడా దౌత్యానికి భారత్ ఎందుకు మొగ్గుచూపింది?. అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీఆర్సీ పద్ధతి) ద్వారానో లేదా కనీసం, ఐక్యరాజ్యసమితి ద్వారానో ముందుకు వెళ్లాలే తప్ప.. ఇలాంటి మార్గం ఎందుకు ఎంచుకుంది? ఈ రెండు ప్రశ్నలకు జవాబు చెప్పాలంటూ ఆయన తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. Pak’s mistreatment of Jadhav’s family unequivocally condemnable but-1.What were ground rules settled between India&Pak about the meeting?2 Knowing Pak’s perfidy fully well why did India not ask ICJ to facilitate meeting through ICRC or any other UN body rather than bilaterally??? — Manish Tewari (@ManishTewari) December 29, 2017 ఇక పాక్ విదేశాంగ కార్యాలయం వెలుపల కులభూషణ్ జాదవ్ తల్లి, భార్యలను పాక్ మీడియా ఎలా వేధించాయో కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మీరు ఓ టెర్రరిస్టుకు తల్లిగా ఎలా ఫీలవుతున్నారు? అంటూ ఇబ్బందికర ప్రశ్నలతో జాదవ్ తల్లిపై పాక్ మీడియా ప్రశ్నలు గుప్పించాయి. -
పాక్ ఓ చెప్పుల దొంగ.. జాదవ్ భార్య షూ ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్థాన్‌లోని జైలు ఉన్న కులభూషణ్ జాదవ్‌ను చూసేందుకు ఆయన తల్లి, భార్య వెళ్లిన సమయంలో పాకిస్థాన్ అధికారులు వ్యవహరించిన తీరుపట్ల భారత్‌లోని పలువురు నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పాక్ అధికారుల చర్యలపై జోకులు పేలుస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్లో ‘పాకిస్థాన్ ఓ చెప్పుల దొంగ’ అనే పేరిట యాష్ ట్యాగ్‌తో పాక్ దుమ్ముదులుపుతున్నారు. జాదవ్‌ను కలవడానికి ముందు భద్రత పేరుతో పాక్ జాదవ్ తల్లి, భార్య మంగళ సూత్రం, బొట్టు, గాజులతోపాటు వారి షూ కూడా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, మిగితా వస్తువులు ఇచ్చిన పాక్.. బూట్లు మాత్రం ఇవ్వలేదు. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో పాక్‌పై సెటైర్లు వేస్తున్నారు. ‘పాక్ ఓ చెప్పుల దొంగ’ ‘పాక్ ఆర్థికంగా వెనుకబడిన దేశం అని మాకు తెలుసు.. కానీ మరీ చెప్పులు కూడా దోచుకునేంతనా అని ఇప్పుడే తెలుస్తోంది. వెంటనే మా దేశ భక్తురాలికి చెప్పులు తిరిగి ఇచ్చేయండి’ ‘పాక్ ఎందుకు జాదవ్ భార్య చెప్పులు దొంగిలించింది? వాటితో కూడా ఏదైనా జిహాదీకి ప్లాన్ చేస్తున్నారా’ ‘చెప్పులు కూడా దొంగిలించడానికి పాక్ సిగ్గుపడాలి’ ‘500 రూపాయల చెప్పుల కోసం పాక్ ఇంత కక్కుర్తిపడాలా?’ అంటూ ఇలా వరుసబెట్టి ట్విట్టర్లో యాష్ ట్యాగ్‌తో చప్పల్ చోర్ పాకిస్థాన్ పేరిట సెటైర్లు పేలుతున్నాయి. So shameful that Pakistan has stolen slippers also. #ShameOnPakistan #ChappalChorPakistan — Mili Rajpootani 🏹 (@milisilichilli) 26 December 2017 Why this beggar nation Pakistan kept shoes of #KulbhushanJadhav ‘s wife ? Any jihadi jadu-Tona planned? #ChappalChorPakistan https://t.co/HqB2LhYMPj — Freelance bhakt (@ExSecular) 27 December 2017 @pid_gov we know that your economy is in bad condition but we seriously did not expected that you will resort to stealing chappals#ChappalChorPakistan https://t.co/os7zEBJtAG — Amit 🕉️ #रुद्राक्षधारक (@The_AmitSpeaks) 27 December 2017 Aren't you ashamed of #ChappalChorPakistan .You stole bangles, bindi, Mangalsutra,earrings even shoes of diplomatically called ladies. You are internationally exposed & the whole world is watching your despicable deeds ! — Bane Singh (@bsdauphin) 26 December 2017 -
అనుమాన పిశాచి
భారత్ గూఢచారిగా ముద్రపడి 22 నెలలనుంచి పాకిస్తాన్ చెరలో మగ్గుతున్న కులభూషణ్ జాధవ్‌ను ఎట్టకేలకు ఆయన తల్లి అవంతి, భార్య చేతాంకుల్ కలుసుకోగలిగారు. ఎక్కడో ఇరాన్‌కు వెళ్లి వ్యాపారాలు నిర్వహిస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నవాడు ఉన్నట్టుండి మాయం కావడం, పాకిస్తాన్ అతన్ని బంధించి గూఢచారిగా ఆరోపించడం ఆ కుటుంబాన్ని ఎంత కలవరపరిచి ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. ఇదింకా తీరకముందే ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ రుజువయ్యాయని, వాటిని ఆయనే ఒప్పుకున్నాడని పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం ప్రకటించి అందుకు ఉరిశిక్ష విధిస్తున్నట్టు తీర్పునివ్వడం ఆ కుటుంబాన్ని మరింత ఆందోళనలో పడేసింది. మన ప్రభుత్వం వెనువెంటనే స్పందించి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) స్వీకరించి మరణశిక్షపై స్టే విధించింది. అప్పటినుంచీ జాధవ్ సజీవంగానే ఉన్నాడన్న ఊరట లభించింది తప్ప ఆయన మాత్రం ఒంటరి చెరలో ఉరితాడు నీడన బతుకీడుస్తున్నాడు. జాధవ్ ఎన్నడో భారత నావికాదళం నుంచి రిటైరయ్యాడని, ఇరాన్లో వ్యాపారం చేసుకుంటున్న అతడితో ప్రభుత్వానికి సంబంధం లేదని మన దేశం చెప్పింది. అందుకు భిన్నంగా బలూచిస్తాన్‌లో గూఢచర్యానికి పాల్పడుతున్నాడని పాక్ ఆరోపించింది. ఏం జరిగిందో తెలుసుకోవడానికి తమ దౌత్యవేత్తలను అనుమతించాలన్న మన ప్రభుత్వ వినతుల్ని పాకిస్తాన్ తోసిపుచ్చింది. చివరకు తమ జాతిపిత జిన్నా జయంతి సందర్భంగా ‘ఇస్లామిక్ సంప్రదాయాలు, మానవతా దృక్పథం’ అనుసరించి జాధవ్ తల్లి, భార్య కలుసుకునే ఏర్పాటు చేస్తామంది. కారణమేదైనా పాకిస్తాన్ వైఖరి మార్చుకున్నందుకు అందరూ సంతోషించారు. అయితే సోమవారం ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయంలో జరిగిన ఆ భేటీ అందరికీ నిరాశే మిగిల్చింది. జాధవ్‌ను అయినవారు కలుసుకోవడానికి అనుమతించడాన్ని మానవతా దృక్పథమని చెప్పుకున్న పాకిస్తాన్ తీరా వారు వచ్చాక గాజు తెరను అడ్డంగా పెట్టి ఇంటర్‌కామ్ ద్వారా మాత్రమే మాట్లాడే వీలు కల్పించడం, వారి మధ్య ఆత్మీయతా స్పర్శకు వీలు కల్పించకపోవడం ఎవరికైనా చివుక్కుమనిపిస్తుంది. అంతకన్నా ముందు అవంతి, చేతాంకుల్ పట్ల అక్కడి భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు కూడా సమర్ధనీయమైనది కాదు. జాధవ్‌పై గూఢచారి అన్న ముద్రేశారు సరేగానీ... ఆయన తల్లి, భార్యను సైతం అలాగే పరిగణించడం సబబేనా? వారి దుస్తుల్ని మార్పించి వేరే బట్టలు వేసుకోమనడం, మెడలో ఉన్న మంగళసూత్రాలను, గాజుల్ని తీయించడం, బొట్టు ఉండరాదనడం, బూట్లు తీయించడం, జాధవ్‌తో మాతృభాషలో సంభాషించడానికి ప్రయత్నిస్తే అడ్డుకోవడంలాంటివి విస్మయం కలిగిస్తాయి. చివరకు జాధవ్ భార్య మంగళసూత్రాలు,ఆమె బూట్లు వెనక్కి ఇవ్వలేదు. వాటిల్లో ఏదో అమర్చుకుని వచ్చారని రేపో మాపో యాగీ చేసినా చేయొచ్చు. ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలు ఏ స్థాయిలో ఉన్నాయో ఎవరికీ తెలి యని విషయం కాదు. కనుక అవతలి దేశానికి చెందిన పౌరుల్ని అనుమాన దృక్కులతో చూడటం కూడా సర్వసాధారణం. కానీ ప్రభుత్వాలు ముందే మాట్లాడుకుని ఈ భేటీని ఏర్పాటు చేసినప్పుడు ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకోకూడదు. పైగా భౌతిక తనిఖీల అవసరం లేకుండా వ్యక్తుల వద్ద అవాంఛనీయమైనవి ఉంటే క్షణంలో పట్టిచ్చే అత్యాధునిక పరికరాలు వచ్చాయి. వారు ఏం మాట్లాడుకుంటారోనన్న అనుమానాలుంటే దుబాసీలను నియ మించుకోవచ్చు. వీటన్నిటినీ కాదని జాధవ్ తల్లి, భార్య పట్ల అంత మొరటుగా వ్యవహరించడం వల్ల సాధించిందేమిటి? అంతేకాదు... ముందుగా అనుకున్న దానికి భిన్నంగా వారిద్దరి సమీపానికి పాకిస్తాన్ మీడియా ప్రతినిధులు వచ్చి దూషించడానికి ఆస్కారం కలగజేయడం సైతం పాక్ చెప్పుకుంటున్న మానవతా దృక్పథాన్ని సందేహాస్పదం చేస్తుంది. దాని చిత్తశుద్ధిపై అనుమానాలు రేకెత్తిస్తుంది. అంతేకాదు...కుటుంబసభ్యులతోపాటు మన డిప్యూటీ హై కమిషనర్‌ను కూడా జాధవ్‌ను కలుసుకోవడానికి అనుమతిస్తామని పాక్ చెప్పింది. తీరా వెళ్లాక డిప్యూటీ హైకమిషనర్‌ను విడిగా వేరేచోట కూర్చోబెట్టారు. ఆయన సంబంధిత అధికా రులతో పదే పదే మాట్లాడాక మాత్రమే అనుమతించారు. అప్పుడు కూడా జాధవ్ కుటుంబసభ్యులకూ, ఆయనకూ మధ్య గాజు తెర బిగించారు. ఇంతా అయ్యాక ‘మాట్లాడుకోవడానికి మేం ముందు అరగంట వ్యవధి మాత్రమే ఇచ్చినా, పెద్ద మనసుతో మరో పది నిమిషాలు పొడిగించాం... మరిన్నిసార్లు కలిసేందుకు అను మతిస్తామ’ని చెప్పడం వింతగా అనిపిస్తుంది. మరోపక్క జాధవ్, అతని కుటుంబసభ్యుల భేటీకి కొద్దిరోజుల ముందునుంచీ భారత్–పాక్ సరిహద్దుల్లో చోటుచేసుకుంటున్న ఉదంతాలు అందరికీ కలవరం కలిగించాయి. ఎలాంటి కవ్వింపూ లేకుండా పాకిస్తాన్ దళాలు రాజౌరీ జిల్లాలోని సరిహద్దుల వద్ద జరిపిన కాల్పుల్లో మన దేశానికి చెందిన మేజర్‌తోపాటు మరో ముగ్గురు జవాన్లు మరణించారు. మన దళాలు సోమవారం సాయంత్రం పూంచ్ సెక్టార్ వద్ద అధీన రేఖ దాటుకుని పాక్ భూభాగంలోకి ప్రవేశించి ముగ్గురు పాక్ సైనికులను హతమార్చడంతోపాటు ఒక పోస్టును ధ్వంసం చేశారు. గత ఏడాది ఇదే తరహాలో మన సైనిక దళాలు సర్జికల్ దాడులు నిర్వహించాయి. ఒకపక్క జాధవ్‌ను కలిసేందుకు కుటుంబసభ్యుల్ని అనుమతించి తన సుహృద్భావాన్ని ప్రపంచానికి చాటడానికి ప్రయత్నించడం...అదే సమయంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టి అక్కడ భారత్ కారణంగా తప్పులు జరుగుతున్నాయన్న అభిప్రాయం కలగ జేయడానికి చూడటం వల్ల అంతిమంగా తనకు ఒరిగేదేమిటో పాక్ ఆలోచించు కోవాలి. ఇరు దేశాల మధ్యా జటిలమైన సమస్యలున్న మాట వాస్తవం. ఇద్దరూ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తేనే అవి పరిష్కారమవుతాయి. వాటిని మరింత సంక్లిష్టంగా మార్చాలని చూస్తే నష్టం రెండు వైపులా ఉంటుంది. పాకిస్తాన్ దాన్ని గుర్తెరిగి ప్రవర్తించాలి. -
తాళి, గాజులు, బొట్టు తీయించారు!
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్థాన్ జైలు అధికారులు ఎంత దుర్మార్గులో మరోసారి తెలిసిపోయింది. పాకిస్థాన్ జైలులో శిక్షను అనుభవిస్తున్న కులభూషణ్ జాదవ్‌ను చూసేందుకు వెళ్లినప్పుడు ఆయన తల్లి, భార్యను వారు తీవ్రంగా అవమానించారు. కనీసం సభ్యత పాటించకుండా వ్యవహరించారు. భద్రత పేరు చెప్పి ఓ మతానికి చెందినవారి మనోభావాలు దెబ్బకొట్టేలా పాక్ అధికారులు పనిచేశారు. భద్రత పేరుతో వారి మంగళ సూత్రం, గాజులు, ఆఖరికి బొట్టు కూడా తీయించారు. చివరకు వారి మాతృభాషలో కూడా మాట్లాడకుండా అడ్డుకున్నారు. జాదవ్ తల్లి పలుమార్లు తన భాషలో ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ పాక్ అధికారులు ఆమెను నిలువరించారు. ఈ వివరాలన్నీ భారత విదేశాంగ వ్యవహారాల శాఖ వెల్లడించింది. దాదాపు రెండేళ్లుగా పాక్ జైలులో కులభూషణ్ జాదవ్ శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. గూఢచర్యం నిర్వహించారనే పేరిట పాక్ అక్రమంగా అరెస్టు చేసి ఉరి శిక్ష విధించి జైలులో ఉంచింది. దీంతో ఆయనను కలిసేందుకు భార్య, తల్లి ఓ భారత డిప్యూటీ హైకమిషనర్ వెళ్లారు. అయితే, డిప్యూటీ కమిషనర్‌కు చెప్పకుండానే జాదవ్ వద్దకు తల్లిని, భార్యను తీసుకెళ్లిన పాక్ అధికారులు ఆ తర్వాత మాత్రమే డిప్యూటీ హైకమిషనర్‌ను అనుమతించారు. అప్పటికీ ఆయనను వారి నుంచి దూరంగానే ఉంచి జాదవ్‌ను కలవనివ్వలేదు. భారత హైకమిషన్ వివరాల ప్రకారం పాక్ ముందుగా చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా వ్యవహరించలేదు. పూర్తిగా అగౌరవ పరిచింది. పేరుకే వారిని జాదవ్‌తో భేటీకి అనుమతించిందే తప్ప ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించిందని వెల్లడించింది. -
జాధవ్ పిటిషన్ పెండింగ్‌లోనే ఉంది..
ఇస్లామాబాద్: గూఢచర్యం ఆరోపణలపై కులభూషణ్ జాధవ్‌కు విధించిన మరణశిక్షను ఇప్పటికిప్పుడే అమలు చేయడం లేదని పాకిస్తాన్ గురువారం స్పష్టం చేసింది. తల్లి, భార్యను జాధవ్ కలసిన తర్వాత మరణశిక్షను అమలు చేయనున్నారని, జాధవ్‌తో వారికిదే చివరి సమావేశమని వస్తున్న ఆరోపణలను కొట్టిపారేసింది. ‘మరణశిక్షను ఇప్పటికిప్పుడే అమలు చేయడం లేదు. ఆయన క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లోనే ఉంది’ అని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైసల్ చెప్పారు. ‘ఇస్లామిక్ సంప్రదాయాలు, మానవతా దృక్పథంతోనే జాధవ్ భార్య, తల్లికి పాక్ వీసాలిచ్చింది’ అని చెప్పారు. -
జాదవ్ కేసు... పాక్ ‘మానవతా దృక్పథం’
సాక్షి, న్యూఢిల్లీ : కులభూషణ్ జాదవ్ వ్యవహారంలో పాకిస్థాన్ ప్రభుత్వం కాస్త మెత్తబడింది. జైల్లో ఉన్న అతన్ని చూసేందుకు జాదవ్ భార్యను అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు భారత హై కమిషన్‌కు ఓ లేఖ పంపగా.. పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక సంస్థ పీటీవీ ఈ విషయాన్ని ధృవీకరించింది. ‘మానవతా ధృక్పథంతోనే’.. తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా, తన భర్తను చూసేందుకు అనుమతించాలని ఆయన అరెస్ట్ తర్వాత చాలాసార్లు ఆమె అక్కడి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. అక్కడి అధికారులు తిరస్కరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం నుంచి పాక్‌పై విపరీతమైన ఒత్తిళ్లు వస్తున్నాయి. వాటికి తలొగ్గే ఆమెకు వీసా మంజూరు చేసి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, గూఢాచర్యం ఆరోపణలతో కులభూషణ్ జాదవ్‌ను మార్చి 3, 2016లో బెలొచిస్థాన్ మష్కెల్ వద్ద పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. దఫాలుగా విచారణ జరిపిన పాక్ మిలిటరీ కోర్టు ఏప్రిల్ 10న మరణశిక్ష అతనికి మరణశిక్ష విధించింది. అయితే అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యం చేసుకుని తుది వాదనలు పూర్తయ్యేదాకా శిక్షను అమలు చేయొద్దని ఆదేశాలు వెలువరించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 13న భారత్ పాక్ ఆరోపణలను తోసిపుచ్చుతూ నివేదికను సమర్పించగా.. డిసెంబర్ 13న పాక్ తన వాదనలను వినిపించనుంది. -
జాదవ్ కేసు.. పాక్ ప్రజలకు శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ : భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ క్షమాభిక్ష విషయంలో త్వరలోనే ఓ నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. జాదవ్ మెర్సీ పిటిషన్ గురువారం సైన్యాధ్యకుడు ఖమర్ జాదవ్ బజ్వా వద్దకు చేరిందని ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ చెప్పారు. జాదవ్ కేసులో త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని గఫూర్ పేర్కొన్నారు. కాగా, తనకు విధించిన మరణశిక్షను కొట్టేయాలంటూ అప్పిలేట్ కోర్టు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు దానిని కొట్టివేసింది. దీంతో ఆయన పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆశ్రయించారు. ఒకవేళ ఆయన కూడా దానిని కొట్టివేస్తే నేరుగా పాక్ అధ్యక్షుడిని ఆశ్రయంచవచ్చు. అయితే క్షమాభిక్ష పిటిషన్ ఆర్మీ ఛీఫ్ తిరస్కరించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయన్న సంకేతాలు అందుతున్నాయి. ‘పాక్ ప్రజలు త్వరలోనే ఓ శుభవార్త వినబోతున్నారు’ అంటూ జాదవ్ క్షమాభిక్షను ఉద్దేశిస్తూ... పాకిస్థాన్ ఏజెన్సీ సంస్థ ఇంటర్-స్టేట్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్పీఆర్) ఓ ప్రకటన వెలువరించటంతో ఆయన ప్రాణాలకు ముప్పుతప్పదనే భావించవచ్చు. కాగా, గూఢచర్యం ఆరోపణలతో కుల్‌భూషణ్ జాదవ్ ను 2016లో పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. ఆపై పాక్ ఆర్మీ కోర్టు మరణశిక్ష విధించగా.. 46 ఏళ్ల జాదవ్ తరపున భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. భారత్ పిటిషన్‌పై మే 18న విచారించిన 10 మంది సభ్యుల ఐసీజే ధర్మాసనం.. జాదవ్ మరణశిక్షపై స్టే విధించింది. అయితే జాదవ్ క్షమాభిక్ష పిటిషన్లపై ఓ స్పష్టత వచ్చేంత వరకు ఆయనకు మరణశిక్ష అమలు చేయబోమని పాక్ స్పష్టం చేసింది. -
ఒక్కడి కోసం.. ఏకమవుతున్న భారతీయం..
అన్యాయాన్ని ఎదిరించడం భారతీయుల రక్తంలోనే ఉంది. అందుకోసం ఒక్కటి కావడం చరిత్ర మనకు నేర్పిన పాఠం. శాంతి, సహనాలు కర్మభూమి మనకిచ్చిన ఆయుధాలు. అందుకే ఎన్నో అరాచకాలను ఈ ఆయుధాలతోనే ఎదుర్కొనేందుకు ఒక్కటయ్యాం. విజయాలు సాధించాం. ఆ విజయాలే స్ఫూర్తిగా మరో అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు దేశంలోనే కాదు.. విదేశాల్లో ఉంటున్న భారతీయులంతా ఎకమవుతున్నారు. ఎందుకోసం? అని అడిగితే సమాధానం ‘ఒక్కడి కోసం’. ఆ ఒక్కడు ఎవరంటే... కుల్‌భూషణ్ జాదవ్... గత కొద్దిరోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. భారతీయులంతా అతణ్ని బతికించుకునేందుకే ఆరాటపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే జాదవ్ ఇప్పుడున్నది మన దాయాది పాకిస్తాన్ చెరలో. అలా ఎంతోమంది ఉన్నప్పటికీ.. జాదవ్‌కు పాకిస్తాన్ ఉరిశిక్ష విధించింది. తప్పుడు ఆరోపణలను ఆయనపై మోపి.. జాదవ్‌ను ఉరితీయడం ద్వారా భారత్‌ను బాధపెట్టాలనుకుంటోంది. అందుకే భారత్ చేసిన విన్నపాలను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోవడం లేదు. ఏకమవుతున్న భారతీయం.. జాదవ్‌ను కాపాడుకునేందుకు ప్రభుత్వమే కాదు.. భారతీయులంతా ఏకమవుతున్నారు. పాక్ వక్రబుద్ధిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో ఉంటున్న భారతీయులంతా జాదవ్‌ను రక్షించుకునేందుకు వైట్‌హౌస్‌లో పిటిషన్ దాఖలు చేశారు. జాదవ్ విషయంలో జోక్యం చేసుకోవాలని అమెరికాను కోరుతున్నారు. ఇందుకోసం ఎస్.ఎస్ అనే ఓ వ్యక్తి అమెరికా వైట్ హౌస్‌కు అర్జీలు పెట్టుకునే ‘వీ ది పీపుల్ పిటిషన్’ అనే వైట్‌హౌస్ వెబ్సైట్లో ఈ పిటిషన్ ప్రారంభించారు. మే 14లోపు దీనిపై లక్ష సంతకాలు చేస్తే ట్రంప్ పరిపాలన వర్గం స్పందిస్తుంది. ఇప్పటికే ప్రారంభించిన ఈ సంతకాల సేకరణలో లక్షలాదిమంది భారతీయులు సంతకాలు చేశారు. అమెరికా వంటి దేశం ఇలాంటి పిటిషన్లను పరిగణనలోకి తీసుకోవాలంటే సదరు పిటిషన్‌పై కనీసం లక్షమందికిపైగా సంతకాలు చేయాలి. అయితే సంతకాల సేకరణ పెద్ద లక్ష్యమేమీ కాకపోవచ్చు. కానీ విషయాన్ని అమెరికా దృష్టికి తీసుకురావడమంటే ప్రపంచం దృష్టికి తీసుకురావడమే. ఇదీ పిటిషన్.. ‘జాదవ్ నిర్దోషి. తప్పుడు అభియోగాలను అతనిపై రుద్ది.. అతణ్ని ఉరితీయాలని పాక్ చూస్తోంది. ఈ విషయంలో మీరు కలుగజేసుకోవాలి. అందుకు అంతటి సామర్థ్యమున్న అధికారులను రంగంలోకి దింపాలి. పాక్ చెబుతున్నట్లుగా జాదవ్ గూఢచర్యానికి పాల్పడ్డాడో లేదో నిగ్గు తేల్చాలి. ఇరాన్ మీదుగా పాక్‌లోకి చొరబడుతుండగా బెలూచిస్తాన్ వద్ద జాదవ్‌ను పట్టుకున్నామని, అతని ఇండియన్ నేవీలో పనిచేస్తున్నాడని పాక్ చెబుతోంది. ఈ ఆరోపణలకు రుజువులు చూపాలని పాక్‌ను భారత్ కోరినా సమాధానమే కరువైంది. అందుకే ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవాలని మరోసారి కోరుతున్నాం. ’ -
కులభూషణ్‌కు భుట్టో మద్దతు
లాహోర్: భారత్ నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు విధించిన మరణ శిక్షను పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చీఫ్ బిలావుల్ భుట్టో జర్దారీ పరోక్షంగా వ్యతిరేకించారు. జాదవ్ విషయం వివాదాస్పదంతో కూడుకున్నదని, అయితే, తాను తన పార్టీ మరణ శిక్షకు వ్యతిరేకం అని చెప్పారు. ‘భారత్‌కు చెందిన గుఢాచారి కులభూషణ్ జాదవ్ విషయం వివాదాస్పదం. ఇక్కడ అతను ఎక్కువకాలం ఉండాల్సింది కాదు. మా తాత జుల్ఫీకర్ అలీ భుట్టోకు కూడా మరణ శిక్ష విధించారు. మా పార్టీ, నేను ఉరిశిక్షకు వ్యతిరేకం’ అని బిలావుల్ తెలిపాడు. మరోపక్క, పీపీపీ పంజాబ్ అధ్యక్షుడు, సమాచార శాఖ మాజీ మంత్రి ఖమర్ జమాన్ కైరా స్పందిస్తూ జాదవ్‌కు ఉరిశిక్ష విధించడంపై భారత్ స్పందించడం సాధారణ విషయమే అని అన్నారు. అయితే, వాస్తవానికి జాదవ్‌ను ఎందుకు ఉరి తీస్తున్నారో, ఆయనపై నమోదు చేసిన చార్జీషీట్ ఏమిటో ప్రపంచానికి తెలియజేయడంలో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. అదే భారత్ ఇలా పాకిస్థాన్ గుఢాచారిని అరెస్టు చేసి ఉంటే అందుకు తగిన సాక్ష్యాధారాలతో ప్రపంచం మొత్తానికి తెలియజేసేదని అభిప్రాయపడ్డారు.