కులభూషణ్‌కు భుట్టో మద్దతు
లాహోర్: భారత్ నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు విధించిన మరణ శిక్షను పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చీఫ్ బిలావుల్ భుట్టో జర్దారీ పరోక్షంగా వ్యతిరేకించారు. జాదవ్ విషయం వివాదాస్పదంతో కూడుకున్నదని, అయితే, తాను తన పార్టీ మరణ శిక్షకు వ్యతిరేకం అని చెప్పారు. ‘భారత్‌కు చెందిన గుఢాచారి కులభూషణ్ జాదవ్ విషయం వివాదాస్పదం. ఇక్కడ అతను ఎక్కువకాలం ఉండాల్సింది కాదు. మా తాత జుల్ఫీకర్ అలీ భుట్టోకు కూడా మరణ శిక్ష విధించారు. మా పార్టీ, నేను ఉరిశిక్షకు వ్యతిరేకం’ అని బిలావుల్ తెలిపాడు.
మరోపక్క, పీపీపీ పంజాబ్ అధ్యక్షుడు, సమాచార శాఖ మాజీ మంత్రి ఖమర్ జమాన్ కైరా స్పందిస్తూ జాదవ్‌కు ఉరిశిక్ష విధించడంపై భారత్ స్పందించడం సాధారణ విషయమే అని అన్నారు. అయితే, వాస్తవానికి జాదవ్‌ను ఎందుకు ఉరి తీస్తున్నారో, ఆయనపై నమోదు చేసిన చార్జీషీట్ ఏమిటో ప్రపంచానికి తెలియజేయడంలో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. అదే భారత్ ఇలా పాకిస్థాన్ గుఢాచారిని అరెస్టు చేసి ఉంటే అందుకు తగిన సాక్ష్యాధారాలతో ప్రపంచం మొత్తానికి తెలియజేసేదని అభిప్రాయపడ్డారు.