bilawal bhutto
-
ప్రభుత్వంలో చేరబోం
ఇస్లామాబాద్: మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్), బిలావల్ భుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)ల సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుఖాయమైన వేళ బిలావల్ భిన్నమైన ప్రకటన చేశారు. తాము ప్రభుత్వంలో చేరట్లేదని, బయటి నుంచి మద్దతు ఇస్తామని ఆయన స్పష్టంచేశారు. ‘‘ ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులు పొందటంలో మేం విఫలమయ్యాం. గెలిచిన సీట్ల సంఖ్యలో మేం మూడోస్థానానికే పరిమితమయ్యాం. అందుకే ప్రభుత్వంలో చేరొద్దని, ఏ మంత్రి పదవులూ స్వీకరించవద్దని మా పార్టీ నిర్ణయించింది. దేశంలో రాజకీయ సంక్షోభాన్ని మేం కోరుకోవట్లేదు. దేశంలో రాజకీయ సుస్థిరతే మాకు ముఖ్యం’’ అని పార్టీ అత్యున్నత కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సమావేశం తర్వాత బిలోవల్ మీడియాతో చెప్పారు. దీంతో నవాజ్ షరీఫ్ రికార్డుస్థాయిలో నాలుగోసారి ప్రధా ట కావడం ఖాయమైంది. మరోవైపు కేంద్రంలో, రెండు ప్రావిన్సుల్లో ప్రభుత్వాల ఏర్పాటుకు ఇమ్రాన్ నేతృత్వంపీటీఐ ప్రయత్నిస్తోంది. ఎండబ్ల్యూఎం పార్టీతో కలసి కేంద్రంలో, పంజాబ్ ప్రావిన్స్‌లో.. జమాతే ఇస్లామీ పార్టీతో కలిసి ఖైబర్–పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయతి్నస్తామని పీటీఐ పేర్కొంది. -
Pak: పాకిస్థాన్‌లో పవర్ షేరింగ్ !
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం దాదాపు ఖాయమైంది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ప్రధాన పార్టీలైన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్(ఎన్), బిలావల్ బుట్టోకు చెందిన పీపీపీ పార్టీలు ప్రధాని పదవిని పంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రెండు పార్టీల మధ్య ఇప్పటికే ఒప్పందం జరిగినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం ఈ విషయంపైనే ఇరు పార్టీల మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. మొత్తం ఐదేళ్లలో ఒక పార్టీ మూడేళ్లు, మరో పార్టీ రెండేళ్లు ప్రధాని పదవి పంచుకునేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన పాకిస్థాన్ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సాధారణ మెజారిటీ ఏ పార్టీకి రాలేదు. దీంతో అత్యధిక సీట్లు సాధించిన ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన తెహ్రీక్ ఈ పాకిస్థాన్ పార్టీని అధికారం నుంచి దూరం చేయడానికి మిగిలిన ప్రధాన పార్టీలన్నీ ఏకమై సంకీర్ణం ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదీ చదవండి.. న్యూయార్క్‌లో కాల్పులు.. ఒకరి మృతి -
సైన్యం పడగ నీడన... పాక్‌లో ఎన్నికలకు వేళాయె
అది 2018. పాకిస్తాన్లో సాధారణ ఎన్నికల సమయం. సైన్యం ఆగ్రహానికి గురై అవినీతి కేసుల్లో దోషిగా తేలడంతో నవాజ్ షరీఫ్ అప్పటికి ఏడాది క్రితమే ప్రధాని పదవి పోగొట్టుకున్నారు. జైల్లో మగ్గుతున్నందున ఎన్నికల్లో పోటీకీ దూరమయ్యారు. క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్‌ఖాన్ సైన్యం ఆశీస్సులతో ఎన్నికల్లో నెగ్గి ఏకంగా ప్రధాని పీఠమెక్కారు. ఆరేళ్లు గడిచి పాక్ మళ్లీ సాధారణ ఎన్నికల ముంగిట నిలిచేనాటికి ఈ ఇద్దరు మాజీ ప్రధానుల విషయంలో ఓడలు బళ్లు, బళ్లు ఓడలూ అయ్యాయి. సైన్యం కన్నెర్రతో ఇమ్రాన్ పదవి పోగొట్టుకోవడమే గాక అవినీతి కేసుల్లో జైలుపాలయ్యారు. శిక్షల మీద శిక్షలు అనుభవిస్తూ ఎన్నికలకు దూరమయ్యారు. పార్టీకి కనీసం ఎన్నికల గుర్తు కూడా దక్కని దుస్థితి నెలకొంది! చికిత్స పేరుతో ఆరేళ్ల కింద లండన్ చేరి బతుకు జీవుడా అంటూ ప్రవాసంలో కాలం వెళ్లదీసిన నవాజ్ మళ్లీ సైన్యం దన్నుతో దర్జాగా స్వదేశాగమనం చేశారు. సైన్యం స్క్రిప్టులో భాగంగా అవినీతి కేసులన్నీ కొట్టుకుపోయి నాలుగోసారి ప్రధాని అయ్యేందుకు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. ఇలా దశాబ్దాలుగా పాక్‌లో నేతల భాగ్యరేఖలను ఇష్టానికి నిర్దేశిస్తూ వస్తున్న సైన్యం కనుసన్నల్లో ఎప్పట్లాగే మరో ఎన్నికల తంతుకు సర్వం సిద్ధమవుతోంది... ఏ పౌర ప్రభుత్వమూ పూర్తి పదవీకాలం మనుగడ సాగించని చరిత్ర పాక్ సొంతం. చాలాకాలం పాటు ప్రత్యక్షంగా, మిగతా సమయంలో పరోక్షంగా సైనిక నియంతృత్వపు పడగ నీడలోనే ఆ దేశంలో పాలన సాగుతూ వస్తోంది. అలాంటి దేశంలో సైనిక పాలన ఊసు లేకుండా వరుసగా మూడోసారి సాధారణ ఎన్నికలు జరగబోతుండటం విశేషం! ఇలా జరగడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి. 342 మంది సభ్యుల జాతీయ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న పోలింగ్‌కు సర్వం సిద్ధమవుతోంది. ఎప్పటి మాదిరే ఈసారి కూడా ఏయే పార్టీలు పోటీ చేయాలో, వాటి తరఫున ఎక్కణ్నుంచి ఎవరు బరిలో ఉండాలో కూడా సైన్యమే నిర్దేశిస్తూ వస్తోంది. దేశ ఆర్థికంగా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి, నిత్యావసరాలతో పాటు అన్ని ధరలూ ఆకాశాన్నంటుతూ ప్రజల బతుకే దుర్భరంగా మారిన వేళ జరుగుతున్న ఎన్నికలివి. అక్కడ ఏ ఎన్నికలూ వివాదరహితంగా జరగలేదు. కానీ ఈసారి మాత్రం అవి పరాకాష్టకు చేరాయి. నిజానికి గత నవంబర్‌లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సింది. జనగణనను కారణంగా చూపి ఫిబ్రవరి దాకా వాయిదా వేశారు. నవాజ్ స్వీయ ప్రవాసం నుంచి తిరిగొచ్చి కాలూచేయీ కూడదీసుకుని బరిలో దిగేందుకు వీలుగానే ఇలా చేశారన్న ఆరోపణలున్నాయి. ఏదెలా ఉన్నా కనీసం ఈసారన్న కాస్త సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నది సగటు పాక్ పౌరుల ఆశ. అమెరికాతో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి అవసరమైన ఆర్థిక సాయం రాబట్టి అవ్యవస్థను చక్కదిద్దడంతో పాటు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న భారత్‌తో సంబంధాలను మెరుగు పరుచుకోవాలన్నది వారి ఆకాంక్ష. కానీ సర్వం సైన్యం కనుసన్నల్లో సాగుతున్న తీరును బట్టి చూస్తే ఈసారీ అది అత్యాశే అయ్యేలా కనిపిస్తోంది. నవాజ్ షరీఫ్ పాక్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పని చేసిన రికార్డు 74 ఏళ్ల నవాజ్ సొంతం. భారత్‌తో సత్సంబంధాలకు ప్రాధాన్యమిచ్చే నేతగానూ పేరుంది. దేశంలోకెల్లా అత్యంత ధనవంతుడని కూడా చెబుతారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) సారథిగా మూడోసారి ప్రధానిగా ఉండగా 2017లో పనామా పేపర్స్, లండన్ అపార్ట్మెంట్స్ వంటి నానారకాల కేసుల్లో ఇరుక్కున్నారు. పదవి పోగొట్టుకుని జైలుపాలై ప్రాణ భయంతో లండన్ పారిపోయారు. అనంతరం పగ్గాలు చేపట్టిన ఇమ్రాన్‌కూ నాలుగేళ్లలోపే అదే గతి పట్టింది. 2022లో నవాజ్ సోదరుడు షహబాజ్ షరీఫ్ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవడంతో నవాజ్‌కు మంచి రోజులు తిరిగొచ్చాయి. గత అక్టోబర్‌లో ఆయన తిరిగొచ్చి పీఎంఎల్ (ఎన్) పగ్గాలు చేపట్టడం, సైన్యంతో పాటు న్యాయ వ్యవస్థ దన్నూ తోడై ఆయనపై అవినీతి కేసులు, శిక్షలూ ఒక్కొక్కటిగా రద్దవడం చకచకా జరిగిపోయాయి. అడ్డంకులన్నీ తొలిగి ఎన్నికల బరిలో నిలిచిన నవాజ్ నాలుగోసారి ప్రధాని కావడం ఖాయమేనంటున్నారు. ఇమ్రాన్‌ఖాన్ అనితరసాధ్యమైన క్రికెట్ నైపుణ్యంతో పాక్ ప్రజలను ఉర్రూతలూగించి నేషనల్ హీరోగా వెలుగు వెలిగిన 71 ఇమ్రాన్ రాజకీయ పిచ్‌పై మాత్రం నిలదొక్కుకోలేక చతికిలపడ్డారు. అవినీతిని రూపుమాపి, కుటుంబ రాజకీయాలకు చెక్ పెట్టి సర్వం చక్కదిద్దుతానంటూ మార్పు నినాదంతో 2018లో ప్రధాని అయ్యారాయన. కానీ ఇమ్రాన్ హయాంలో ఆర్థికంగానే గాక అన్ని రంగాల్లోనూ దేశం కుప్పకూలింది. హింసతో, అశాంతితో పాక్ అట్టుడికిపోయింది. ఆయనకు ఆదరణా అడుగంటింది. నిజానికి సైన్యం చేతిలో పావుగానే ఇమ్రాన్ రాజకీయ ప్రవేశం జరిగిందంటారు. అలాంటి సైన్యానికే ఎదురు తిరగడంతో ఇమ్రాన్ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఎంత ప్రయతి్నంచినా పదవిని కాపాడుకోలేకపోయారు. పైగా జైలు శిక్ష వల్ల తాను పోటీ చేసే అవకాశం లేదు. ఆయన పార్టీ తరఫున కొందరు ధైర్యం చేసి ఇండిపెండెంట్లుగా బరిలో దిగుతున్నా చాలామంది జైలుపాలయ్యారు. పలువురు ఫిరాయించగా మిగిలిన వారు అజ్ఞతంలోకి వెళ్లిపోయారు. ఈ సమస్యలు చాలవన్నట్టు పీటీఐ ఎన్నికల గుర్తు బ్యాట్‌పైనా ఎన్నికల సంఘం వేటు వేసింది. దాంతో లక్షలాది మంది నిరక్షరాస్య ఓటర్లు బ్యాలెట్ పత్రాలపై ఇమ్రాన్ పార్టీని గుర్తించను కూడా లేరంటున్నారు. బిలావల్ భుట్టో 35 ఏళ్ల బిలావల్ భుట్టో జర్దారీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్. దారుణ హత్యకు గురైన మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో, పాక్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కుమారుడు. షహబాజ్ షరీఫ్ సర్కారులో విదేశాంగ మంత్రిగా తన పనితీరుతో స్వదేశంలో విమర్శలపాలు, భారత్‌లో నవ్వులపాలయ్యారు. గత ఎన్నికల్లో పీపీపీ మూడో స్థానంలో నిలిచింది. ఈసారి అన్నీ కలిసొస్తే బహుశా కింగ్‌మేకర్ అవ్వొచ్చంటున్నారు. పాక్ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులుంటారు. 266 మందిని నేరుగా ఉన్నుకుంటారు. 70 సీట్లను మహిళలు, మతపరమైన మైనారిటీలకు; ఆరింటిని గిరిజన ప్రాంతాల వారికి రిజర్వు చేశారు. ఈ స్థానాలను పార్టీలకు గెలుచుకున్న స్థానాలను బట్టి నైష్పత్తిక ప్రాతిపదికన కేటాయిస్తారు. సాక్షి, నేషనల్ డెస్క్ -
విదేశీ మారక నిల్వల కంటే వేగంగా... పాక్ విశ్వసనీయత పతనం
బెనౌలిమ్ (గోవా): అంతర్జాతీయ వేదికలపై వక్రబుద్ధి ప్రదర్శించే పాకిస్తాన్ తీరుపై విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ విశ్వసనీయత దాని విదేశీ మారక ద్రవ్య నిల్వల కంటే కూడా శరవేగంగా క్షీణిస్తోందంటూ దుయ్యబట్టారు. శుక్రవారం గోవాలో ముగిసిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) విదేశాంగ మంత్రుల భేటీ ఇందుకు వేదికగా మారింది. కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో భేటీలో లేవనెత్తారు. దానిపై పునరాలోచన చేసేదాకా భారత్‌తో ద్వైపాక్షిక చర్చలకు పాక్ సిద్ధంగా లేదన్నారు. దాంతో భేటీ అనంతరం జై శంకర్ మీడియాతో మాట్లాడుతూ బిలావల్ వ్యాఖ్యలను తూర్పారబట్టారు. ‘‘ఆర్టికల్ 370 ముగిసిన చరిత్ర. ఇప్పటికైనా నిద్ర నుంచి మేల్కొని వాస్తవాలు గమనించండి’’ అంటూ చురకలు వేశారు. బిలావల్ ‘ఉగ్రవాదానికి ప్రోత్సాహకుడు, సమర్థకుడు, అధికార ప్రతినిధి’గా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు! తామూ ఉగ్రవాద బాధితులమేనన్న బిలావల్ వ్యాఖ్యలపైనా జై శంకర్ తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ ఇప్పటికీ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోందని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, పాక్ చేతులు కలుపుతాయా అని ప్రశ్నించగా, ఉగ్రవాద బాధితులు ఎప్పుడూ ఉగ్రవాదానికి పాల్పడిన వారితో కలిసి ఉగ్రవాదంపై చర్చించడానికి కూర్చోరని బదులిచ్చారు. చేశారు. జీ 20 సన్నాహక సమావేశాలను జమ్మూ కశ్మీర్లో జరపడంపై బిలావల్ లేవనెత్తిన అభ్యంతరాలనూ కొట్టిపారేశారు. ‘‘అసలు జీ 20 భేటీలతో మీకేం సంబంధం? దానికంటే, జమ్మూ కశ్మీర్లో మీరు ఆక్రమించుకున్న భూభాగాలను ఎప్పుడు ఖాళీ చేస్తారన్న దానిపై మాట్లాడితే బాగుంటుంది’’ అంటూ వాతలు పెట్టారు. జమ్మూ కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. ‘‘మేమేదో పాక్‌పై దౌత్యపరంగా పై చేయి సాధించేందుకు ప్రయత్నించడం లేదు. ఆ దేశం అసలు రంగును రాజకీయంగా, దౌత్యపరంగా ఎప్పటికప్పుడు ప్రపంచం ముందుంచుతున్నాం’’ అని వివరించారు. ఉగ్రమూలాల్ని పెకిలించాలి ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సమూలంగా నాశనం చేయాలని ఎస్సీఓ భేటీలో జై శంకర్ పిలుపునిచ్చారు. ‘‘ఉగ్రవాదం ఇప్పటికీ కొనసాగుతోంది. దానినెవరూ సమర్థించరాదు. ప్రభుత్వాల సాయంతో తెరవెనుక సాగే సీమాంతర ఉగ్రవాదం సహా ఏరూపంలో ఉన్నా అరికట్టాలి’’ అని పాక్‌నుద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఉగ్రమూకల ఆర్థిక మూలాలను సమూలంగా నాశనం చేయాలన్నారు. ఇది ఎస్సీవో లక్ష్యాల్లో ఒకటని గుర్తు చేశారు. సభ్య దేశాల శాంతి, సుస్థిరతలకు భారత్ అత్యంత ప్రాముఖ్యతనిస్తుందన్నారు. ద్వైపాక్షిక అంశాలను ప్రస్తావించరాదనే ఎస్సీవో నిబంధనలను ఉల్లంఘించకుండానే పాక్‌కు మంత్రి తలంటారు. బిలావల్ మాట్లాడుతూ దౌత్యపరమైన అంశాల్లో ఉగ్రవాదాన్ని అస్త్రంగా వాడుకోరాదన్నారు. ‘‘ఈ సమస్యను రాజకీయాల నుంచి వేరు చేసి అందరూ కలిసికట్టుగా పోరాడాలి. నేనూ ఉగ్రవాద బాధితుడినే. నా తల్లి బేనజీర్ భుట్టో ఉగ్రవాదానికి బలయ్యారు’’ అన్నారు. నమస్కారంతోనే భుట్టోకు పలకరింపు భారత్ సారథ్యంలో ఎస్సీవో సదస్సుకు హాజరైన పాక్ మంత్రి భుట్టో తదితర సభ్య దేశాల విదేశాంగ మంత్రులకు ఎస్.జై శంకర్ తాజ్ ఎగ్జోటికా రిసార్టులో ఏర్పాటు చేసిన వేదిక వద్ద నమస్తేతో స్వాగతం పలికారు. గురువారం సాయంత్రం హోటల్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్లో మాత్రం భుట్టో సహా అతిథులందరితోనూ మంత్రి జై శంకర్ కరచాలనం చేశారు. కార్యక్రమంలో రష్యా, చైనా విదేశాంగ మంత్రులు వరుసగా బిలావల్ భుట్టో, సెర్గీ లావ్రోవ్, క్విన్ గాంగ్‌తోపాటు ఖజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మంత్రులు పాల్గొన్నారు. -
భారత్‌పై బిలావల్ ఆక్రోశం
ఐక్యరాజ్యసమితి: కశ్మీర్‌ను పాలస్తీనాతో పోలుస్తూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో మరోసారి నోరుపారేసుకున్నారు. ‘‘రెండుచోట్లా పరిస్థితులు ఒక్కటే. రెండు సమస్యలనూ ఐరాస ఇప్పటికీ పరిష్కరించలేదు. కశ్మీర్‌ను ఐరాస ప్రధాన ఎజెండాలోకి తీసుకురాకుండా భారత్ పదేపదే అడ్డుపడుతోంది’’ అంటూ వాపోయారు. భారత్‌ను గురించి మాట్లాడే క్రమంలో ఒకసారి మిత్రదేశం, మరోసారి పొరుగుదేశం అంటూ ఆయన తడబాటుకు గురయ్యారు. -
బిలావల్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ శ్రేణులు
-
భుట్టోపై భగ్గుమన్న బీజేపీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేశాయి. భుట్టో వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతూ దేశవ్యాప్తంగా శనివారం పలు నగరాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. బిలావల్ దిష్టిబొమ్మలను దగ్ధంచేశారు. శనివారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లోనూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ‘ భారత ప్రధానిపై అనాగరిక, హేయమైన నిందలు వేస్తున్న పాక్ మంత్రికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనల్లో ప్రజలంతా పాల్గొనాలి’ అంటూ బీజేపీ ఒక ప్రకటన చేసింది. -
విజయవాడలో బీజేపీ కార్యకర్తల ఆందోళనలు
-
భారత ప్రధానమంత్రి కసాయి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో నోటి దురుసు ప్రదర్శించారు. ఐరాస భేటీ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్‌కు ఒక విషయం చెప్పదల్చుకున్నా. లాడెన్ చచ్చిపోయాడు గానీ గుజరాత్ ప్రజల ప్రాణాలను బలి తీసుకున్న కసాయి బతికే ఉన్నాడు. ఆయనే భారత ప్రధాని. ఆయన్ను అమెరికాలో అడుగుపెట్టకుండా అక్కడి ప్రభుత్వం నిషేధించింది. ఆయన ఆరెస్సెస్ ప్రధాని. ఆరెస్సెస్ విదేశాంగ మంత్రి. అసలు ఆర్ఎస్ఎస్ హిట్లర్ నుంచి స్ఫూర్తి పొందింది!’’ అన్నారు. బిలావల్ తొలుత ఐరాస భేటీలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. వేలాది మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్ర సంస్థ అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌కు, భారత పార్లమెంట్‌పై దాడి చేసిన ముష్కరులకు ఆశ్రయమిచ్చిన పాక్‌కు నీతి బోధలు చేసే అధికారం లేదంటూ విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా బదులిచ్చారు. ఈ విమర్శలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మోదీపై బిలావల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవి అనాగరికంగా, పాక్ స్థాయిని మరింత దిగజార్చేలా ఉన్నాయంటూ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తీవ్రంగా ఖండించారు. 1971లో ఏం జరిగిందో బిలావల్ మర్చిపోయినట్లున్నారని భారత్ చేతిలో పాక్ ఓటమిని ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. -
మేము డేంజరా? మరి అణ్వాయుధాలున్న భారత్ ప్రమాదం కాదా?
ఇస్లామాబాద్: అణ్వాయుధ సమన్వయం లేని పాకిస్థాన్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పాక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బైడెన్ వాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబారి డొనాల్డ్ బ్లోమ్కు సమన్లు పంపింది. పాకిస్థాన్ తన సమగ్రత, భద్రత విషయంలో మొండిగా ఉంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అన్నారు. ఒకవేళ ప్రశ్నలు లేవనెత్తాల్సి వస్తే భారత్‌లో అణ్వాయుధాలపై కూడా ప్రశ్నించాలని పేర్కొన్నారు. బైడెన్ కామెంట్లు తనను షాక్‌కు గురిచేశాయని భుట్టో అన్నారు. సమన్వయ లోపం వల్లే బైడెన్ పొరబడి ఉంటారని చెప్పారు. లాస్ ఏంజెల్స్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పాకిస్థాన్ అత్యంత ప్రమాదకర దేశమని బైడెన్ అన్నారు. పాక్ ప్రధాని అమెరికాతో సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: పాకిస్తాన్‌పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు -
కెప్టెన్ సెన్సేషన్.. ప్రత్యర్థులు విలవిల
ఇస్లామాబాద్: సానూభూతి గాలి పని చేయలేదు.. అధికారంపై మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ఊహించని రీతిలో సత్తా చాటుతున్న పీటీఐ పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులేస్తోంది. పాక్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ అతిపెద్ద పార్టీగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం 272 స్థానాలకుగానూ ఎన్నికలు జరగ్గా.. దాదాపు 120 సీట్ల ఆధిక్యంతో పీటీఐ దూసుకుపోతోంది. ఇమ్రాన్ దెబ్బకు పీఎంఎల్-ఎన్, పీపీపీ, ఎంక్యూఎమ్‌లు విలవిలలాడిపోతున్నాయి. ఇమ్రాన్ ఘనత.. ఇదిలా ఉంటే ఫలితాల్లో మాజీ క్రికెట్ స్టార్ ఇమ్రాన్‌ఖాన్ ఓ అరుదైన ఘనత సాధించారు. మొత్తం పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఆయన ఘన విషయం సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా పీఎంఎల్-ఎన్ పార్టీ కంచుకోటగా ఉన్న రావల్పిండిలో ఇమ్రాన్ జెండా ఎగరేయటం చర్చనీయాంశంగా మారింది. అధికారం దిశగా ఫలితాలు పీటీఐకు అనుకూలంగా వస్తుండటంతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. సయీద్‌కు షాక్.. గ్లోబల్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్‌కు ఈ ఎన్నికల్లో ఊహించని పరాభవం ఎదురైంది. సయీద్ ‘అల్లాహో అక్బర్‌తెహరిక్ పార్టీ’ని ప్రజలు ఘోరంగా తిరస్కరించారు. ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కలేదు. అయితే ఈ పార్టీ మద్ధతుదారులు కొందరు ఇండిపెండెంట్లుగా పోటీ చేయగా, వాళ్లు మాత్రం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. NA-3 స్వాట్‌లో షరీఫ్ సోదరుడు, పీఎంఎల్-ఎన్ ప్రెసిడెంట్ షెబాజ్ షరీఫ్ ఓటమి పాలయ్యాడు. అక్కడ పీటీఐ అభ్యర్థి సలీం రెహమాన్ జయకేతనం ఎగరవేశాడు. NA-200 లార్కానా లో పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో వెనకంజలో ఉన్నారు. ఎంఎంఏ రషీద్ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బిలావల్ తండ్రి అసిఫ అలీ జర్దారీ NA-213 నవాబ్షా నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. మొత్తం 272 స్థానాలకు గానూ ఎన్నికలు జరగ్గా, మ్యాజిక్ ఫిగర్ 137. ఒకవేళ పీటీఐకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే మాత్రం.. ఇండిపెండెంట్లు కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంది. ఫలితాలపై పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. అవకతవకల ఆరోపణలపై స్పందించిన ఎన్నికల ప్రధానాధికారి ముహమ్మద్ రాజా వాటిని ఖండించారు. ఫలితాలు ఆలస్యం కావటం వెనుక ఎలాంటి ఒత్తిడి లేదని.. కేవలం సాంకేతిక సమస్యల కారణంగానే జాప్యం జరుగుతోందని ఆయన వెల్లడించారు. సాయంత్రంకల్లా పూర్తి ఫలితాలు వెల్లడిస్తామని ఆయన చెబుతున్నారు. -
ఒక రాహుల్... ఒక బిలావల్!?
వారసత్వం.. పాతరాతి యుగం నుంచి నేటి ఆధునిక ప్రజాస్వామ్య యుగం వరకూ.. కొనసాగుతున్న పద్దతి. పరిస్థితులు మారినా.. వ్యవస్థలు మారినా.. నేపథ్యాలు మారినా వారసత్వం మాత్రం మారడం లేదు. నిజం చెప్పాలంటే ఒకప్పుడు రాజు మరణించిన తరువాత అతని పెద్ద కుమారుడు రాజయ్యేవాడు.. ఇదే పరిస్థితి ఆధునిక ప్రజాస్వామ్య కాలంలోనూ కనిపిస్తోంది. ఉపఖండంలో దాయాది దేశాలుగా భావించే భారత్, పాకిస్తాన్లలో వారసత్వం చుట్టే పార్టీలు, రాజకీయాలు తిరుగుతున్నాయి. రాజకీయాలు అత్యంత శక్తివంతమైనవి. ఉపఖండంలోని 200 కోట్ల మంది ప్రజలు.. ఓటుతో తమకు నచ్చిన ప్రభుత్వాన్ని, పాలకుడిని ఎంచుకునే అవకాశం ఉంది. ఇదే ప్రజాస్వామ్యం. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశంగా పేరొందిన భారత్, అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపు పొందిన పాకిస్తాన్లలో రాజకీయ వారసులే.. పార్టీలను ముందుకు నడిపిస్తున్నారు. బ్రిటీష్ కాలం నుంచి పార్టీ ఒకటైతే.. దేశ ఆవిర్భావితం తరువాత ఏర్పడ్డ పార్టీ మరొకటి. ఇంతటి సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీలపై ఆయా కుటుంబాలదే పెత్తనం. ఇక్కడే రాజరికంలో ఉన్నట్లు ఆయా కుటుంబాల్లోని పెద్ద కుమారులకే పార్టీ అధినేతలుగా పట్టం కట్టారు. రేప్పొద్దున ఆ పార్టీలు అధికారంలోకి వస్తే.. వారే దేశాధినేతలు. ప్రజాస్వామ్యంలోనూ రాజరికం..అందులోనూ కుటుంబస్వామ్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. రాహుల్ గాంధీ భారత్‌లోని రాహుల్ గాంధీకి, పాకిస్తాన్‌లోని బిలావల్ జర్దారీ భుట్టోకి ఇక్కడే చాలా సారూప్యతలు కనిపిస్తాయి. ఇద్దరూ ఉన్నత విద్యావంతులే. ఇద్దరూ బ్రిటన్‌లోనే ఉన్న విద్యను అభ్యశించారు. ఇద్దరూ యువకులే. బిలావల్ పార్టీ చీఫ్‌గా వ్యవహరిస్తున్నసమయంలో పీపీపీ పాకిస్తాన్లో అధికారంలో ఉంది. అప్పుడు వయసు తక్కువగా ఉండడంతో బిలావల్ ప్రధాని కాలేకపోయాడు. ఇక్కడ రాహుల్ గాంధీది అదే పరిస్థితి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 2004 నుంచి 2014 వరకూ అధికారంది. కాంగ్రెస్ దేశంలో దశాబ్దకాలం పాటు అధికారంలో ఉన్నా రాహుల్ గాంధీ మాత్రం ప్రధాని కాలేకపోయారు. భారత దేశంలో గాంధీ.. అనే పేరుకు చాలా ప్రతిష్ట ఉంది. ఇక్కడ వ్యక్తికన్నా.. గాంధీ అనే ట్యాగ్‌లైన్ చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. గత ఐదేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ దాదాపు 27 ఎన్నికల్లో వరుస పరాజయాలు చవిచూసింది. ఈ నేపథ్యంలో కొందరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారిని సంప్రదించిన ఘటనలున్నాయి. ఇన్ని వైఫల్యాలున్నా.. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్నారు.. ఇందుకు ప్రధాన కారణం అతను గాంధీ వారసత్వంగా రాజకీయాల్లో కోనసాగడమే. బిలావల్.. ఇక పాకిస్తాన్‌లోనూ భుట్టే అనే ఇంటి పేరు చాలా శక్తివంతం. రాహుల్ గాంధీ కన్నా బిలావల్ భుట్టో 18 ఏళ్ల చిన్నవాడు. ప్రస్తుతం అతని వయసు 29 ఏళ్లు. వచ్చే ఏడాది పాకిస్తాన్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీని బిలావల్ ముందుకు నడిపిస్తున్నాడు. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి అయిన జుల్ఫీకర్‌ఆలీ భుట్టో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీని స్థాపించాడు. జుల్ఫీకర్‌ఆలీ భుట్టో కుమార్తె అయిన బేనజీర్ భుట్టో కూడా పాకిస్తాన్ ప్రధానిగా పనిచేశారు. దాదాపు దశాబ్దం కిందట బేనజీర్ భుట్టో హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే బిలావల్ పీపీపీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. ఇద్దరిలోనూ సారూప్యతలు బిలావల్, రాహుల్ గాంధీలు.. ఇద్దరూ వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. బిలావల్ తల్లిని, తాతయ్యను పోగొట్టుకుంటే.. రాహుల్ చిన్నతనంలోనే తండ్రిని, నానమ్మను కోల్పోయాడు. ఇందిరను బాడీ గార్డులో హత్య చేయగా.. జుల్ఫీకర్ ఆలీ భుట్టోను ఉరి తీశారు. రాజీవ్, బేనజీర్‌ల మరణం కూడా ఒకేలా ఉంటుంది. పాకిస్తాన్లో భుట్టో కుటుంబం, భారత్‌లో నెహ్రూ-గాంధీ ఫ్యామిలీలు దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశాయి. ఇద్దరు పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న సమయంలో పార్టీ అధికారంలో ఉంది. కానీ ఇద్దరూ ప్రదానులు మాత్రం కాలేకపోయారు. ఇద్దరికీ ఇంటిపేరే వరం, శాపంగానూ మారింది. యాధృచ్చికంగా రాజకీయాల్లోకి వచ్చినా తమ పార్టీలను గెలిపించేందుకు ఇద్దరూ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇద్దరిలోనూ ఉన్న ప్రధాన సారూప్యత.. వివాదాలు. పాకిస్తాన్లో బిలావల్ భుట్టో మీద, భారత్‌లో రాహుల్ గాంధీ మీద.. ఉన్నన్ని వివాదాస్పద వ్యాఖ్యలు మరెవరిమీద ఉండవేమో! ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్లో పర్వేజ్ ముషారఫ్, నవాజ్ షరీఫ్‌లు వారిమీద చేసే వివాదాస్స వ్యాఖ్యలకు కొదవ లేదు. ఎన్నికలు ఇద్దరికీ పరీక్ష గుజరాత్లో జరిగిన శాసనసభ ఎన్నికలు రాహుల్ గాంధీ నాయకత్వ రెఫరెండమ్‌గా అందరూ భావిస్తున్నారు. ఈ కారణం వల్లే రాహుల్ గాంధీ ఎన్నడూ లేని విధంగా గుజరాత్లో దాదాపు 3000 వేల కిలోమీటర్లు పర్యటించారు. బిలావల్ కూడా వచ్చే ఏడాది పాకిస్తాన్ ఎన్నికల్లో తల్లి పోటీ చేసిన సింధ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి బిలావల్ భుట్టో.. వారసత్వంగానే అధినేతలు అయినా.. పార్టీలను విజయతీరాలకు చేరిస్తేనే.. వారికి రాజకీయ భవిష్యత్ ఉంటుందనేది వాస్తవం. -
కులభూషణ్‌కు భుట్టో మద్దతు
లాహోర్: భారత్ నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు విధించిన మరణ శిక్షను పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చీఫ్ బిలావుల్ భుట్టో జర్దారీ పరోక్షంగా వ్యతిరేకించారు. జాదవ్ విషయం వివాదాస్పదంతో కూడుకున్నదని, అయితే, తాను తన పార్టీ మరణ శిక్షకు వ్యతిరేకం అని చెప్పారు. ‘భారత్‌కు చెందిన గుఢాచారి కులభూషణ్ జాదవ్ విషయం వివాదాస్పదం. ఇక్కడ అతను ఎక్కువకాలం ఉండాల్సింది కాదు. మా తాత జుల్ఫీకర్ అలీ భుట్టోకు కూడా మరణ శిక్ష విధించారు. మా పార్టీ, నేను ఉరిశిక్షకు వ్యతిరేకం’ అని బిలావుల్ తెలిపాడు. మరోపక్క, పీపీపీ పంజాబ్ అధ్యక్షుడు, సమాచార శాఖ మాజీ మంత్రి ఖమర్ జమాన్ కైరా స్పందిస్తూ జాదవ్‌కు ఉరిశిక్ష విధించడంపై భారత్ స్పందించడం సాధారణ విషయమే అని అన్నారు. అయితే, వాస్తవానికి జాదవ్‌ను ఎందుకు ఉరి తీస్తున్నారో, ఆయనపై నమోదు చేసిన చార్జీషీట్ ఏమిటో ప్రపంచానికి తెలియజేయడంలో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. అదే భారత్ ఇలా పాకిస్థాన్ గుఢాచారిని అరెస్టు చేసి ఉంటే అందుకు తగిన సాక్ష్యాధారాలతో ప్రపంచం మొత్తానికి తెలియజేసేదని అభిప్రాయపడ్డారు. -
పాకిస్థాన్‌కు బ్రిటన్ చెప్పుదెబ్బ సమాధానం
బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ పాకిస్థాన్‌కు చెప్పుదెబ్బ లాంటి సమాధానం చెప్పారు. బ్రిటన్ వేదికగా అంతర్జాతీయ యవనికపై కాశ్మీర్ అంశాన్ని రచ్చ చేయాలనుకున్న పాక్ పన్నాగాన్ని తిప్పికొట్టారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తమ దేశానికి ఆహ్వానించిన కామెరాన్.. కాశ్మీర్ అంశం కేవలం భారత్, పాకిస్థాన్ మధ్య విషయమని, దానిపై తాము ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకునేది లేదని స్పష్టం చేశారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో జర్దారీ ఇటీవల లండన్‌లో ఓ భారీ ప్రదర్శన ఏర్పాటుచేసి, కాశ్మీర్ అంశాన్ని అక్కడ చర్చకు లేవదీయాలని ప్రయత్నించారు. అయితే.. ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. అక్కడ భారీ ప్రదర్శన చేయాలనుకున్నా.. దానికి స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది. దాంతో ఆ వైఫల్యానికి కారణం మీరంటే మీరేనంటూ.. బిలావల్ భుట్టో, ఇమ్రాన్ ఖాన్ వర్గాలు ఆరోపించుకున్నాయి. కానీ ఇప్పుడు వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు అటు ప్రదర్శన విఫలం కావడం, ఇటు బ్రిటిష్ ప్రధాని కామెరాన్ కూడా పాకిస్థాన్‌కు మద్దతు చెప్పకపోవడం ఆ దేశ నాయకులకు తీవ్ర ఆశాభంగాన్ని కలిగించింది. -
కాశ్మీర్ మొత్తాన్నీ లాక్కుంటాం!
-
కాశ్మీర్‌ను భారత్ నుంచి లాక్కుంటాం: బిలావల్
దివంగత పాక్ నాయకురాలు బేనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో జర్దారీ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మొత్తం కాశ్మీర్‌ను భారత్ నుంచి లాక్కుంటామని, అందుకు తమ పార్టీ (పీపీపీ) కృషి చేస్తుందని అన్నాడు పాకిస్థాన్ పంజాబ్‌లోని ముల్తాన్ ప్రాంతంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ అతనీ వ్యాఖ్యలు చేశాడు. ''నేను మొత్తం కాశ్మీర్‌ను వెనక్కి తీసుకుంటా. అందులో ఒక్క అంగుళం కూడా వదలను. ఎందుకంటే, ఇతర రాష్ట్రాల్లాగే అది కూడా పాకిస్థాన్‌కే చెందుతుంది'' అని భుట్టో కుటుంబ వారసుడు ప్రగల్భాలు పలికాడు. బిలావల్ ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో పాక్ మాజీ ప్రధానమంత్రులు యూసుఫ్ రజా గిలానీ, రజా పర్వేజ్ అషారఫ్ అతడికి రెండువైపులా ఉన్నారు. 2018లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తానని ముందే ప్రకటించిన బిలావల్.. అందుకోసం పాక్ ప్రజలను రెచ్చగొట్టడానికే ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి అతడి తల్లి బేనజీర్ భుట్టో రెండుసార్లు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆమె తండ్రి జుల్ఫికర్ అలీ భుట్టో 1967లో పీపీపీని స్థాపించారు. బిలావల్ తండ్రి ఆసిఫ్ అలీ జర్దారీ 2008 నుంచి 2013 వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు.