ఇస్లామాబాద్: మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్), బిలావల్ భుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)ల సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుఖాయమైన వేళ బిలావల్ భిన్నమైన ప్రకటన చేశారు. తాము ప్రభుత్వంలో చేరట్లేదని, బయటి నుంచి మద్దతు ఇస్తామని ఆయన స్పష్టంచేశారు. ‘‘ ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులు పొందటంలో మేం విఫలమయ్యాం. గెలిచిన సీట్ల సంఖ్యలో మేం మూడోస్థానానికే పరిమితమయ్యాం. అందుకే ప్రభుత్వంలో చేరొద్దని, ఏ మంత్రి పదవులూ స్వీకరించవద్దని మా పార్టీ నిర్ణయించింది.
దేశంలో రాజకీయ సంక్షోభాన్ని మేం కోరుకోవట్లేదు. దేశంలో రాజకీయ సుస్థిరతే మాకు ముఖ్యం’’ అని పార్టీ అత్యున్నత కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సమావేశం తర్వాత బిలోవల్ మీడియాతో చెప్పారు. దీంతో నవాజ్ షరీఫ్ రికార్డుస్థాయిలో నాలుగోసారి ప్రధా ట కావడం ఖాయమైంది. మరోవైపు కేంద్రంలో, రెండు ప్రావిన్సుల్లో ప్రభుత్వాల ఏర్పాటుకు ఇమ్రాన్ నేతృత్వంపీటీఐ ప్రయత్నిస్తోంది. ఎండబ్ల్యూఎం పార్టీతో కలసి కేంద్రంలో, పంజాబ్ ప్రావిన్స్‌లో.. జమాతే ఇస్లామీ పార్టీతో కలిసి ఖైబర్–పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయతి్నస్తామని పీటీఐ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment