ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం దాదాపు ఖాయమైంది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ప్రధాన పార్టీలైన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్(ఎన్), బిలావల్ బుట్టోకు చెందిన పీపీపీ పార్టీలు ప్రధాని పదవిని పంచుకోనున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు రెండు పార్టీల మధ్య ఇప్పటికే ఒప్పందం జరిగినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం ఈ విషయంపైనే ఇరు పార్టీల మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. మొత్తం ఐదేళ్లలో ఒక పార్టీ మూడేళ్లు, మరో పార్టీ రెండేళ్లు ప్రధాని పదవి పంచుకునేందుకు అంగీకరించినట్లు సమాచారం.
ఇటీవల జరిగిన పాకిస్థాన్ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సాధారణ మెజారిటీ ఏ పార్టీకి రాలేదు. దీంతో అత్యధిక సీట్లు సాధించిన ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన తెహ్రీక్ ఈ పాకిస్థాన్ పార్టీని అధికారం నుంచి దూరం చేయడానికి మిగిలిన ప్రధాన పార్టీలన్నీ ఏకమై సంకీర్ణం ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment