పాకిస్థాన్కు బ్రిటన్ చెప్పుదెబ్బ సమాధానం | british prime minister cameron invites modi to uk, denies to involve in kashmir issue | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్కు బ్రిటన్ చెప్పుదెబ్బ సమాధానం

Published Tue, Oct 28 2014 3:06 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

పాకిస్థాన్కు బ్రిటన్ చెప్పుదెబ్బ సమాధానం - Sakshi

పాకిస్థాన్కు బ్రిటన్ చెప్పుదెబ్బ సమాధానం

బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ పాకిస్థాన్కు చెప్పుదెబ్బ లాంటి సమాధానం చెప్పారు. బ్రిటన్ వేదికగా అంతర్జాతీయ యవనికపై కాశ్మీర్ అంశాన్ని రచ్చ చేయాలనుకున్న పాక్ పన్నాగాన్ని తిప్పికొట్టారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తమ దేశానికి ఆహ్వానించిన కామెరాన్.. కాశ్మీర్ అంశం కేవలం భారత్, పాకిస్థాన్ మధ్య విషయమని, దానిపై తాము ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకునేది లేదని స్పష్టం చేశారు.

పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో జర్దారీ ఇటీవల లండన్లో ఓ భారీ ప్రదర్శన ఏర్పాటుచేసి, కాశ్మీర్ అంశాన్ని అక్కడ చర్చకు లేవదీయాలని ప్రయత్నించారు. అయితే.. ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. అక్కడ భారీ ప్రదర్శన చేయాలనుకున్నా.. దానికి స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది. దాంతో ఆ వైఫల్యానికి కారణం మీరంటే మీరేనంటూ.. బిలావల్ భుట్టో, ఇమ్రాన్ ఖాన్ వర్గాలు ఆరోపించుకున్నాయి. కానీ ఇప్పుడు వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు అటు ప్రదర్శన విఫలం కావడం, ఇటు బ్రిటిష్ ప్రధాని కామెరాన్ కూడా పాకిస్థాన్కు మద్దతు చెప్పకపోవడం ఆ దేశ నాయకులకు తీవ్ర ఆశాభంగాన్ని కలిగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement