David Cameron
-
‘భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం భారత్ హక్కు’
ఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని తగ్గించటంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ అన్నారు. ‘దీ ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్’లో పాల్గొన్న డేవిడ్ కామెరాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం వ్యవహరించే సత్తా భారతదేశానికి ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై రెండున్నరేళ్లు గడుస్తోంది. కాల్పుల విరమణ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. భారతదేశం మధ్యవర్తిత్వం వహించే స్థితిలో ఉంది. కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బలవంతంగా భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి అనుమతి ఉండదనే విషయాన్ని తెలుసుకోవాలి’’అని అన్నారు.అదేవిధంగా ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్ల విషయంలో ప్రస్తుతం భారత్ దృక్పథం చాలా అవసరమని అన్నారు. ‘‘ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత దేశానికి శాశ్వత సభ్యత్వం లభించాలి. ప్రపంచానికి బలమైన ఆర్థిక వృద్ధి, ప్రజాస్వామ్యం, వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి భారత్ దృక్పథం అవసరం. ఈ అంశాలను సమర్థవంతంగా ఎదుర్కొవటంలో భారతదేశం ఒక ప్రపంచ దేశాలకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ శతాబ్దంలో ఏదో ఒక దశలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే భారతదేశపు ఎదుగుదలను కనబరుస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత స్థానం ఉండాలని 2015 ప్రకటన చేశాను. యూఎన్‌ఏలో సభ్యత్వం పొందటం.. భారతదేశం హక్కు’ అని అన్నారు. -
ఫేక్ వీడియో కాల్ బారినపడ్డ డేవిడ్ కామెరాన్!
లండన్: సామాన్యులు, రాజకీయ, సినీ ప్రముఖులు.. ఇలా అందరూ ఇటీవలఫేక్ కాల్స్ బారినపడుతున్నారు. అయితే తాజాగా బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరాన్ కూడా ఫేక్ వీడియో కాల్ బారిన పడ్డారు. డేవిడ్ కామెరాన్‌కు ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకో నుంచి వీడియో కాల్ రావటంతో ఆయన సంభాషించారు. అయితే తర్వాత కొంతసేపటికి అది ఫేక్ కాల్ అని తేలిపోయింది. ఈ విషయాన్ని యూకే విదేశాంగ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది.‘‘ కామెరాన్‌కు వీడియో కాల్ వచ్చింది. అందులో అచ్చం ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకోలా కనిపిస్తూ ఓ వ్యక్తి మాట్లాడారు. అయితే కొంత సమయానికి అవతలివైపు ఉన్న వ్యక్తి పెట్రో పోరోషెంకోనా? కాదా? అనే అనుమానం డేవిడ్‌కు కలిగింది. దీంతో అది ఫేక్ వీడియో కాల్‌గా ఆయన గుర్తించారు. ఈ ఫేక్ వీడియో కాల్, మెసెజ్‌లు నకిలీవి’ అని విదేశాంగ విభాగం పేర్కొంది.వీటిపై దర్యాపు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఆ నకిలీ కాలర్‌తో డేవిడ్ కామెరాన్ ఏం సంభాషించారనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఫేక్ కాలర్ కామెరాన్‌ను సంప్రదించటం కోసం మరింత సమాచారం అడిగినట్లు అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన డేవిడ్ కామెరాన్.. ఫేక్ కాల్స్, నకిలీ సమాచారాన్ని ఎదుర్కొనే ప్రయత్నం, అవగాహన ప్రజల్లో పెంచాలని భావించినట్లు విదేశాంగ కార్యాలయం పేర్కొంది.2018లో బోరిస్ జాన్సన్ విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో అర్మేనియా ప్రధాని పేరుతో ఓ ఫేక్ కాల్ వచ్చింది. అదే విధంగా 2022లో ఇద్దరు మంత్రులకు ఫేక్ కాల్స్ రావటం వెనక రష్యా హస్తం ఉందని బ్రిటన్ ఆరోపణులు కూడా చేసింది. -
బ్రిటన్ హోం మంత్రి బ్రేవర్మన్కు ఉద్వాసన
లండన్: బ్రిటిష్ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్కు ఉద్వాసన పలికింది రిషి సునాక్ ప్రభుత్వం. పాలస్తీనా అనుకూల ఆందోళనలను అణిచివేయడంలో లండన్ పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. బ్రేవర్మన్ వ్యాఖ్యలపై గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తున్న నేపథ్యంలో సునాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేయాల్సిందిగా బ్రేవర్మన్ను సునాక్ అడిగినట్లు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. సునాక్ ఆదేశాలకు ఆమె అంగీకరించినట్లు రాయిటర్స్‌లో కథనం వెలువడింది. గాజాలో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ చేపట్టాలని బ్రిటన్ వేదికగా ఆందోళనకారులు గత కొద్ది రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. ఈ నిరసనలకు అడ్డుకట్ట వేయడంలో అధికారులు విఫలమైతున్నారని ప్రధాని సునాక్ అంతరంగిక మంత్రి బ్రేవర్మన్ మండిపడ్డారు. ఆందోళనల పట్ల అధికారులు కూడా సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని సునాక్ అనుమతి లేకుండానే ఈ అంశంపై ఓ కథనం కూడా ప్రచురించారు. ఈ అంశం గత కొద్ది రోజులుగా బ్రిటన్‌లో వివాదానికి దారి తీసింది. ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆమెను పదవి నుంచి తొలగించాలని నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. బ్రేవర్మన్ను తొలగించాల్సిందిగా సునాక్‌పై ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలో ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఇలా ఉంటే.. బ్రిటన్ కేబినెట్లో సుయెల్లా బ్రేవర్మన్ సీనియర్ మంత్రి. గతంలో మాజీ ప్రధాని లిజ్ ట్రస్ మంత్రివర్గంలో కూడా ఆమె పనిచేశారు. అప్పట్లో లిజ్ ట్రస్ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోందని విమర్శించారు. అదే సమయంలో మైగ్రేషన్ అంశంపై అధికారిక పత్రాలను వ్యక్తిగత మెయిల్ ద్వారా షేర్ చేసినందుకు బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం రిషి సునాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక.. ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇంటీరియర్ మినిస్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆమె ప్రచురించిన కథనం వివాదాస్పదం కావడంతో మరోసారి పదవి కోల్పోయారు. గతంలో ఆమె వలసదారులపై చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి. మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్‌కు చోటు బ్రేవర్మన్ స్థానంలో విదేశాంగ మంత్రి జేమ్స్ క్లీవర్లీని బ్రిటన్ కొత్త హోం మంత్రిగా సునాక్ ప్రభుత్వం నియమించింది. మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్‌ను బ్రిటన్ తదుపరి విదేశాంగ మంత్రిగా ఎంపిక చేసింది. త్వరలో వారు అధికారికంగా పదవులు చేపట్టనున్నారు. కామెరూన్ 2010 నుంచి 2016 వరకు ప్రధానిగా పనిచేశారు. ఇదీ చదవండి: Jaishankar Gift To Rishi Sunak: బ్రిటీష్ ప్రధానికి భారత్ దీపావళి కానుక -
భారత్ అవకాశాల కేంద్రం: కామెరాన్
కోల్‌కతా: భారత్ ఇతర దేశాలకు మించి వేగంగా వృద్ధి చెందుతోందని, ఎన్నో అవకాశాలను కల్పిస్తోందని బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్ చెప్పారు. కోల్‌కతాలో ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘మంచి అయినా, చెడు అయినా అవకాశాలపై దృష్టి సారించడం ముఖ్యం. ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకోవాలి. నా పదవీ కాలంలో భారత్, బ్రిటన్ మధ్య సంబంధాలకు ప్రాధాన్యమిచ్చాం. జి20 దేశాల్లో భారత్‌లోనే బ్రిటన్ ఎక్కువగా పెట్టుబడులు పెట్టింది. టాటాల రూపంలో భారత్ నుంచి అతిపెద్ద పెట్టుబడులు అందుకున్న దేశం కూడా మాదే’’ అని కామెరాన్ పేర్కొన్నారు. 2010–2016 వరకు కామెరాన్ బ్రిటన్ ప్రధానిగా పనిచేశారు. ఈ రోజు మార్కెట్ ఎకానమీకి ప్రతికూలతలు ఎదురయ్యాయని, బలవంతుడి రాజకీయాలు ఆవిర్భవించడాన్ని చూస్తున్నామంటూ పరోక్షంగా అమెరికా అధ్యక్షుడి తీరును ప్రస్తావించారు. 7 శాతం వృద్ధి రేటుతో భారత్ బలమైన స్థానంలో ఉందన్నారు. స్వేచ్ఛాయుత వాణిజ్యం వ్యర్థమన్న పూర్వ సిద్ధాంతం మాదిరిగా రక్షణాత్మకం, ఒంటరితనం పెరిగిపోతోందని పేర్కొన్నారు. వ్యవస్థను మార్చాల్సిన అవసరం లేదని, దాని రూపు మారిస్తే సరిపోతుందన్నారు. భారత స్టీల్‌పై అమెరికా అధ్యక్షుడు దిగుమతి సుంకాలు విధించడాన్ని తప్పుబట్టారు. భారత ప్రధాని తాను ఎంత బలవంతుడో చూపించాల్సి ఉందన్నారు. -
టెండూల్కర్ ని కిడ్నాప్ చేయాలి..!
బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ భారత క్రికెట్ సంచలనం సచిన్ టెండూల్కర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో టూర్ లో అష్టకష్టాలు పడుతున్న ఇంగ్లాండ్ టీంకు శిక్షణ ఇవ్వడానికి సచిన్ ను కిడ్నాప్ చేయాలంటూ చమత్కరించారు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ లో పాల్గొంటున్న కామెరూన్ శనివారం ఈ కమెంట్స్ చేశారు. ప్రస్తుతం దేశంలో ఇరు దేశాల మధ్య జరుగుతున్న సిరీస్ ని దృష్టిలో పెట్టుకుని కామెరూన్ చతురోక్తులు విసిరారు. టెండూల్కర్ ని కిడ్నాప్ చేసి, తమ ఆటగాళ్లకు ట్రయినింగ్ ఇప్పించాలన్నారు. మరోవైపు సచిన్ కూడా సమావేశానికి హాజరు కానున్నారు. తాను ఇండియాకువచ్చిన ప్రతీసారీ దేశ పురోగతి, సామర్థ్యాన్ని చూసి ఎంతో ముగ్ధుణ్నవుతున్నానని వ్యాఖ్యానించారు. దీంతో సభలో చప్పట్లుమారు మోగాయి. ఇరుదేశాలమధ్య చరిత్ర, సంస్కృతి భాగస్వామ్యంతోపాటు ఉద్యోగాలు, పెట్టుబడులు ఆధారంగా "ఆధునిక భాగస్వామ్యం" పట్ల తనకు మక్కువ ఎక్కువన్నారు. కాగా ఇంగ్లాండ్ -భారత్ మధ్య జరుగుతున్న అయిదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో రెండింటినీ భారత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. -
మాజీ ప్రధానికి జాబ్ ఆఫర్.. 314 కోట్ల శాలరీ!
సాధారణంగా ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయిన వారు ఏ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలో చేసుకుంటారు. లేదా రిటైరయి కాలక్షేపం చేస్తారు. కానీ బ్రెగ్జిట్ దెబ్బకు బ్రిటన్ ప్రధాని పదవిని కోల్పోయిన డేవిడ్ కామెరాన్ ఒక్కసారిగా ఖాళీగా మారిపోయారు. ఎంపీగా కొనసాగాలని, వచ్చే ఏడాది కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన భావిస్తున్నప్పటికీ.. ఆయనకు మాత్రం ఇతర జాప్ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అందులో ఒకింత వికృతమైన, విస్మయం కలిగించే ఆఫర్ ఆయనకు వచ్చింది. తమ దేశ 'సుల్తాన్'గా ఉండాలని, అందుకు ఏడాదికి 32మిలియన్ పౌండ్లు (రూ. 314,49 కోట్లు) జీతం ఇస్తామని కజికిస్థాన్ ఆఫర్ చేసింది. అయితే, ఈ పదవికి అర్హుడిగా మారాలంటే ముస్లింల మాదిరిగా 'సుంతి' చేయించుకోవాలని సూచించింది. ఈమేరకు నేరుగా కామెరాన్ కార్యాలయానికి జాబ్ ఆఫర్‌ను పంపించడం గమనార్హం. ముస్లిం యూనియన్ అయిన కజకిస్తాన్ ఇలాంటి వ్యంగ్య ప్రహసనాలతో గతంలోనూ వార్తల్లో నిలిచింది. కజకిస్తాన్ నియంత పాలకుడు మురాత్ తెలిబెకోవ్ గతంలోనూ ఇలాంటి వ్యంగ్యోక్తులతో మీడియా దృష్టిని ఆకర్షించారు. దేశాధ్యక్షుడి వయస్సు 80 ఏళ్లు దాటితే ఉరితీయాలని, లంచాన్ని చట్టబద్ధం చేయాలంటూ 76 ఏళ్ల తెలిబెకోవ్ గతంలో పేర్కొన్నారు. మరోవైపు ప్రస్తుతం ఎంపీగా కామెరాన్ అందుకుంటున్న వేతనం 74వేల పౌండ్లు మాత్రమే కాబట్టి ఆయన ఈ జాబ్ చేపడితే బాగుంటుందని ఆయన ప్రత్యర్థులు ఛలోక్తులు విసురుతున్నారు. -
థెరిసా కెన్
థెరిసా మే.. బ్రిటన్ కొత్త ప్రధాని! గత వందేళ్లలో బ్రిటన్ 24 సార్లు... ఎన్నికలతో నిమిత్తం లేకుండా తన ప్రధాన మంత్రుల్ని మార్చింది. కాబట్టి థెరిసా మే అకస్మాత్తుగా ప్రధాని అవడంలో ప్రత్యేకత ఏమీ లేదనిపించవచ్చు. అది నిజం కాదు. థెరిసాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే ఈ పార్లమెంటు సభ్యురాలిని ప్రధానిని చేసిన ప్రత్యేకత మాత్రం.. ‘ఆఖరి నిమిషంలో మనసు మార్చుకోవడం’! కలిసి ఉన్నా కలివిడిగా లేరు! బ్రిటన్‌కు వారం క్రితం వరకు ఉన్న ప్రధాని డేవిడ్ కామెరాన్. ఆయన టీమ్‌లో హోంశాఖ కార్యదర్శి థెరిసా మే. ‘ఐరోపా సమాఖ్యతో బ్రిటన్ కలిసే ఉండాలా? విడిపోవాలా?’ అనే అంశంపై గత నెలలో బ్రిటన్ తలపెట్టిన జనవాక్య సేకరణకు (రెఫరెండమ్) ముందు.. ప్రధాని కామెరాన్, ఆయన బృందం కలిసి.. ‘ఇ.యు.తో బ్రిటన్ కలిసే ఉండాలి’ అని గట్టిగా ప్రచారం చేశారు. అయితే ఆ ప్రచారంలో థెరిసా మనస్ఫూర్తిగా పాలుపంచుకోలేదు! దీనినే ఇంకో విధంగా చెప్పాలంటే... ఇ.యు.తో కలిసి ఉండే విషయంలో ఆమె కామెరాన్‌తో కలిసే ఉన్నారు కానీ... కామెరాన్‌తో కలివిడిగా లేరు! దానర్థం.. ఇ.యు. నుంచి బ్రిటన్ విడిపోవాలని థెరిసా మే కోరుకుంటున్నారని! సింహాన్ని స్వారీ చేయగలరా? రెఫరెండమ్ ఫలితాలు కామెరాన్ అభీష్టానికి వ్యతిరేకంగా వచ్చాయి. కామెరాన్ నైతిక బాధ్యత వహించి ప్రధాని పదవి నుంచి దిగిపోయారు. ఆ స్థానంలోకి.. చివరి నిమిషంలో మనసు మార్చుకుని (విడిపోవడానికి అనుకూలంగా) ‘నైతికత’ సాధించిన థెరిసా మే... వచ్చేశారు. జూలై 13 న ప్రమాణ స్వీకారం చేయడానికి రెండు రోజుల ముందు మీడియాతో ఆమె ‘‘బ్రెగ్జిట్ మీన్స్ బ్రెగ్జిట్. అండ్ వియ్ ఆర్ గోయింగ్ టు మేక్ ఎ సక్సెస్ ఆఫ్ ఇట్’’ అన్నారు. ఈ మాట ‘కోట్ ఆఫ్ థెరిసా’ అయింది! ప్రధానిగా ప్రస్తుతం ఆమె ముందున్న సవాలు కూడా ఇదే! విడిపోయే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం. అంటే సింహం పెకైక్కి స్వారీ చెయ్యడం. మార్గరెట్... మెర్కెల్... మదర్ పాలిటిక్స్‌లో మార్గరెట్ థాచర్, పోలికల్లో ఏంజెలా మెర్కెల్, పేరులో మదర్ థెరిసా... ఈ ముగ్గురు వ్యక్తుల్నీ గుర్తుకు తెస్తారు థెరిసా మే. మార్గరెట్ థాచర్ బ్రిటన్ తొలి మహిళా ప్రధాని (1979-1990). బ్రిటన్ రెండో మహిళా ప్రధాని థెరిసా మే. థాచర్‌కు ‘ఐరన్ లేడీ’ అని పేరు. థాచర్లా థెరిసా కూడా దృఢమైన నాయకురాలిగా వ్యవహరించగలరా? ‘బ్రెగ్జిట్’తో బ్రిటన్‌కు ప్రయోజనాలను సాధించిపెట్టడం, గ్రేట్ బ్రిటన్ నుంచి స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్న స్కాట్లాండ్ను నియంత్రించడం.. వీటితో పాటు మరికొన్ని పాత భూతాలను సీసాలో పెట్టి బంధించడంలో థెరిసా తెగువ , విజ్ఞత చూపించగలరనే పరిశీలకుల అంచనా. ఒకేలా అనిపిస్తారు... కనిపిస్తారు! జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్కి, థెరిసా మే కి ఉన్న పోలికలు ప్రధానంగా వాళ్ల వ్యక్తిత్వానికి, దృఢచిత్తానికి, నిర్భీతికి, నిర్మొహమాటానికి సంబంధించినవి. మాటల్లో, కదలికల్లో ఇద్దరిలోనూ ఒకే విధమైన ఆత్మవిశ్వాసం వ్యక్తమౌతుంటుంది. ఇద్దరివీ క్రైస్తవ సేవా సంఘాలకు పనిచేసిన కుటుంబ నేపథ్యాలే. మెర్కెల్ తండ్రి లూథరన్ పాస్టర్. థెరిసా తండ్రి చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ మతాధికారి. థెరిసా ప్రధాని అయ్యారనగానే బి.బి.సి. ‘ఈజ్ థెరిసా మే.. ది యూకేస్ మెర్కెల్?’ అనే స్టోరీని ఇచ్చింది. ‘యూరప్స్ టూ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్’ అంటూ వాషింగ్టన్ పోస్ట్ ఇద్దరి మధ్యా రాజకీయ సారూప్యతలను వెదకి పట్టింది. మరో పోలిక... మదర్ థెరిసా! విశ్వమాత థెరిసాకు, రాజకీయనేత థెరిసాకు ఎక్కడా పొంతన కుదరదు. థెరిసా అన్న పేరున్నంత మాత్రాన థెరిసా మే కు ప్రాముఖ్యం వచ్చేయదు. మరి ఎలా పోలిక? లేకపోవడమే పోలిక! థె రిసా మే లో ‘మదర్’ అన్న మాట లేదు. థెరిసా జీవితంలో మదర్ అనే అపురూప భావన లేదు. అవును. థెరిసా మే కి పిల్లలు లేరు! ‘‘మీ పిల్లలేం చేస్తున్నారు’’ అని ఎవరైనా అడిగితే థెరిసా ఆవేదనకు లోనవుతారట. ఆరోగ్య కారణాల రీత్యా మదర్ కాలేక పోయిన థెరిసాను ‘మదర్’ అనే మాట.. ఆమె ప్రధాని అయ్యే ముందు వరకు కూడా వెంటాడింది! ‘మదర్ కామెంట్’పై క్షమాపణ బ్రిటన్ ప్రధానిగా కామెరాన్ వైదొలగుతున్నట్లు ప్రకటన వెలువడగానే.. థెరిసా మే తో పాటు, బ్రిటన్ ఇంధన వనరుల శాఖ మంత్రి ఆండ్రియా లీడ్సమ్ బరిలోకి వచ్చారు! థెరిసా కన్నా ఆండ్రియా ఆరేళ్లు చిన్న. ప్రధాని అభ్యర్థిత్వానికి ఇద్దరి మధ్యా పోటీ మొదలైంది. ఇద్దరి బలాబలాలపై ఎంపీల మధ్య చర్చ ప్రారంభం అయింది. ‘‘ప్రధాని పదవికి మీకున్న అదనపు అర్హత ఏమిటి?’’ అని ఓ చానల్ ఆండ్రియాను ప్రశ్నించింది. ఆండ్రియా ఏమాత్రం తడుముకోకుండా... ‘‘నేను మదర్ని. తల్లిగా నాకు అనుభవం ఉంది’’ అని చెప్పారు. ఆ వెంటనే తప్పు తెలుసుకున్నారు. ‘‘నా మాటల వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే వారిని క్షమాపణ కోరుతున్నాను’’ అని అపాలజీ చెప్పారు. దీనిపై థెరిసా ఏమీ స్పందించలేదు. కానీ ఆమె నొచ్చుకునే ఉంటారు. ఆ రాత్రి థెరిసా భర్త ఫిలిప్ ఆమెను ఊరడించే ఉంటారు. అన్నట్టు.. క్షమాపణ చెప్పాక, ఆండ్రియా పోటీ నుంచి వైదొలిగారు. థెరిసా ఎన్నిక ఏకగ్రీవం అయింది. వైదొలగడానికి ఆండ్రియా చెప్పిన కారణం... తనకు తగినంత మద్దతు లేదని! రాజకీయ రంగ ప్రవేశం చక్కగా చదువుకుంటున్న అమ్మాయి రాజకీయాల్లోకి ఎందుకొచ్చింది! థాచర్‌ను చూసి స్ఫూర్తి పొందారు థెరిసా. థాచర్ బ్రిటన్ తొలి మహిళా ప్రధాని అయినప్పుడు థెరిసా వయసు 22 ఏళ్లు. బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. ప్రమాణ స్వీకారం రోజున థాచర్ వేసుకున్న నీలిరంగు ‘పవర్ సూట్’ థెరిసా మనసులో ఇప్పటికీ ఉండిపోయిందట! బట్టల మాట అలా ఉంచితే.. థాచర్ హయాంలోని రాజకీయ విధానాలకు ‘థాచరిజం’ అనే పేరు రావడం థెరిసాను ఊపేసింది. రాజకీయాల్లో ఆసక్తిని కలుగజేసింది. 29 ఏళ్ల వయసులో.. అప్పటికి చేస్తున్న ఉద్యోగం మానేసి రాజకీయాల్లోకి వచ్చేశారు థెరిసా. కౌన్సిలర్‌గా జీవితాన్ని మొదలుపెట్టి.. ఎంపీగా, బ్రిటన్ ప్రధానిగా ఎదిగారు. నా అన్నవారు లేని ప్రధాని! థెరిసామే కు తోబుట్టువుల్లేరు. ఇంట్లో ఒకే అమ్మాయి. తల్లిదండ్రుల్లేరు. థెరిసా పెళ్లయిన ఏడాదికే తల్లీతండ్రీ చనిపోయారు. కన్నబిడ్డల్లేరు. ఆమె మాతృమూర్తి కాలేకపోయారు. భర్తే ఇప్పుడు ఆమెకు అన్నీ! జీవితంలోని ప్రతి దశలోనూ థెరిసాకు ఒంటరితనం తోడుగా ఉంటూ వచ్చింది. మరో తోడు.. రాజకీయాలు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఒక అగ్రరాజ్యానికే తోడుగా నిలబడి, నడిపించవలసిన స్థానంలోకి వచ్చారు. బ్రిటన్‌కు ‘నేనున్నాను’ అనే ధీమాను ఇవ్వవలసిన బాధ్యతను చేపట్టారు. మరికొన్ని విశేషాలు థెరిసాకు ఆమె భర్త ఫిలిప్ మే.. ఉమ్మడి స్నేహితురాలైన బేనజీర్ భుట్టో ద్వారా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పరిచయం అయ్యారు థెరిసా భర్త.. ఆమె కన్నా ఏడాది చిన్న. థెరిసా 23వ యేట, ఫిలిప్ మే 22వ యేట 1980లో వాళ్ల వివాహం జరిగింది థెరిసాకు పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లిదండ్రులు మరణించారు. తండ్రి 1981లో కారు యాక్సిడెంట్లో చనిపోతే, తల్లి ఆ తర్వాతి ఏడాదే అనారోగ్యం (మల్టిపుల్ స్క్లెరోసిస్)తో కన్నుమూశారు థెరిసాకు షూస్ అంటే పిచ్చి. గత ఏడాది మార్చిలో రాణిగారిని కలవడానికి వెళ్లినప్పుడు ఆమె ధరించిన నల్లటి, మోకాళ్ల వరకు ఉండే పేటెంట్ (మెరిసే) లెదర్ షూ మీడియాను విపరీతంగా ఆకర్షించింది థెరిసా టైప్ 1 షుగర్ పేషెంట్. రోజుకు రెండుసార్లు ఇన్సులిన్‌ను ఇంజక్ట్ చేసుకుంటారు పార్లమెంటులో ప్రసంగించే అవకాశం వస్తే థెరిసా ఏమాత్రం వదులుకోరు. పార్లమెంటులో ఎక్కువమంది మహిళలు ఉండాలనేది కూడా ఆమె అభిమతం. థెరిసా ఫెమినిస్టు. మహిళల్ని రాజకీయాల్లోకి ప్రోత్సహించే ‘ఉమెన్2విన్’ ఉద్యమ కమిటికీ ఒకప్పుడు ఆమె అధ్యక్షురాలిగా ఉన్నారు. చదువు - కొలువు - రాజకీయాలు బి.ఎ. జాగ్రఫీ : ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ (1977) ఉద్యోగం : బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ (1977-83) ఫైనాన్షియల్ కన్సల్టెంట్ : 1985-1997 మున్సిపల్ కౌన్సిలర్ : 1986-1994 ఎంపీగా పోటీ : 1992 (ఓటమి) ఎంపీగా పోటీ : 1997 (గెలుపు) కన్సర్వేటివ్ పార్టీ తొలి మహిళా చైర్మన్‌గా నియామకం : 2002 షాడో కేబినెట్ సభ్యత్వం : 1999-2010 స్త్రీ, సమానత్వం శాఖల మంత్రి : 2010-2012 హోం శాఖ కార్యదర్శి : 2010-2016 (ఆరేళ్ల రికార్డు కాలం) ప్రధాన మంత్రి : 13-7-2016 నుంచి థెరిసా మే (59) బ్రిటన్ కొత్త ప్రధాని పూర్తి పేరు థెరిసా మేరీ బ్రేసియర్ జన్మదినం: 1 అక్టోబర్ 1956 జన్మస్థలం ఈస్ట్‌బోర్న్, ఇంగ్లండ్, యు.కె. తల్లిదండ్రులు జైడీ బ్రేసియర్ (తల్లి) హ్యూబెర్ట్ బ్రేసియర్ (తండ్రి) భర్త: ఫిలిప్ మే (బ్యాంకర్) -
డేవిడ్ కామెరాన్ (మాజీ ప్రధాని) రాయని డైరీ
టెన్ డౌనింగ్ స్ట్రీట్ నుంచి సామానుతో బయట పడ్డాం. స్ట్రీట్ నుంచి బయట పడినట్టు లేదు. స్ట్రీట్ మీదకు వచ్చి పడినట్టు ఉంది! ‘‘ఎక్కడికి వెళుతున్నాం డాడీ’’.. చిన్నది ఫ్లారెన్స్ అడిగింది. ఐదేళ్లు దానికి. వీడ్కోలు ప్రెస్ మీట్లో వాళ్ల అమ్మ స్కర్ట్‌ని గట్టిగా రెండు పిడికిళ్లతో పట్టుకుని నిలబడింది. ఎల్వెన్ కాస్త దిటవుగా ఉన్నాడు. పదేళ్లు వాడికి. వాడికన్నా రెండేళ్లు పెద్ద నాన్సీ. పిల్లలు ముగ్గుర్నీ దగ్గరకు చేర్చుకుని నిలబడి ఉంది శామ్.. నా పక్కనే. ఒక ఫ్యామిలీకి ఒక దేశం ఇస్తున్న వీడ్కోలులా ఉంది ఆ ప్రెస్ మీట్! మాట్లాడ్డం అయ్యాక, వెళ్లి కార్లో కూర్చున్నాం. అప్పుడు అడిగింది ఫ్లారెన్స్.. ‘‘ఎక్కడికి వెళుతున్నాం డాడీ’’ అని. ‘‘కొత్త ఇంట్లోకి’’ అన్నాను... తన కళ్లలోకి నవ్వుతూ చూస్తూ. తను నవ్వలేదు! శామ్ తనను ఒళ్లో కూర్చోబెట్టుకుంది. వేళ్లతో బుగ్గలు నిమిరింది. తల్లి చేతిని మృదువుగా తోసేసింది ఫ్లారెన్స్. ‘‘ఆ ఇల్లు ఈ ఇంటి కన్నా చాలా బాగుంటుంది’’... చెల్లికి చెబుతోంది నాన్సీ. ఎల్వెన్ ఈ ప్రపంచంలో లేడు. విండోలోంచి బయటికి చూస్తున్నాడు. వెనక్కి పోతున్న దారిని వెతుక్కుంటున్నాడా? ఎదురొస్తున్న దారిని కనుక్కుంటున్నాడా? భుజం చుట్టూ చేతులు వేసి వాడిని నా దగ్గరికి లాక్కున్నాను. కదల్లేదు! కనీసం విండోలోంచి తల తప్పి కూడా చూడలేదు. దగ్గరికి తీసుకోగానే ఎప్పటిలా వాడు నాలోకి ఒదిగిపోతా డనుకున్నాను. ఎప్పటిలా తన ముక్కుతో నా ఛాతీని అదుముతాడని అనుకున్నాను. అలా ఏం కాలేదు! ఏం జరుగుతోంది ఎల్వెన్లో? శామ్ మధ్యమధ్యలో నా కళ్లలోకి చూస్తోంది. డౌనింగ్ స్ట్రీట్‌లోని ఇంటి గడపను దాటి వచ్చినప్పటి నుంచీ ఆ కళ్లు నిశ్శబ్దంగా నన్ను.. అడిగిన ప్రశ్నే అడుగుతున్నాయి.. ‘‘ఆర్యూ ఓకే డేవిడ్?’’ అని. కారు మమ్మల్ని కాకుండా, మా ఫీలింగ్స్‌ని మోసుకెళు తున్నట్లుగా ఉంది. కళ్లలో ఫీలింగ్స్, కడుపులో ఫీలింగ్స్, వెనుక బ్యాగేజీల నిండా ఫీలింగ్స్. ఫ్లారెన్స్ ఈసారి ప్రశ్న మార్చింది. ‘‘ఎక్కడికి వెళుతున్నాం’’ అని అడగలేదు. ‘‘ఎందుకు వెళుతున్నాం?’’ అని అడిగింది! నాన్సీ తనని తల్లి చేతుల్లోంచి తీసుకుంది. ‘‘చెప్పాను కదా.. డార్లింగ్, ఆ కొత్త ఇల్లు ఇంకా బాగుంటుందని’’ అంది, చెల్లి బుగ్గ మీద ముద్దు పెట్టి. ఫ్లారెన్స్ కన్విన్స్ అయినట్టు లేదు. కళ్లకు చేతులు అడ్డం పెట్టుకుని.. ‘‘నాకు ఇష్టం లేదు... నాకు ఇష్టం లేదు’’ అనడం మొదలుపెట్టింది. ‘‘ఓహ్.. మై లిటిల్ ఫ్లారెన్స్’’ అంటోంది వాళ్ల అమ్మ. ఒక్కసారిగా ఏడ్చేసింది ఫ్లారెన్స్. ‘‘వెళ్లిపోవడం బాగుండదు.. వెళ్లిపోవడం బాగుండదు..’’ అంటూ ఏడ్చేస్తోంది. నాన్సీ కూడా తల్లి దగ్గరికి చేరింది. ఎల్వెన్ తలతిప్పి చూశాడు! ‘‘మనందరం వచ్చేస్తే మన ఇంటికి ఎవరు తోడుంటారు?’’... వెక్కి వెక్కి ఏడుస్తోంది ఫ్లారెన్స్. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటికి వచ్చినప్పుడు బెంగ పెట్టుకున్న బ్రిటన్ పౌరురాలిలా అనిపించింది.. మై ఏంజల్ కిడ్.. ఫ్లారెన్స్.. నాకా క్షణంలో! - మాధవ్ శింగరాజు -
కామెరాన్ సన్నిహితులకు చెక్
మంత్రివర్గంపై థెరిసా మార్క్! లండన్: బ్రిటన్ ప్రధానిగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన థెరిసా మే, గురువారం మంత్రివర్గానికి షాక్ ఇచ్చారు. కామెరాన్ ప్రధానిగా ఉన్నప్పుడు కీలక స్థానాల్లో కొనసాగిన వారికి ఉద్వాసన పలికారు. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా గట్టి ప్రచారం నిర్వహించిన బోరిస్ జాన్సన్‌కు అనూహ్యంగా విదేశాంగ మంత్రి పదవి కట్టబెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రధాని పదవి రేసులో థెరిసాకు పోటీగా నిలిచిన న్యాయమంత్రి మైకేల్ గోవ్, తొలగింపుల్లో ఆమె తొలి లక్ష్యమయ్యారు. కామెరాన్ మంత్రివర్గంలోని నిక్కీ మోర్గాన్, ఆలివర్ లెట్విన్, జాన్ విట్టింగ్డేల్లను కూడా పదవుల నుంచి థెరిసా తొలగించారు. లిజ్ ట్రస్, జస్టిన్ గ్రీనింగ్లకు కొత్తగా మంత్రివర్గంలో చోటుదక్కింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు బ్రెగ్జిట్ మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసి బాధ్యతలను డేవిడ్ డేవిస్‌కు అప్పగించారు. థెరిసాకు భారత ప్రధాని నరేంద్రమోదీ ట్వీటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో కలిసి ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషిచేస్తామని అన్నారు. -
పాత మంత్రులకు షాకిచ్చిన నూతన ప్రధాని
లండన్: బ్రిటన్ ప్రధానిగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన థెరిసా మే, గురువారం మంత్రివర్గానికి షాక్ ఇచ్చారు. డేవిడ్ కామెరాన్ ప్రధానిగా ఉన్నప్పుడు కీలక స్థానాల్లో కొనసాగిన వారికి ఆమె ఉద్వాసన పలికారు. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా గట్టి ప్రచారం నిర్వహించిన బోరిస్ జాన్సన్‌కు అనూహ్యంగా విదేశాంగ మంత్రి పదవి కట్టబెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రధాని పదవి రేసులో థెరిసాకు పోటీగా నిలిచిన న్యాయమంత్రి మైకేల్ గోవ్, మంత్రుల తొలగింపుల్లో ఆమె తొలి టార్గెటయ్యారు. కామెరాన్ మంత్రివర్గంలోని నిక్కీ మోర్గాన్, ఆలివర్ లెట్విన్, జాన్ విట్టింగ్డేల్లను కూడా పదవుల నుంచి థెరిసా తొలగించారు. కాగా, లిజ్ ట్రస్, జస్టిన్ గ్రీనింగ్ నూతన మంత్రివర్గంలో చోటుదక్కింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు బ్రెగ్జిట్ మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసి ఆ బాధ్యతలను డేవిడ్ డేవిస్‌కు అప్పగించారు. థెరిసా మేకు భారత ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో కలిసి ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషిచేస్తామని అన్నారు. యూరోపియన్ కూటమికి చెందిన జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మోర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే, ఐర్లాండ్ ప్రధాని ఎండా కెన్నీలు కూడా ఆమెకు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. -
చివరి భేటీలో ఉద్విగ్న వీడ్కోలు!
-
చివరి భేటీలో ఉద్విగ్న వీడ్కోలు!
డేవిడ్ కామెరాన్ బ్రిటన్ ప్రధానమంత్రిగా చివరి కేబినెట్ సమావేశం ఉద్విగ్నభరితంగా సాగింది. చివరి మంత్రిమండలి సమావేశానికి నేతృత్వం వహించిన కామెరాన్‌ను సహచర మంత్రులు ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయనో అద్భుతమైన ప్రధాని అంటూ ముక్తకంఠంతో కితాబిచ్చారు. ఈ సమావేశంలో కామెరాన్ కొంత ఉద్విగ్నతకు లోనయ్యారు. సహచర మంత్రులు నాలుగుసార్లు బల్లలను గట్టిగా చరుస్తూ.. ఆయన సేవల పట్ల తమ హర్షామోదాలను తెలియజేస్తూ.. ప్రధానిగా కామెరాన్‌కు ఘనమైన వీడ్కోలు పలికారు. ఈ సమావేశంలో కామెరాన్ మాట్లాడుతూ ఇన్నాళ్లు దేశానికి సేవ చేయడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. కేబినెట్‌కు నేతృత్వం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఆయన బుధవారం ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వెళ్లి స్వయంగా కామెరాన్ రాజీనామా పత్రాన్ని రాణికి సమర్పించనున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలన్న 'బ్రెగ్జిట్' ఫలితాల నేపథ్యంలో కామెరాన్ ప్రధాని పదవి నుంచి దిగిపోతున్న సంగతి తెలిసిందే. ఆయన వారసురాలిగా థెరిసా మే ప్రధాని పగ్గాలను చేపట్టనున్నారు. బుధవారం మధ్యాహ్నం ఆమె ప్రధాని పదవీ స్వీకారం చేసే అవకాశముంది. బ్రెగ్జిట్ ప్రక్రియను నిర్వర్తించే బృహత్ బాధ్యతను భుజస్కంధాలపై మోయనున్న థెరిసా తన కేబినెట్ లో కీలకమైన వ్యక్తులను తీసుకొనే అవకాశముంది. -
రెఫరెండం సరే.. తర్వాత ఏంటి?
బ్రిటన్‌లో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ - వీలైనంత త్వరగా తెగదెంపుల ప్రక్రియకు శ్రీకారం - కన్జర్వేటివ్ పార్టీలోనూ నాయకత్వ పోరు లండన్: చరిత్రాత్మక రెఫరెండమ్‌తో ప్రజా తీర్పు వెల్లడైంది కానీ... తర్వాత ఏం జరుగుతుందనే విషయమై బ్రిటన్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది. యురోపియన్ యూనియన్‌లోని దేశాలతో వాణిజ్య భాగస్వామ్యంపై చర్చల ప్రక్రియే యూకే ముందున్న అతిపెద్ద సవాలు. దీంతోపాటు.. అధికార కన్జర్వేటివ్ పార్టీలోనూ నాయకత్వ రేసు మొదలు కానుంది. సాధారణంగా అయితే రెఫరెండం ఫలితానికి బ్రిటన్ ప్రభుత్వం చట్టబద్ధంగా కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. కానీ.. 2015 సాధారణ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగానే కన్జర్వేటివ్ పార్టీ రెఫరెండాన్ని నిర్వహించి.. ప్రజాతీర్పును గౌరవించాల్సి వచ్చింది. రాజీనామా విషయాన్ని వెల్లడిస్తూ.. ప్రధాని డేవిడ్ కామెరాన్ కూడా ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. కాగా, సోమవారం కామెరాన్ అధ్యక్షతన బ్రిటన్ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీ తర్వాత మంగళ, బుధవారాల్లో ఆయన బ్రసెల్స్ చేరుకుని యూరోపియన్ కౌన్సిల్‌కు బ్రిటన్ రిఫరెండమ్ గురించి సమాచారం అందజేస్తారు. కొత్త ప్రధానికి కత్తిమీద సామే! బ్రెగ్జిట్‌పై ప్రజాతీర్పు వరకు అంతా సవ్యంగానే సాగినా.. ఇకపై పరిస్థితులు క్లిష్టంగా మారనున్నాయి. దీనికి కారణాలనేకం. ముఖ్యంగా రెఫరెండమ్ అమల్లోకివచ్చిన తర్వాత వాణిజ్యపరమైన అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున పునఃసంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించాలి. అలాగే ఈయూ-బ్రిటన్ మధ్య భవిష్యత్తులో సంబంధాలు ఏవిధంగా ఉంటాయనేదీ కీలకమే. ఈ సంప్రదింపుల ప్రక్రియ ఏళ్లకేళ్లు కొనసాగొచ్చనేది నిపుణుల అంచనా. ఈయూ నుంచి నిష్ర్కమణతో బ్రిటన్ స్వేచ్ఛా మార్కెట్‌గా మారుతుంది. దీంతో కొత్త వాణిజ్య ఒప్పందాల కోసం ప్రపంచ దేశాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇదంతా కామెరాన్ స్థానంలో ప్రధానిగా బాధ్యతలు తీసుకునే వ్యక్తికి కత్తిమీద సామే. ఇదే తొలిసారి: వాస్తవానికి ఈయూ నుంచి ఒక సభ్య దేశం వైదొలగాలంటే 2009 లిస్బాన్ ఒప్పందంలోని ఆర్టికల్ 50 ప్రకారమే సాధ్యమవుతుంది. ఈ ఆర్టికల్‌ను ఉపయోగించడం ఇదే తొలిసారి. దీని ప్రకారం ఈయూతో తెగదెంపులు చేసుకునేందుకు రెండేళ్లలో సంప్రదింపుల ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం బ్రిటన్ విడిపోయే ప్రక్రియను పూర్తి చేసేందుకు 2020 వరకు సమయం పడుతుందని అంచనా. 1982లో ఈయూ నుంచి గ్రీన్లాండ్ విడిపోయింది. కానీ అప్పటికీ ఈ ఒప్పందం అమల్లో లేదు. కాగా బ్రెగ్జిట్ గురించి చర్చించేందుకు ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, లగ్జెంబర్గ్, ఇటలీ, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులు శనివారం సమావేశం కానున్నారు. బ్రిటన్ బాటలో పయనించేందుకు పలు దేశాలు ఆలోచిస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. 27 సభ్యదేశాలు తమ పార్లమెంటులలో తీర్మానం చేసి బ్రిటన్ నిష్ర్కమణకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. -
ఈయూ.. బై బై..
యూరోపియన్ యూనియన్‌లో ఉండలేమని తేల్చిన బ్రిటన్ వాసులు - బ్రెగ్జిట్‌కు అనుకూలంగా 51.9 శాతం మంది ఓటు - రాజీనామా చేస్తానంటూ బ్రిటన్ ప్రధాని ప్రకటన - అంతర్జాతీయంగా మార్కెట్ల అతలాకుతలం - స్టాక్స్, కరెన్సీలు, ముడిచమురు దారుణ పతనం - సురక్షిత పెట్టుబడిగా బంగారం మెరుపులు - మున్ముందు తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరికలు ప్రభావం ఇలా.. పౌండు చరిత్రాత్మక పతనం.. డాలర్ డ్రీమ్స్.. రూపాయి క్రాష్ బ్రిటన్‌తో లింకుంటే కుదేలే!! ఐటీలో అనిశ్చితి తప్పదు: నాస్కామ్ ఆందోళన అక్కర్లేదు: జైట్లీ భయపడొద్దు: రాజన్ బ్రిటన్‌తో విడిపోతాం - ఈయూతో కలిసుంటాం - బ్రెగ్జిట్ ఫలితాల నేపథ్యంలో స్కాట్లాండ్ అడుగులు - ఉత్తర ఐర్లాండ్‌లోనూ ఇవే డిమాండ్లు బ్రిటన్ పోతే పోనీ! డొనాల్డ్ టస్క్, ఈయూ అధ్యక్షుడు బ్రెగ్జిట్ ప్రభావం తమపై ఉండదని.. మిగిలిన 27 దేశాలతో కలిసి కూటమి బలంగానే ఉంటుందని ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ వెల్లడించారు. రెఫరెండంపై బ్రిటన్లు పిచ్చి నిర్ణయం తీసుకున్నారన్నారు. ‘ఈయూలోని 27 దేశాల ప్రతినిధిగా చెబుతున్నా. మా ఐక్యత కొనసాగుతుంది’ అని టస్క్ తెలిపారు. ప్రజాతీర్పు వెల్లడైనందున ఈయూ నుంచి బ్రిటన్ వీలైనంత త్వరగా వెళ్లిపోయేలా ప్రయత్నాలు ప్రారంభించాలన్నారు. అనవసర ఆలస్యం వల్ల అనిశ్చితి పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే.. బ్రిటన్ నిర్ణయంతో తమ కూటమిలో చీలిక వస్తుందన్న వార్తల్లో వాస్తవం లేదని ఈయూ పార్లమెంట్ అధ్యక్షుడు మార్టిన్ షుల్జ్ తెలిపారు. నిర్ణయాన్ని గౌరవిస్తాం అమెరికా అధ్యక్షుడు ఒబామా యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలన్న బ్రిటన్ ప్రజల నిర్ణయాన్ని తమ దేశం గౌరవిస్తుందని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు. యునెటైడ్ కింగ్డమ్తోపాటు యూరోపియన్ యూనియన్ ఎప్పటిలాగే అమెరికా భాగస్వాములుగా కొనసాగుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రిటన్‌లో జరిగిన రెఫరెండం ఫలితాలపై ఆయన శుక్రవారం ఒక ప్రకటన చేశారు. బ్రెగ్జిట్ అనంతర సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికాకు ప్రశాంతమైన, స్థిరమైన, అనుభవం గల నాయకత్వం అవసరమని డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అన్నారు. బ్రిటన్ ప్రజల ఎంపికను గౌరవిస్తున్నానంటూ ఆమె శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఇక సెలవ్!: డేవిడ్ కామెరాన్ (బ్రిటన్ ప్రధాని) ఈ చారిత్రక నిర్ణయంతో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ పదవినుంచి తప్పుకోనున్నారు. బ్రెగ్జిట్ వ్యతిరేక వాదనను ముందుండి నడిపించిన కామెరాన్.. ఇకపైనా దేశాభివృద్ధిలో తన భాగస్వామ్యం ఉంటుందని.. కొత్త నాయకత్వం దేశాన్ని ముందుకు నడపాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. టెన్ డౌనింగ్‌స్ట్రీట్ (యూకే ప్రధాని అధికారిక నివాసం) ముందు శుక్రవారం భార్య సమంతతో కలిసి ఉద్వేగంగా మాట్లాడిన కామెరాన్ ‘రెఫరెండం ప్రజాస్వామ్య విజయం. చారిత్రక నిర్ణయం. ఇందులో ప్రజల నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఫలితాలపై ఎటువంటి సందేహం లేదు. ఈ నిర్ణయం వల్ల మార్కెట్లకు వచ్చే ప్రమాదం లేదని, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ బలోపేతంగా ఉందని.. ప్రపంచ దేశాలకు భరోసా ఇస్తున్నాను’ అని తెలిపారు. అక్టోబర్‌లో జరగనున్న కన్సర్వేటివ్ కాన్ఫరెన్స్‌లో కొత్త ప్రధానిని ఎన్నుకుంటారన్నారు. విజయం సాధించిన బ్రెగ్జిట్ అనుకూల వర్గానికి కామెరాన్ శుభాకాంక్షలు తెలిపారు. తాజా నిర్ణయంతో బ్రిటన్‌లో ఉన్న ఇతర యూరోపియన్ దేశాల ప్రజలకు, యూరోపియన్ దేశాల్లో ఉన్న బ్రిటన్లకు ప్రస్తుతానికి ఎలాంటి సమస్యా లేదని ఇప్పటివరకున్నట్లుగానే వస్తువులు, సేవల విషయంలో పెద్ద మార్పులేమీ ఉండవని కామెరాన్ తెలిపారు. ఇకపై యురోపియన్ యూనియన్‌తో చర్చించాల్సిన అంశాలపై వేల్స్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్ ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆరేళ్లపాటు యూకే ప్రధానిగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉందన్న కామెరాన్.. తమ ప్రభుత్వం విద్య, సంక్షేమం, జీవన ప్రమాణాల మెరుగుదల, దృఢమైన సమాజ నిర్మాణంలో కృషి చేసి విజయం సాధించిందన్నారు. సోమవారం సమావేశం కానున్న బ్రిటన్ కేబినెట్.. కామెరాన్ పదవినుంచి తప్పుకునేందుకు తదుపరి చేయాల్సిన పనులను నిర్ణయించనుంది. 48.1 వ్యతిరేకం బ్రెగ్జిట్ అనుకూలం 51.9 సర్దుకునేందుకు కొంత సమయం: బోరిస్ జాన్సన్ (బ్రెగ్జిట్ ఉద్యమ నేత) రెఫరెండం తీర్పుతో ఉన్నపళంగా ఈయూతో తెగదెంపులు జరగవని.. అంతా సర్దుకునేందుకు కొంత సమయం పడుతుందని.. బ్రెగ్జిట్ ఉద్యమానికి నాయకత్వం వహించిన లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ తెలిపారు. ‘ఇది ప్రజా నిర్ణయం. ప్రజాస్వామ్య విజయం. ప్రజలు తమ నిర్ణయాన్ని ధైర్యంగా తెలియజేశారనేదానికి ఇదే నిదర్శనం. అయితే రెఫరెండంతో ఉన్నపళంగా మార్పులు సాధ్యం కాదు. అన్ని సర్దుకునేందుకు కొంత సమయం పడుతుంది’ అని అన్నారు. ప్రధాని కామెరాన్‌పై బోరిస్ ప్రశంసలు కురిపించారు. ‘కామెరాన్ మా తరం చూసిన అసాధారణ నాయకుడు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే ధైర్యమున్న వ్యక్తి’ అని కొనియాడారు. యురోపియన్ యూనియన్ గొప్ప ఆలోచన.. కానీ ఇది బ్రిటన్‌కు సరిపోదని అభిప్రాయపడ్డారు. ఎప్పటికీ బ్రిటన్ యూరప్‌లో భాగమేనన్నారు. ఈయూ నుంచి విడిపోతామంటూ చరిత్రాత్మక నిర్ణయం లండన్: ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపిన బ్రెగ్జిట్ (ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవటం) వివాదంపై బ్రిటన్లు శుక్రవారం చారిత్రక నిర్ణయాన్ని వెలువరిచారు. ఈ వివాదంపై నాలుగు నెలల ఉత్కంఠకు తెరదీస్తూ.. ఈయూతో నాలుగున్నర దశాబ్దాల బంధాన్ని తెంచుకునేందుకే మెజారిటీ బ్రిటన్లు మొగ్గుచూపారు. దీంతో, ఈయూలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న బ్రిటన్.. ఈయూనుంచి తప్పుకోనున్న రెండో దేశంగా (గ్రీన్లాండ్ తర్వాత) నిలిచింది. గురువారం జరిగిన రెఫరెండంలో 51.9 శాతం మంది బ్రెగ్జిట్‌కే మద్దతు తెలిపారు. యూకే ఎన్నికల కమిషన్ చీఫ్ జెన్నీ వాట్సన్ ప్రతిష్ఠాత్మకమైన మాంచెస్టర్ టౌన్‌హాల్ నుంచి ఈ ఫలితాలను వెల్లడించారు. దాదాపు 3.3 కోట్ల మంది బ్రిటన్లు (ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్, జీబ్రాల్టర్) రెఫరెండంలో పాల్గొనగా 1.74 కోట్ల మంది (51.9 శాతం) విడిపోవాలని.. 1.61 మంది (48.1 శాతం) ఈయూతో కలిసుండాలని తమ నిర్ణయాన్ని తెలియజేశారు. బ్రెగ్జిట్ అనుకూల, వ్యతిరేక ఓటర్ల మధ్య తేడా 12.69 లక్షలు మాత్రమే. లండన్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్‌లో ఎక్కువ మంది యురోపియన్ యూనియన్లోనే ఉండాలని తమ అభిప్రాయాన్ని తెలపగా.. ఉత్తర, మధ్య ఇంగ్లాండ్, వేల్స్, మెజారిటీ ఇంగ్లీష్ కౌంటీలు మాత్రం బ్రెగ్జిట్‌కే మొగ్గుచూపాయి. రెఫరెండం ఫలితంతో.. త్వరలోనే ప్రధాని పదవినుంచి తప్పుకోనున్నట్లు బ్రిటన్ ప్రధాని డెవిడ్ కామెరాన్ వెల్లడించారు. దేశాన్ని తదుపరి మజిలీకి తీసుకెళ్లటంలో తను సరైన వ్యక్తిని కాన్నారు. మూడు నెలల తర్వాత యూకేకు కొత్త ప్రధాని వస్తారని..ఆయన నాయకత్వంలోనే దేశం ముందుకెళ్తుందని కామెరాన్ స్పష్టం చేశారు. కామెరాన్ వారసుడిగా బ్రెగ్జిట్ ఉద్యమాన్ని ముందుండి నడిపిన లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ పేరు వినబడుతోంది. పలువురు కన్జర్వేటివ్ పార్టీ నేతలూ పీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బ్రెగ్జిట్తో స్కాట్లాండ్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈయూలో యూకే కలిసుండాలని బలమైన ప్రజాభిప్రాయాన్ని తెలిపిన స్కాట్లాండ్.. తాజా ఫలితంతో.. యూకే నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా ఈయూలో కలవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ నికోలా స్టుర్జియాన్ ఈ విషయాన్ని చూచాయగా వ్యక్తం చేశారు. రెఫరెండం తర్వాత దేశం రెండుగా విడిపోయిందని.. అమెరికా, భారత్, చైనావంటి దేశాలతో ఈయూతో కలిసి వ్యాపారం చేసే అవకాశాన్ని కోల్పోయిందని కామెరాన్‌కు అత్యంత సన్నిహితుడైన భారత సంతతి ఎంపీ అలోక్ శర్మ తెలిపారు. బ్రెగ్జిట్ నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. దీంతో పాటు వలసలపై కొత్త చర్చకు తెర లేచింది. ఇకపై యురోపియన్ దేశాలు, భారత్‌తోపాటు ప్రపంచ దేశాలతో బ్రిటన్ కొత్త వాణిజ్య బంధాలను నిర్వచించుకోవాల్సి ఉంటుంది. జర్మన్ చాన్స్‌లర్ అంజెలా మెర్కెల్ రెఫరెండాన్ని ఈయూకు పెద్ద దెబ్బ అని తెలపగా.. ఇది చాలా తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ తెలిపారు. ఈయూ పతనం మొదలైందని వస్తున్న వార్తలను యురోపియన్ కమిషన్ చీఫ్ జీన్ క్లాడ్ జంకర్ ఖండిచారు. కాగా, బ్రిటన్ నిర్ణయంతో నెదర్లాండ్స్, ఇటలీ కూడా రెఫరెండం ఆలోచన చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కాందిశీకులే అసలు సమస్య! బయటకు ఎన్ని కారణాలు చెబుతున్నా... ప్రస్తుతం ఈయూ దేశాల్ని కుదిపేస్తున్నది కాందిశీకుల సమస్యే. ఈయూ ఒప్పందాల ప్రకారం ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రజలు వలస వెళ్లొచ్చు. దీంతో ఆర్థిక అస్తవ్యస్థ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న దేశాల నుంచి, సిరియా, ఇరాక్ వంటి కల్లోల దేశాల నుంచి బ్రిటన్, స్వీడన్, డెన్మార్క్ తదితర దేశాలకు లక్షల మంది తరలివస్తున్నారు. పలుచోట్ల వలసదారుల సంఖ్య పెరుగుతోంది. ఇది సామాజిక మార్పులకూ దారితీస్తోంది. పెపైచ్చు వారికి భృతి చెల్లిస్తూ... ఉద్యోగాలిప్పిస్తున్నా చాలామంది చేయటం లేదు. సులభంగా భృతి అందుకుని జీవించడానికే మొగ్గు చూపిస్తున్నారు. ఇది పన్ను చెల్లింపుదారుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. కాందిశీకులపై రేగుతున్న అసంతృప్తి ఏ స్థాయికి వెళ్లిందంటే... ‘ఈయూ’లో బ్రిటన్ కొనసాగాలని ప్రచారం చేస్తున్న బ్రిటన్ మహిళా ఎంపీని వారం రోజుల కిందట ఓ అగంతకుడు కాల్చిచంపాడు. రెఫరెండంలో ప్రతిఫలించింది కూడా ఈ ఆవేదన... ఆగ్రహమే!!. -
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ప్రమాదం
జాతిహితం పిరికితనంతో డేవిడ్ కామెరాన్... ఈయూలో ఉండాలా, వైదొలగాలా? అనే చర్చపై తన సొంత పార్టీనే చీలిపోయేలా చేసే ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టారు. తన దేశాన్ని, యూరప్‌ను విఫలం చేశారు, మొత్తం ప్రపంచమే కదలిపోయేలా చేశారు. ఆ అంశంపై తన పార్టీలోనే ఓటింగును చేపట్టి, మెజారిటీ ‘‘వదిలిపెట్టాలి’’ అంటే... ఆ అంశంతో కొత్త ప్రణాళికను రూపొందించి తాజాగా ఎన్నికలను నిర్వహించడం మెరుగైనదై ఉండేది. ఇప్పుడాయన ఆపరేషన్ థియేటర్లో పేషంట్‌ను నిలువునా కోసేసి పారిపోయారు. బ్రెగ్జిట్ పర్యవసానాలు ద్రవ్య మార్కెట్లపై చూపే ప్రభావం పట్ల ఆందో ళనకు పరిమితమై మనం ఆ పరిణామాన్ని సంకుచితమైన, ఏక ముఖ దృష్టితో చూస్తూ తప్పు చేస్తున్నాం. లేదా, ప్రపంచీకరణను తిరగదోడి, తిరిగి పాత జాతీయవాదానికి తిరిగి పోవడంగా మాత్రమే దీన్ని చూస్తున్నాం. కానీ బ్రెగ్జిట్ (ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడం) రాజకీయ పర్యవసానాలు అంతకంటే చాలా ప్రబలమైనవి, తీవ్రమైనవి. ఆగ్రహభరితమైన నేటి కాలంలో ఈ పరిణామం... శతాబ్దాలుగా అభివృద్ధి చెందిన ఆధునిక, ప్రజాస్వామ్య రాజ్యపు అసలు పునాదినే సవాలు చేస్తుంది. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కావాలని గావుకేకలుపెట్టే కొత్త ధోరణి ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉంది. కీలక నిర్ణయా లపై, సమస్యలపై తరచుగా ప్రజాభిప్రాయ సేకరణలను చేపట్టడం, ప్రజా ప్రతినిధులను తిరిగి పిలిచే హక్కు, దామాషా పద్ధతి ప్రాతినిధ్యం, వ్యవస్థ సాధికారతను బలహీనపరచడం వంటివి ఇందులో ఉన్నాయి. ఇది అరాచ కానికి మాత్రమే దారి తీస్తుంది. ఢిల్లీకి రాష్ట్ర ప్రతిపత్తిపై ప్రజాభిప్రాయ సేక రణ జరపాలని అరవింద్ కేజ్రీవాల్ కోరడం గురించి కాదు నా ప్రధానమైన ఆందోళన. అదృష్టవశాత్తూ మన రాజ్యాంగం అందుకు అవకాశం కల్పించ లేదు లేదా మనం మొట్టమొదటిసారిగా ఆ భావనను కశ్మీర్లో పరీక్షించాలనీ అనుకోలేదు. ఆధునిక రాజ్యం విశ్వసనీయతను దెబ్బతీసే అంతకంటే పెద్ద ముప్పే ఇలాంటి ప్రజాభిప్రాయ సేకరణల వల్ల ఉంది. ప్రజాస్వామ్యం పునాదికే చేటు ప్రజాభిప్రాయసేకరణ ద్వారా ప్రత్యక్ష ఓటింగును నిర్వహించడం ప్రధానంగా యూరోపియన్ వ్యామోహం. అయితే అత్యంత కీలకమైన ఒక అంశాన్ని నిర్ణయించడానికే కాదు, సర్వసత్తాకశక్తిగా దేశం కట్టుబడి ఉండాల్సిన అంశా లను నిర్ణయించడానికి కూడా దాన్ని ప్రయోగించడం ఇదే మొదటిసారి. పాఠశాల బోధనాంశాలకు, కొన్ని వివాదాస్పదమైన జాతీయ స్థాయి పన్ను లకు పరిమితమైతే ప్రజాభిప్రాయ సేకరణలు గమ్మత్తుగానూ, ముద్దుగానూ ఉంటాయి. ఇటీవల స్విట్జర్లాండ్ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా మినార్ల వంటి నిర్మాణాలను నిషేధించడం పూర్తి అధికసంఖ్యాకవాదం, జాత్యహం కార పూరితం కాకున్నా మొరటుదనం. స్విట్జర్లాండ్ పలు రంగాలలో ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పి ఉండవచ్చు. కానీ అక్కడి ప్రజాస్వామ్యం స్త్రీలకు 1971లోగానీ ఓటు హక్కును ఇవ్వలేక పోయింది. అది కూడా పార్లమెంటు అలా నిర్ణయించాక 12 ఏళ్లకు గానీ అది జరగలేదు. బహుశా అంతా పురుషులతోనే జరిపే ప్రజాభిప్రాయ సేకరణ దాన్ని అడ్డు కుంటుందని భయపడటమే అందుకు కారణం కావచ్చు. అతి భయంకరమైన వైరస్ల కంటే ఎక్కువ త్వరగా సోకే అంటు వ్యాధులు చెడు భావాలు. ఇప్పటికే నెదర్లాండ్‌లో ఈయూపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలనే డిమాండు ఊపందుకుంటోంది. క్యుబెక్, స్కాట్లండ్ల వేర్పాటువాద ఒత్తిడులను కెనడా, బ్రిటన్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి అపకేంద్రక ధోరణులు మరింత సంక్లిష్టమైన, వైవిధ్యభరితమైన ఇతర దేశాలకు కూడా విస్తరించగలుగుతాయి. సుస్థిరత, నమ్మకం ఉన్న ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నిర్ణీత కాలంపాటూ అధికారంలో ఉండటం అనే పునాదిపై ఆధునిక ప్రజాస్వామ్యం నిర్మితమైంది. తరచుగా ప్రజాభి ప్రాయ సేకరణల పేరిట జరిగే ఓటింగులు, అనూహ్యమైన అంతరాయాలు ఆ పునాదిని పూర్తిగా ధ్వంసం చేస్తాయి. ఏ ప్రభుత్వమైనాగానీ విశాల దేశ లేదా ప్రజా ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలను తీసుకోవడాన్ని అసాధ్యం అయ్యేలా చేస్తాయి. తమను ఎవరు పరిపాలించాలనే విషయంలో ఓటర్లకు అత్యున్నత నిర్ణయాధికారం ఉండగా... రాజ్యాంగం, చట్టాలు, ప్రాథమిక సూత్రాలకు ఒక మేరకు స్థిరత్వం, ఉల్లంఘనీయత ఉండటమే ఆధునిక ప్రజాస్వామ్యం గొప్పదనం. కాబట్టి ఆధిక్యతావాద అతిక్రమణలకు ప్రత్యక్ష ఓటు సాకుగా మార రాదు. మన దేశానికి అన్వయిస్తే... అతిగా సరళీకరించిన ఉదాహరణలతో దీన్ని మరింత వివ్లవకరంగా భారత దేశానికి అన్వయిద్దాం. ఢిల్లీ పూర్తి రాష్ట్ర స్థాయి అధికారాల కోసం ఓటిం గ్ను నిర్వహిస్తుంది. తమిళనాడు తనను ఆర్టికల్ 370 జాబితా కిందకు తేవాలని లేదా 2010 నాటి రాళ్లు రువ్విన కాలపు ఆగ్రహావేశపూరిత క్షణాల్లో జమ్మూ కశ్మీర్ తనకు సర్వసత్తాకత కావాలని, పాకిస్తాన్లో భాగం కావాలని ‘ఎంచు కుంటే’నో? విదర్భ, బుందేల్‌ఖండ్ వాటికవే రాష్ట్రాలుగా ప్రకటించుకో వచ్చు. ఢిల్లీ దేశ రాజధాని కాబట్టి, యావద్భారతం దానికి ఒకప్పటి పూర్తి కేంద్రపాలిత రాష్ట్ర స్థాయిని పునరుద్ధరించాలని కచ్చితంగా ఓటు చేస్తుంది. ప్రజల మానసిక స్థితులలోని ఊగిసలాటల వల్ల కలిగే అస్థిరత్వాన్ని నివా రించడం కోసమే రాజ్యం అధికారాన్ని కచ్చితంగా నిర్వచించారు, సువ్యవ స్థితం చేశారు. వాటికి పరిమితులున్నాయి. పక్షపాతరహిత సంస్థలైన కోర్టులు, ఎన్నికల కమిషన్, కాగ్, సీఐసీ, తదితరాల ద్వారా ప్రధానంగా అవి అమలవుతుంటాయి. ప్రభుత్వం తమకు ఓటు చేయని, లేదా లెక్కలోకి రాని ఓట్లున్న వారిపట్ల వివక్ష చూపకుండా నివారించడం వాటి లక్ష్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం నేడు ఉదారవాద ఉద్యమపు ప్రధాన నినా దంగా అవతరించింది. కాబట్టి ఇదీ ప్రశ్న: మీరు కోర్టు తీర్పును ఎంచు కుంటారా? అది జరగకపోతే భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 377లోని కాల దోషంపట్టిన అంశాలకు పార్లమెంటరీ సవరణ కావాలా? లేక అయోధ్యలో ఆలయ నిర్మాణ ం కోసమూ, 370 అధికరణాన్ని, సింధు లోయ ఒప్పందా లను, సిమ్లా ఒప్పందాన్ని, తాష్కెంట్ ప్రకటనను రద్దుచేస్తూ ఓటింగ్‌ను నిర్వహించడం కావాలా? ఇవన్నీ ఒక పక్షానికి మొగ్గుచూపేలా ప్రేరేపించేవే. ఓటింగుకు పెడితే, రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితి అండతో అగ్రకుల ఉన్నత వర్గాలు తమకు కల్పించుకున్న విశేషహక్కులను కోల్పోవాల్సి వస్తుంది. మొత్తం జనాభాలో 20 నుంచి 25 శాతంగా ఉన్న అగ్రకులాలకు తమకు తాముగా శాశ్వత ‘ప్రతిభ’ను అంటగట్టేసుకుని అను భవిస్తున్న అవకాశాలలో సగం మాత్రమే వారికి మిగులుతాయి. అవునూ, మీరు... 2001 డిసెంబర్లో పార్లమెంటుపై దాడి తర్వాత లేదా 26/11 ముంబై దాడుల తర్వాత వారంలోగా పాకిస్తాన్‌పై యుద్ధానికి పోవాలా, లేదా? అని జాతీయ స్థాయి ఓటింగ్‌ను నిర్వహించేవారా? ఆ రెండు సంద ర్భాల్లోనూ నాటి ప్రభుత్వాలు ప్రజాగ్రహాన్ని విస్మరించి వివేకవంతమైన మార్గాన్ని అనుసరించాయి. నిర్ణీత పదవీ కాలంపాటూ మనల్ని పరిపాలిం చాలని ప్రభుత్వంపై మనం విశ్వాసం ఉంచడమే సరిగ్గా అందుకు కారణం. ఈ అసంబద్ధత ఇలాగే సాగిపోతూ ఉండగలదు. ఓ సీనియర్ బీజేపీ ఎంపీ ట్విటర్లో రఘురామ్ రాజన్‌కు రెండో దఫా పదవి ఇవ్వాలా, వద్దా? అని ఓటింగ్ నిర్వహించారు. ‘‘ఓటర్లు’’ అంతా ఆయన అనుచరులే. ‘‘వద్దు’’ అంటూ అత్యధిక ఆధిక్యతతో వారంతా ఓటింగ్ చేశారు. మరొక బీజేపీ రాష్ట్ర మంత్రి కూడా అలాగే పులికి బదులుగా ఆవును మన జాతీయ జంతువుగా గుర్తించాలంటూ ట్విటర్/సోషల్ మీడియాలో ఓటింగ్ చేపట్టారు. భారీ ఆధిక్యతతో ‘‘ప్రజాభిప్రాయం’’ ఆవును ఎన్నుకుంది. వెర్రిబాగుల పులికి తాను తన స్థానాన్ని కోల్పోయానని తెలియనైనా తెలియదు. అరాచకం పరిష్కారం కాదు ప్రపంచ అర్థిక వ్యవస్థలు ప్రతిష్టంభలో పడి, నిరుద్యోగం పెరుగు తుండగా పాత వ్యవస్థ పట్ల కొత్త అసంతృప్తి పెల్లుబుకుతోంది. కానీ పరిష్కారం అరాచకం కాదు. గతం పట్ల, ప్రత్యేకించి ‘‘ప్రాచీనులు’’ చేసిన గొప్ప పనుల పట్ల కొత్త ఆకర్షణ పెరుగుతోంది. రోమన్ చక్రవర్తులు తమ నిర్ణయాలకు సమంజసత్వాన్ని కల్పించడం కోసం అలాంటి సర్కస్లను మహా సొగసుగా నిర్వహించగలిగినా కొంతవరకు ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని అమలు చేశారు. అయితే అంతకంటే ప్రాచీన కాలంనాటి వాటి గురించి కూడా చాలానే చెప్పారు. ప్రత్యేకించి మన వైశాలి అలాంటిదే. బిహార్‌లోని ముజ ఫర్పూర్కు కార్లో పయనిస్తుంటే ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజా స్వామ్యమైన వైశాలి ఆహ్వానం పలుకుతున్న బోర్డులు కనిపి స్తాయి. మగధ సైన్యాలు దండెత్తగా వైశాలి వారితో యుద్ధం చేయాలా, చేస్తే ఎప్పుడు, ఎక్కడ చేయాలని చర్చిస్తూ ఉండగానే... మగధ సేనలు వైశాలిని ధ్వంసం చేసి ప్రజలను ఊచకోత కోశాయని చరిత్రకారులు చెబుతారు. క్రీడలలో తరచుగా మనం విజయం చేతికి అందిందనగా కూడా ఓటమిని వరిస్తుండవచ్చు. భారతీయులకు ఇతరుల చర్చను లాగేసుకోవడం అనే ప్రత్యేకమైన, దీర్ఘకాలిక బలహీనత ఉంది. కష్టాలను ఎదుర్కొనే ధైర్యంలేని పిరికితనంతో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్... ఈయూలో ఉండాలా, వైదొలగాలా? అనే చర్చపై తన సొంత పార్టీనే చీలిపోయేలా చేసే ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టారు. తన దేశాన్ని, యూరప్‌ను విఫలం చేశారు, మొత్తం ప్రపంచమే కదలిపోయేలా చేశారు. ఆయన ఆ అంశంపై తన పార్టీలోనే ఓటింగ్‌ను చేపట్టి, మెజారిటీ ‘‘వదిలిపెట్టాలి’’ అంటే... ఆ అంశంతో కొత్త ప్రణాళికను రూపొందించి తాజాగా ఎన్నికలను నిర్వ హించడం మెరుగైనదై ఉండేది. ఇప్పుడాయన ఆపరేషన్ థియేటర్లో పేషం ట్ను పడుకోబెట్టి నిలువునా కోసేసి పారిపోయారు. ఇది ఏవిధంగానూ అనుసరించకూడని ఉదాహరణ. తాజా కలం: 1974 పోఖ్రాన్-1 అణు పరీక్షకు ‘‘బుద్ధుడు నవ్వు తున్నాడు’’ అనే పేరు ఎందుకు పెట్టారు? చూడబోతే ఇందిరా గాంధీకి, ఆమె సలహాదారులకు కూడా మగధ, వైశాలిని ధ్వంసం చేసిన చరిత్ర తెలిసే ఉండాలి. బుద్ధుడు దాని పట్ల చాలా కలత చెందాడని, ఎవరూ కఠిన నిర్ణయాలను తీసుకోలేని ప్రత్యక్ష ప్రజాస్వామానికి బదులు వైశాలికి కూడా ప్రతినిరోధకంగా పనిచేయగల సైనిక శక్తి ఉండివుంటే అది ఈ విధ్వంసాన్ని నివారించగలిగేదని ఆయన భావించారనే గాథ ప్రచారంలో ఉంది. సైనిక శక్తిలోని అసమతూకం వల్ల కలిగే ప్రమాదాల గురించి బుద్ధుడు కలత చెందారు. భారత్ ఎట్టకేలకు సైనికపరమైన ప్రతినిరోధక శక్తిని సాధించిదని విన్నప్పుడు ఆయన నవ్వకపోతే ఏంచేస్తాడు? శేఖర్ గుప్తా twitter@shekargupta -
బ్రిటన్ ప్రధాని సంచలన ప్రకటన
లండన్: బ్రెగ్జిట్ పై బ్రిటన్ ప్రజల నిర్ణయం ప్రధాని డేవిడ్ కామెరాన్ పదవికి ఎసరు తెచ్చిపెట్టింది. యూరోపియన్ యూనిన్ లోనే బ్రిటన్ కొనసాగాలన్న ఆయన ఆకాంక్షకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వడంతో ప్రధాని పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. బ్రెగ్జిట్ పై ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని చెప్పారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసమే పోరాడానని చెప్పారు. దేశానికి కొత్త నాయకత్వం అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అక్టోబర్ లో కొత్త ప్రధాని వస్తారని సంచలన ప్రకటన చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తవని భావిస్తున్నట్టు చెప్పారు. యూకే ఆర్థిక పునాదులు పటిష్టంగా ఉన్నాయన్నారు. మొదటి నుంచి బ్రెగ్జిట్ ను వ్యతిరేకించిన ఆయన ప్రజాతీర్పుతో కంగుతిన్నారు. తన ఆకాంక్షకు వ్యతిరేకంగా ఫలితం రావడంతో ప్రధాని పదవిని వదులు కోవాలని నిర్ణయించారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన కామెరాన్ 2010లో తొలిసారిగా ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. 2015లో రెండో పర్యాయం ప్రధానిగా ఎన్నికయ్యారు. బ్రెగ్జిట్ తీర్పుతో మరో నాలుగేళ్లు పదవీ కాలం ఉండగానే రాజీనామా ప్రకటన చేశారు. -
కామెరాన్.. క్షమాపణ చెప్పండి!
భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో చెరిగిపోని రక్తపు మరకగా మిగిలిన 1919 జలియన్ వాలాబాగ్ దురాగతానికి బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ క్షమాపణలు చెప్పాలని యూకే భారతీయ కార్మికుల సంఘం అధ్యక్షుడు హార్స్ వెన్ కోరారు. 1914 కొమగాట మారు సంఘటనకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడ్ క్షమాపణలు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రధానమంత్రి క్షమాపణలు చెప్పాలని, అందుకు యూకే మొత్తం ఈ విషయంపై పోరాటం చేస్తామని అన్నారు. బ్రిటన్ క్షమాపణలు చెప్పడం వల్ల ప్రపంచదేశాలకు దాని మీద అభిప్రాయం మారుతుందని యూకే సిక్కు హక్కుల గ్రూప్ అధ్యక్షుడు జస్దేవ్ సింగ్ రాయ్ అన్నారు. 1919, 1925 దురాగతాలు సిక్కుల గుండెలపై ఎప్పటికీ చెరగని మచ్చలని అన్నారు. ఓ వైపు కెనడా తన తప్పిదాన్ని గుర్తించి క్షమాపణలు చెబితే, బ్రిటన్ మాత్రం తన తప్పును గుర్తించకపోవడం బాగాలేదని వాపోయారు. మేయర్ ఎన్నికలలో సిక్కుల మద్దతు కోరిన కామెరాన్.. బ్రిటన్ తప్పిదాన్ని ఒప్పుకుని ఇప్పుడైనా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జలియన్ వాలా బాగ్ దురాగతంలో దాదాపు వెయ్యి మందికి పైగా భారతీయులు మరణించారు. -
సమంతకు ప్రధాని సెకండ్ హ్యాండ్ కారు గిఫ్ట్
లండన్: బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ఓ సెకండ్ హ్యాండ్ కారు కొన్నారు. అది కూడా తన భార్య సమంతకు గిఫ్ట్‌గా ఇవ్వడం కోసం. ఆయన చూసి చూడగానే ఆ కారుపై మనసుపడి తన భార్యకు గిఫ్ట్ గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన దాదాపు 1,495 ఫౌండ్లు వెచ్చించి ఈ కారును తీసుకున్నారు. తన నియోజకవర్గం మినిస్టర్ లోవెల్‌లో గల ఓ సెకండ్ హ్యాండ్ కార్ల దుకాణానికి వెళ్లిన కామెరూన్ 2004 నిస్సాన్ మైక్రా బ్లూకారును కొనేశారు. ఈ కారు అమ్మిన యజమాని లేయిన్ హ్యారీస్ ఈ విషయంపై వివరణ ఇస్తూ 'శుక్రవారం రాత్రి నాకు ఒక ఫోన్ వచ్చింది. ప్రధాని కామెరాన్ తన కార్లు షెడ్లలో ఓ కారును చూసేందుకు వస్తున్నారని. కానీ, నా సహచరుల్లో ఎవరో ఆటపట్టిస్తున్నారని అనుకున్నాను. కానీ, ఆయన నిజంగానే నా వద్దకు వచ్చేసరికి నమ్మలేకపోయాను. కనీసం అరగంటపాటు కారును చూస్తూ ఇక్కడే గడిపారు. ఇలాంటి కార్లు బ్రిటన్ లో తయారుచేస్తే బాగుంటుందని అన్నారు. ఆయన చాలా సాన్నిహిత్యంతో ఉండే వ్యక్తి. వేరే వారు కార్లు కొనేందుకు వచ్చినప్పుడు ఎలా ఉంటారో ఆయన కూడా అలాగే ఉన్నారు. కారు ఇన్సూరెన్స్ వివరాలు.. ఇప్పటికీ ఎన్ని కిలోమీటర్లు తిరిగిందన్న విషయాలు అడిగి తెలుసుకున్నారు' అని చెప్పారు. -
నేనేమీ మూర్ఖుణ్ని కాదు!
'నేనేమీ మూర్ఖుణ్ణి కాదు. మూర్ఖుడికి పూర్తి భిన్నమైనవాడిని. ఇక, రెండోవిషయం విచ్ఛినకారుడని నన్ను విమర్శించాడు. కానీ నేనేమీ విచ్ఛిన్నకారుణి కాదు. అందరిని కలిపేవాడిని. ప్రస్తుత అధ్యక్షుడు (ఒబామా) లాంటివాడిని కాదు.. అందరినీ ఐక్యంగా ఉంచేవాడిని నేను'.. బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ తనపై చేసిన విమర్శల పట్ల డొనాల్డ్ ట్రంప్ స్పందన ఇది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలోకి దిగడం దాదాపు ఖాయమైన డొనాల్డ్ ట్రంప్ తాజాగా కామెరాన్ విమర్శలపై నోరువిప్పారు. తాను అమెరికా అధ్యక్షుడినైతే, కామెరాన్‌తో సత్సంబంధాలు ఉండబోవని తాను భావిస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో ఆయనతో సత్సంబంధాలు ఉంటే ఉండవచ్చునని, అయితే, సమస్య పరిష్కారానికి ఆయన సమ్మతిస్తేనే ఇందుకు వీలుంటుందని చెప్పారు. అమెరికాలో ముస్లింల ప్రవేశంపై తాత్కాలిక నిషేధం విధించాలన్న ట్రంప్ వ్యాఖ్యలను తప్పబడుతూ.. బ్రిటన్ పార్లమెంటు చర్చలో ప్రధాని కామెరాన్ మాట్లాడుతూ ' ట్రంప్‌ను ఒక మూర్ఖుడు. అతడో విచ్ఛిన్నకారుడు. అతడు బ్రిటన్‌లో అడుగుపెడితే అతనికి వ్యతిరేకంగా బ్రిటన్ అంతా ఏకమవుతుంది' అని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కామెరాన్ వ్యాఖ్యలపై ఒకింత అసహనంతో ట్రంప్ తాజాగా స్పందించాడు. -
'అలా చేస్తే చీకట్లోకి దూకడమే'
లండన్: యూరోపియన్ యూనియన్‌తో బ్రిటన్ కలసి ఉండాలా? వద్దా? అంశంపై జూన్ 23న ప్రజాభిప్రాయం నిర్వహిస్తామని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ప్రకటించారు. ఈయూ సంస్కరణల ఒప్పందంపై కేబినెట్‌కు వివరించాక తన నివాసం వెలుపల ఈ వివరాలు వెల్లడించారు. యూరోపియన్ యూనియన్‌లో బ్రిటన్ ఉండాలనే కోరుకుంటున్నానని, నిర్ణయం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. ఈయూలో ఉంటేనే దేశం బలంగా, సురక్షితంగా ఉంటుందని తన మనసులో మాట చెప్పారు. వైదొలగడం చీకట్లోకి దూకడమేనంటూ ఇదివరకే కామెరాన్ హెచ్చరించారు. -
'ఇంగ్లీష్ రాకుంటే మా దేశంలో ఉండనివ్వం'
లండన్: బ్రిటన్‌కు వలసవచ్చేవారు రెండు లేదా రెండున్నరేళ్ల లోపు ఇంగ్లీష్ నేర్చుకోకపోతే దేశంలో నివసించేందుకు అనుమతించబోమని ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ అన్నారు. బ్రిటన్‌లో నివసించే దాదాపు లక్షా 90 వేలమంది ముస్లిం మహిళలకు ఇంగ్లీష్ రాదని చెప్పారు. ఓ వార్త పత్రికకు రాసిన వ్యాసంలో కామెరూన్.. ఇంగ్లీష్ ఆవశ్యకతను తెలియజేశారు. 'ఇంగ్లీష్ కొద్దిగా తెలుసుని బ్రిటన్‌కు వలసరావచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడటం నేర్చుకోవాల్సిన అవసరముంది. భాషపై పట్టుసాధించకపోతే దేశంలో నివసించే అవకాశాన్ని కోల్పోతారు' అని పేర్కొన్నారు. కొన్ని మతాలకు చెందిన మహిళలకు ఇంగ్లీష్ భాష నేర్పించేందుకు బ్రిటన్‌లో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఇందుకోసం 20 లక్షల పౌండ్లు ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి ప్రత్యేక వీసాపై బ్రిటన్‌కు వచ్చినవారి ఇంగ్లీష్ నైపుణ్యాన్ని పరీక్షించనున్నారు. ఇంగ్లీష్ భాష నైపుణ్యానికి, తీవ్రవాదానికి నేరుగా సంబంధం లేకపోయినా, బ్రిటీష్ సమాజంతో ఇమడలేనివారు తీవ్రవాద భావజాలానికి ఆకర్షితులయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని కామెరూన్ పేర్కొన్నారు. బ్రిటీష్ సమాజంతో కలవకుండా ఆపుతున్న వారికి ఈ చర్యలు ఉపయోగపడతాయని అన్నారు. కామెరూన్ వ్యాఖ్యలపై ముస్లిం సంస్థల నుంచి విమర్శలు వచ్చాయి. -
నోరు జారి.. ప్రధానిని చంపేశాడు!
ప్రముఖ పాప్ సింగర్ డేవిడ్ బోయి మరణిస్తే.. ఒక రేడియో ప్రెజెంటర్ మాత్రం నోరు జారి.. ఏకంగా బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ మరణించినట్లు ప్రకటించేశాడు. తర్వాత నాలుక కరుచుకుని, పాప్ సింగర్ డేవిడ్ బోయి మరణించినట్లు చెప్పాడు. ప్రముఖ పాప్ గాయకుడు డేవిడ్ బోయి (69) క్యాన్సర్ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఫియోనా విన్షెస్టర్ అనే న్యూస్ రీడర్ మాత్రం పొరపాటున బోయి పేరుకు బదులు ప్రధాని పేరు చదివేశాడు. హార్ట్ ఎఫ్ఎం అనే రేడియో చానల్లో ఈ పొరపాటు దొర్లింది. దీన్ని బ్రిటిష్ ప్రధాని కూడా పెద్ద సీరియస్‌గా ఏమీ తీసుకోలేదు. డేవిడ్ బోయి మరణం తీరని లోటని మాత్రం ట్వీట్ చేశారు. -
అందర్ని చంపేస్తానంటున్న ఐదేళ్ల పిల్లాడు
సిరియా: ‘ఇస్లాం మతాన్ని విశ్వసించని మీ అందరిని చంపేస్తా’ అంటూ ఓ ఐదేళ్ల పిల్లాడు బ్రిటన్ పౌరులు, ప్రభుత్వాన్ని ఉద్దేశించి బ్రిటన్ యాసలోనే హెచ్చరించే తాజా ప్రాపగాండ వీడియోను ఐసీస్ టెర్రరిస్టులు విడుదల చేశారు. అందులో నారింజ పండు దుస్తులు ధరించిన ఐదుగురు బ్రిటన్ గూఢచారులను పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి మిలటరీ దుస్తులు ధరించిన టెర్రరిస్టులు నిర్ధాక్షిణ్యంగా చంపడాన్ని, బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్‌ను ఉద్దేశించి తీవ్రమైన హెచ్చరికలు చేయడం లాంటి దృశ్యాలు ఉన్నాయి. ఆ వీడియోలో ట్రెయిలర్గా చూపించిన పార్ట్‌లో దానిలో మతాన్ని విశ్వసించని వారందరినీ చంపేస్తానంటూ ఐదేళ్ల పిల్లాడు బెదిరించడం కనిపించింది. అలాగే ఓ బందీని కెమెరా ముందు ఆ పిల్లాడే చంపినట్లు స్ఫురించే దృశ్యం కూడా ఉంది. ట్రెయిలర్గా చూపించిన ఈ వీడియోను టెర్రరిస్టులు త్వరలోనే విడుదల చేయనున్నట్టు అర్థమవుతోంది. మొత్తం పది నిమిషాల నిడివిగల ఈ వీడియోలో డేవిడ్ కామెరాన్‌ను ఉద్దేశించి టెర్రరిస్టులు తీవ్రమైన హెచ్చరిక వ్యాఖ్యలు చేశారు. ‘శ్వేత భవనం బానిస. యూదుల ఆడ గాడిదైన కామెరాన్ నీకిదే సందేశం’ అంటూ ఇంగ్లీషులో హెచ్చరిస్తూ ఓ టెర్రరిస్టు బ్రిటన్ గూఢచారులను కాల్చివేశారు. అంతకుముందు ఆ గూఢచారులు తాము నిజంగా గూఢచారులమేనని, బ్రిటన్ ప్రభుత్వం తరఫున ఐసీస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నామని అంగీకరించడం వీడియోలో కనిపించింది. ‘ఓ మూర్ఖుడా సిరియాలోని ఐసీస్ లక్ష్యాలపై బ్రిటీష్ వైమానికి దాడులు జరపుతున్నందుకు మీ పిల్లలు తగిన మూల్యం చెల్లిస్తారు. నీలాంటి అర్భకుడు ఓ ఇస్లాం రాజ్యాన్ని సవాల్ చేయడమా? చిన్న ద్వీపానికి చెందిన మీరు కేవలం గుప్పెడు విమానాలతో అతి విశాల ప్రపంచాన్ని ఆవహించిన మమ్మల్ని బెదిరించడం ఎంత సాహసం! నీవు నీ పూర్వ నాయకులు టోనీ బ్లేర్, గోర్దన్ బ్రౌన్ లాగే తల బిరుసుగల మూర్ఖుడివి. షరియా చట్టం కింద ప్రజలు భద్రంగా ఉన్నా, అల్లా సుప్రీం చట్టాలు అమలవుతున్న భూమికి వ్యతిరేకంగా పోరాడేందుకు పిచ్చివాడు మాత్రమే ప్రయత్నిస్తాడు. నీవు మాకు చిక్కితే నీ దేశం నిన్ను రక్షించేందుకు ముందుకు వస్తుందని అనుకుంటున్నావా? లేదు, ఈ గూఢచారులను వదిలేసినట్లే నీ దేశం నిన్ను వదిలేస్తుందని గ్రహించుకో’ అని డేవిడ్ కామెరాన్‌ను ఉద్దేశించి ఓ టెర్రరిస్టు హెచ్చరించాడు. -
ఈసారి బ్రిటన్‌పై దాడిచేస్తాం: ఐఎస్
-
ఈసారి బ్రిటన్‌పై దాడిచేస్తాం: ఐఎస్
ఈసారి తాము బ్రిటన్ మీద దాడిచేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ తాజా వీడియోలో ప్రకటించింది. ఈ విషయాన్ని సిరియా మానవహక్కుల సంస్థ తెలిపింది. బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌ను ఐఎస్ ఉగ్రవాది ఒకరు 'ఫూల్' అని తిట్టారు. ఆ తర్వాత ఐదుగురి తలలు నరికేశాడు. ఈ ఐదుగురూ బ్రిటన్ తరఫున పనిచేస్తూ ఐఎస్ఐఎస్ మీద గూఢచర్యానికి పాల్పడినట్లు ఆరోపించాడు. ఉత్తర సిరియాలో ఉగ్రవాద రాజధానిగా ఉన్న రక్కా ప్రాంతంలో ఈ వీడియోను తీసినట్లు తెలుస్తోంది. సిరియాలో ఐఎస్ఐఎస్ మీద దాడి చేయాల్సిన నైతిక, సైనిక బాధ్యత బ్రిటన్ మీద ఉందని ప్రధాని కామెరాన్ గత నెలలో అన్నారు. ఇప్పటికే ఇరాక్‌లో వైమానిక మార్గంలో ఐఎస్ఐఎస్ మీద దాడులు చేస్తున్న బ్రిటన్.. ఇటీవలే సిరియాకు కూడా ఆ దాడులను విస్తరించింది. -
భద్రత కోసం బాంబుల వర్షం..
- ఐఎస్‌పై సైనిక చర్యతోనే బ్రిటన్ సురక్షితంగా ఉంటుందన్న కామెరూన్ - పార్లమెంట్లో మద్దతుకు యత్నం.. ప్రతిపక్షపార్టీలో చీలిక లండన్: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై సైనిక చర్య అంశం బ్రిటన్ పార్లమెంట్ ను కుదిపేస్తున్నది. యుద్ధానికి ఇదే సరైన సమయమని అధికార పక్షం, అసలు యుద్ధమే వద్దంటూ ప్రతిపక్షం వాదులాడుకున్నాయి. ఈ మేరకు గురువారం బ్రిటన్ పార్లమెంట్ లోని దిగువ సభలో జరిగిన ప్రత్యేక చర్చలో ప్రధాని డేవిడ్ కామెరూన్ విపక్షాలను ఒప్పించే ప్రయత్నం చేశారు. సిరియాలో తలదాచుకున్న ఐఎస్ ఉగ్రవాదులపై సైనిక చర్యకు ఇదే తగిన సమయమని, కేవలం అలాంటి చర్యలతోనే బ్రిటన్ సురక్షితంగా మనగలుగుతుందని కామెరూన్ అన్నారు. ఐఎస్ పై సైనికచర్యతో.. ఇప్పట్లోగానీ, భవిష్యత్లోగానీ దేశానికి ఎలాంటి ముప్పు వాటిల్లబోదని ఉద్ఘాటించారు.ఈ మేరకు రూపొందించిన నివేదికను పార్లమెంట్ సభ్యులకు అందజేస్తూ.. మద్దతు పలకాల్సిందిగా ప్రతిపక్ష పార్టీని కోరారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత జెర్మీ కోర్బెయిన్.. ప్రభుత్వ ప్రతిపాదనను నిర్దంద్వంగా తిరస్కరించారు. సైనిక చర్యతోనే బ్రిటన్ సురక్షితంగా ఉండగలదన్న ప్రధాని వ్యాఖ్యలను ఖండించారు. కామెరూన్ తన ప్రతిపాదనను విరమించుకోవాలని హితవుపలికారు. అయితే సైనిక చర్య వ్యవహారం లేబర్ పార్టీ రెండుగా చీలిపోయింది. నాయకుడు కోర్బెయిన్ నిర్ణయానికి వ్యతిరేకంగా పలువురు ఎంపీలు ప్రకటనలు చేశారు. సైనిక చర్య తప్పదన్న ప్రభుత్వ వాదనను సమర్థించారు. దీంతో కొర్బెయిన్ ఇరుకునపడ్డట్లయింది. మరోవైపు మాజీ ప్రధాని, లేబర్ పార్టీకే చెందిన టోనీ బ్లేయర్ కూడా డేవిడ్ కామెరూన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. -
ఇంగ్లండ్‌కు ‘ఇండియన్’ ప్రధాని
- ఆ రోజు ఎంతో దూరం లేదు: కామెరాన్ - ‘అచ్చేదిన్ జరూర్ ఆయేంగే’ అంటూ వెంబ్లీలో సందడి లండన్: యునెటైడ్ కింగ్డమ్ ప్రధానమంత్రిగా.. బ్రిటిష్-ఇండియన్ ఎన్నికయ్యే రోజు ఎంతో దూరంలో లేదంటూ ఆ దేశ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ పేర్కొనటంతో లండన్‌లోని వెంబ్లీ స్టేడియం కేరింతలతో హోరెత్తింది. మోదీ కన్నా ముందు స్టేడియంలో ప్రవాసభారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన కామెరాన్.. పలుసందర్భాల్లో గుజరాతీ, హిందీ వ్యాఖ్యలతో ఆకట్టుకున్నారు. ‘నమస్తే వెంబ్లీ’ అంటూ మొదలుపెట్టిన ఆయన.. ‘కేమ్ చో!’ అంటూ గుజరాతీలో సభికులను కుశలం అడిగారు. వివిధ రంగాల్లో బ్రిటిష్-ఇండియన్లు చేసిన కృషిని ప్రస్తావించారు. భారత్, బ్రిటన్ సంబంధాలు ప్రజలకు, సుసంపన్నతకు సంబంధాలని అభివర్ణించారు. చివర్లో మోదీ ఎన్నికల నినాదాన్ని అనుకరిస్తూ.. ‘అచ్ఛే దిన్ జరూర్ ఆయేంగే’ అనటంతో స్టేడియం హర్షధ్వానాలతో మార్మోగింది. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ‘‘నమస్తే వెంబ్లీ! ప్రపంచంలో అత్యంత విజయవంతమైన బహుళ జాతుల ప్రజాస్వామ్యంగా మనం ఉన్నాం. అందులో బ్రిటిష్ ఇం డియన్ల పాత్ర ఎంతో ఉంది. ఒక బ్రిటిష్-ఇండియన్ (బ్రిటన్ పౌరసత్వం గల భారత సంతతి వ్యక్తి) యునెటైడ్ కింగ్డమ్ ప్రధానమంత్రిగా టెన్ డౌనింగ్ స్ట్రీట్ (ప్రధాని నివాసం)లోకి వచ్చే రోజు దూరంలో లేదు. ప్రధాని మోదీ, నేను సవాళ్లతో కూడిన కాలంలో పరిపాలిస్తున్నాం. కానీ.. మా ప్రగాఢ ఆకాంక్షల కారణంగా సమైక్యంగా ఉన్నాం. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి మేం మద్దతిస్తున్నాం. టీమ్ ఇండియా - టీమ్ యూకే.. మనమిద్దరం కలిస్తే అది గెలిచే జట్టు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేం కలసికట్టుగా నిలుచున్నాం. మీరు ముంబైలో బాధపడ్డారు. మేం లండన్‌లో బాధను చవిచూశాం. మనం ఉమ్మడిగా వారిని ఓడిస్తాం. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యాన్ని ఒక చాయ్‌వాలా పరిపాలించలేరని విమర్శకులు అన్నారు.. కానీ ఆయన (మోదీ) వారి అంచనా తప్పు అని నిరూపించారు. అచ్ఛే దిన్ జరూర్ ఆయేంగే!’’ కిక్కిరిసిన వెంబ్లీ... బ్రిటన్‌లో దాదాపు 15 లక్షల మంది ప్రవాసభారతీయులు నివసిస్తున్నారు. లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో మోదీ కార్యక్రమానికి 60 వేల మందికి పైగా హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా.. అలీషా చినాయ్ ‘మేడ్ ఇన్ ఇండియా’ పాటతో ప్రదర్శన నిర్వహించారు. కనికాకపూర్ ప్రదర్శన నిర్వహించారు. బాలీవుడ్ సినీ గీతాల ప్రదర్శనలు, ఎన్డీఏ సర్కారు ముఖ్య కార్యక్రమాలు, విజయాలతో వీడియోను ప్రదర్శించారు. స్టేడియాన్ని ‘మోదీ.. మోదీ’ నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమాల చివర్లో వందేమాతర గీతం ఆలపించారు. బ్రిటన్ ప్రధాని కామెరాన్ భార్య సమంత భారత సంప్రదాయ రీతిలో చీర కట్టుకుని స్టేడియంకు రావటం విశేషం. స్టేడియం వద్ద మోదీకి కామెరాన్ దంపతులు స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ప్రధానులు కార్యక్రమ నిర్వాహకులు, జాతీయ గీతాలు ఆలపించిన విద్యార్థులు, కళాకారులతో ముచ్చటించారు. తొలుత కామెరాన్, తర్వాత మోదీలు ప్రసంగించారు. -
'జిహాదీ జాన్ చనిపోయాడో లేదో తెలియదు'
లండన్: సిరియాలో అమెరికా వైమానిక దళాలు జరిపిన దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది, బ్రిటన్ జాతీయుడు జిహాదీ జాన్ చనిపోయాడో లేదో ఇంకా తెలియదని ఇంగ్లండ్ ప్రధాని డేవిడ్ కామెరూన్ అన్నారు. జిహాదీ జాన్‌ను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి చేశారని, అయితే ఈ ఆపరేషన్ విజయవంతమయిందో లేదో కచ్చితంగా చెప్పలేమని కామెరూన్ చెప్పారు. వేలమంది కంఠాలను తెగకోసిన నరరూప రాక్షసుడు జిహాదీ జాన్(మహ్మద్ ఎమ్వాజీ)ని ఎలాగైనా మట్టుపెట్టాలని అమెరికా మిలటరీ సేనలు దాడులు నిర్వహించాయి. జిహాదీ జాన్ ఉన్నట్లుగా భావించిన ప్రాంతాల్లో అమెరికా వైమానిక సంస్థ దాడులు జరిపింది. అయితే, ఈ దాడుల్లో మహ్మద్ ఎమ్వాజీ చనిపోయాడా లేదా అనే విషయంపై మాత్రం పెంటగాన్ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. -
మోదీకి యూకే ఘన స్వాగతం
లండన్: ప్రధాని మోదీ గురువారం ప్రధానిగా తన తొలి బ్రిటన్ పర్యటనను ప్రారంభించారు. బ్రిటన్‌తో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, మేకిన్ ఇండయాకు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా 3 రోజుల పర్యటనకు శ్రీకారం చుట్టారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ లండన్‌లోని కింగ చార్లెస్ స్ట్రీట్ వద్ద ఆయనకు గార్డ్ ఆఫ్ హానర్‌తో ఘన స్వాగతం పలికారు. ఆ తరువాత కామెరాన్ తో మోదీ ప్రతినిధుల స్థాయి చర్చల్లో పాల్గొన్నారు. అంతకుముందు,,మోదీ బ్రిటన్‌లోని సిక్కు మతస్తుల ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. యూకేలో అడుగుపెట్టిన మోదీకి లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో బ్రిటన్ విదేశాంగ, కామన్వెల్త్ శాఖ సహాయమంత్రి హ్యూగొ స్వైర్, ఆ దేశంలో భారత హై కమిషనర్ రంజన్ మథాయి, భారత్‌లో బ్రిటన్ హై కమిషనర్ జేమ్స్ డేవిడ్ ఎవాన్, భారతీయ సంతతికి చెందిన బ్రిటన్ మంత్రి ప్రీతి పటేల్ తదితరులు స్వాగతం పలికారు. యూకేకు స్వాగతం’ అంటూ కామెరాన్ ట్వీట్ చేశారు. మోదీ రాకను నిరసిస్తూ ఆవాజ్ నెట్వర్క్, ‘క్యాస్ట్వాచ్యూకే’ సహా పలు సంఘాలు ‘మోదీ నాట్ వెల్కమ్’ పేరుతో ప్రదర్శన నిర్వహించారు. షెడ్యూల్లో మోదీ.. బ్రిటన్ పార్లమెంట్ స్క్వేర్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి అంజలి ఘటించడం, బ్రిటన్ పార్లమెంట్లో, లండన్‌లోని గిల్డ్‌హాల్‌లో ప్రఖ్యాత కంపెనీల సీఈఓల సమావేశంలో ప్రసంగాలు, ఎలిజబెత్ మహారాణి 2తో మధ్యాహ్న భోజనం, వెంబ్లీ స్టేడియంలో బ్రిటన్‌లోని భారతీయులనుద్దేశించి ప్రసంగించడం.. తదితర కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. చివరగా టాటా కంపెనీకి చెందిన జాగ్వార్ లాండ్రోవర్ కర్మాగారాన్ని సందర్శిస్తారు. 12వ శతాబ్దానికి చెందిన ప్రముఖ తత్వవేత్త బసవేశ్వర విగ్రహావిష్కరణ, అంబేద్కర్ స్మారక కేంద్రం ప్రారంభోత్సవం అనంతరం అంకారాలో జరిగే జీ 20 సదస్సులో పాల్గొనేందుకు శనివారం టర్కీ వెళ్తారు. గత దశాబ్ద కాలంలో భారత ప్రధాని యూకే పర్యటించడం ఇదే ప్రథమం.మోదీ పర్యటన సందర్భంగా బ్రిటన్‌లో ఉంటున్న దాదాపు 15 లక్షల భారతీయులకు సంబంధించిన వీడియోనుకా మెరాన్ కార్యాలయం విడుదల చేసింది. కాగా,భారత్‌లో ప్రత్యేక ఖలిస్థాన్ ఉద్యమాన్ని పునరుజ్జీవింపజేసేందుకు ప్రయత్నిస్తున్న సిక్కు అతివాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని చర్చల సందర్భంగా బ్రిటన్ ప్రధాని కామెరాన్‌కు మోదీ విజ్ఞప్తి చేసే అవకాశముంది.. ‘అసహనా’న్ని ప్రస్తావించండి.. మోదీ యూకే పర్యటన సందర్భంగా 200 మంది ప్రముఖ రచయితలు కామెరాన్‌కు ఓ విజ్ఞప్తి చేశారు. భరత్‌తో పెరుగుతున్న భయానక, అసహన వాతావరణంపై మోదీని ప్రశ్నించాలని లేఖలో కోరారు. -
‘ఉగ్ర’ దేశాలను ఒంటరిని చేయాలి
ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న దేశాలను ఏకాకి చేయాలి ♦ బ్రిటన్ పార్లమెంట్ సభ్యులనుద్దేశించి ప్రసంగించిన భారత ప్రధాని ♦ మోదీకి బ్రిటన్ ఎంపీల స్టాండింగ్ ఒవేషన్ లండన్: ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ సాయం చేస్తున్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చేవారిని బహిష్కరించి, ఏకాకిని చేసే విషయంలో ఒక అంతర్జాతీయ తీర్మానం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అలాగే, ఉగ్రవాదంపై నిజాయితీగా పోరు చేస్తున్న దేశాలకు బాసటగా నిలిచే విషయంలోనూ ఒక్కమాటపై నిలవాలన్నారు. బ్రిటన్ ఎంపీలను ఉద్దేశించి గురువారం మోదీ ప్రసంగించారు. యూకే పార్లమెంట్‌లోని రాయల్ గ్యాలరీలో ఎంపీలనుద్దేశించి ప్రసంగిస్తున్న తొలి భారత ప్రధాని మోదీ అక్కడికి అడుగుపెట్టగానే.. బ్రిటన్ ఎంపీలంతా లేచి నిల్చొని స్వాగతం పలికారు. పార్లమెంట్‌లోని రాయల్ గ్యాలరీ నుంచి 25 నిమిషాల పాటు ప్రసంగించిన మోదీ.. సమకాలీన సమాజపు అతిపెద్ద ప్రమాదమైన ఉగ్రవాదంపై పోరును అంతర్జాతీయ సమాజం ఐకమత్యంగా సాగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఉగ్రవాద సంస్థల మధ్య తేడాను, దేశాల మధ్య వివక్షను చూపొద్దని పిలుపునిచ్చారు. అఫ్ఘాన్ భవిష్యత్తు అఫ్ఘాన్ ప్రజల ఆకాంక్షల మేరకే ఉండాలి కానీ.. ఇతరుల ఆశల మేరకో.. లేక ఇతర దేశాల అనవసర భయాల మేరకో ఉండకూడదని స్పష్టం చేశారు. బ్రిటన్ పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్న మోదీ.. ప్రస్తుత సమాజానికి కూడా ఆధునికత ప్రమాణం లండనేనన్నారు. ‘భారత్ ప్రపంచ దేశాలకు ఇప్పుడు అవకాశాల స్వర్గధామం. ఈ సమయంలో మీరు భారత్‌లో పర్యటిస్తే ఆ సానుకూల మార్పును మీరు కూడా గుర్తిస్తారు’ అన్నారు. భారత్‌లో ‘సమాఖ్య వ్యవస్థ స్థానంలో టీమ్ ఇండియా’ భావనను తీసుకువచ్చామన్నారు. భారత్, యూకేల చరిత్రాత్మక భాగస్వామ్యం గురించి చెబుతూ.. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, తాజా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లను మోదీ గుర్తు చేశారు. మోదీ ప్రసంగంలోని చతురోక్తులకు బ్రిటన్ ఎంపీలు పలుమార్లు నవ్వుల్తో స్పందించారు. ఇటీవలి ఎన్నికల్లో కామెరాన్ ఉపయోగించిన నినాదం ‘మళ్లీ ఒకసారి.. కామెరాన్ ప్రభుత్వం’ అనేది తనదేనని, దానికి తనకు కామెరాన్ రాయల్టీ ఇవ్వాలని మోదీ చమత్కరించారు. అంతకుముందు, పార్లమెంట్ వెలుపల మోదీ, కామెరాన్‌లు మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. హక్కుల ఉల్లంఘనలపై ప్రశ్నించండి! భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై మోదీని ప్రశ్నించాలంటూ ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్ సహా 46 మంది ఎంపీలు బ్రిటన్ ప్రధాని కామెరాన్‌కు ఒక పార్లమెంటరీ తీర్మానాన్ని పంపించారు. ఆశలకు వెలుగుచుక్క భారత్.. ‘ఆశలకు, అవకాశాలను సరికొత్త వెలుగుచుక్కగా భారత్ అవతరిస్తోంది. రక్షణ, వాణిజ్యం, గృహనిర్మాణం, సేవలు, తదితర రంగాల్లో భారత్‌లో అపార అవకాశాలున్నాయి. భారత్‌లో పాలనలో పారదర్శకత, నిర్ణయాల్లో వేగం, వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ.. మొదలైన సానుకూల మార్పులు చోటు చేసుకున్నాయి. గాంధీజీ చెప్పిన ప్రకారం.. మార్పు మాలోనే ప్రారంభమైంది. అందరికి విద్యుత్తు, తాగునీరు, ఇల్లు, పారిశుద్ధ్య వసతి మొదలైన లక్ష్యాల సాధనకు గడవును నిర్దేశించుకుని పని చేస్తున్నాం. భారతీయ చరిత్రలో చాలా భాగం బ్రిటన్ పార్లమెంట్‌లోనే లిఖితమైంది’ అని మోదీ పేర్కొన్నారు. -
అసహనాన్ని సహించం..!
భారత్‌లో అసహనంపై యూకేలో స్పందించిన మోదీ ♦ అసహన ఘటనల్ని తీవ్రంగా తీసుకుంటామని స్పష్టీకరణ ♦ {బిటన్ ప్రధానితో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న మోదీ ♦ పౌర అణు ఒప్పందం సహా రూ.90,500 కోట్ల విలువైన ఒప్పందాలు లండన్: స్వదేశంలో తీవ్రస్థాయి విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ దేశంలో నెలకొన్న అసహన వాతావరణంపై స్పందించని ప్రధాని మోదీకి.. విదేశంలో ఆ అంశంపై స్పందించాల్సివచ్చింది. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌తో చర్చల అనంతరం మోదీ, కామెరాన్‌లు సంయుక్తంగా పాల్గొన్న మీడియా సమావేశంలో అసహనంపై, 2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ విలేకరి మోదీని ప్రశ్నించారు. దానికి.. భారత్‌లోని ఏ భాగంలోనూ అసహనానికి సంబంధించిన ఘటనలను సహించబోమని మోదీ హామీ ఇచ్చారు. ‘గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీలు నడయాడిన నేల భారత్. దేశ మౌలిక విలువలకు వ్యతిరేకంగా జరిగే ఏ ఘటనలనైనా భారతీయ సంస్కృతి ఆమోదించదు. అసహనాన్ని భారత్ అంగీకరించబోదు. ఏ చిన్న ఘటననైనా.. 125 కోట్ల ప్రజలున్న భారతావనిలో దాని ప్రాముఖ్యత ఏ స్థాయిదైనా.. భారత్ ఆమోదించబోదు. మా దృష్టిలో ప్రతీ అసహన ఘటనా తీవ్రమైనదే. వాటిని సహించబోం. వాటిపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుంది. పౌరులందరి ప్రాణాలు, ఆలోచనలకు రక్షణ కల్పించే రాజ్యాంగం ఉన్న ప్రజాస్వామ్య దేశం భారత్’ అంటూ మోదీ సమాధానమిచ్చారు. ‘గతంలో మీరు ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ అల్లర్లను కారణంగా చూపి మోదీకి యూకేలో అడుగుపెట్టే అవకాశమివ్వలేదు. ఇప్పుడు అదే మోదీని స్వాగతించడం ఎలా ఉంది?’ అన్న గార్డియన్ పత్రికకు చెందిన విలేకరి ప్రశ్నకు కామెరాన్ సమాధానమిస్తూ.. ‘భారత ప్రజలిచ్చిన అద్భుతమైన, భారీ తీర్పుతో ప్రధాని హోదాలో యూకే వచ్చిన మోదీని స్వాగతించడం సంతోషంగా ఉంది’ అన్నారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. బ్రిటన్‌కు రాకుండా గతంలో కూడా తననెవరూ నిరోధించలేదని, 2003లో తాను యూకే వచ్చానని గుర్తు చేశారు. పౌర అణు ఒప్పందం.. మోదీ పర్యటన సందర్భంగా భారత్, బ్రిటన్ల మధ్య పౌర అణు ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం విషయంలో భారత్‌కు మద్దతిస్తున్నట్లు బ్రిటన్ పునరుద్ఘాటించింది. ఇరుదేశాల మధ్య 900 కోట్ల పౌండ్ల (రూ.90,500 కోట్లు) ఒప్పందాలు కుదిరాయి. రక్షణ, సైబర్ సెక్యూరిటీపై సహకరించుకోవాలని నిర్ణయించాయి. ప్రతినిధుల స్థాయి చర్చల అనంతరం సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ వివరాలను మోదీ, కామెరాన్‌లు వెల్లడించారు. పుణే, హైదరాబాద్‌లలో కొత్త సాంకేతిక కేంద్రాల ఏర్పాటులో సహకారంపై ఒక ఒప్పందం కుదిరింది. ‘భారత్‌లో పెట్టుబడుల విషయంలోనెంబర్ వన్ భాగస్వామి కావాలనుకుంటున్నాం. ప్రభుత్వ ప్రాయోజిత రూపీ బాండ్లు సహా 100 కోట్ల పౌండ్ల విలువైన బాండ్ల విడుదలతో.. విదేశాల్లో రూపీ ట్రేడింగ్‌లో లండన్ తొలి స్థానంలో నిలవాలన్నది మా లక్ష్యం’ అని కామెరాన్ చెప్పారు. భారత్‌లో పెట్టుబడులను ఆకర్షించే విషయంలో లండన్‌ను కేంద్రంగా చేసుకోవాలనుకుంటున్నట్లు మోదీ తెలిపారు. భారత రైల్వేల ప్రస్థానం లండన్‌లోనే మొదలైందన్న మోదీ.. రైల్వే రూపీ బాండ్‌ను లండన్‌లో ఆవిష్కరించడం సంతోషకరమన్నారు. -
బ్రిటన్ గడ్డపై మోదీ
భారత్-బ్రిటన్ల మధ్య చిరకాలంగా ఉన్న సంబంధాలు మరో మలుపు తీసుకోబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మూడు రోజుల పర్యటన కోసం బ్రిటన్ చేరుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాల పటిష్టత కోసం 2006లో మన్మోహన్సింగ్ పర్యటించాక తర్వాత మన ప్రధాని ఒకరు ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. ఇందుకు భిన్నంగా 2010లో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక డేవిడ్ కామెరాన్ మన దేశంలో మూడుసార్లు పర్యటించారు. మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. శరవేగంతో ఎదిగే ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కూడా గుర్తింపు పొందింది. అందుకు అవసరమైన వనరులూ, శక్తిసామర్థ్యాలూ భారత్‌కు పుష్కలంగా ఉన్నాయని ఆర్థికవేత్తలు చెబుతున్న మాట. దీనికి తోడు ఏ దేశంలోనూ లేనివిధంగా మన దేశంలో పాతికేళ్ల లోపున్న యువత 60 కోట్లమంది ఉన్నారు. అంతేకాదు...బ్రిటన్‌లో కంటే మన దేశంలోనే శత కోటీశ్వరుల సంఖ్య ఎక్కువట. ఇన్ని అనుకూలాంశాలున్న దేశంతో ఎవరైనా మరింత సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. మన దేశంతో వాణిజ్య సంబంధాలున్న తొలి 25 దేశాల్లో బ్రిటన్ 18వ స్థానంలో ఉంది. ఇరు దేశాలమధ్యా ఉన్న వాణిజ్యం విలువ ప్రస్తుతం 1,434 కోట్ల డాలర్లు. ఈమధ్యకాలంలో మన దేశంలో బ్రిటన్‌కు సంబంధించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) ఇతోధికంగా పెరిగాయి. మరోపక్క యూరప్‌లోని మిగిలిన దేశాలకంటే బ్రిటన్‌లోనే భారత్ పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయి. అక్కడున్న దాదాపు 700 భారతీయ వ్యాపార సంస్థల్లో, పరిశ్రమల్లో 1,10,000మంది సిబ్బంది పనిచేస్తున్నారు. మరోపక్క బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కూడా ఇటీవలికాలంలో కోలుకుంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, నిరుద్యోగం తగ్గుముఖం పట్టడం అందుకు నిదర్శనం. ఇరు దేశాలమధ్యా ద్వైపాక్షిక సంబంధాల స్థాయిని మరింత పెంచడానికి మోదీ పర్యటన దోహదపడుతుందని కామెరాన్ ఆశాభావంతో ఉన్నారు. దానికి అనుగుణంగా ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాలమధ్యా 1,500 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాలు కుదరబోతున్నాయి. ఇందులో 20 హాక్ ట్రైనర్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కూడా భాగమే. ఈ విమానాల కొనుగోలుకు 2004లో తొలిసారి ఒప్పందం కుదిరాక ఇంతవరకూ మన వైమానిక దళం ఈ తరహా విమానాలు 123 కొనుగోలు చేసింది. ఒప్పందాన్ని అనుసరించి ఇందులో కొన్ని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)లో తయారయ్యాయి. టోనీ బ్లెయిర్ బ్రిటన్ ప్రధానిగా ఉండగా ఇరు దేశాలమధ్యా వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. అయినా సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అఫ్ఘానిస్థాన్ సమస్య విషయంలోగానీ, కశ్మీర్ సమస్యపైగానీ ఇరు దేశాలమధ్యా ఏకాభిప్రాయం లేకపోవడమే ఇందుకు కారణం. కశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో జరుగుతున్న జాప్యంవల్లే దక్షిణాసియాలో మత తీవ్రవాదం పెచ్చరిల్లుతున్నదని...ఆఫ్ఘాన్‌లో ప్రశాంతత ఏర్పడాలంటే ముందు క శ్మీర్ పరిష్కారం కావాలని 2009లో అప్పటి బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ మిలిబాండ్ వ్యాఖ్యానించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కశ్మీర్ భారత్‌లో విడదీయరాని భాగమని అప్పట్లో మన దేశం స్పష్టంచేసింది. మిలిబాండ్ దాన్ని విస్మరించి పాక్‌పై పక్షపాతం ప్రదర్శించారని విమర్శించింది. అంతేకాదు...2010లో అఫ్ఘాన్ సమస్యపై నిర్వహించిన లండన్ కాన్ఫరెన్స్ద్వారా తాలిబన్లను ప్రధాన స్రవంతికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరిగింది. ఇది పాకిస్తాన్‌కు మేలు చేయడమే అవుతుందని, సమస్య తీవ్రతనూ, దాని పుట్టుకనూ విస్మరించడమే అవుతుందని మన దేశం హెచ్చరించింది. మరోపక్క వాతావరణ మార్పులు, బ్రిటన్‌లో భారత విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం తదితర అంశాల్లో కూడా ఇరు దేశాలకూ వేర్వేరు అభిప్రాయాలున్నాయి. ముఖ్యంగా మూడు నెలలక్రితం బ్రిటన్ వలస నిబంధనల్లో చేసిన మార్పులవల్ల వేలాదిమంది భారతీయ నర్సులకు అక్కడ ఉపాధి అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. ఆరేళ్ల తర్వాత 35,000 పౌండ్ల జీతాన్ని పొందగలిగేవారే తమ దేశంలో ఉండటానికి అర్హులని తాజా నిబంధనలు చెబుతున్నాయి. ఇప్పుడున్న వేతనాలను దృష్టిలో ఉంచుకుంటే ఆరేళ్ల తర్వాత ఆ స్థాయికి చేరగలవారి సంఖ్య చాలా తక్కువుంటుందని ఆందోళన వ్యక్తమైంది. ఆ ప్రాతిపదికన లెక్కలేసి రాగల రెండేళ్లలో చాలామందిని బయటకు పంపే ఉద్దేశం బ్రిటన్‌కు ఉంది. ఇది మాత్రమే కాదు...నర్సింగ్ శిక్షణా కేంద్రాలకు నిధుల కేటాయింపును కూడా బ్రిటన్ సర్కారు గణనీయంగా తగ్గించింది. విదేశీయులకు అవకాశాలు లభించకుండా చేయడమే ఈ చర్యలోని ఆంతర్యమని విమర్శలు చెలరేగాయి. ఒకపక్క రక్షణతో సహా వివిధ రంగాల్లో వాణిజ్య సంబంధాలను విస్తరించుకుని లాభపడాలని చూస్తున్న బ్రిటన్...మన దేశంనుంచి వెళ్లే విద్యార్థులకూ, వృత్తిగత నిపుణులకూ అవకాశాలను కుదించేలా చేయడం ఆందోళన కలిగించే అంశం. యూరప్ దేశాలన్నిటి పెట్టుబడులకంటే బ్రిటన్‌లో మన దేశం పెట్టుబడులే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడి పౌరులకిచ్చే వెసులుబాటు మన దేశంనుంచి వెళ్లేవారికి ఇవ్వకపోవడం అన్యాయమవుతుందని తోచకపోవడం విచిత్రం. ఇవన్నీ నరేంద్ర మోదీ పర్యటనలో చర్చకొస్తాయి. బ్రిటన్ పార్లమెంటునుద్దేశించి మన ప్రధాని ఒకరు ప్రసంగించడం ఇదే తొలిసారి. ఈ అవకాశాన్ని గురువారం నరేంద్ర మోదీ సమర్థవంతంగానే వినియోగించుకున్నారు. ఉగ్రవాదంపై ప్రపంచమంతా ఒకే గొంతుతో మాట్లాడాల్సిన అవసరం ఉన్నదని ఆయన గుర్తుచేశారు. ఈ అంశంలో బ్రిటన్ ఆలోచనా తీరును దృష్టిలో పెట్టుకునే ఆయన ఇలా చెప్పవలసి వచ్చింది. దౌత్యంలో నిర్మొహమాటంగా ఉండటం, మన వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం అవసరం. మోదీ ఆ పని చేశారు. మొత్తానికి ఆయన పర్యటన ఇరు దేశాల సంబంధాలనూ మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లగలదని ఆశించాలి. -
భారత్ సరికొత్త ఆశాకిరణం: మోదీ
లండన్: ఆర్థిక మందగమనం నుంచి బ్రిటన్ పునరుత్థానం చెందిన తీరు ఆసక్తికరమని, అదేసమయంలో ప్రస్తుతం ప్రపంచానికి భారత్ సరికొత్త ఆశాకిరణమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఉమ్మడిగా గళమెత్తాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఐరాసలో ఉగ్రవాదంపై ఒకే నిర్వచనం ఉండేలా అందరూ మద్దతు పలుకాలని బ్రిటన్ పార్లమెంటులో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తూ కోరారు. భారత ప్రధానమంత్రి బ్రిటన్ పార్లమెంటులో ప్రసంగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మోదీ మాట్లాడుతూ భారత సమాఖ్య విధానాన్ని ఇప్పుడో కొత్త అర్థం చెబుతున్నామని, భారత సమాఖ్య అంటే టీమిండియా అన్నది మా దృక్పథమని పేర్కొన్నారు. మారుతున్న భారతాన్ని చూడాలంటే మీరు భారత్‌ను సందర్శించాలని చెప్పారు. భారత్-బ్రిటన్ ఆర్థిక బంధం కొత్త పుంతలు తొక్కుతున్నదన్నారు. భారత్‌లో కొత్త రంగాల్లో పెట్టుబడులకు తలుపులు తెరిచామని చెప్పారు. అణుశక్తి, పునరుత్పాదక వనరుల విషయంలో బ్రిటన్‌తో కలిసి పనిచేస్తామని తెలిపారు. పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఉమ్మడి బాధ్యతతో ముందుకు సాగాల్సిన అవసరముందని చెప్పారు. కలల భారత సాకారం ఇప్పుడు మనముందు నిలిచి ఉందని, భారత్ ప్రగతితో ప్రపంచంలో ఆరోవంతు మానవాళి తలరాత మారుతుందని పేర్కొన్నారు. -
భద్రతా మండలిలో భారత్‌కు పూర్తి మద్దతు: కామెరూన్
లండన్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి బ్రిటన్ సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ స్పష్టం చేశారు. మూడు రోజుల బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతంపై అగ్రనేతలిద్దరూ చర్చించారు. మేక్ ఇన్ ఇండియాకు బ్రిటన్ సహకరిస్తుందని కామెరూన్ అన్నారు. రక్షణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నిధులను అందిస్తామని తెలిపారు. ఇండోర్, పుణె నగరాలలో ప్రత్యేక అభివృద్ధి కేంద్రాలకు బ్రిటన్ సహాయం ఉంటుందన్నారు. స్మార్ట్ సిటీస్, స్వచ్ఛ్భారత్లలో బ్రిటన్ భాగస్వామ్యం పంచుకుంటుందని, భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటీష్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ వివరించారు. -
లండన్‌లోనూ తప్పని 'అసహనం' సెగ
లండన్: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని అసహనం తాలూకు నిరసనలు వదిలేలా లేవు. దేశలో అసహనం పెరిగిపోతోందంటూ పలువురు రచయితలు, మేధావులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మూడు రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్ వెళ్లిన మోదీకి అక్కడ కూడా ఇదే తరహా నిరసన వ్యక్తమౌతుంది. భారత్‌లో పెరుగుతున్న అసహనంపై చర్యతీసుకోవాలని మోదీకి సూచించాల్సిందిగా కోరుతూ బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరూన్‌కు అక్కడి రచయితలు బహిరంగ లేఖ రాశారు. దీనిలో ప్రముఖ రచయిత సల్మాన్ రష్ధీతో పాటు సుమారు రెండు వందల మంది రచయితలు సంతకం చేశారు. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తరువాత భారత్‌లో ఛాందసవాదం, భయానకమైన పరిస్థితులు పెరిగిపోయాయని లేఖలో పేర్కొన్నారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలని, విమర్శకుల గొంతులను నొక్కే ప్రయత్నం జరుగుతోందనీ దీనిపై మోదీ వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. మోదీ పర్యటన సందర్భంగా మరో వర్గం బ్రిటన్ పార్లమెంట్ భవనంపై 'మోదీ నాట్ వెల్కమ్' అంటూ పోస్టర్‌ను ప్రొజెక్ట్ చేసిన విషయం తెలిసిందే. -
దావూద్ ఇబ్రహీంను అణచివేయండి!
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్, కరుడుగట్టిన ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం బ్రిటన్‌లో నిర్వహిస్తున్న కార్యకలాపాలను అణచివేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ యూకే ప్రధాని డేవిడ్ కామెరూన్ ను కోరే అవకాశముంది. భారత మోస్ట్ వాటెండ్ నేరగాడైన దావూద్‌ను పట్టుకొని.. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో శిక్షిస్తామని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి చెప్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మూడు రోజుల పర్యటన కోసం లండన్ చేరుకున్న ప్రధాని మోదీ బ్రిటన్‌తో పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. అదేవిధంగా బ్రిటన్‌లో దావూద్ కార్యకలాపాలకు చెక్ పెట్టాలని ఆయన కోరే అవకాశముంది. బ్రిటన్‌లోని దావూద్ ఇబ్రహీం ఆస్తుల వివరాలతో కూడిన ఓ జాబితాను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. బ్రిటన్‌లో దావూద్‌కు కనీసం 15 ఆస్తులు ఉన్నాయని ఈ జాబితాలో ఆ వివరాలు వెల్లడించింది. -
వాట్సప్‌పై త్వరలో నిషేధం?
సోషల్ మీడియా, ఆన్లైన్ మెసేజింగ్ సర్వీసులపై కఠిన చట్టాల నేపథ్యంలో.. త్వరలోనే బ్రిటన్‌లో 'వాట్సప్'పై నిషేధం వేటు పడేలా ఉంది. కొత్త చట్టాన్ని అమలుచేయాలని ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ గట్టిగా పట్టుబడుతున్నారు. ఏరకమైన ఎన్క్రిప్టెడ్ మెసేజిలైనా పంపకుండా ప్రజలను అడ్డుకోవాలని ఆయన అంటున్నారు. దీంతో వాట్సప్ సహా ఐమెసేజ్, స్నాప్‌చాట్ లాంటి అనేక మెసేజింగ్ సర్వీసులు త్వరలోనే ఆ దేశంలో మూతపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చట్టాన్ని అమలుచేస్తే వెనువెంటనే యూకేలో ఈ మూడూ చట్ట వ్యతిరేక సర్వీసులు అయిపోతాయి. మనం చదవలేని సందేశాలు ప్రజలు మధ్య వెళ్లడాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించలేమని ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఓ సమావేశంలో కామెరాన్ అన్నారు. యూజర్ ప్రైవసీ విషయాన్ని వాట్సప్ ఏమాత్రం పట్టించుకోదని అంటున్నారు. గూగుల్ సెర్చి చేసినా, ఫేస్బుక్లో చాటింగ్ చేసినా, వాట్సప్ గ్రూపుల్లో సందేశాలు పంపుకొన్నా, స్నాప్‌చాట్ వీడియో సందేశాలు చూసుకున్నా.. ఇవన్నీ కూడా ఇంగ్లండ్ పోలీసులకు, ప్రభుత్వానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులోకి రావాలన్నది సర్కారు ఉద్దేశం. -
‘ఫిర్ ఏక్‌బార్ కామెరాన్ సర్కార్’
డేవిడ్ కామెరాన్ నాయకత్వంలో కన్సర్వేటివ్ పార్టీ ఇంగ్లండ్‌లో మరోసారి అధికారంలోకి రావడంతో ప్రధాని నరేంద్ర మోదీ తన ట్వీట్లో ‘ఫిర్ ఏక్‌బార్ కామెరాన్ సర్కార్’ అనే హిందీ మాటలతో అభినందనలు తెలియచేశారు. నిజానికి ఇవి కామెరాన్ ఇంగ్లండ్‌లోని హిందీ ఓటర్లను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు అన్నమాటలే. -
బ్రిటన్ ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీకే మళ్లీ పట్టం
-
‘ఫిర్ ఏక్ బార్....’
సంపాదకీయం ‘ఫిర్ ఏక్ బార్...కామెరాన్ సర్కార్’ అని నినాదమిచ్చిన బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ మాటే చివరికి నిజమైంది. సర్వేల అంచనాలన్నిటినీ తలకిందులు చేస్తూ బ్రిటన్ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంది. అంతేకాదు... ఈసారి లిబరల్ డెమొక్రటిక్ పార్టీ సాయం అవసరం లేకుండా అది సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. 650 స్థానాలున్న హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 326 స్థానాలకంటే మరో అయిదు స్థానాలను అదనంగా పొంది తన బలాన్ని 331కి పెంచుకుంది. రద్దయిన సభలో కన్సర్వేటివ్‌ల బలం 306 మాత్రమే. గట్టి పోటీ ఇచ్చి కన్సర్వేటివ్‌ల బలాన్ని గణనీయంగా తగ్గిస్తుందనుకున్న లేబర్ పార్టీ 26 స్థానాలు కోల్పోయి 232 స్థానాలకు పరిమితమైంది. ఆ పార్టీ ప్రచార సారథి ఎడ్ మిలిబాండ్ మూడుచోట్లనుంచి పోటీ చేసి ఒకచోట మాత్రమే గెలిచాననిపించుకున్నారు. స్కాట్లాండ్లో స్కాటిష్ నేషనల్ పార్టీ(ఎస్ఎన్పీ) అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ 59 స్థానాల్లో 56 కైవసం చేసుకోవడంతో లేబర్ పార్టీ ఆశలన్నీ అడుగంటాయి. ఈ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీల్లో పెను సంక్షోభాన్ని తీసుకొచ్చాయి. లేబర్ పార్టీ నాయకుడు మిలిబాండ్తోపాటు లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నాయకుడు నిక్ క్లెగ్, యూకే ఇండిపెండెన్స్ పార్టీ(యూకేఐపీ) నాయకుడు నెజైల్ ఫెరాజ్లు పదవులకు రాజీనామా చేశారు. బ్రిటన్‌లో గత అయిదేళ్లుగా కొనసాగిన కన్సర్వేటివ్-లిబరల్ డెమొక్రటిక్ పార్టీ కూటమి ప్రభుత్వం చెప్పుకోదగ్గ విజయాలే సాధించింది. ఏడెనిమిదేళ్ల తర్వాత నిరుద్యోగం తగ్గుముఖం పట్టడం, ద్రవ్యోల్బణం బాదరబందీ లేకపోవడం, కొద్దో గొప్పో వేతనాలు పెరగడంవంటివి కన్సర్వేటివ్‌లకు అనుకూల వాతావరణాన్ని ఏర్పరిచాయి. జీడీపీ తగ్గుముఖంలో ఉండటం, పారిశ్రామికరంగం, నిర్మాణ రంగాలను మందకొడితనం ఆవరించడం వగైరాలను లేబర్ పార్టీ ఎత్తిచూపినా వాటి ప్రభావం ఇంకా స్పష్టంగా కనబడని ప్రస్తుత పరిస్థితుల్లో ఓటర్లు ఆ ప్రచారాన్ని విశ్వసించలేదు. పైగా ఆర్థిక రంగం కాస్త మెరుగవుతున్న సూచనలు కనిపిస్తున్న తరుణంలో ఈ ఒరవడి కొనసాగితేనే మేలు జరుగుతుందని భావించారు. ఈ ఎన్నికల్లో కన్సర్వేటివ్‌లు లేబర్ పార్టీ కంటే స్వల్ప ఆధిక్యతను మాత్రమే కనబరచగలరని సర్వేలు చెప్పిన జోస్యం కూడా ఓటర్లను ప్రభావితం చేసింది. అదే జరిగితే లేబర్ పార్టీ ఎస్ఎన్పీతో పొత్తు కుదుర్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని, దాన్ని కాపాడుకోవడం కోసం స్కాట్లాండ్లో తిరిగి రిఫరెండం నిర్వహించడంతోసహా ఆ పార్టీ పెట్టే డిమాండ్లన్నిటికీ తలొగ్గుతుందని జనం భయపడ్డారు. ఈ విషయంలో కామెరాన్ చేసిన ప్రచారాన్ని వారు బలంగా నమ్మారు. అందుకే లేబర్ పార్టీపై మొగ్గు చూపినవారు సైతం చివరి నిమిషంలో కన్సర్వేటివ్లవైపు వెళ్లారన్నది విశ్లేషకుల అంచనా. స్కాట్లాండ్ ప్రాంతంలో జాతీయ ఆకాంక్షలను రేకెత్తించి లేబర్ పార్టీకి పడాల్సిన ఓట్లన్నీ ఎస్ఎన్పీ తన్నుకుపోయింది. ఆ ప్రాంతంలో లేబర్పార్టీకున్న 41 స్థానాల్లో 40 స్థానాలు ఎస్ఎన్పీ కైవసమయ్యాయి. ఇక దేశంలోని వేల్స్, ఇంగ్లండ్ ప్రాంతాల్లో సైతం జాతీయ ఆకాంక్షల కారణంగానే లేబర్ పార్టీ ఘోరంగా దెబ్బతింది. 2010 వరకూ కంచుకోటలుగా ఉన్న ఎన్నో నియోజకవర్గాలు ఆ పార్టీకి దూరమయ్యాయి. ఈ ఎన్నికల్లో యూకేఐపీ ఓట్ల పరంగా చూస్తే మూడో స్థానంలో ఉన్నా ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుని ఘోర పరాభవాన్ని పొందింది. ఓట్లను చీల్చడం ద్వారా లేబర్ పార్టీనే అది ఎక్కువగా దెబ్బతీసింది. వలసలపై యూకేఐపీ తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించినా అది కన్సర్వేటివ్‌లకు లాభించినట్టుగా ఆ పార్టీకి ఉపయోగపడలేదు. ఇరాక్ యుద్ధ సమయంలో లేబర్ పార్టీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై జనం ఇప్పటికీ కోపంగా ఉన్నారని ఎన్నికలు రుజువుచేశాయి. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న టోనీ బ్లెయిర్ అమెరికా చెప్పినట్టల్లా ఆడి దేశాన్ని యుద్ధంలోకి దించి ఆర్థికంగా కుంగదీశారన్న అభిప్రాయం జనంలో బలంగా ఉంది. మరోసారి లేబర్ పార్టీ విజయం సాధిస్తే అలాంటి పరిస్థితులే ఏర్పడగలవన్న అభిప్రాయం కూడా వ్యాప్తిలోకి వచ్చింది. ఈసారి ఎన్నికల్లో ఉపాధి నిమిత్తం యూరప్ దేశాల నుంచి...మరీ ముఖ్యంగా ఫ్రాన్స్, ఇటలీల నుంచి వచ్చిపడుతున్న వలసలు ప్రధాన పాత్ర పోషించాయి. వీటని అరికట్టడానికి అవసరమైతే యూరప్ యూనియన్(ఈయూ)నుంచి బయటకు రావడానికి సిద్ధమని ప్రకటించిన కామెరాన్ మాటలే జనాన్ని ఆకట్టుకున్నాయి. వలసలపై ఈయూతో చర్చించడమే మార్గమని, ఆ సంస్థనుంచి తప్పుకోవడం ఆత్మహత్యాసదృశమవుతుందని లేబర్ పార్టీ చేసిన వాదన వారికి రుచించలేదు. ఆ పార్టీకి ఓటేస్తే వలసల విషయంలో కఠినంగా ఉండలేదన్న సంశయం వారికి కలిగింది. ఈ విషయంలో మిలిబాండ్ కంటే ప్రధానిగా ఉన్న కామెరాన్ గట్టిగా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది. నిజానికి కామెరాన్ హామీ ఇచ్చినట్టు ఈయూలో కొనసాగడంపై 2017లో రిఫరెండం నిర్వహిస్తే అందువల్ల అంతిమంగా నష్టపోయేది బ్రిటనే. ఈయూలో భాగం కాదు గనుక బ్రిటన్ తన వలస చట్టాలను కఠినం చేసి ఎవరినీ రానీయకుండా చేయొచ్చుగానీ... ఇన్నాళ్లుగా యూరప్‌లో చలాయిస్తున్న పెద్దరికాన్ని, పరపతిని అది కోల్పోతుంది. పర్యవసానంగా అంతర్జాతీయంగా దాని పలుకుబడి క్షీణిస్తుంది. స్కాట్లాండ్లో మరోసారి రిఫరెండం డిమాండ్ ముందుకు వస్తుంది. జనం లేబర్ పార్టీ తిరిగి రావడంవల్ల ఎస్ఎన్పీ బలపడుతుందనుకున్నారుగానీ... కామెరాన్ ప్రతిపాదిస్తున్న చర్యలవల్ల ఆ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని గుర్తించలేకపోయారు. విజయోత్సవ ప్రసంగంలో కామెరాన్ స్కాట్లాండ్కూ, వేల్స్కూ అధికార వికేంద్రీకరణ చేస్తానని హామీ ఇచ్చారు. వాటి మాటెలా ఉన్నా 2017లో ఆయన నిర్వహిస్తానంటున్న రిఫరెండంపై కార్పొరేట్ వర్గాలు గుబులుగా ఉన్నాయి. ఆ విషయంలో కామెరాన్ తుది నిర్ణయం ఎలా ఉంటుందోనని బెంగపడుతున్నాయి. మొత్తానికి ఈసారి బ్రిటన్ ప్రజలు ఏక పార్టీ పాలనకు పట్టంగట్టారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడంలో స్వీయ విధానాలే ఆయనకు అడ్డంకి. వీటిలో ఎన్నిటిని ఆయన సవరించుకుని జనరంజకంగా పాలన సాగించగలరన్నది రాబోయే కాలం తేలుస్తుంది. -
మళ్లీ కామెరానే బ్రిటిష్ ప్రధాని
లండన్: బ్రిటన్ అధికారపీఠం కోసం హోరా హోరీగా సాగిన పోరులో కన్జర్వేటివ్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రధాని డేవిడ్ కామెరాన్ మరోసారి ప్రధాని పీఠాన్నిఅధిరోహించేందుకు సన్నద్ధమవుతున్నారు. అధికార కన్సర్వేటివ్ పార్టీ ఇప్పటికి 326 సీట్లను గెల్చుకుంటే, ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ 230 సీట్లు సాధించింది. 643 స్థానాల్లో ఫలితాలను వెల్లడించారు. మరో 7 సీట్లకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉండగానే కన్సర్వేటివ్స్ విజయం ఖాయమైపోయింది. సాధారణ మెజారిటీకి కావల్సిన 326 మ్యాజిక్ మార్కును సాధించారు. ఎగ్జిట్ పోల్స్‌కు అంచనాలకు కొంచెం అటూ ఇటుగా ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు డేవిడ్ కామెరాన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. అందుకోసం ఆయన బ్రిటిష్ రాణిని అనుమతి కోరారు. స్కాటిష్ నేషనల్ పార్టీ సంచలన విజయాలను నమోదు చేసింది. 56 సీట్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఒక విధంగా వీరి ఫలితం ప్రధాన ప్రతిపక్షాన్ని బాగా దెబ్బతీసిందని చెప్పవచ్చు. మొత్తం కాగా మొత్తం 650 స్థానాలకు ఇప్పటివరకు ఫలితాలు ఇలా ఉన్నాయి. కన్జర్వేటివ్ పార్టీ 326 లేబర్ పార్టీ 230 స్కాటిష్ నేషనల్ పార్టీ 56 లిబరల్ డెమోక్రటిక్ పార్టీ 8 డియూపి 8 ఇతరులు 15 రాణి ఎలిజబెత్ అధికారిక ప్రకటన అనంతరం ఈ నెల 27న కొత్త పార్లమెంటు కొలువుదీరనుంది. కాగా మొత్తం 650 స్థానాలకు, 316 స్థానాలు కన్జర్వేటివ్ పార్టీ, ప్రతిపక్షం లేబర్ పార్టీ 239 స్థానాలు గెలుచుకుంటాయని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. విపక్షనేత రాజీనామా బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రతిపక్ష నేత ఎడ్ మిలిబాండ్ తన పదవికి రాజీనామా చేశారు. లేబర్ పార్టీ ఇక ఓటమిని అంగీకరించక తప్పలేదు. మోదీ అభినందనలు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌ను అభినందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆయనకు అభినందనలు తెలిపారు. 'ఫిర్ ఏక్ బార్.. కామెరాన్ సర్కార్' (మరోసారి కామెరాన్ ప్రభుత్వమే) అంటూ తన ఎన్నికల సమయం నాటి నినాదాన్ని గుర్తుచేశారు. అప్పట్లో 'అబ్ కీ బార్ మోదీ సర్కార్' అనే నినాదం బాగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. Congratulations @David_Cameron. As you rightly pointed out- its "Phir Ek Baar, Cameron Sarkar!" My best wishes. pic.twitter.com/xf5tJfW0SE — Narendra Modi (@narendramodi) May 8, 2015 -
అధికారపీఠం కోసం హోరా హోరీ పోరు
లండన్: బ్రిటన్ అధికారపీఠం కోసం హోరా హోరీ పోరు కొనసాగుతోంది. ప్రధాన పార్టీల మధ్య పోటీ గట్టిగా ఉంది. నువ్వా.. నేనా అన్నట్లుగా జరిగిన బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తన స్థానాలను నిలబెట్టుకుంటోంది. ప్రధాని డేవిడ్ కామెరాన్ మరో సారి ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నారు. అధికార పార్టీ 218 సీట్లను గెల్చుకుంటే.. ప్రధాన ప్రతిపక్షం 200 సీట్లు సాధించింది. అయితే తుది ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఇక ఫలితాలపై కామెరాన్ ట్విట్ చేశారు. 'ఒకే జాతి.. ఒకే రాజ్యం...మరోసారి దేశప్రధానిగా ఎన్నికయితే.. ప్రజలకు సేవచేసే అవకాశం దొరకడం నా అదృష్టం' అంటూ ఆయన ట్విట్ చేశారు. ముందుంది మంచి కాలం అన్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత, లేబర్ పార్టీ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎడ్ మిలిబాండ్, లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నేత నిక్‌క్లెగ్, యునైటెడ్ కింగ్డమ్ ఇండిపెండెన్స్ పార్టీ నికెల్ ఫరాగ్, స్కాటిష్ నేషనల్ పార్టీ అధిపతి నికోలా స్టర్జన్ తదితరులు విజయాన్ని సాధించినవారిలో ఉన్నారు. ఆరు లక్షలకు పైగా భారతీయ ఓటర్లు ఈ ఎన్నికల్లో నిర్ణాయశ శక్తిగా మిగలడం విశేషం. ఫలితాలను రాణి ఎలిజబెత్ అధికారికంగా ప్రకటించిన అనంతరం ఈ నెల 27న ఆమె ప్రసంగంతో కొత్త పార్లమెంటు కొలువుదీరనుందని సమాచారం. -
ఆసక్తికరంగా బ్రిటన్ ఎన్నికల ఫలితాలు
లండన్: నువ్వా.. నేనా అన్నట్లుగా జరిగిన బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఫలితాలు నమోదయ్యాయి. తరువాత క్రమంగా కన్సర్వేటివ్ పుంజుకుంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం కన్జర్వేటివ్ పార్టీ 200, లేబర్ పార్టీ188, ఎస్ఎన్పీ 55 స్థానాలను గెలుచుకున్నాయి. ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించారు. మరోవైపు స్కాటిష్ నేషనల్ పార్టీ 55 స్థానాలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా 20ఏళ్ల ఎస్ఎన్పీ అభ్యర్థి మైరి బ్లాక్ అనే విద్యార్థి విజయాన్ని సాధించారు. పార్లమెంటుకు ఎన్నికైన అతి చిన్న వయస్కురాలుగా ఆమె రికార్డు సృష్టించారు. కాగా మొత్తం 650 స్థానాలకు, 316 స్థానాలు కన్జర్వేటివ్ పార్టీనే గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ మాత్రం 239 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందే అని తెలిపింది. -
బ్రిటన్ ప్రధానిగా మళ్లీ కామెరాన్?
లండన్: కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాని డేవిడ్ కామెరాన్ మరో సారి ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకుంటారా ? అంటే అవుననే అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. వచ్చే ఐదేళ్లు ఆయనే ప్రధానిగా ఉంటారని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. బ్రిటన్ పార్లమెంట్‌లోని మొత్తం 650 స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. వాటిలో 316 స్థానాలు కన్జర్వేటివ్ పార్టీనే గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ మాత్రం 239 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందే అని తెలిపింది. ఎగ్జిట్ పోల్స్‌పై డేవిడ్ కామెరాన్ ప్రభుత్వంలోని మంత్రి మైఖల్ గోవ్ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ చెప్పింది అక్షరాల నిజం అని అన్నారు. -
మీ కన్నీళ్లు తుడిచేందుకు వచ్చా!
జాఫ్నాలో తమిళులను ఉద్దేశించి మోదీ వ్యాఖ్య పౌరులందరికీ సమాన హక్కులు దక్కాలని స్పష్టీకరణ తమిళ నిరాశ్రయులకు 27 వేల కొత్త ఇళ్ల అందజేత జాఫ్నా/కొలంబో: దశాబ్దాల అంతర్యుద్ధంలో కొట్టుమిట్టాడి, తమిళుల హక్కుల కోసం నినదించిన జాఫ్నా గడ్డపై ప్రధాని నరేంద్ర మోదీ అడుగుపెట్టారు. శ్రీలంకలో చివరిరోజు పర్యటనలో భాగంగా శనివారం ఆయన తమిళుల ప్రాబల్య ప్రాంతమైన జాఫ్నాను సందర్శించారు. పౌరులందరికీ సమాన హక్కులు దక్కాలని, అందరూ ఆత్మగౌరవంతో జీవించాలంటూ పరోక్షంగా తమిళుల ఆకాంక్షను చాటారు. సంక్షుభిత ప్రాంతంలో ఇన్నేళ్లూ కష్టనష్టాల పాలైన వారి కన్నీళ్లు తుడిచేందుకు ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీనే. 2013లో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ జాఫ్నాలో పర్యటించారు. ఆ తర్వాత ఓ అంతర్జాతీయ నేత ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. ఇలావలైలో తమిళులకు 27 వేల కొత్త ఇళ్లను అందజేశారు. మంగళ హారతులు, మేళతాళాల మధ్య సంప్రదాయ రీతిలో మహిళలు ఆయనకు స్వాగతం పలికారు. గృహ ప్రవేశంలో భాగంగా పాలు పొంగించే కార్యక్రమంలో మోదీ స్వయంగా పాల్గొన్నారు. రెండో దశలో మరో 47 వేల గృహాలు నిర్మిస్తామన్నారు. జాఫ్నాలో రూ.60 కోట్లతో భారత్ నిర్మిస్తున్న సాంస్కృతిక కేంద్రానికీ మోదీ శంకుస్థాపన చేశారు. ‘పర్యటన షెడ్యూల్లో లేకపోయినా ఈ నేలకు వందనం చేసేందుకే ఇక్కడకు వచ్చాను. ప్రజలు అనేక కష్టాలు పడ్డారు. ప్రజలందరూ సమానత్వం, న్యాయం, శాంతి, గౌరవంతో జీవించాలి. అందుకు దోహదపడేలా శ్రీలంక రాజ్యాంగానికి 13వ సవరణ చేయాల్సిన అవసరం ఉంది. నేను సహకార సమాఖ్య వ్యవస్థను నమ్ముతాను’ అని అన్నారు. మోదీ వెంట జాఫ్నా సీఎం, తమిళ నేత సీవీ విఘ్నేశ్వరన్ ఉన్నారు. భారత్‌కు సమీప ప్రాంతమైన జాఫ్నాలోని తలైమన్నార్‌లో రైలు సర్వీసును మోదీ ప్రారంభించారు. మహాబోధి వృక్షానికి పూజలు.. జాఫ్నాకు బయల్దేరే ముందు మోదీ.. ప్రాచీనకాలంలో లంక రాజధాని అయిన అనురాధాపుర పట్టణానికి వెళ్లి మహాబోధి వృక్షం వద్ద పూజలు చేశారు. లంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన కలిసి ఈ మహాబోధి వృక్షాన్ని సందర్శించిన మోదీ.. అక్కడ అరంగటపాటు గడిపారు. అనంతరం నాగులేశ్వరం ఆలయాన్ని కూడా మోదీ సందర్శించారు. రాజపక్సతో భేటీ.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్సతో.. మోదీ కొలంబోలోని భారత హైకమిషన్ ఆఫీసులో భేటీ అయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమి వెనుక భారత్, అమెరికా, యూరప్ దేశాల హస్తం ఉందని ఇటీవల రాజపక్స ఆరోపించడం తెలిసిందే. ప్రధాని గౌరవార్థం భారత హైకమిషన్ ఇచ్చిన విందులోనూ మోదీ పాల్గొని అక్కడి సిబ్బందితో ముచ్చటించారు. రెండ్రోజుల లంక పర్యటన ముగించుకొన్న మోదీ శనివారం రాత్రి భారత్ బయల్దేరారు. లంక ప్రధాని విక్రమసింఘే కొలంబో విమానాశ్రయంలో వీడ్కోలు పలికారు. 5 రోజుల పర్యటనలో ప్రధాని సీషెల్స్, మారిషస్, లంకలో పర్యటించారు. -
ఆ దేశ పార్లమెంట్ ఆవరణలోనే గాంధీ విగ్రహం!
లండన్: భారత స్వాతంత్ర్యం కోసం ఏ దేశ పాలకులకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ పోరాడారో, ఆ దేశ పార్లమెంటు ఆవరణలోనే మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. బ్రిటిష్ పార్లమెంట్ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటుకు ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరాన్ మద్దతు పలికారు. విన్స్టన్ చర్చిల్, నెల్సన్ మండేలా విగ్రహాల సరసన భారత జాతిపిత విగ్రహం ఏర్పాటుచేయడం సరైన నిర్ణయమే అన్నారు. శాంతి, అహింసల గొప్పతనాన్ని ప్రపంచానికి బోధించిన మహోన్నత వ్యక్తి గాంధీ అని కొనియాడారు. దీంతో బ్రిటన్‌కు భారత్‌తోఉన్న చారిత్రక సంబంధాలు మరింత ధృడపడతాయని పేర్కొన్నారు. శక్తిమంతమైన సమాజాన్ని నిర్మించాలనుకునేవారికి మహాత్ముని బోధనలు మార్గదర్శకాలుగా నిలుస్తాయన్నారు. ఈ ఏడాది ప్రథమార్ధంలోనే గాంధీ విగ్రహన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని కామెరాన్ తెలిపారు. గత ఏడాది యూకే ప్రతినిధి బృందం భారత పర్యటన సందర్భంగా విగ్రహ ఏర్పాటు విషయాన్ని ప్రకటించారు. ప్రవాస భారతీయ ఆర్థిక వేత్త లార్డ్ మేఘనాథ్ దేశాయ్ నేతత్వంలోని 'గాంధీ స్టాట్యూ మెమోరియల్ ట్రస్ట్' ఈ విగ్రహానికి నిధులు సమీకరిస్తోంది, విగ్రహ ఏర్పాటుకు 7 లక్షల 50 వేల పౌండ్లు అవసరమని భావించగా, మూడు నెలల స్వల్ప వ్యవధిలోనే 5 లక్షల పౌండ్లు సమీకరించినట్లు ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. -
పాకిస్థాన్‌కు బ్రిటన్ చెప్పుదెబ్బ సమాధానం
బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ పాకిస్థాన్‌కు చెప్పుదెబ్బ లాంటి సమాధానం చెప్పారు. బ్రిటన్ వేదికగా అంతర్జాతీయ యవనికపై కాశ్మీర్ అంశాన్ని రచ్చ చేయాలనుకున్న పాక్ పన్నాగాన్ని తిప్పికొట్టారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తమ దేశానికి ఆహ్వానించిన కామెరాన్.. కాశ్మీర్ అంశం కేవలం భారత్, పాకిస్థాన్ మధ్య విషయమని, దానిపై తాము ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకునేది లేదని స్పష్టం చేశారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో జర్దారీ ఇటీవల లండన్‌లో ఓ భారీ ప్రదర్శన ఏర్పాటుచేసి, కాశ్మీర్ అంశాన్ని అక్కడ చర్చకు లేవదీయాలని ప్రయత్నించారు. అయితే.. ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. అక్కడ భారీ ప్రదర్శన చేయాలనుకున్నా.. దానికి స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది. దాంతో ఆ వైఫల్యానికి కారణం మీరంటే మీరేనంటూ.. బిలావల్ భుట్టో, ఇమ్రాన్ ఖాన్ వర్గాలు ఆరోపించుకున్నాయి. కానీ ఇప్పుడు వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు అటు ప్రదర్శన విఫలం కావడం, ఇటు బ్రిటిష్ ప్రధాని కామెరాన్ కూడా పాకిస్థాన్‌కు మద్దతు చెప్పకపోవడం ఆ దేశ నాయకులకు తీవ్ర ఆశాభంగాన్ని కలిగించింది. -
దీపావళి వేడుకల్లో బ్రిటన్ ప్రధాని
లండన్: బ్రిటన్‌లో దీపావళి వేడుకల్ని ఘనంగా నిర్వహంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ సైతం తన అధికారిక నివాసంలో దీపావళి పండుగ జరుపుకోనున్నారు. కామెరూన్ భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ప్రవాస భారతీయులు దీపావళి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
'ఆ జీహాదీ జాన్ జాడను పసిగట్టండి'
లండన్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు తమ దేశ పౌరుడైన అలెన్ హెన్నింగ్ను బందీగా పట్టుకొని శిరచ్ఛేదం చేయడాన్ని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తీవ్రంగా పరిగణించారు. ముఖానికి ముసుగు ధరించి అలెన్‌ను శిరచ్ఛేదం చేసిన ఉగ్రవాది ‘జీహాదీ జాన్’ జాడ పసిగట్టాల్సిందిగా తమ గూఢచార సంస్థల అధిపతులను ఆదేశించారు. అతని ఉనికిని పసిగడితే అతన్ని హతమార్చేందుకు లేదా బందీగా పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలను పంపుతానని దేశ ప్రధాన గూఢచార సంస్థలైన ఎంఐ5, ఎంఐ6, జీసీహెచ్‌క్యూ చీఫ్‌లతో శనివారం జరిపిన భేటీలో కామెరాన్ చెప్పారు. ఐఎస్ ఉగ్రవాదులు మరో బ్రిటన్ పౌరుడికి శిరచ్ఛేదం చేసిన సంగతి తెలిసిందే. ఓ బ్రిటిష్ పౌరుడిని తలనరికి ఆ దృశ్యాలున్న వీడియోను శుక్రవారం ఇంటర్నెట్లో పెట్టారు. బ్రిటన్‌కు చెందిన అలెన్ హెన్నింగ్ అనే టాక్సీడ్రైవర్ ఓ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రవూల్లో పాలుపంచుకోవడానికి దాదాపు ఏడాది కిందట సిరియా వెళ్లాడు. అతడిని బందీగా పట్టుకున్న ఐఎస్ మిలిటెంట్లు, దారుణంగా నరికి చంపారు. తవుపై దాడులకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపినందుకు ప్రతీకారంగా ఆ దేశ పౌరులను ఇలా శిక్షిస్తున్నట్టు వీడియోలో పేర్కొన్నారు. -
బ్రిటన్ సమైక్యతకు ఢోకా లేనట్లే!
గ్లాస్గో : స్కాట్లాండ్ స్వతంత్ర దేశం అయ్యే అవకాశాలు తగ్గిపోతున్నాయి. యునైటెడ్ కింగ్డమ్ విభజనకు వ్యతిరేకంగా స్కాట్లాండ్ ప్రజలు తీర్పు ఇచ్చే దిశగా ఓటింగ్ ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటి దాకా వెలువడిన ఫలితాల్లో దేశ విభజన వద్దంటూ 54.33 శాతం మంది ఓటేశారు. 45.67 శాతం మంది ప్రత్యేకం దేశం కావాలని కోరుతూ ఓటేశారు. మొత్తం 32 కౌంటీలు ఉండగా 25 కౌంటీల్లో ఫలితాలు వెలువడుతున్నాయి. 25 కౌంటీల్లో కేవలం 4 కౌంటీల్లో మాత్రమే విభజనకు అనుకూలంగా మెజార్టీ ఓటర్లు తీర్పు ఇచ్చారు. 21 కౌంటీల్లో విభజనకు వ్యతిరేకంగా.. సమైక్యానికి మద్దతుగా ఓటేశారు. ఈ ఫలితాలను బట్టి బ్రిటన్ భవితవ్యానికి ఢోకా ఉండకపోవచ్చని అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
నేడు తేలనున్న స్కాట్లాండ్ భవిత
ఎడిన్‌బరో: ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపిన స్కాట్లాండ్ రెఫరెండంపై గురువారం పోలింగ్ ముగిసింది. ఫలితాలు శుక్రవారం వెల్లడి కానున్నాయి. యూకే నుంచి విడిపోయి స్వతంత్రదేశంగా మారే విషయంలో స్కాట్లాండ్ ప్రజల వైఖరి మరికొద్ది గంటల్లో తేలనుంది. ఓటింగ్‌లో స్కాట్లాండ్ పౌరులు ఆసక్తిగా పాల్గొన్నారు. పోలింగ్‌బూత్‌లు తెరవకముందే.. వాటిముందు బారులు తీరడం కనిపించింది. కొన్ని వారాలుగా స్కాట్లాండ్ను హోరెత్తించిన స్వాతంత్య్ర అనుకూల, వ్యతిరేక వర్గాల ప్రచారం సద్దుమణిగింది. స్వాతంత్య్ర అనుకూల వర్గానికి అలెక్స్ సాల్మండ్ నేతృత్వం వహిస్తున్నారు. స్వతంత్రదేశంగా మారేందుకుగల ఈ చరిత్రాత్మక అవకాశాన్ని వదులుకోరాదని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరాన్.. బ్రిటన్ నుంచి విడిపోవద్దంటూ అభ్యర్థిస్తూనే, విడిపోతే వచ్చే ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకోలేరంటూ హెచ్చరించారు. యూకే ఐక్యంగానే కొనసాగుతుందన్న ఆశాభావాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యక్తం చేశారు. ఇంతకాలం బ్రిటన్‌తో కలిసుండటానికి మద్దతిచ్చిన స్కాట్లాండ్కు చెందిన టెన్నిస్ స్టార్ ఆండీముర్రే చివరి నిమిషంలో స్వతంత్ర వాదనకు మొగ్గు చూపుతూ ట్వీట్ చేశారు. ముర్రే ట్వీట్‌కు విశేష స్పందన లభించింది. కలిసుండేందుకే మొగ్గు: అతి స్వల్ప మెజారిటీతో బ్రిటన్‌తో కలిసుండాలనే వాదనే విజయం సాధిస్తుందని తాజా సర్వేలో తేలింది. ‘యుగవ్’ చేసిన ప్రీ ఎలక్షన్ సర్వేలో 52% మంది యూకేలో భాగంగానే ఉండాలని, 48% మంది స్వతంత్రదేశంగా ఉండాలని స్పష్టం చేశారు. -
స్కాట్లాండ్లో నేడే ప్రజాభిప్రాయ సేకరణ
-
విడిగానా?.. కలివిడిగానా?
స్కాట్లాండ్లో నేడే ప్రజాభిప్రాయ సేకరణ యునెటైడ్ కింగ్డమ్లో కొనసాగడమా? స్వాతంత్య్రమా? ఇరు వాదనలకు దాదాపు సమాన మద్ధతు కలిసుండాలని బ్రిటన్ హామీల వర్షం స్వాతంత్య్రానికి మొగ్గు చూపుతున్న స్కాట్లాండ్ యువత ఎడిన్బర్గ్: బ్రిటన్‌తో 307 ఏళ్ల అనుబంధాన్ని కొనసాగించడమా? లేక స్వతంత్ర దేశంగా తొలి అడుగులు వేయడమా?.. అని స్కాట్లాండ్ ప్రజలు నిర్ణయించుకునేది నేడే. యూరోప్.. ముఖ్యంగా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ దశ, దిశ తేలేది నేడే. కలిసుందామనే బ్రిటన్ నేతల భావోద్వేగ అభ్యర్థన ఫలిస్తుందా? లేక కలి‘విడి’గా ఉందామనే స్కాట్లాండ్ వాసుల ఆలోచన గెలుస్తుందా?..అని యావత్ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్కాట్లాండ్ రెఫరెండానికి ముహూర్తం ఈ రోజే. స్కాట్లాండ్ స్వాతంత్య్రాన్ని నిర్ణయించే ప్రజాభిప్రాయ సేకరణ గురువారం జరగనుంది. ఈ రెఫరెండంలో ‘స్కాట్లాండ్ స్వతంత్ర దేశంగా ఉండాలా?’ అన్న ఏకైక ప్రశ్నకు ‘ఉండాలి(యెస్)’.. లేదా ‘వద్దు(నో)’ అంటూ దాదాపు 43 లక్షల మంది స్కాట్లాండ్ పౌరులు ఏకవాక్య సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఈ రెఫరెండం ప్రచారం కూడా ‘ఎస్’ గ్రూప్, ‘నో’ గ్రూప్‌లుగా విడిపోయింది. 16 ఏళ్లు పైబడిన స్కాట్లాండ్ పౌరులకు ఈ రెఫరెండంలో పాల్గొనే అర్హత ఉంటుంది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. శుక్రవారం ఉదయం వరకు తుది ఫలితం ప్రకటిస్తామని చీఫ్ కౌంటింగ్ ఆఫీసర్ మేరీ పిట్కైత్లీ స్పష్టం చేశారు. లండన్ కాలమానం కన్నా భారత్ కాలమానం నాలుగున్నర గంటలు ముందుంటుందన్న విషయం గమనార్హం. అటో.. ఇటో.. ఎటైనా.. స్వల్ప మెజారిటీనే! మొదట్లో స్కాట్లాండ్ స్వాతంత్య్రానికి స్థానికుల నుంచి అంతగా మద్దతు లభించలేదు. దాంతో ఈ రెఫరెండాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ క్రమంగా స్వాతంత్య్రం వైపు స్కాట్లాండ్ ప్రజలు మొగ్గు చూపుతుండటం, ఒపీనియన్ పోల్స్‌లోనూ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఓట్ల తేడా చాలా తక్కువగా ఉండటంతో ఉత్కంఠ, ఆసక్తి పెరిగింది. ప్రమాదం శంకించిన బ్రిటన్ నేతలు స్కాట్లాండ్కు క్యూ కట్టారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరాన్ కూడా స్వయంగా వెళ్లి.. ‘కష్టపడి నిర్మించుకున్న జాతిని విచ్ఛిన్నం చేయొద్ద’ంటూ స్కాట్ ప్రజలను కన్నీళ్లతో అభ్యర్థించారు. ఈ క్రమంలో ‘ఎస్’, ‘నో’ గ్రూపుల మధ్య ప్రచారం కూడా ఊపందుకుంది. స్కాట్లాండ్ వ్యాప్తంగా ర్యాలీలతో, కరపత్రాలతో హోరెత్తించారు. బుధవారం పత్రికల్లో ప్రచురితమైన ఒపీనియన్ పోల్స్‌లో.. బ్రిటన్‌తో కలిసుండాలనే వాదనకు అత్యంత స్వల్ప మెజారిటీ(52%) లభించింది. ఈ పరిస్థితుల్లో ఇంకా ఎటూ నిర్ణయించుకోని ఓటర్ల నిర్ణయం తుది ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్కాట్లాండ్ స్వాతంత్య్రాన్ని ఆ దేశ యువత ఎక్కువగా కోరుకుంటున్నారు. స్కాట్ స్వాతంత్య్ర కాంక్షను బలంగా ముందుకు తీసుకెళ్లిన నేత అలెక్స్ సాల్మండ్ బుధవారం ఉదయం దేశ ప్రజలను ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ రాశారు. అందులో ‘బ్రిటన్‌తో 307 ఏళ్ల బంధం నుంచి విడిపోయే ఈ చరిత్రాత్మక అవకాశాన్ని వినియోగించుకోండి. శుక్రవారం కొత్తదేశంలో, కొత్త ఆకాంక్షలతో నిద్రలేవండి’ అని పిలుపునిచ్చారు. బ్రిటన్‌తో కలిసుంటేనే మెరుగైన భవిష్యత్తు ఉంటుందని స్వాతంత్య్రాన్ని వద్దనే గ్రూప్ వాదిస్తోంది. ‘నో’కు ఓటేస్తే పన్నులు, సంక్షేమ రంగం సహా పలు రంగాల్లో మరిన్ని అధికారాలు అప్పగిస్తామంటూ బ్రిటన్‌కు చెందిన 3 ముఖ్యమైన పార్టీలు స్కాట్లాండ్కు హామీ ఇచ్చాయి. కేమరాన్‌కు కష్టకాలం విడిపోవడానికే స్కాట్లాండ్ నిర్ణయించుకుంటే తక్షణ నష్టం బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరాన్కేనని విశ్లేషకులు భావిస్తున్నారు. స్కాట్లాండ్నుంచి ఎన్నికైన ఎంపీలు దూరమైతే ఆయన ప్రధాని పదవిని కూడా కోల్పోయే ప్రమాదముందంటున్నారు. అలాగే, ప్రతిపక్ష టోరీల డిమాండ్ ప్రకారం.. ఇంగ్లండ్ చట్టాలపై స్కాట్లాండ్ ఎంపీలకు ఓటింగ్ హక్కును నిరాకరిస్తే.. బడ్జెట్ ఆమోదం పొందడం కూడా కష్టమేనని వివరిస్తున్నారు. భారతీయుల ఓట్లు కీలకం అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తేడా స్వల్పంగా ఉండే అవకాశాలుండటంతో స్కాట్లాండ్లో స్థిరపడిన ఆసియన్లు, ముఖ్యంగా అక్కడి భారతీయుల ఓట్లు ఈ రెఫరెండంలో కీలకం కానున్నాయి. స్కాట్లాండ్ జనాభాలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇండియాలకు చెందినవారు 3% పైగా ఉన్నారు. అయితే, వారు కూడా రెండు వర్గాలుగా విడిపోవడం విశేషం. యువత స్వాతంత్య్రానికి మద్దతిస్తుండగా.. పాతతరం వారు, ముఖ్యంగా అక్కడ పలు వ్యాపారాల్లో ఉన్నవారు బ్రిటన్‌తో కలిసుండాలనే కోరుకుంటున్నారు. వారు భారత్- పాకిస్థాన్ విభజన నాటి కష్టాలను ప్రస్తావిస్తున్నారు. -
'మీరు చేసిన పనికి బ్రిటీషు పౌరుడు బలి'
సిరియాలో కిడ్నాప్ చేసిన ఇద్దరు అమెరికా జర్నలిస్టులను ఊచకోత కోసిన ఇస్లామిక్ ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. మరో అగ్రదేశం బ్రిటన్ కు సవాల్ విసిరారు. హెయిన్స్(44) అనే బ్రిటీషు సహాయ కార్యకర్త తల నరికి.. ఆ వీడియోను శనివారం రాత్రి ఇంటర్నెట్లో పెట్టారు. యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న ఈ వీడియో ఇంతకీ అసలైనదా కాదా అనే విషయం మాత్రం ఇంకా ఖరారు కాలేదు. స్కాట్లాండ్ లోని పెర్త్ ప్రాంతానికి చెందిన హెయిన్స్ ఇద్దరు పిల్లల తండ్రి. ఫ్రెంచ్ ఎయిడ్ ఏజెన్సీ తరపున పనిచేస్తున్న అతడిని గతేడాది కిడ్నాప్ చేశారు. తమకు వ్యతిరేకంగా ఇరాక్ లోని కుర్దీష్ పెష్‌మెగ్రా పోరాటదారులకు బ్రిటన్ ప్రధాని డెవిడ్ కామెరూన్ మాట ఇచ్చినందుకు హెయిన్స్ ను హతమారుస్తున్నట్టు వీడియోలో ఇస్లామిక్ ఉగ్రవాదులు వెల్లడించారు. కామెరూన్ చేసిన పనికి బ్రిటీషు పౌరుడు మూల్యం చెల్లించుకుంటున్నాడని అందులో పేర్కొన్నారు. -
ప్లీజ్.. విడిపోవద్దు!
స్కాట్లాండ్కు బ్రిటన్ పీఎం అభ్యర్థన లండన్: 307 ఏళ్ల తమ అనుబంధాన్ని విడగొట్టవద్దంటూ బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కేమరూన్ స్కాట్లాండ్ ప్రజలను అభ్యర్థించారు. యునెటైడ్ కింగ్డమ్(యూకే) నుంచి విడిపోవడానికి సంబంధించి ఈ నెల 18న స్కాట్లాండ్ లో ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. యూకే నుంచి విడిపోవడానికే స్కాట్లాండ్ ప్రజలు మొగ్గుచూపుతున్నారన్న వార్తల నేపథ్యంలో.. కేమరూన్ బుధవారం హుటాహుటిన స్కాట్లాండ్కు వెళ్లారు. ఇంగ్లండ్, స్కాట్లాండ్ల అనుబంధాన్ని విడగొట్టి.. యూకే కుటుంబా న్ని చీల్చొద్దని స్కాట్ ప్రజలను ఆయన అభ్యర్థించారు. ‘నా దేశాన్ని నా పార్టీ కన్నా ఎక్కువగా ప్రేమిస్తాను. మనమంతా కలిసి నిర్మించుకున్న యూకే విడిపోవడం నేను భరించలేను’ అని ఎడిన్‌బరోలో కేమరూన్ వ్యాఖ్యానించారు. లేబర్ పార్టీ నేత ఎద్ మిలిబండ్, ఉపప్రధాని నిక్ క్లెగ్ లు స్కాట్లాండ్ స్వాతంత్య్రానికి వ్యతిరేకంగా ఓటేయాలని అక్కడి ప్రజలను అభ్యర్థించారు. -
సంప్రదాయ కీర్తనలకు...పాశ్చాత్య పదనిసలు
సంగీతానికి భాషాభేదం లేదు... అయితే... నేటి యువతరం పాశ్చాత్య సంగీతాన్ని కోరుకుంటోంది...మరి వారికి సంప్రదాయ సంగీతంలోని తియ్యదనాన్ని అందించడం ఎలా... సంప్రదాయ సంగీతానికి కొత్త ఊపిరిపోయాలంటే, బాణీలో కొత్తదనం ఉండాలి... అందరి హృదయాలను దోచుకోవాలి... అందుకు ఫ్యూజన్ అనువైన మార్గం... భారతీయ సంప్రదాయ సంగీతాన్ని ఫ్యూజన్ డ్రీమ్స్ ద్వారా అందరికీ చేరువ చేస్తూ... సంప్రదాయ సంగీతంలో జాజ్, జానపదాలను కలిపి సామాన్యుడిని సైతం మెప్పిస్తున్న అచ్చతెలుగు అమ్మాయి జ్యోత్స్నా శ్రీకాంత్ ‘డిస్నీ సంగీత సింహం’గా పేరు పొందిన వయొలిన్ విద్వాంసుడు రాబర్ట్ అట్చిసన్, ఇంగ్లాండ్ ప్రధాని డేవిడ్ కామరాన్... వీరు నన్ను అభినందించడం నేను ఎప్పటికీ మరచిపోలేను. - జ్యోత్స్న లండన్‌లో స్థిరపడిన ఆమె, భారతీయ సంప్రదాయ సంగీతంతో పాటు, లండన్‌లోని రాయల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్‌లో వెస్ట్రన్ వయొలిన్ సంగీతంలో డిప్లమా చేశారు. వయొలిన్ మీద ఉండే ఆసక్తితో, ఆ వాద్యం మీదే సంగీతం నేర్చుకుని, అదే రంగంలో రాణిస్తున్నారు. అక్కడితో ఆగకుండా వివిధ పాశ్చాత్య సంప్రదాయ సంగీతాలను నేర్చుకుని, ప్రదర్శనలిచ్చారు. లండన్ ‘ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్’లో ఫెలోషిప్ పొందారు. బ్రిటిష్ పార్లమెంటులో బ్రిటిష్ ప్రధాని ఎదుట భారతీయ సంప్రదాయ సంగీతాన్ని వయొలిన్‌పై వినిపించారు జ్యోత్స్న. సంగీతంపై పలు వర్క్‌షాపులను నిర్వహించిన ఆమె గత సంవత్సరం లండన్‌లో జరిగిన ‘లండన్ ఇంటర్నేషనల్ ఆర్ట్స్’ ఫెస్టివల్‌కు ఆతిథ్యం ఇచ్చారు. నిజానికి, జ్యోత్స్న ఇంత ఎత్తుకు ఎదగడానికి చిన్న నాటే పునాది పడింది. తల్లి రత్న ఆమె తొలి గురువు. బాల్యం నుంచే సంగీతం నేర్చుకున్న జ్యోత్స్న ఆ తరువాత బెంగుళూరుకు చెందిన ఆర్ ఆర్ కేశవమూర్తి, విఎస్.నరసింహన్‌ల దగ్గర సంగీతాభ్యాసం చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా దగ్గర కూడా కొంతకాలం విద్య నేర్చారు. తొమ్మిదో ఏట తొలి సంగీత ప్రదర్శన ఇచ్చారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఈ కళాకారిణి ఇప్పటివరకు ఎనిమిది అంతర్జాతీయ ఆల్బమ్స్ విడుదల చేశారు. అంతేకాదు...దాదాపు 200 సినిమాలకు వయొలిన్ సహకారం అందజేశారు. ఇందులో ఇళయరాజా, హంసలేఖలతో పాటు బాలీవుడ్ సంగీత దర్శకుల చిత్రాలూ ఉన్నాయి. బ్రిటన్ లోని ఓమాడ్, వేల్స్లో జరిగిన రెడ్ వయొలిన్ ఫెస్టివల్, బీబీసీలతో పాటు చెన్నై మ్యూజిక్ అకాడమీలో జరిగే సంగీతోత్సవాల్లోనూ ఆమె వాయులీనం రాగాల పరిమళాలు వెదజల్లింది. బాలమురళీకృష్ణ, సుధా రఘునాథన్ వంటి దిగ్దంతులతో జుగల్బందీ చేశారు. ‘‘భారతీయ సంగీతాన్ని ప్రపంచదేశాల్లో విస్తరింపచేయాలనేది నా ధ్యేయం. అందులో భాగంగానే లండన్‌లో ‘ధ్రువ్ ఆర్ట్స్’ సంస్థ స్థాపించా. ఇందులో బ్యాచ్‌కు 70 మంది చొప్పున విద్యార్థులకు కర్ణాటక సంగీతం నేర్పిస్తాం. ఏ సంగీతోత్సవంలో పాల్గొన్నా. భారతీయ సంప్రదాయ సంగీతానికే ప్రాధాన్యమిస్తా’’ అంటారు జ్యోత్స్న. ‘‘సంగీతాన్ని సంప్రదాయంగా ఆలపిస్తే వినేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపడం లేదు. వారిలో ఉత్సాహం నింపేందుకు మన సంప్రదాయ రాగాలను ప్యూజన్లో మిళితం చేయాలని నిర్ణయించుకున్నాను. అందులో భాగంగా అన్నమయ్య కృతిని పాప్ మ్యూజిక్‌లో ప్రదర్శిస్తున్నాను. అయితే ఈ పద్ధతికి విద్వాంసుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. వారి విమర్శలు సహేతుకమైనవే. అయితే సంగీతాన్ని అందరికీ చేరువ చేయడం కోసమే నా యీ తపన. ఇందుకోసం ‘కర్ణాటక సింఫనీ’అనే విధానాన్ని రూపొందించాలనుకుంటున్నాను. భారతీయ సంప్రదాయ వయొలిన్‌ను వెస్ట్రన్ సింఫనీకి చెందిన వంద సంగీత వాద్యాలతో కలిపి, ప్రదర్శన ఇవ్వాలన్నది నా లక్ష్యం’’ అని చెప్పుకొచ్చారు జ్యోత్స్న. ఆమె చేపట్టిన ఈ వినూత్న ప్రయత్నం ఫలవంతం కావాలని కోరుకుందాం. - సి.బి. మోహన్‌రావు, బ్యూరో చీఫ్, నెల్లూరు -
బ్రిటన్ ట్రెజరీ మంత్రిగా ప్రీతి పటేల్
లండన్: బ్రిటన్ ట్రెజరీ మంత్రిగా భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ నియమితులయ్యారు. బుధవారంనాటి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ ప్రీతి పటేల్‌ను ట్రెజరీ మంత్రిగా నియమించారు. 42 ఏళ్ల ప్రీతి ప్రస్తుతం విధమ్ నుంచి కన్సర్వేటివ్ పార్టీ ఎంపీగా ఉన్నారు. ఆమె భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి పెద్ద అభిమాని. 2010లో తొలిసారి పార్లమెంటుకు ఎంపికైన ప్రీతికి ఇదే మొట్టమొదటి ప్రభుత్వ పదవి. లండన్‌లో జన్మించిన ప్రీతి కన్సర్వేటివ్ పార్టీ నుంచి ఎన్నికైన మొదటి ఆసియా మహిళా ఎంపీ. ఆమె తల్లిదండ్రులు నోర్ఫోల్క్లో గ్రామీణ పోస్టాఫీసును నిర్వహిస్తున్నారు. కీలే యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పొందిన ఆమె పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యురాలిగా ఉన్నారు. గత నెలలో భారత్‌లో పర్యటించిన బ్రిటన్ అత్యున్నత స్థాయి కమిటీలో ఆమె సభ్యురాలు. ఈ సందర్భంగా ఆమె మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇండో-బ్రిటన్ సంబంధాలు మరింత మెరుగుపడాలని ఆమె ఆకాంక్షించారు. ఓ బ్రిటన్ పత్రికకు రాసిన వ్యాసంలో దేశాన్ని సంస్కరణల బాటలో నడపాలని భావిస్తున్న మోడీకి అంతా మంచే జరగాలని, మోడీ తమకు మంచి మిత్రుడని, ఆయనకు అన్ని విధాలా సహకారం అందిస్తామని చెప్పారు. -
ఆకాశమెత్తు ఆదర్శం అవసరం
బైలైన్ ఎం.జె.అక్బర్, సీనియర్ సంపాదకులు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ఏ సిగ్గూలేని నయవంచకుడా లేక మరో మితవాద రాజకీయవేత్త మాత్రమేనా? లండన్‌లోని సుప్రసిద్ధమైన ‘10 డ్రౌనింగ్ స్ట్రీట్’ విలాసంలో కెమెరాల ముందు నిలిచి ఆయన మండేలాకు అర్ఫించిన నివాళి ఘనమైనదే. కానీ ఆయన ఒక విషయం చెప్పడం మరచారు. విశ్వవిద్యాలయ విద్యార్థిగా ఉండగా ఆయన గది గోడకు ‘మండేలాను ఉరి తీయండి’ అనే పోస్టరు ఉండేది. కామెరాన్, ఆయన మితవాద టోరీ సహచర బృందాలు మార్గరేట్ థాచర్‌ను ఆరాధించేవారు. దక్షిణాఫ్రికాలోని జాత్యహం కార వ్యవస్థను, దాని జాతి దురహంకార క్రూరత్వాన్ని ఇక ఏవిధంగానూ సమర్థించజాలమనీ, ఆ పాశవిక దురన్యాయాన్ని సమర్థిస్తూ కూడా తాము అత్యుత్తమ నాగరికతకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని ప్రజాస్వామిక దేశాలు చెప్పుకోడం కుదరదనీ అమెరికాతో పాటు అత్యధికభాగం పాశ్చాత్య దేశాలు బ్రిటన్ కంటే ముందే గుర్తించాయి. అయినా ఆ తర్వాత కూడా చాలా కాలంపాటు అవి అక్కడి జాత్యహంకార వ్యవస్థను నిలబెట్టే ఆసరా అయ్యాయి. అందుకు కారణం మార్గరేట్ థాచర్. బ్రిటన్ మితవాదం పెంచి పోషించిన చరిత్రకారులు దాని మితవాద భావజాల స్రవింతిలో భాగమే. వారు దక్షిణాఫ్రికాలోని జాత్యహంకార పాలనకు సమర్థకులుగా, చిట్టచివరి ప్రతిఘటనా కేంద్రంగా నిలి చారు. వలస పాలనా, దాని వివిధ దుష్ట రూపాలు ‘స్థానికుల’ మంచికేనని వారు చెప్పేవారు. తమ ఏలుబడిలోని దేశాల ప్రజలు... తమ చరిత్ర గతిలో ఐరోపా దేశాలు జోక్యం చేసుకోవడమనే ‘వరం పొందినవారు’ అని ప్రచారం చేసేవారు. దక్షిణాఫ్రికా జాత్యహంకార పాలన కంటే భారత్‌లోని బ్రిటిష్‌రాజ్ తక్కువ దుర్మార్గమైనదేనని ఒప్పుకోవాల్సిందే. అయితే అందుకు సరితూగేట్టుగా లక్షలాది మంది భారతీయులు కరువు కాటకాలలో రాలిపోవడాన్ని, చైనీ యులు నల్లమందు బానిసలు కావడాన్ని చెప్పుకోవచ్చు. దక్షిణాఫ్రికాలోని అత్యంత బీభత్సకరమైన, జుగుప్సాకరమైన పరిస్థితుల నుంచే 20వ శతాబ్దపు ముగ్గురు అతి గొప్ప దార్శనికులు... గాంధీ, మండేలా, లూథర్కింగ్లు ఆవిర్భవించడం పూర్తిగా సమంజసం. వారిలో ఒకరైన మార్టిన్ లూథర్‌కింగ్ అమెరికాలో సుదీర్ఘంగా కమ్ముకున్న బానిసత్వపు నీలినీడల నుం చి వచ్చినవారు. మండేలా లేదా గాంధీలోని అద్భుత మేధో ప్రతిభ కు ప్రేరణను కలిగించినది బహుశా వారనుభవించిన అత్యథమస్థాయి అవమానమే కావొ చ్చు. ప్రతీకారం ప్రత్యామ్నాయం కాజాలదని అర్థం కావాలంటే నరకాన్ని అనుభవించి ఉండాలి. ప్రతీకారం మరో నరకాన్ని సృష్టించడం మాత్రమే చేస్తుంది. కాకపోతే దాని అధికార వ్యవస్థ భిన్నమైనదై ఉంటుంది. గాంధీ తరచుగా చెబుతుండినట్టు కంటికి కన్ను తీసుకోవడమే జరిగితే త్వరలోనే ప్రపంచమంతటా అంధులే మిగులుతారు. మండేలా లేదా గాంధీలు సవాలు చేసిన వ్యవస్థలు ఆనాటి విజ్ఞతను బట్టి శతాబ్దాల పాటు మనగలిగినవి. ఆ వ్యవస్థలను సవాలు చేసిన వారిద్దరూ వాటిపట్ల ఎంతగా ఆగ్రహం చెందారనేదాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. అయితే పీడన మర్మం యజమాని బలంలో కంటే బానిస బలహీనతలోనే ఎక్కువగా ఉన్నద ని వారు అర్థం చేసుకున్నారు. వారు విసిరిన సవాలు కూడా దానికి అనుగుణమైనదే. తమ దేశాలను చెరబట్టిన నియంతృత్వాన్ని ధ్వంసించడానికి ముందు వారు ప్రజలను భయం నుంచి విముక్తులను చేయాల్సివ చ్చింది. వారిరువురి జీవితాలు, ఆదర్శప్రాయమైన ధైర్యసాహసాలు, అసమాన త్యాగాలు... నిస్సహాయమైన, నిరాశమయమైన పలు తరాలకు నిరంకుశత్వ విషవలయం నుంచి కాపాడే కరదీపికలయ్యాయి. ఒక ద్వీపం మీది చెరసాలలో 27 ఏళ్ల యవ్వన జీవితాన్ని కోల్పోయిన పిదప పదవీ స్వీకారం చేస్తూ మండేలా... పాశవికమైన బానిసత్వం దక్షిణాఫ్రికాలో తిరిగి మళ్లీ తలెత్తడం ఎన్నటికీ జరగదు గాక జరగదు, జరగదని అన్నారు, 1947లో గాంధీ భారతదేశపు సంకెళ్లను తెంచడంతోనే ‘ఆప్రికా, ఆసియా ఖండాల వలసీకరణ’ అనే బృహత్తర యూరోపియన్ సౌధం ఇసుక మేడలా కుప్పకూలిపోయింది. అయితే నిజంగా ఆశ్చర్యం గొలిపే విషయం ఒక్కటే. ఉన్మాదపుటానందంతో జారిస్టులను హతమార్చిన కమ్యూనిస్టులకు భిన్నంగా గాంధీ, మండేలాలు... అంతర్యుద్ధం లేదా మరేదైనా యుద్ధానికి బదులు అందరినీ కలుపుకుపోవడం ద్వారానే అత్యుత్తమ భవిత సాధ్యమని గ్రహించారు. గొప్ప వ్యక్తులను మన జీవితాలకు దూరం చేసి, ఊకదంపుడు పుస్తకాలలోని నిస్సారమైన వాక్యాలకు అతికించేయడం చాలా సులువైన పని. మనలాంటి సామాన్యులం గాంధీ, మండేలాలను అనుసరించలేం. గాంధీ అతి నిరాడంబరమైన ఆశ్రమ సంస్కృతిని ఎంచుకుంటే, మండేలా లొంగుబాటుతో జీవిత సౌఖ్యాలను తిరిగి అందుకోగలిగినా కాదని జైల్లో ఒంటరితనాన్నే ఎంచుకున్నారు. అలాంటి బాధలను అనుభవించగలిగిన వ్యక్తిత్వం మనకు లేదు. గాంధీ తన ఆత్మకథలో బహిర్గతం చేసినట్టుగా మనలో దాగివున్న బలహీనతను, దుర్బలతను, పరస్పర విరుద్ధతల అంతర్గత కల్లోలాన్ని వెల్లడి చే సే మనోస్థైర్యం మనకు లేదు. కానీ అసాధారణమైన కారుణ్య తాత్విక చింతన నుంచి మనం కొంత నేర్చుకోగలం. గాంధీ, మండేలా తమ లోలోతుల్లోని విశ్వాసానికి శిష్యులు. అందుకే రెండో చెంపను చూపారు... అది కూడా తాము క్రైస్తవులమని చెప్పుకోడానికి సైతం వెరవని దుస్సాహసికులైన క్రూర శత్రువులకు చూపారు. ఈ ప్రపంచం సాత్వికులదేనని వారు విశ్వసించారు. వారు తమ పొగుగువారిని వారెవరో వారిగానే ప్రేమించారు, ప్రత్యేకించి తాము హిందువులుకాగా పొరుగువారు ముస్లింలైనప్పుడు లేదా తాము నల్లవారుకాగా పొరుగువారు తెల్లవారైనప్పుడు వారు అదే ప్రేమను చూపగలిగారు. వారు లోపరిహ తులైన పరిపూర్ణ మూర్తులేమీ కారు. అలాంటి అర్థరహితమైన విషయాలను వారివద్ద ప్రస్తావిస్తే నవ్వేసేవారు. నిజమైన హీరోలకు భజనపరుల అవసరం లేదు. చిల్లర మల్లర సాహసికులే పొగడ్తలను కోరుకుం టారు. వారు పుణ్యపురుషులు కారు. ఆదర్శప్రాయమైనది ప్రతిదీ ఆచరణ సాధ్యమైనదే అవుతుందని విశ్వసించేటంతటి అమాయకులు కారు. వారు తాము పనిచేసిన కాలం నాటి రాజకీయ వాతావరణంలో పలువురితో కలిసి పనిచేసారు, కాపాడారు, వారు వృద్ధి చెందడానికి తోడ్పడ్డారు. అలాంటి వారిలో కూడా అహంకారం, భజనపరత్వం చెల్లాచెదురుగా పడి ఉండేవి. అయినా వారు వారిని ఇముడ్చుకోడానికి ప్రయత్నించారు. అయితే ఆదర్శవాదం కనుచూపు మేరలో కనిపిస్తూ ఉండకపోతే ఏ సమాజంలోనైనా లేదా ఏ దేశంలోనైనా రాజకీయాలు బయటపడలేని చిట్టడవిలో చిక్కుకుపోతాయని, త్వరత్వరగా దుర్గంధభరితమైన మస్తిష్కపు జైలుగా దిగజారిపోతాయని వారు గుర్తించారు. వారిరువురూ దేవుణ్ణి విశ్వసించారు. ఇహలోకంలో వారిద్దరూ కలుసుకునే అవకాశం చిక్కలేదు. బహుశా వారి అంతరాత్మలు స్వర్గంలో కలుసుకుంటాయనుకుంటాను. వాళ్లు కిందకు చూసినప్పుడు తమ వారసులను, వారి పెడదోవలను, అవినీతిని చూసి సంతుష్టి చెందలేరు. కానీ వారిద్దరూ కామెరాన్ హృదయపూర్వకంగా అర్పించిన నిజాయితీతో కూడిన నివాళులకు సంతోషిస్తారని కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆ నివాళి వారి అంతిమ విజయానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అర్ధనగ్న ఫకీరు, నల్ల యువకుడు శాంతిని విశ్వసించినందు వల్లనే సుదీర్ఘ యుద్ధంలో విజయం సాధించగలిగారని విన్స్టన్ చర్చిల్, మార్గరెట్ థాచర్‌ల వారసునికి తెలుసు. -
జాఫ్నాలో బ్రిటన్ ప్రధానిని చుట్టుముట్టిన తమిళులు
శ్రీలంకలో పర్యటిస్తున్న బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ కు చేదు అనుభవం ఎదురైంది. జాఫ్పాలో వేలాది మంది తమిళ నిరసనకారులు కామెరాన్ కాన్వాయ్ ను చుట్టుముట్టారు. యుద్దంలో దెబ్బతిన్న ఉత్తర ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్లుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీలంక సేనలతో జరిగిన యుద్ధంలో తప్పిపోయిన తమ కుటుంబ సభ్యుల ఫోటోలను బ్రిటన్ ప్రధానికి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. సివిల్ వార్ సందర్భంగా తమ కుటుంబాలకు చెందిన సభ్యులు కనిపించకుండా పోయారని కామెరాన్ దృష్టి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. శ్రీలంకలో జరుగుతున్న కామన్ వెల్త్ శిఖరాగ్ర సభలో పాల్గొనేందుకు కామెరాన్ కొలొంబోకు చేరుకున్నారు. జాఫ్నా ప్రాంత తొలి తమిళ ముఖ్యమంత్రి, మాజీ న్యాయమూర్తి సీవీ విఘ్నేశ్వరన్ ను కలుసుకోవడానికి కామెరాన్ వెళుతుండగా ఘటన సంభవించింది. గత 25 ఏళ్లుగా జరుగుతున్న సివిల్ వార్ 2009లో ముగిసింది. -
ద్వైపాక్షిక సంబంధాలకు ప్రాధాన్యం: డేవిడ్ కామెరాన్
మన్మోహన్‌తో బ్రిటన్ ప్రధాని కామెరాన్ భేటీ బ్రిటన్ రావాలనుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్యపై పరిమితి లేదని వెల్లడి న్యూఢిల్లీ: భారత్, బ్రిటన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పరిధిని మరింత విసృ్తతపర్చాల్సిన అవసరం ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ పేర్కొన్నారు. రెండు దేశాలు కలిసి పనిచేస్తే ఉగ్రవాదం లాంటి సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవచ్చన్నారు. పలు అంతర్జాతీయ, ప్రాంతీయ, ద్వైపాక్షిక అంశాలపై గురువారం ఆయన భారత ప్రధానమంత్రి మన్మో హన్‌సింగ్‌తో చర్చలు జరిపారు. 2010 నుంచి రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల రంగంలో జరిగిన అసాధారణ అభివృద్ధిపై వారిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. బెంగళూరు- ముంబై ఆర్థిక కారిడార్, భారత్- యూరోపియన్ యూనియన్ల మధ్య జరిగిన విసృ్తత వాణిజ్య, పెట్టుబడుల ఒప్పందం, అఫ్ఘానిస్తాన్‌లో పరిస్థితి మొదలైన అంశాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి. చోగమ్ సదస్సులో పాల్గొనేందుకు శ్రీలంక వెళ్తూ.. కామెరాన్ భారత్‌లో ఒకరోజు పర్యటన జరిపారు. చోగమ్ సదస్సుకు భారత ప్రధాని హాజరుకాకపోవడంపై కామెరాన్ స్పందిస్తూ.. ‘భారత్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. ఇండియా, కెనడా, బ్రిటన్.. మేమంతా తమిళ సమస్య పరిష్కారానికి శ్రీలంక ప్రభుత్వం మరింత కృషి చేయాల్సి ఉందనే భావిస్తున్నాం’ అన్నారు. గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ సహా ఎన్నికైన నేతలెవరితో అయినా సమావేశమయ్యేందుకు తాను సిద్ధమేనని కామెరాన్ అన్నారు. ఐఐఎం కోల్‌కతా విద్యార్థులతో మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందేనన్నారు. భారతీయ విద్యార్థులందరికీ స్వాగతం: బ్రిటన్‌లో చదవాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు కేమరాన్ శుభవార్త తెలిపారు. తమ దేశంలో చదవాలనుకునే భారతీయ విద్యార్థుల సంఖ్యకు ఎలాంటి పరిమితి లేదని భారతీయ వ్యాపారవేత్తలతో జరిపిన మర్యాదపూర్వక భేటీలో వెల్లడించారు. అయితే వారు బ్రిటిష్ విశ్వవిద్యాలయాల్లో వాస్తవంగా అడ్మిషన్ పొందిన విద్యార్థులు అయి ఉండాలన్నారు. అలాగే వారు బ్రిటన్ వలస నిబంధనలను జాగ్రత్తగా పాటించాలని సూచించారు. వేరే ఉద్యోగాల్లో చేరకుండా, గ్రాడ్యుయేట్ ఉద్యోగాలపైనే దృష్టి పెట్టాలన్నారు. ‘రెండు విషయాలను స్పష్టం చేస్తున్నాను. ఒకటి.. భారత్ నుంచి బ్రిటన్ వచ్చి చదువుకోవాలనుకునే విద్యార్థుల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు. రెండు.. అక్కడి యూనివర్సిటీలో డిగ్రీ పూర్తయిన తరువాత బ్రిటన్‌లో ఉద్యోగం చేయాలనుకుంటున్న వారి సంఖ్యపై కూడా ఎలాంటి పరిమితి లేదు’ అని కేమరాన్ వివరించారు. గత పదేళ్లలో వలస నిబంధనలపై అంతగా దృష్టి పెట్టలేదని, ఆ కాలంలో 20 లక్షల మంది బ్రిటన్‌కు వచ్చారని, భౌగోళికంగా చిన్నదేశమైన తమకు అది భారమేనన్నారు. -
దీపావళి వేళ.. బ్రిటన్ ప్రధాని దంపతుల పూజలు
దీపావళి పండగను పురస్కరించుకుని సోమవారం లండన్ లోని స్వామినారాయణ్ ఆలయంలో అభిషేకం చేస్తున్న బ్రిటన్ ప్రధానమంత్రి కామెరన్ దంపతులు. దీపావళి సందర్భంగా లండన్ లోని స్వామినారాయణ్ ఆలయంలో పూజ కార్యక్రమంలో పాల్గొన్న బ్రిటన్ ప్రధానమంత్రి సతీమణి సమంత కామెరన్. దీపావళి పండగను పురస్కరించుకుని సోమవారం లండన్ లోని స్వామినారాయణ్ ఆలయంలో అభిషేకం చేసి, మాట్లాడుతున్న బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరన్. లండన్ లోని స్వామినారాయణ్ ఆలయంలో దీపావళి పండగ సందర్భంగా పూజ కార్యక్రమంలో పాల్గొన్న బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరన్. దీపావళి పండగను పురస్కరించుకుని సోమవారం లండన్ లోని స్వామినారాయణ్ ఆలయానికి విచ్చేసిన బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరన్, సమంత కామెరన్. లండన్ లోని స్వామినారాయణ్ ఆలయంలో అభిషేకం చేసి, మాట్లాడుతున్న బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరన్. లండన్ లోని స్వామినారాయణ్ ఆలయంలో దీపావళి పండగ సందర్భంగా భారతీయ సంప్రదాయ దుస్తులతో దర్శనమిచ్చిన బ్రిటన్ ప్రధానమంత్రి సతీమణి సమంత కామెరన్. స్వామినారాయణ్ ఆలయంలో పూజలు చేస్తున్న బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరన్. భారతీయ సంతతికి చెందిన బాలికలతో బ్రిటన్ ప్రధాని సతీమణి సమంత కామెరన్. దీపావళి పండగ సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్న బ్రిటన్ ప్రధానమంత్రి లండన్ లోని స్వామినారాయణ్ ఆలయంలో భారతీయ సంప్రధాయ దుస్తులతో దర్శనమిచ్చిన బ్రిటన్ ప్రధానమంత్రి సతీమణి సమంత కామెరన్, రీనా అమీన్ దీపావళి పండగను పురస్కరించుకుని సోమవారం లండన్ లోని స్వామినారాయణ్ ఆలయానికి విచ్చేసిన బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరన్. -
శిరచ్ఛేదం వీడియోలకు ‘ఫేస్బుక్’ అనుమతి
లండన్: ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ ‘ఫేస్బుక్’ శిరచ్ఛేదం వీడియోలు సహా ఒళ్లు గగుర్పొడిచే వీడియోలను పోస్టు చేసేందుకు తిరిగి అనుమతించడం దుమారం రేపింది. మానవ హక్కుల ఉల్లంఘన, ఉగ్రవాద దాడులు, హింసాత్మక సంఘటనలను తమ యూజర్లు ఖండించేందుకు వీలుగానే ఇటువంటి వీడియోలను పోస్టు చేసేందుకు లేదా షేరింగ్ చేసేందుకు అనుమతించినట్లు ఫేస్బుక్ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ నిర్ణయాన్ని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ బాధ్యతారాహిత్యమైనదిగా అభివర్ణించారు.