అధికారపీఠం కోసం హోరా హోరీ పోరు
లండన్: బ్రిటన్ అధికారపీఠం కోసం హోరా హోరీ పోరు కొనసాగుతోంది. ప్రధాన పార్టీల మధ్య పోటీ గట్టిగా ఉంది. నువ్వా.. నేనా అన్నట్లుగా జరిగిన బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తన స్థానాలను నిలబెట్టుకుంటోంది. ప్రధాని డేవిడ్ కామెరాన్ మరో సారి ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నారు. అధికార పార్టీ 218 సీట్లను గెల్చుకుంటే.. ప్రధాన ప్రతిపక్షం 200 సీట్లు సాధించింది. అయితే తుది ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఇక ఫలితాలపై కామెరాన్ ట్విట్ చేశారు. 'ఒకే జాతి.. ఒకే రాజ్యం...మరోసారి దేశప్రధానిగా ఎన్నికయితే.. ప్రజలకు సేవచేసే అవకాశం దొరకడం నా అదృష్టం' అంటూ ఆయన ట్విట్ చేశారు. ముందుంది మంచి కాలం అన్నారు.
మరోవైపు ప్రతిపక్ష నేత, లేబర్ పార్టీ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎడ్ మిలిబాండ్, లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నేత నిక్‌క్లెగ్, యునైటెడ్ కింగ్‌డమ్ ఇండిపెండెన్స్ పార్టీ నికెల్ ఫరాగ్, స్కాటిష్ నేషనల్ పార్టీ అధిపతి నికోలా స్టర్జన్ తదితరులు విజయాన్ని సాధించినవారిలో ఉన్నారు.
ఆరు లక్షలకు పైగా భారతీయ ఓటర్లు ఈ ఎన్నికల్లో నిర్ణాయశ శక్తిగా మిగలడం విశేషం. ఫలితాలను రాణి ఎలిజబెత్ అధికారికంగా ప్రకటించిన అనంతరం ఈ నెల 27న ఆమె ప్రసంగంతో కొత్త పార్లమెంటు కొలువుదీరనుందని సమాచారం.