బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల పోలింగ్ మొదలైంది. 5కోట్ల మంది ప్రజలు సుమారు 50 వేల పోలింగ్ స్టేషన్లలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్టు సమాచారం.
లండన్ : బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల పోలింగ్ మొదలైంది. 5కోట్ల మంది ప్రజలు సుమారు 50 వేల పోలింగ్ స్టేషన్లలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్టు సమాచారం. పార్లమెంటు ఎన్నికలతో పాటు 9వేల కౌన్సిల్ సీట్లకు, స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. కోప్లాండ్, టోర్బే, బెడ్ఫోర్డ్ లీసెస్టర్ తదితర నగరాల మేయర్ల భవితవ్యం కూడా ఈ ఎన్నికల్లో తేలిపోనుంది. ఈ అర్థరాత్రివరకు ఫలితాలపై ఒక అంచనా రావచ్చని తెలుస్తోంది.