Voting begins
-
తొలి పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి సారి జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు పోలీంగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మూడు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో సోమవారం తొలి విడత పోలింగ్ జరుగుతుంది. మిగతా రెండు విడతల పోలింగ్ ఈనెల 25, 30 తేదీల్లో జరగనుంది. మొదటిదశలో మొత్తం 4479 గ్రామ పంచాయతీలకు పోలింగ్ ఉంది. అయితే, అందులో 769 పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోర్టు కేసుల కారణంగా 9 పంచాయతీల్లో ఎన్నికలు జరగటం లేదు. మరోవైపు వార్డు సభ్యుల పరంగా కూడా మొత్తం 39,822 వార్డులకు ఎన్నికలు జరగాలి. అందులో కోర్టు కేసులు, రిజర్వేషన్ల వివాదంతో 192 వార్డుల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 10,654 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 28,976 వార్డులకు 70,094 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మొదట వార్డు సభ్యులకు వచ్చిన ఓట్లు, ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు లెక్కిస్తారు. పోలింగ్ విధుల్లో 1,48,033 మంది సిబ్బందిని నియమించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. 26వేల మంది పోలీసులతో బందోబస్తు చేపట్టింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేసే వారికి మధ్య వేలి మీద సిరా గుర్తు వేయనున్నారు. -
బ్రిటన్‌లో మొదలైన పోలింగ్
లండన్ : బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల పోలింగ్ మొదలైంది. 5కోట్ల మంది ప్రజలు సుమారు 50 వేల పోలింగ్ స్టేషన్లలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్టు సమాచారం. పార్లమెంటు ఎన్నికలతో పాటు 9వేల కౌన్సిల్ సీట్లకు, స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. కోప్లాండ్, టోర్బే, బెడ్ఫోర్డ్ లీసెస్టర్ తదితర నగరాల మేయర్ల భవితవ్యం కూడా ఈ ఎన్నికల్లో తేలిపోనుంది. ఈ అర్థరాత్రివరకు ఫలితాలపై ఒక అంచనా రావచ్చని తెలుస్తోంది. -
జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్‌లలో తుది దశ పోలింగ్
జమ్మూ కాశ్మీర్/ జార్ఖండ్: జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీకి అయిదవ, తుది దశ పోలింగ్ ప్రక్రియ శనివారం ఉదయం ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్: తుది దశలో 20 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల బరిలో మొత్తం 213 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి తారాచంద్తోపాటు మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాశ్మీర్ లోయలో ఇంతకుముందు జరిగిన నాలుగు దశల ఎన్నికల్లో భారీ ఓటింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. జమ్మూ, కుధువా, రాజౌరీ జిల్లాలో నేడు జరిగే పోలింగ్‌లో భారీ ఓటింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. సాధారణ పోలీసులతోపాటు 400 కంపెనీల భద్రత సిబ్బందిని మోహరించారు. భారత్, పాక్ సరిహద్దు వెంబడి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జార్ఖండ్: తుది దశలో ఆరు జిల్లాలోని మొత్తం 16 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల బరిలో మొత్తం 208 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ... డుమ్కా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. అలాగే అసెంబ్లీ స్పీకర్‌తోపాటు మరో మంత్రి కూడా ఈ ఎన్నికల బరిలో నిలబడి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ రెండు రాష్ట్రాలలో అయిదు విడతలుగా జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 23వ తేదీన లెక్కిస్తారు. -
కాశ్మీర్, జార్ఖండ్‌ల్లో మూడో దశ ఎన్నికలు ప్రారంభం
జమ్మూకాశ్మీర్/ జార్ఖండ్: జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల శాసనసభకు మూడో విడత పోలింగ్ మంగళవారం ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో సీఎం ఒమర్ అబ్దుల్లాతోపాటు ముగ్గురు కేబినెట్ మంత్రులు బరిలో ఉన్నారు. బద్గామ్, పుల్వామా, బారాముల్లా జిల్లాల్లోని 16 స్థానాలకు సంబంధించిన పోలీంగ్ కేంద్రాల వద్ద ఓట్లు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్లో మూడో దశ ఎన్నికల్లో మొత్తం 144 మంది అభ్యర్థులు బరిలో నిలిచి... తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాశ్మీర్‌లోయలో శుక్రవారం ఉగ్రవాదులు దాడితో 21 మంది మృతి చెందిన నేపథ్యంలో ఎన్నికల జరిగే ప్రాంతాలలో భారీగా భద్రత బలగాలను మోహరించారు. సీఎం ఒమర్ అబుల్లా గందర్ బాల్‌తోపాటు బీర్ వా స్థానం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. అలాగే జార్ఖండ్‌లో మూడో దశ ఎన్నికల్లో 17 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దశలో మొత్తం 289 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో 103 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీతోపాటు ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ఎన్నికల బరిలో నిలిచారు. -
జమ్మూ, జార్ఖండ్‌లో రెండో విడత పోలింగ్
జమ్మూ కాశ్మీర్/ జార్ఖండ్: జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీకి రెండు విడత పోలింగ్ ప్రక్రియ మంగళవారం ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ ఉదయం 8.00 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.00 గంటలకు ముగియనుంది. జమ్మూ కాశ్మీర్: రెండో దశలో 18 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల బరిలో 175 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో నలుగురు మంత్రులు, ఉప సభాపతి, 11 మంది ప్రస్తుత శాసనసభ్యులు ఉన్నారు. వారంతా ఈ రోజు జరిగే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అలాగే ఈ ఎన్నికల 55 మంది కోటీశ్వరులు పోటి చేస్తున్నారని ఏడీఆర్ వెల్లడించింది. జార్ఖండ్: రెండో దశలో జార్ఖండ్‌లోని 20 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల బరిలో 223 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో మాజీ ముఖ్యమంత్రులు అర్జున్ ముండా, మధుకోడా ఉన్నారు. వారంతా ఈ రోజు జరిగే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే జంషెడ్పూర్ నగరంలోని పశ్చిమ, తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాలలో భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5.00 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.