జమ్మూ, జార్ఖండ్లో రెండో విడత పోలింగ్
జమ్మూ కాశ్మీర్/ జార్ఖండ్: జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీకి రెండు విడత పోలింగ్ ప్రక్రియ మంగళవారం ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ ఉదయం 8.00 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.00 గంటలకు ముగియనుంది.
జమ్మూ కాశ్మీర్: రెండో దశలో 18 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల బరిలో 175 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో నలుగురు మంత్రులు, ఉప సభాపతి, 11 మంది ప్రస్తుత శాసనసభ్యులు ఉన్నారు. వారంతా ఈ రోజు జరిగే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అలాగే ఈ ఎన్నికల 55 మంది కోటీశ్వరులు పోటి చేస్తున్నారని ఏడీఆర్ వెల్లడించింది.
జార్ఖండ్: రెండో దశలో జార్ఖండ్లోని 20 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల బరిలో 223 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో మాజీ ముఖ్యమంత్రులు అర్జున్ ముండా, మధుకోడా ఉన్నారు. వారంతా ఈ రోజు జరిగే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే జంషెడ్పూర్ నగరంలోని పశ్చిమ, తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాలలో భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5.00 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.