Second phase elections
-
Odisha Assembly Elections 2024: బీజేపీకి సవాల్
ఒడిశాలో రెండో విడత ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో 21 లోక్‌సభ స్థానాలుండగా నాలుగింటికి 13న పోలింగ్ ముగిసింది. ఈ నెల 20న రెండో విడతలో ఐదు లోక్‌సభ స్థానాలు, వాటి పరిధిలోని 35 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఐదు లోక్‌సభ స్థానాల్లో మూడు బీజేపీ సిట్టింగ్ సీట్లే కావడం విశేషం. ఆ పారీ్టకి గట్టి మద్దతున్న ఈ స్థానాల్లో అధికార బీజేడీ నుంచి సవాలు ఎదురవుతోంది... బోలంగీర్ రాష్ట్రమంతటా ఆసక్తి నెలకొన్న స్థానమిది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ, రాజ వంశీకురాలు సంగీతా సింగ్‌దేవ్ బరిలో ఉన్నారు. బీజేడీ గత అభ్యర్థి కల్కేశ్ నారాయణ్ సింగ్‌దేవ్ స్థానంలో సురేంద్ర సింగ్ భోయ్‌ని పోటీకి దింపింది. కాంగ్రెస్ నుంచి మనోజ్ మిశ్రా పోటీలో ఉన్నారు. ఇక్కడ సంగీత నాలుగుసార్లు గెలిచారు. ఆమె భర్త కనకవర్ధన్ సింగ్‌దేవ్ పాటా్నగఢ్–బోలంగీర్ మహరాజు రాజ్రాజ్ సింగ్‌దేవ్ కుమారుడు. ఒడిశా బీజేపీ చీఫ్‌గా, రాష్ట్ర మంత్రిగా కూడా చేశారు. కరువు బాధిత జిల్లా అయిన బోలంగీర్ నుంచి ఏటా 30 వేల మందికి పైగా ఉపాధి కోసం వలస పోతున్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో నాలుగు బీజేడీ చేతిలో ఉన్నాయి. కాంగ్రెస్ రెండు చోట్ల, బీజేపీ ఒక్క స్థానంలో గెలిచాయి.సుందర్‌గఢ్ ఒడిశాలో కీలక లోక్‌సభ స్థానాల్లో ఇదీ ఒకటి. ఇక్కడ బీజేపీదే హవా. గత రెండు ఎన్నికల్లో గెలిచిన బీజేపీ సిట్టింగ్ ఎంపీ జుయల్ ఓరం మళ్లీ బరిలో ఉన్నారు. 1998 నుంచి ఇక్కడ ఆయన ఐదుసార్లు గెలవడం విశేషం. 2009 ఎన్నికల్లో మాత్రం ఓరంపై కాంగ్రెస్ నేత హేమానంద బిశ్వాస్ విజయం సాధించారు. అధికార బీజేడీ ఇక్కడ ఖాతాయే తెరవలేదు! రాష్ట్రంలో ఆ పార్టీ ఇప్పటిదాకా నెగ్గని ఏకైక స్థానమిది. గత మూడుసార్లుగా అభ్యర్థులను మారుస్తున్నా ఫలితం దక్కడం లేదు. ఈసారి భారత హాకీ జట్టు మాజీ కెపె్టన్ దిలీప్ టిర్కీని బీజేడీ మరోసారి బరిలో దింపింది. 2014లో ఆయన 18 వేల ఓట్ల తేడాతో ఓడారు. ఈ గిరిజన ప్రాబల్య నియోజకవర్గంలో బీజేపీని ఓడించడం కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచ స్థాయి హాకీ స్టేడియం ఏర్పాటు, టిర్కీ ఆదరణ కలిసొచ్చి ఈసారి గట్టెక్కుతామని బీజేడీ భావిస్తోంది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ దెహూరీ పోటీ చేస్తున్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో మూడు బీజేపీ చేతిలో ఉన్నాయి. రెండింట బీజేడీ, కాంగ్రెస్, సీపీఎం చెరో చోట గెలిచాయి.కందమాల్ ఈ స్థానం బీజేడీ కంచుకోట. కందమాల్, బౌద్ జిల్లాలు మొత్తం దీని పరిధిలోకే వస్తాయి. బీజేడీ నుంచి సిట్టింగ్ ఎంపీ, ప్రముఖ విద్యావేత్త అచ్యుతానంద సామంత బరిలో ఉన్నారు. బీజేపీ ప్రతిసారీ కొత్త అభ్యరి్థని నిలుపుతున్నా నిరాశే ఎదురవుతోంది. ఈసారి సుకాంత కుమార్ పాణిగ్రాహికి టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి అమీర్‌చంద్ నాయక్ పోటీలో ఉన్నా పోటీ బీజేపీ, బీజేడీ మధ్యే ఉంది. సామంతకు విద్యా, దాతృత్వ కార్యక్రమాలు గట్టి దన్ను. కాగా తాగు, సాగునీటి సమస్య, రోడ్ల దుస్థితి తదితర అంశాలను పాణిగ్రాహి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఆయనకు మద్దతుగా ప్రధాని మోదీ ఇప్పటికే ప్రచారం చేశారు.బార్గఢ్ 2008 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఏర్పడిన ఈ స్థానంలో విజయం పారీ్టల చేతులు మారుతూ వస్తోంది. 2009లో కాంగ్రెస్ నేత సంయజ్ భోయ్ గెలవగా, 2014లో బీజేడీకి చెందిన డాక్టర్ ప్రవాస్ కుమార్ సింగ్ విజయం సాధించారు. 2019లో బీజేపీని విజయం వరించింది. బీజేడీ సీనియర్ నేత ప్రసన్న ఆచార్యను బీజేపీ నేత సురేశ్ పూజారి ఓడించారు. ఈసారి ఆయనకు బదులు ప్రదీప్ పురోహిత్‌కు బీజేపీ టికెటిచి్చంది. పూజారిని అసెంబ్లీ ఎన్నికల్లో మోహరించింది. బీజేడీ కూడా పరిణీత మిశ్రాకు అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి సంజయ్ భోయ్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేడీ ప్రభుత్వ వైఫల్యాలపై బలంగా గళం వినిపించే ప్రదీప్‌కు స్థానికంగా మంచి పేరుంది. మోదీ సర్కారు సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ఓటర్లకు దగ్గరవుతున్నారు.అస్కా బీజేడీకి కంచుకోట. సీఎం నవీన్ పటా్నయక్‌కు ప్రతిష్టాత్మక లోక్‌సభ స్థానం. ఆయన పోటీ చేస్తున్న హింజిలి అసెంబ్లీ స్థానం దీని పరిధిలోనే ఉంది. తండ్రి బిజూ పటా్నయక్ మరణానంతరం 1997 లోక్‌సభ ఉప ఎన్నికల్లో అస్కా నుంచే నవీన్ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1998, 1999 ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో ఉక్కు, గనుల శాఖ మంత్రిగా చేశారు. ఇక్కడ ఏ అభ్యర్థినీ రెండోసారి నవీన్ కొనసాగించకపోవడం గమనార్హం. బీజేడీ నుంచి 2019లో ప్రమీలా బిసోయ్ గెలిచారు. ఈసారి ఆమెను కాదని 33 ఏళ్ల రంజితా సాహుకు బీజేడీ టికెట్ దక్కింది. ఆమె వలస కారి్మకుల కోసం ‘కొడాల యూత్ ఫోరం’ అనే స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు. సామాన్యుల్లో ఆమెకున్న గుర్తింపు చూసే సీఎం టికెటిచ్చారు. బీజేపీ నుంచి మరోసారి అనితా శుభదర్శిని పోటీ చేస్తున్నారు. ఆమె తండ్రి రామకృష్ణ పటా్నయక్ మాజీ మంత్రి. బిజూ, నవీన్ పట్నాయక్‌లకు అత్యంత సన్నిహితుడు. గంజాం జిల్లాలో ఆయనకు మంచి పేరుంది.ముగ్గురిలో ఒకరిపై కేసు ఒడిశాలో రెండో విడతలో పోలింగ్ జరిగే ఐదు లోక్‌సభ స్థానాల్లో 40 మంది పోటీలో ఉన్నారు. వీరిలో 13 మంది కోటీశ్వరులే. సంగీతా కుమారి రూ.67.3 కోట్లతో జాబితాలో టాప్‌లో ఉన్నారు. 12 మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులున్నట్టు పేర్కొన్నారు. వీరిలో 8 మంది తీవ్ర నేరాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 21 మంది గ్రాడ్యుయేషన్, అంతకంటే ఉన్నత విద్యావంతులని ఏడీఆర్ సంస్థ ప్రకటించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓటు హక్కు వినియోగించుకున్న ద్రవిడ్, కుంబ్లే
దేశంలో ఇవాళ (ఏప్రిల్ 26) సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్ జరుగుతుంది. ఈ విడతలో మొత్తం 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కేరళలోని 20 స్థానాలకు, కర్ణాటకలో 14, రాజస్థాన్‌లో 13, ఉత్తర్‌ప్రదేశ్ 8, మహారాష్ట్ర 8, మధ్యప్రదేశ్ 7, అస్సాం 5, బీహార్ 5, పశ్చిమ బెంగాల్ 3, చత్తీస్ఘడ్ 3, జమ్మూ కశ్మీర్ 1, మణిపూర్ 1, త్రిపురలో ఒక లోక్‌సభ స్థానానికి ఇవాళ పోలింగ్ జరుగతుంది. #WATCH | Rahul Dravid casts his vote in Karnataka's Bengaluru.#LokSabhaElections2024 pic.twitter.com/gZ6Ybairc1— ANI (@ANI) April 26, 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇవాల్టి ఉదయం నుంది వివిధ రంగాలకు చెందిన చాలామంది ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్రీడారంగానికి సంబంధించి భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇవాళ ఉదయం బెంగళూరులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య, కొడుకుతో సహా పోలింగ్ కేంద్రం వద్దకు చేరిన ద్రవిడ్ అతి సాధారణ వ్యక్తిలా క్యూలో నిలబడి ఓటు వేశారు. #Vote #Indiaelections2024 #Karnataka #bengaluru pic.twitter.com/JDi9VYpIA6— Anil Kumble (@anilkumble1074) April 26, 2024 ఓటు వేసిన అనంతరం ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చాడు. ఓటు అనేది ప్రజాస్వామ్యం మనకు కల్పించిన హక్కు అని ద్రవిడ్ తెలిపాడు. ద్రవిడ్ సహచరుడు, టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే కూడా ఇవాళ బెంగళూరులో ఓటు వేశారు. ఓటు వినియోగించుకున్న విషయాన్ని కుంబ్లే సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. కుంబ్లే తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. -
Lok sabha elections 2024: నేడే రెండో దశ.. 13 రాష్ట్రాలో 88 స్థానాలకు ఎన్నికలు
-
Lok sabha elections 2024: కన్నడిగుల తొలి ఓటెవరికో!
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కర్నాటకలో 14 లోక్‌సభ స్థానాలకు శుక్రవారం రెండో విడతలో పోలింగ్ జరగనుంది. 2019లో రాష్ట్రంలో బీజేపీ క్లీన్‌స్వీప్ చేయగా ఈసారి బీజేపీ–జేడీ(ఎస్) కూటమితో కాంగ్రెస్ హోరాహోరీ తలపడుతోంది. జేడీ(ఎస్) పోటీ చేస్తున్న హసన్, మండ్య, కోలార్ స్థానాలకు రెండో విడతలోనే పోలింగ్ ముగియనుంది. ఆ పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జట్టు కట్టడం విశేషం! ఈసారి పలు స్థానాల్లో పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది... బెంగళూరు నార్త్బీజేపీ నేత సదానంద గౌడ 2014 నుంచీ ఇక్కడ గెలుస్తున్నారు. ఈసారి మాత్రం కేంద్ర సహాయ మంత్రి శోభ కరంద్లాజె పోటీ చేస్తున్నారు. ప్రముఖ విద్యావేత్త, కాంగ్రెస్ నేత ఎంవీ రాజీవ్గౌడను ఆమె ఢీకొడుతున్నారు. గౌడ బెంగళూరు ఐఐఎం ప్రొఫెసర్. ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సభ్యుడు. ఈ స్థానం 1999 దాకా కాంగ్రెస్ కంచుకోట. 2004 నుంచీ బీజేపీ జైత్రయాత్రే సాగుతోంది. దీనికి ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది.బెంగళూరు సౌత్1996 నుంచి ఈ స్థానం బీజేపీకి కంచుకోట. బీజేపీ దివంగత నేత అనంతకుమార్ ఇక్కడినుంచి ఏకంగా 28 ఏళ్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు! 2019 ఎన్నికల్లో యువ నేత తేజస్వి సూర్య బీజేపీ తరఫున 3.31 లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఈసారీ ఆయనకే బీజేపీ టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి రాష్ట్ర మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి బరిలో ఉన్నారు. ఈసారీ విజయం తనదేనని తేజస్వి ధీమాగా ఉన్నా పోరు హోరాహోరీగా సాగవచ్చంటున్నారు.హసన్మాజీ ప్రధాని దేవెగౌడ ఐదుసార్లు నెగ్గిన స్థానమిది. 2019లో మనవడు ప్రజ్వల్ రేవణ్ణను బరిలో దింపారు. బీజేపీ నేత ఎ.మంజుపై ఆయన 1.41 లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఈసారి కూడా జేడీ(ఎస్) నుంచి ప్రజ్వలే బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బలమైన నేతగా పేరున్న జి.పుట్టస్వామి గౌడ మనవడు శ్రేయస్ పటేల్ పోటీలో ఉన్నారు. ఒకప్పుడు దేవెగౌడ, పుట్టస్వామి పోటీకి వేదికైన హసన్ వారి మనవళ్ల పోరుకు కేంద్రంగా మారింది!కోలార్ఒకప్పుడు కాంగ్రెస్‌కు బలమైన పట్టున్న కోలార్‌లో ఈసారి గట్టి పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచి్చన హామీలు ఇక్కడ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత ఎస్.మునిస్వామి 2.1 లక్షల మెజారిటీతో కాంగ్రెస్ నేత కె.హెచ్.మునియప్పపై నెగ్గారు. ఈసారి పొత్తులో భాగంగా జేడీ(ఎస్) అభ్యర్థి ఎం.మల్లేశ్‌బాబు పోటీ చేస్తున్నారు. అంతర్గత విభేదాలు కూడా ఇక్కడ కాంగ్రెస్‌కు చేటు చేసేలా ఉన్నాయి. ఇక్కడ ఆరుసార్లు గెలిచిన మునియప్ప ఇటీవలి అసెంబ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. లోక్‌సభ టికెట్‌ను తన అల్లుడికి ఇప్పించుకునేందుకు ప్రయతి్నంచగా సొంత పార్టీ నేతలే మోకాలడ్డారు. సామాజిక వర్గాల ప్రభావం..రెండో దశలో భాగంగా ఎన్నికలు నిర్వహించే 14 స్థానాలకు గాను మెజారిటీ చోట్ల వొక్కళిగ సామాజిక వర్గం ఓటర్లు కీలకంగా వ్యవహరించనున్నారు. వీరు బీజేపీ వైపు మొగ్గు చూపిస్తుంటారు. వీరితోపాటు ఎస్సీ, ఎస్టీ ఓట్లపైనా బీజేపీ దృష్టి సారించింది. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ఓటర్లను ఆకర్షించడంపై కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి పెట్టింది.కరవు కోరలుకర్ణాటకలోని అధిక ప్రాంతాలు ప్రస్తుతం చరిత్రలోనే అతి తీవ్రమైన కరువును చూస్తున్నాయి. దాదాపు అధిక శాతం పట్టణాలను కరువు ప్రాంతాలుగా ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. కరువు కోరల్లోనే జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఐదు గ్యారంటీలతో నెగ్గుకొచి్చన కాంగ్రెస్‌కు.. లోక్‌సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఆ గ్యారంటీల ప్రభావం ఇప్పుడు అంతగా పనిచేయకపోవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. మండ్యవొక్కళిగ ఆధిపత్యమున్న స్థానమిది. గత ఎన్నికల్లో నటి సుమలత బీజేపీ మద్దతుతో 1.26 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామిని ఓడించారు. ఈ స్థానం పొత్తులో భాగంగా ఈసారి జేడీ(ఎస్)కు వెళ్లింది. కుమారస్వామే బరిలో ఉన్నారు. సుమలత బీజేపీలో చేరడం ఆయనకు మరింత కలిసి రానుంది. కాంగ్రెస్ నుంచి వెంకటరమణ గౌడ (స్టార్ చంద్రు) బరిలో ఉన్నారు. 2009, 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి జేడీ(ఎస్) విజయం సాధించడం కూడా కుమారస్వామికి కలిసొచ్చే అంశాల్లో ఒకటి.బెంగళూరు రూరల్2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్నాటకలో కాంగ్రెస్ గెలిచిన ఏకైక స్థానమిది. ఈసారి కూడా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తమ్ముడు, సిట్టింగ్ ఎంపీ డీకే సురేశ్ పోటీలో ఉన్నారు. ఇక్కడ 2009లో జేడీ(ఎస్) నేత కుమారస్వామి గెలిచారు. కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉండటంతో దేవెగౌడ అల్లుడు, ప్రముఖ వైద్యుడు సి.ఎన్.మంజునాథను బీజేపీ బరిలో దింపింది. ఇద్దరూ బలమైన అభ్యర్థులు కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. చారిత్రకంగా ఇక్కడ హస్తానిదే ఆధిపత్యం. ఆ పార్టీ ఏకంగా 13 సార్లు నెగ్గగా మూడుసార్లు జేడీ(ఎస్) గెలిచింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: బెంగళూరు సిటీ... రిజర్వుడ్!
నాలెడ్జ్ కేపిటల్. ఐటీ హబ్. దిగ్గజ శాస్త్ర సాంకేతిక సంస్థల నిలయం. కాస్మోపాలిటన్ సంస్కృతి. చెప్పుకుంటూ పోతే బెంగళూరు నగర ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ లెక్కలన్నింటినీ పక్కన పెట్టేస్తున్నారు నగర ఓటర్లు. అన్నిచోట్లా ఉన్నట్టే కులం, మతం, పార్టీ విధేయతలకే ఓటేస్తున్నారు!బెంగళూరు నగర పరిధిలో 4 లోక్‌సభ సీట్లకూ శుక్రవారం రెండో విడతలో పోలింగ్ జరగనుంది. 2008లో లోక్‌సభ నియోజకవర్గాల పునరి్వభజన జరిగినప్పటి నుంచీ ఆ స్థానాల్లో ఓటర్లు ఎప్పుడూ ఒకే పారీ్టకో, అభ్యరి్ధకో పట్టం కడుతుండటం విశేషం... బెంగళూరు పరిధిలోని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన అభ్యర్థే గెలవడం, ఒకే పార్టీకి ఓటర్లు జై కొట్టడానికి నియోజకవర్గాల పునరి్వభజన జరిగిన తీరే కారణమనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. నేతలు తమకు అనుకూలమైన కులాలు, మతాల ఓటర్లు ఒకే నియోజకవర్గంలోకి వచ్చేలా జాగ్రత్త పడటం వల్లే ఈ ట్రెండ్ కొనసాగుతోందనే వాదనలు బలంగా ఉన్నాయి. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ధోరణి ప్రతిఫలిస్తోంది. 2008 నుంచి బెంగళూరులోని మొత్తం 28 అసెంబ్లీ స్థానాల్లో 57 శాతం సీట్లను సిట్టింగ్ ఎమ్మెల్యేలే గెలుస్తూ వస్తున్నారు. మరో 18 శాతం సీట్లను ఒకే ఎమ్మెల్యే లేదా పార్టీ కనీసం రెండుసార్లు గెలవడం విశేషం. ఆ లెక్కన చూస్తే నగరంలోని 75 శాతం స్థానాలు ఒకే అభ్యరి్థకో, ఒకే పారీ్టకో ‘రిజర్వ్’ అయిపోయాయన్నమాట! రాజకీయాల్లో తరచూ వినిపించే ఓటర్ల వ్యతిరేకత, సిట్టింగ్ ప్రజాప్రతినిధిపై అసంతృప్తి వంటివి బెంగళూరుకు వర్తించవు!నగర పరిధిలోని తొమ్మిది అసెంబ్లీ సీట్లలో బీజేపీ నుంచి, ఏడు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన అభ్యర్థులే మళ్లీ గెలిచారు. శివాజీనగర్‌లో 2008 నుంచి వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ టికెట్‌పై ఎమ్మెల్యే అయిన రోషన్ బేగ్ 2019లో బీజేపీలోకి దూకారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ అర్షద్ చేతిలో ఆయన చిత్తుగా ఓడటం విశేషం! అర్షద్‌కు ఎమ్మెల్యేగా అది రెండో విజయం. చామరాజ్‌పేట్ నుంచి మూడుసార్లు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ మాత్రం రెండుసార్లు జేడీ(ఎస్) టికెట్‌పైనా గెలిచారు.వొక్కళిగలే కీలకం...బెంగళూరులో ఇలా ఒకే పార్టీ, ఒకే అభ్యర్థి వరుసగా గెలుస్తున్న ట్రెండ్ వెనక పలు ఇతర కారణాలూ ఉన్నా కులమే కీలక ఫ్యాక్టర్‌గా నిలుస్తోంది. పార్టీ ఓటు బ్యాంకుతో పాటు పారీ్టలు, నేతల మధ్య లోపాయకారీ అవగాహన, తటస్థ ఓటర్ల మొగ్గు కూడా ప్రభావం చూపుతున్నాయి.► బెంగళూరులోని 28 అసెంబ్లీ స్థానాల్లో 4 ఎస్సీ రిజర్వుడు సీట్లు. వాటిని బీజేపీ, కాంగ్రెస్ చెరో రెండు చొప్పున తమ ఖాతాలో వేసుకుంటూ వస్తున్నాయి.► బెంగళూరు పరిధిలోని 28 మంది ఎమ్మెల్యేల్లో 13 మంది వొక్కళిగ కులానికి చెందినవారే. మిగతా సీట్లలో కూడా వారి ప్రభావం గట్టిగా కనబడుతుండటం నగరంలో కులాలవారీ ఓటింగ్ కీలకంగా నిలుస్తోందనేందుకు తిరుగులేని నిదర్శనం.► పునరి్వభజన తర్వాత పరిసర గ్రామీణ ప్రాంతాల నుంచి బెంగళూరు నగర పరిధిలోని నియోజకవర్గాలకు ఓటర్ల వలస కూడా ఈ ధోరణికి మరింత దోహదపడుతోంది.► వొక్కళిగ, ఎస్సీ రిజర్వుడ్‌తో పాటు ముగ్గురు ముస్లిం, ఒక క్రిస్టియన్ అభ్యర్థులు శివాజీనగర్ శాంతిగనర్, చామరాజ్‌పేట్, సర్వజ్ఞనగర్‌లో అసెంబ్లీ స్థానాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు.► రాజాజీనగర్, గాం«దీగనర్, బసవనగుడి, చిక్పేట్ నియోజవర్గాల్లో ఎప్పుడూ బ్రాహ్మణ సామాజిక వర్గమే గెలుస్తోంది.► ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో నగరంలో టికెట్ల కేటాయింపులోనూ వొక్కళిగల ఆధిపత్యం కొట్టొచి్చనట్టు కనిపిస్తోంది. నాలుగు సీట్లలో మూడింటిని కాంగ్రెస్ ఆ సామాజికవర్గానికే కట్టబెట్టింది. బెంగళూరు నార్త్ నుంచి రాజీవ్ గౌడ, సౌత్ నుంచి సౌమ్యా రెడ్డి, రూరల్‌లో డీకే సురేశ్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి బెంగళూరు నార్త్ అభ్యర్థి శోభ కరంద్లాజె, రూరల్ నుంచి సీఎన్ మంజునాథ కూడా వొక్కళిగలే. ► బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో చాలావరకు మైనారిటీల ఆధిపత్యమే కావడంతో మన్సూర్ అలీకి కాంగ్రెస్ టికెటిచి్చంది.లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే ధోరణి► నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత మూడు లోక్‌సభ ఎన్నికల్లోనూ బెంగళూరు పరిధిలోని స్థానాల్లో దాదాపు ఒకే పార్టీ, లేదా అభ్యర్థే గెలిచారు.► బెంగళూరు రూరల్ 2013 ఉపఎన్నిక నుంచీ కాంగ్రెస్ కంచుకోటగా మారింది. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ ఇక్కడ హ్యాట్రిక్ కొట్టారు. నాలుగో విజయం కోసం మళ్లీ బరిలో దిగారు. ఆయనదీ వొక్కళిగ కులమే. ఇక్కడ బీజేపీ కూడా అదేసామాజిక వర్గానికి చెందిన దేవెగౌడ అల్లుడు సి.ఎన్.మంజునాథను బరిలో దింపింది.► బెంగళూరు సెంట్రల్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ పీసీ మోహన్ కూడా హ్యాట్రిక్ వీరుడే. ఈసారి కూడా ఆయనే బరిలో ఉన్నారు. కాంగ్రెస్ మాత్రం అభ్యరి్థని మార్చి మన్సూర్ అలీతో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.► బెంగళూరు సౌత్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ తేజస్వీ సూర్య మళ్లీ పోటీలో ఉన్నారు. ఇక్కడ 1991 నుంచీ కాషాయ జెండానే ఎగురుతుండటం విశేషం! దాంతో ఈసారి రాష్ట్ర మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దింపింది.► బెంగళూరు నార్త్‌లో మాత్రం 2014 నుంచీ గెలుస్తున్న సదానంద గౌడను బీజేపీ ఈసారి పక్కనబెట్టింది. ఉడుపి–చిక్మగళూరుఎంపీ, కేంద్ర మంత్రి శోభ కరంద్లాజెను బరిలో దింపింది. ఆమె కోస్తా వొక్కళిగ కాగా కాంగ్రెస్ అభ్యర్థి రాజీవ్ గౌడ స్థానిక వొక్కలిగ కావడం విశేషం.బెంగళూరు నగర పరిధిలోని లోక్‌సభ స్థానాలుబెంగళూరు నార్త్, బెంగళూరు రూరల్, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు సౌత్ నోట్: ‘గతం’ శీర్షికన అందిస్తున్న లోక్‌సభ ఎన్నికల సిరీస్‌కు రెండో విడత పోలింగ్ కవరేజీ కారణంగా ఈ రోజు విరామం. ఆ సిరీస్ రేపటినుంచి యథావిధిగా కొనసాగుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: రెండో విడతలో... నారీ శక్తి 8 శాతమే!
లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 26న దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 88 స్థానాల్లో పోలింగ్ జరగనుంది (మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో బీఎస్పీ అభ్యర్థి అశోక్ భలావి మరణంతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది). రెండో దశలో 1,210 మంది పోటీలో ఉన్నారు. వీరి ఎన్నికల అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడార్) విశ్లేíÙంచగా పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి...► రెండో విడత బరిలో నిలిచిన అభ్యర్థుల్లో మహిళలు కేవలం 8 శాతమే ఉన్నారు!► పట్టభద్రులు, ఆపై చదువులు చదివిన వారు 43 శాతం.► 21 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వారిలో 167 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ జాబితాలో కాంగ్రెస్ (35), తర్వాత బీజేపీ (31), సీపీఎం (14) టాప్‌లో ఉన్నాయి.► 390 మంది కోటీశ్వరులున్నారు. వీరిలో 105 మంది ఇండిపెండెంట్లు. తర్వాతి స్థానాల్లో బీజేపీ (64), కాంగ్రెస్ (62), బీఎస్పీ (24) నిలిచాయి. ఇద్దరికి 500 కోట్ల పైగా ఆస్తి ఉంది!► టాప్–10 సంపన్న అభ్యర్థుల్లో కర్నాటక టాప్‌లో ఉంది. మండ్య కాంగ్రెస్ అభ్యర్థి వెంటకరమణే గౌడ రూ.623 కోట్లతో ‘టాప్’ లేపారు. బెంగళూరు రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి డీకే సురేశ్ రూ.593 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో నిలిచారు. హేమమాలినికి రూ.279 కోట్ల ఆస్తులున్నాయి. మధ్యప్రదేశ్‌లో హోషంగాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ శర్మ (రూ.233 కోట్లు), మండ్యలో జేడీ(ఎస్) చీఫ్ కుమారస్వామి (రూ.217 కోట్లు), యూపీలో అమ్రోహా బీజేపీ అభ్యర్థి కన్వర్ సింగ్ తన్వర్ (రూ.215 కోట్లు) టాప్–10లో నిలిచారు.► రెండో విడత అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ రూ.5.2 కోట్లు. ఆరుగురు తమకు చిల్లిగవ్వ కూడా లేదని ప్రకటించడం విశేషం!► అభ్యర్థుల్లో ఎక్కువ మంది 40–50 ఏళ్ల మధ్యవారే. సగటు వయసు 49 ఏళ్లు. 70–80 ఏళ్ల మధ్య వయసు్కలు 49 మంది ఉండగా ఇద్దరు 80 ఏళ్లు పైబడ్డారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: 88 స్థానాలకు నేడు నోటిఫికేషన్
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక పోరులో రెండో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. రెండో విడతలో భాగంగా దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలతో పాటు ఔటర్ మణిపూర్‌లోని ఒక స్థానానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరుగనుంది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 4 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జమ్మూకశీ్మర్ మినహా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 5న జరుగనుంది. జమ్మూ కశ్మీర్లో మాత్రం నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 6న జరుగుతుంది. రెండో విడతలో అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, జమ్మూకశీ్మర్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశి్చమ బెంగాల్, మణిపూర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. వీటితోపాటు మహారాష్ట్రలోని అకోలా పశి్చమ అసెంబ్లీ నియోజకవర్గం, రాజస్తాన్‌లోని భాగిడోరా అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతాయి. -
గుజరాత్ ఎన్నికలు: తల్లి ఆశీస్సులు అందుకున్న మోదీ
అహ్మదాబాద్: గుజరాత్ రెండో(తుది) విడత పోలింగ్ సోమవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రానికి చేరుకున్నారు. ఆదివారం సాయంత్రమే ఆయన అహ్మదాబాద్‌కు వెళ్లారు. అయితే నేరుగా గాంధీనగర్ రైసన్ ప్రాంతంలో ఉంటున్న తన తల్లి హీరాబెన్ మోదీ నివాసానికి వెళ్లారు. తల్లి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం పొందారు. సుమారు 45 నిమిషాలు అక్కడే గడిపారు. ఆపై గాంధీనగర్‌లోని బీజేపీ ఆఫీస్‌కు చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్, ఇతర సీనియర్ నేతలు మోదీకి స్వాగతం పలికారు. అహ్మదాబాద్ రనిప్‌లోని ఓ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నారన్‌పూర్ ప్రాంతంలోని మున్సిపల్ సబ్ జోనల్ కార్యాలయంలోని కేంద్రంలో ఓటేయనున్నారు. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గాను డిసెంబర్ 1న 89 సీట్లకు తొలి విడతలో పోలింగ్ జరగ్గా 63.31శాతం పోలింగ్ నమోదైంది. ఇవాళ మిగిలిన 93స్థానాలకు రెండో దశలో పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. Gujarat | Prime Minister Narendra Modi meets his mother Heeraben Modi at her residence, in Gandhinagar. pic.twitter.com/3Rtg3gJ3ON — ANI (@ANI) December 4, 2022 -
Gujarat Assembly Elections 2022: ప్రశాంతంగా ముగిసిన రెండో దశ పోలింగ్
అప్డేట్స్ ముగిసిన రెండో దశ పోలింగ్.. 60శాతానికిపైగా ఓటింగ్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తుది విడతలో 60 శాతానికిపైగా ఓటింగ్ నమోదైనట్లు అంచనా. రెండు దశల్లో నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరగనుంది. 04:00PM మధ్యాహ్నం 3 గంటల వరకు 50.51 శాతం ఓటింగ్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 50.51 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. సబర్‌కాంతా జిల్లాలో అత్యధికంగా 57.24 శాతం ఓటింగ్ నమోదైనట్లు పేర్కొంది. ఓటేసిన ప్రధాని మోదీ తల్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 100 ఏళ్ల హీరాబెన్ గాంధీనగర్‌లోని రాయ్సన్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. Prime Minister Narendra Modi's mother Heeraben Modi casts her vote for the second phase of #GujaratAssemblyPolls in Raysan Primary School, Gandhinagar pic.twitter.com/ZfWcBXWCfI — ANI (@ANI) December 5, 2022 01: 55PM మధ్యాహ్నం 1 గంట వరకు 34.74 శాతం ఓటింగ్ గుజరాత్ శాసనసభ ఎన్నికల తుది విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 34.74 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మాజీ టీమిండియా క్రికెటర్ నయన్ మోంగియా.. వడోదరలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. Former Indian Cricketer Nayan Mongia casts his vote for the second phase of #GujaratAssemblyPolls at a polling booth in Vadodara pic.twitter.com/S1zsIvaoMX — ANI (@ANI) December 5, 2022 12: 15PM ఉదయం 11 గంటల వరకు 19.17 శాతం ఓటింగ్ గుజరాత్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 19.17 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. అహ్మదాబాద్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలిసారి ఓటు హక్కు పొందిన యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 10: 30AM ఉదయం 9 గంటల వరకు 4.75 శాతం ఓటింగ్ గుజరాత్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు 4.75 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. గాంధీనగర్‌లో అత్యధికంగా 7 శాతం ఓటింగ్ నమోదైనట్లు పేర్కొంది. ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్, అహ్మదాబాద్‌లోని శిలాజ్ అనుపమ్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ 95లో ఓటు వేశారు. Ahmedabad | Uttar Pradesh Governor Anandiben Patel cast her vote for the second phase of #GujaratAssemblyPolls at Polling Booth 95, Shilaj Anupam School#GujaratAssemblyPolls pic.twitter.com/dC7Jk8UKBH — ANI (@ANI) December 5, 2022 09: 23AM ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ Cast my vote in Ahmedabad. Urging all those voting today to turnout in record numbers and vote. pic.twitter.com/m0X16uCtjA — Narendra Modi (@narendramodi) December 5, 2022 Ahmedabad, Gujarat | Prime Minister Narendra Modi casts his vote for the second phase of Gujarat Assembly elections at Nishan Public school, Ranip#GujaratElections pic.twitter.com/snnbWEjQ8N — ANI (@ANI) December 5, 2022 08:56AM Ahmedabad, Gujarat | Prime Minister Narendra Modi leaves from Gandhinagar Raj Bhawan to cast his vote for the Gujarat Assembly elections at Nishan Public School, Ranip.#GujaratElections2022 pic.twitter.com/gt9Rmg2tes — ANI (@ANI) December 5, 2022 ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు ఓటేయడానికి పోలింగ్ స్టేషన్‌కు బయల్దేరారు. రానిప్‌లోని నిషాన్ పబ్లిక్ స్కూల్ బూత్‌లో మోదీకి ఓటు.. గాంధీనగర్ నుంచి రానిప్కు బయల్దేరిన మోదీ 08:50AM కొనసాగుతున్న పోలింగ్ 08:00AM గుజరాత్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం మధ్య గుజరాత్లో బీజేపీ పట్టు కొనసాగుతున్నప్పటికీ ఆప్ నుంచి సవాళ్లు ఉత్తర గుజరాత్లో ఆప్ ఉనికి లేకపోయినప్పటికీ అధికార పార్టీకి ఎదురుగాలి అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోదీ Urging all those who are voting in Phase 2 of the Gujarat elections, particularly the young voters and women voters to vote in large numbers. I will be casting my vote in Ahmedabad at around 9 AM. — Narendra Modi (@narendramodi) December 5, 2022 గుజరాత్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల్లో అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. తన ట్విటర్ ఖాతా ద్వారా ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రధాని. 14 జిల్లాల్లో 93 స్థానాలకు మధ్య, ఉత్తర గుజరాత్‌ల్లోని 14 జిల్లాల్లో 93 స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. 833 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ, ఆప్ మొత్తం 93 స్థానాల్లో, కాంగ్రెస్ 90 చోట్ల, దాని మిత్రపక్షం ఎన్సీపీ మూడు స్థానాల్లో పోటీ పడుతున్నాయి. 255 మంది స్వతంత్రులూ బరిలో ఉన్నారు. 2.54 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరికోసం 14,975 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. బరిలో ఉద్యమకారులు ఈ దఫా ఎన్నికల్లో కొన్ని హాట్ సీట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పటీదార్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్, ఠాకూర్ల ఆందోళనల నేత అల్పేశ్ ఠాకూర్ బీజేపీ తరఫున, దళిత సమస్యలపై గళమెత్తిన జిగ్నేష్ మేవానీ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘాట్లోడియా స్థానం నుంచి పోటీ పడుతూ ఉంటే, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన హార్దిక్ పటేల్ వీరమ్‌గామ్ అల్పేష్ కుమార్ గాంధీనగర్–సౌత్ నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక జిగ్నేష్ మేవానీ వద్గమ్ నుంచి మరోసారి పోటీకి దిగారు. బీజేపీకి కనీసం నాలుగైదు స్థానాల్లో రెబెల్ అభ్యర్థులు సవాల్ విసురుతున్నారు. వఘోడియా, పాద్రా, బయాద్, నాందోడ్లలో రెబెల్స్ పార్టీకి తలనొప్పిగా మారారు. 16 ముస్లిం ప్రాబల్యం స్థానాలు కీలకం అహ్మదాబాద్‌లోని ముస్లింల ప్రాబల్యం ఉన్న 16 స్థానాలు బీజేపీకి అత్యంత కీలకంగా మారాయి. వీటిలో నాలుగు స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థుల్ని నిలబెట్టడంతో చతుర్ముఖ పోటీ నెలకొంది. గుజరాత్ మతఘర్షణలో అత్యాచార బాధితురాలు బిల్కిస్ బానో దోషుల్ని శిక్షాకాలం కాక ముందే విడుదల చేయడం కూడా అధికార పార్టీకి మైనస్‌గా మారింది. దీంతో ఓట్లు చీలిపోయి ఎవరికి లబ్ధి చేకూరుతుందా అన్న ఆందోళన కమలనాథుల్లో ఉంది. గుజరాత్ మోడల్ పాలనతో అత్యధిక ప్రయోజనం పొందిన అహ్మదాబాద్ దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అహ్మదాబాద్ జిల్లాలో అయిదు స్థానాలు దక్కించుకోవడం, పట్టణ ప్రాంతాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బలపడడం బీజేపీకి సవాల్‌గా మారాయి. అందుకే ప్రచారంలో ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో వరసగా రెండు రోడ్ షోలు నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఓటుపై ఉదాసీనత డిసెంబర్ 1న జరిగిన తొలి దశ పోలింగ్‌లో ఓటు వెయ్యడానికి ప్రజల్లో ఒక రకమైన ఉదాసీనత కనిపించింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలైన సూరత్, రాజ్‌కోట్, జామ్‌నగర్‌లలో ఓటింగ్ అత్యంత స్వల్పంగా జరిగింది. మొత్తమ్మీద 63.3% పోలింగ్ నమోదైంది. పట్టణాలకు, గ్రామాలకి మధ్య పోలింగ్‌లో 35% వరకు తేడా ఉంది. అహ్మాదాబాద్, ఆనంద్, వడోదరా, గాంధీనగర్, గోధ్రా వంటి నగరాల్లో రెండో దశ పోలింగ్ ఉండడంతో ఓటర్లు ఉదాసీనంగా వ్యవహరించవద్దని, తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఓటర్లందరూ ముందుకు రావాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం అహ్మాదాబాద్‌లో ఓటు వేయనున్నారు. -
Gujarat Assembly Election 2022: గుజరాత్లో ప్రచారానికి తెర
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో, తుది దశ ప్రచారానికి శనివారం తెరపడింది. రెండో దశలో 93 అసెంబ్లీ స్థానాలకు 5న పోలింగ్ జరగనుంది. 833 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అధికార బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. అయితే ప్రచారంలో బీజేపీ, ఆప్‌తో కాంగ్రెస్ పోటీ పడలేకపోయింది. అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఒక్కరే ప్రచార భారం మోశారు. మోదీ.. అన్నీ తానై రాష్ట్రంలో బీజేపీ 27 ఏళ్లుగా అధికారంలో ఉండడంతో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించే బాధ్యతను ప్రధాని మోదీ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. 31 ర్యాలీలు, 3 నగరాల్లో అతి పెద్ద రోడ్ షోలతో సుడిగాలి ప్రచారం చేశారు. అహ్మదాబాద్‌లో గురువారం ఆయన రోడ్ షో దేశంలోనే అతి పెద్దదిగా చరిత్ర సృష్టించింది. 13 అసెంబ్లీ నియోజకవర్గాలను మీదుగా 50 కి.మీ. వరకు ఈ రోడ్ షో సాగింది. నాలుగు గంటల సేపు సాగిన ఈ రోడ్ షోకి జనం పోటెత్తారు. రోడ్డుకిరువైపులా కిలో మీటర్ల మేర 10 లక్షల మంది వరకు నిల్చొని మోదీకి జన నీరాజనం సమర్పించారని బీజేపీ చెప్పుకుంటోంది. ప్రధాని ఏ సభకు వెళ్లినా మోదీ, మోదీ, మోదీ అంటూ యువత ఉత్సాహంగా కేకలు వేయడం కనిపించింది. ప్రచారంలో మోదీ ప్రధానంగా గుజరాత్ ఆత్మగౌరవ నినాదాన్ని, తమ పార్టీ చేస్తున్న అభివృద్ధినే ప్రస్తావించారు. అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎక్కడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తావన తీసుకురాలేదు. ఆప్ పేరు తీసుకురాకుండా ఆ పార్టీ ఇచ్చే ఉచిత పథకాలను మోదీ ఎక్కడికక్కడ ఎండగట్టారు. ఉచితానికి, సంక్షేమానికి మధ్య తేడా తెలుసుకోవాలంటూ అవకాశం వచ్చినప్పుడల్లా చురకలంటించారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు ప్రచారం నిర్వహించారు. ఇక ఆప్ తరఫున ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. 30కిపైగా ర్యాలీలు, రోడ్ షోలలో పాల్గొని ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరారు. ప్రతీ చోటా ఉచిత విద్యుత్ పథకాన్నే ఎక్కువగా ప్రస్తావించారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ఎదుగుతామని ఆప్ ధీమాగా ఉంది. కాగా గుజరాత్ ఫలితాలు ఈ నెల 8న వెలువడనున్నాయి. అది కాంగ్రెస్ ఢూండో యాత్ర: స్మృతీ భారత్ జోడో యాత్ర నిజానికి కాంగ్రెస్ ఢూండో (అన్వేషణ) యాత్ర అంటూ కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఎద్దేవా చేశారు. గుజరాత్లో శనివారం బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. 8న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలొచ్చాక కాంగ్రెస్ ఢూండో యాత్ర మొదలవుతుందని జోస్యం చెప్పారు. -
మణిపూర్ పోలింగ్ హింసలో.. ఇద్దరి మృతి
మణిపూర్ రెండో ఫేజ్ ఎన్నికల పోలింగ్ కూడా హింసాత్మక ఘటనల మధ్యే సాగుతున్నాయి. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేసినప్పటికీ.. ఈ ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. థౌబాల్ జిల్లా, సేనాపతి జిల్లాల్లో పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసలో వేర్వేరే ఘటనల్లో ఇద్దరు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. మరికొన్ని చోట్ల కూడా అల్లర్లు చెలరేగినట్లు తెలుస్తోంది. ఇక ఉదయం 11 గంటల వరకు 28 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. పది జిల్లాలు.. 22 నియోజకవర్గాలు 92 మంది అభ్యర్థులు మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల రెండో ఫేజ్(చివరిది కూడా) పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. Today is the second phase of the Manipur Assembly elections. Calling upon all those whose constituencies are polling today to vote in large numbers and mark the festival of democracy. — Narendra Modi (@narendramodi) March 5, 2022 -
నందిగ్రామ్‌లో స్వల్ప ఘర్షణలు
నందిగ్రామ్/గువాహటి: పశ్చిమబెంగాల్లో గురువారం జరిగిన రెండో దశ ఎన్నికల్లో స్వల్పంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అక్రమాలు జరిగాయని, కేంద్ర బలగాలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరించాయని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఆరోపించారు. ఆమె బరిలో నిలిచిన నందిగ్రామ్‌లో గురువారం పోలింగ్ జరిగింది. కేంద్ర మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు నందిగ్రామ్ నియోజకవర్గంలో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు బీజేపీకి ఓట్లు పడేలా సహకరించాయని మమత పేర్కొన్నారు. ఎన్నికల సంఘం టీఎంసీ, ఇతర పార్టీల ఫిర్యాదులపై స్పందించడం లేదని, అమిత్ ఆదేశాలనే పాటిస్తోందన్నారు. తన ఆందోళన అంతా ప్రజాస్వామ్యంపై బీజేపీ చేస్తున్న దాడి గురించేనని ఆమె వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ, ఆమె ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి పలు పోలింగ్ బూత్‌లకు వెళ్లి, ఓటింగ్ సరళిని పరిశీలించారు. నందిగ్రామ్‌లో విజయం తనదేనని, ఇక్కడి ప్రజలంతా తనవారేనని, గ్రామాలకు, గ్రామాలే బీజేపీకి ఓటేశాయని సువేందు అధికారి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 30 స్థానాల్లో జరిగిన రెండో దశలో ఎన్నికల్లో కూడా 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదయింది. సాయంత్రం ఐదు గంటల వరకు రాష్ట్రంలో 80.53% ఓటింగ్ నమోదయిందని ఈసీ వెల్లడించింది. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తోందని, తమ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని మమత బెనర్జీ ఆరోపించారు. ‘ఉదయం నుంచి 63 ఫిర్యాదులు చేశాం. ఏ ఒక్క ఫిర్యాదు పైనా చర్యలు తీసుకోలేదు. అమిత్ షా ఆదేశాలను మాత్రమే ఈసీ పాటిస్తోంది. దీనిపై మేం కోర్టుకు వెళ్తాం. వేరే రాష్ట్రాల నుంచి గూండాలను తీసుకువచ్చి గందరగోళం చేస్తున్నారు’ అని బోయల్లో బూత్ నెంబర్ 7 బయట కూర్చున్న మమతా పేర్కొన్నారు. బీజేపీ గూండాలు బూత్‌ల స్వాధీనానికి, దొంగ ఓట్లకు పాల్పడుతున్నారన్నారు. టీఎంసీ తరఫున ఏజెంట్లుగా ఉండవద్దని గత రాత్రి తమ పోలింగ్ ఏజెంట్లను బీజేపీ నాయకులు బెదిరించారని మమత ఆరోపించారు. బోయల్లో తమ ఓట్లను వేయనీయడం లేదని పలువురు ఓటర్లు, టీఎంసీ కార్యకర్తలు ఆమెకు ఫిర్యాదు చేయడంతో, ఆ బూత్ వద్ద ఆమె దాదాపు రెండు గంటల పాటు కూర్చున్నారు. బోయల్‌కు మమత చేరుకోగానే అక్కడి బీజేపీ కార్యకర్తలు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. టీఎంసీ కార్యకర్తలు వారిని అడ్డుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. దీనిపై గవర్నర్ జగదీప్‌కు ఫోన్ చేసి మమత ఫిర్యాదు చేశారు. కేంద్ర బలగాలు తమను పోలింగ్ బూత్‌లకు వెళ్లనివ్వడం లేదని ఆరోపిస్తూ నందిగ్రామ్ బ్లాక్ 1 రోడ్డును టీఎంసీ కార్యకర్తలు దిగ్బంధించారు. సువేందు అధికారి కారుపై కొందరు దాడి చేశారు. టాకాపుర, సతేంగబరిల్లో ఆయనపై రాళ్లు రువ్వారు. కేశ్పూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి తన్మయ్ ఘోష్ కారును కొందరు ధ్వంసం చేశారు. నందిగ్రామ్ ఘటనలపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. అక్కడ మమత బెనర్జీ ఓడిపోతున్నారని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. పోలింగ్‌ను అడ్డుకోలేదు నందిగ్రామ్‌లో పోలింగ్ బూత్ నెంబర్ 7లో పోలిం గ్ సక్రమంగా కొనసాగిందని, అక్కడ ఎవ రూ ఓటర్లను అడ్డుకోలేదని ఎన్నికల సంఘం స్ప ష్టం చేసింది. ఈ మేరకు తమకు ఎన్నికల ప్రత్యేక పరిశీలకుల నుంచి సమాచారం అందిందని పేర్కొంది. అస్సాంలో.. అస్సాంలో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 39 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సాయంత్రం ఐదు గంటల వరకు 77.21% ఓటింగ్ నమోదయింది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో వెంటనే వాటిని మార్చారు. దాదాపు అన్ని బూత్‌ల్లో ఓటర్లు కోవిడ్ 19 నిబంధనలను పాటిస్తూ ఓటింగ్‌లో పాల్గొన్నారు. మమత వచ్చిన పోలింగ్ కేంద్రం వద్ద వ్యతిరేక నినాదాలు చేస్తున్న గ్రామస్తులు -
పల్లెల్లో వైఎస్సార్సీపీ ప్రభంజ
-
మలివిడతలోనూ ‘దేశం’ దౌర్జన్యకాండ
సాక్షి, అమరావతి: ఏకగ్రీవాల సంఖ్య పెరగడం, తొలివిడతలో ప్రజాతీర్పు అధికార పార్టీకి అనుకూలంగా ఉండటంతో జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా శనివారం పలుచోట్ల దౌర్జన్యానికి పాల్పడ్డాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో 18 రెవెన్యూ డివిజన్లలో 167 మండలాలకు చెందిన గ్రామాలు, వార్డుల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పలు ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టి దాడులకు దిగడడంతో పోలీసులు రంగంలోకి దిగి చెదరగొట్టారు. మలివిడత పోలింగ్‌లో దాదాపు 9 వేలకు పైగా అతి సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామాల్లో పోలింగ్‌ను వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద మాస్కులు, శానిటైజర్లతోపాటు వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించి కోవిడ్ జాగ్రత్తలు తీసుకున్నారు. మలి విడతలోను టీడీపీ దౌర్జన్యపర్వం విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం కృష్ణపల్లిలో వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన సర్పంచ్ అభ్యర్ధిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు దౌర్జన్యానికి దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. కృష్ణా జిల్లా కొత్త నిమ్మకూరులో ఓ వృద్ధురాలితో కలసి పోలింగ్ బూత్ లోపలికి ప్రవేశించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించగా వైఎస్సార్ సీపీ మద్దతుదారులు అభ్యంతరం తెలపడంతో దాడికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం పెరిసేపల్లిలో పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌గా ఉన్న దాసి ప్రవీణ్‌కుమార్‌ను మాస్క్ ధరించలేదనే నెపంతో టీడీపీ నేతలు దాడి చేశారు. గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో దొంగ ఓట్లు వ్యవహారం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ప్రకాశం జిల్లా కొనకనమిట్ట మండలం బోడపాడులో టీడీపీ అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ మద్దతుదారైన అభ్యర్థి కమలాకర్ పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించడంతో వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైలులో బ్యాలెట్ పెట్టెల తరలింపు ఉద్రిక్తతకు దారితీసింది. తమ గ్రామంలోనే కౌంటింగ్ జరపాలంటూ పోలింగ్ బూత్‌కు తాళాలు వేసి గ్రామస్తులు అందోళనకు దిగారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లోని మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పామర్రు ఎమ్మెల్యే అనిల్‌పై డీఐజీ అసహనం కృష్ణా జిల్లా పామర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకుని బయటకు వస్తున్న ఎమ్మెల్యే అనిల్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ మద్దతుదారులపై టీడీపీ శ్రేణుల దౌర్జన్యకాండను డీఐజీ మోహనరావుకు వివరించే ప్రయత్నం చేయగా డీఐజీ పట్టించుకోలేదు. వెళ్లవయ్యా.. వెళ్లు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఓ ప్రజాప్రతినిధిగా తాను చెప్పేది వినకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మనస్తాపం చెందిన ఎమ్మెల్యే అనిల్ డీఐజీ కారు వద్ద నిరసన తెలిపారు. దీనిపై అసెంబ్లీ స్పీకర్‌కు, డీజీపీకి ఫిర్యాదు చేస్తానన్నారు. డీఐజీ తీరుకు నిరసనగా వైఎస్సార్సీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపాయి. దీంతో తాను ఎమ్మెల్యేను గుర్తుపట్టలేదంటూ డీఐజీ నిష్క్రమించారు. టీడీపీ నేతల బరితెగింపు తాడిపత్రి రూరల్: ఓటర్లకు డబ్బు పంచుతున్న విషయాన్ని పోలీసులకు సమాచారం ఇస్తారేమోననే భయంతో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి తెగబడిన ఘటన అనంతపురం జిల్లా ఆలూరులో శనివారం జరిగింది. తాడిపత్రి మండలం ఆలూరులో టీడీపీ మద్దతుదారైన అగ్రహారం శంకర్.. టీడీపీ నేత తిరుపాల్‌రెడ్డి, కార్యకర్తలతో కలిసి ప్రచారం ముసుగులో ఓటర్లకు డబ్బులు పంచడంలో నిమగ్నమయ్యాడు. దీనిని వైఎస్సార్సీపీ కార్యకర్త రవిచంద్రారెడ్డి గమనించడంతో పోలీసులకు సమాచారం ఇస్తాడేమోననే ఉద్దేశంతో తిరుపాల్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, వెంకటనారాయణ, రమేష్, వెంకటప్రసాద్, సర్పంచ్ అభ్యర్థి శంకర్, నాగరంగయ్య అలియాస్ బుజ్జి, అగ్రహారం ప్రసాద్, శివ, రంగనాయకులు, వేణుగోపాల్, గురుస్వామి మరికొందరు అతనిపై రాళ్లు, కట్టెలతో దాడికి తెగబడ్డారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ అభిమానులు అతడిని కాపాడేందుకు అక్కడికి పరుగెత్తుకు రాగా.. వారిపైనా దాడి చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు రవిచంద్రారెడ్డి, ప్రవీణ్‌కుమార్, తలారి బయన్న, వంశీలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్సకు తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించకుండా పోలీసులు గంటకు పైగా పోలీసుస్టేషన్లోనే ఉంచడం విమర్శలకు తావిస్తోంది. ఓటమిని జీర్ణించుకోలేక రాళ్ల దాడి కొలిమిగుండ్ల: కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంకమ్మవారిపల్లెలో ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలు శనివారం వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారు. సర్పంచ్ పదవికి వైఎస్సార్సీపీ అభిమాని తమ్మినేని కొండయ్య, టీడీపీ తరఫున రాందాస్‌చౌదరి పోటీపడగా.. తమ్మినేని కొండయ్య 123 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుండగా టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడికి దిగారు. రాముడు, గురుచంద్ర, వెంకటేశ్వరరావుతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. -
పల్లెల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం
సాక్షి, అమరావతి: పాలనను పల్లెకు చేర్చిన విప్లవాత్మక మార్పునకు ప్రజలు ఓటేశారు. సంక్షేమ పథకాలను సంతృప్త స్థాయిలో అమలు చేస్తున్న విధానానికి పల్లె ప్రజలు జై కొట్టారు. పార్టీ రహితంగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత కూడా వైఎస్సార్సీపీ అభిమానులు విజయబావుటా ఎగుర వేశారు. భారీ సంఖ్యలో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగింది. ఎన్నికల ఫలితాల సరళి పూర్తిగా ఏకపక్షంగానే సాగింది. దాదాపు 80.4 శాతం గ్రామాల్లో వైఎస్సార్సీపీ అభిమానులు విజయ దుందుభి మోగించారు. గ్రామ సచివాలయాల ద్వారా 524 రకాల ప్రభుత్వ సేవలను మారుమూల పల్లెల్లో సైతం అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో ప్రభుత్వ పథకాలను అందించిన వైఎస్ జగన్ పాలన తీరుకు పూర్తి మద్దతు తెలుపుతున్నారన్నట్టు ప్రజా తీర్పు వెలువడింది. రెండో విడతలో 3,328 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా, 539 చోట్ల సర్పంచి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మూడు చోట్ల సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు ఏ ఒక్కరూ నామినేషన్లు దాఖలు చేయనందున అక్కడ ఎన్నికలు జరగలేదు. మిగిలిన 2,786 సర్పంచ్ స్థానాలకు శనివారం పోలింగ్, కౌంటింగ్ జరిగింది. వైఎస్సార్సీపీ అభిమానులు విజయపథాన దూసుకెళుతున్న సరళి విస్పష్టంగా కనిపిస్తుండటంతో ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ కార్యాలయాల వద్ద ఇదే వాతావరణం నెలకొంది. 81.61 శాతం పోలింగ్ రెండో విడత ఎన్నికల్లోనూ ఓటర్లు పోటెత్తారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81.61 శాతం ఓటర్లు ఓటు వినియోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. శనివారం ఉదయం 6.30 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 3.30 గంటల వరకు కొనసాగింది. తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని మావోయిస్టు ప్రభావం ఉంటుందని భావించిన దాదాపు 200 గ్రామాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ జరిగింది. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 86.60 శాతం దాకా ఓట్లు పోలయ్యాయి. శ్రీకాకుళం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు మినహా మిగిలిన 10 జిల్లాల్లో 80 శాతానికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధిక గ్రామాల్లో ఉదయమే ఎక్కువ సంఖ్యలో పోలింగ్ జరగగా.. ఆఖరి గంట 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు కేవలం ఐదు శాతం ఓట్లు నమోదు కావడం గమనార్హం. చాలా పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఓటు వేసిన వారు చాలా కొద్ది మందేనని పోలింగ్ పర్యవేక్షణ అధికారులు వెల్లడించారు. పోలింగ్ దాదాపు ప్రశాంతం గుంటూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాలో ఒకట్రెండు స్వల్ప సంఘటనలు మినహా 13 జిల్లాల పరిధిలో పోలింగ్ ప్రక్రియ పూర్తి ప్రశాంతంగా జరిగినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. గుంటూరు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో పోలింగ్‌కు ముందు కొందరు వ్యక్తులు బ్యాలెట్ పేపర్లును అపహరించుకుపోయారు. దీంతో అధికారులు అప్పటికప్పుడు అదనంగా బ్యాలెట్ పేపర్లను ముద్రించి.. తెప్పించడంతో అక్కడ ఎన్నిక సజావుగా కొనసాగింది. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన వినుకొండ మాజీ ఎమ్మెల్యే సొంత గ్రామం ఇనిమెళ్లలో కొందరు రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నించగా, అధికారులు సమర్థవంతంగా అడ్డుకొని ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. విజయనగరం జిల్లా పార్వతీపురం క్రిష్టాపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు పొలింగ్ బూత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించగా, అధికారులు అడ్డుకొని ఎన్నికను సజావుగా నిర్వహించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన 9,661 చోట్ల పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి గిరిజాశంకర్ తదితర అధికారులు పోలింగ్ జరుగుతున్న తీరును వెబ్ కెమెరాల ద్వారా నిరంతరం పరిశీలించారు. పోలింగ్ ముగిసిన రెండున్నర గంటల లోపే ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైంది. ఒట్ల లెక్కింపులో మొత్తం 48,929 మంది సిబ్బందిని వినియోగించినట్టు అధికారులు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలకు ఆదేశం ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, కౌంటింగ్ ప్రక్రియను పూర్తిగా రికార్డు చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా గ్రామాల్లో అప్పటికే పొలింగ్ జరుగుతుండడం, కౌంటింగ్‌కు కూడా కేవలం రెండు మూడు గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉన్నప్పుడు ఆ ఆదేశాలు జారీ చేశారు. పలు చోట్ల రిటర్నింగ్ అధికారులు హడావుడి పడుతూ ఆ ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నాలు సాగించారు. -
బిహార్‌లో 54.64% పోలింగ్
పట్నా/భోపాల్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇందులో 54.64 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. రెండు దశల్లో కలిపి 53.79 ఓటింగ్ శాతానికి పైగా నమోదైనట్లు తెలిపింది. మంగళవారం జరిగిన ఈ పోలింగ్‌లో దాదాపు 2.85 కోట్ల ఓటర్లలో సగానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గవర్నర్ ఫగు చౌహాన్, సీఎం నితీశ్, డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 17 జిల్లాల్లో 94 సీట్లకు ఈ దశలో ఎన్నికలు జరిగాయి. ఎలక్షన్ కమిషన్ ఓటర్ టర్నౌట్ యాప్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ముజఫర్çపూర్లో అత్యధికంగా 54.89 శాతం ఓట్లు పోలయ్యాయి. నితీశ్‌పై ఉల్లిపాయలు.. హార్లఖి నియోజకవర్గంలో ప్రచారసభలో సీఎం నితీశ్ ప్రసంగిస్తుండగా కొందరు వ్యక్తులు పెరిగిన ఉల్లి ధరలపై నిరసనగా ఆయనపై ఉల్లిపాయలు విసిరారు. అయితే అవి నితీశ్‌పైకి రాకముందే నేలపై పడ్డాయి. భద్రతా బలగాలు వారిని పట్టుకోబోతుండగా నితీశ్ వారించారు. మధ్యప్రదేశ్‌లో 69.93 శాతం పోలింగ్.. దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఇందులో మధ్యప్రదేశ్‌లో పలు ఉద్రిక్తత ఘటనల నడుమ కొనసాగిన∙అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్‌లో 69.93 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 28 స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. ఎన్నికల సందర్భంగా జరిగిన హింసలో కొందరు తుపాకులను ఉపయోగించడంతో, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బద్నావర్ నియోజకవర్గంలో అత్యధికంగా 81.26 శాతం ఓటింగ్ నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌లో 77, గుజరాత్లో 58.58, హరియాణాలో 69.43, జార్ఖండ్‌లో 62.51, ఒడిశాలో 70, నాగాలాండ్‌లో 84.41, ఉత్తరప్రదేశ్‌లో 53 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. -
జార్ఖండ్‌లో 63.36% పోలింగ్
రాంచీ: ఉద్రిక్తత నడుమ జార్ఖండ్‌లో రెండో దశ పోలింగ్ ముగిసింది. 63.36 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. సిసాయ్ నియోజకవర్గంలోని 36వ పోలింగ్ బూత్ వద్ద పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నించిన వ్యక్తుల మీద భద్రతా సిబ్బంది కాల్పులు జరపడంతో ఓ వ్యక్తి మరణించగా, మరి కొందరు గాయపడ్డారని ఏడీజీపీ మురారి లాల్ మీనా చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరపుతున్నామని జార్ఖండ్ ఎన్నికల అధికారి వినయ్ కుమార్ చౌబే తెలిపారు. పోలీసుల కాల్పుల అనంతరం కోపోద్రిక్తులైన ప్రజలు రాళ్లు విసరడంతో ఓ పోలీసుకు గాయాలయ్యాయి. రెండో దశలో మొత్తం 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనుండగా, అందులో 18 స్థానాల్లో మధ్యాహ్నం 3 వరకూ మరో రెండు స్థానాల్లో సాయంత్రం 5 వరకు పోలింగ్ జరిగింది. దాదాపు ఏడు జిల్లాల వ్యాప్తంగా 42 వేల మంది భద్రతా సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. -
ఓట్ల వెల్లువ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మలి విడత పోరులో గ్రామీణ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. అధిక సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం రెండో విడత పరిషత్ ఎన్నికలు జరిగిన 8 మండలాల్లో సగటున 82.49 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. తొలి విడత కంటే దాదాపు మూడు శాతం అదనం. ఒక మండలం మినహా ఏడు మండలాల్లో పోలింగ్ 80 శాతం దాటింది. అత్యధికంగా కొత్తూరు మండలంలో 86.28 శాతం, అత్యల్పంగా చౌదరిగూడ మండలంలో 78.41 శాతం నమోదైంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎండ తీవ్రత పెరగక ముందే ఓటు వేయాలన్న ఉద్దేశంతో ఓటర్లు ఉదయం పూటే పోలింగ్ కేంద్రాల్లో కిక్కిరిశారు. ఈ క్రమంలో ఉదయం 11 గంటల వరకే 45.37 శాతం పోలింగ్ పూర్తయింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 64.29 శాతం మంది ఓటేశారు. ఎండ తీవ్రతతో మధ్యాహ్నం పోలింగ్ మందకొడిగా సాగింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాలుగు గంటల వ్యవధిలో కేవలం 18.17 శాతం మందే ఓటేశారు. షాద్‌నగర్, కందుకూరు మండలాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలకు బ్యాలెట్ బాక్సులను చేర్చి భద్రపరిచా రు. ఓట్ల లెక్కింపు ఈ కేంద్రాల్లోనే జరుగుతుంది. పురుషులే అధిక శాతం.. ఎనిమిది మండలాల పరిధిలో 89 ఎంపీటీసీ, 8 జెడ్పీటీసీలకు పోలింగ్ సజావుగా, ప్రశాతంగా జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో అటు పోలీసులు, ఇటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం 468 పోలింగ్ కేంద్రాల్లో 2.06 లక్షల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. మహిళల కంటే పురుషులే అధిక శాతం పోలింగ్‌లో పాల్గొన్నారు. మహిళలు 81.49 శాతం మంది ఓటేయగా.. పురుషులు 83.47 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్నిచోట్ల వెలవెలబోయిన పోలింగ్ కేంద్రాలు కొత్తూరు మండలంలోని ఎస్బీపల్లి, మల్లాపూర్, కొడిచర్ల, పెంజర్ల గ్రామాల్లో ఓటర్లు లేక కేంద్రాలు వెలవెలబోయాయి. ఉదయం 11:30 గంటలకే కేంద్రాల వద్ద ఓటర్లు కనిపించలేదు. ఎండల తీవ్రత, దానికి తోడు వివాహలు ఎక్కువగా ఉండడంతో ఉదయమే కొంతమంది ఓటుహక్కును వినియోగించుకోగా.. సాయంత్రం మరికొంత మంది ఓట్లు వేశారు. అక్కడక్కడ అసౌకర్యాలు కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు మౌలిక వసతులు బాగానే కల్పించారు. మరికొన్ని చోట్ల ఓటర్లు తీవ్ర అసౌకర్యానికి గురికావాల్సి వచ్చింది. నందిగామ మండల కేంద్రంలోని 28, 29 పోలింగ్‌బూత్‌ల వద్ద టెంట్లు ఏర్పాటు చేయని కారణంగా ఓటర్లు ఎండలోనే నిలబడాల్సి వచ్చిం ది. అలాగే వృద్ధులు, గర్భిణులు, వికలాంగులు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపు నిర్మించాలి. అయితే ఈ విషయాన్ని అధికారులు కొన్ని చోట్ల తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటో కొన్ని చోట్ల ఓటరు స్లిప్పులు ఓటర్లకు అందలేదు. పోలింగ్‌కు రెండు రోజుల ముందే ఓటర్లకు వీటిని పంపిణీ చేయాల్సి ఉన్నా పూర్తిస్థాయిలో దృష్టి సారించడంలో అధికారులు విఫలమయ్యారు. -
ఓటెత్తారు
సాక్షి, మెదక్ : మలి విడత ప్రాదేశిక ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలు నర్సాపూర్, కౌడిపల్లి, చిలప్‌చెడ్, శివ్వంపేట, వెల్దుర్తి, కొల్చారంలో శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ శాతం 80.85గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే 3.11 శాతం, తొలి విడత మండల, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికలతో పోలిస్తే 3.07 శాతం అధికంగా నమోదైనట్లు స్పష్టమవుతోంది. ఈ నెల 14న తుది విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 27న ఓట్ల లెక్కింపు జరగనుండగా.. అదేరోజు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. పురుషులదే పైచేయి రెండో విడతలో మొత్తం ఆరు జెడ్పీటీసీ స్థానాలకు 22 మంది బరిలో ఉన్నారు. శివ్వంపేట మండలం చండి ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం కాగా.. మిగిలిన 59 స్థానాలకు 205 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 337 పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి విడత ఎన్నికల్లో మహిళలు ఓటెత్తి పైచేయి సాధించగా.. రెండో విడతలో పురుషులు పైచేయి సాధించారు. మలి విడత ఎన్నికల్లో పురుషులు 76,718, మహిళలు 79,505, ఇతరులు ఇద్దరు.. మొత్తం 1,56,225 మంది ఓటెయ్యాల్సి ఉంది. ఇందులో 1,26,306 మంది మాత్రమే ఓటేశారు. ఓటేసిన వారిలో పురుషులు 63,519, మహిళలు 62,787 మంది ఉన్నారు. ఫస్ట్ నర్సాపూర్.. లాస్ట్ కొల్చారం రెండో విడతలో ఎన్నికలు జరిగిన మండలాల్లో పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే నర్సాపూర్‌లో అత్యధికంగా నమోదైంది. 95.39 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. శివ్వంపేట మండలం 83.00, కౌడిపల్లి 81.28, చిలప్‌చెడ్ 80.90, వెల్దుర్తి 78.44 శాతంతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 76.19 శాతంతో కొల్చారం చివరి స్థానంలో నిలిచింది. రెండు గంటలకోసారి వెల్లడి ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. పోలింగ్ శాతాన్ని అధికారులు రెండు గంటలకోసారి వెల్లడించారు. ఉదయం తొమ్మిది గంటలకు 27.96.. 11 గంటలకు 52.56.. ఒంటి గంటకు 68.00.. మూడు గంటలకు 74.67.. పోలింగ్ ముగిసే ఐదు గంటల వరకు 80.85 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎంపీ, తొలివిడత ప్రాదేశిక పోలింగ్ కంటే అధికం తొలివిడత ప్రాదేశిక ఎన్నికల్లో 77.78 శాతం పోలింగ్ నమోదు కాగా.. మలి విడతలో 80.85 శాతం నమోదైంది. ఈ లెక్కన 3.07 శాతం అధికంగా పోలింగ్ నమోదైనట్లు స్పష్టమవుతోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో 77.74 శాతం పోలింగ్ నమోదు కాగా.. రెండో విడత ప్రాదేశిక ఎన్నికల్లో 80.85 శాతం నమోదైంది. 3.11 శాతం అధికంగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. పెద్దగొట్టిముక్లలో స్వల్ప ఘర్షణ శివ్వంపేట మండలంలోని పెద్దగొట్టిముక్కల పోలింగ్ కేంద్రం వద్ద కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్లో స్వతంత్రంగా పోటీచేస్తున్న రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు అలర్ట్ అయి చెదరగొట్టారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. స్ట్రాంగ్ రూంలకు బ్యాలెట్ బాక్సుల తరలింపు పోలింగ్ అనంతరం పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య వాహనాల్లో బ్యాలెట్ బాక్సులను నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని కౌడిపల్లి మండలం తునికికి తరలించారు. మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో వాటిని భద్రపరిచారు. స్ట్రాంగ్ రూం వద్ద నిరంతర గస్తీ ఉండేలా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకుంది. అధికారులు, ప్రజాప్రతినిధుల పరిశీలన రెండో విడతలో పోలింగ్ సరళిని అధికారులు నిశితంగా పర్యవేక్షించారు. పలు పోలింగ్ సెంటర్లను సందర్శించారు. శివ్వంపేటలోని పలు పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు వాకాటి కరుణ, వెల్దుర్తి మండలం మాసాయిపేట గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ధర్మారెడ్డి పరిశీలించారు. వెల్దుర్తి మండల పరిధిలోని పలు పోలింగ్ సెంటర్లను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సందర్శించి పోలింగ్ తీరును తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దంపతులు కౌడిపల్లిలో, మాజీమంత్రి సునీతారెడ్డి గోమారంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. 14న తుదివిడత పోరు తొలి, మలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఈ నెల 14న జిల్లాలోని ఎనిమిది మండలాల (తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, మెదక్) పరిధిలో తుది విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 27న ఓట్లు లెక్కించి.. అదే రోజున ఫలితాలు వెల్లడించనున్నారు. -
77.84 ప్రశాంతం
సాక్షి, వరంగల్ రూరల్ : మలి విడత పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.భానుడు భగభగ మండుతున్నా ఓటర్లు ఓపికతో క్యూలో నిల్చున్నారు. మొదటి విడత కన్నా రెండో విడతకు పోలింగ్ శాతం ఎక్కువ నమోదైంది. జిల్లాలోని ఖానాపురం, నల్లబెల్లి, పరకాల, నడికూడ, శాయంపేట, రాయపర్తి మండలల్లో రెండో విడతలో పరిషత్ ఎన్నికలు శుక్రవారం జరిగాయి. 77.84శాతం పోలింగ్ నమోదైంది. ఆరు జెడ్పీటీసీ స్థానాలకు గాను 56 మంది, ఎంపీటీసీలు 63కు గాను 452 మంది బరిలో నిలిచారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరిగింది. 367 పోలింగ్ కేంద్రాల్లో 6,445 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వర్తించారు. గంట గంటకు పెరిగిన పోలింగ్ శాతం ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ జరిగింది. గంట గంటకు పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది.ఉదయం 9 గంటల వరకు 41,551 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 24.09శాతం, ఉదయం 11 గంటల వరకు 82, 505 ఓటు హక్కును వినియోగించుకోగా 47.84 శాతం, మధ్యాహ్నం 1 గంటల వరకు1,10,741 ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసే వరకు 1,34, 257 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా 77.84 శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆరు మండలల్లో జరిగిన ఎన్నికల్లో పరకాల మండలంలో ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పరకాలలో 14,526 మంది ఓటర్లు ఉండగా 11876 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా 81.76 శాతం నమోదైంది. శాయంపేట మండలంలో 33, 743 ఓటర్లుండగా 25,252 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 74.34శాతం నమోదైంది. పోలింగ్ పూర్తయిన తర్వాత ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్ రూంలకు తరలించారు. ఓటు హక్కు వినియోగించుకున్న పెద్ది దంపతులు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, సతీమణి నల్లబెల్లి జెడ్పీటీసీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పెద్ది స్వప్నలు నల్లబెల్లి మండల కేంద్రంలోని 38వ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం నల్లబెల్లి, ఖానాపురంలో మండలాల్లోని గ్రామాల్లోకి వెళ్లి ఓటింగ్ సరళిని తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో పరిశీలించిన కలెక్టర్ జిల్లా కలెక్టర్ ముండ్రాతి హరిత రెండవ విడత ఎన్నికలు జరగుతున్న మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ సిబ్బందిని పోలింగ్ సరళి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరకాల మండలంలోని కంఠాత్మకూరు, నడికూడ, కామారెడ్డిపల్లెల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. స్వల్ప ఘర్షణ శాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలిక పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి కోడెపాక స్వరూప, టీఆర్ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థి గండ్ర జ్యోతిలు ఇద్దరు దుర్బాషలాడుకున్నారు. బీజెపీ నాయకులు, స్థానికులు గండ్ర జ్యోతిని అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రికత్తత చోటుచేసుకుంది. ఖానాపురం మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఘర్షణ పడ్డారు. పోలిసులు చేరుకుని శాంతింప చేశారు. -
మండుటెండలో ఓట్ల వాన
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: మండుటెండలో ఓట్ల వాన కురిసింది. రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఉత్సాహంగా ఓట్లేశారు. భగభగ మం డుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా పో లింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు తమ ఓ టుహక్కును వినియోగించుకున్నారు. ఎండలను దృష్టిలో ఉంచుకుని ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ముఖ్యంగా మహిళలు, యువత, వృద్ధులు పెద్ద ఎత్తున తరలిరావడంతో తొలి మూడు గంటల్లోనే భారీగా పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసే సమయానికి 76.28 శాతం నమోదైంది. మొదటి విడత కంటే 3.97 శాతం అధికంగా ఓటర్లు ఓట్లేశారు. రెండో విడతలో భా గంగా బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఎనిమిది జెడ్పీటీసీ స్థానాలు, 75 ఎంపీటీసీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. ఈ విడతలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలు ఎక్కువగా ఉండటంతో పోలీసుశాఖ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని బోధన్ డివిజన్ మొత్తం 144 సెక్షన్‌ను అమలు చేసింది. మొత్తం మీద ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా సజావుగా, ప్రశాంతంగా పోలింగ్ ముగియడంతో అధికార యంత్రాంగం, పోలీసుశాఖ ఊపిరి పీల్చుకుంది. ఉదయం నుంచే ఉత్సాహంగా.. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభానికి ముందే తరలివచ్చిన ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 21 శాతం మంది ఓట్లేశారు. మధ్యాహ్నం 11 గంటల వరకు 48 శాతం పోలింగ్ దాటగా, ఒంటి గంట వరకు పోలింగ్ 60 శాతానికి చేరింది. ఎండ తీవ్రతకు మధ్యాహ్నం మందకొడిగా సాగింది. 3 గంటల వరకు 68.56 శాతం పోలింగ్ జరిగింది. మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చారు. పోలింగ్ సమయం ముగిసే వరకు మొత్తం 76.28 శాతం పోలింగ్ నమోదైంది. ముందు జాగ్రత్తగా 144 సెక్షన్.. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు బోధన్ డివిజన్లో శుక్రవారం 144 సెక్షన్‌ను అమలు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక బందోబస్తు కనిపించింది. 16 స్ట్రైకింగ్ ఫోర్స్, 14 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని సీపీ కార్తికేయ ప్రకటించారు. ఒక మొబైల్ టీంను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రతి సమస్యాత్మక కేంద్రాల్లో ఎస్ఐ స్థాయి అధికారిని నియమించారు. జాన్కంపేట్, నీలా, రెంజల్, సాటాపూర్ తదితర చోట్ల భారీ బందోబస్తు కనిపించింది. పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. జాన్కంపేట్, నీలా, సాటాపూర్, బోధన్ మండలం సాలూర, ఎడపల్లి, కోటగిరి, వర్ని తదితర పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. ఓటర్లకు అందించాల్సిన సౌకర్యాలు, తాగునీరు, దివ్యాంగులకు వీల్చైర్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్ల వంటి సౌకర్యాలపై ఆరా తీశారు. పోలింగ్ సజావుగా జరిపేందుకు ఎప్పటికప్పుడు ఎంపీడీఓలకు, రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును సీపీ కార్తికేయ పరిశీలించారు. జాన్కంపేట్, నీలా, రెంజల్ పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. లైవ్ వెబ్‌కాస్టింగ్.. పోలింగ్‌ను ఎప్పటి కప్పుడు పరిశీలించేందుకు పలు పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో లైవ్ వెబ్‌కాస్టింగ్‌ను కలెక్టర్ పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వీడియో చిత్రీకరణ చేపట్టారు. -
82.56% శాతం పోలింగ్
మిర్యాలగూడ : మిర్యాలగూడ డివిజన్లో శుక్రవారం ప్రాదేశిక ఎన్నికల మలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకో లేదు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఎండ వేడిమికి ఓటర్లు ఉదయమే ఎక్కువ మంది క్యూలో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు డివిజన్లో మొత్తం 82.56 శాతం పోలింగ్ నమోదైంది. మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధిలో పది మండలాల్లో 109 ఎంపీటీసీలకు గాను నాలుగు ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 105 ఎంపీటీసీ స్థానాలకు గాను 363 మంది అభ్యర్థులు, పది జెడ్పీటీసీ స్థానాలకు 51మంది మొత్తం 414 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో పది మండలాల్లో పురుషులు 1,49, 020 మంది, మహిళలు 1,51,331 మంది, ఇతరులు ఆరుగురు, మొత్తం 3,00,357 మంది ఓటర్లు ఉండగా 2,47,988 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా మాడుగులపల్లిలో పోలింగ్ డివిజన్లో అత్యధికంగా మాడుగులపల్లి మండలంలో పోలింగ్‌శాతం నమోదైంది. మొత్తం డివిజన్లో 82.56 శాతం పోలింగ్ కాగా అత్యధికంగా మాడుగులపల్లి మండలంలో 88.47 శాతం, అతి తక్కువగా అనుముల మండలంలో 79.01 శాతం పోలింగ్ నమోదైంది. భారీ బందోబస్తు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. డివిజన్లోని పది మండలాల్లో 1551 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఎస్పీ రంగనా«థ్ మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలం శెట్టిపాలెం, అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని పోలింగ్ స్టేషన్లను, అనుముల మండలం కొత్తపల్లి పోలింగ్ స్టేషన్‌ను పరిశీలించారు. ఎన్నికల పరిశీలకులు చంపాలాల్ నిడమనూరు మండలంలోని నారమ్మగూడెం పోలింగ్ స్టేషన్‌ను పరిశీలించారు. ఎండ వేడిమి వల్ల ఉదయమే ఎక్కువ పోలింగ్ వేసవిలో ఎండ వేడిమి వల్ల ఉదయం వేళలోనే ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావడం వల్ల మద్యాహ్నం 1 గంట వరకే డివిజన్లో 63.24 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 44 డిగ్రీల ఎండ వేడిమిలో కూడా ఓటర్లు బారులుదీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
ఓటెత్తిన చైతన్యం
కరీంనగర్: జిల్లాలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికల తుది దశ సమరం ప్రశాంతంగా ముగిసింది. మండే ఎండ సైతం పల్లె ఓటర్ల చైతన్యం ముందు చల్లబడింది. ఓ వైపు ఎండలు దంచి కొడుతున్నా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. 44 డిగ్రీల వేడితో భగభగమంటున్న భానుడి ప్రతాపాన్ని లెక్క చేయకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్లు వేసేందుకు జనం బారులు తీరారు. మలిదశ పోరులో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద యువత, మహిళలు, వృద్ధులు ఉదయం నుంచే ఓటు వేసేందుకు రావడం కనిపించింది. మరోవైపు అభ్యర్థులు కూడా ఓటర్లను రప్పించుకునే ఏర్పాట్లు చేయడం, పలు వాహనాల్లో వారిని కేంద్రాలకు చేరవేయడం వంటి సదుపాయాలతో ఓటింగ్ శాతం పెంచుకోగలిగారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అన్ని చోట్ల ఓటర్లు ముందస్తుగానే ఉదయం వేళ ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపించారు. ఇతర పనులకు వెళ్లాల్సిన వారు, వృద్ధులు, ఉపాధి కూలీలు ముందుగానే ఓటు హక్కు వినియోగించుకోవడం కనిపించింది. వృద్ధులను ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకువచ్చారు. జిల్లాలోని ఎనిమిది జెడ్పీటీసీ స్థానాలు, 88 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు 73.54 శాతం నమోదైంది. చిగురుమామిడి, చొప్పదండి, గంగాధర, గన్నేరువరం, కరీంనగర్‌రూరల్, కొత్తపల్లి, రామడుగు, తిమ్మాపూర్ మండలాల్లో పోలింగ్ జరుగగా అత్యధికంగా గన్నేరువరం మండలంలో 79.68 శాతం, ద్వితీయ స్థానంలో చొప్పదండి మండలం 75.96 శాతం, కరీంనగర్‌రూరల్ మండలంలో 69.35 శాతం అతి తక్కువ పోలింగ్ నమోదైంది. మండలాల వారీగా పోలింగ్.. ఎనిమిది జెడ్పీటీసీ, 88 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన పోరులో చిగురుమామిడి మండలంలో 75.73 శాతం, చొప్పదండి మండలంలో 75.96 శాతం, గంగాధరలో 71.66 శాతం, గన్నేరువరంలో 79.68 శాతం, కరీంనగర్‌రూరల్‌లో 69.35శాతం, కొత్తపల్లిలో 69.65 శాతం, రామడుగులో 74.06 శాతం, తిమ్మాపూర్ మండలంలో 75.34 శాతం పోలింగ్ నమోదైంది. ఉన్నతాధికారుల సందర్శన.. పరిషత్ పోరు సరళిని జిల్లా వ్యాప్తంగా పలు కేంద్రాలను సందర్శించి ఓటింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర సాధారణ పరిశీలకులు శర్మన్, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, సీపీ కమలాసన్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, డీఆర్వో భిక్షానాయక్, ఆర్డీవో ఆనంద్‌కుమార్, జెడ్పీ సీఈవో వెంకటమాధవరావు, ఆయా విభాగాల అధికారులు మండల కేంద్రాల్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తూ సిబ్బందికి సూచనలు చేశారు. ఓటేసిన ప్రముఖలు... పరిషత్ ఎన్నికల్లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బూర్గుపల్లి గ్రామంలో ఓటు వేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చిగురుమామిడి మండలం రేకొండలో ఓటేశారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి చిగురుమామిడి మండల కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి చొప్పదండి మండలం మంగళపల్లిలో ఓటు వేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి తన స్వగ్రామమైన ఒగులాపూర్‌లో ఓటు వేశారు. రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గూడెల్లి తిరుపతి గన్నేరువరం మండలం గునుకులకొండాపూర్ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
సల్లపూట..ఓటుబాట
ప్రాదేశిక ఎన్నికల్లో ఓటర్లు క్యూ కట్టారు. ఎండను సైతం లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాల బాట పట్టారు. శుక్రవారం బోథ్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో జరిగిన మలి విడత ఎన్నికల్లో అంతా ఉత్సాహంగా ఓటేయడంతో 75.33 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో మహిళలు అధిక సంఖ్యలో ఓటేయడం గమన్హారం. ఇచ్చోడ(బోథ్): జిల్లాలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాతంగా ముగిశాయి. శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఉదయం, సాయంత్రం పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం ఎండకు పోలింగ్ మందకొడిగా కొనసాగింది. పగటి పూట పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు లేకపోవడంతో సిబ్బంది ఖాళీగా కూర్చున్నారు. సాయంత్రం ఒకేసారి బారులు తీరారు. దూర ప్రాంతాలు, పట్టణ ప్రాంతంలో ఉన్న వారు, పొలం పనులకు వెళ్లిన వారు సాయంత్రం ఐదు గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటేశారు. దీంతో సాయంత్రం వేళా పోలింగ్‌శాతం అధికంగా నమోదైంది. ఉదయం 9 గంటల వరకు పోలింగ్ జరుగుతున్న ఐదు మండలాల్లో కేవలం 18.45శాతం మాత్రమే పోలింగ్ నమోదు కాగా చివరకు పెరిగింది. 75.33శాతం పోలింగ్ నమోదు ఐదు మండలాల్లో మొత్తం 1,26,960 మంది ఓటర్లు ఉండగా 94,130 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 46,987 మంది పురుషులు, 47,147 మంది మహిళలు ఓటేశారు. తలమడుగు మండలంలో అత్యధికంగా 81.05 శాతం పోలింగ్ నమోదు కాగా, అతిస్వల్పపంగా బజార్హత్నూర్ మండలంలో 72.65 పోలింగ్ శాతం నమోదైంది. చిన్నచిన్న సంఘటనలు బోథ్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో చిన్నచిన్న సంఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. నేరడిగొండ మండలం కొర్టిటికల్(బి)లో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకొని సద్దుమణిగించారు. నారాయణపూర్‌లో పోలింగ్ కేంద్రంలో ఉన్న పార్టీ ఏజెంట్ల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. బోథ్ మండలంలోని సోనాలలో ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు ప్రచారం జరగడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. గుడిహత్నూర్ పోలింగ్ స్టేషన్‌ను ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ పరిశీలించారు. టివిటిలో పోలింగ్ బహిష్కరణ బోథ్ మండలంలోని టివిటి గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. గతంలో తమ గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేయకుండా ఇతర గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేశారని, ప్రసుతం తమ గ్రామంలో పోలింగ్ భూత్ ఏర్పాటు చేయకుండా పార్టీబి గ్రామంలో పోలింగ్ భూత్ ఏర్పాటు చేశారని వారు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. పార్టీ బి గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో వెళ్లి ఓటు వేయడానికి వెళ్లాల్సి ఉంటుందని గ్రామస్తులు ఓట్లు వేయకుండా ఎన్నికలు బహిష్కరించారు. ఈ గ్రామంలో 167 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌కు భారీ బందోబస్తు రెండో విడతలో తలమడుగు, గుడిహత్నూర్, బజార్హత్నూర్, నేరడిగొండ, బోథ్ మండలాల్లో జరిగిన ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. పోలింగ్ కేంద్రానికి ఇరువైపులా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్రాలకు వందమీటర్ల దూరంలో ఎవరినీ రానివ్వలేదు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. -
ప్రశాంతంగా ముగిసిన రెండోవిడత పోలింగ్
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలో రెండోవిడుత ప్రాదేశిక ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. మొదటి విడతతో పోల్చితే రెండవ విడతలో ఏకంగా నాలుగు శాతం పోలింగ్ పెరిగింది. ఎండలను సైతం లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా మొత్తంగా 73.68 శాతం నమోదైంది. మొదటి విడతలో 69.84 శాతం పోలింగ్ నమోదుకాగా ఈ సారి 4శాతం పెరిగింది. 7 జెడ్పీటీసీ, 91 ఎంపీటీసీ స్థానాలకు.. రెండోవిడతలో అడ్డాకుల, దేవరకద్ర, కోయిల్‌కొండ, సీసీకుంట, మహబూబ్‌నగర్, మూసాపేట, హన్వాడ మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 7 జెడ్పీటీసీ, 91 ఎంపీటీసీ స్థానాలకు గాను 318 మంది బరిలో నిలిచారు. ఇందులో జెడ్పీటీసీ స్థానాలకు 30 మంది బరిలో నిలిచారు. ఎంపీటీసీ స్థానాలకు 288 బంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. తొలి రెండు గంటల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు రాక కొంత మంద కొడిగా కనిపించింది. 9 గంటల తర్వాత 20 శాతం, 9 గం టల నుంచి 11 గంటల వరకు తొలి రెండు గంట లు సాగినట్లుగానే సాఫీగా సాగింది. 11 గంటల తరువాత 40.95 పోలింగ్ శాతం నమోదైంది. మ ధ్యాహ్నం 1 గంటలకు 60.19 శాతంగా నిలిచింది. గొడవలకు ఆస్కారం లేకుండా.. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరుగలేదు. చిన్నచిన్న సమస్యలు తప్పా ఎలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తలేదు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన వికలాంగులకు తోడుగా సహాయకులు వచ్చారు. వారి కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లను ఏర్పాటు చేసి తీసుకెళ్లారు. పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు ఉండడంతో 4 గంటలకు చాలా మంది ఓటర్లు వచ్చారు. 5 గంటలలోపు పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారికి ఓటింగ్‌కు అనుమతించారు. దీంతో చాలా చోట్ల సమయం ముగిసినా పోలింగ్ కొనసాగింది. మహబూబ్‌నగర్ మండలంలోని జైనల్లిపూర్లో నూతన వధూవరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 73.68 పోలింగ్ రెండోవిడత ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 73.68 పోలింగ్‌శాతం నమోదైంది. అత్యధికంగా దేవరకద్రలో 76.97 శాతం, అత్యల్పకంగా కోయిలకొండలో 68.14 శాతం, మూసాపేట్లో 74.93 శాతం, సీసీకుంటలో 76.14, హన్వాడలో 71.89, మహబూబ్‌నగర్‌లో 75.91 శాతం నమోదైంది ఉదయం 9 గంటలకు 21.4 శాతం ఉదయం పోలింగ్ మంకొడిగా సాగింది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 46,416 ఓట్లు పోలవ్వగా 20 శాతం నమోదైంది. 11 గంటలకు 94,661 ఓట్లు పోల్ కాగా 40.95 శాతం, మధ్యహ్నం 1 గంటలకు 1,39,147 ఓట్లు పోల్ కాగా 60.19 శాతం, 3 గంటలకు 1,55,583 ఓట్లు పోల్ కాగా 67.30 శాతం పోలింగ్ నమోదైంది. చివరగా 2,30,383 ఓటర్లకు గాను 1,70,338 ఓట్లు పోల్ కాగా 73.68 శాతం నమోదైంది. ఇందులో 85,640 పురుష ఓటర్లు, 84.698 మహిళా ఓటర్లు ఉన్నారు. పల్లెల్లో పండగ వాతావరణం పోలింగ్ జరుగుతున్న పల్లెల్లో పండగ వాతావరణం నెలకుంది. ఎన్నికలు జరగుతున్న గ్రామాల్లో ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటించింది. దీంతో పల్లెల్లోని చౌరస్తాలు మొత్తం జనంతో కిటకిట లాడాయి. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో హద్దును వేశారు. బార్డర్ అవతలికి పోటీ చేస్తున్న మద్దతు దారులు పోలింగ్‌పై సూచనలు చేశారు. పర్యవేక్షించిన కలెక్టర్ రొనాల్డ్‌రోస్ తొలివిడత జరుగుతున్న మండలాల్లో కలెక్టర్ రొనాల్డ్‌రోస్ స్వయంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పరిశీలించారు. మహబూబ్‌నగర్ మండలంలోని మనికొండ, మాచారం, పోతన్‌పల్లి, హన్వాడ మండలంలో పల్లెమోనికాలనీ, మాదరం, అమ్మాపూర్తండా, మునిమోక్షం, కోయిల్‌కొండ మండలంలో కొత్తాబాద్, సూరారం, భూర్గుపల్లి, వీరంపల్లి, మల్కపూర్, రాజీవ్నగర్తాండ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి గుర్తులను సూచించే పట్టిక సక్రమంగా ఉంచారా లేదని పరిశీలించారు. ఇక్కడ పోలింగ్í Üసిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్‌ను పారదర్శకంగా నిర్వహించాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు. గట్టి బందోబస్తు నిర్వహించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరుగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ సరళిపై మంత్రి ఆరా రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పోలింగ్ సరళిపై ఆరా తీశారు. సల్లోనిపల్లి, హన్వాడ, అప్పాయిపల్లి, ఓబులాయపల్లి, ధర్మాపూర్ గ్రామాల్లో పర్యటించారు. స్థానిక నాయకులతో మాట్లాడి పోలింగ్ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం దివిటిపల్లిలో ఓటు వేసేందుకు పంజాబ్ రాష్ట్రంలోని బతిండలో నివసిస్తున్న దంపతులను ఆయన అభినందించారు. -
82.05 శాతం పోలింగ్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో రెండో విడత పరిషత్ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. ఆరు జెడ్పీటీసీ, 82 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు మండలాల్లో ఎన్నికలు నిర్వహించగా.. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో అధికార యంత్రాంగంతోపాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికలు జరిగే సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సందర్భంగా ఏమైనా సంఘటనలు జరిగితే వెంటనే స్పందించేందుకు రూట్ మొబైల్ పార్టీలను సిద్ధంగా ఉంచారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఉదయం మందకొడిగా పోలింగ్ జరిగినప్పటికీ 11 గంటల తర్వాత ఊపందుకుంది. మొదటి విడత ఎన్నికల్లో చెదురు మదురు సంఘటనలు చోటు చేసుకోగా.. రెండో విడతలో మాత్రం ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. అయితే సత్తుపల్లి మండలం కిష్టారంలో మద్యం మత్తులో ఓ యువకుడు ట్రెయినీ ఎస్సై శ్రీకాంత్‌ను నెట్టివేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెనుబల్లి మండలం లంకపల్లిలో గురువారం రాత్రి స్వల్ప ఘర్షణ జరగడంతో భారీ ఎత్తున పోలీస్ బలగాలు మోహరించి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద మంచినీరు తదితర ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్, సీపీ.. రెండో విడత ఎన్నికలు జరిగిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ సందర్శించారు. తల్లాడ జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ కర్ణన్, జెడ్పీ సీఈఓ ప్రియాంక సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. అన్నారుగూడెంలో ఎన్నికల సరళిని సీపీ తఫ్సీర్ ఇక్బాల్ పరిశీలించి.. శాంతిభద్రతలను పర్యవేక్షించారు. అలాగే కిష్టారం పోలింగ్ కేంద్రాన్ని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, అసిస్టెంట్ కలెక్టర్ హనుమంతు కొడింబా పరిశీలించారు. పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. మొత్తం 82.05 శాతం పోలింగ్ నమోదు.. రెండో విడత ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, తల్లాడ, సత్తుపల్లి, వేంసూరు జెడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తం 82.05 శాతం పోలింగ్ నమోదైంది. 1,88,785 ఓట్లు పోల్ కాగా.. అందులో 93,143 మంది పురుషులు, 95,642 మంది మహిళలు ఓట్లు వేశారు. అత్యధికంగా ఏన్కూరులో 85.31 శాతం పోలింగ్ జరిగింది. మొత్తం 22,207 ఓట్లు పోల్ కాగా.. 10,881 మంది పురుషులు, 11,326 మంది మహిళలు ఓట్లు వేశారు. అత్యల్పంగా కల్లూరులో 77.45 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 39,360 మంది ఓటు వేయగా.. అందులో 19,532 మంది పురుషులు, 19,828 మంది మహిళలు ఉన్నారు. పెనుబల్లిలో 84.61 శాతం పోలింగ్ నమోదు కాగా.. 34,418 మంది ఓటు వేశారు. ఇందులో 17,003 మంది పురుషులు, 17,415 మంది మహిళలు ఉన్నారు. సత్తుపల్లిలో 83.14 శాతం పోలింగ్ నమోదు కాగా.. 28,536 మంది ఓట్లు వేశారు. 13,784 మంది పురుషులు, 14,752 మంది మహిళలు ఓట్లు వేశారు. తల్లాడలో 83.46 శాతం పోలింగ్ జరగ్గా.. 36,564 మంది ఓట్లు వేశారు. 18,064 మంది పురుషులు, 18,500 మంది మహిళలు ఓట్లు వేశారు. వేంసూరులో 80.49 శాతం పోలింగ్ జరగ్గా.. మొత్తం 27,700 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 13,879 మంది పురుషులు, 13,821 మంది మహిళలు ఓట్లు వేశారు. -
రెండో విడత ప్రాదేశిక పోలింగ్ నేడే
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రాదేశిక ఎన్నికల సమరం–2 నేడు జరగనుంది. ఈ విడతలో అడ్డాకుల, దేవరకద్ర, కోయిల్‌కొండ, సీసీకుంట, మహబూబ్‌నగర్ రూరల్, మూసాపేట్, హన్వాడ మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. 7 జెడ్పీటీసీ, 91 ఎంపీటీసీ స్థానాలకు గాను 318 మంది బరిలో నిలిచారు. ఇందులో జెడ్పీటీసీ స్థానాలకు 30 మంది, ఎంపీటీసీ స్థానాలకు 288 బంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రమే ప్రచారం ముగిసింది. 437 పోలింగ్ కేంద్రాలు.. రెండో విడత ఎన్నికలు జరిగే మండలాల్లో మొత్తం 437 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇందులో అత్యధికంగా దేవరకద్రంలో 80 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశారు. కోయిల్‌కొండలో 79 కేంద్రాలు, సీసీ కుంటలో 67, హన్వాడలో 65, మహబూబ్‌నగర్‌లో 65, మూసాపేట్లో 39 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,30,383 ఓటర్లు రెండోవిడతలో జరిగే ఎన్నికల్లో 7 మండలాలకు కలుపుకుని మొత్తం 2,30,383 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో అత్యధికంగా కోయిల్‌కొండలో 44,959 ఓటర్లు, అత్యల్పంగా మూసాపేట మండలంలో 19,852 ఓటర్లు కాగా అడ్డాకులలో 22,339, సీసీకుంటలో 33,677, దేవరకద్రలో 41,884, హన్వాడలో 35,160, మహబూబ్‌నగర్‌లో 32,512 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 16 గ్రామాలు, 62 పోలింగ్ స్టేషన్లు జిల్లాలో రెండో విడత జరిగే గ్రామాల్లో మొత్తంగా 16 గ్రామాలు, 62 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. ఈ పోలింగ్ స్టేషన్లను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించారు. ఇందుకోసం సమస్యాత్మక గ్రామాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నారు. మిగిలిన 16 గ్రామాల్లో మైక్రొ అబ్జర్వర్లను నియమించారు. వీరు నిరంతరం ఎన్నికల సరళిని పరిశీలించి ఉన్నతా«ధికారులకు పరిస్థితిని చేరవేస్తుంటారు. సీసీకుంటలో 23 సమస్యాత్మక కేంద్రాలు రెండో విడత ఎన్నికలు జరిగే మండలాల్లో సీసీ కుంటలో 23 అత్యధికంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయి. హన్వాడలో 14, దేవరకద్రలో 13, అడ్డాకులలో 10, కోయిల్‌కొండలో 3 సమస్మాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ విడత ఎన్నికలు జరిగే మహబూబ్‌నగర్, మూసాపేట్ మండలాల్లో ఎలాంటి సమస్యాత్మ గ్రామాలు కాని, పోలింగ్స్టేషన్లు కాని లేవు. రెండో విడతలో 91 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుతున్నాయి. ఇందుకోసం 437 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు చేశారు. వీటిని 209 లోకేషన్లలో ఏర్పాటు చేశారు. మొత్తంగా 2,30,383 ఓటర్లు ఉన్నారు. 2581 పోలింగ్ సిబ్బంది రెండోవిడత కోసం మొత్తం 2,581 పోలింగ్ సిబ్బందిని నియమించారు. వారికి ఇదివరకే పోలింగ్ శిక్షణను ఇచ్చారు. పీఓలు 437, ఏపీఓలు 437 మంది ఉండగా ఇతర పోలింగ్ అధికారులు 1,707 మందితోపాటు 12 శాతం సిబ్బందిని రిజర్వులో ఉంచారు. అత్యవసర సమయంలో వీరికి ఉపయోగించుకోనున్నారు. అందుకు వారిని ముందుకుగా ఎంపిక చేసి సిద్ధంగా ఉంచారు. పోలింగ్ సామగ్రి పంపిణీ జిల్లాలో జరిగే ఏడు మండలాల్లో పాల్గొనే ఎన్నికల సిబ్బందికి ఆయా మండల కేంద్రాల్లో పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. ఈ ప్రక్రియను కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పరిశీలించారు. ఎన్నికలకు అవసరమయ్యే సామగ్రిలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ సామాగ్రితో వెళ్లే అధికారులకు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించారు. గుర్తింపు కార్డు తప్పనిసరి ఓటు వేసేందుకు ఓటర్లు కచ్చితంగా ఏదో ఒక గుర్తింపు కార్డును కచ్చితంగా పోలింగ్ కేంద్రానికి తీసుకుని పోవాల్సి వస్తుంది. ఎన్నికల సంఘం 28 రకాల గుర్తింపు కార్డులు తీసుకుపోవచ్చని సూచించింది. అందులో ఓటర్ గుర్తింపు కార్డు, ఆదార్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం, పొలానికి చెందిన పట్టాదారు పాస్‌పుస్తం, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, కిసాన్ కార్డు లాంటివి కచ్చితంగా ఉండాలి. ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకటి ఎంపీటీసీకి, రెండోది జెడ్పీటీసీకి. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. జిల్లాలో రెండే విడతలు రెండోవిడత ప్రాదేశిక ఎన్నికలు శుక్రవారంతో ముగియనున్నాయి. దీంతో జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగియనుంది. మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు విడతల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడుతలో 7 మండలాలకు, రెండోవిడతలో ఏడు మండలాల్లో ఎన్నికల జరిగాయి. దీంతో జిల్లాలో ఎన్నికలు పరిపూర్ణం కానున్నాయి. ఇక ఓట్ల లెక్కింపు కోసం మరో 17 రోజుల పాటు వేచి చూడాల్సిందే. 27వ తేదీన ఫలితాలు వస్తాయి. -
రెండో విడతకు రెడీ
హన్మకొండ: జిల్లా, మండల ప్రజాపరిషత్ ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈమేరకు సిబ్బందికి పోలింగ్ సామగ్రిని గురువారం అందించనున్నారు. ధర్మసాగర్, వేలేరు మండలాల ఉద్యోగులకు ధర్మసాగర్‌లోని జూనియర్ కాలేజీలో, ఐనవోలు మండల ఉద్యోగులకు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్లోని ఈవీఎం గోదాంలో సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం 7.30 గంటల నుంచి పోలింగ్ సిబ్బంది రిపోర్టు, సామగ్రి పంపిణీ ప్రక్రియ మొదలవుతుంది. సాయంత్రానికి సిబ్బంది పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటారు. ఇక 10వ తేదీన శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. 3 జెడ్పీటీసీ స్థానాలు, 34 ఎంపీటీసీ స్థానాలు వరంగల్ అర్బన్ జిల్లాలోని మూడు జెడ్పీటీసీ స్థానాలు, 34 ఎంపీటీసీ స్థానాలకు రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు జరగనున్నాయి. అధికారులు ఇప్పటికే పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. ఈ దఫాలో 86,465 మంది ఓటర్లకు గాను 184 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. కాగా, మూడు జెడ్పీటీసీ స్థానాలకు 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ధర్మసాగర్ జెడ్పీటీసీ స్థానానికి ఆరుగురు, వేలేరు జెడ్పీటీసీ స్థానానికి నలుగురు, ఐనవోలు జెడ్పీటీసీ స్థానానికి ఐదుగురు పోటీ పడుతున్నారు. ఇక మూడు మండలాల్లోని 34 ఎంపీటీసీ స్థానాలకు గాను 98 మంది బరిలో ఉన్నారు. ఇందులో ఐనవోలు మండలం నుంచి ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవి కాకుండా ధర్మసాగర్ మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాలకు 41 మంది, వేలేరు మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు 21 మంది, ఐనవోలు మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలకు 36 మంది పోటీలో ఉన్నారు. సామగ్రి పంపిణీ.. పోలింగ్ పర్యవేక్షణ పోలింగ్ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంతంగా సాగేలా పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఈ మేరకు వీరు పోలింగ్ సామాగ్రి పంపిణీతో పాటు పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తారు. ధర్మసాగర్ మండలానికి ఎస్సారెస్పీ డిప్యూటీ కలెక్టర్ గణేశ్, ఐనవోలుకు డీఆర్డీఓ రాము, వేలేరుకు మెప్మా పీడీ కృష్ణవేణి ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు జెడ్పీ, మండల ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్ శుక్రవారం జరగనుండగా ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగిసింది. ఎన్నికల్లో విజయం కోసం పార్టీలు, అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తించారు. డప్పుచప్పుళ్ల మద్య అభ్యర్థులు, పార్టీ అగ్రనాయకులు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. ప్రచార రథాలు, మైకులతో గ్రామాల వీధులు హోరెత్తాయి. జెడ్పీ, మండల ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా వ్యూహా, ప్రతివ్యూహాలతో ముందుకు సాగారు. పోలింగ్ సమీపించడంతో ప్రధానంగా ఎంపీటీసీ అభ్యర్థులు తమకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు ఉపయోగిస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకుంనేందుకు మద్యం, డబ్బు, ఇతరత్రా తాయిలాలను ఎర వేస్తున్నారని సమాచారం అందుతోంది. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఐనవోలు: ఐనవోలు మండలంలో శుక్రవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని ఎంపీడీఓ నాగపురి స్వరూప తెలిపారు. హన్మకొండలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించి ఏర్పాట్లపై ఆరా తీయగా ఆమె వివరించారు. శుక్రవారం జరగనున్న రెండో విడత ప్రాదేశిక ఎన్నికల సందర్భంగా ఐనవోలు మండలంలోని 66 పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించడానికి 180 మంది పీఓ, ఏపీఓలు 180తో పాటు ఇతర సిబ్బంది 300 మం దిని నియమించినట్లు ఎంపీడీఓ కలెక్టర్‌కు వివరించారు. అలాగే, ఒక్క ఏసీపీ, ఇద్దరు సీఐలు, ఏడుగురు ఎస్సైలు, 18 మంది ఏఎస్సై, హెచ్‌సీలు, 32 మంది హోంగార్డులు, 8 మంది ఏఆర్‌లు, 34 మంది కానిస్టేబుళ్లతో పాటు 12 మంది మహిళా పోలీసులు విధుల్లో పాల్గొంటారని ఎస్సై నర్సింహరావు తెలిపారు. -
ముగ్గురి నామినేషన్లు తిరస్కరణ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తొలిదశ ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన గురువారం ముగిసింది. 96 ఎంపీటీసీలకు 475, ఏడు జెడ్పీటీసీలకు 60 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. వీరిలో ముగ్గురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నిర్ధిష్ట నమూనా ప్రకారం వివరాలు ఇవ్వకపోవడం, తప్పుడు సమాచారం, సరైన ధ్రువపత్రాలు లేని కారణంగా వీటిని తిరస్కరించినట్లు రిట ర్నింగ్ అధికారులు తెలిపారు. ఎంపీటీసీలు రెండు, జెడ్పీటీసీల్లో ఒక నామినేషన్ తిరస్కరణకు గురయ్యాయి. ఇవిపోగా ఎంపీటీసీలకు 473, జెడ్పీటీసీలకు 59 మంది నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. నామినేషన్ల ఉప సంహరణకు ఈనెల 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంది. నేడు రెండో విడత నోటిఫికేషన్ రెండో విడత ప్రాదేశిక పోరుకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ వెలువడనుంది. రెండో దశలో 8 మండలాల పరిధిలోని 94 ఎంపీటీసీలు, 8 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. నామినేషన్ల దాఖలుకు 28వ తేదీ ఆఖరు. -
95 స్థానాల్లో నేడు పోలింగ్
న్యూఢిల్లీ: లోక్‌సభ రెండో దశ ఎన్నికల్లో భాగంగా నేడు 95 స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఒక కేంద్రపాలిత ప్రాంతం, 11 రాష్ట్రాల్లోని జరగనుంది. కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జువల్ ఓరమ్, సదానంద గౌడ, పొన్ రాధాకృష్ణ సహా, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, డీఎంకే నేత దయానిధి మారన్, ఏ రాజా, కనిమొళి తదితరులు రెండో దఫా ఓటింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండో దశ పోలింగ్‌లో మొత్తంగా 1,600 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తంగా 15.8 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. షెడ్యూల్ ప్రకారం తమిళనాడులోని 39 చోట్ల ఓటింగ్ జరగాల్సింది. కానీ, డీఎంకే నేత సంబంధీకుల వద్ద భారీ మొత్తంలో నగదు లభించిన నేపథ్యంలో రాష్ట్రంలోని వేలూరు నియోజకవర్గంలో పోలింగ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం రద్దుచేసింది. సరైన శాంతిభద్రతలు లేకపోవడంతో త్రిపుర(ఈస్ట్) స్థానానికి పోలింగ్‌ను మూడో దశలో (ఏప్రిల్ 23న) నిర్వహించనున్నారు. ఒడిశాలోని కంధమాల్ జిల్లా ఫుల్బనీ అసెంబ్లీ నియోజకవర్గంలో సిబ్బందితో కలసి పోలింగ్ బూత్‌కు వెళ్తున్న ఎన్నికల అధికారిణిని మావోలు బుధవారం కాల్చి చంపారు. -
తేలనున్న ప్రముఖుల భవితవ్యం..
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ రేపు (గురువారం) జరుగనుంది. రెండో విడత ఎన్నికల ప్రచారం మంగళవారంతో పరిసమాప్తమైంది. ఒడిశాలో 35 అసెంబ్లీ స్థానాలకు కూడా గురువారం రెండో దశ పోలింగ్ జరుగనుంది. కర్ణాటకలో 28, తమిళనాడులో 39 లోక్ సభ స్థానాలకు ఈ దశలోనే పోలింగ్ జరుగనుంది. అస్సాం, బిహార్, ఛత్తీస్ గఢ్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, మణిపూర్, త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలోని 96 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ కొనసాగనుంది. రేపు జరిగే ఎన్నికల్లో కేంద్రమంత్రులు, పలువురు ప్రముఖ నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మొత్తం 15 కోట్లకు పైగా ఓటర్లు 1629 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. తొలి విడతలో భాగంగా 20 రాష్ట్రాల్లోని 91 లోక్‌సభ స్థానాలకు ఈనెల 11న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. మథుర: ప్రతిష్టాత్మకమైన ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రముఖ నటి, హేమామాలిని పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మహేష్ పథాక్, ఆర్ఎల్డీ నుంచి నరేంద్ర సింగ్ కున్వర్ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆర్ఎల్డీ అభ్యర్థి జయంత్ చౌదరీ విజయంపై హేమామాలిని సాధించారు. ఫతేపూర్‌సిక్రీ: కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ యూపీ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ పోటీలో నిలవగా, బీజేపీ నుంచి రాజ్ కుమార్ పోటీలో నిలిచారు. కన్యాకుమారి: (తమిళనాడు) దక్షిణ భారతంలో ప్రసిద్ధిగాంచిన కన్యాకుమారి లోక్‌సభ పోరు ఉత్కంఠ రేపుతోంది. పొత్తులో భాగంగా ఈస్థానాన్ని డీఎంకే కాంగ్రెస్‌కు కేటాయించగా, పోన్ రాధాకృష్ణ బీజేపీ అభ్యర్థిగా పోటీపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి వసంతకుమార్ బరిలో నిలిచారు. తుత్తుకుడి: తమిళనాడులో ఈ లోక్‌సభ స్థానం చర్చనీయాంశంగా మారింది. డీఎంకే నుంచి మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమొళి బరిలో నిలవగా.. బీజేపీ నుంచి ఫైర్‌బ్రాండ్ సౌందరరాజన్ పోటీలో ఉన్నారు. డీఎంకే ఆస్థానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. శివగంగా( తమిళనాడు): కేంద్ర మాజీమంత్రి చిదంబరం తనయుడు, కార్తీ చిదంబరాన్ని కాంగ్రెస్ బరిలో నిలిపింది. హెచ్ రాజా బీజేపీ నుంచి పోటీపడుతున్నారు. లోకనాయకుడికీ అగ్నిపరీక్షే.. బహుభాషా నటునిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హీరో కమల్ హాసన్. ఆయన నెలకొల్పిన మక్కళ్ నీధి మయ్యం పార్టీ తొలిసారిగా లోక్ సభ ఎన్నికలను రుచి చూస్తోంది. ఈ ఎన్నికల్లో కమల్ హాసన్ పోటీ చేయట్లేదు. అయినప్పటికీ.. తమిళనాడులోని 39 లోక్ సభ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించారు. రెండో దశలో తమిళనాడులోని అన్ని నియోజకవర్గాలకూ పోలింగ్ జరుగనుంది. కమల్ హాసన్ ప్రభావం ఏ విధంగా ఉంటుందనే విషయం కూడా తేలనుంది. రాష్ట్ర రాజకీయాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించినందున తాను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని కమల్ ఇదివరకే ప్రకటించారు. తుమకూరు, (కర్ణాటక): మాజీ ప్రధాని దేవెగౌడ ఆస్థానం నుంచి పోటీ చేస్తుడడంతో యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. చివరి వరకు ఆయన పోటీకి నిరాకరించడంతో కాంగ్రెస్ ఇక్కడ అభ్యర్థిని సైతం ప్రకటించింది. తీవ్ర ఉత్కంఠ నడుమ తూమకూరు నుంచి పోటీ చేస్తున్నట్లు దేవెగౌడ ప్రకటించి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. జీఎస్ దస్వరాజ్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే జేడీఎస్‌కు కంచుకోటైన మాండ్య నుంచి సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ తొలిసారి పోటీ పడుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన ప్రముఖ నటుడు అంభారిష్ మృతిలో ఆయన భార్య సుమలత స్వాతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. మాండ్య నుంచి నటి సుమలత, బెంగళూరు సెంట్రల్ నుంచి సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ ఒకేసారి రాజకీయాల్లోకి ప్రవేశించడం చెప్పుకోదగ్గ విశేషం. ఈ విషయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే- వారిద్దరూ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగారు. సుమలతకు బీజేపీ మద్దతు ఇస్తుండగా.. ప్రకాష్ రాజ్ కు ఆమ్ఆద్మీ పార్టీ అండగా నిలిచింది. ఈ రెండు స్థానాల్లో అటు బీజేపీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్థులను నిలబెట్టలేదు. దీనితోపాటు నిఖిల్ గౌడ కూడా నటుడే కావడంతో.. కర్ణాటక రాజకీయాలు సినీ గ్లామర్ ను సంతరించుకున్నాయి శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ అధినేత ఫరూర్ అబ్దుల్లా శ్రీనగర్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిచారు. పీడీపీ, బీజేపీ కూడా అభ్యర్థులను ప్రకటించాయి. వీటితో పాటు బెంగుళూర్ దక్షిణ, డార్జిలింగ్, రాణిగంజ్, మహారాష్ట్రలోని అమరావతి, అకోలా స్థానాలకు రేపు పోలింగ్ జరుగనుంది. అలాగే ఇప్పటికే వరుసగా ముడు సార్లు విజయాన్ని అందుకున్న బీజూ జనతాదళ్ నాలుగోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. 145 అసెంబ్లీ స్థానాలున్న ఒడిశాలో రెండో విడతలో 35 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. -
రెండో విడతలోనూ ప్రభంజనం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రెండో దశలోనూ గులాబీ గుబాళించింది. అత్యధిక గ్రామ పంచాయతీలను దక్కించుకొని తిరుగులేని అధిక్యతను సాధించింది. శుక్రవారం ఎన్నికలు జరిగిన 8 మండలాల్లో అన్నింట్లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లో మినహా మిగతా చోట్ల కాంగ్రెస్ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. తొలిదశలో కారుజోరు సాగగా.. రెండో విడతలో కూడా దుమ్ము రేపింది. ఏకంగా ఆ పార్టీ 85 గ్రామ పంచాయతీలను చేజిక్కించుకుంది. ముఖ్యంగా కల్వకుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గణనీయంగా సర్పంచ్ పదవులను దక్కించుకున్నారు. తలకొండపల్లిలో ఏకంగా 24 గ్రామ సర్పంచ్ పదవులను టీఆర్ఎస్ మద్దతుదారులు గెలుచుకోగా.. కడ్తాల్‌లో 14, మాడ్గులలో 19 గ్రామాల్లో పాగా వేశారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే 41 పల్లెలను హస్తగతం చేసుకుంది. ఆరు జీపీల్లో బీజేపీ, నాలుగు చోట్ల సీపీఎం, మూడు గ్రామాల్లో టీడీపీ విజయం సాధించింది. 12 చోట్ల స్వతంత్రులు విజయఢంకా మోగించారు. ఇదిలావుండగా, శివారు మండలాలు కావడంతో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీచేసిన అభ్యర్థులు భారీగా ఖర్చు చేశారు. స్థిరాస్తి రంగం ప్రభావం గ్రామాలపై కనిపించడంతో సర్పంచ్, వార్డుల్లో పాగా వేసేందుకు ఇబ్బడిముబ్బడిగా నగదును వెదజల్లారు. రిజర్వ్డ్ స్థానాల్లో ఉప సర్పంచ్ పోస్టును కైవసం చేసుకోవడానికి రూ.లక్షలు వెచ్చించారు. 89శాతం పోలింగ్ రెండో దశ పంచాయతీ పోరు ముగిసింది. శుక్రవారం జరిగిన పోలింగ్‌లో 89శాతం పోలింగ్ నమోదైంది. తొలిదశతో పోలిస్తే ఇది నాలుగు శాతం తక్కువ. ఎనిమిది మండలాల పరిధిలోని 181 గ్రామ పంచాయతీలకుగాను 21జీపీలు ఏకగ్రీవం కాగా.. ఇందులో మాడ్గుల మండలం ఫల్గుతండా సర్పంచ్ పదవి వివాదాస్పదమైంది. పదవిని వేలం వేశారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందడంతో ప్రస్తుతానికి దీన్ని పెండింగ్‌లో పెట్టారు. దీనిపై ఈసీ నిర్ణయం వెలువరించే వరకు వేచిచూడాల్సిందే! మరోవైపు ఏకగ్రీవం పోను మిగతా 160 పంచాయతీలకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల్లో బారులుతీరిన ఓటర్లు ఉత్సాహంతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఉత్కంఠ మధ్య సాగిన కౌంటింగ్‌లో విజేతలు నిలిచిన అభ్యర్థులు విజయ దరహాసంతో ఊరేగగా.. పరాజితులు ఓటమి భారంతో వెనుదిరగడం కనిపించింది. మాడ్గుల మండలం కొల్కుల్‌పల్లిలో మాత్రం ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓడిపోయిన అభ్యర్థి విజేత వర్గీయులపై రాళ్లురువ్విన సంఘటనలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మినహా మిగతా చోట్ల ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ ముగిసింది. -
కారు అదే జోరు
సాక్షి, వరంగల్ రూరల్: మొదటి విడతలో ఉన్నట్లుగానే రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో గులాబీ జోరు కొనసాగింది. ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవడంలో టీఆర్ఎస్ పార్టీ సక్సెస్ సాధించింది. గులాబీ సర్పంచు వార్డు సభ్యులు తమ సత్తా చాటారు. రాష్ట ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరి లబ్ది పొందుతుండడంతో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించారు. రెండో విడతలో పరకాల, నడికూడ, శాయంపేట, ఖానాపురం, నల్లబెల్లి, రాయపర్తి మండలాల్లోని 136 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల చేయగా 33 గ్రామ పంచాయతీలు ఏకగీవ్రమయ్యాయి. 103 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. రెండో విడతలో 136 గ్రామ పంచాయతీల్లో 111 గ్రామ పంచాయతీల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా, 18 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఐదు గ్రామ పంచాయతీలను ఇండిపెండెంట్లు, ఒక్క గ్రామాన్ని న్యూ డెమోక్రసీ పార్టీ దక్కించుకుంది. 136కు 111 టీఆర్ఎస్వే.. వరంగల్ రూరల్ జిల్లాలో మొదటి విడతలో 145 గ్రామ పంచాయతీలకు గాను 120 గ్రామ పంచాయతీలు టీఆర్ఎస్ దక్కించుకుంది. అదే జోష్ రెండో విడతలో సైతం కొనసాగించింది. రెండో విడతలో 136 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరుగగా 111 గ్రామ పంచాయతీల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. పరకాలలో 7, నడికూడ 10, శాయంపేట 16, ఖానాపురంలో 19, నల్లబెల్లిలో 23, రాయపర్తిలో 36 గ్రామ పంచాయతీలలో సర్పంచ్‌లను గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ పరకాలలో 2, నడికూడలో 3 , శాయంపేటలో 6, ఖానాపురంలో 1, నల్లబెల్లిలో 4, రాయపర్తిలో 2 గ్రామ పంచాయతీలను దక్కించుకున్నాయి. శాయంపేటలో ఇద్దరు ఇండిపెండెంట్లు, పరకాల, నడికూడ, నల్లబెల్లి, రాయపర్తిలో ఒక్కొక్క గ్రామ పంచాయతీని దక్కించుకున్నారు. ప్రశాంతంగా పోలింగ్.. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా శుక్రవారం జరిగాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ఎన్నికల్లో భారీగా ఓటింగ్ నమోదయింది. 87.52 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఈ నెల 11న రెండో విడతకు నోటిఫికేషన్ జారీ చేశారు. పరకాల, నడికూడ, శాయంపేట, ఖానాపురం, నల్లబెల్లి, రాయపర్తి మండలాల్లో రెండో విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 401 గ్రామ పంచాయతీలుండగా రెండో విడతలో 136 గ్రామ పంచాయతీలు, 1210 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా 33 గ్రామ పంచాయతీలు, 1210 వార్డులకు 392 వార్డులు ఏకగీవమయ్యాయి. రాయపర్తి మండలంలోని జయరాం తండాలో నాలుగు వార్డులకు నామినేషన్లు వేయలేదు. రెండో విడతలో 103 గ్రామ పంచాయతీలకు, 814 వార్డులకు ఎన్నికలు జరిగాయి.103 గ్రామ పంచాయతీలకు 309 మంది సర్పంచ్ అభ్యర్థులు, 814 వార్డులకు 1884 మంది వార్డు సభ్యులుగా పోటీ చేశారు.. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. నల్లబెల్లిలో నర్సంపేట ఎమ్మెల్యేపెద్ది సుదర్శన్‌రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ ముండ్రాతి హరిత పరకాల, శాయంపేట, నల్లబెల్లిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. 87.52 శాతం ఓటింగ్.. రెండవ విడతలోని పరకాల, నడికూడ, శాయంపేట, ఖానాపురం, నల్లబెల్లి, రాయపర్తి మండలాల్లోని భారీగా ఓటింగ్ శాతం నమోదయింది. ఆరు మండలాల్లో 1,45, 023 మంది ఓటర్లు ఉండగా1,26, 931 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆరు మండలాల్లో 87.52శాతం ఓటింగ్ శాతం నమోదు కాగా అత్యధికంగా పరకాల మండలంలో 90.66 శాతం ఓటింగ్ నమోదు కాగా çశాయంపేటలో తక్కువగా 86.01 శాతం ఓటింగ్ నమోదయింది. ఓటింగ్‌లో మహిళలే అధికం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళ ఓటర్లు అధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళా ఓటర్లు 72,809 మంది ఉండగా 63, 602 మహిళలు, 72, 208 పురుషులు ఉండగా 63చ 329 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గంట గంటకు పెరిగిన పోలింగ్... ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ శాతం గంటగంటకు పెరుగుతూ వచ్చింది. మొదటి రెండు గంటలు 67.16శాతం నమోదు కాగా పోలింగ్ ముగిసే వరకు 87.52శా–బహిష్కరించిన శ్రీరామనగర్ తండా వాసులు రాయపర్తి మండలంలోని శ్రీరామనగర్తండా వాసులు గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. శ్రీరామనగర్ తండాను గ్రామ పంచాయతీగా చేయాలని ఓటింగ్‌లో పాల్గొనకుండా తమ నిరసన తెలిపారు. పరకాల మండలం నాగారంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. పోలీసుల రంగ ప్రవేశంతో గొడవ సద్దుమణిగింది. మధ్యాహ్నం ఎన్నిక కౌంటింగ్ ఉదయం 7 గంటల నుంచి మద్యహ్నాం 1గంట వరకు ఎన్నికలు జరిగాయి. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్‌ను ప్రారంభించారు. రాత్రి వరకు కౌంటింగ్‌ను నిర్వహించి ఆయా గ్రామ పంచాయతీల వారీగా ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. -
ప్రశాంతంగా పోలింగ్
నిజామాబాద్‌అర్బన్: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు బోధన్ డివిజన్లో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు పేర్కొన్నారు. ఎడపల్లి మండలం నెహ్రునగర్‌లో పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ పోలీసు కమిషనర్ కార్తికేయతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పోలింగ్ నిర్వహణకు జిల్లా, రెవెన్యూ యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేసిందన్నారు. ఓటు వేయడానికి వచ్చే ఓటర్లకు తాగునీరు, వైద్యసదుపాయాలు, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, ర్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ శాతం సంతృప్తికరంగా ఉందన్నారు. గత ఎన్నికలను దృష్టిలో పె ట్టుకొని, సమస్యాత్మక ప్రాంతాలలో అవసరమైన చోట్ల అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. ఆన్లైన్ వెబ్‌క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షణతో పాటు సూక్ష్మ పరిశీలకులు పోలింగ్ సరళిని గమనించారని తెలిపారు. -
గులాబీదే జోరు!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : పల్లెపోరులో గులాబీ దళం దూసుకుపోతోంది. పార్టీ రహితంగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు గెలుస్తున్నారు. పేరుకు పార్టీ గుర్తులపై జరగని ఎన్నికలే అయినా.. పంచాయతీల్లో అభ్యర్థులు పార్టీల వారీగానే విడిపోయి పోటీ పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ శుక్రవారం మిర్యాలగూడ డివిజన్లోని పది మండలాల పరిధిలోని 276 గ్రామ పంచాయతీల్లో జరిగింది. మొత్తం పంచాయతీల్లోనామినేషన్ల ఉప సంహరణల నాటికే 52 పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పంచాయతీల్లోని వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ జరిపారు. కాగా, మలి విడతలోనూ అధికార టీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పది మండలాల్లోని మొత్తం పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో 92.01శాతం పోలింగ్ నమోదైంది. కొత్తగా ఏర్పాటైన అడవిదేవులపల్లి మండలంలో అత్యధికంగా 95.24శాతం, అత్యల్పంగా తిరుమలగిరి (సాగర్) మండలంలో 88.44శాతం పోలింగ్ నమోదైంది. పది మండలాలకు గాను ఏకంగా ఎనిమిది మండలాల్లో తొంభై శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. మిగిలి రెండు మండలాల్లో సైతం 88శాతానికి పైనే ఓట్లు పోలయ్యాయి. డివిజన్లో మొత్తం 2,59,040 ఓట్లకు గాను, 2,38,351 ఓట్లు పోలయ్యాయి. గులాబీ జోరు గ్రామ పంచాయతీ ఎన్నికల మలి విడతలోనూ అధికార టీఆర్ఎస్ హవా కనిపించింది. 276 పంచాయతీలక గాను నామినేషన్ల దశలోనే ఏకగీవ్రంగా 52 పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవంగా కాగా, వాటిలో 51 మంది సర్పంచులు టీఆర్ఎస్ మద్దతు దారులే కావడం గమనార్హం. ఒక్క చోట మాత్రమే కాంగ్రెస్ మద్దతుదారు ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. మిగిలిన 224 పంచాయతీల్లో 146 మంది టీఆర్ఎస్కు చెందిన వారు సర్పంచులుగా విజయం సాధించారు. మిగిలిన పంచాయతీల్లో 66 మంది కాంగ్రెస్ మద్దతు దారులు, సీపీఎం 02, స్వతంత్రులు 09 మంది సర్పంచులుగా విజయం సాధించారు. -
మలి విడత ప్రశాంతం
ఇచ్చోడ(బోథ్): జిల్లాలో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేయడానికి ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు, వికలాంగులు, నడవలేని వారిని వాహనాలు, మంచాలపై పోలింగ్ కేంద్రాల వరకు తీసుకువచ్చి ఓటేయించారు. రెండో విడతలో బోథ్ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో 83 పంచాయతీలు, 322 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మండల కేంద్రాలతోపాటు పెద్ద పంచాయతీల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. చివరి నిమిషం వరకు కూడ ఓట్లు వేశారు. ఎన్నికలు జరిగిన 83 పంచాయతీల పరిధిలో మొత్తం 94,463 మంది ఓటర్లు ఉండగా 78,407 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటేసిన వారిలో 40,051 మంది పురుషులు ఉండగా 38,356 మంది మహిళలు ఓటు వేశారు. పోలింగ్ జరిగింది ఇలా.. రెండో విడత పంచాయతీ ఎన్నికలలో ఆయా పంచాయతీలలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనా, 9 గంటల వరకు పోలింగ్ అంతంత మాత్రమే జరిగింది 11 గంటల వరకు తలమడుగు మండలంలో 29.19 శాతం, గుడిహత్నూర్ మండలంలో 29.51 శాతం, బోథ్ మండలంలో 21.68, బజార్హత్నూర్ మండలంలో 22.07, నేరడిగొండ 31.63 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. 11 గంటల నుంచి పోలింగ్ ఊపందుకుంది. బోథ్, నేరడిగొండ, బజార్హత్నూర్, గుడిహత్నూర్, గిర్నూర్, పిప్రి పంచాయతీల్లో మినహా ఎక్కడా ఓటర్లు బారులు తీరి కనిపించలేదు. ఓటర్లు స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి వచ్చారు. వికలాంగులు, వృద్ధులను ఆటోల్లో మోటార్ సైకిళ్ల ద్వార ఓటు వేసేందుకు కేంద్రాల వద్దకు తీసుకువచ్చి ఓట్లు వేయించారు. బోథ్ మండలంలోని కుచ్లపూర్ పంచాయతీ సర్పంచ్‌కు 6 వార్డులకు ఏకగ్రీవంగా కాగా కేవలం ఒక్క వార్డుకే ఎన్నికలు జరిగాయి. ఒక్క వార్డు కోసం రిటర్నింగ్ ఆధికారితోపాటు ఇద్దరు ఎన్నికల సిబ్బంది ద్వారా ఎన్నికలు నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ద్వార ఓట్లు వేసిన ఓటర్లు పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ ద్వార ఓటింగ్‌కు కొంత ఇబ్బంది పడ్డట్లు కనిపించింది. నిరక్షరాసులు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలలో రెండు బ్యాలెట్ పేపర్లు ఇవ్వడంతో తికమక పడ్డారు. ఎన్నికల సిబ్బంది ఓటర్లకు ఓటు వేసే విధానాన్ని వివరించి చెప్పడంతో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. గుడిహత్నూర్ మండలంలోని మూత్నూర్తండాలో సర్పంచ్‌గా పోటీ చేసిన కళాబాయి తన ప్రత్యర్థి చేతిలో ఓటమి చెందడంతో పురుగులు మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించగా ఆమెకు ప్రాణపాయస్థితి తప్పింది. రెండో విడతలో 83.6శాతం నమోదు రెండో విడత పంచాయతీ పోరులో మొత్తం 83.6శాతం పోలింగ్ నమోదైంది. రెండో విడతలో 83 పంచాయతీలకు 322 మంది, 363 వార్డులకు 908 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బోథ్ మండలంలో 20 జీపీలకు 91 వార్డులకు ఎన్నికలు జరిగాయి. తలమడుగు మండలంలో 11జీపీలకు 89 వార్డులకు, బజార్హత్నూర్ మండలంలో 19 జీపీలకు, 65 వార్డులకు, గుడిహత్నూర్ మండలంలో 17 జీపీలకు 75 వార్డులకు, నేరడిగొండ మండలంలో 16 జీపీలకు 43 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఐదు మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అత్యధికంగా నేరడిగొండ మండలంలో 88.75శాతం పోలింగ్ నమోదైంది. అతి తక్కువగా బోథ్ మండలంలో 80.34శాతం నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నేరడిగొండ మండల కేంద్రంతోపాటు వడూర్‌లో ఎస్పీ విష్టు ఎస్ వారియర్, ఉట్నూర్ డీఎస్పీ వెంకటేశ్, బజార్హత్నూర్ మండలంలో భూతాయి, జాతర్ల గ్రామంలో ఆదిలాబాద్ డీఎస్పీ నర్సింహరెడ్డి, బోథ్ మండలంలో ఏఎస్పీ మోహన్, ఆదిలాబాద్ ఆర్డీవో సూర్యనారయణ ఎన్నికలను పర్యవేక్షించారు. రెండో విడతలో 83.6శాతం నమోదు రెండో విడత పంచాయతీ పోరులో మొత్తం 83.6శాతం పోలింగ్ నమోదైంది. రెండో విడతలో 83 పంచాయతీలకు 322 మంది, 363 వార్డులకు 908 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బోథ్ మండలంలో 20 జీపీలకు 91 వార్డులకు ఎన్నికలు జరిగాయి. తలమడుగు మండలంలో 11జీపీలకు 89 వార్డులకు, బజార్హత్నూర్ మండలంలో 19 జీపీలకు, 65 వార్డులకు, గుడిహత్నూర్ మండలంలో 17 జీపీలకు 75 వార్డులకు, నేరడిగొండ మండలంలో 16 జీపీలకు 43 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఐదు మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అత్యధికంగా నేరడిగొండ మండలంలో 88.75శాతం పోలింగ్ నమోదైంది. అతి తక్కువగా బోథ్ మండలంలో 80.34శాతం నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నేరడిగొండ మండల కేంద్రంతోపాటు వడూర్‌లో ఎస్పీ విష్టు ఎస్ వారియర్, ఉట్నూర్ డీఎస్పీ వెంకటేశ్, బజార్హత్నూర్ మండలంలో భూతాయి, జాతర్ల గ్రామంలో ఆదిలాబాద్ డీఎస్పీ నర్సింహరెడ్డి, బోథ్ మండలంలో ఏఎస్పీ మోహన్, ఆదిలాబాద్ ఆర్డీవో సూర్యనారయణ ఎన్నికలను పర్యవేక్షించారు. -
గులాబీ.. పల్లెలు
పల్లెల్లో మరోమారు గులాబీ గుబాళించింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కారు దూసుకెళ్లింది. మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లో శుక్రవారం పోలింగ్ జరిగింది. సాయంత్రం కడపటి సమాచారం అందే వరకు మొత్తం 107 పంచాయతీలకు ఏకగ్రీవం కలుపుకుని 63 మంది టీఆర్ఎస్ మద్దతుదారులు సాధించుకున్నారు. మిగతా 44 స్థానాల్లో కాంగ్రెస్ 20, సీపీఐ 3, టీడీపీ ఒకచోట గెలుపొందగా, 20 స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధిం చారు. మెజార్టీ ఉపసర్పంచ్‌లుగా టీఆర్ఎస్ మద్దతుదారులే నెగ్గారు. సాక్షిప్రతినిధి, కరీంనగర్: జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం ఐదు మండలాల్లో 107 గ్రామపంచాయతీలు, 1014 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఇందులో ఐదు పంచాయతీలు, 167 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. పంచాయతీలు, వార్డులు కలిపి మొత్తం 104 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించగా.. శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ మొదలైంది. తొమ్మిది గంటల వరకు మందకోడిగా సాగిన పోలింగ్ ఆ తర్వాత పుంజుకుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఓటర్లు బారులు తీరారు. ఒంటిగంటకు పోలింగ్ సమయం ముగిసినా.. ఓటర్లు ‘క్యూ’లు కట్టడంతో శంకరపట్నం, మానకొండూరు, తిమ్మాపూర్ గ్రామాల్లోని 21 గ్రామాల్లో మధ్యాహ్నం 1.30 వరకు కూడా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రెండో విడత పోలింగ్ సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా ఐదు మండలాల్లో రెండో విడతలో 89.52 శాతంగా పోలింగ్ నమోదైంది. 89.52 శాతం పోలింగ్.. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా రెండో విడతలో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ నమోదైంది. దీంతో ఓటర్ల నమోదు, ఓటుహక్కు వినియోగంపై అధికారులు ఉద్యమంలా చేపట్టిన కృషి ఫలించింది. ఐదు మండలాల్లో మొత్తం 16,3,788 మంది ఓటర్లకు 1,46,623 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోగా సగటున 89.52 శాతంగా నమోదైనట్లు జిల్లా పంచాయతీ అధికారి మనోజ్‌కుమార్ వెల్లడించారు. ఇందులో 81,799 మంది పురుషులకు 73,114 మంది, 81,989 మంది మహిళలకు 73,509 మంది ఓట్లేశారు. అత్యధికంగా శంకరపట్నం మండలంలో 91.20 శాతంగా కాగా, అత్యల్పంగా చిగురుమామిడి మండలంలో 87 శాతంగా ఉంది. గన్నేరువరంలో 90.39 శాతం, మానకొండూరులో 89.84 శాతంగా పోలింగ్ జరిగింది. వార్డులు, పంచాయతీలు కలుపుకుని మొత్తం 104 పంచాయతీల్లో 102 మంది సర్పంచ్‌లు, 847 వార్డుల్లో సభ్యుల కోసం ఈ ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా రాత్రి వరకు కొనసాగింది. పోలింగ్ సందర్భంగా జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్, జిల్లా ఎన్నికల పరిశీలకురాలు భారతీ లక్పతినాయక్. పోలీసు కమిషనర్ వీబీ.కమలాసన్‌రెడ్డి తదితరులు పలు గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. పోలింగ్ ప్రశాంతం.. ఉత్కంఠగా కౌంటింగ్ ఐదు మండలాల పరిధిలోని గ్రామపంచాయతీలు, వార్డులకు రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ముందుగానే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఎన్నికల సక్రమ నిర్వహణకు ఎలాంటి అడ్డంకులు కలుగకుండా ఉండడానికి రెండో విడతలోని 42 ప్రాంతాల్లోని 2,346 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. అందులో 13 ప్రాంతాల్లోని 144 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంటర్నెట్ సౌకర్యం కోసం కావాల్సిన మోడెమ్‌లను కొనుగోలు చేశారు. వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేసిన చోట నేరుగా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎన్నికల సరళిని అధికారులు పర్యవేక్షించడానికి వీలు కల్పించారు. 29 ప్రాంతాల్లో గుర్తించిన 202 పోలింగ్ స్టేషన్లను 29 మంది మైక్రో అబ్జర్వర్లకు బాధ్యతలు అప్పగించారు. వారు ఎన్నికలు జరిగే ప్రాంతాలకు చేరుకుని పర్యవేక్షించడంతో పాటు ఎన్నికలు పూర్తయ్యేంత వరకు వీడియో చిత్రీకరణతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఎన్నికలు జరిగే పంచాయతీలను 16 జోన్లు, 36 రూట్లుగా గుర్తించి, అందుకోసం ప్రత్యేక అధికారులు పర్యవేక్షించారు. ఎన్నికల నిర్వహణ కోసం 983 మంది పోలింగ్ అధికారులుగా, మరో 1257 మందిని అదనపు పోలింగ్ అధికారులకు బాధ్యతలను అప్పగించగా, వీరికి అదనంగా 261 పీవో, 562 మంది ఓపీవోలను రిజర్వులో సిద్ధంగా ఉంచిన అధికారులు పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు. ఉప సంహరణల అనంతరం మానకొండూర్ మండలంలోని 26 పంచాయతీల్లో 121 మంది సర్పంచ్ బరిలో ఉండగా, తిమ్మాపూర్‌లో 21 స్థానాలకు 99 మంది, శంకరపట్నంలో 24 స్థానాలకు 94 మంది, గన్నేరువరంలో 14 స్థానాలకు 43 మంది, చిగురుమామిడి మండలంలో 17 సర్పంచ్ స్థానాలకు 82 మంది కలిపి మొత్తంగా 102 సర్పంచి స్థానాల్లో 439 మంది బరిలో నిలిచారు. 846 వార్డు స్థానాల కోసం 2,354 మంది బరిలో నిలిచారు. అయితే పెద్ద సంఖ్యలో పోటీ ఉండటంతో ఫలితాలు వెలువడే వరకు కూడా సస్పెన్స్ నెలకొంది. అర్ధరాత్రి వరకు జరిగిన ఓట్ల లెక్కింపు అభ్యర్థులను ఉత్కంఠకు గురి చేసింది. రెండో విడత పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. -
ఓటెత్తిన పల్లెలు !
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా రెండో విడత జీపీల్లో శుక్రవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఓట్లు వేసేందుకు పల్లె ప్రజలు ఉత్సాహం చూపారు. తొలి విడతతో పోలిస్తే పోలింగ్ శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. తొలి విడతలో 84.71 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ విడతలో 89.5 శాతంగా నమోదైంది. మొత్తంగా రెండో విడత పోలింగ్ సైతం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రశాతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ జిల్లాలోని పలు బూత్‌ల్లో పర్యటించి పోలింగ్ సరళిని పరిశీలించారు. 89.5 శాతం రెండో విడత ఎన్నికలు జిల్లాలోని ఏడు మండలాలు, 185 పంచాయతీల్లో జరిగాయి. ఈ సందర్భంగా 89.5 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, తొలి రెండు గంటల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తక్కువగానే వచ్చారు. ఇక 9 గంటల తర్వాత పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరిగింది. 9 నుంచి 11 గంటల వరకు ఏకంగా 68.98 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన వికలాంగుల వెంట సహాయకులు తోడుగా ఉన్నారు. వీరి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ సమయం ముగియనుండగా చివరి గంటలో ఎక్కువ మంది బూత్‌లకు వచ్చారు. ఉత్సాహంగా.. ఓట్లు వేసేందుకు గ్రామాల్లో ప్రజలు ఉత్సహం చూపారు. ముందు నుంచి ప్రభుత్వం కూడా ఓటు హక్కుపై విస్తృతంగా ప్రచారం కల్పించడం.. గ్రామాల్లో అభ్యర్థులు తమ గెలుపు కోసం ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చేందుకు చేసిన కృషి ఫలించింది. ఉదయం కాస్తా పలుచగా కనిపించిన జనం సమయం దగ్గర పడుతున్న కొద్ది పోలింగ్ బూత్‌లకు ఎక్కువగా రావడం కనిపించింది. ఓటు హక్కు వినియోగించుకున్న 1,68,169 మంది రెండో విడతలో మొత్తం 1,68,169 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొ త్తం 1,88,845 ఓటర్లలో 1,68.169 మంది ఓటు వేశారు. దీంతో 89.5 శాతంగా పోలింగ్ నమోదైంది. కాగా, 1,88,845 మంది ఓటర్లలో 95,367 మంది పురుషులకు గాను 85,075 మంది, 93,478 మంది మహిళలకు గాను 83,094 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కట్టుదిట్టమైన భధ్రత జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. పల్లెల్లో ఎలాంటి అవాంఛనీయమైన టనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించిఛాయా ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమించడం సత్ఫలితాలను ఇచ్చింది. కాగా, బందోబస్తు చర్యలను ఎప్పటికప్పుడు ఎస్పీ రెమారాజేశ్వరి పర్యవేక్షించారు. ఈ మేరకు సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఎలాంటి ఘటనలు నమోదు కాకపోవడంతో పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. -
కారు.. హవా
జడ్చర్ల టౌన్ : అదే జోరు కొనసాగింది! అధికార టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు.. ఆ పార్టీ నాయకులు, వారి అనుచరులే రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించారు. జిల్లాలోని 719 పంచాయతీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనుండగా.. మొదటి దశ పోలింగ్ 21వ తేదీన ముగిసింది. ఈ దశలో 249 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించగా టీఆర్ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థులకు 145 స్థానాలు దక్కాయి. ఇక రెండో దశలో 243 పంచాయతీల్లో ఎన్నికలు జరగగా 201 సీట్లను అధికార టీఆర్ఎస్ మద్దతుదారులు దక్కించుకోవడం విశేషం. అలాగే, మొదటి దశలో 59 స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ అభ్యర్థులు.. ఈ దశలో కేవలం 20 సీట్లకే పరిమితం కావడం, బీజేపీకి రెండు సీట్లు మాత్రమే దక్కడం గమనార్హం. వీరు మినహాయిస్తే మరో 20 సీట్లలో సర్పంచ్‌లుగా స్వతంత్రులు గెలుపొందారు. అయితే, వీరిలో చాలా మందిటీఆర్‌ఎస్ రెబెల్స్ కావడంతో ఈ స్థానాలు కూడా అధికార పార్టీ ఖాతాలో పడినట్లుగానే భావిస్తున్నారు. ఉత్కంఠ... రెండో విడతగా 721 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. అయితే, ఇందులో రెండింటి పాలకవర్గాల పదవీకాలం ముగియకపోవడంతో 719 పంచాయతీల్లోనే ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు రెండో దశలో 243 పంచాయతీల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేయగా.. కాగా, ఒక్కో నామినేషన్ దాఖలైనవి, నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఒక్కటే మిగిలినవి 58 జీపీలు ఉండడంతో ఇవి ఏకగ్రీవమైనట్లుగా ప్రకటించారు. మిగిలిన 185 పంచాయతీల్లో శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. ఆయా స్థానాల్లో సర్పంచ్ అభ్యర్థులుగా 594 మంది బరిలో ఉన్నారు. ఇక ఏకగ్రీవమైన 697 వార్డులు మినహాయిస్తేమిగిలిన 1,369 వార్డుల్లో 3,427 మంది పోటీలో మిగిలారు. ఈ మేరకు శుక్రవారం పోలింగ్ నిర్వహించిన అధికారులు మధ్యాహ్నం తర్వాత నుంచి ఒక్కటొక్కటిగా ఫలితాలను వెల్లడించారు. 2 గంటల నుంచి కౌంటింగ్ ఉదయం 7 గంటల నుంచి మ«ధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొసాగింది. అనంతరం గంట పాటు ఉద్యోగులకు భోజన విరామం సమయం కేటాయించారు. ఆ తర్వాత రెండు గంటలకు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు తెరిచారు. ముందుగా సర్పంచ్, వార్డు సభ్యుల బ్యాలెట్లను వేరు చేసి 25 చొప్పున కట్టలు కట్టారు. ఇక తొలుత వార్డు సభ్యుల ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించాక.. అనంతరం సర్పంచ్ ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉత్కంఠ నెలకొంది. తొలుత వార్డు సభ్యుల ఫలితాలు వెల్లడించగా కౌంటింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులతో పాటు మద్దతు దారులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక ఫలితాలు వెల్లడయ్యాక గెలిచిన అభ్యర్థులు సంబరాల్లో మునిగిపోగా.. ఓడిన వారు నిరాశతో వెనుదిరిగారు. వార్డు సభ్యుల ఫలితాలను తొలుత వెల్లడించడంతో ఎవరి ప్యానల్ అభ్యర్థులు ఎక్కువగా గెలిచారో వారు తమకు ఉప సర్పంచి పదవి కావాలని లాబీయింగ్ మొదలుపెట్టారు. వార్డు సభ్యుల ఫలితాలు ప్రకటించడం పూర్తి కాగానే అధికారులు ఉప సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక చేతులు లేపే పద్ధతిలో నిర్వహించారు. పార్టీల వారీగా విడిపోయిన వార్డుసభ్యులు తమ పార్టీ మద్దతుదారులు ఎక్కువగా ఉందంటూ ఉప సర్పంచ్ పదవి కోసం పట్టుపట్టడం కనిపిచింది. -
‘కారు’.. జోరు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: మలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కారు జోరు కొనసాగింది. తొలి విడతలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న టీఆర్ఎస్ మద్దతుదారులు రెండో విడతలోనూ సత్తా చాటారు. జిల్లాలోని మొత్తం 204 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. 35 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా.. ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామ పంచాయతీకి నామినేషన్ దాఖలు కాలేదు. దీంతో శుక్రవారం 168 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది. మొత్తం 91.47 శాతం పోలింగ్ నమోదైంది. ఆయా గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్లు వరుసలో బారులుతీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో చెదురు మదరు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. పోలింగ్ అనంతరం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. రాత్రి వరకు కొనసాగింది. ఈ విడతలో సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాలు, వైరా నియోజకవర్గంలోని రెండు మండలాల్లోని జీపీలకు ఎన్నికలు నిర్వహించారు. ఇటు సత్తుపల్లి.. అటు వైరా నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీల్లో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకోవడం విశేషం. ఎన్నికలకు ముందే ఏకగ్రీవాల్లో అత్యధిక జీపీలను దక్కించుకున్న టీఆర్ఎస్.. ఎన్నికల్లో కూడా తన హవా చాటింది. సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో టీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించింది. వైరా నియోజకవర్గంలోని ఏన్కూరు, కారేపల్లి మండలాల్లోనూ టీఆర్ఎస్ పట్టు నిలుపుకుంది. టీఆర్ఎస్ తర్వాతి స్థానంలో స్వతంత్రులు నిలిచారు. అయితే టీఆర్ఎస్కు.. స్వతంత్ర అభ్యర్థులకు భారీ వ్యత్యాసం ఉంది. సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ 9 జీపీలను గెలుచుకోగా.. వైరా నియోజకవర్గంలో అసలు ఖాతా తెరవలేకపోయింది. ఇక టీడీపీ కూడా సత్తుపల్లి నియోజకవర్గంలో 15 జీపీలను గెలుచుకోగా.. వైరా నియోజకవర్గంలో ఒక్క స్థానాన్ని కూడా గెలవలేదు. స్వతంత్ర అభ్యర్థులు మాత్రం 31 స్థానాల్లో గెలుపొందారు. మొత్తంమీద ఏకగ్రీవాలతో కలిసి టీఆర్ఎస్ 139 స్థానాలను, స్వతంత్ర అభ్యర్థులు 31, కాంగ్రెస్ 9, టీడీపీ 15, సీపీఐ ఒకటి, సీపీఎం 7, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఒకస్థానాన్ని గెలుపొందాయి. వేంసూరు మండలంలో 26 స్థానాలకుగాను.. 21 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందింది. కాంగ్రెస్ రెండు, టీడీపీ స్థానాలకు పరిమితమయ్యాయి. సత్తుపల్లి మండలంలో 21 జీపీలు ఉండగా.. 15 జీపీలను టీఆర్ఎస్ గెలుపొంది సత్తా చాటింది. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీలు చెరో మూడు స్థానాల్లో గెలుపొందాయి. తల్లాడ మండలంలో 27 జీపీలకుగాను.. టీఆర్ఎస్ 16 స్థానాల్లో, సీపీఎం 3, స్వతంత్ర అభ్యర్థులు 8 స్థానాల్లో గెలుపొందారు. -
ఓటేయ రారండోయ్...!
కరీంనగర్/కమాన్‌చౌరస్తా(కరీంనగర్): మానకొండూర్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన వారు ఉపాధికోసం మహారాష్ట్రలో నివసిస్తున్నారు. ఆ గ్రామంలో వారికి ఓట్లు ఉండడంతో అక్కడ పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి వారితో మాట్లాడి గ్రామానికి వచ్చి తమకు ఓటు వేయాలని ప్రాధేయపడ్డాడు. వారి కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉండగా ప్రత్యేకంగా వాహనం ఏర్పాటు చేయడంతో వారు ఓట్లు వేసేందుకు రావడానికి బయల్దేరారు. గన్నేరువరం మండలంలోని ఒక గ్రామానికి చెందిన పదిమంది వరకు యువకులు ఉన్నత చదువుల నిమిత్తం హైదరాబాద్‌తో పాటు సమీప ప్రాంతాల్లో ఉంటున్నారు. వారికి గ్రామంలో ఓట్లు ఉండడంతో అక్కడ పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి, సదరు వార్డు సభ్యులు సైతం పేరుపేరునా ఫోన్ చేసి ఓటు వేసేందుకు రావాలని అభ్యర్థించారు. ఒకరికి మించి ఒకరు ఫోన్లు చేసి వివిధ రకాల ఆఫర్లు ప్రకటించారని తెలిసింది.పంచాయతీ ఎన్నికల పోరు పోటాపోటీగా సాగుతోంది. సర్పంచ్, వార్డు స్థానాల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు ఎలాగైనా కుర్చీని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. శుక్రవారం రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, మూడో విడత ఎన్నికల ప్రచారం గ్రామాల్లో ముమ్మరంగా సాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే కావడంతో ఉపాధి, చదువుల కోసం వెళ్లినవారు, ఉద్యోగులతో పాటు ఇతర పనుల రీత్యా వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారిని నానా పాట్లు పడి ఓట్ల కోసం రప్పిస్తున్నారు. వారికి రకరకాల నజరానాలతో పాటు రానుపోను ఖర్చులు ఇస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఒక రోజు ముందే గ్రామాలకు చేరుకోగా, ఈ రోజు మరికొంత మంది రానున్నారు. వివరాలు సేకరించిన అభ్యర్థులు... రెండో విడతలో గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాల్లో పోటీలో ఉంటున్న అభ్యర్థులు నామినేషన్ వేసిన నాటినుంచే గ్రామం, వార్డుల్లోని ఓటరు లిస్టు చూస్తూ స్థానికేతరులను గుర్తించారు. వారి వివరాలు సేకరించి ఎక్కడెక్కడ నివసిస్తున్నారో తెలుసుకొని స్వయంగా ఫోన్లు చేయడం, వారి అనుచరులు, బంధుగణంతో ఫోన్లు చేయించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా తమకే ఓటు వేయాలని వేడుకున్నారు. వారికి అవసరమైన రవాణా ఖర్చుతో పాటు ఎక్కువ మంది ఉంటే ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లాలోని పలు పల్లెలకు చెందినవారు స్వరాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా నివసిస్తున్నారు. ఉద్యోగం, వ్యాపారం, చదువుల నిమిత్తం హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, మహారాష్ట్ర, బెంగళూర్, ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను కూడా రప్పించడానికి శతవిధాలా ప్రయత్నించారు. ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్... వలస ఓటర్లకు ఊరు రాజకీయాలతో పెద్దగా సంబంధం ఉండదు కాబట్టి వారికి ఎంత కావాలంటే అంత ముట్టజెపుతున్నట్లు తెలిసింది. తమ పనులను, సమయాన్ని, వ్యాపారాలను తమ కోసం కేటాయించడానికి సిద్ధపడుతున్నందుకు వారికి పెద్ద ఎత్తున్న నజరానాలు అందించడానికి సిద్ధపడ్డారని ప్రచారం జరుగుతోంది. ఓటర్ల అకౌంట్లలోకి తేజ్, పేటీఎం, గూగూల్ పేలతో పాటు వివిధ యాప్‌ల ద్వారా కొంతమందికి ట్రాన్స్ఫర్ నగదు ట్రాన్స్ఫర్ చేసినట్లు సమాచారం. సెల్‌ఫోన్ సాంకేతికత లేని వారికి వారి అకౌంటు నంబర్లు తీసుకొని ఓటుకు కొంత మొత్తం చెప్పున లెక్కించి వారి ఖాతాల్లో జమ చేసినట్లు పలు గ్రామాల్లో చెప్పుకుంటున్నారు. స్థానికంగా ఉన్న ఓట్లతో పాటు వలస ఓట్లు కీలకంగా ఉండడంతో అభ్యర్థుల గెలుపులో స్థానికేతరులు కీలకపాత్ర పోషించనున్నారని అర్థమవుతోంది. అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో ఎలాగైనా గెలువాలని అడ్డదారులు తొక్కుతున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ నోట్ల కట్టలు పంచుతున్నారు. ఈ హోరాహోరీ పోరులో ఎవరి వ్యూహాలు ఫలించాయో సాయంత్రానికల్లా తేలనుంది. -
సంగ్రామం 2
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్ శుక్రవారం జరగనుంది. జిల్లాలోని ఏడు మండలాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతగా 243 పంచాతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 58 పంచాయతీల్లో పాలకవర్గాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 185 పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏడు మండలాలు... జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించే షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు రెండో విడతగా మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, నవాబుపేట, మహబూబ్‌నగర్, హన్వాడ మండాల్లోని 243 పంచాయతీలు, 2,068 వార్డులో ఎన్నికలకు ఏర్పాటుచేశారు. అయితే, ఏకగ్రీవమైన పంచాయతీలు పోను మిగతా జీపీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఏకగ్రీవ జీపీలు... రెండో విడతగా ఏడు మండలాల్లో మొత్తంగా 58 గ్రామపంచాయతీల పాలకవర్గాలు ఏకగ్రీవమయ్యాయి. నవాబుపేట మండలంలో అత్యధికంగా 19 గ్రామపంచాయతీల పాలకవర్గాలు ఏకగ్రీవం కాగా, మహబూబ్‌నగర్ రూరల్‌లో 5, జడ్చర్లలో 8, మిడ్జిల్‌లో 3, హన్వాడలో 7, బాలానగర్‌లో 10, రాజాపూర్‌లో 6 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆయా మండలాల్లోని 697 వార్డుసభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మిడ్జిల్ మండలంలోని పంచాయతీల్లో 48 వార్డులు, బాల్నగర్లో 120, రాజాపూర్‌లో 57, జడ్చర్లలో 117, నవాబ్‌పేట్‌లో 191, మహబూబ్‌నగర్ రూరల్‌లో 50, హన్వాడలో 114 వార్డుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బరిలో 4,021 మంది గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత జీపీల్లో మొత్తం 4,021 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సర్పంచ్ స్థానాలకు 594 మంది బరిలో ఉండగా.. వార్డు సభ్యులుగా 3,427 మంది పోటీలో మిగిలారు. మిడ్జిల్ మండలంలోని 24 పంచాయతీల్లో మూడు ఏకగ్రీవం కాగా, 21 పంచాయతీల్లో, బాలానగర్‌లో 37 జీపీలకు 10 ఏకగ్రీవం కాగా 27 పంచాయతీల్లో, రాజాపూర్‌లో 24 జీపీల్లో 6 ఏకగ్రీవం కాగా 18 పంచాయతీల్లో, జడ్చర్లలో 43 జీపీలకు 8 ఏకగ్రీవం కాగా 35 జీపీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నవాబుపేట మండలంలో 54 పంచాయతీల్లో 19 ఏకగ్రీవం కాగా, 35 జీపీల్లో, మహబూబ్‌నగర్ రూరల్ మండలంలో 26 జీపీల్లో 5 ఏకగ్రీవం కాగా 21 జీపీల్లో, హన్వాడలో 35 జీపీలకు 7 ఏకగ్రీవం కాగా, 28 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. మొత్తంగా 243 జీపీల్లో 58 ఏకగ్రీవం కాగా మిగిలిన 185 జీపీలకు 594 మంది సర్పంచ్ స్థానం కోసం బరిలో నిలిచారు. ఇక 2,066 వార్డులకు గాను 697 ఏకగ్రీవం కాగా 1,369 వార్డుల్లో 3,427 మంది బరిలో నిలిచారు. వలస ఓటర్లపై నజర్ పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. దీంతో అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి సారించారు. పోలింగ్ శుక్రవారం జరగనుండగా.. గురువారం రాత్రి వరకే ఎక్కడ ఉన్న ఓటర్లయినా స్వస్థలాలకు చేరుకునేలా అభ్యర్థులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పట్టణాలకు వెళ్లి వలస ఓటర్లను కలిసిన అభ్యర్థులు వారికి గ్రామాలకు చేర్చడంతో పాటు తిరిగి పట్టణాలకు పంపించే లా సొంత ఖర్చు తో వాహనాలు సమకూర్చారు. 4,685 మంది పోలింగ్ సిబ్బంది రెండో విడత ఎన్నికల నిర్వహణకు మొత్తం 4,685 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. వీరికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. ఇందు లో 2,274 మంది పీఓలు కాగా 2,411 మంది ఏపీఓలు, ఇతర సిబ్బంది ఉన్నారు. సిబ్బందికి గ్రామపంచాయతీలను కేటాయించగా.. గురువారం ఉదయం పోలింగ్ సామగ్రితో కేంద్రాలకు బయలుదేరారు. ఇందుకోసం జిల్లా యంత్రాం గం ప్రత్యేక వాహనాలు కేటాయించింది. పోలింగ్.. ఆ వెంటనే ఫలితం గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం గంట విరామం ఇచ్చాక రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడుతారు. తొలుత వార్డు సభ్యు ల ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించాక సర్పం చ్ అభ్యర్థుల వచ్చిన ఓట్లను లెక్కిస్తారు. కాగా, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి పూర్తయ్యాక ఉప సర్పంచ్‌ను సైతం ఎన్నుకోవాల్సి ఉంటుంది. ముందుగా అనుకున్న ప్యానెల్ గెలిస్తే అప్పటికే అనుకున్న అభ్యర్థికి ఉప సర్పంచ్ అభ్యర్థికి అవకాశం వస్తుంది. అలా జరగకపోతే ఎవరిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకోవాలో పార్టీల నేతలు వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు. సర్పం చ్ పదవి జనరల్ స్థానమైతే ఉప సర్పంచ్ పదవి నాన్ జనరల్‌కు ఇవ్వాలని, సర్పంచి రిజర్వ్ అయితే ఉప సర్పంచి జనరల్‌కు ఇవ్వాలని పలు వురు నిర్ణయించుకున్నట్లు సమాచారం. -
సర్వం సిద్ధం
చుంచుపల్లి: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి సాయంత్రానికి ఫలితాలు వెల్లడించనున్నారు. ముందుగా వార్డు సభ్యులు, తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. గెలిచిన వార్డు సభ్యుల్లో సగం మంది అందుబాటులో ఉంటే వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. నిర్ణీత సమయంలో వార్డు సభ్యులు హాజరు కాకుంటే ఉప సర్పంచ్ ఎన్నిక మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. ఎన్నికలు జరిగే అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, చండ్రుగొండ, కరకగూడెం, పినపాక, చుంచుపల్లి మండలాలకు అధికార యంత్రాంగం, పోలింగ్, పోలీస్ సిబ్బంది గురువారం మధ్యాహ్నానికే ఆయా కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రితో చేరుకున్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా పోలీసు బందోబస్తుతో పాటు, పలు పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో రెండో విడతలో 142 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వాటిలో 20 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 122 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1294 వార్డులకు గాను ఐదింటికి నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 289 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1000 వార్డులకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికలు జరిగే 122 పంచాయతీలకు 343 మంది సర్పంచ్ అభ్యర్థులు, 1000 వార్డులకు మొత్తం 2,668 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సిబ్బంది, సామగ్రి తరలింపునకు 100 బస్సులు... రెండో విడత ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాలకు ఎన్నికల సిబ్బందిని, పోలింగ్ సామగ్రిని తరలించేందుకు 100 బస్సులను ఏర్పాటు చేశారు. ఇందులో 75 పెద్ద బస్సులు, 25 మినీ బస్సులు ఉన్నాయి. శుక్రవారం ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం తిరిగి ఈ బస్సుల్లోనే సిబ్బంది, సామగ్రిని గమ్యస్థానాలకు చేరుస్తారు. కాగా, రెండో విడత ఎన్నికల విధులకు 3,423 మంది పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరిలో ఆర్వోలు 43 మంది, ఆర్వో– 1, 43 మంది, ఏఆర్వోలు 156, పీవోలు 1,423, ఓపిఓలు 1,657 మంది ఉన్నారు. వీరితో పాటు రూట్ ఆఫీసర్లు 77 మంది, జోనల్ ఆఫీసర్లను 25 మందిని కేటాయించారు. ఇక రెండో విడత పోలింగ్ కోసం 4లక్షల బ్యాలెట్ పత్రాలు, 1,455 బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలి: కలెక్టర్ రెండో విడత ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఆదేశించారు. రెండో విడత ఎన్నికలకు పోలింగ్ సామగ్రిని తరలించే సింగరేణి పాఠశాల కేంద్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 7 మండలాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయా మండలాల అధికారులకు సూచించారు. తొలి విడత ఎన్నికల సమయంలో అక్కడక్కడా కొంతమంది సిబ్బంది ఇబ్బంది పడినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఎన్నికల విధులను నిర్వర్తించే అధికారులకు భోజనాలతో పాటు ఇతర సౌకర్యాలను స్థానిక మండల అధికారులు ముందుగానే సమకూర్చాలని ఆదేశించారు. జిల్లాలో రెండో విడత ఎన్నికలను విజయవంతం చేయడానికి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్ వెంట జేసీ వెంకటేశ్వర్లు, డీపీఓ ఆశాలత, ఎన్నికల విభాగం అధికారులు ముత్యాల పులిరాజు, కోటయ్య, ఎంపీడీఓ మనోహర్‌రెడ్డి, చుంచుపల్లి తహసీల్దార్ నాగుబాయి ఉన్నారు. -
అస్తవ్యస్తం..
సాక్షి, కొత్తగూడెం: ఎన్నికల ప్రక్రియ నిర్వహణ కత్తిమీద సాములాంటిది. ఇక స్థానిక సంస్థల్లో అత్యంత కీలకమైన గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ మరింత పకడ్బందీగా ఉండాలి. అయితే గతంతో పోలిస్తే గ్రామ పంచాయతీల సంఖ్య పెరగడంతో ఎన్నికల నిర్వహణకు సిబ్బంది ఎక్కువగా అవసరం వచ్చింది. పైగా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. అయితే అన్ని అంశాల్లో ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు తీసుకున్నప్పటికీ.. సిబ్బందికి విధుల కేటాయింపులో మాత్రం జిల్లాలో అనేక లోపాలు తలెత్తాయి. ముఖ్యంగా జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు సగం మందికి ఎన్నికల డ్యూటీ పడకపోగా వందల మంది ప్రైవేటు టీచర్లకు విధులు అప్పగించారు. దీంతో ఏదైనా సమస్య తలెత్తితే ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉన్న బాధ్యత ప్రైవేటు వారికి ఉంటుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చాలకుంటే ప్రైవేటు వారి సేవలు ఉపయోగించుకోవాలే తప్ప ఇలా చేయడమేంటని అంటున్నారు. మరో విషయమేంటంటే చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు గత నెలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో డ్యూటీలు పడకపోగా, ప్రస్తుతంజరుగుతున్న మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో ఏ ఒక్క విడతలోనూ సదరు టీచర్లకు విధులు కేటాయించకపోవడం గమనార్హం. ఇక కొందరు ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులకు మాత్రం మూడు విడతల్లోనూ విధులు కేటాయించారు. జిల్లాలో మొత్తం 4500 మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండగా, వీరిలో 2వేల మందికి అసలు ఎన్నికలు డ్యూటీలే వేయకపోవడం విచిత్రంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కొందరు ఉపాధ్యాయులైతే తాము ఎన్నికల విధులకు పనికి రామా అని వాపోతున్నారు. అలాగే చాలామంది ఎస్జీటీలకు ఎన్నికల విధులు పడకపోగా, కీలకమైన పదోతరగతి విద్యార్థులకు బోధించే స్కూల్ అసిస్టెంట్లకు మాత్రం మూడు విడతల్లో విధులు కేటాయించడం గమనార్హం. రిటైర్డ్ ఉపాధ్యాయులకూ విధులు..! కొందరు రిటైర్డ్ ఉపాధ్యాయులకు, ఇతర జిల్లాల్లో ఉన్న ఉపాధ్యాయులకు సైతం ఎన్నికల విధులు కేటాయించారు. కొందరు వికలాంగ ఉద్యోగులకు కూడా విధులు కేటాయించడంతో, వారు సంబంధిత జీవో కాపీలు తెచ్చుకుని డీపీఓ వద్దకు వెళ్లి డ్యూటీలు రద్దు చేయించుకున్నారు. ఇక జిల్లావ్యాప్తంగా మూడు విడతల్లో అనేకమంది అంగన్వాడీ టీచర్లకు ఎన్నికల డ్యూటీలు వేశారు. చివరకు కాంట్రాక్టు లెక్చరర్లు, సింగరేణి ఉద్యోగులు, ఐటీడీఏ ఉద్యోగులకు సైతం విధులు కేటాయించి తమను విస్మరించడం ఏంటని పలువురు ఉపాధ్యాయులు మథనపడుతున్నారు. టీ– పోల్ వెబ్‌సైట్‌తోనే అసలు తిప్పలు.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందరు ఎంపీడీఓలు ఆయా మండలాల పరిధిలోని ఉద్యోగుల వివరాలు ఇచ్చారు. వారు టీ.పోల్ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈ టీ.పోల్ ద్వారా మాత్రమే జిల్లా పంచాయతీ అధికారులు ఉద్యోగుల వివరాలు తీసుకుని విడతల వారీగా ఎన్నికల విధులు కేటాయించారు. అయితే క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఉత్పన్నం కాగా, వాటిని జిల్లా పంచాయతీ అధికారి సాధ్యమైనంత మేరకు సవరించారు. అలాగే ఉపాధ్యాయులు వివిధ సమస్యలను డీపీఓ దృష్టికి తీసుకురాగా వాటిని సైతం సరిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మొదటి విడత ఎన్నికలు జరిగిన అన్ని మండలాల్లో ఎన్నికల సిబ్బంది కొరత తలెత్తినప్పటికీ నెట్టుకొచ్చారు. రెండో విడతలో అలాంటి సమస్యలు రాకుండా డీపీఓ సరిచేశారు. ఉద్యోగుల వివరాలను ఎంపీడీఓలు ఆయా మండలాల నుంచి టి.పోల్ వెబ్‌సైట్‌కు పంపారు. అయితే ఉపాధ్యాయుల వివరాలను, రిటైర్డ్ ఉపాధ్యాయుల వివరాలను ఎంఈఓల నుంచి ఎంపీడీఓలు తీసుకున్నారు. అయితే ఉపాధ్యాయులకు సంబంధించిన కచ్చితమైన వివరాలను ఎంఈఓలు సక్రమంగా ఇవ్వలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఎంపీడీఓలు తమకు అందిన వివరాలను మాత్రమే పంపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జిల్లా పంచాయతీ అధికారులకు సమస్యలు ఎదురైనట్లు పలువురు ఉపాధ్యాయులు చెపుతున్నారు. రెమ్యునరేషన్‌లోనూ తేడాలు.. ఎన్నికల విధులకు హాజరైన వివిధ స్థాయిల సిబ్బందికి రెమ్యునరేషన్ ఇచ్చే విషయంలోనూ ఒక విధానమంటూ లేదని పలువురు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలానికి ఒక రకంగా చెల్లించారని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు. ఈ చెల్లింపు విషయంలో ఆయా విభాగాల వారీగా సిబ్బందికి అన్ని చోట్లా ఒకేలా ఉండేలా చూడాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇప్పటికే ఆయా ఉపాధ్యాయ సంఘాలన్నీ కలెక్టరుకు వినతిపత్రాలు అందించాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికల విధులు ముగించుకుని ఇంటికి వచ్చే సమయంలో ఆయా మండల కేంద్రాల వద్ద నుంచి అర్ధరాత్రి సమయంలో రవాణా సదుపాయాలు లేక సిబ్బంది, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు అనేక అగచాట్లు పడ్డారు. రెండు, మూడు విడతల్లో అయినా ఈ పరిస్థితిని లేకుండా చేయాలని కోరుతున్నారు. ఎంఈఓలు అన్ని వివరాలు ఇచ్చారు అన్ని మండలాల్లో ఆయా ఉపాధ్యాయులకు సంబంధించిన పూర్తి వివరాలను మండల విద్యాశాఖ అధికారులు ఎంపీడీఓలకు అందజేశారు. అయితే ఉపాధ్యాయులందరికీ ఎన్నికల విధులు కేటాయించకపోవడం, ఉద్యోగ విరమణ పొందిన వారికి ఎన్నికల విధులు కేటాయింపు విషయంలో మాకు ఎలాంటి సంబంధం లేదు. – వాసంతి, డీఈఓ -
రేపే రెండో దశ పోరు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రెండో విడత పంచాయతీ ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. దాదాపు వారం రోజులపాటు పోటాపోటీగా సాగిన ప్రచారానికి బుధవారం సాయంత్రం తెరపడింది. చివరి రోజు అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేశారు. రెండో దశగా ఎనిమిది మండలాల పరిధిలోని 181 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇప్పటికే 21 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 160 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 489 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా 1,656 వార్డులకుగాను 1,400 వార్డుల్లో పోరు జరగనుంది. ఇక్కడ 3,844 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 256 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ప్రచారం ముగియడంతో అభ్యర్థులు ఇక పోల్ మేనేజ్మెంట్పై దృష్టిసారించారు. తమకే ఓటేస్తామన్న వారి ఓటును కాపాడుకునేందుకు జాగ్రత్త వహిస్తున్నారు. ఇప్పటికే మద్యం పంపిణీ చేస్తుండగా.. డబ్బులు కూడా అందజేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. -
రేపే మలి విడత
నిజామాబాద్‌అర్బన్: బోధన్ డివిజన్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్త య్యాయి. బుధవారం సాయంత్రంతో ప్రచారం ముగిసిపోగా ఈనెల 25న ఎన్నికలు జరుగనున్నా యి. ఉదయం 7 గంటల నుంచి మధ్యా హ్నం ఒం టి గంట వరకు పోలింగ్ ఉంటుంది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి అభ్యర్థులను ప్రకటిస్తారు. డివిజన్లోని బోధన్, కోటగిరి, రెంజల్, రుద్రూ రు, వర్ని, ఎడపల్లి మండలాల్లో 142 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఈనెల 11న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 13న నామినేషన్ల ముగింపు, ఉపసంహరణల అనంతరం బరిలో ఉన్న అభ్యర్థులను అధికారులు ప్రకటించారు. 33 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానా లు ఏకగ్రీవం కాగా, 109 స్థానాలకు ఎన్ని కలు జరుగనున్నాయి. సర్పంచ్ స్థానాలకు 336 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 1,296 వార్డు లు ఉండగా ఇందులో 452 వార్డు స్థానాలకు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగితా 844 వార్డులకు ఎన్నికలు జరుగనున్నా యి. వార్డు స్థానాలకు 2,002 మంది బరిలో ఉన్నారు. కుల సంఘాలకు.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రచార పర్వం ముగియగానే, ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థులు గ్రామాల్లో కులసంఘాలు, యు వజన సంఘాలకు విందులు ఏర్పాటు చేస్తున్నా రు. మహిళా సంఘాలకు శీతల పానీయాలను పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికి మద్యం అందిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా తమకు కేటాయించిన గుర్తులను వస్తువులుగా అభ్యర్థులు ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. కులసంఘాలు, యువజన సంఘాల సభ్యులకు రోజూ విందులు ఇస్తున్నారు. గ్రామాల్లో ఎన్నికల హడావుడి నెలకొంది. -
భారీగా నామినేషన్లు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత నా మినేషన్ల పర్వం ముగిసింది. జిల్లాలోని ఎనిమిది మండలాలకు సంబంధించి 243 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మూడు రోజులుగా నామినేషన్లు స్వీకరిస్తుండగా ఆదివారంతో గడువు ముగిసింది. ఈ మేరకు మూడు రోజుల్లో కలిపి అన్ని పంచాయతీల సర్పంచ్, వార్డుసభ్యులస్థానాలకు 6,060 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజే అధికం రెండో విడత ఎన్నికలు జరగనున్న గ్రామపంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు వేసేందుకు ఆదివారం చివరి రోజు గడువు. దీంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. ఈ పంచాయతీల్లో శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా.. తొలి రోజు రెండు రోజుల్లో అంతంత మాత్రంగానే నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే, చివరి రోజు కావడంతో ఎక్కువ సంఖ్యలో అందాయి. కాగా, దాఖలైన నామినేషన్లను సోమవారం పరిశీలించి వివరాలు అసంపూర్ణంగా ఉన్న వాటిని అధికారులు తిరస్కరిస్తారు. తిరస్కరణపై అప్పీల్ చేసుకునేందుకు 15వ తేదీన అవకాశం ఇస్తారు. ఇక ఈనెల 17వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు కాగా.. అదే రోజు మద్యహ్నం 3 గంటల తర్వాత తుది జాబితాలో మిగిలిన అభ్యర్థులు, వారికి కేటాయించిన గుర్తులను అధికారులు వెల్లడిస్తారు. ఈ విడత పోలింగ్ 25వ తేదీన జరగనుంది. 39ద పంచాయతీల్లో ఒక్కొక్కటే... గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత నామినేషన్ల స్వీకరణ పర్వం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా 243 పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా 39 స్థానాలకు ఒక్కొక్కటే నామినేషన్ దాఖలైంది. ఇందులో జడ్చర్ల మండలం నుంచి 43 పంచాయతీలకు గాను ఐదు పంచాయతీల్లో ఒక్కటి చొప్పునే నామినేషన్ దాఖలు చేశారు. అలాగే, బాలానగర్ మండలంలో 37 పంచాయతీలకు ఎనిమిది, రాజాపూర్ మండలంలో 24 పంచాయతీలకు నాలుగు, మిడ్జిల్ మండలంలో 24 మండలాలకు ఒకటి, నవాబుపేట మండలంలోని 54 పంచాయతీలకు 16, మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని 26 పంచాయతీలకు రెండు చోట్ల, హన్వాడ మండలంలోని 35 గ్రామపంచాయతీలకు గాను మూడు స్థానాల్లో ఒక్కొక్కటే నామినేషన్ వచ్చింది. దీంతో ఆయా పంచాయతీల్లో పాలకవర్గాలు ఏకగ్రీవం కానున్నాయి. అయితే, నామినేషన్ల ఉపసంహరణకు 17వ తేదీ వరకు అవకాశం ఉండగా.. ఆ రోజు మరికొన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశముందని తెలుస్తోంది. దీంతో అధికారులు అదే రోజున అధికారికంగా వివరాలు వెల్లడిస్తారు. -
బుజ్జగింపులు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బుజ్జగింపుల పర్వం షురువైంది. నామినేషన్ల ఉప సంహరణకు గడువు రేపటితో ముగియనుండటంతో నామినేషన్లు వేసిన వారిని బరిలోంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్న గ్రామ పంచాయతీల్లో కొన్నింటికి ఒకే ఒక నామినేషను దాఖలు కావడంతో ఈ పంచాయతీలు ఏకగీవ్రమైనట్లే. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసాక ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. తొలి విడతలో ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 177 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు, 1,746 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికే బాల్కొండ నియోజకవర్గం పరిధిలో నాలుగు గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు ఒకే ఒక నామినేషన్ చొప్పున దాఖలయ్యాయి. దీంతో ఈ నాలుగు గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఈ ఏకగ్రీవ పంచాయతీల సంఖ్య సుమారు 10 నుంచి 14 వరకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్మూర్ నియోజకవర్గంలో కూడా నాలుగు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ సంఖ్య మరింత పెరగనుంది. నిజామాబాద్ రూరల్ పరిధిలోని జక్రాన్‌పల్లి మండలంలో ఇప్పటికే రెండు చోట్ల ఏకగ్రీవం కాగా, మరికొన్ని గ్రామ పంచాయతీలు కూడా ఏకగ్రీవం వైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘మేజర్’పై ఎమ్మెల్యేల దృష్టి.. మేజర్ గ్రామ పంచాయతీలపై ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ పంచాయతీలు దాదాపు తమ అనుచరులకే దక్కేలా చూస్తున్నారు. నామినేషన్లు వేసిన బలమైన అభ్యర్థులకు అవసరమైతే సహకార ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. సహకార సం ఘం డెరెక్టర్ స్థానానికి మద్దతిస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానానికి అవకాశం కల్పిస్తామని బుజ్జగిస్తున్నారు. వార్డు సభ్యులకూ పోటీ.. సర్పంచ్ స్థానాలకే కాకుండా వార్డు సభ్యుల స్థానాలకు కూడా పోటీ ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా మేజర్ పంచాయతీల్లో ఈ పోటీ అధికంగా కనిపిస్తోంది. నందిపేట్ మేజర్ గ్రామ పంచాయతీలోని ఓ వార్డుకు ఏకంగా 16 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారంటే వార్డు సభ్యులకు సైతం ఏ స్థాయిలో పోటీ ఉందో అర్థం అవుతోంది.అవకాశం వస్తే ఉప సర్పంచ్ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవచ్చనే ఉద్దేశంతో కొందరు వార్డు సభ్యునిగా బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. కుల సంఘాలు వార్డు సభ్యుల ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా జనరల్‌గా స్థానాలుగా ప్రకటించిన వాటిలో కొన్ని చోట్ల కులాల మధ్య పోటీ నెలకొంది. బలమైన సామాజికవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు నేతలు కూడా బరిలోకి దిగుతుండటంతో పోరు ఆసక్తికరంగా మారుతోంది. -
జోరుగా నామినేషన్లు
కరీంనగర్: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. శుక్రవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. తమ అనుచరగణంతో అట్టహా సంగా నామినేషన్లు వేసి గ్రామాల్లో వేడి రగిలిం చారు. రెండవ విడతలో మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లోని 107 గ్రామపంచాయతీలకు, 1,014 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా మండలాల్లోని క్లస్టర్ గ్రామ పంచాయతీల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. తొలి రోజున సర్పంచ్ స్థానాలకు 199 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వార్డు మెంబర్ స్థానాలకు 604 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల దాఖలకు రేపటి వరకు గడువు ఉంది. -
‘రెండో విడత’ షురూ..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ శుక్రవారం ప్రారంభమైంది. ఇప్పటికే జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. దీంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. శుక్రవారం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే గ్రామాల్లో ఆయా పార్టీల మద్దతుదారులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 204 జీపీలకు రెండో విడత ఎన్నికలు జరగనుండగా.. మొదటి రోజు సర్పంచ్ పదవులకు 179 నామినేషన్లు, వార్డు సభ్యుల పదవులకు 453 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలిరోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ఆసక్తి కనబరిచారు. మరో రెండు రోజులు గడువు ఉండడంతో రెట్టింపు సంఖ్యలో నామినేషన్లు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, సింగరేణి మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీలకు ఈనెల 25వ తేదీన రెండో విడతలో పోలింగ్ జరగనుంది. ఈనెల 13వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 14వ తేదీన నామినేషన్ల పరిశీలన, 15న అభ్యర్థులు అభ్యంతరాల కోసం ఆర్డీఓకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. 16న అప్పీల్‌పై అధికారులు నిర్ణయం ప్రకటించనున్నారు. 17న పోటీ నుంచి తప్పుకునే అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు గడువు విధించారు. 17వ తేదీ సాయంత్రం బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రదర్శించనున్నారు. కాగా.. ఏన్కూరు మండలంలో 25 గ్రామ పంచాయతీలు ఉండగా.. సర్పంచ్ పదవులకు 25, వార్డు సభ్యుల పదవులకు 84 నామినేషన్లు దాఖలయ్యాయి. తల్లాడ మండలంలో 27 జీపీలు ఉండగా.. సర్పంచ్ పదవులకు 18 నామినేషన్లు, వార్డు సభ్యుల పదవులకు 43 నామినేషన్లు వచ్చాయి. కల్లూరు మండలంలో 31 జీపీలు ఉండగా.. సర్పంచ్ పదవులకు 21, వార్డు సభ్యుల పదవులకు 57 నామినేషన్లు దాఖలయ్యాయి. పెనుబల్లి మండలంలో 33 పంచాయతీల సర్పంచ్ పదవులకు 51, వార్డు పదవులకు 121 నామినేషన్లు దాఖలయ్యాయి. సత్తుపల్లి మండలంలో 21 జీపీల సర్పంచ్ పదవులకు 21 నామినేషన్లు, వార్డు సభ్యుల పదవులకు 51 నామినేషన్లు దాఖలయ్యాయి. వేంసూరు మండలంలో 26 పంచాయతీలు ఉండగా.. సర్పంచ్ పదవులకు 20, వార్డు సభ్యుల పదవులకు 62 నామినేషన్లు దాఖలయ్యాయి. సింగరేణి మండలంలో 41 పంచాయతీలు ఉండగా.. సర్పంచ్‌లకు 23, వార్డు సభ్యుల పదవులకు 35 నామినేషన్లు దాఖలయ్యాయి. -
పోటీకి పరుగులు
జిల్లాలో సర్పంచ్ పదవికి డిమాండ్ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా రెండు, మూడో విడత ఎన్నికలు జరగనున్న నర్సాపూర్, తూప్రాన్ డివిజన్లలోని కొన్ని పంచాయతీలకు తీవ్రమైన పోటీ నెలకొంటోంది. రెండు డివిజన్లలోని పలు గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలో ఉండటం, కొన్ని పారిశ్రామిక వాడల పరిధిలో, మరికొన్ని గ్రామాలకు ఆదాయ వనరులు అధికంగా ఉండటంతో ఇక్కడ నుంచి సర్పంచ్‌గా బరిలో దిగేందుకు రాజకీయ నాయకులు పోటీపడుతున్నారు. దీనికితోడు రియల్ వ్యాపారం అభ్యర్థులను ఊరిస్తోంది. సాక్షి, మెదక్ : ఒక్కసారి సర్పంచ్‌గా గెలిస్తే ఐదేళ్లపాటు రియల్ దందా చేసి డబ్బులు సంపాదించవచ్చని ఆశపడుతున్నారు. ‘ఎంతఖర్చుకైనా వెనుకాడేదిలేదు.. ఎంత డబ్బైనా ఖర్చుచేస్తా.. నేను సర్పంచ్‌గా గెలవాల్సిందే’ అంటూ మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ పంచాయతీకి చెందిన ఓ నేత వ్యాఖ్యానించాడు. తూప్రాన్ డివిజనల్లో మూడవ విడతగా ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. తూప్రాన్ డివిజన్ పరిధిలోని గ్రామ పంచాయతీలకు డిమాండ్ పెరిగింది. రియల్ వ్యాపారంతో భూములకు రెక్కలు రావడం, పరిశ్రమల స్థాపనతో పంచాయతీలకు ఆదాయం వస్తున్న నేపథ్యంలో పలు పంచాయతీలకు ఆశావహుల్లో పోటీ పెరిగింది. తూప్రాన్ మండలంలో ఆదర్శ గ్రామం మల్కాపూర్, ఘనపూర్, నాగులపల్లి, ఇస్లాంపూర్ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవికి ఎక్కువ పోటీ ఉంది. ఒక్కో గ్రామం నుంచి పది మందికి పైగా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. అలాగే మనోహరాబాద్ మండలంలో కాళ్లకల్, ముప్పిరెడ్డిపల్లి, కూచారం, జీడిపల్లి, మనోహరాబాద్ గ్రామ పంచాయతీలు హైదరాబాద్‌కు సమీప దూరంలో ఉండడం, 44వ జాతీయ రహదారికి ఆనుకొని ఉండడంతో రియల్ వ్యాపారం ఎక్కువగా జరుగుతోంది. ఒక ఎకరం సుమారు రూ.2కోట్ల వరకు పలుకుతోంది. దీనికితోడు కాళ్లకల్, ముప్పిరెడ్డిపల్లిల్లో పారిశ్రామిక వాడలు ఉన్నాయి. పరిశ్రమలు ఉన్నందున పంచాయతీలకు ఆదాయం రావడంతోపాటు సర్పంచ్‌గా గెలిస్తే పరిశ్రమల్లో కాంట్రాక్టులు చేయవచ్చన్న ఆశతో ఎక్కువగా మంది పోటీకి సై అంటున్నారు. ముప్పిరెడ్డిపల్లి మహిళలకు రిజర్వు అయ్యింది. ఇక్కడి నుంచి ముగ్గురు నేతలు తమ భార్యలను పోటీలో దించేందుకు సిద్ధం అవుతున్నారు. ఎన్నికల్లో ఎంత ఖర్చయినా పెట్టేందుకు సిద్ధ పడుతున్నారు. రూ.50 నుంచి రూ.80 లక్షల వరకు డబ్బు ఖర్చు చేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాళ్లకల్ పంచాయతీ జనరల్ రిజర్వు కావడంతో ఇక్కడా పోటీ ఎక్కువగా ఉంది. స్థానికంగా ఉన్న ముగ్గురు నేతలు సర్పంచ్ పదవిపై కన్నేశారు. వీరు ఎన్నికల్లో ఎంత ఖర్చైనా చేసేందుకు సిద్ధ పడుతున్నారు. వెల్దుర్తి మండలంలో మాసాయిపేట, కుకునూరు, వెల్దుర్తి, చేగుంట మండలంలో వడియారం, రెడ్డిపల్లితో నార్సింగి మండల కేంద్రానికి పోటీ ఎక్కువగా ఉంది. నర్సాపూర్‌లోనూ సర్పంచ్ పదవికి పోటీ ఎక్కువే.. నర్సాపూర్ నియోజకవర్గంలోని పలు పంచాయతీల్లో పోటీ చేసేందుకు లీడర్లు ఆసక్తి చూపుతున్నారు. నర్సాపూర్, శివ్వంపేట మండలాలు హెచ్ఎండీఏ పరిధిలోకి రావడంతోపాటు ఇక్కడ రియల్ వ్యాపారం ఎక్కువగా సాగుతుండటంతో సర్పంచ్ పదవి కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. నర్సాపూర్ డివిజన్లో రెండవ విడతగా 25వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. నర్సాపూర్ మండలంలోని కాగజ్‌మద్దూరు, రెడ్డిపల్లి, ఆవంచ, రుస్తుంపేట, కొల్చారం మండలంలోని రాంపూర్ గ్రామంలో మైనింగ్ ఉండటంతో ఇక్కడి నుంచి ఎక్కువ మంది పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు. కొల్చారం, వరిగుంతం, రంగంపేట, ఎనగండ్ల గ్రామాల్లో సర్పంచ్‌గా పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. శివ్వంపేట మండలంలో దొంతి, శబాష్‌పల్లి, గోమారం పంచాయతీల్లో సర్పంచ్‌గా పోటీ చేసేందుకు నేతలు పోటీపడుతున్నారు. ఇదిలా ఉంటే నర్సాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీలో సైతం ఎక్కువ పోటీ ఉంది. కొల్చారం మండంలోని రంగంపేట, కొల్చారం, తుక్కాపూర్, పైతర, అంసాన్పల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ నుంచి ఇద్దరి కంటే ఎక్కువ మంది నేతలు టికెట్ కోరుతున్నారు. కౌడిపల్లి మండలంలోని కొట్టాల, బుజరంపేట, కంచన్‌పల్లి, రాయిలాపూర్, కూకట్లపల్లి పంచాయతీల నుంచి పోటీ చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. శివ్వంపేట, గోమారం గ్రామాల్లో సర్పంచ్ టికెట్ కోసం టీఆర్ఎస్ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకే పంచాయతీ నుంచి టీఆర్ఎస్ నేతలు ఎక్కువ మంది టికెట్ ఆశిస్తుండటం స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి తలనొప్పిగా మారింది. టికెట్ కోసం పోటీ పడుతున్న టీఆర్ఎస్ నాయకుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. -
నేడు రెండో విడత నోటిఫికేషన్
సాక్షి, వరంగల్ రూరల్: గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక బుజ్జగింపుల పర్వం మొదలైంది. సొంత పార్టీల నుంచే పోటాపోటీగా నామినేషన్లు వేయడంతో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. విత్ డ్రాకు మరోరెండు రోజుల సమయం ఉండడంతో పోటీ నుంచి తప్పుకునేలా నాయకులు పావులు కదుపుతున్నారు. మొదటి విడతలో నర్సంపేట, దుగ్గొండి, పర్వతగిరి, వర్ధన్నపేట, సంగెం మండలాల్లో 145 గ్రామ పంచాయతీలు, 1,264 వార్డు స్థానాలకు గురువారం తెల్లవారుజాము వరకు నామినేషన్లు దాఖలయ్యాయి. 145 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 819 నామినేషన్లు, 1264 వార్డు స్థానాలకు 2987 నామినేషన్లు వచ్చాయి. టీఆర్ఎస్ నుంచి పోటాపోటీ.. గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారుల మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. తమకు కలిసి వచ్చిన రిజర్వేషన్ ఆధారంగా సొంత పార్టీ నుంచే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్ గ్రామ పంచాయతీలో 12 మంది నామినేషన్ వేయగా అందులో 8 మంది టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. అలాగే పెద్దతండాలో 10 మందికి 9 మంది, కొంకపాకలో 10 మందికి 8 మంది, రావూరులో ఏడుగురికి ఐదుగురు, దౌలత్‌నగర్‌లో ఏడుగురికి ఐదుగురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు నామినేషన్ వేయడం విశేషం. వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద, కట్య్రాల, తాచగుడెం, ల్యాబర్తి, రామోజీ కుమ్మరిగూడెంతండా, దమ్మన్నపేట, రామవరం, కడారిగూడెంలో సైతం ఎక్కువగా టీఆర్ఎస్కు చెందిన వారే నామినేషన్లు వేశారు. సముదాయిస్తున్న నేతలు.. సొంత పార్టీ నుంచే ఇద్దరి నుంచి10 మంది వరకు అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో బరి నుంచి తప్పించడానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు రంగంలోకి దిగారు. పార్టీ నుంచే పోటీ ఉంటే గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో వారిని తప్పించడానికి బుబ్జగింపులు మొదలుపెట్టారు. వారి అవసరాలను తెలుసుకుని డబ్బులు ఆఫర్ చేస్తున్నారు. రాబోయే ఎంపీటీసీ, సహకార ఎన్నికల్లో పోటీ చేయిస్తామని భరోసా ఇస్తున్నారు. 21 గ్రామాలు ఏకగ్రీవం మొదటి విడతలో జరగనున్న 145 గ్రామపంచాయతీల్లో 21 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి. అందులో 20జీపీలను టీఆర్ఎస్ మద్దతుదారులే దక్కించుకోబోతున్నారు. వర్ధన్నపేట మండలం కొత్తపల్లి నుంచి కౌడగాని కవిత ఇండిపెండెంట్‌గా ఎన్నిక కాబోతున్నారు. పర్వతగిరి మండలం నారాయణపురం గ్రామ పంచాయతీ నుంచి కె.రామ్మోహన్, చెరువు కొమ్ముతండా నుంచి దేశ్రామ్, తూర్పుతండా నుంచి బానోత్ విజయ, మల్లెతండా నుంచి బోడ సుజాత, శ్రీనగర్ నుంచి పరిటాల సుబ్బారావు, గోరుగుట్టతండా నుంచి బానోత్ వెంకన్న, దూపతండా నుంచి జూమిర్రి , జమలాపురం నుంచి పిడుగు రేణుక, దుగ్గొండి మండలం పోనకల్ నుంచి బొమ్మగాని ఊర్మిళ, పీజీతండా నుంచి నునావత్ మంగమ్మ, గుడి మహేశ్వరం నుంచి అడప సుధాకర్, స్వామిరావుపల్లి నుంచి అంబరగొండ సుమలత, సంగెం మండలంలోని కాపులకనుపర్తి నుంచి ఎర్రబెల్లి గోపాల్ రావు, కొత్తగుడెం నుంచి వాసం రజిత, ఎలుగూరుస్టేషన్ నుంచి గూగులోతు భద్రమ్మ, బీకోజినాయక్ తండా నుంచి బానోత్ విద్యారాణి నర్సంపేట మండలంలోని రాజపల్లి నుంచి నామాల భాగ్యమ్మ, బోజ్యనాయక్‌తండా నుంచి భూక్యా లలిత, వర్ధన్నపేట మండలం బొక్కలగూడెం నుంచి ఆకుల వెంకట్ నారాయణ, రామ్ధన్తండా నుంచి గుగులోతు లక్ష్మి ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయి. నేడు రెండో విడత నోటిఫికేషన్.. గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల కోసం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. పరకాల, నడికూడ, శాయంపేట, నల్లబెల్లి, ఖానాపురం, రాయపర్తి మండలాల్లోని 136 గ్రామ పంచాయతీలు, 1210 వార్డు స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్లు స్వీకరిస్తారు. తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. షెడ్యూల్.. 11వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ 13వ తేదీ నామినేషన్ల దాఖలుకు చివరి గడువు 14న నామినేషన్ల పరిశీలన 17న నామినేషన్ల ఉపసంహరణ(మధ్యాహ్నం 3గంటల వరకు), అదే రోజు బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా విడుదల -
ఇక రెండో విడత
నిజామాబాద్‌అర్బన్: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ జారీ కానుండగా బోధన్ డివిజన్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ డివిజన్లోని ఆరు మండలాల్లో 142 గ్రామ పంచాయతీలు, 1,296 వార్డులు ఉన్నాయి. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను అధికారులు స్వీకరిస్తారు. 13వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 14న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 17న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటిస్తారు. 25న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు విజేతలను ప్రకటిస్తారు. అర్హులు వీరే... సర్పంచు, వార్డు స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఓటు హక్కు కలిగి ఉండాలి. 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అభ్యర్థులను ప్రతిపాదించే వారికీ ఓటు ఉండాలి. వార్డు సభ్యుడిగా పోటీచేసే అభ్యర్థికి వార్డులో ఓటు ఉన్నవారే ప్రతిపాదించవల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇంటి పన్నులు బకాయిలు లేకుండా చూసుకోవాలి. బకాయి చెల్లించిన రశీదును జతపరచాలి. బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. ఎస్సీ,ఎస్టీ, బీసీ రిజర్వు పంచాయతీల్లో పోటీచేసే వారు. సంబంధిత కుల ధ్రువీకరణ పత్రం జతచేయాలి. వార్డు సభ్యునిగా పోటీచేసే జనరల్ అభ్యర్థులకు నామినేషన్ ఫీజు రూ. 500 , బీసీ,ఎస్సీ,ఎస్టీలకు రూ. 200 ఉంటుంది. సర్పంచు స్థానాలకు పోటీ చేసే జనరల్ అభ్యర్థులు నామినేషన్ ఫీజు రూ.2,000, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. పక్బడందీగా ఏర్పాట్లను పూర్తి చేసిన అధికార యంత్రాంగం బోధన్‌రూరల్: రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం రెండో విడతలో బోధన్ మండలంలోని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికల నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధం అయ్యింది. బోధన్ మండలంలో మొత్తం 38 సర్పంచ్‌లు, 340 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై ఆదివారం వరకు కొనసాగనుంది. మండంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ అధికార యంత్రాంగం ఏర్పాట్లు పక్బడందీగా ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావ్, బోధన్ ఆర్డీవో గోపిరాం నేతృత్వంలో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు (స్టేజ్–1, అసిస్టెంట్ స్టేజ్–1 అధికారులకు) పక్కగా శిక్షణ ఇచ్చి ఎన్నికల విధులను సాఫీగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కావాల్సిన ఎన్నికల సామగ్రిని అధికారులు పంపిణీ చేశారు. సర్పంచ్‌లు, వార్డులు నామినేషన్లు వేసేందుకు కావాల్సిన పత్రాలు, డ్యాంకుమెంట్లను అభ్యర్థులకు జీపీ ఎన్నికల అధికారులు తెలియచేశారు. -
ఇక మలి దశ
చుంచుపల్లి: జిల్లాలో తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రెండో విడత ఎన్నికల తంతు శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతోంది. నేటి నుంచి ఈ నెల 13 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మొదటి విడతలో జిల్లాలో భారీగానే నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో రెండో విడతకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దశలో 142 పంచాయతీలు, 1294 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మూడు రోజుల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. మలిదశ ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాత పంచాయతీల వారీగా స్థానికంగానే నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఆయా పంచాయతీల పరిధిలో మూడు రోజుల పాటు స్థానికంగా అందుబా టులో ఉండి నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. 14 నుంచి 16 వరకు నామినేషన్ల పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, వాటి పరిష్కారం, నామినేషన్లు తిరస్కరణ, ఉపసంహరణ, తదితర పనులను చేపట్టి 17న రెండో విడత ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారు. రెండో విడతలో 142 పంచాయతీల్లో.. మొదటి విడతలో ఏడు మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా, రెండో దశలో మరో ఏడు మండలాల పరిధిలోని 142 పంచాయతీలు, 1294 వార్డులకు ఎలక్షన్లు జరగనున్నాయి. ఇందులో అన్నపురెడ్డిపల్లి మండలంలో 10 పంచాయతీలు ఉండగా 16, 519 మంది ఓటర్లు, అశ్వారావుపేటలో 30 పంచాయతీల పరిధిలోని 41,3179 మంది, చండ్రుగొండలో 14 పంచాయతీల్లో 21,795 మంది, చుంచుపల్లిలో 18 పంచాయతీల పరిధిలో 33,462 మంది, దమ్మపేటలో 31 పంచాయతీల్లో 40,729 మంది, కరకగూడెంలో 16 పంచాయతీల్లో 11,184 మంది, పినపాకలో 23 పంచాయతీల పరిధిలోని 23,712 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈనెల 25న 142 పంచాయతీలు 1294 వార్డులకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక గ్రామాలు 520.. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే గ్రామాల వారీగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. జిల్లాలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. 479 పంచాయతీలకు మూడు విడతల్లో జరగనున్న పోలింగ్ నేపథ్యంలో జిల్లాలో 520 గ్రామాలు సమస్యాత్మక, 876 గ్రామాలు అతి సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఆయా గ్రామాల్లో పోలింగ్ రోజున ఏ మేరకు బందోబస్తు ఏర్పాటు చేయాలనే విషయమై పోలీసు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లాలో అవసరమైన పోలింగ్ స్టేషన్ల పరిధిలో వెబ్‌కాస్టింగ్ కోసం కూడా పోలీసులు కసరత్తు చేస్తున్నారు. -
జమ్మూ, జార్ఖండ్‌లో రెండో విడత పోలింగ్
జమ్మూ కాశ్మీర్/ జార్ఖండ్: జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీకి రెండు విడత పోలింగ్ ప్రక్రియ మంగళవారం ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ ఉదయం 8.00 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.00 గంటలకు ముగియనుంది. జమ్మూ కాశ్మీర్: రెండో దశలో 18 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల బరిలో 175 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో నలుగురు మంత్రులు, ఉప సభాపతి, 11 మంది ప్రస్తుత శాసనసభ్యులు ఉన్నారు. వారంతా ఈ రోజు జరిగే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అలాగే ఈ ఎన్నికల 55 మంది కోటీశ్వరులు పోటి చేస్తున్నారని ఏడీఆర్ వెల్లడించింది. జార్ఖండ్: రెండో దశలో జార్ఖండ్‌లోని 20 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల బరిలో 223 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో మాజీ ముఖ్యమంత్రులు అర్జున్ ముండా, మధుకోడా ఉన్నారు. వారంతా ఈ రోజు జరిగే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే జంషెడ్పూర్ నగరంలోని పశ్చిమ, తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాలలో భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5.00 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. -
నేడే రెండో దశ
సాక్షి, ముంబై: పశ్చిమ మహారాష్ట్ర, ఉత్తర మహారాష్ట్ర, మరాఠ్వాడా, కొంకణ్‌లోని 19 లోక్‌సభ నియోజకవర్గాల్లో గురువారం రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఇన్ని రోజులు రాజకీయ నేతల ప్రసంగాలను విన్న ఓటర్లు నేడు తమ ఓటుతో అభ్యర్థుల తలరాతలు రాసేందుకు సిద్ధమయ్యారు. 36,879 పొలింగ్ కేంద్రాల్లో సుమారు 3.25 కోట్ల మంది తమ ఓటు వేయనున్నారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకునే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల సంఘం(ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. పొలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముందే చేసిపెట్టింది. ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ సిబ్బందికి ఇబ్బంది కలగకుండా కనీస వసతులు కల్పించడంపై దృష్టి సారించింది. ఎండలో వచ్చి ఓటువేసే వారికి పొలింగ్ కేంద్రం వద్ద మంచినీరు అందుబాటులో ఉంచింది. వృద్ధులు, వికలాంగులకు తగిన ఏర్పాట్లు చేసింది. పొలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ ఎత్తున పోలీసు బందోబస్తు మొహరించారు. ఇదిలావుండగా లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు టెన్షన్ మొదలైంది. ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో అన్న ఆందోళన వారిలో కనబడుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే, బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండే, మాజీ సీఎం అశోక్ చవాన్, సుప్రీయా సూలే , విజయ్ సింహ్ మోహితే పాటిల్, పద్మసింహ్ పాటిల్, నీలేష్ రాణే తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖాముఖి పోటీ... రెండో దశలో ఎన్నికలు జరుగనున్న 19 లోక్‌సభ నియోజకవర్గాల్లో మూడు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ డీఎఫ్ కూటమి, మహాకూటమిల మధ్య ప్రధాన పోటీ జరగనుంది. ఎన్నికల ప్రచారం చివరిరోజు వరకు కాంగ్రెస్ కూటమి ప్రచారం కోసం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రచారం చేశారు. మహాకూటమి కోసం బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీ నేత గోపీనాథ్ ముండే తదితరులు ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. దేశంలోనే తొలిసారిగా బీజేపీ అత్యాధునిక సాంకేతిక పరిఙ/ా్ఞనాన్ని వినియోగించుకుంది. మోడీ కోసం త్రీడి సభలను ఏర్పాటు చేసింది. మోడీ వేరే ప్రాంతంలో మాట్లాడుతున్నప్పటికీ త్రీడీ టెక్నాలజీ కారణంగా మనముందే ఉన్నట్టు, మనవైపే చూస్తూ మాట్లాడుతున్నట్టు కనిపించింది. ఇలా తొలిసారిగా ఔరంగాబాద్‌లో ఏర్పాటు చేసిన త్రీడీ సభకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. అందరి దృష్టి సింధుదుర్గావైపు... రెండో దశలో రత్నగిరి-సింధుదుర్గా లోక్‌సభ నియోజకవర్గంవైపు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కాంగ్రెస్ నేత నారాయణ రాణే కుమారుడు నీలేష్ రాణే, శివసేన అభ్యర్థి వినాయక్ రావుత్ల మధ్య గట్టిపోటీ కన్పిస్తోంది. సింధుదుర్గాలో రాణే ప్రభావం ఉన్నా గత కొంతకాలంగా మారిన రాజకీయ సమీకరణాలు రాణే వర్గీయుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్సీపీ నాయకుడు కేసకర్ రాణేకు ప్రచారం చేయడానికి నిరాకరించి అధిష్టానం ఆదేశాలను కూడా లెక్కచేయకుండా పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత కేసకర్ మద్దతుదారులు శివసేనకు మద్దతు ప్రకటించారు. దీంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. కాగా, అహ్మద్నగర్లోనూ ఈసారి తీవ్ర పోటీనే నెలకొంది. గత ఎన్నికల్లో సుమారు 47 వేల ఓట్ల మెజార్టీతో ఎన్సీపీ అభ్యర్థి శివాజీ భానుదాస్ కర్దిలేపై విజయం సాధించిన దిలీప్ కుమార్ ఈసారి విజయం కోసం చెమటోడుస్తున్నారు. అయితే ఈసారి గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన రాజీవ్ రాజలేను ఎన్సీపీ బరిలోకి దింపింది. దీంతో ఇక్కడ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. షిర్డీలో శివసేన అభ్యర్థిగా సదాశివ్ లోకాండే, కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎంపీ బావ్సాహెబ్ వాక్చౌరే మధ్య తీవ్ర పోటీ నెలకొంది.