మణిపూర్ రెండో ఫేజ్ ఎన్నికల పోలింగ్ కూడా హింసాత్మక ఘటనల మధ్యే సాగుతున్నాయి. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేసినప్పటికీ.. ఈ ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం.
థౌబాల్ జిల్లా, సేనాపతి జిల్లాల్లో పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసలో వేర్వేరే ఘటనల్లో ఇద్దరు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. మరికొన్ని చోట్ల కూడా అల్లర్లు చెలరేగినట్లు తెలుస్తోంది. ఇక ఉదయం 11 గంటల వరకు 28 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
పది జిల్లాలు.. 22 నియోజకవర్గాలు 92 మంది అభ్యర్థులు మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల రెండో ఫేజ్(చివరిది కూడా) పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Today is the second phase of the Manipur Assembly elections. Calling upon all those whose constituencies are polling today to vote in large numbers and mark the festival of democracy.
— Narendra Modi (@narendramodi) March 5, 2022
Comments
Please login to add a commentAdd a comment