Manipur assembly Polls
-
మణిపూర్ పోలింగ్ హింసలో.. ఇద్దరి మృతి
మణిపూర్ రెండో ఫేజ్ ఎన్నికల పోలింగ్ కూడా హింసాత్మక ఘటనల మధ్యే సాగుతున్నాయి. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేసినప్పటికీ.. ఈ ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. థౌబాల్ జిల్లా, సేనాపతి జిల్లాల్లో పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసలో వేర్వేరే ఘటనల్లో ఇద్దరు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. మరికొన్ని చోట్ల కూడా అల్లర్లు చెలరేగినట్లు తెలుస్తోంది. ఇక ఉదయం 11 గంటల వరకు 28 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. పది జిల్లాలు.. 22 నియోజకవర్గాలు 92 మంది అభ్యర్థులు మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల రెండో ఫేజ్(చివరిది కూడా) పోలింగ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. Today is the second phase of the Manipur Assembly elections. Calling upon all those whose constituencies are polling today to vote in large numbers and mark the festival of democracy. — Narendra Modi (@narendramodi) March 5, 2022 -
విజయం మాదే: ఇరోమ్ షర్మిల
ఇంఫాల్ : ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఉక్కు మహిళ ఇరోమ్ చాను షర్మిల అన్నారు. మణిపూర్లో కూడా అలాంటి మార్పే రావాలని ఆమె ఆకాంక్షించారు. యువతరం నుంచి కూడా సానుకూల స్పందన వస్తోందని షర్మిల పేర్కొన్నారు. శనివారం ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఇరోమ్ షర్మిల తన గెలుపుపై ముందే ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 8న జరిగే ఎన్నికల్లో ముఖమంత్రి పోటీ చేస్తున్న ఖంగాబాక్ నియోజకవర్గంలో తమ గెలుపు ఖాయమన్నారు. కాగా ఇటీవలే రాజకీయ ఆరంగేట్రం చేసిన ఇరోమ్ షర్మిల తాను స్థాపించిన పీఆర్జేఎ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులను బరికి దింపారు. మరోవైపు పీఆర్జేఏ అభ్యర్థి ఎలాండ్రో లైకోంబామ్పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. మణిపూర్ తొలిదశ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. తొలి దశలో మొత్తం 38 అసెంబ్లి స్థానాలకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం ఒంటిగంటకు 69శాతం పోలింగ్ నమోదు అయింది. అలాగే మరో రెండోవిడత పోలింగ్ బుధవారం జరగనున్నాయి.