విజయం మాదే: ఇరోమ్ షర్మిల
ఇంఫాల్ : ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఉక్కు మహిళ ఇరోమ్ చాను షర్మిల అన్నారు. మణిపూర్‌లో కూడా అలాంటి మార్పే రావాలని ఆమె ఆకాంక్షించారు. యువతరం నుంచి కూడా సానుకూల స్పందన వస్తోందని షర్మిల పేర్కొన్నారు. శనివారం ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఇరోమ్ షర్మిల తన గెలుపుపై ముందే ధీమా వ్యక్తం చేశారు.
ఈ నెల 8న జరిగే ఎన్నికల్లో ముఖమంత్రి పోటీ చేస్తున్న ఖంగాబాక్ నియోజకవర్గంలో తమ గెలుపు ఖాయమన్నారు. కాగా ఇటీవలే రాజకీయ ఆరంగేట్రం చేసిన ఇరోమ్ షర్మిల తాను స్థాపించిన పీఆర్‌జేఎ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులను బరికి దింపారు. మరోవైపు పీఆర్‌జేఏ అభ్యర్థి ఎలాండ్రో లైకోంబామ్‌పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.
మణిపూర్ తొలిదశ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. తొలి దశలో మొత్తం 38 అసెంబ్లి స్థానాలకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం ఒంటిగంటకు 69శాతం పోలింగ్ నమోదు అయింది. అలాగే మరో రెండోవిడత పోలింగ్ బుధవారం జరగనున్నాయి.