
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తొలిదశ ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన గురువారం ముగిసింది. 96 ఎంపీటీసీలకు 475, ఏడు జెడ్పీటీసీలకు 60 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. వీరిలో ముగ్గురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నిర్ధిష్ట నమూనా ప్రకారం వివరాలు ఇవ్వకపోవడం, తప్పుడు సమాచారం, సరైన ధ్రువపత్రాలు లేని కారణంగా వీటిని తిరస్కరించినట్లు రిట ర్నింగ్ అధికారులు తెలిపారు. ఎంపీటీసీలు రెండు, జెడ్పీటీసీల్లో ఒక నామినేషన్ తిరస్కరణకు గురయ్యాయి. ఇవిపోగా ఎంపీటీసీలకు 473, జెడ్పీటీసీలకు 59 మంది నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. నామినేషన్ల ఉప సంహరణకు ఈనెల 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంది.
నేడు రెండో విడత నోటిఫికేషన్
రెండో విడత ప్రాదేశిక పోరుకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ వెలువడనుంది. రెండో దశలో 8 మండలాల పరిధిలోని 94 ఎంపీటీసీలు, 8 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. నామినేషన్ల దాఖలుకు 28వ తేదీ ఆఖరు.
Comments
Please login to add a commentAdd a comment