Nominations Filed
-
మహారాష్ట్రలో రెబల్స్ తలనొప్పి
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామి నేషన్ ప్రక్రియ ముగిసింది. మహాయుతి, మహావికా స్ అఘాడీకి రెబల్స్ సవాలుగా మారారు. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ఏకంగా 10,900 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 5,949 నామినేషన్లు ఆమోదం పొందగా, 1,649 తిరస్కరణకు గురయ్యాయి. మరో 3,302 మంది నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. నామినేషన్లను వాపసు తీసుకున్న వారిలో మహాయుతి, మహావికాస్ అఘాడీ తిరుగుబాటు నేతలు కూ డా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఐదుగురు తిరుగుబాటు నేతలను పార్టీ నుంచి బహిష్కరించింది. నామినేషన్లను వెనక్కి తీసుకోకుంటే చర్యలు తప్పవని మహాయుతి పార్టీలు కూడా రెబల్స్‌ను హెచ్చరించాయి. మహాయుతిలో తగ్గేదేలేదంటున్నారు..! బీజేపీ మాజీ ఎంపీ హీనా గవిత్ నందుర్బార్ జిల్లాలోని అక్కల్కువా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ శివసేన షిండే వర్గానికి చెందిన అమ్షియా పద్వీ మహాయుతి అధికారిక అభ్యర్థిగా ఉన్నారు. అయితే గవిత్ బరిలో నిలవడం మహాయుతికి తలనొప్పిని పెంచింది. మాహిమ్‌లో ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే నామినేషన్ వేశారు. అయితే, శివసేన షిండేకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే సదా శరవంకర్‌కూడా పోటీకి దిగారు. ఇక్కడ అమిత్ ఠాక్రేకు మద్దతు ఇవ్వాలని బీజేపీ మిత్రపక్షాలను కోరుతోంది. నాసిక్‌లోనూ తిరుగుబాటును ఆపడంలో మహాయుతి విఫలమైంది. మహాయుతి అధికారిక అభ్యర్థులపై నంద్‌గావ్ నుంచి సమీర్ భుజ్‌బల్, దేవ్లాలీ నుంచి రాజశ్రీ అహిర్రావ్, చాంద్వాడ్ నుంచి కేదా అహెర్ పోటీలో ఉన్నారు. భివాండి రూరల్ స్థానంలో శివసేన అభ్యర్థి శాంతారామ్ మోరేపై బీజేపీ రూరల్ యూత్ అధ్యక్షురాలు స్నేహా పాటిల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. పార్టీలు ఒత్తిడి చేసినప్పటికీ రెబల్స్ నామినేషన్ ఉపసంహరించుకోవడం లేదు. కల్యాణ్ ఈస్ట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా సులభ గణపత్ గైక్వాడ్‌ను ప్రకటించిన తర్వాత, శివసేనకు చెందిన మహేష్ గైక్వాడ్ రెబల్‌గా పోటీలో ఉన్నారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మందా మత్రేని బేలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా ప్రతిపాదించగా... ఇక్క స్వతంత్ర అభ్యర్థిగా శివసేనకు చెందిన విజయ్ నహతా రెబల్‌గా బరిలో ఉన్నారు. ఐరోలి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి గణేష్ నాయక్‌పై శివసేన షిండే వర్గానికి చెందిన విజయ్ చౌగులే నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. శివాజీనగర్‌లో మహాయుతి అనుకోని సవాల్‌ను ఎదుర్కొంటోంది. ఎన్సీపీ (అజిత్ వర్గం) నవాబ్ మాలిక్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే, ఇక్కడ శివసేన(షిండే)కు చెందిన సురేష్ కృష్ణ పాటిల్‌ను కూటమి అధికారిక అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. దేవేంద్ర ఫడ్నవీస్, ఆశిష్ షెలార్ సహా పలువురు బీజేపీ నేతలు మాలిక్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తుండటం గమనార్హం. ఎంవీఏలోనూ ఇదే తీరు మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లోని చాలా మంది తిరుగుబాటు నాయకులు ఎన్నికలకు ముందు తమ నామినేషన్లను వాపసు తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు. పుణేలో ముగ్గురు సీనియర్ కాంగ్రెస్ నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. శివాజీనగర్, పార్వతి స్థానాల్లో కాంగ్రెస్, కస్బాపేట్ స్థానంలో ఎన్సీపీ (ఎస్పీ) పోటీ చేస్తోంది. కొప్రి పచ్‌పాఖాడీలో కాంగ్రెస్ రెబల్స్ ఠాక్రే వర్గాన్ని ఎదుర్కొంటున్నారు. భివాండీ వెస్ట్‌లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. కోప్రి పచ్‌పాఖాడీ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై ఉద్ధవ్ ఠాక్రే బృందం కేదార్ దిఘేను నామినేట్ చేయగా... కాంగ్రెస్‌కు చెందిన మనోజ్ షిండే ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మరోవైపు భివాండీ వెస్ట్ స్థానం నుంచి దయానంద్ చోర్గేను కాంగ్రెస్ నిలపగా.. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రియాజ్ అజ్మీ స్వతంత్రునిగా నామినేషన్ వేయడం గమనార్హం. -
17 ఎంపీ సీట్లకు 893 నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అ సెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో నామినేషన్ల దాఖలుకు గడువు గురువారంతో ముగిసింది. ఈ నెల నుంచి 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా, చివరి రోజు గురువారం నాటికి 17 లోక్‌సభ స్థానాల పరిధిలో మొత్తం 893 మంది అభ్యర్థులు 1488 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇక కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి 24 మంది అభ్యర్థులు మొత్తం 50 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. శుక్రవా రం నామినేషన్ల పరిశీలన నిర్వహించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు 29తో ముగియనుంది. మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణతో సహా దేశంలోని 543 లోక్‌సభ స్థానాల్లో పోలైన ఓట్లను జూన్ 4న లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. అత్యధికంగా మల్కాజ్‌గిరిలో.. అత్యధికంగా మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలో 114 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఆ తర్వాత చేవెళ్లలో 66 మంది, పెద్దపల్లిలో 63 మంది, భువనగిరిలో 61 మంది, సికింద్రాబాద్, హైదరాబాద్‌లలో చెరో 57 మంది, నల్లగొండలో 56 మంది, మెదక్‌లో 54 మంది, కరీంనగర్లో 53 మంది, వరంగల్‌లో 58 మంది, ఖమ్మంలో 45 మంది, మహబూబ్ నగర్లో 42 మంది, నిజామాబాద్‌లో 42 మంది జహీరాబాద్‌లో 40 మంది నాగర్ కర్నూల్లో 34 మంది, మహబూబాబాద్‌లో 30 మంది, ఆదిలాబాద్‌లో 23 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
MLC elections: నామినేషన్లు వేసిన కాంగ్రెస్ అభ్యర్థులు
హైదరాబాద్, సాక్షి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్ దాఖలుకు నేడు ఆఖరి రోజు కాగా, కాంగ్రెస్ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లు నామినేషన్ పత్రాలు సమర్పించారు. మరోవైపు బీఆర్ఎస్ తరఫున నామినేషన్లు దాఖలు కాకుంటే.. ఓటింగ్‌తో పని లేకుండా వీళ్ల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. లేకుంటే ఎమ్మెల్యేలు ఓటేయక తప్పదు. ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2021 నవంబర్‌లో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి పదవీ కాలం 2027 నవంబర్ వరకు ఉంది. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వెంటనే ఇద్దరు తమ ఎమ్మెల్సీ పదవులకు(డిసెంబర్ 9వ తేదీన) రాజీనామా చేశారు. దీంతో జనవరి 4వ తేదీన ఈ రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక కోసం వేరువేరుగా ఓటింగ్ నిర్వహణకు షెడ్యూల్ జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే శాసనసభలో కాంగ్రెస్‌కు తగినంత సంఖ్యాబలం ఉండడంతో.. రెండూ తమ స్థానాల్లో గెలుపు ఖాయమని కాంగ్రెస్ ధీమాలో ఉంది. మరోవైపు వేర్వేరుగా షెడ్యూల్ విడుదల చేయడంతో.. వేర్వేరుగా ఓటింగ్ నిర్వహించాల్సి వస్తుండడంపై బీఆర్ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈసీ షెడ్యూల్ జనవరి 4వ తేదీన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల జనవరి 11వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల జనవరి 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జనవరి 19వ తేదీ నామినేషన్ల పరిశీలన నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 22వ తేదీ వరకు గడువు 2024 జనవరి 29వ తేదీన ఎన్నికల నిర్వహణ ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర నాలుగు గంటల వరకు పోలింగ్.. అదే రోజు సాయంత్రం కౌంటింగ్, ఫలితాల వెల్లడి ఫిబ్రవరి 1 వ తేదీ లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి కాంగ్రెస్ అభ్యర్థుల బయోడేటా 1. పేరు : బల్మూరి వెంకట్/బల్మూరి వెంకట నర్సింగరావు తండ్రి: మదన్మోహన్రావు పుట్టిన తేదీ : నవంబర్ 2, 1992 విద్యార్హత: ఎంబీబీఎస్ పుట్టిన ఊరు: తారుపల్లి, కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా కులం: ఓసీ (వెలమ) 2. పేరు: బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ తండ్రి: బి.గంగాధర్ గౌడ్ పుట్టిన తేదీ: ఫిబ్రవరి 24, 1966 విద్యార్హత: బీకామ్ పుట్టిన ఊరు: రహత్‌నగర్, భీంగల్ మండలం, నిజామాబాద్ జిల్లా కులం: బీసీ (గౌడ) -
Telangana: ఒక్కరోజే 1,129 నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల దాఖలు ఘట్టం శుక్రవారం ముగియనుంది. గురువారం ఏకాదశి సుముహూర్తం కావడంతో భారీసంఖ్యలో అభ్యర్థులు తరలివచ్చి నామినేషన్లు వేశారు. రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో గురువారం రికార్డు సంఖ్యలో 1,129 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) కార్యాలయ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం ఉదయం 11 గంటలకు గజ్వేల్‌లో, మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామినేషన్లు వేశారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు ప్రారంభమైన నాటి నుంచి బుధవారం వరకు 119 శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 1,188 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) కార్యాలయం ప్రకటించింది. గురువారం నాటికి దాఖలైన మొత్తం నామినేషన్ల వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. రెండురోజుల తర్వాత (13వ తేదీన) నామినేషన్ల పరిశీలన నిర్వహించనున్నారు. 15వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. అదేరోజు అన్ని నియోజకవర్గాల్లో పోటీలో ఉండే అభ్యర్థులెవరో తేలిపోతుంది. నవంబర్ 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటాయి. -
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్
సాక్షి, నల్గొండ: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా బంగారిగడ్డ నుంచి చండూరుకు టీఆర్ఎస్ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డి, వామపక్ష నేతలు పాల్గొన్నారు. చదవండి: మునుగోడు వార్: అన్ని పార్టీలు ఆయనపైనే ఫోకస్ రాజగోపాల్‌రెడ్డి రూ.18వేల కోట్లకు అమ్ముడుపోవడం వల్లే ఉప ఎన్నిక అని, అమ్ముడుపోయిన వారికి బుద్ధి చెప్పాలని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. అమ్ముడుపోయే వాళ్లను డెకాయిట్స్, 420 గాళ్లు అంటారు. కరోనా కంటే విషమైంది బీజేపీ, మతోన్మాద శక్తులను ఓడించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. దేశ శ్రేయస్సుకోసం మునుగోడులో టీఆర్ఎస్ను గెలిపించాలని ఆయన కోరారు. -
యూపీ అసెంబ్లీ ఎన్నికలు: అమిత్ షా సమక్షంలో సీఎం యోగి నామినేషన్
UP Assembly Elections 2022: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కీలక నేతల సమక్షంలో ఆయన నామినేషన్ వేశారు. ఇదిలా ఉంటే.. గతంలో ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా పని చేసిన యోగి.. ఎమ్మెల్సీ కోటాలో యూపీకి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మొట్టమొదటిసారి గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. శుక్రవారం నామినేషన్ దాఖలు చేసే ముందు గోరఖ్‌నాథ్ టెంపుల్లో పూజల్లో పాల్గొన్నారు. ఎలక్షన్ ఆఫీస్‌కు వెళ్లే క్రమంలో మంత్రి అమిత షా ర్యాలీ నిర్వహించారు. ‘ఉత్తర ప్రదేశ్‌లో ముఠాలను యోగి తుడిచిపెట్టారని గర్వంగా చెప్తున్నా. పాతికేళ్ల తర్వాత యూపీలో న్యాయబద్ధంగా పాలన నడుస్తోంది. యోగి నాయకత్వంలో యూపీ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది ’ అని షా అన్నారు. #WATCH | Accompanied by Union Home Minister Amit Shah, Uttar Pradesh CM Yogi Adityanath files nomination papers as a BJP candidate from Gorakhpur Urban Assembly constituency pic.twitter.com/BYzpDtVmlS — ANI UP/Uttarakhand (@ANINewsUP) February 4, 2022 -
ఈటల, వెంకట్ తరఫున నామినేషన్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ యాదగిరిగుట్ట: హుజూరాబాద్ బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఈటల రాజేందర్, బల్మూరి వెంకట్ల తరఫున గురువారం నామినేషన్లు దాఖలయ్యాయి. వెంకట్ తరఫున హుజూరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్‌కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఆ పత్రాల్లో తనతో పాటు తల్లి ఆస్తుల వివరాలు కూడా వెంకట్ పేర్కొన్నారు. ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన విద్యార్థి–నిరుద్యోగ జంగ్ సందర్భంగా వెంకట్ గాయపడిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో కలిసి వెంకట్ స్వయంగా నామినేషన్ వేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇలావుండగా వెంకట్ గురువారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రీశుడి ఆశీస్సులతో హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయ ఢంకా మోగిస్తామని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఈటల తరఫున నామినేషన్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ పత్రాలను ఆయన సోదరుడు ఈటల భద్రయ్య దాఖలు చేశారు. ఈటల జమున నామినేషన్‌ను కంకణాల సుదర్శన్‌రెడ్డి దాఖలు చేశారు. కాగా శుక్రవారం ఈటల స్వయంగా మరోసారి నామినేషన్ దాఖలు చేయనున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు గురువారం ఒక్కరోజే అత్యధికంగా 11 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 24కు చేరింది. -
విధాన మండలికి ఉద్ధవ్ ఠాక్రే ఏకగ్రీవం!
సాక్షి ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సోమవారం మహారాష్ట్ర విధాన మండలి (ఎంఎల్సీ)కి నామినేషన్ దాఖలు చేశారు. తొమ్మిది స్థానాల కోసం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి అయిదుగురు, బీజేపీకి చెందిన నలుగురు ఇలా మొత్తంగా తొమ్మిది మంది బరిలో నిలిచారు. దీంతో విధాన మండలి ఎన్నికలు దాదాపు ఏకగ్రీవమ య్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండానే ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్ ఠాక్రేకు మే 27వ తేదీ లోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం అనివార్యంగా ఉన్న సంగతి తెలిసిందే. తొలిసారిగా ఉద్ధవ్ తన నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన తన ఆస్తుల వివరాలు వెల్లడించాల్సి వచ్చింది. తనకు రూ. 143 కోట్ల ఆస్తులున్నట్టు అఫిడవిట్లో తెలిపారు. -
హోరెత్తిన హుజూర్నగర్
సాక్షి, సూర్యాపేట: చివరి రోజు నామినేషన్లతో హుజూర్నగర్ హోరెత్తింది. రాజకీయ పార్టీలతో పాటు, సతంత్ర అభ్యర్థులు, నిరుద్యోగ జేఏసీ నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి హుజూర్నగర్ అభ్యర్థులు, ఆయా పార్టీల ముఖ్య నేతలు, కేడర్‌తో జనసంద్రమైంది. పోలీసులు ఎక్కడికక్కడ భారీ బందోస్తు చేపట్టారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నోటిఫికేషన్ విడుదలైన గత నెల 23 నుంచి చివరి రోజు వరకు మొత్తం 76 మంది అభ్యర్థులు 119 నామినేషన్లు వేశారు. ఇందులో కొంతమంది అభ్యర్థులవి రెండు, మూడు నామినేషన్ సెట్లు ఉన్నాయి. తరలివచ్చిన ముఖ్యనేతలు.. తమ పార్టీల అభ్యర్థుల నామినేషన్లకు ముఖ్య నేతలు తరలివచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నలమాద పద్మావతిరెడ్డి నామినేషన్ వేశారు. ఆపార్టీ సాయంత్రం బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సలీంఅహ్మద్, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి వెంట విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య, చిరుమర్తి లింగయ్య, భాస్కర్‌రావులు వెళ్లి నామినేషన్ వేయించారు. అలాగే బీజేపీ అభ్యర్థి డాక్టర్ కోటరామారావు నామినేషన్ వేయడానికి ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, స్థానిక నేతలు హాజరయ్యారు. సీపీఎం అభ్యర్థిగా పారేపల్లి శేఖర్‌రావు, బీఎల్ఎఫ్ అభ్యర్థిగా మేడి రమణ, టీడీపీ అభ్యర్థిగా చావా కిరణ్మయి, స్వతంత్ర అభ్యర్థిగా తీన్మాన్ మల్లన్న నామినేషన్లు వేశారు. నామినేషన్ల తీరును ఎన్నికల పరిశీలకులు సచింద్ర ప్రతాప్‌సింగ్, జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ అమయ్కుమార్లు దగ్గరుండి పరిశీలించారు. బరిలో ఉండేది ఎంతమందో.. 76 మంది అభ్యర్థులు నామినేషన్ వేయడంతో బరిలో ఉండేది ఎంత మందో ఈనెల 3న నామినేషన్ల ఉపసంహరణతో తేలనుంది. ప్రధాన పార్టీలతో పాటు.. చిన్నాచితక పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులుగా చాలా మంది నామినేషన్లు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికపై జోరుగా చర్చ జరుగుతండడంతో ఎంతమంది నామినేషన్లు వేస్తారన్న చర్చ జోరుగా సాగింది. చివరకు 76 మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తమను నామినేషన్లు వేయనివ్వలేదని సర్పంచ్ల ఫోరం సభ్యులు నిరసన వ్యక్తంచేశారు. 30 మందికి టోకెన్లు ఇస్తే కేవలం ఆరుగురిని మాత్రమే నామినేషన్ వేయించారని, అందులో నలుగురివి ఆ పత్రాలు.. ఈ పత్రాలు లేవని తిరస్కరించారని ఆ సంఘం సభ్యులు మీడియా ఎదుట ఆవేదనవ్యక్తంచేశారు. న్యాయవాదులు నామినేషన్లు వేస్తారని ప్రచారం సాగినా.. వారు నామినేషన్లు వేయలేదు. నామినేషన్లే వేసిన 76 మంది అభ్యర్థుల్లో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఆమ్ ఆద్మీపార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు, తెలంగాణ సోషల్ పొలిటికల్ ఫ్రంట్ అభ్యర్థిగా శంకర్చౌహాన్, బహుజన ముక్తి పార్టీ నుంచి శాంతిరాందాస్నాయక్, తెలంగాణ ప్రజా పార్టీ అభ్యర్థిగా డాక్టర్ సాంబశివగౌడ్తో పాటు పలువురు నామినేషన్లు వేశారు.గత ఎన్నికల్లో ట్రక్కు గుర్తు వచ్చిన మేకల రఘుమారెడ్డి ఈ సారి కూడా తెలంగాణ రిపబ్లికన్ పార్టీ నుంచి నామినేషన్ వేశారు. కేడర్‌లో జోష్.. నామినేషన్‌కు ఆయా పార్టీల కేడర్ భారీగా తరలివచ్చింది. అభ్యర్థులు నామినేషన్‌కు వెళ్తుండగా కాంగ్రెస్, టీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. బీజేపీ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించింది. సీపీఎం ఏర్పాటు చేసిన సభకు ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. అన్ని పార్టీల నుంచి నామినేషన్లు వేయడం, కేడర్ తరలిరావడంతో హుజూర్నగర్ గతంలో ఎన్నికల సమయంలో ఎప్పుడూ లేనట్లు పార్టీ జెండాలతో కళకళలాడింది. కొయంబత్తూర్ నుంచి వస్తే నామినేషన్ పోయింది... హుజూర్‌నగర్‌కు చెందిన గున్రెడ్డి మాధవరెడ్డిది కొంతకాలంగా మేడ్చెల్‌లో నివాసం ఉంటున్నారు. ఉద్యోగరీత్యా తమిళనాడు రాష్ట్రం లోని కొయంబత్తూర్‌కు వెళ్లారు.తన స్వస్థలంలో ఉప ఎన్నిక జరుగుతుండడంతో నామినేషన్ వేయాలనుకున్నాడు. ఆదివారం విమానంలో హైదరాబాద్ చేరుకున్నాడు. అక్కడి నుంచి సాయంత్రం హుజూర్‌నగర్‌కు చేరాడు. ఓ న్యాయవాది ఇంటికి వెళ్లి నామినేషన్ తయారు చేసుకున్నాడు. ఇవన్నీ తీసుకొని ఆదివారం రాత్రి తన స్నేహితుడి ఇంటికి వెళ్తుండగా నామినేషన్ ఎవరో కొట్టేశారు. అందులో అతని ఒర్జినల్ సర్టిఫికెట్లు, పాస్‌పోర్టు ఉన్నాయి. అయితే తన నామినేషన్ పత్రం, ఒర్జినల్ సర్టిఫికెట్లు ఎవరో కొట్టేయడంతో నామినేషన్ వేయలేకపోయానని, దీనిపై కేసు పెట్టానని సోమవారం నామినేషన్ కేంద్రం సమీపంలో మీడియా పాయింట్ వద్ద ఆవేదనవ్యక్తంచేశారు. -
ముగ్గురి నామినేషన్లు తిరస్కరణ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తొలిదశ ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన గురువారం ముగిసింది. 96 ఎంపీటీసీలకు 475, ఏడు జెడ్పీటీసీలకు 60 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. వీరిలో ముగ్గురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నిర్ధిష్ట నమూనా ప్రకారం వివరాలు ఇవ్వకపోవడం, తప్పుడు సమాచారం, సరైన ధ్రువపత్రాలు లేని కారణంగా వీటిని తిరస్కరించినట్లు రిట ర్నింగ్ అధికారులు తెలిపారు. ఎంపీటీసీలు రెండు, జెడ్పీటీసీల్లో ఒక నామినేషన్ తిరస్కరణకు గురయ్యాయి. ఇవిపోగా ఎంపీటీసీలకు 473, జెడ్పీటీసీలకు 59 మంది నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. నామినేషన్ల ఉప సంహరణకు ఈనెల 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంది. నేడు రెండో విడత నోటిఫికేషన్ రెండో విడత ప్రాదేశిక పోరుకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ వెలువడనుంది. రెండో దశలో 8 మండలాల పరిధిలోని 94 ఎంపీటీసీలు, 8 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. నామినేషన్ల దాఖలుకు 28వ తేదీ ఆఖరు. -
‘నల్లగొండ’ బరిలో...27మంది
సాక్షి, నల్లగొండ : నల్లగొండ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసేందుకు అభ్యర్థులు అత్యధికంగా పోటీపడ్డారు. మొత్తం పార్లమెంట్‌కు 39మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగా ఎనిమిది మందివి నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో తిరస్కరించిన విషయం తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణకు రెండు రోజుల గడువులో నలుగురు మాత్రమే నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో నల్లగొండ పార్లమెంట్ బరిలో మొత్తం 27 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. అత్యధికంగా పోటీ.. నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలామంది పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు రిజిస్టర్, గుర్తింపు పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పెద్దఎత్తున నామినేషన్లు సమర్పించారు. దీంతో నల్లగొండ ఎంపీ స్థానానికి పెద్దఎత్తున పోటీ ఏర్పడింది. అప్పట్లో జలసాధన సమితి నుంచి అత్యధికంగా పోటీ చేయడంతో బ్యాలెట్ పేపర్ ముద్రణ విషయంలో ఆలస్యం కావడంతోపాటు పోలింగ్, లెక్కింపులో కూడా చాలా ఇబ్బందులు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. రెండు బ్యాలెట్ యూనిట్లు తప్పనిసరి... అయితే ప్రస్తుతం ఈవీఎంల ద్వా రా ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కో బ్యాలెట్ యూనిట్లో 16 గుర్తులతోపాటు ఒక నోటా ఉం టుంది. నల్లగొండ పార్లమెంట్లో మొత్తం 27 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నందున ఒక కంట్రో ల్ యూనిట్‌కు రెండు బ్యాలెట్ యూనిట్లను వాడాల్సి ఉంటుంది. గుర్తుల కేటాయింపు పనిలో అధికారులు నామినేషన్ల ఉపసంహరణ ముగి యడంతో రంగంలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గు ర్తులను కేటాయిస్తున్నారు. ఇండిపెండెంట్లకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల గర్తుల కేటాయిస్తున్నారు. -
బరిలో 165 మంది
సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి): నామినేషన్ల ఉపసంహరణ అనంతరం జిల్లాలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల బరిలో 165 మంది అభ్యర్థులు మిగిలారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. పార్లమెంటు నియోజకవర్గం ఉప సంహరణ బరిలో నిలిచింది ఏలూరు పార్లమెంటు 2 10 నర్సాపురం పార్లమెంటు 2 15 మొత్తం 4 25 (అసెంబ్లీ నియోజకవర్గాల్లో) నియోజకవర్గం ఉప సంహరణ బరిలో నిలిచింది కొవ్వూరు 3 11 నిడదవోలు 1 10 ఆచంట 2 13 పాలకొల్లు 1 13 నర్సాపురం 1 14 భీమవరం 2 13 ఉండి 2 10 తణుకు 3 12 తాడేపల్లిగూడెం 2 13 ఉంగుటూరు 0 8 దెందులూరు 1 12 ఏలూరు 1 8 గోపాలపురం 0 7 పోలవరం 2 11 చింతలపూడి 1 10 మొత్తం 22 165 -
వైఎస్సార్ కడప: ఎన్నికల బరిలో సై
సాక్షి, కడప సెవెన్‌రోడ్స్ : లోక్‌సభ, శాసనసభ సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గురువారం ముగిసింది. కడప లోక్‌సభ స్థానంలో 17 మంది ఉండగా, అందులో ఇద్దరు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 15 మంది పోటీలో మిగిలారు. రాజంపేట లోక్‌సభ స్థానంలో 12 మంది ఉండగా, ముగ్గురు ఉపసంహరించుకోగా, తొమ్మిది మంది మిగిలారు. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 28 మంది పోటీ నుంచి వైదొలిగారు. జమ్మలమడుగులో అత్యధికంగా 34 నామినేషన్లు దాఖలు కాగా, అందులో నాలుగు తిరస్కరించారు. మిగిలిన 30 నామినేషన్లను ఆమోదించారు. చివరిరోజు 15 మంది ఉపసంహరించుకోగా 15 మంది మిగిలారు. అభ్యర్థుల సంఖ్య 15కు మించితే రెండు బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించాల్సి వస్తుంది. ఇందువల్ల చాలామంది ఓటర్లు తికమక పడే అవకాశం ఉంటుంది. దీంతో కొందరు చొరవ చూపడంతో అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మిగిలిన కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలా నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో రెండవ బ్యాలెట్ యూనిట్ ఉపయోగించాల్సిన అవసరం రాకుండా పోయింది. రాయచోటిలో పది మంది అభ్యర్థులుండగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి తప్పుకున్నారు. దీంతో తొమ్మిది మంది బరిలో మిగిలారు. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఇండిపెండెంట్ ఉపసంహరించుకోవడంతో 15 మంది మిగి లారు. పులివెందుల నియోజకవర్గంలో ఏ ఒక్కరూ నామినేషన్ ఉపసంహరించుకోలేదు. 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కమలాపురంలో 17 మంది ఉండగా, ఇద్దరు ఉపసంహరించుకోవడంతో 15 మంది పోటీలో నిలిచారు. ప్రొద్దుటూరులో ఇద్దరు ఉపసంహరించడంతో 12 మంది పోటీలో ఉన్నారురు. రైల్వేకోడూరులో 16 మంది అభ్యర్థులు ఉండగా ఒకరు ఉపసంహరించుకోవడంతో 15 మంది మిగిలారు. బద్వేలులో 14 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ ఎవరూ ఉపసంహరించుకోలేదు. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 19 మంది అభ్యర్థులకుగాను నలుగురు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో 15 మంది మిగిలారు. మైదుకూరు నియోజకవర్గంలో 13 మంది అభ్యర్థుల్లో ఇద్దరు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో 11 మంది బరిలో ఉన్నారు. బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య: కడప 15 పులివెందుల 12 జమ్మలమడుగు 15 ప్రొద్దుటూరు 12 మైదుకూరు 11 కమలాపురం 15 బద్వేలు 14 రాజంపేట 15 రాయచోటి 9 రైల్వేకోడూరు 15 ప్రధాన పార్టీ అభ్యర్థులు వీరే: నియోజకవర్గం వైఎస్సార్ సీపీ టీడీపీ కడప లోక్‌సభ వైఎస్ అవినాష్‌రెడ్డి సి.ఆదినారాయణరెడ్డి రాజంపేట లోక్‌సభ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి డీకే సత్యప్రభ అసెంబ్లీ నియోజకవర్గాలు: నియోజకవర్గం వైఎస్సార్ సీపీ టీడీపీ బద్వేలు డాక్టర్ వెంకట సుబ్బయ్య డాక్టర్ రాజశేఖర్ రాజంపేట మేడా మల్లికార్జునరెడ్డి బత్యాల చెంగల్రాయులు కడప ఎస్బీ అంజద్‌బాష అమీర్‌బాబు రైల్వేకోడూరు కొరముట్ల శ్రీనివాసులు పి. నరసింహప్రసాద్ రాయచోటి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి పులివెందుల వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్వీ సతీష్‌రెడ్డి కమలాపురం పి.రవీంద్రనాథ్‌రెడ్డి పుత్తా నరసింహారెడ్డి జమ్మలమడుగు డాక్టర్ సుధీర్‌రెడ్డి పి.రామసుబ్బారెడ్డి ప్రొద్దుటూరు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఎం.లింగారెడ్డి మైదుకూరు ఎస్.రఘురామిరెడ్డి పుట్టా సుధాకర్ యాదవ్ -
245 నామినేషన్లకు ఆమోదం
సాక్షి, చిలకలపూడి(మచిలీపట్నం): సాధారణ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను మంగళవారం పరిశీలించారు. ఆయా నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులు, నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు, వారి అనుచరుల సమక్షంలో పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానంగా అభ్యర్థి ఓటు.. ప్రపోజర్ ఓటు పరిశీలనతో పాటు నామినేషన్ పత్రాన్ని పూర్తిస్థాయిలో రాసినదీ, లేనిదీ, పార్టీల ఆమోదపత్రాలు తదితర అంశాలను పరిశీలించి అనంతరం వాటిని ఆమోదించారు. అలాగే ఒక పార్టీ అభ్యర్థి, వేరొక పార్టీ అభ్యర్థి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చునని రిటర్నింగ్ అధికారులు ఆయా పార్టీల నాయకులకు తెలియజేశారు. జిల్లావ్యాప్తంగా 332 మంది అభ్యర్థులు నామినేషన్లు పరిశీలించగా 245 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. 87 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. గుడివాడ, పెనమలూరు నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు అభ్యంతరాలు తెలపటంతో నామినేషన్ల పరిశీలన కార్యక్రామాన్ని బుధవారానికి వాయిదా వేసినట్లు కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. నామినేషన్లు ఆమోదించిన అనంతరం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీ ప్రధాన పార్టీలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. ♦ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి, టీడీపీ అభ్యర్థిగా కొనకళ్ల నారాయణరావు, జనసేన పార్టీ అభ్యర్థిగా బండ్రెడ్డి రామకృష్ణ (రాము) తో పాటు మరో 11 మంది నామినేషన్లను ఆమోదించారు. నలుగురి నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. ♦ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొట్లూరి వీరప్రసాద్ (పీవీపీ), టీడీపీ అభ్యర్థిగా కేశినేని శ్రీనివాస్ (నాని), జనసేన పార్టీ అభ్యర్థిగా ముత్తంశెట్టి ప్రసాద్‌బాబు తో పాటు మరో 12 నామినేషన్లను ఆమోదించారు. ఆరుగురు నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. ♦ తిరువూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొక్కిలిగడ్డ రక్షణనిధి, టీడీపీ అభ్యర్థిగా కొత్తపల్లి శామ్యూల్జవహార్ తో పాటు 10 నామినేషన్ పత్రాలను ఆమోదించారు. ఏడుగురివి తిరస్కరించారు. ♦ నూజివీడులో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా మేకా వెంకటప్రతాప్ అప్పారావు, టీడీపీ అభ్యర్థిగా ముదరబోయిన వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ అభ్యర్థిగా బసవ భాస్కరరావుతో పాటు మరో తొమ్మిది నామినేషన్ పత్రాలను ఆమోదించారు. మూడింటిని తిరస్కరించారు. ♦ గన్నవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు, టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీమోహన్ తో పాటు మరో 12 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. రెండు నామినేషన్ పత్రాలకు ఆమోదం లభించలేదు. ♦ కైకలూరులో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా దూలం నాగేశ్వరరావు, టీడీపీ అభ్యర్థిగా జయమంగళ వెంకటరమణతో పాటు మరో 22 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించగా.. మరో ఏడు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ♦ పెడనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జోగి రమేష్, టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్, జనసేన అభ్యర్థి అంకెం లక్ష్మీశ్రీనివాస్లతో పాటు 14 నామినేషన్ పత్రాలను ఆమోదించారు. మరో మూడు నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. ♦ మచిలీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పేర్ని వెంకట్రామయ్య (నాని), టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన అభ్యర్థి బండి రామకృష్ణతో పాటు ఆరు నామినేషన్ పత్రాలను ఆమోదించారు. మూడు నామినేషన్లను తిరస్కరించారు. ♦ అవనిగడ్డలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్, టీడీపీ అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్, జనసేన అభ్యర్థిగా ముత్తంశెట్టి కృష్ణారావుతో పాటు పది నామినేషన్ పత్రాలను ఆమోదించారు. ముగ్గురు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ♦ పామర్రులో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా కైలే అనిల్‌కుమార్, టీడీపీ అభ్యర్థిగా ఉప్పులేటి కల్పనతో పాటు 11 నామినేషన్ పత్రాలను ఆమోదం లభించగా.. ఐదు నామినేషన్లను తిరస్కరించారు. ♦ విజయవాడ వెస్ట్‌లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్, టీడీపీ అభ్యర్థిగా షబనాముస్తరాత్కాతూన్, జనసేన అభ్యర్థిగా పోతిన వెంకటమహేష్తో పాటు 25 నామినేషన్ పత్రాలను ఆమోదించారు. నాలుగు నామినేన్లను తిరస్కరించారు. ♦ విజయవాడ సెంట్రల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లాది విష్ణువర్థన్, టీడీపీ అభ్యర్థిగా బొండా ఉమామహేశ్వరరావుతో పాటు మరో 17 నామినేషన్ పత్రాలను ఆమోదించారు. నాలుగు నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. ♦ విజయవాడ ఈస్ట్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొప్పన భవకుమార్, టీడీపీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్‌తో పాటు పది నామినేషన్ పత్రాలను ఆమోదించారు. 17 నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. ♦ మైలవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్, టీడీపీ అభ్యర్థిగా దేవినేని ఉమామహేశ్వరరావు, జనసేనఅభ్యర్థిగా అక్కల రామ్మోహనరావుతో పాటు మరో 17 నామినేషన్ పత్రాలను ఆమోదించారు. నాలుగు నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. ♦ నందిగామలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా మొండితోక జగన్మోహన్, టీడీపీ అభ్యర్థిగా తంగిరాల సౌమ్యతో పాటు తొమ్మిది నామినేషన్ పత్రాలను ఆమోదించారు. మరో ఐదు తిరస్కరణకు గురయ్యాయి. ♦ జగ్గయ్యపేటలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా సామినేని ఉదయభాను, టీడీపీ అభ్యర్థిగా శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)తో పాటు పది నామినేషన్ పత్రాలను ఆమోదించారు. మరో ఎనిమిది నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. -
అనంతపురం: నామినేషన్ వేసిన అభ్యర్థులు
సాక్షి,అనంతపురం అర్బన్: ఎన్నికల ప్రక్రియలో తొలి అంకమైన నామినేషన్ పర్వం సోమవారంతో ముగిసింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైన 18వ తేదీ నుంచి చివరి రోజు 25వ తేదీ వరకు అనంతపురం, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ స్థానాలకు 40 మంది అభ్యర్థులు 54 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇక జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు 278 మంది 400 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజున అనంతపురం పార్లమెంట్ నియోకవర్గానికి 14 మంది అభ్యర్థులు 16 సెట్లు , 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 208 మంది అభ్యర్థులు 262 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. రెండు పార్లమెంట్ స్థానాలకు 40 మంది 54 సెట్లు దాఖలు 14 అసెంబ్లీ స్థానాలకు 278 మంది 400 సెట్లు దాఖలు నేడు నామినేషన్ల పరిశీలన సోమవారం ప్రధాన పార్టీల నామినేషన్లు అనంతపురం పార్లమెంట్: టి.రంగయ్య (వైఎస్సార్సీపీ), జేసీ దివాకర్‌రెడ్డి (టీడీపీ), డి.జగదీశ్ (సీపీఐ), హంస దేవినేని (బీజేపీ) హిందూపురం పార్లమెంట్: గోరంట్ల మాధవ్ (వైఎస్సార్సీపీ), కురబ సవిత (వైఎస్సార్సీపీ), ఎన్.కిష్టప్ప (టీడీపీ), పార్థసారథి (బీజేపీ) జిల్లా ఓటర్లు 32,39,517 పురుషులు 16,25,192 మహిళలు 16,14,071, ఇతరులు 254 జాబితాను విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 11న తుది జాబితాలో 30,58,909 మంది ఓటర్లు నమోదుతో పెరిగిన ఓటర్లు 1,80,608 మంది అనంతపురం అర్బన్ : ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. ఆ మేరకు జిల్లా ఓటర్లు 32,39517 మంది. ఇందులో పురుషులు 16,25,192 మంది, మహిళలు 16,14,071 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ 24 మంది ఉన్నారు. ఈ ఏడాది జనవరి 11న విడదుల చేసిన తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 30,58,909 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 15,39,936 మంది, మహిళలు 15,18,769 మంది, థర్డ్ జెండర్ 204 మంది ఉన్నారు. నవంబరు ఒకటి నుంచి ఈనెల 15 వరకు ఓటర్ల నమోదు ప్రక్రియ నిర్వహించారు. దీంతో జిల్లాలో 1,80,608 మంది ఓటర్లు పెరిగారు. వీరిలో పురుషులు 85,256, మహిళలు 95,302, థర్డ్ జెండర్ 50 మంది ఉన్నారు. -
ఒకేరోజు 162 నామినేషన్లు!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను శుక్రవారం ఒక్కరోజే 162 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో శుక్రవారం నాటికి దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్య 220కు పెరిగింది. టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు శుక్రవారం ఒకే సారి నామినేషన్లు వేయడానికి తరలిరావడంతో ఎన్ని కల సందడి కనిపించింది. నిజామాబాద్ నుంచి అత్యధికంగా 54 నామినేషన్లు దాఖలయ్యాయి. నాలుగో శనివారం, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో నామినేషన్లు స్వీకరించరు. నామినేషన్ల దాఖలకు సోమవారం (25వ తేదీ)ఒక్క రోజు మాత్ర మే మిగిలింది. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఆదిలాబాద్ నుంచి రమేశ్ రాథోడ్ (కాంగ్రెస్), మెదక్ నుంచి గాలి అనీల్‌కుమా ర్ (కాంగ్రెస్), మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి(కాంగ్రెస్), నల్లగొండ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాం గ్రెస్), భువనగిరి నుంచి బూర నర్సయ్యగౌడ్ (టీఆర్ఎస్), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (కాంగ్రెస్), మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత (టీఆర్ఎస్), బలరాంనాయక్ (కాంగ్రెస్), నాగర్‌కర్నూల్ నుంచి పి.రాములు (టీఆర్ఎస్), చేవెళ్ల నుంచి జి.రంజిత్‌రెడ్డి (టీఆర్ఎస్), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (కాంగ్రెస్)లు శుక్రవారం నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు. -
కవిత నామినేషన్ దాఖలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ కవిత శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి కలెక్టరేట్‌కు వచ్చిన ఆమె.. రెండు సెట్ల నామినేషన్ పత్రాలను కలెక్టర్ రామ్మోహన్‌రావుకు అందజేశారు. అంతకు ముందు నగర శివారులో ఉన్న సారంగపూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో భర్త అనిల్‌కుమార్‌తో కలసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీఆర్ఎస్ గుర్తు అయిన అంబాసిడర్ కారు (గులాబీరంగు)లో ఎమ్మెల్యేలతో కలసి ఆమె కలెక్టరేట్‌కు చేరుకున్నారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో సైనికులుగా పనిచేస్తాం: టీఆర్ఎస్ ఎంపీలు తమ ఐదేళ్ల పదవీ కాలంలో గల్లీలో ప్రజా సేవకులుగా, ఢిల్లీలో తెలంగాణ సైనికులుగా పని చేశారని కవిత వ్యాఖ్యానించారు. నియోజకవర్గ ప్రజలు దయతో తనకు మరోసారి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. శక్తి వంచన లేకుండా పని చేశానని, జిల్లా, రాష్ట్ర, జాతీయ అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించానని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరితో కలసి రాష్ట్ర, జిల్లా అభివృద్ధి కోసం కృషి చేశానని చెప్పారు. దేశంలో మారుతున్న పరిస్థితుల్లో 16 ఎంపీ సీట్లు గెలిస్తే రాష్ట్ర హక్కులను కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. హైకోర్టు, మైనారిటీ, ఎస్టీ రిజర్వేషన్లు, ఎయిమ్స్ వంటి అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించామని గుర్తు చేశారు. ఐదేళ్ల కాలంలో ప్రజలు టీఆర్ఎస్ ఎంపీల నడవడికను గమనించారని, మరోసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశా రు. నిజామాబాద్ ఎంపీగా మొదటిసారి గెలిపించిన ప్రజలకు, మరోసారి తనను అభ్యర్థిగా ఎంపిక చేసిన పార్టీ అధినేత కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు కవిత ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్‌గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, షకీల్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీలు వీజీగౌడ్, ఆకుల లలిత, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి తదితరులు ఆమె వెంట ఉన్నారు. -
2 స్థానాలు.. 33 మంది
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 22న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు ఈనెల 5వ తేదీతో ముగియగా.. పట్టభద్రుల స్థానానికి 35, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి పది నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నామినేషన్లను బుధ, గురువారాల్లో స్క్రూటినీ నిర్వహించిన అధికారులు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి రెండింటిని, పట్టభద్రుల నియోజకవర్గంలో 10 నామినేషన్లను తిరస్కరించినట్లు ప్రకటించారు. దీంతో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 25 మంది, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎనిమిది మంది బరిలో మిగిలారు. కాగా నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగియగా సాయంత్రానికి పోటీలో ఉన్న వారెందరనేది తేలనుంది. చంద్రశేఖర్‌గౌడ్‌కు ‘గులాబీ’ మద్దతు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో అభ్యర్థిని పోటీలో పెట్టబోమని టీఆర్ఎస్ ప్రకటించినప్పటికీ కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌కు మద్దతు ఇస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు ఎంపీ కవిత కూడా ఆయనకు ఆశీస్సులు అందించారు. బుధవారం రాత్రి కరీంనగర్లో ఆయన కేటీఆర్‌ను కలవగా పార్టీ నేతల సమక్షంలో గౌడ్‌కు మద్దతు ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ నేపథ్యంలో బరిలో నిలిచిన మిగిలిన టీఆర్ఎస్ నాయకులు ఉపసంహరించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ మద్దతు ఆశించి భంగపడిన యాదగిరి శేఖర్‌రావు, జమాలుద్దీన్ నామినేషన్లు దాఖలు చేసిన విషయం విదితమే. ప్రచారంలో నిమగ్నమైన జీవన్‌రెడ్డి కాంగ్రెస్ అధికారిక అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి ఇప్పటికే జిల్లాల్లో ప్రచారం సాగిస్తున్నారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌తో పాటు కాంగ్రెస్ నేతలు ఆయనకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ అభ్యర్థిగా సుగుణాకర్‌రావు బరిలో ఉన్నారు. ‘యువ తెలంగాణ’ నుంచి రాణిరుద్రమ యువ తెలంగాణ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణిరుద్రమ సైతం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. పట్టభద్రుల అండతో విజయం సాధిస్తానని చెపుతున్న ఆమె గురువారం తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంను కలిసి మద్దతు కోరారు. అభ్యర్థులు వీరే... స్క్రూటినీ అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బరిలో మిగిలిన అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి. టి.జీవన్‌రెడ్డి(కాంగ్రెస్), పి. సుగుణాకర్‌రావు(బీజేపీ), గోగుల రాణిరుద్రమ(యువ తెలంగాణ పార్టీ)తో పాటు గుర్రం ఆంజనేయులు, ఎడ్ల రవికుమార్, కడారి అనంతరెడ్డి, కల్లెం ప్రవీణ్‌రెడ్డి, గంట సంపత్, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్(టీఆర్ఎస్), ఎం.డీ.జమాలుద్దీన్, డొంకెన రవీందర్(తెలంగాణ జన సమితి), దేవునూరి రవీందర్, పరువెల్లి ప్రభాకర్‌రావు, ఎం.బాలనాగసైదులు, యాదగిరి శేఖర్‌రావు, జి.రణజిత్ మోహన్, ఎస్.రవీందర్‌గౌడ్, వై.రామిరెడ్డి, వంజరి శివకుమార్, శ్రీకాంత్ తోడే టి, కె.శ్రీధర్ రాజు, షేక్‌షబ్బీర్, సురేష్, అబ్దుల్ హమీద్ ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూర రఘోత్తంరెడ్డి, బి.కొండల్ రెడ్డి, చార్ల మానయ్య, చిట్యాల రాములు, పాతూరి సుధాకర్‌రెడ్డి, బట్టాపురం మోహన్‌రెడ్డి, మామిడి సుధాకర్‌రెడ్డి, జి.వేణుగోపాలస్వామి బరిలో ఉన్నారు. -
అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా..
సాక్షి,సిటీబ్యూరో: ‘వైవిధ్యభరితమైన హైదరాబాద్ సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. శతాబ్దాల నాటి చారిత్రక వారసత్వ కట్టడాలు మసకబారుతున్నాయి. ఇప్పటికే వందలాది చెరువులు, కుంటలు, నీటి వనరులు కబ్జాలకు గురయ్యాయి. వరదలతో నాలాలు ఉప్పొంగుతున్నాయి. నగర జీవనం అస్తవ్యస్తమవుతోంది. క్రమంగా అస్తిత్వాన్ని కోల్పోతోంది. ఈ ముప్పు నుంచి నగరాన్ని కాపాడుకోవాలి’.. అంటున్నారు. ప్రముఖ సామాజిక కార్యకర్త లుబ్నా సార్వత్. నగరంలో నీటి వనరుల పరిరక్షణ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తోన్న ఆమె ఆ లక్ష్య సాధన కోసం ఎన్నికలను ప్రచార అస్త్రంగా చేసుకున్నారు. ఆ లక్ష్యంతోనే ఎన్నికల బరిలోకి దిగారు. వారసత్వ కట్టడాలకు నెలవైన కార్వాన్ నియోజకవర్గం నుంచి సోషలిస్టు (ఇండియా) పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఆమ్ ఆద్మీ నుంచి హైదరాబాద్ ఎంపీ పదవి కోసం పోటీ చేశారు. ‘నాలుగున్నరేళ్ల క్రితం ఎంపీ అభ్యర్థిగా నగరంలో విస్తృతంగా పర్యటించాను. అన్ని వర్గాల ప్రజలను కలిసాను. అప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఇప్పుడూ ప్రజలు అవే సమస్యలను ఎదుర్కొంటున్నారు. అప్పటికి ఇప్పటికీ నగర పర్యావరణానికి ముప్పు రెట్టింపైంది’ అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారామె. ఎన్నికల బరిలోకి దిగిన ఆమె ‘సాక్షి’తో పలు అంశాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. జీవన ప్రమాణాల నాణ్యత పడిపోయింది ప్రజల జీవన ప్రమాణాల్లో నాణ్యత పూర్తిగా పడిపోయింది. తెలంగాణ వల్ల ఎలాంటి మెరుగైన అవకాశాలు లభించలేదు. సాంకేతిక పరిజ్ఞానం మానవ అభివృద్ధి కాదు. పర్యావరణం బాగా దెబ్బతింది. భూగర్భ జలాలు చెడిపోయాయి. చెరువులన్నీ కుంచించుకొనిపోయాయి. ప్రజల సంతోషం ఆవిరైపోయింది. ఏ ఒక్క రంగంలోనూ తెలంగాణకు ముందు, తర్వాత అని చెప్పుకోదగిన అభివృద్ధి కనిపించడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం గ్రేటర్లో 185 చెరువులు ఉన్నాయి. కానీ అంతకంటే ఎక్కువే కబ్జాకు గురయ్యాయి. జలగం వెంగళరావు పార్కులో పెద్ద చెరువు ఉండేది. ఇప్పుడది చిన్న నీటి కుంటలా మారింది. ఇందిరాపార్కులో పెద్ద చెరువు ఉండేది. హుస్సేన్ సాగర్ నాలాను ఈ చెరువులోకి మళ్లించేవారు. ఇప్పుడు చెరువును కుదించారు. నాలాను ముసేశారు. చెరువులోకి వరదనీరు చేరడం వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లిందో గతంలోనే చూశాం. పబ్లిక్‌గార్డెన్, మాసబ్ ట్యాంక్ సహా అనేక చెరువులు ఇలాగే కుంచించుకుపోయాయి. దీంతో వరదనీటితో నాలాలు ఉప్పొంగి జనావాలను ముంచెత్తుతోంది. హుస్సేన్ సాగర్ కాలుష్య కాసారంగా మారింది. ప్రక్షాళన కాగితాలకే పరిమితమైంది. కార్వాన్ నుంచే ఎందుకంటే.. అతి పురాతనమైన నగరం కార్వాన్. ఒకప్పుడు ఇక్కడ రతనాలు, ముత్యాలు, వజ్రాలు రాశులుగా పోసి విక్రయించేవారట. అలాంటి కార్వాన్ పురాతన వైభవం ఇప్పుడు పూర్తిగా కనుమరుగైంది. గొప్పగొప్ప చారిత్రక వారసత్వ కట్టడాలు మసకబారాయి. గోల్కొండ కోట, టూంబ్స్, నయాఖిల్లా, పాతబస్తీలో ఉన్న చారిత్రక కట్టడాలకు రక్షణ లేకుండా పోయింది. చారిత్రక, వారసత్వ కట్టడాలకు విఘాతం కలిగించే గోల్ఫ్ కోర్సులోచ్చాయి. ఇక కోట చుట్టూ ఉన్న చెరువులు లంగర్‌హౌస్ చెరువు, జమాల్ చెరువు, నయాఖిల్లా చెరువు, షాహతమ్ చెరువు, జమాలీకుంట వంటివి చాలా వరకు కబ్జాకు గురయ్యాయి. పేద ప్రజలు ఏం తిని బతుకుతారు? పాతబస్తీతో పాటు, అనేక చోట్ల దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేద ప్రజలు వంటగ్యాస్ కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు. రూ.1000 గ్యాస్ ధర వారికి భారంగా మారింది. ఎప్పుడో వచ్చే సబ్సిడీ కోసం ఇప్పుడు ఆ వెయ్యి రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలంటూ చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికీ వంటగ్యాస్ అని గొప్పగా చెప్పినా, ఆ గ్యాస్ కొనుక్కోలేని స్థితిలో తిరిగి కట్టెల పొయ్యినే ఆశ్రయిస్తున్నారు. వినూత్నంగా ప్రచారం.. పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నికల ప్రచారంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, ప్లాస్టిక్ వస్తువులకు బదులు కాటన్ బ్యానర్లను మాత్రమే వినియోగిస్తాం. సీఎన్జీతో నడిచే ఆటో రిక్షాలనే వినియోగిస్తాం. నా వల్ల నగరంలో కార్బన్ స్థాయి ఏ మాత్రం పెరగకుండా జాగ్రత్తలు పాటిస్తాను. అన్ని రాజకీయ పార్టీలు పర్యావరణహితంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే బాగుంటుంది. -
నేడే నామినేషన్ల సమర్పణకు చివరి రోజు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: శాసనసభ ఎన్నికల సందర్భంగా వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు సోమవారం (నేడు) చివరి రోజు. మంచి ముహూర్తం కోసం వేచి చూస్తున్న ప్రధాన రాజకీయ పార్టీల, ఇతర పార్టీల వారు సోమవారం నామినేషన్ సమర్పించేందుకు సమాయత్తమవుతున్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ అభ్యర్థిగా, ఖమ్మం నుంచి బరిలో ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ టీఆర్ఎస్ అభ్యర్థిగా, ఇంకా మహా కూటమి మద్దతుతో నామా నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఇంకా బీఎల్ఎఫ్–సీపీఎం కూటమి నుంచి పోటీ చేస్తున్న ఖమ్మం, పాలేరు అభ్యర్థులు పాల్వంచ రామారావు, బత్తుల హైమావతిలు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ నెల 12వ తేదీన ప్రారంభమైన ప్రక్రియ 19వ తేదీ (సోమవారం)తో ముగియనుంది. ఇన్నిరోజులుగా అధికారులు నామినేషన్లను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తీసుకున్నారు. చివరిరోజు కూడా ఇదే సమయాన్ని పాటించనున్నారు. గడువు ముగుస్తుండడంతో అభ్యర్థులు సరైన పత్రాలతో సంబంధిత కార్యాలయం లోపలికి చేరుకోవాల్సి ఉంటుంది. సమయాన్ని మూడు గంటల వరకే కుదించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఇప్పటికే వివిధ పార్టీల నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావాహులు తిరుగుబాటు అభ్యర్థులుగా, మరికొందరు స్వతంత్రంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇక గడువు ముగుస్తుండడంతో ఈ నెల 22వ తేదీ వరకు ఉపసంహరణకు ఎన్నికల కమిషన్ గడువు విదించింది. నామినేషన్‌కు చివరిరోజు కావడంతో ప్రధాన అభ్యర్థులు....తిరుగుబాటు, స్వతంత్ర అభ్యర్థులను అనునయించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంరూరల్ తహసీల్దార్ కార్యాలయంలో, పువ్వాడ అజయ్‌కుమార్ అర్బన్తహసీల్దార్ కార్యాలయంలో టీఆర్ఎస్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. దాఖలైన పత్రాలన్నింటినీ 20వ తేదీన ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. -
‘స్థానిక’ ఎమ్మెల్సీకి నలుగురి నామినేషన్
కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారం ముగిసింది. అంతకుముందు రోజు వరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. అయితే.. చివరిరోజు మాత్రం టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్ (నాలుగు సెట్లు), సమాజ్‌వాదీ పార్టీ తరఫున దండు శేషుయాదవ్ (రెండు సెట్లు), పంచాయతీ రాజ్ చాంబర్ తరఫున నంద్యాల డివిజన్ ఎంపీటీసీ సభ్యుల సంఘం నేత పులి జయప్రకాశ్‌రెడ్డి (ఒక సెట్), స్వతంత్ర అభ్యర్థిగా మాజీ మంత్రి బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అనుచరుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పుల్యాల నాగిరెడ్డి (ఒక సెట్) నామినేషన్లు దాఖలు చేశారు. వీటిని బుధవారం పరిశీలిస్తారు. ఈనెల 29న ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికకు వైఎస్సార్సీపీ దూరంగా ఉంటోంది. -
ఆర్టీసీ హౌస్‌లో నామినేషన్లు దాఖలు
అమరావతి : ఆర్టీసీ ఉద్యోగులకు ఈ నెల 16న జరుగుతున్న సీసీఎస్ (క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ) ఎన్నికలకు ఎంప్లాయిస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ ఉమ్మడి అభ్యర్ధులుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఆర్టీసీ హౌస్ (హెడ్ ఆఫీస్ యూనిట్)లో ఉన్న రెండు డెలిగేట్ల స్థానాలకు ఈయూ, ఎస్డబ్ల్యుఎఫ్ అభ్యర్ధులుగా ఎం.కృష్ణమూర్తి, కృష్ణమాచార్యులు తమ నామినేషన్లను ఆర్టీసీ పర్సనల్ ఆఫీసరు చిరంజీవికి అందజేశారు. ఈయూ రాష్ట్ర నాయకులు పి.దామోదరరావు, వైవీ రావు, ఎస్డబ్ల్యుఎఫ్ నాయకులు జిలానీలు ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. -
ఆ నలుగురి ఎన్నిక ఏకగ్రీవం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు రాజ్యసభ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున డమ్మీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన సునందారెడ్డి తన నామినేషన్ పత్రాలను ఉపసంహరించటంతో నలుగురి ఎన్నిక ఏకగ్రీవమైంది. తన నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకుంటున్నట్లు సునందారెడ్డి బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె. సత్యనారాయణకు లేఖ అందజేశారు. దీంతో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన వి. విజయసాయిరెడ్డి (వైఎస్సార్సీపీ), కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు (బీజేపీ), కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ (టీడీపీ)లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. వీరి ఎన్నికను శుక్రవారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించి ధ్రువ పత్రాలను అందజేస్తారు. -
రాజ్యసభకు అభ్యర్థుల నామినేషన్లు దాఖలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికకు నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ, టీడీపీ అభ్యర్థులు, తెలంగాణ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు మంగళవారం ఉదయం నామినేషన్లు దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ టీడీపీ అభ్యర్థులు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ లు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన టీడీపీ అభ్యర్థులు అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. వారి వెంట లోకేశ్, మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా రైల్వేమంత్రి సురేష్ ప్రభు బీజేపీ కార్యాలయం నుంచి నేతలతో కలిసి ఏపీ అసెంబ్లీకి చేరుకున్నారు. ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయనకు మద్దతుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం చేశారు. బీజేపీ శాసనసభ్యులు నలుగురితోపాటు ఏపీ మంత్రులు కూడా సంతకాలు చేశారు. అంతకు ముందు బీజేపీ కార్యాలయంలో నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. సురేష్ ప్రభు వెంట కేంద్రమంత్రి అశోకగజపతి రాజు, ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు, ఆంధ్రా, తెలంగాణ బీజేపీ నేతలు ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు నామినేషన్లు వేసేందుకు తెలంగాణ అసెంబ్లీ కార్యాలయానికి చేరుకున్నారు. వారు కూడా తమ నామినేషన్లు దాఖలు చేశారు. వారివెంట మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. నేటి మధ్యాహ్నంతో నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనుంది. జూన్ 1న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 3వ తేదీ గడువు ఉంది. జూన్ 11న అసెంబ్లీలో పోలింగ్ నిర్వహిస్తారు. -
దేశం గుండెల్లో రెబల్
ఎంఎల్సీ ఎన్నికల్లో ఎదురులేదనుకున్న టీడీపీకి మాజీ ఎమ్మెల్యే ఉప్పల పాటి వెంకట రమణమూర్తిరాజు(కన్నబాబురాజు) షాకిచ్చారు. రెండు స్థానా లకు నామినేషన్లు దాఖలు చేసి టీడీపీగుండెల్లో రె‘బెల్’ మోగించారు. అధిష్టానంతో అమితుమీ తేల్చుకుంటానని కన్నబాబు చేసిన ప్రకటన గుబులు రేపుతోంది. - రసకందాయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు - సోమవారం ఐదు నామినేషన్లు - వేసిన వారంతా టీడీపీకి చెందిన వారే - ఒకటో స్థానానికి ఎంవీవీఎస్ మూర్తి - రెండో స్థానానికి చలపతిరావు - రెండు స్థానాలకు కన్నబాబు సాక్షి, విశాఖపట్నం: ఎంఎల్సీ ఎన్నికల్లో సోమవారం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. దాఖలు చేసిన వారంతా టీడీపీకి చెందిన వారే. గంటా శ్రీనివాసరావు అనుచరుడు కన్న బాబురాజు రెబల్‌గా రెండుస్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఆడారి తులసీరావు డమ్మీగా వేశారని, కందుల స్వతంత్రుడిగా నామినేషన్ దాఖలు చేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జే.నివాస్ ప్రకటించారు. రెబల్‌గా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు మాత్రం రెండు స్థానాలకు చెరొక నామినేషన్ దాఖలు చేశారు. తొలుత ఉదయం ర్యాలీగా బయల్దేరేందుకు అధికార పార్టీ అభ్యర్థి ఎంవీవీఎస్ మూర్తిపార్టీ నేతలను ఆహ్వానించారు. మంత్రి అయ్యన్నపాత్రుడు మరో అభ్యర్థి పప్పల చలపతి రావు, అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్‌లతో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు చేరుకున్నప్పటికీ మంత్రి గంటా మాత్రం రాలేదు. చేసేది లేక మూర్తి ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. గంటా మధ్యలో కలిసి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. తర్వాత మూర్తి..పప్పల నామినేషన్లు వేశారు. ఈ కార్యక్రమానికి సగానికి పైగా పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు డుమ్మా కొట్టారు. వీరిని కన్నబాబురాజు ఆపేశారనే ప్రచారం జరిగింది. 24 మంది జెడ్పీటీసీల్లో సగం మంది హాజరయ్యారు. వంద మంది వరకు ఎంపీటీసీలు గైర్హాజరైనట్టు పార్టీలో శ్రేణులు గుర్తించారు. నాలుగు వాహనాలకు మించి అనుమతించే ప్రసక్తే లేదని ఆర్వో ప్రకటనకు విరుద్ధంగా భారీ కాన్వాయ్‌తో టీడీపీ అభ్యర్థులు కలెక్టరేట్‌లోకి వచ్చారు.పార్టీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి హల్చల్ చేశారు. ఆర్వో ఛాంబర్ లోకి అభ్యర్థితో పాటు ప్రతిపాదించే వ్యక్తులను మాత్రమే అనుమతిస్తామని చెప్పినప్పటికి మంత్రులు,ఎమ్మెల్యేలు,ఇతర పార్టీ నేతలు భారీగానే లోనికి వెళ్లారు. బీజేపీ తరపున ఎంపీ కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు కూడా హాజరయ్యారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాత్రం హాజరు కాలేదు. నిరాడంబరంగా కన్నబాబురాజు నామినేషన్ కన్నబాబురాజు నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేశారు. బలపర్చిన పదిమంది ఎంపీటీసీ సభ్యులతో పాటు ఇతర ముఖ్య అనుచరులు వెంటరాగా మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ అభ్యర్థుల నామినేషన్ సమయంలోనే కన్నబాబురాజు నామినేషన్ వేస్తున్నారంటూ పార్టీ శ్రేణుల్లో కలకలం మొదలైంది. కన్నబాబురాజు మీడియాకు ఫోన్ చేసి తాను రెండు స్థానాలకు నామినేషన్ వేస్తున్నట్టుగా సమాచారమిచ్చి మరీ నామినేషన్ దాఖలు చేశారు. రెండూ మావే:గంటా, అయ్యన్న రెండు స్థానాలను అవలీలగా గెలుచుకుంటామని మంత్రులు గంటా శ్రీనివాస రావు, అయ్యన్న పాత్రుడులు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థులుగా పప్పల చలపతిరావు, ఎంవీవీఎస్ మూర్తి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, ఎన్నికల సమయంలో ఇలాంటి అసంతృప్తులు సహజమేనన్నారు. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని సామాజిక వర్గాల సమతూకం పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారే తప్ప జిల్లాలో బీసీలు, ఎస్టీలకు అన్యాయం చేశారనడం సరి కాదన్నారు. కన్నబాబురాజు బరిలోకి దిగుతుండడంపై మంత్రి గంటా స్పందిస్తూ ఎమ్మెల్సీ సీటుఆశించారని..రాకపోయేసరికి అసంతృప్తికి గురై ఈ నిర్ణయం తీసుకున్నారని.. తాను ఉదయమే ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాననిచెప్పా రు. పరిణామాలను చంద్రబాబు, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. 19వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉన్నందున కన్నబాబురాజుతో ఉపసంహరణకు ఒప్పిస్తామన్నారు. నేడు మరో రెబల్ నామినేషన్ టీడీపీలో రెబల్స్ బెడద మరింత ఎక్కువయ్యే లా కన్పిస్తోంది. మంగళవారం మరో టీడీపీ రెబల్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. రూరల్ పార్టీ మాజీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు నామినేషన్ వేయనున్నట్టు తెలిసిం ది. ఈయన్ని బుజ్జగించేందుకు మంత్రి అయ్య న్న పాత్రుడు ప్రయ త్నిస్తున్నట్టు తెలిసింది.