సాక్షి, నల్గొండ: మునుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా బంగారిగడ్డ నుంచి చండూరుకు టీఆర్‌ఎస్ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డి, వామపక్ష నేతలు పాల్గొన్నారు.
చదవండి: మునుగోడు వార్: అన్ని పార్టీలు ఆయనపైనే ఫోకస్
రాజగోపాల్‌రెడ్డి రూ.18వేల కోట్లకు అమ్ముడుపోవడం వల్లే ఉప ఎన్నిక అని, అమ్ముడుపోయిన వారికి బుద్ధి చెప్పాలని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. అమ్ముడుపోయే వాళ్లను డెకాయిట్స్, 420 గాళ్లు అంటారు. కరోనా కంటే విషమైంది బీజేపీ, మతోన్మాద శక్తులను ఓడించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. దేశ శ్రేయస్సుకోసం మునుగోడులో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment