కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి 24
నామినేషన్ల ఘట్టం సమాప్తం
నేడు నామినేషన్ల పరిశీలన..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అ సెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో నామినేషన్ల దాఖలుకు గడువు గురువారంతో ముగిసింది. ఈ నెల నుంచి 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా, చివరి రోజు గురువారం నాటికి 17 లోక్‌సభ స్థానాల పరిధిలో మొత్తం 893 మంది అభ్యర్థులు 1488 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇక కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి 24 మంది అభ్యర్థులు మొత్తం 50 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. శుక్రవా రం నామినేషన్ల పరిశీలన నిర్వహించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు 29తో ముగియనుంది. మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణతో సహా దేశంలోని 543 లోక్‌సభ స్థానాల్లో పోలైన ఓట్లను జూన్ 4న లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.
అత్యధికంగా మల్కాజ్‌గిరిలో..
అత్యధికంగా మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలో 114 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఆ తర్వాత చేవెళ్లలో 66 మంది, పెద్దపల్లిలో 63 మంది, భువనగిరిలో 61 మంది, సికింద్రాబాద్, హైదరాబాద్‌లలో చెరో 57 మంది, నల్లగొండలో 56 మంది, మెదక్‌లో 54 మంది, కరీంనగర్‌లో 53 మంది, వరంగల్‌లో 58 మంది, ఖమ్మంలో 45 మంది, మహబూబ్ నగర్‌లో 42 మంది, నిజామాబాద్‌లో 42 మంది జహీరాబాద్‌లో 40 మంది నాగర్ కర్నూల్‌లో 34 మంది, మహబూబాబాద్‌లో 30 మంది, ఆదిలాబాద్‌లో 23 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment