
సాక్షి ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సోమవారం మహారాష్ట్ర విధాన మండలి (ఎంఎల్‌సీ)కి నామినేషన్ దాఖలు చేశారు. తొమ్మిది స్థానాల కోసం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి అయిదుగురు, బీజేపీకి చెందిన నలుగురు ఇలా మొత్తంగా తొమ్మిది మంది బరిలో నిలిచారు. దీంతో విధాన మండలి ఎన్నికలు దాదాపు ఏకగ్రీవమ య్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండానే ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్ ఠాక్రేకు మే 27వ తేదీ లోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం అనివార్యంగా ఉన్న సంగతి తెలిసిందే. తొలిసారిగా ఉద్ధవ్ తన నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన తన ఆస్తుల వివరాలు వెల్లడించాల్సి వచ్చింది. తనకు రూ. 143 కోట్ల ఆస్తులున్నట్టు అఫిడవిట్లో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment