legislative council member
-
ఎమ్మెల్సీల ఆస్తుల్లో నారా లోకేశ్ టాప్.. ఏడీఆర్ రిపోర్టు వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ : శాసన మండలి సభ్యుల్లో 75 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), ఏపీ ఎలక్షన్ వాచ్ తాజా అధ్యయనం పేర్కొంది. ఎప్పటికప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు.. అభ్యర్థులు అందించిన సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. మొత్తం 58 మంది సిట్టింగ్ ఎమ్మెల్సీలలో 48 మంది వివరాలను(10 మంది అఫిడవిట్లు వారికి అందుబాటులో లేవు) విశ్లేషించారు. వీరిలో 75 శాతం మంది అంటే 36 మంది కోటీశ్వరులేనని స్పష్టమైంది. ఇందులో అధికార వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు 22 మంది, ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు 11 మంది ఉన్నారు. కాగా, రూ.369 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ అత్యంత ధనవంతుడు అని ఏడీఆర్ రిపోర్టు పేర్కొంది. రెండో స్థానంలో రూ.101 కోట్లతో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఉండగా, మూడో స్థానంలో రూ.36 కోట్లతో ఎమ్మెల్సీ టి.మాధవరావు ఉన్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ పి.రఘువర్మ అత్యల్పంగా రూ.1,84,527 ఆస్తులు కలిగి ఉన్నారు. కాగా, 20 మంది ఎమ్మెల్సీలపై క్రిమినల్ కేసులున్నట్లు ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది. ఎనిమిది మంది 5–12వ తరగతి మధ్య, 40 మంది గ్రాడ్యుయేట్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్నారని తెలిపింది. -
Karnataka: సొంత ప్రభుత్వాన్ని ఏకిపారేసిన బీజేపీ సీనియర్ నేత
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ హెచ్ విశ్వనాథ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిజాబ్ వివాదం తరువాత హిందు దేవాలయ ప్రాంగణంలో ముస్లిం వ్యాపారులను నిషేధించాలంటూ రైట్ వింగ్ సంస్థలు పిలుపునివ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. కర్ణాటక ప్రభుత్వం మత రాజకీయాలకు పాల్పడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతుంటే ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తోందని విశ్వనాథ్ ఆరోపించారు. ప్రభుత్వం తప్పక స్టాండ్ తీసుకోవాలని హితవు పలికారు. దీనిపై అభ్యంతరాలను ఇప్పటికే ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో చర్చించినట్లు తెలిపారు. కాగా 2019లో కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించినవారిలో విశ్వనాథ్ ఒకరు. చదవండి: ఢిల్లీ ఎయిర్ పోర్టులో కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన విమానం ‘ఇతర దేశాలలో కూడా ముస్లింలు నివసిస్తున్నారు. అక్కడ వారు ఆహారం, పువ్వులు అమ్ముతుంటారు.. ఒకవేళ మనం అక్కడికి వెళ్తే వాళ్ల నుంచి ఏం తీసుకుకోకుండా ఉంటామా? వీళ్లంతా చిరు వ్యాపారులు, కాలే కడుపు కోసం పనిచేసుకునే వారు. వారికి మతాల పట్టింపు లేదు. ఇది బీజేపీ ప్రభుత్వం. మత సంస్థ కాదు’ అని ఎమ్మెల్సీ విశ్వనాథ్ నొక్కి చెప్పారు. అయితే రాష్ట్రం రైట్ వింగ్ ఒత్తిడికి లొంగిపోతోందా అని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించడానికి నిరాకరించారు. ఇదిలా ఉండగా బీజేపీ ప్రభుత్వానికి సొంత పార్టీ నుంచే విమర్శలు రావడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చదవండి: బెంగాల్ అసెంబ్లీలో రచ్చ రచ్చ.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు, వీడియో వైరల్ -
విధాన మండలికి ఉద్ధవ్ ఠాక్రే ఏకగ్రీవం!
సాక్షి ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సోమవారం మహారాష్ట్ర విధాన మండలి (ఎంఎల్సీ)కి నామినేషన్ దాఖలు చేశారు. తొమ్మిది స్థానాల కోసం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి అయిదుగురు, బీజేపీకి చెందిన నలుగురు ఇలా మొత్తంగా తొమ్మిది మంది బరిలో నిలిచారు. దీంతో విధాన మండలి ఎన్నికలు దాదాపు ఏకగ్రీవమ య్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండానే ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్ ఠాక్రేకు మే 27వ తేదీ లోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం అనివార్యంగా ఉన్న సంగతి తెలిసిందే. తొలిసారిగా ఉద్ధవ్ తన నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన తన ఆస్తుల వివరాలు వెల్లడించాల్సి వచ్చింది. తనకు రూ. 143 కోట్ల ఆస్తులున్నట్టు అఫిడవిట్లో తెలిపారు. -
షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి.. లేదంటే ..
రైతుల రుణమాఫీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ షరతులు విధించడం అన్యాయమని తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ సభపక్ష నేత డీఎస్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం షరతులు విధించడం రైతులను ఓ విధంగా మోసం చేయడమేనని విమర్శించారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాల్సిందేనని ఆయన సీఎం కేసీఆర్ను డిమాండ్ చేశారు. గురువారం డీఎస్ హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు రుణమాఫీ అని గెలిచిన తర్వాత షరతులు విధించడం ఎంత వరకు సమంజసమని ఆయన ఈ సందర్భంగా కేసీఆర్ని డీఎస్ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే రైతు రుణామాఫీ చేస్తామని టీఆర్ఎస్ పార్టీ తొలి హమీ ఇచ్చిందని డీఎస్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఇచ్చిన హమీని అమలు పరచకుండా మాట తప్పితే తెలంగాణ ప్రభుత్వానికి సహకరించమని డీఎస్ హెచ్చరించారు. ఎటువంటి షరతులు లేకుండా రూ. లక్ష రూపాయల రుణమాఫీ చేయాలిని కేసీఆర్ ప్రభుత్వాన్ని డీఎస్ డిమాండ్ చేశారు.