
కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారం ముగిసింది. అంతకుముందు రోజు వరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
అయితే.. చివరిరోజు మాత్రం టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్ (నాలుగు సెట్లు), సమాజ్‌వాదీ పార్టీ తరఫున దండు శేషుయాదవ్ (రెండు సెట్లు), పంచాయతీ రాజ్ చాంబర్ తరఫున నంద్యాల డివిజన్ ఎంపీటీసీ సభ్యుల సంఘం నేత పులి జయప్రకాశ్‌రెడ్డి (ఒక సెట్), స్వతంత్ర అభ్యర్థిగా మాజీ మంత్రి బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అనుచరుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పుల్యాల నాగిరెడ్డి (ఒక సెట్) నామినేషన్లు దాఖలు చేశారు. వీటిని బుధవారం పరిశీలిస్తారు. ఈనెల 29న ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికకు వైఎస్సార్‌సీపీ దూరంగా ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment