అహ్మదాబాద్: గుజరాత్ రెండో(తుది) విడత పోలింగ్ సోమవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రానికి చేరుకున్నారు. ఆదివారం సాయంత్రమే ఆయన అహ్మదాబాద్‌కు వెళ్లారు. అయితే నేరుగా గాంధీనగర్ రైసన్ ప్రాంతంలో ఉంటున్న తన తల్లి హీరాబెన్ మోదీ నివాసానికి వెళ్లారు.
తల్లి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం పొందారు. సుమారు 45 నిమిషాలు అక్కడే గడిపారు. ఆపై గాంధీనగర్‌లోని బీజేపీ ఆఫీస్‌కు చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్, ఇతర సీనియర్ నేతలు మోదీకి స్వాగతం పలికారు.
అహ్మదాబాద్ రనిప్‌లోని ఓ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నారన్‌పూర్ ప్రాంతంలోని మున్సిపల్ సబ్ జోనల్ కార్యాలయంలోని కేంద్రంలో ఓటేయనున్నారు.
గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గాను డిసెంబర్ 1న 89 సీట్లకు తొలి విడతలో పోలింగ్ జరగ్గా 63.31శాతం పోలింగ్ నమోదైంది. ఇవాళ మిగిలిన 93స్థానాలకు రెండో దశలో పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.
Gujarat | Prime Minister Narendra Modi meets his mother Heeraben Modi at her residence, in Gandhinagar. pic.twitter.com/3Rtg3gJ3ON
— ANI (@ANI) December 4, 2022
Comments
Please login to add a commentAdd a comment