Heeraben Modi
-
Heeraben Modi: చెక్ డ్యామ్‌కు మోదీ తల్లి పేరు
అహ్మదాబాద్: దేశ ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమెకు నివాళిగా గుజరాత్‌లోని ఓ చెక్ డ్యామ్‌కు ఆమె పేరు పెట్టనున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. దాదాపు రూ. 15 లక్షలతో రాజ్‌కోట్-కలావడ్ రోడ్డులోని వాగుదాడ్ గ్రామ సమీపంలో న్యారీ నది వద్ద ఈ డ్యామ్‌ను నిర్మిస్తున్నారు. గిర్ గంగా పరివార్ ట్రస్ట్.. ఈ డ్యామ్ నిర్మాణ బాధ్యతలను చూసుకుంటోంది. బుధవారం స్థానిక ఎమ్మెల్యే దర్షితా షా, రాజ్‌కోట్ మేయర్ ప్రదీప్ దావ్ సమక్షంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోదీ తల్లికి నివాళిగా ఈ చెక్ డ్యామ్‌కు హీరాబా స్మృతి సరోవర్ అని నామకరణం చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించారు గిర్ గంగా పరివార్ ట్రస్ట్ వాళ్లు. తద్వారా అయినవాళ్లు దూరమైనప్పుడు ఓ మంచి పని చేయాలనే ఆలోచన మరికొందరిలో కలుగుతుందని ఆశిస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు ప్రకటించారు. గిర్ గంగా పరివార్ ట్రస్ట్.. పూర్తిగా విరాళాల సేకరణతోనే గత నాలుగు నెలల్లో 75 చెక్ డ్యామ్‌లు కట్టించింది. ప్రస్తుత డ్యామ్ నాలుగు వందల ఫీట్ల పొడవు, 150 ఫీట్ల వెడల్పు ఉంటుందని, ఒక్కసారి డ్యామ్ నిండితే తొమ్మిది నెలల వరకు నీరు ఎండిపోదని, చుట్టుపక్కల గ్రామాలకు నీటి సమస్య తీరనుందని ట్రస్ట్ నిర్వాహకులు ప్రకటించారు. -
Heeraben Modi: తల్లి చెప్పిన మాటలు తల్చుకుంటూ..
ప్రతీ వ్యక్తి జీవితంలో అమ్మ ఒక మధురమైన పదం. కానీ, అమ్మ అంటే పదం మాత్రమే కాదు.. ఎన్నో భావోద్వేగాల సంగ్రహం అంటారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. మాతృవియోగం తర్వాత తన తల్లితో పెనవేసుకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ.. అద్భుతమైన శతాబ్ది(తల్లి హీరాబెన్ మోదీని ఉద్దేశించి..) భగవంతుని పాదాల చెంత ఉంది అని సోషల్ మీడియాలో మోదీ చేసిన వ్యాఖ్య చేశారు. సన్యాసి ప్రయాణం, నిస్వార్థ కర్మయోగి, విలువలకు కట్టుబడి జీవించడం.. ఈ త్రిమూర్తులను అమ్మ ద్వారా అనుభూతి చెందాను అని పేర్కొన్నారు. తెలివితో పని చేయండి.. స్వచ్ఛమైన జీవితాన్ని గడపండి అంటూ తన వందవ పుట్టినరోజున ఆమె తనకు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నారు ఆయన. తన అమ్మ సాధారణంగా కనిపించినప్పటికీ ఆమె అసాధారణమైన మహిళ అని అంటారు నరేంద్ర మోదీ. చాలా చిన్న వయసులోనే తన తల్లి ఆమె మాతృమూర్తిని కోల్పోయిందని, జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించిందని, అయినప్పటికీ బలంగా నిలబడిందని పేర్కొన్నారు. शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है। pic.twitter.com/yE5xwRogJi — Narendra Modi (@narendramodi) December 30, 2022 1922, జూన్ 18న గుజరాత్ మెహ్సనా వద్‌నగర్‌లో జన్మించారు హీరాబెన్. చిన్నతనంలోనే ఆమె తల్లి స్పానిష్ ఫ్లూతో కన్నుమూసింది. ఫొటోలు కూడా లేకపోవడంతో.. ఆమె ముఖం కూడా హీరాబెన్‌కు గుర్తు లేదట. అలా తల్లి లేకుండానే హీరాబెన్ బాల్యం గడిచింది. తల్లి ఒడిలో సేద తీరని పరిస్థితి.. తన పిల్లలకు రాకూడదని ఆమె ఎంతో తాపత్రయపడింది. బడికి పోయి రాయడం, చదవడం నేర్వలేదు. పేదరికం, కష్టాలతోనే గడిచిపోయింది ఆమె జీవితం. అందుకేనేమో బాధ్యతగా తన ఐదుగురు పిల్లలను పెంచింది. అదే బాధ్యతను బిడ్డలకు ప్రబోధించింది. బాధ్యతాయుతంగా ఉండాలని పిల్లలకు చెప్పడమే కాదు.. ఆరోగ్యం సహకరించకున్న ఆమె ఓటేసి తన బాధ్యతను నేరవేర్చారు కూడా. టీ అమ్ముకునే దామోదరదాస్ ముల్చంద్ మోదీని వివాహాం చేసుకున్నారు హీరాబెన్. ఆ ఇంటికి పెద్ద కోడలిగా వెళ్లిన ఆమె.. అంతే బాధ్యతాయుతంగా ఇంటిని నడిపించే యత్నం చేశారు. సోమ భాయ్ మోదీ, అమృత్ భాయ్ మోదీ, నరేంద్ర మోదీ, ప్రహ్లాద్ మోదీ, వసంతి బెన్, పంకజ్ మోదీ.. ఇలా నలుగురు కొడుకులు, ఒక కూతురిని కనిపెంచారామె. గాంధీనగర్‌లో రేసన్ గ్రామంలో చిన్న కొడుకు పంకజ్ మోదీ దగ్గర చివరిరోజుల్లో గడిపారామె. తన పెరుగుదల కోసం , ఎదుగుదల కోసం తన తల్లి ఎన్నో త్యాగాలను చేసిందని మోదీ గుర్తు చేసుకున్నారు. తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి, తనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఎంతో ప్రేరణ ఇచ్చిందని తరచూ చెప్తుంటారు. నా తల్లి కష్టాలను కళ్లారా చూశా. ఇంట్లో పనులన్నీ ఆమె ఒక్కతే చేసుకునేది. ఇంటి పోషణ కోసం కూడా తన వంతు ప్రయత్నించేది. ఇతరుల ఇళ్లల్లో వంటపాత్రలు కడిగి, చరఖా తిప్పి వచ్చిన ఆదాయంతో కుటుంబ ఖర్చులకు సాయంగా నిలిచింది. చిన్న ఇల్లు.. బురద మట్టి గోడలు.. వర్షానికి ఇల్లంతా కురిసినా, వర్షం నీరు పడుతున్న చోట బకెట్లు, గిన్నెలు పెట్టేదని, ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, తన తల్లి ఎంతో దృఢంగా నిలిచిందని మోదీ తన బ్లాగులో రాసుకొచ్చారు. కష్టాలను ఆమె ధైర్యంగా ఎదుర్కొనే వారు. ఆమె పేరిట ఎలాంటి ఆస్తులు లేవు. ఒంటిపై ఆమె బంగారం ధరించింది ఏనాడూ చూడలేదు. అసలు ఆమెకు ఆసక్తి కూడా ఉండేది కాదు. ఆ తర్వాత కూడా అతి సాధారణ జీవితాన్ని, ఒక చిన్న గదిలో కొనసాగించినట్లు గుర్తు చేసుకున్నారు. అమ్మతో కలిసి ప్రజల సమక్షంలో ఆయన కనిపించింది అరుదు. ఏక్తా యాత్ర పూర్తి చేసుకుని శ్రీనగర్ లాల్ చౌక్‌లో జాతీయ జెండా ఎగరేసి.. తిరిగి అహ్మదాబాద్‌కు చేరుకున్నప్పుడు తికలం దిద్దింది ఆ తల్లి. మళ్లీ.. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు ఆమె కొడుకు వెంట ఉంది. తల్లి చేసిన కర్తవ్య బోధ వల్లనేమో.. ఆమె అంత్యక్రియలు పూర్తి చేశాక బాధను దిగమింగుకుని తిరిగి విధుల్లోకి దిగి పోయారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. తన తల్లి నూరవ పుట్టిన రోజు సందర్భంగా తనకు జన్మనిచ్చిన తల్లికి కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తూ రాసిన ‘మదర్’ బ్లాగ్ నుంచి సంగ్రహణ -
హీరాబెన్ అంత్యక్రియలు.. తల్లి పాడె మోసిన ప్రధాని మోదీ.. (ఫొటోలు)
-
మోదీ తల్లి హీరాబెన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన చిరంజీవి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్లలి హీరాబెన్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని తల్లి శ్రీమతి హీరాబెన్ మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆమె అసాధారణమైన జీవితాన్ని గడిపింది. స్వర్గలోకానికి వెళ్లిన ఆమె ఆత్మకు నా నివాళులు. నరేంద్ర మోదీ జీకి నా హృదయపూర్వక సానుభూతి! ఓం శాంతి!....అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మోదీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. కాగా రెండురోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మోదీ తల్లి హీరాబెన్ అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఇటీవలె ఆమె వందో పుట్టినరోజును జరుపుకున్నారు. Deeply saddened by the demise of Smt.Heeraba Modi ji , beloved mother of our Hon’ble Prime Minister. She lived an extraordinary life. My tributes to the divine soul who left for the heavenly abode. My heartfelt condolences to Shri @narendramodi ji ! Om Shanti! 🙏🙏 — Chiranjeevi Konidela (@KChiruTweets) December 30, 2022 -
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు
-
గాంధీనగర్ లో హీరాబెన్ అంత్యక్రియలు
-
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. హీరాబెన్ అంటే మోదీకి ఎంత ప్రేమో..
న్యూఢిల్లీ: ఈ ప్రపంచంలో కన్నతల్లిని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. పిల్లలపై తల్లి చూపించే ప్రేమ వెలకట్టలేనిది. మాతృమూర్తిపై కుమారుడు చూపించే ప్రేమ వర్ణించలేనిది. ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తన తల్లి హీరాబెన్ మోదీపై అమితమైన ప్రేమ. ఢిల్లీకి రాజైనా ఓ తల్లికి కొడుకే అనే నానుడి ఆయనకు సరిగ్గా సరిపోతుంది. మిగతా రోజుల్లో ఎక్కడున్నా.. తన పుట్టినరోజు వచ్చిందంటే మాత్రం మోదీ కచ్చితంగా ఆమె దగ్గరకు వెళ్తారు. ఆప్యాయంగా మాట్లాడుతారు. ఆమె కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఆమెకు కానుకలు కూడా ఇస్తారు. హీరాబెన్ మోదీ కూడా కుమారుడిపై తన ప్రేమను చూపించేవారు. పుట్టినరోజు నాడు మోదీకి స్వీట్లు తినిపించి ముద్దాడేవారు. తన కుమారుడు ప్రధాని అయిన విషయం మరిచి దాచుకోవడానికి తన దగ్గరున్న డబ్బులు కూడా ఇచ్చిన సందర్బాలు ఉన్నాయి. మోదీ ఎక్కడున్నా ముఖ్యమైన సమయాల్లో కచ్చితంగా తన తల్లి దగ్గరకు వెళ్తారు. పుట్టినరోజుతో పాటు ఎన్నికలకు ముందు ఆమె ఆశీర్వచనాలు తీసుకుంటారు. హీరాబెన్ మోదీ ఇటీవలే 100వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తన తల్లి గొప్పతనాన్ని, కుటుంబం కోసం చేసిన త్యాగాలను మోదీ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. తన మనస్సు, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసంతో తన తల్లి హీరాబెన్ పాత్ర ప్రధానమని మోదీ చెప్పారు. తన తల్లి చిన్నతనం నుంచే ఎన్నోకష్టాలను, ఒడుదొడుకులను ఎదుర్కొందని మోదీ బ్లాగ్‌లో రాశారు. తన కుటుంబం వాద్నగర్లో మట్టిగోడలతో నిర్మించిన చిన్న ఇంట్లో నివసించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. పరిశుభ్రత పట్ల తన తల్లి ఎంతో ప్రత్యేకంగా ఉండవారని వివరించారు. మోదీ తండ్రి దామోదర్‌దాస్ ముల్చంద్ మోదీ 1989లో క్యాన్సర్‌తో మరణించారు. అప్పటి నుంచి తల్లి హీరాబెన్ మోదీ చిన్నకుమారుడి దగ్గరే ఉంటున్నారు. ఇటీవలే 100వ పుట్టినరోజు చేసుకున్న హీరాబెన్ మోదీ గుజరాత్ అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. నిండు నూరేళ్లు జీవించిన తన తల్లి.. భగవంతుని చెంతకు చేరిందని మోదీ భావోద్వేగ సందేశాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తన తల్లిలో మూడు గుణాలున్నాయని, ఆమెను చూస్తే తనకు ఒక రుషి ప్రయాణం, నిస్వార్థ కర్మయోగి, విలువలకు కట్టుబడి జీవించడం గుర్తుకు వస్తాయని ఎమోషనల్ అయ్యారు. చదవండి: ప్రధాని మోదీకి మాతృ వియోగం -
తల్లి హీరాబెన్ పాడె మోసిన ప్రధాని మోదీ
-
తల్లి హీరాబెన్ పాడె మోసిన ప్రధాని మోదీ
గాంధీనగర్: ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మోదీ అశ్రునయనాలతో తన తల్లి పాడె మోశారు. అంతిమ యాత్ర వాహనంలో తల్లి పార్థివ దేహం వద్ద కూర్చుని ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం గాంధీనగర్‌లోని ముక్తిధామ్ శ్మశానవాటికిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హీరాబెన్ చితికి నిప్పంటించి అక్కడి నుంచి వెనుదిరిగారు మోదీ. హిరాబెన్ అంతిమయాత్రకు కుటుంబసభ్యులతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందు గాంధీనగర్‌లోని నివాసంలో తన తల్లి పార్ధీవ దేహానికి పుష్పాంజలి ఘటించారు మోదీ. కడసారి నివాళులు అర్పించారు. #WATCH | Gandhinagar: Prime Minister Narendra Modi carries the mortal remains of his late mother Heeraben Modi who passed away at the age of 100, today. pic.twitter.com/CWcHm2C6xQ — ANI (@ANI) December 30, 2022 #WATCH | Gujarat: Heeraben Modi, mother of PM Modi, laid to rest in Gandhinagar. She passed away at the age of 100, today. (Source: DD) pic.twitter.com/wqjixwB9o7 — ANI (@ANI) December 30, 2022 ఇటీవలే 100వ పుట్టినరోజు జరుపుకొన్న హీరాబెన్ మోదీ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం గుజరాత్ అహ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు. తన తల్లి మరణించిన విషయాన్ని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. భారమైన హృదయంతో సందేశాన్ని రాసుకొచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రధాని మోదీకి సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి
సాక్షి, తాడేపల్లి: ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హీరాబెన్ మృతి పట్ల అమిత్ షా, వెంకయ్యనాయుడు, యోగి ఆదిత్యనాథ్, దిగ్విజయ్‌సింగ్ సంతాపం తెలిపారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ (100) కన్నుమూశారు. అనారోగ్యంతో రెండు రోజుల క్రితం ఆమె ఆస్పత్రిలో చేరారు. అహ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గురువారం అర్ధరాత్రి సమయంలో మృతి చెందారు. చదవండి: (ప్రధాని మోదీకి మాతృ వియోగం) -
తల్లిపై మోదీకి ఎంత ప్రేమో.. మాతృమూర్తి సేవలో ప్రధాని ఫోటోలు
-
తల్లి మృతిపై ప్రధాని మోదీ భావోద్వేగ ట్విట్
-
Heeraben Modi: తల్లి చెంతకు నరేంద్ర మోదీ
అహ్మదాబాద్: దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన తల్లి హీరాబెన్ మోదీ దగ్గరకు వెళ్లారు. మంగళవారం రాత్రి ఆమె అస్వస్థతకు గురి కావడంతో అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఆమెను చేర్పించిన విషయం తెలిసిందే. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు కూడా. అయితే.. తల్లి అనారోగ్యం నేపథ్యంలో ఆమెను చూసేందుకు ఢిల్లీ నుంచి వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లిన ఆయన.. సుమారు గంటపాటు తల్లితో గడిపారు. ఆరోగ్యంగా ఉండమని, అధైర్య పడొద్దని ఆమెకు సూచించారాయన. గుజరాత్ ఎమ్మెల్యేలు దర్శనాబెన్ వఘేలా, కౌశిక్ జైన్ సైతం ఆస్పత్రికి వెళ్లారు. 99 ఏళ్ల హీరాబెన్ ఆరోగ్య స్థితి నిలకడగానే ఉందని అహ్మదాబాద్ యూఎన్ మెహతా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి తల్లి దగ్గరకు వెళ్లిపోవడం తగ్గినట్లు.. తరచూ ఆయన ఇంటర్వ్యూలో నరేంద్ర మోదీ బాధపడడం తెలిసిందే. ఈ క్రమంలో గుజరాత్ ఎన్నికల సమయంలో ఆయన ఆమె దగ్గరకు వెళ్లారు. అంతేకాదు తన తల్లి వందవ పుట్టినరోజు కోసం ‘మదర్’ అనే బ్లాగ్‌ను సైతం ఆయన రాశారు. మరోవైపు నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ.. ఆయన కుటుంబం ప్రయాణిస్తున్న వాహనం మంగళవారం మైసూర్(కర్ణాటక) వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అందరికీ స్వల్ఫ గాయాలు అయ్యాయి. -
ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ ఓదార్పు
-
మోదీజీ.. నా ప్రేమ, మద్దతు మీకు ఉంటాయి: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ అస్వస్థతకు గురై మంగళవారం రాత్రి అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్లో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుపుతూ హెల్త్ బులిటిన్ విడుదల చేశారు వైద్యులు. ఈ క్రమంలో హీరాబెన్ ఆరోగ్య పరిస్థితిపై ట్విట్టర్లో స్పందించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘తల్లీకొడుకుల మధ్య ప్రేమ వెలకట్టలేనిది. మోదీ జీ, ఈ కఠిన సమయంలో నా ప్రేమ, మద్ధతు మీకు ఉంటాయి. మీ మాతృమూర్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా.’అని ట్విట్టర్లో రాసుకొచ్చారు రాహుల్ గాంధీ. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం స్పందించారు. హీరాబెన్ త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలి ప్రార్థించారు. एक मां और बेटे के बीच का प्यार अनन्त और अनमोल होता है। मोदी जी, इस कठिन समय में मेरा प्यार और समर्थन आपके साथ है। मैं आशा करता हूं आपकी माताजी जल्द से जल्द स्वस्थ हो जाएं। — Rahul Gandhi (@RahulGandhi) December 28, 2022 ఇదీ చదవండి: నిలకడగా ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ ఆరోగ్యం -
నిలకడగా ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ ఆరోగ్యం
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్లో చేరారు. కాగా హీరాబెన్ ఈ ఏడాది జూన్‌లోనే 99వ పుట్టినరోజు జరుపుకున్నారు. ప్రధాని తల్లి హీరాబెన్ ఆరోగ్యంపై ఆసుపత్రి వైద్యులు స్పందించారు. బుధవారం అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుప్రతిలో చేరారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. The health of the Prime Minister's mother Hiraba is improving. Today She was admitted to UN Mehta Institute of Cardiology and Research Center in Ahmedabad. This institute has just issued a health bulletin. (బులిటెన్ సారాంశం) -
గుజరాత్ ఎన్నికలు: తల్లి ఆశీస్సులు అందుకున్న మోదీ
అహ్మదాబాద్: గుజరాత్ రెండో(తుది) విడత పోలింగ్ సోమవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రానికి చేరుకున్నారు. ఆదివారం సాయంత్రమే ఆయన అహ్మదాబాద్‌కు వెళ్లారు. అయితే నేరుగా గాంధీనగర్ రైసన్ ప్రాంతంలో ఉంటున్న తన తల్లి హీరాబెన్ మోదీ నివాసానికి వెళ్లారు. తల్లి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం పొందారు. సుమారు 45 నిమిషాలు అక్కడే గడిపారు. ఆపై గాంధీనగర్‌లోని బీజేపీ ఆఫీస్‌కు చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్, ఇతర సీనియర్ నేతలు మోదీకి స్వాగతం పలికారు. అహ్మదాబాద్ రనిప్‌లోని ఓ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నారన్‌పూర్ ప్రాంతంలోని మున్సిపల్ సబ్ జోనల్ కార్యాలయంలోని కేంద్రంలో ఓటేయనున్నారు. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గాను డిసెంబర్ 1న 89 సీట్లకు తొలి విడతలో పోలింగ్ జరగ్గా 63.31శాతం పోలింగ్ నమోదైంది. ఇవాళ మిగిలిన 93స్థానాలకు రెండో దశలో పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. Gujarat | Prime Minister Narendra Modi meets his mother Heeraben Modi at her residence, in Gandhinagar. pic.twitter.com/3Rtg3gJ3ON — ANI (@ANI) December 4, 2022 -
నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు: ప్రధాని మోదీ భావోద్వేగం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన తల్లి హీరాబెన్‌పై ఉన్న ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. ఆమెపై మోదీపై చూపించే అప్యాయతను ఎన్నోసార్లు చూశాము. కాగా,మోదీ తల్లి హీరాబెన్ నేడు(జూన్ 18న) వందవ(100) పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. హీరాబెన్.. జూన్ 18, 1923లో జన్మించారు. ఈ సందర్భంగా మోదీ.. స్వయంగా ఇంటికి వెళ్లి.. తల్లికి పుట్టిన రోజును జరిపారు. తల్లి కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్బంగా మోదీ ట్విట్టర్ వేదికగా.. ‘‘మా.. ఇది కేవలం పదం కాదు. అనేక రకాల భావోద్వేగాలను కూడుకున్నది. ఈ రోజు, జూన్ 18న నా తల్లి హీరాబా తన 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన రోజు. ఈ ప్రత్యేకమైన రోజున, నేను ఆనందం మరియు కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తూ కొన్ని ఆలోచనలను వ్రాసాను’8 అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే, రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. గుజరాత్‌కు వెళ్లారు. తల్లి హీరాబెన్ పుట్టినరోజు సందర్భంగా మొదట గాంధీనగర్‌లోని తన ఇంటికి చేరుకుని.. తల్లికి హీరాబెన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తల్లి కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె పక్కనే కూర్చున్న మోదీ.. కాసేపు హీరాబెన్‌తో మాట్లాడి బాగోగుల గురించి తెలుసుకున్నారు. అనంతరం, ఇద్దరూ కలిసి అల్పాహారం సేవించారు. ఇదిలా ఉండగా.. హీరాబెన్ 100వ పుట్టినరోజు సందర్భంగా గాంధీనగర్ మేయర్ హితేష్ మక్వానా కీలక ప్రకటన చేశారు. రైసెన్ ప్రాంతంలోని 80 మీటర్ల రహదారికి పూజ్య హీరాబా మార్గ్ అనే పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. దీంతో, ఆమె జీవితం గురించి తర్వాతి తరం స్పూర్తి పొందుతారని స్పష్టం చేశారు. Maa…this isn’t a mere word but it captures a range of emotions. Today, 18th June is the day my Mother Heeraba enters her 100th year. On this special day, I have penned a few thoughts expressing joy and gratitude. https://t.co/KnhBmUp2se — Narendra Modi (@narendramodi) June 18, 2022 -
పోరాడలేక నా తల్లిపై దూషణలా?
ఛత్తర్పూర్/మంద్సౌర్: తనతో పోరాడే శక్తిలేని కాంగ్రెస్ నేతలు తన తల్లి హీరాబెన్ లక్ష్యంగా దూషణలకు దిగుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 18 ఏళ్లుగా తన చేతిలో ఓడిపోతున్న కాంగ్రెస్ నేతలు, పోరాడేందుకు మరే విషయం దొరక్కపోవడంతోనే వృద్ధురాలైన తన తల్లిని ఈ వివాదంలోకి లాగారని దుయ్యబట్టారు. దేశంలో రూపాయి విలువ మోదీ తల్లి వయస్సుకు దిగజారిందని కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ చేసిన వ్యాఖ్యలపై మోదీ ఈ మేరకు స్పందించారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఛత్తస్‌పూర్‌లో నిర్వహించిన ర్యాలీలో విపక్షాలపై మోదీ నిప్పులు చెరిగారు. ఆమెకు రాజకీయాలంటేనే తెలియదు.. ‘ఈ కాంగ్రెస్ నేతలకు నరేంద్ర మోదీపై పోరాడే శక్తి లేదు. 17–18 సంవత్సరాలుగా మిమ్మల్ని ప్రతీసారి సవాల్ చేయడమే కాకుండా చిత్తుచిత్తుగా ఓడిస్తున్నా. కానీ మీరు ఈ రాజకీయ రొంపిలోకి నా తల్లిని లాగుతున్నారా? కాంగ్రెస్ నేతలకు ఇది సరైనదేనని అనిపిస్తోందా? మోదీపై చేసిన విమర్శలేవీ పనిచేయకపోవడంతో కాంగ్రెస్ నేతలు నా తల్లి హీరాబెన్‌ను దుర్భాషలాడుతున్నారు. ఆమెను అవమానిస్తున్నారు. కానీ నా తల్లికి రాజనీతి(రాజకీయం) అనే పదంలో ఆర్ అనే అక్షరానికి అర్థం కూడా తెలియదు’ అని అన్నారు. మాది రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం కాదు ఈ సందర్భంగా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ లక్ష్యంగా మోదీ విమర్శలు గుప్పిం చారు. ‘నా ప్రభుత్వాన్ని ఓ మేడమ్(సోనియా) తన ఇంట్లో కూర్చుని రిమోట్ కంట్రోల్ తో నియంత్రించడం లేదు. దేశంలోని 125 కోట్ల మంది ప్రజలే నా హైకమాండ్. మేడమ్ హయాంలో ధనికుల కోసం బ్యాంకుల ఖజానాలను ఖాళీ చేసేశారు. కానీ, మా ప్రభుత్వం యువతకు సాధికారత కల్పిస్తోంది. అవినీతి అన్నది నాలుగు తరాల కాంగ్రెస్‌లో అనాదిగా వస్తున్న ఆచారం, సంస్కృతి. నోట్ల రద్దు తర్వాత తప్పుడు పేర్లు, చిరునామాలతో నడుస్తున్న మూడు లక్షల డొల్ల కంపెనీలు మూతపడ్డాయి.’ అని మోదీ తెలిపారు. సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు వస్తున్న ఆదరణ చూసి నామ్‌దార్(రాహుల్), రాజా (దిగ్విజయ్), మహారాజా (జ్యోతిరాదిత్య సింధియా)లు కలత చెందుతున్నారని ప్రధాని ఆరోపించారు. పటేల్ తొలి ప్రధాని అయ్యుంటే.. భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఉంటే దేశంలో రైతులు నాశనమయ్యేవారు కాదని మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తప్పులు, లోపభూయిష్టౖ నిర్ణయాలతో రెతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆ లోపాలను సరిదిద్దేందుకు కొంత సమయం అవసరమనీ, అయితే తనకు నాలుగేళ్ల కాలం మాత్రమే లభించిందని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలకు లభించిన సమయంలో సగం కాలం తనకు అధికారం అప్పగించినా విప్లవాత్మక మార్కులు తీసుకొస్తానన్నారు. పేదరికాన్ని తరిమేద్దాం(గరీబీ హఠావో) అంటూ నాడు ఇందిర ఇచ్చిన నినాదం నేటికీ నెరవేర లేదని విమర్శించారు. -
ఆటోలో మోదీ తల్లి.. అభాసుపాలైన మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఆటోలో ప్రయాణిస్తున్న ఫోటో ఒకటి ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. కేంద్ర మంత్రి విజయ్ సంపాలా తన ట్వీటర్లో ఆ ఫోటోను పోస్టు చేసి అభాసుపాలయ్యారు. ‘మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీగారి తల్లి ఇప్పటికీ ఆటోలోనే ప్రయాణిస్తున్నారు. కానీ, రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ ప్రపంచంలోనే ధనిక నేతల్లో నాలుగో స్థానంలో ఉన్నారు’ అంటూ ఆ ఫోటోను ఉంచారు. కానీ, ఆ ఫోటోలో నిశితంగా పరిశీలిస్తే హీరాబెన్ మోదీ కుడి మోచేతిని పట్టుకున్నట్లు ఓ చెయ్యి ఉంది. అది గమనించిన కొందరు అది మార్ఫింగ్ ఫోటో అంటూ కేంద్ర మంత్రిపై విమర్శలు గుప్పించారు. నాలుగేళ్ల క్రితం ఫోటోను మార్ఫ్ చేసి దానిని ఇప్పుడు ఈ విధంగా వైరల్ చేస్తున్నారంటూ కొందరు మండిపడుతున్నారు. ఒకవేళ మంత్రి చెప్పినట్లు ఆ ఫోటో నిజమే అయితే తల్లి బాగోగులు పట్టించుకునే పరిస్థితిలో మన ప్రధాని లేరేమో అంటూ ఇంకొందరు విమర్శిస్తున్నారు. మొత్తానికి కేంద్ర మంత్రి అత్యుత్సాహంతో పోస్టు చేసిన ఆ మార్ఫింగ్ ఫోటోపై తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. Our Beloved PM Shri @narendramodi 's Mother is still travelling in Auto, While @RahulGandhi 's Mother is the World's 4th Wealthiest Politician!#NarendraModi pic.twitter.com/HsLuTBYUaI — Vijay Sampla MoS (@vijay_sampla) 4 May 2018 -
67వ పడిలోకి మోదీ.. ప్రముఖుల అభినందనలు
సాక్షి, గాంధీనగర్: సరిగ్గా మూడేళ్ల క్రితం నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ దేశ ప్రధాన మంత్రిగా ప్రమాణం చేస్తున్న సమయమది. సొంత రాష్ట్రం గుజరాత్ సహా దేశంలోని బీజేపీ కార్యకర్త సంబరాలు అంబరాన్నంటాయి. 12 ఏళ్లపాటు ఒక రాష్ట్రాన్ని విజయవంతంగా పాలించి.. దేశ ప్రజల దృష్టిలో సమర్థుడిగా మన్ననలు పొందిన వ్యక్తి ప్రధాని కావటం కన్నా ఇంకేముందన్న భావన పార్టీ నేతల్లో నెలకొంది. అయితే గాంధీనగర్‌లో 95 ఏళ్ల హీరాబెన్ మాత్రం కన్నీటి ధారలతో తన కొడుకు ప్రసంగ కార్యక్రమం టీవీల్లో చూస్తూ ఆనందం వ్యక్తం చేశారు. తన కొడుకు దేశ సేవకు అంకితం కావటం కంటే తనకు ఇంకేం కావాలన్నది ఆమె ఉద్దేశ్యం అయి ఉండొచ్చు. సరిగ్గా నాలుగు నెలల తిరగక ముందే తన పుట్టిన రోజున తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు మోదీ. ఆ సమయంలో తను దాచుకున్న 5001 రూపాయలను కశ్మీర్ వరద బాధితులకు సహాయంగా అందించారు హీరాబెన్. ఇక గతేడాది(2016)లో కూడా తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. కొన్నాళ్లకు తొలిసారి తన వద్దకు వచ్చిన తల్లితో సంతోషంగా గడిపారు ప్రధాని. 2014, 2016 ఇలా రెండేళ్లు తన తల్లి వద్దకు వెళ్లిన ప్రధాని 2015 అమెరికా పర్యటనలో మాత్రం అమ్మను గుర్తుకు తెచ్చుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో... మీ జీవితంలో మీ తల్లి పాత్ర ఏంటని అడిగిన ప్రశ్నతో మోదీ హావభావాలు ఒక్కసారిగా మారిపోయాయి. తనను పెంచేందుకు తల్లిపడ్డ కష్టాలు తలుచుకుని కంటతడిపెట్టారు. తన జీవితంలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమైనదన్నారు. తమది చాలా నిరుపేద కుటుంబమని… తాను రైల్వే స్టేషన్లో టీ అమ్మేవాడినని గుర్తు చేసుకున్నారు. చిన్న పిల్లలైన తమకు పెంచేందుకు అమ్మ చుట్టుపక్కల ఇళ్ళలో పని మనిషిగా ఉండేదన్నారు. పక్కిళ్లలో అంట్లు తోమేదని చెప్పారు. తన తల్లే కాకుండా భారతదేశంలో ఎంతో మంది తల్లులు తమ పిల్లలను పెంచేందుకు తమ జీవితం మొత్తం త్యాగం చేస్తున్నారని భావోద్వేగానికి గురయ్యారు. ఇలా అమ్మతో అనుబంధాన్ని ఎప్పటికప్పుడు గుర్తుకు చేసుకునే ప్రధాని నరేంద్ర మోదీ నేడు తన 67వ పడిలోకి అడుగుపెట్టారు. ఊహించినట్లుగానే ఉదయమే తల్లి చెంత వాలిపోయిన ఆయన హీరాబెన్ నుంచి ఆశీర్వాదం తీసేసుకున్నారు. తల్లితో ముచ్చటించి సంతోషంగా గడిపారు. పుట్టినరోజు ప్రత్యేకంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద డ్యామ్ సర్దార్ సరోవర్‌ను కాసేపట్లో జాతికి అంకితం ఇవ్వనున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలు, పలువురు ప్రముఖులు మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే సన్నిహితులతోపాటు రాజకీయాలకతీతంగా ప్రత్యర్థుల నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకోవటం బహుశా మోదీకే చెల్లుతుందేమో. Birthday wishes to @PMOIndia @narendramodi Ji — Mamata Banerjee (@MamataOfficial) 16 September 2017 దేశాన్ని ప్రగతి పథములో పరుగులు పెట్టిస్తున్న నవ భారత సారథి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు pic.twitter.com/fXhNLYScGx — Mohan Babu M (@themohanbabu) 17 September 2017 My best wishes to Modi ji on his birthday. May Almighty give him wisdom to admit his mistakes and correct them. — digvijaya singh (@digvijaya_28) 17 September 2017 Birthday greetings to Sri @narendramodi ji. May you achieve every goal and vision for our Mother India. — N Chandrababu Naidu (@ncbn) September 17, 2017 I wish Namo a very happy birthday and pray that God showers on him the best of health and blesses him to steer the nation to greatness — Subramanian Swamy (@Swamy39) 17 September 2017 Wishing @narendramodi ji a very happy birthday. Best wishes for a healthy & happy life. @PMOIndia — Capt.Amarinder Singh (@capt_amarinder) 17 September 2017 -
బ్యాంకుకు వచ్చిన ప్రధాని మోదీ తల్లి
-
బ్యాంకుకు వచ్చిన ప్రధాని మోదీ తల్లి
గాంధీనగర్: దేశ వ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దుతో చిన్నపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బ్యాంకులు, పోస్టాపీసుల వద్ద బారులు తీరుతుండగా గుజరాత్ లోని ఓ బ్యాంకు ముందు ఓ పెద్దావిడ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించారు. మీడియా మొత్తం ఒక్కసారిగా ఆమె వైపు తమ కెమెరాలు తిప్పింది. ఆమె ఎవరో కాదు భారత ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరా బెన్. ఆమె మంగళవారం ఉదయం గుజరాత్ లోని గాంధీనగర్ లో ఓ బ్యాంకు వద్దకు తన సహాయకుల సాయంతో చేరుకున్నారు. అనంతరం వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ వద్దకు వెళ్లి తన పాత డబ్బును మార్పిడి చేసుకున్నారు. రూ.500, రూ.1000 నోట్లు ఇక చెల్లబోవని ఈ నెల(నవంబర్) 8న ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దుతో ఒక్కసారి దేశంలోని పలువురు(వీరిలో సామాన్యులే అధికం) బ్యాంకులముందు తమ కనీస అవసరాలకోసం బారులు తీరి తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.