సాక్షి, వరంగల్ రూరల్: మొదటి విడతలో ఉన్నట్లుగానే రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో గులాబీ జోరు కొనసాగింది. ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవడంలో టీఆర్‌ఎస్ పార్టీ సక్సెస్ సాధించింది. గులాబీ సర్పంచు వార్డు సభ్యులు తమ సత్తా చాటారు. రాష్ట ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరి లబ్ది పొందుతుండడంతో టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించారు. రెండో విడతలో పరకాల, నడికూడ, శాయంపేట, ఖానాపురం, నల్లబెల్లి, రాయపర్తి మండలాల్లోని 136 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల చేయగా 33 గ్రామ పంచాయతీలు ఏకగీవ్రమయ్యాయి. 103 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. రెండో విడతలో 136 గ్రామ పంచాయతీల్లో 111 గ్రామ పంచాయతీల్లో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా, 18 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఐదు గ్రామ పంచాయతీలను ఇండిపెండెంట్‌లు, ఒక్క గ్రామాన్ని న్యూ డెమోక్రసీ పార్టీ దక్కించుకుంది.
136కు 111 టీఆర్‌ఎస్‌వే..
వరంగల్ రూరల్ జిల్లాలో మొదటి విడతలో 145 గ్రామ పంచాయతీలకు గాను 120 గ్రామ పంచాయతీలు టీఆర్‌ఎస్ దక్కించుకుంది. అదే జోష్ రెండో విడతలో సైతం కొనసాగించింది. రెండో విడతలో 136 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరుగగా 111 గ్రామ పంచాయతీల్లో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. పరకాలలో 7, నడికూడ 10, శాయంపేట 16, ఖానాపురంలో 19, నల్లబెల్లిలో 23, రాయపర్తిలో 36 గ్రామ పంచాయతీలలో సర్పంచ్‌లను గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ పరకాలలో 2, నడికూడలో 3 , శాయంపేటలో 6, ఖానాపురంలో 1, నల్లబెల్లిలో 4, రాయపర్తిలో 2 గ్రామ పంచాయతీలను దక్కించుకున్నాయి. శాయంపేటలో ఇద్దరు ఇండిపెండెంట్‌లు, పరకాల, నడికూడ, నల్లబెల్లి, రాయపర్తిలో ఒక్కొక్క గ్రామ పంచాయతీని దక్కించుకున్నారు.
ప్రశాంతంగా పోలింగ్..
రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా శుక్రవారం జరిగాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ఎన్నికల్లో భారీగా ఓటింగ్ నమోదయింది. 87.52 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఈ నెల 11న రెండో విడతకు నోటిఫికేషన్ జారీ చేశారు. పరకాల, నడికూడ, శాయంపేట, ఖానాపురం, నల్లబెల్లి, రాయపర్తి మండలాల్లో రెండో విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
జిల్లాలో మొత్తం 401 గ్రామ పంచాయతీలుండగా రెండో విడతలో 136 గ్రామ పంచాయతీలు, 1210 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా 33 గ్రామ పంచాయతీలు, 1210 వార్డులకు 392 వార్డులు ఏకగీవమయ్యాయి. రాయపర్తి మండలంలోని జయరాం తండాలో నాలుగు వార్డులకు నామినేషన్లు వేయలేదు. రెండో విడతలో 103 గ్రామ పంచాయతీలకు, 814 వార్డులకు ఎన్నికలు జరిగాయి.103 గ్రామ పంచాయతీలకు 309 మంది సర్పంచ్ అభ్యర్థులు, 814 వార్డులకు 1884 మంది వార్డు సభ్యులుగా పోటీ చేశారు.. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. నల్లబెల్లిలో నర్సంపేట ఎమ్మెల్యేపెద్ది సుదర్శన్‌రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ ముండ్రాతి హరిత పరకాల, శాయంపేట, నల్లబెల్లిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
87.52 శాతం ఓటింగ్..
రెండవ విడతలోని పరకాల, నడికూడ, శాయంపేట, ఖానాపురం, నల్లబెల్లి, రాయపర్తి మండలాల్లోని భారీగా ఓటింగ్ శాతం నమోదయింది. ఆరు మండలాల్లో 1,45, 023 మంది ఓటర్లు ఉండగా1,26, 931 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆరు మండలాల్లో 87.52శాతం ఓటింగ్ శాతం నమోదు కాగా అత్యధికంగా పరకాల మండలంలో 90.66 శాతం ఓటింగ్ నమోదు కాగా çశాయంపేటలో తక్కువగా 86.01 శాతం ఓటింగ్ నమోదయింది.
ఓటింగ్‌లో మహిళలే అధికం
రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళ ఓటర్లు అధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళా ఓటర్లు 72,809 మంది ఉండగా 63, 602 మహిళలు, 72, 208 పురుషులు ఉండగా 63చ 329 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గంట గంటకు పెరిగిన పోలింగ్...
ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ శాతం గంటగంటకు పెరుగుతూ వచ్చింది. మొదటి రెండు గంటలు 67.16శాతం నమోదు కాగా పోలింగ్ ముగిసే వరకు 87.52శా–బహిష్కరించిన శ్రీరామనగర్ తండా వాసులు రాయపర్తి మండలంలోని శ్రీరామనగర్‌తండా వాసులు గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. శ్రీరామనగర్ తండాను గ్రామ పంచాయతీగా చేయాలని ఓటింగ్‌లో పాల్గొనకుండా తమ నిరసన తెలిపారు. పరకాల మండలం నాగారంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. పోలీసుల రంగ ప్రవేశంతో గొడవ సద్దుమణిగింది.
మధ్యాహ్నం ఎన్నిక కౌంటింగ్
ఉదయం 7 గంటల నుంచి మద్యహ్నాం 1గంట వరకు ఎన్నికలు జరిగాయి. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్‌ను ప్రారంభించారు. రాత్రి వరకు కౌంటింగ్‌ను నిర్వహించి ఆయా గ్రామ పంచాయతీల వారీగా ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment