
సారంగపూర్ పోలింగ్ సెంటర్‌లో వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్
నిజామాబాద్‌అర్బన్: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు బోధన్ డివిజన్‌లో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ రామ్మోహన్‌రావు పేర్కొన్నారు. ఎడపల్లి మండలం నెహ్రునగర్‌లో పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ పోలీసు కమిషనర్ కార్తికేయతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పోలింగ్ నిర్వహణకు జిల్లా, రెవెన్యూ యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేసిందన్నారు. ఓటు వేయడానికి వచ్చే ఓటర్లకు తాగునీరు, వైద్యసదుపాయాలు, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, ర్యాంపులు ఏర్పాటు చేశామన్నారు.
పోలింగ్ శాతం సంతృప్తికరంగా ఉందన్నారు. గత ఎన్నికలను దృష్టిలో పె ట్టుకొని, సమస్యాత్మక ప్రాంతాలలో అవసరమైన చోట్ల అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. ఆన్‌లైన్ వెబ్‌క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షణతో పాటు సూక్ష్మ పరిశీలకులు పోలింగ్ సరళిని గమనించారని తెలిపారు.