
కడ్తాల్‌లో ప్రచారం చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి డాక్టర్ ఆలంపల్లి రమేశ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా:
రెండో విడత పంచాయతీ ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. దాదాపు వారం రోజులపాటు పోటాపోటీగా సాగిన ప్రచారానికి బుధవారం సాయంత్రం తెరపడింది. చివరి రోజు అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేశారు. రెండో దశగా ఎనిమిది మండలాల పరిధిలోని 181 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇప్పటికే 21 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 160 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 489 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
అదేవిధంగా 1,656 వార్డులకుగాను 1,400 వార్డుల్లో పోరు జరగనుంది. ఇక్కడ 3,844 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 256 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ప్రచారం ముగియడంతో అభ్యర్థులు ఇక పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టిసారించారు. తమకే ఓటేస్తామన్న వారి ఓటును కాపాడుకునేందుకు జాగ్రత్త వహిస్తున్నారు. ఇప్పటికే మద్యం పంపిణీ చేస్తుండగా.. డబ్బులు కూడా అందజేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment