ఇచ్చోడ(బోథ్): జిల్లాలో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేయడానికి ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు, వికలాంగులు, నడవలేని వారిని వాహనాలు, మంచాలపై పోలింగ్ కేంద్రాల వరకు తీసుకువచ్చి ఓటేయించారు. రెండో విడతలో బోథ్ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో 83 పంచాయతీలు, 322 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మండల కేంద్రాలతోపాటు పెద్ద పంచాయతీల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. చివరి నిమిషం వరకు కూడ ఓట్లు వేశారు. ఎన్నికలు జరిగిన 83 పంచాయతీల పరిధిలో మొత్తం 94,463 మంది ఓటర్లు ఉండగా 78,407 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటేసిన వారిలో 40,051 మంది పురుషులు ఉండగా 38,356 మంది మహిళలు ఓటు వేశారు.
పోలింగ్ జరిగింది ఇలా..
రెండో విడత పంచాయతీ ఎన్నికలలో ఆయా పంచాయతీలలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనా, 9 గంటల వరకు పోలింగ్ అంతంత మాత్రమే జరిగింది 11 గంటల వరకు తలమడుగు మండలంలో 29.19 శాతం, గుడిహత్నూర్ మండలంలో 29.51 శాతం, బోథ్ మండలంలో 21.68, బజార్‌హత్నూర్ మండలంలో 22.07, నేరడిగొండ 31.63 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. 11 గంటల నుంచి పోలింగ్ ఊపందుకుంది. బోథ్, నేరడిగొండ, బజార్‌హత్నూర్, గుడిహత్నూర్, గిర్నూర్, పిప్రి పంచాయతీల్లో మినహా ఎక్కడా ఓటర్లు బారులు తీరి కనిపించలేదు. ఓటర్లు స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి వచ్చారు. వికలాంగులు, వృద్ధులను ఆటోల్లో మోటార్ సైకిళ్ల ద్వార ఓటు వేసేందుకు కేంద్రాల వద్దకు తీసుకువచ్చి ఓట్లు వేయించారు.
బోథ్ మండలంలోని కుచ్లపూర్ పంచాయతీ సర్పంచ్‌కు 6 వార్డులకు ఏకగ్రీవంగా కాగా కేవలం ఒక్క వార్డుకే ఎన్నికలు జరిగాయి. ఒక్క వార్డు కోసం రిటర్నింగ్ ఆధికారితోపాటు ఇద్దరు ఎన్నికల సిబ్బంది ద్వారా ఎన్నికలు నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ద్వార ఓట్లు వేసిన ఓటర్లు పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ ద్వార ఓటింగ్‌కు కొంత ఇబ్బంది పడ్డట్లు కనిపించింది. నిరక్షరాసులు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలలో రెండు బ్యాలెట్ పేపర్లు ఇవ్వడంతో తికమక పడ్డారు. ఎన్నికల సిబ్బంది ఓటర్లకు ఓటు వేసే విధానాన్ని వివరించి చెప్పడంతో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. గుడిహత్నూర్ మండలంలోని మూత్నూర్‌తండాలో సర్పంచ్‌గా పోటీ చేసిన కళాబాయి తన ప్రత్యర్థి చేతిలో ఓటమి చెందడంతో పురుగులు మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించగా ఆమెకు ప్రాణపాయస్థితి తప్పింది.
రెండో విడతలో 83.6శాతం నమోదు
రెండో విడత పంచాయతీ పోరులో మొత్తం 83.6శాతం పోలింగ్ నమోదైంది. రెండో విడతలో 83 పంచాయతీలకు 322 మంది, 363 వార్డులకు 908 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బోథ్ మండలంలో 20 జీపీలకు 91 వార్డులకు ఎన్నికలు జరిగాయి. తలమడుగు మండలంలో 11జీపీలకు 89 వార్డులకు, బజార్‌హత్నూర్ మండలంలో 19 జీపీలకు, 65 వార్డులకు, గుడిహత్నూర్ మండలంలో 17 జీపీలకు 75 వార్డులకు, నేరడిగొండ మండలంలో 16 జీపీలకు 43 వార్డులకు ఎన్నికలు జరిగాయి.
ఐదు మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అత్యధికంగా నేరడిగొండ మండలంలో 88.75శాతం పోలింగ్ నమోదైంది. అతి తక్కువగా బోథ్ మండలంలో 80.34శాతం నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నేరడిగొండ మండల కేంద్రంతోపాటు వడూర్‌లో ఎస్పీ విష్టు ఎస్ వారియర్, ఉట్నూర్ డీఎస్పీ వెంకటేశ్, బజార్‌హత్నూర్ మండలంలో భూతాయి, జాతర్ల గ్రామంలో ఆదిలాబాద్ డీఎస్పీ నర్సింహరెడ్డి, బోథ్ మండలంలో ఏఎస్పీ మోహన్, ఆదిలాబాద్ ఆర్డీవో సూర్యనారయణ ఎన్నికలను పర్యవేక్షించారు.

Comments
Please login to add a commentAdd a comment