జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత నా మినేషన్ల పర్వం ముగిసింది. జిల్లాలోని ఎనిమిది మండలాలకు సంబంధించి 243 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మూడు రోజులుగా నామినేషన్లు స్వీకరిస్తుండగా ఆదివారంతో గడువు ముగిసింది. ఈ మేరకు మూడు రోజుల్లో కలిపి అన్ని పంచాయతీల సర్పంచ్, వార్డుసభ్యులస్థానాలకు 6,060 నామినేషన్లు దాఖలయ్యాయి.
చివరి రోజే అధికం
రెండో విడత ఎన్నికలు జరగనున్న గ్రామపంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు వేసేందుకు ఆదివారం చివరి రోజు గడువు. దీంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. ఈ పంచాయతీల్లో శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా.. తొలి రోజు రెండు రోజుల్లో అంతంత మాత్రంగానే నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే, చివరి రోజు కావడంతో ఎక్కువ సంఖ్యలో అందాయి. కాగా, దాఖలైన నామినేషన్లను సోమవారం పరిశీలించి వివరాలు అసంపూర్ణంగా ఉన్న వాటిని అధికారులు తిరస్కరిస్తారు. తిరస్కరణపై అప్పీల్ చేసుకునేందుకు 15వ తేదీన అవకాశం ఇస్తారు. ఇక ఈనెల 17వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు కాగా.. అదే రోజు మద్యహ్నం 3 గంటల తర్వాత తుది జాబితాలో మిగిలిన అభ్యర్థులు, వారికి కేటాయించిన గుర్తులను అధికారులు వెల్లడిస్తారు. ఈ విడత పోలింగ్ 25వ తేదీన జరగనుంది.
39ద పంచాయతీల్లో ఒక్కొక్కటే...
గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత నామినేషన్ల స్వీకరణ పర్వం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా 243 పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా 39 స్థానాలకు ఒక్కొక్కటే నామినేషన్ దాఖలైంది. ఇందులో జడ్చర్ల మండలం నుంచి 43 పంచాయతీలకు గాను ఐదు పంచాయతీల్లో ఒక్కటి చొప్పునే నామినేషన్ దాఖలు చేశారు. అలాగే, బాలానగర్ మండలంలో 37 పంచాయతీలకు ఎనిమిది, రాజాపూర్ మండలంలో 24 పంచాయతీలకు నాలుగు, మిడ్జిల్ మండలంలో 24 మండలాలకు ఒకటి, నవాబుపేట మండలంలోని 54 పంచాయతీలకు 16, మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని 26 పంచాయతీలకు రెండు చోట్ల, హన్వాడ మండలంలోని 35 గ్రామపంచాయతీలకు గాను మూడు స్థానాల్లో ఒక్కొక్కటే నామినేషన్ వచ్చింది. దీంతో ఆయా పంచాయతీల్లో పాలకవర్గాలు ఏకగ్రీవం కానున్నాయి. అయితే, నామినేషన్ల ఉపసంహరణకు 17వ తేదీ వరకు అవకాశం ఉండగా.. ఆ రోజు మరికొన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశముందని తెలుస్తోంది. దీంతో అధికారులు అదే రోజున అధికారికంగా వివరాలు వెల్లడిస్తారు.
భారీగా నామినేషన్లు
Published Mon, Jan 14 2019 7:59 AM | Last Updated on Mon, Jan 14 2019 7:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment