బ్రిటన్ ప్రధానిగా మళ్లీ కామెరాన్?
లండన్: కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాని డేవిడ్ కామెరాన్ మరో సారి ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకుంటారా ? అంటే అవుననే అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. వచ్చే ఐదేళ్లు ఆయనే ప్రధానిగా ఉంటారని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. బ్రిటన్ పార్లమెంట్లోని మొత్తం 650 స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి.
వాటిలో 316 స్థానాలు కన్జర్వేటివ్ పార్టీనే గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ మాత్రం 239 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందే అని తెలిపింది. ఎగ్జిట్ పోల్స్పై డేవిడ్ కామెరాన్ ప్రభుత్వంలోని మంత్రి మైఖల్ గోవ్ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ చెప్పింది అక్షరాల నిజం అని అన్నారు.