నోరు జారి.. ప్రధానిని చంపేశాడు! | radio presenter misreads david bowie as david cameron | Sakshi
Sakshi News home page

నోరు జారి.. ప్రధానిని చంపేశాడు!

Published Mon, Jan 11 2016 7:20 PM | Last Updated on Sun, Sep 3 2017 3:29 PM

నోరు జారి.. ప్రధానిని చంపేశాడు!

నోరు జారి.. ప్రధానిని చంపేశాడు!

ప్రముఖ పాప్ సింగర్ డేవిడ్ బోయి మరణిస్తే.. ఒక రేడియో ప్రెజెంటర్ మాత్రం నోరు జారి.. ఏకంగా బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌ మరణించినట్లు ప్రకటించేశాడు. తర్వాత నాలుక కరుచుకుని, పాప్ సింగర్ డేవిడ్ బోయి మరణించినట్లు చెప్పాడు. ప్రముఖ పాప్ గాయకుడు డేవిడ్ బోయి (69) క్యాన్సర్ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

అయితే ఫియోనా విన్షెస్టర్ అనే న్యూస్ రీడర్ మాత్రం పొరపాటున బోయి పేరుకు బదులు ప్రధాని పేరు చదివేశాడు. హార్ట్ ఎఫ్ఎం అనే రేడియో చానల్‌లో ఈ పొరపాటు దొర్లింది. దీన్ని బ్రిటిష్ ప్రధాని కూడా పెద్ద సీరియస్‌గా ఏమీ తీసుకోలేదు. డేవిడ్ బోయి మరణం తీరని లోటని మాత్రం ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement