David Bowie
-
గ్రామీ అవార్డుల్లో అడెలె హవా
లాస్ఏంజిల్స్: సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘గ్రామీ’ పురస్కారాల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. 59వ ‘గ్రామీ’ అవార్డుల్లో పాప్ సింగర్ అడెలె ఐదు అవార్డులు గెలుపొంది సత్తాచాటారు. ఆమెకు ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్(25), రికార్డ్ ఆఫ్ ద ఇయర్(హలో), సాంగ్ ఆఫ్ ద ఇయర్(హలో) అవార్డులతో పాటు.. బెస్ట్ పాప్ సోలో పర్ఫామెన్స్, బెస్ట్ పాప్ ఓకల్ ఆల్బమ్ అవార్డులను సొంతం చేసుకున్నారు. 9 విభాగాల్లో నామినేషన్ పొందిన బియోన్స్.. బెస్ట్ మ్యూజిక్ వీడియో, కాంటెంపరరీ ఆల్బమ్ అవార్డులను గెలుచుకున్నారు. డేవిడ్ బొవీకి నాలుగు పురస్కారాలు దక్కాయి. ఉత్తమ రాక్ సాంగ్(బ్లాక్స్టార్), ఉత్తమ రాక్ పర్ఫామెన్స్(బ్లాక్స్టార్) అవార్డులు డేవిడ్ బొవీకి దక్కాయి. -
నోరు జారి.. ప్రధానిని చంపేశాడు!
ప్రముఖ పాప్ సింగర్ డేవిడ్ బోయి మరణిస్తే.. ఒక రేడియో ప్రెజెంటర్ మాత్రం నోరు జారి.. ఏకంగా బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ మరణించినట్లు ప్రకటించేశాడు. తర్వాత నాలుక కరుచుకుని, పాప్ సింగర్ డేవిడ్ బోయి మరణించినట్లు చెప్పాడు. ప్రముఖ పాప్ గాయకుడు డేవిడ్ బోయి (69) క్యాన్సర్ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఫియోనా విన్షెస్టర్ అనే న్యూస్ రీడర్ మాత్రం పొరపాటున బోయి పేరుకు బదులు ప్రధాని పేరు చదివేశాడు. హార్ట్ ఎఫ్ఎం అనే రేడియో చానల్లో ఈ పొరపాటు దొర్లింది. దీన్ని బ్రిటిష్ ప్రధాని కూడా పెద్ద సీరియస్గా ఏమీ తీసుకోలేదు. డేవిడ్ బోయి మరణం తీరని లోటని మాత్రం ట్వీట్ చేశారు. -
హాలీవుడ్ లెజెండరీ సింగర్ కన్నుమూత
న్యూయార్క్: ప్రముఖ హాలీవుడ్ పాప్ గాయకుడు డేవిడ్ బోయి కన్నుమూశారు. గత వారమే 69 సంవత్సరాల్లోకి అడుగుపెట్టిన ఆయన క్యాన్సర్ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గత పద్దెనిమిదినెలలుగా డేవిడ్ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. పాప్ సింగర్ గా డేవిడ్ రికార్డు సంచలనాలు సృష్టించారు. అంతేకాకుండా ఆయన భిన్న రంగాల్లో ప్రవేశం ఉంది. స్వయంగా పాప్ సింగర్ అయిన డేవిడ్ మరోపక్క, మంచి లిరిక్ రైటర్ కూడా. అంతేకాకుండా పెయింటర్ గా, నటుడిగా రాణించడంతోపాటు విభిన్న కళా వాయిద్యాలను కూడా ఆయన వాయించగలరు. డేవిడ్ ఇద్దరు భార్యలు కాగా వారిలో ప్రస్తుతం ఆయనకు తోడుగా ఎవరూ లేరు. ముగ్గురు పిల్లలు మాత్రం ఉన్నారు.