లండన్: సామాన్యులు, రాజకీయ, సినీ ప్రముఖులు.. ఇలా అందరూ ఇటీవలఫేక్ కాల్స్ బారినపడుతున్నారు. అయితే తాజాగా బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరాన్ కూడా ఫేక్ వీడియో కాల్ బారిన పడ్డారు. డేవిడ్ కామెరాన్‌కు ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకో నుంచి వీడియో కాల్ రావటంతో ఆయన సంభాషించారు. అయితే తర్వాత కొంతసేపటికి అది ఫేక్ కాల్ అని తేలిపోయింది. ఈ విషయాన్ని యూకే విదేశాంగ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది.
‘‘ కామెరాన్‌కు వీడియో కాల్ వచ్చింది. అందులో అచ్చం ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకోలా కనిపిస్తూ ఓ వ్యక్తి మాట్లాడారు. అయితే కొంత సమయానికి అవతలివైపు ఉన్న వ్యక్తి పెట్రో పోరోషెంకోనా? కాదా? అనే అనుమానం డేవిడ్‌కు కలిగింది. దీంతో అది ఫేక్ వీడియో కాల్‌గా ఆయన గుర్తించారు. ఈ ఫేక్ వీడియో కాల్, మెసెజ్‌లు నకిలీవి’ అని విదేశాంగ విభాగం పేర్కొంది.
వీటిపై దర్యాపు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఆ నకిలీ కాలర్‌తో డేవిడ్ కామెరాన్ ఏం సంభాషించారనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఫేక్ కాలర్ కామెరాన్‌ను సంప్రదించటం కోసం మరింత సమాచారం అడిగినట్లు అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన డేవిడ్ కామెరాన్.. ఫేక్ కాల్స్, నకిలీ సమాచారాన్ని ఎదుర్కొనే ప్రయత్నం, అవగాహన ప్రజల్లో పెంచాలని భావించినట్లు విదేశాంగ కార్యాలయం పేర్కొంది.
2018లో బోరిస్ జాన్సన్ విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో అర్మేనియా ప్రధాని పేరుతో ఓ ఫేక్ కాల్ వచ్చింది. అదే విధంగా 2022లో ఇద్దరు మంత్రులకు ఫేక్ కాల్స్ రావటం వెనక రష్యా హస్తం ఉందని బ్రిటన్ ఆరోపణులు కూడా చేసింది.
Comments
Please login to add a commentAdd a comment