World First Dual Gender Stick Insect With Half Male And Half Female, Know Details - Sakshi
Sakshi News home page

Dual Gender Stick Insect: అవాక్కయ్యే విషయం.. ‘ఆడా నేనే.. మగా నేనే’..

Published Mon, Feb 21 2022 8:03 AM | Last Updated on Mon, Feb 21 2022 5:20 PM

World First Half Male And Half Female Dual Gender Stick Insect - Sakshi

Dual Gender Stick Insect That Is Half Male And Half Female: ఈ ఫొటోలో ఉన్నది చార్లీ. మిడతలాంటి కీటకం. గ్రీన్‌బీన్‌ స్టిక్‌ ఇన్‌సెక్ట్‌ అని పిలుస్తారు. బ్రిటన్‌కు చెందిన లారెన్‌ గార్‌ఫీల్డ్‌ దాన్ని పెంచుకుంటున్నాడు. ఉన్నట్టుండి ఓ రోజు చార్లీ శరీరం రంగు మారడం మొదలైంది. ఇదేమిటా అని శాస్త్రవేత్తలకు చూపిస్తే.. అవాక్కయ్యే విషయం బయటపడింది. ఎందుకంటే చార్లీ ఒక సగం ఆడ కీటకం, మరోసగం మగ కీటకమని గుర్తించారు.

సాధారణంగా ఈ రకం కీటకాల్లో మగవి ముదురు గోధుమ రంగులో చిన్నవిగా, ఆడవి లేత ఆకుపచ్చ రంగులో రెండింతలు పెద్దవిగా ఉంటాయి. చార్లీ ఆడకీటకంలా పెద్ద సైజులో ఒకవైపు ఆకుపచ్చ రంగులో ఉండగా, మరోవైపు ముదురు గోధుమ రంగులో మగ కీటకం లక్షణాలు ఉన్నాయి. ఈ తరహా కీటకాల్లో ఈ లక్షణాన్ని గుర్తించడం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు తేల్చడంతో.. పరిశోధనల కోసం లండన్‌ నేచురల్‌ హిస్టరీ మ్యూజియానికి ఇచ్చేశాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement