insect
-
అనకాపల్లిజిల్లా కోనాంలో కోటి రూపాయల కీటకం ప్రత్యక్షం
-
AP: గిరిజనుడికి చిక్కిన కోటి రూపాయల కీటకం!
సాక్షి,అనకాపల్లిజిల్లా: ఆంధ్రప్రదేశ్‌లోని మాడుగుల నియోజకవర్గం కోనాంలో కోటి రూపాలయ కీటకం ప్రత్యక్షమైంది. అడవికి వెళ్లిన గిరిజనుడికి వింత కీటకం కనిపించడంతో దానిని ఆకులో చుట్టి ఇంటికి తీసుకువచ్చాడు. నిజానికి ఆ కీటకం పేరు స్టాగ్బీటిల్. వింత ఆకారంలో ఉండటంతో ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది. ప్రపంచంలో అత్యంత అరుదైన కీటకంగా స్టాగ్బీటిల్కు గుర్తింపు ఉంది. ఔషధ తయారీలో ఈ కీటకాన్ని వాడతారని తెలుస్తోంది. కీటకం విలువ మార్కెట్లో కోటి రూపాయలకుపైగా ఉంటుందని ప్రచారం. అయితే ఆ గిరిజనుడికి ప్రస్తుతం కీటకాన్ని ఏం చేయాలో తెలియక ఇంటివద్దే ఉంచుకున్నాడు. అడవిలో తిరిగే కీటకానికి ఏం తిండి పెట్టాలో తెలియక దాని ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం..ఏకంగా ఓ లగ్జరీ కారు ధర..!
పురుగే కదా అని తీసిపారేయ్యకండి. ఎందుకంటే..? కొన్ని పురుగులు మనం ఊహించనంత ఖరీదైనవిగా కూడా ఉంటాయి. అలాంటి కోవకు చెందిందే ఈ కీటకం. ఈ పురుగు ధర వింటే నోరెళ్లబెడతారు. అంత ధర ఎందుకంటే..?ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకాలలో 'స్టాగ్ బీటిల్' ఒకటి. ఒక స్టాగ్ బీటిల్ విలువ ఏకంగా రూ. 75 లక్షలు. ఎందుకుంటే దీన్ని అదృష్ట చిహ్నంగా పరిగణిస్తారట. ఈ కీటకాన్ని ఉంచుకుంటే ఒక్క రోజులనే లక్షాధికారి అవుతారని నమ్ముతారట. ఈ కీటకాలు చెక్కలపై ఆధారపడి జీవించే జీవి. అటవీ పర్యావరణంలో ఇది చాలా ముఖ్య పాత్ర పోషిస్తోంది. లండన్ ఆధారిత నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకారం.. ఈ కీటకాలు 2 నుంచి 6 గ్రాముల మధ్య బరువు ఉంటాయి. సగటు జీవితకాలం 3 నుంచి 7 ఏళ్లు. మగవారి పొడవు 35 నుంచి 75 మిమీ అయితే, ఆడవారు 30 నుంచి 50 మిమీ పొడవు. వీటిని ఔషధ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తారు.అవి ఎక్కడ ఉంటాయంటే?స్టాగ్ బీటిల్స్ వెచ్చని, ఉష్ణమండల వాతావరణంలో వృద్ధి చెందుతాయి. చల్లని ఉష్ణోగ్రతలు వీటికి పడదు. ఇవి సహజంగా అడవులలో నివసిస్తాయి. ఎక్కువగా ముళ్లపొదలు, సాంప్రదాయ తోటలు, పార్కులు, తోటలు వంటి పట్టణ ప్రాంతాలలో కూడా కనిపిస్తాయి. ఇవి చనిపోయిన వృక్ష కలపను ఆవాసంగా చేసుకుని జీవిస్తాయి. ఏమి తింటాయంటే..?అడల్ట్ స్టాగ్ బీటిల్స్ ప్రధానంగా చెట్ల సాప్ ద్రవాన్ని, కుళ్ళిన పండ్ల నుండి వచ్చే రసం వంటి తీపి ద్రవాలను తింటాయి. లార్వాదశలో ఇవి తీసుకొన్న ఆహారం నుంచి వచ్చే శక్తిపైనే అధికంగా ఆధారపడతాయి. తొలిదశలో ఇవి కలపను తన పదునైన దవడలతో చీల్చి తింటాయి. కేవలం చనిపోయిన మొక్కల కలపనే తింటాయి. అయితే చక్కటి వృక్ష సంపదకు హాని చేయవు. కేవలం మృత వృక్షాలను మాత్రమే ఆహారంగా తీసుకొంటాయి.(చదవండి: మిస్ సుప్రానేషనల్ 2024 టైటిల్‌ని దక్కించుకున్న ఇండోనేషియా బ్యూటీ!) -
అత్యంత ఖరీదైన కీటకం..ధర ఏకంగా రూ. 65 లక్షలు పైనే..
ఈ ప్రపంచంలో ఎన్నో జంతువులు, కీటకాలు ఉంటాయి. అందులో కొన్నింటిని మనం ఆహారంగా తీసుకుంటాం. కొన్ని మన ప్రాణాలకు ప్రమాదకరం. అయితే ఒక కీటకం ధర ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలవడం విశేషం. దీని ధర ముందు బీఎండబ్ల్యూ, ఆడీ కార్లకు కూడా బలదూర్ అనిపించేలా ఉంది. అయినా ఒక కీటకం ఎందుకు అంత ధర పలుకుతుంది? దాని వల్ల ఉపయోగం ఏంటీ..? అంటే.. స్టాగ్ బీటిల్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం. ఇది కేవలం 2 నుంచి 3 అంగుళాల సైజులో ఉంటుంది. చెత్తలో ఉండే ఈ కీటకాన్ని జపనీస్ పెంపకందారుడు ఏకంగా 65 లక్షలుకు విక్రయించాడు. ఇప్పుడు అది ఏకంగా కోటి పైనే పలుకుతోందట. ప్రజలు కూడా ఈ అరుదైన కీటకాన్ని కొనుగోలు చేయడానికి కోట్లు వెచ్చిస్తుండటం విశేషం. స్టాగ్ బీటిల్స్ లుకానిడే కుటుంబానికి చెందినవి, ఇందులో దాదాపు 1,200 రకాల కీటకాలు ఉన్నాయి. ఈ భూమిపై ఉన్న అత్యంత వింతైన చిన్న కీటకం ఇది. చూడటానికి నల్లగా ఉండి తల నుంచి పొడుచుకు వచ్చిన కొమ్ముల ఉంటాయి. చెత్తలో ఉండే స్టాగ్ బీటిల్స్ కుళ్లిన కలపలోన ద్రవాలు, పండ్లరసం, చెట్ల రసం వంటి వాటినే ఆహారంగా తీసుకుంటాయి. ఇవి ఎక్కువగా ద్రవాల మీద ఆధారపడతాయి. ఎందుకంటే ఇవి తినలేవు. ఈ కీటకం సుమారు 7 సంవత్సరాలు జీవిస్తుందట. అయితే ఇది స్టాగ్ బీటిల్ అని వాటి తలపై ఉన్న కొమ్ముల ఆధారంగా గుర్తిస్తారట. అయితే వీటిని వివిధ రకాల మందుల తయారీలో వినియోగిస్తారు. అందువల్లే ఇది అంత ఖరీదు. వీటిలో మగ స్టాగ్ బీటిల్స్ పెద్ద దవడలు కలిగి ఉండగా, ఆడవారి దవడలు, మగవారి కంటే బలంగా ఉంటాయి. ఇక ఆడ స్టాగ్ బీటిల్స్ తరచుగా నేలపైనే కనిపిస్తాయి. ఎందుకంటే..? గుడ్డు పెట్టేందుకు ఎల్లప్పుడూ నేలపై సంచరిస్తుంటాయి. అయితే ఈ కీటకాలు పెద్దవి అయిపోయాక గట్టి చెక్కను తినలేవట. దాంతో లార్వా కాలంలో ఏర్పడిన కొవ్వు నిల్వలపై ఆధారపడతాయి. శీతల వాతావరణం స్టాగ్ బీటిల్స్‌కు తగినది కాదు, ఎందుకంటే..? ఇది లార్వా ప్రక్రియను పొడిగించగలదు. శీతాకాలంలో చాలా కీటకాలు చనిపోతాయి, కాబట్టి వెచ్చని ప్రదేశాలు వాటికి ఉత్తమమైనవి. దీన్ని ఎక్కువగా ప్రమాదకరమైన వ్యాధులకు మందులు తయారు చేయడంలో ఉపయోగిస్తారట. అందువల్లే బీఎండబ్ల్యూ, ఆడీ కార్లను తలదన్నేలా అత్యంత ధర పలుకుతోంది. అయితే ఈ జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉండటం బాధకరం. (చదవండి: చాక్లెట్, కెల్లాగ్స్ చాకోస్‌లో పురుగుల కలకలం! అలాంటివి వెంటనే తిరిగిచ్చేసి ఉచితంగా మరొకటి..) -
సికాడాల దండయాత్ర.. వణుకుతున్న అమెరికా!
న్యూయార్క్: మిడతల దండును జ్ఞాపకం చేసుకుంటేనే భయం వేస్తుంది. గ్రీకు, అరేబియా గుండా వాయువ్య భారతదేశం వైపుగా మిడతల దండు ప్రయాణించి.. వ్యవసాయానికి అపార నష్టాన్ని కలిగించింది. అచ్చం అలాగే ఈ ఏడాది సికాడా అనే కీటకాల బెడద అమెరికాను వణికిస్తోంది.. అసలు ఈ సికాడా అంటే ఏంటో? వాటి ప్రమాదం ఏంటో తెలుసుకుందాం పదండి..! భూమిపై ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. వివిధ రకాల జీవన చక్రాలను కలిగి ఉన్నాయి. కొన్ని రాత్రిళ్లు పడుకుంటే మరికొన్ని మేల్కొంటాయి. కొన్ని భూమిలోపల ఉంటే మరికొన్ని భూమిపై, కొన్ని జీవనకాలమంతా పొదుగే దశలోనే ఉంటే మరికొన్నింటికి స్వల్పకాలం ఇలా ఎన్నో రకాల జీవులు ఉన్నాయి. ఇలానే ఓ విశిష్ట లక్షణాలు కలిగిన జీవరాశుల్లోనిదే సికాడా. సికాడాలు ఈ ఏడాది అమెరికా రాష్ట్రాలపై దండయాత్ర చేయనున్నాయి. సికాడా పేరులాగానే వీటి జీవనచక్రం కూడా వింతగా ఉంటుంది. సికాడా అంటే.. సికాడా అనేది కీటకాల సూపర్ ఫ్యామిలీ. సికాడొడియా, హెమిప్టెరా క్రమం. అంటే.. లీఫ్‌హాపర్స్(ఆకులను తినే జాతి), ఫ్రాగ్హాపర్(ఒకే ఎత్తు ఎగురుతూ, గెంతుతూ ఉండేవి). అవి సాధారణంగా మిడతల ఆకారంలో ఉంటాయి. సికాడాలు మానవులకు హానికరం కావు. కానీ చెట్ల ఆకులను, రసాలను పీల్చుతాయి. చెట్లుగా భావించి మనుషుల, జంతువుల శరీరాలపై వాలుతాయి. వ్యవసాయానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. నిద్రాణస్థితి నుంచి దండుగా ప్రయాణం.. సికాడా బ్రూడ్-XIX(19), సికాడా బ్రూడ్ XIII(13) అనే రెండు రకాల సికాడా గ్రూప్‌లు 2024లో ఉద్భవించనున్నాయి. ఈ సికాడాలకు ప్రతి 13 నుంచి 17 ఏళ్లకు ఒకసారి నిద్రాణస్థితి నుంచి బయటకు వచ్చే లక్షణం ఉంటుంది. ఈ ఏడాది 2024లో అమెరికాలోని దాదాపు 18 రాష్ట్రాల గుండా ఈ సికాడా కీటకాలు గుంపుగా ప్రయాణం చేస్తాయి. 15 రాష్ట్రాలపై ప్రభావం.. 'సికాడా బ్రూడ్ XIX(19)ను "ది గ్రేట్ సదరన్ బ్రూడ్"గా పిలుస్తారు. వీటికి 13 సంవత్సరాల జీవిత చక్రం ఉంటుంది. అమెరికా భౌగోళిక ప్రాంతం ఆధారంగా అతిపెద్ద గుంపు అని కనెక్టికట్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు తెలిపారు. ఆగ్నేయ అమెరికాలో ఇవి సర్వసాధారణం. 15 రాష్ట్రాలపై ప్రభావం చూపుతాయి. మేరీల్యాండ్ నుండి జార్జియా వరకు అలాగే మిడ్‌వెస్ట్‌లో అయోవా నుండి ఓక్లహోమా వరకు గుర్తించబడ్డాయి. అలాగే ఇల్లినాయిస్ ఉత్తర ప్రాంతంలో కూడా కనిపిస్తాయి. 2011లో చివరిసారి ప్రయాణించాయని సికాడా మానియా అనే కీటకాల వెబ్సైట్ పేర్కొంది. అలబామా, అర్కాన్సాస్, జార్జియా, ఇల్లినాయిస్, ఇండియానా, కెంటుకీ, లూసియానా, మిస్సౌరీ, మిస్సిస్సిప్పి, నార్త్ కరోలినా, ఓక్లహోమా, సౌత్ కరోలినా, టేనస్సీ, వర్జీనియాల్లో ఈ ఏడాది సికాడా బ్రూడ్ XIX కనిపిస్తుంది. అవి మే మధ్యలో ప్రారంభమై జూన్ చివరిలో ముగుస్తాయి. భూమిలో 8 అంగుళాల నేలలో, 64 డిగ్రీల ఫారెన్‌హీట్ వాతావరణ పరిస్థితుల్లో బతుకుతుంటాయి. ఐదు రాష్ట్రాలపై సికాడా బ్రూడ్-XIII.. అలాగే సికాడా బ్రూడ్-XIII చివరిసారిగా 2007లో వచ్చాయి. ఇవి ప్రతీ 17 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే దర్శనమిస్తాయి. సికాడా బ్రూడ్ XIII ఐదు రాష్ట్రాలను ప్రభావితం చేస్తుంది. అయోవా, విస్కాన్సిన్, ఇల్లినాయిస్, ఇండియానా, మిచిగాన్ రాష్ట్రాలపై ప్రభావం చూపుతాయి. ఎప్పుడు వస్తాయి? మే నెల అంతం జూన్ సమయంలో చెట్ల ఆకులు చక్కగా పెరుగుతాయి. ఐరిస్ పువ్వులు అదే సమయంలో చిగురిస్తాయి. ఈ సమయంలో వచ్చిన వర్షంతో ఈ సికాడాలు భూమి నుంచి బయటకు వస్తాయి. వీటిరాకతో వ్యవసాయానికి తీవ్ర నష్టం కలుగుతుంది. ఎందుకు బయటకు వస్తాయి..? సికాడాలు భూమిలో చెట్ల వేర్ల రసాలను పీల్చుతూ ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. నేలలో బొరియలు చేసుకుంటూ నిద్రాణ స్థితిలో జీవనం సాగిస్తాయి. ఎప్పుడైతే తమ యవ్వన దశ రాగానే భూమి నుంచి బయటకు వస్తాయి. మిడతల దండు లాగే లక్షల్లో మగ సికాడాలు, ఆడ సికాడాలు కలిసి ప్రత్యేకమైన ధ్వనిని చేసుకుంటూ ప్రయాణం చేస్తాయి. ఆ సమయంలోనే మగసికాడాలు, ఆడ సికాడాలతో సంభోగం జరుపుకుంటాయి. ఆడ సికాడాలు తమ గుడ్లను చెట్ల బెరడుల్లో గుంతలు చేసి భద్రపరిచి వెళ్లిపోతాయి. అంతటితో వాటి జవనచక్రం ముగుస్తుంది. చెట్ల బెరడుల్లో ఉన్న గుడ్లు పొదిగి సికాడా కీటకాలు భూమిపై పడతాయి. అనంతరం భూమిలోపలికి ప్రయాణిస్తాయి. తగినంత ఉష్ణోగ్రత చేరుకోగానే ఆగిపోతాయి. నేలలనే నిద్రాణ స్థితిలో ఉండి మళ్లీ కాలవ్యవధి వచ్చే వరకు జీవనం సాగిస్తుంటాయి. పరిశోధకులకు సవాలు.. బ్రిటానికా ప్రకారం.. ధ్వనిని ఉత్పత్తి చేసే కీటకానికి రెండు జతల రెక్కలు ఉన్నాయి. ఒక ప్రముఖ కన్ను, మూడు సాధారణ కళ్లు ఉన్నాయి. 0.8 నుండి 2 అంగుళాల పొడవు పెరుగుతాయి. ప్రస్తుతం గుర్తించబడినవి మొత్తం 7 జాతులు, ఐదు వేర్వేరు బ్రూడ్లు ఉన్నాయని పరిశోధనలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా, 3,000 రకాల సికాడాలు ఉన్నాయి. వీటి జీవననిర్మాణాన్ని అర్థం చేసుకోవడం పరిశోధకులకు సవాలుగా మారింది. ఇదీ చదవండి: Pyramid Secrets: రోబో కంటికి అబ్బురపరచే పిరమిడ్ రహస్యాలు! -
మాకొద్దు బాబోయ్.. మాంసం చూస్తే వణికిపోతున్న అమెరికన్లు.. ఆ పురుగు వల్లనే ఇదంతా!
మాంసం చూస్తే ఎవరికైనా తినాలనిపిస్తుంది. ఇంకొంత మందికి ముక్క లేకపోతే ముద్ద దిగదని అంటారు. అయితే కొందరు అమెరికన్లకు మాత్రం మాంసం చూస్తేనే ఒళ్లంతా అలర్జీ వచ్చేసి వాంతులతో వస్తున్నాయట. దీనిపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు చివరికి ఇది ఆల్ఫా – గాల్ సిండ్రోం అని కనుగొన్నారు. అసలు ఆ వ్యాధి ఏంటి, ఇలా ఎందుకు జరుగుతోందంటే.. ఆల్ఫా గాల్ అనేది ఒక ఫుడ్ అలెర్జీ. ఈ సిండ్రోం ఉన్న వారికి మాంసం, లేదా జంతువుల ఉత్పత్తులను ఆహారంగా ఇస్తే అలర్జీకి గురవుతారు. ఇది లోన్ స్టార్ టిక్ అనే కీటకం కుట్టడం వల్ల వ్యాపిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 2010 తర్వాతి నుంచి అమెరికాలో ఆల్ఫా గాలా సిండ్రోం కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గతంలో ప్రభుత్వ విడుదల చేసిన నివేదికలో 100,000 మందికి ఉండగా.. తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆ సంఖ్యను మరింత పెరిగి దాదాపు 450,000 మంది ఈ సిండ్రోం బారిన పడినట్లు పేర్కొన్నారు. 2011 లో పరిశోధకులు మొదటగా లోన్ స్టార్ టిక్ అనే కీటకం కుట్టడం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని కనుగొన్నారు. ఆ ప్రాంతంలోని ఓ ప్రముఖ క్లినిక్ ప్రకారం, ఇటువంటి కేసులు సాధారణంగా దక్షిణ, తూర్పు, మధ్య యునైటెడ్ స్టేట్స్లో ఎక్కువగా ఈ వ్యాధి వ్యాపిస్తున్నట్లు తెలిపింది. లాంగ్ ఐలాండ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ ఎరిన్ మెక్గింటీ దీని గురించి మాట్లాడుతూ, గత దశాబ్దంలో ఆమె సిండ్రోమ్‌తో సుమారు 900 మందిని చూసిందని చెప్పుకొచ్చారు. ఇది వేగంగా వ్యప్తి చెందుతుందని ఆమె చెప్పారు. జింకల ద్వారా ఈ కీటకం నగరాల సరిహద్దుల్లోకి అక్కడి నుంచి వివిధ మార్గాల్లో జనావాసాల్లోకి వస్తోంది. దీంతో ఈ అలర్జీ బారిన పడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. చదవండి నాన్న చనిపోయారు.. కానీ ఆయన గుండె చప్పుడు విన్నారు.. -
రోబో చిన్నదే.. ప్రయోజనాలెన్నో!
ఈ రోబో కీటకాన్ని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల రూపొందించారు. తేనెటీగలు ఎగిరే తీరును గమనించి, దీనిని రూపొందించారు. ఇది ఎలాంటి ఇరుకైన ప్రదేశాల్లోకైనా తేలికగా చొరబడగలదు. దీని ముందు రెక్కలు వెనుక రెక్కల కంటే భిన్నమైన వేగంతో ప్రకంపిస్తాయి. (ఇదీ చదవండి: తక్కువ ధరలో బెస్ట్ గ్యాడ్జెట్స్.. ఒకదాన్ని మించి మరొకటి!) రెండువైపుల రెక్కలనూ కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు. భూకంపాల వంటి ప్రమాదాలు జరిగినప్పుడు శిథిలాల అట్టడుగున చిక్కుకున్న వారిని కనుగొనడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇరుకిరుకు ప్రదేశాల్లోని పరిస్థితులను పరిశీలించేందుకు, వాటికి అనుగుణమైన చర్యలు చేపట్టేందుకు దోహదపడుతుంది. -
తలను 360 డిగ్రీలు సులభంగా తిప్పగల ఏకై క జీవి.. శత్రువును వెనుక నుంచి సైతం
జనగామ: జిల్లా కేంద్రంలోని ఏకశిల విద్యా కళాశాల ఆవరణలో అరుదైన కీటకం బుధవారం ప్రత్యక్షమైంది. డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్‌రెడ్డి ఈ కీటకాన్ని గుర్తించారు. వయోలిన్‌ను పోలి ఉన్న ఈ కీటకాన్ని ‘ది వాండరింగ్ వయోలిన్ మాంటిస్’గా పిలుస్తారని ఆయన పేర్కొన్నారు. ఎండిన ఆకు రూపంలో కనిపించే ఈ కీటకం.. సన్నని కర్ర పుల్ల మాదిరి దేహంతో ఉండి పరిసరాల్లో కలిసి పోతోంది. ఈ కీటకం నేలపై నడుస్తున్న క్రమంలో గాలిలో కదులుతున్న కర్రలా కనిపిస్తోంది. ‘తలను 360 డిగ్రీలు సులభంగా తిప్పగల ఏకై క జీవి.. శత్రువును వెనుక నుంచి కూడా చూడగలదు.. ఒకే చెవి ఉన్నప్పటికీ అద్భుతమైన వినికిడి శక్తి కలిగి ఉంటుంది’ అని రత్నాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మానవ అవాసాల విస్తరణ, పచ్చదనం లోపించడంతో వీటి సంఖ్య తగ్గుతున్నట్లు వివరించారు. -
బిజినెస్ క్లాస్ ప్యాసింజర్‌కి షాక్, ట్వీట్ వైరల్: ఎయిరిండియా స్పందన
సాక్షి,ముంబై: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా మరోసారి వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ షెఫ్ విమానంలో భోజనంపై మండిపడిన మరునాడే విమానంలో అందించిన భోజనంలో పురుగు కనిపించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎయిరిండియా బిజినెస్ క్లాస్ విమానంలో తనకెదురైన అనుభవంపై ఓ ప్రయాణికుడు చేసిన ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ముంబై నుంచి చెన్నైకి వెళ్తున్న బిజినెస్ క్లాస్ ప్యాసింజర్ మహావీర్ జైన్ ఎయిరిండియా బిజినెస్ క్లాస్ విమానంలో వడ్డించిన భోజనంలో పురుగు అంటూ ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. ఇంత అపరిశుభ్రమా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై టాటా యాజమాన్యంలోని క్యారియర్ స్పందిస్తూ, కఠినమైన చర్యల తీసుకుంటామని పేర్కొంది. (ఇదీ చదవండి: ఎయిరిండియా మెగా డీల్: భారీ ఉద్యోగాలు, సీఈవో కీలక ప్రకటన) కాగా మరొక సంఘటనలో నాగ్‌పూర్-ముంబై 0740 విమానంలో ప్రయాణించిన చెఫ్ సంజీవ్ కపూర్ కూడా విమానంలో వడ్డించే ఆహారంపై సంస్థపై మండిపడ్డారు. తనకు పుచ్చకాయ దోసకాయతో కూడిన కోల్డ్ చికెన్ టిక్కా,మినిస్క్యూల్ ఫిల్లింగ్‌తో కూడిన శాండ్విచ్, డెజర్ట్, షుగర్ సిరప్ అందించారని ఆరోపించారు. భారతీయులు అల్పాహారం ఇదా? 'వేక్ అప్ ఎయిరిండియా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అభిప్రాయం చాలా ముఖ్యమైంది అంటూ సంజీవ్ కపూర్ ట్వీట్‌పై స్పందించిన ఎయిరిండియా ఇకపై ఆన్‌బోర్డ్ ఫుడ్ మంచిగా ఉంటుందనే హామీని కూడా ఇచ్చింది. (టెస్లా జోష్: మస్త్..మస్...దూసుకొచ్చిన ఎలాన్ మస్క్) @airindiain insect in the meal served in businessclass pic.twitter.com/vgUKvYZy89 — Mahavir jain (@mbj114) February 27, 2023 -
మిర్చిపై ‘నల్ల తామర’ పంజా!
సాక్షి, మహబూబాబాద్: గత ఏడాది మిర్చి రైతులను గగ్గోలు పెట్టించిన నల్లతామర పురుగు మళ్లీ పంజా విసురుతోంది. మెల్లగా 40శాతం పంటకు వ్యాపించిన పురుగు.. మిర్చి పంటను నిలువునా నాశనం చేస్తోంది. ఎన్ని మందులు కొట్టినా ఫలితం ఉండటం లేదని, పూత రాలిపోయి మొక్కలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఈ పురుగు సోకిన విషయం తెలిసిన నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్సెక్ట్ రిసోర్సెస్ (ఎన్‌బీఏఐఆర్)–బెంగళూరు, సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ సెంటర్ (సీఐపీఎంసీ)–హైదరాబాద్ శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. పలు జిల్లాల్లో పంటలను పరిశీలిస్తూ.. రైతులకు సూచనలు ఇస్తున్నారు. గత ఏడాది ఆగమాగం చేసి.. గత ఏడాది రాష్ట్రంలో మిర్చి పంటకు నల్లతామర పురుగు సోకింది. మొదటి పూత సమయంలోనే ప్రతాపం చూపింది. వేల ఎకరాలకు విస్తరించి తీవ్ర నష్టం కలగజేసింది. చాలా మంది రైతులు పెట్టుబడి కూడా చేతికి రాక అప్పుల పాలయ్యారు. మనస్తాపానికి గురై ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే 24మంది మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే మిర్చికి మంచి ధర ఉండటంతో ఈసారైనా పంట బాగుంటే అప్పులు తీర్చుకోవచ్చన్న ఉద్దేశంతో అదే పంట వేశారు. మొత్తంగా రాష్ట్రంలో 2,41,908 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఇందులో చాలా మంది రైతులకు మొదటి పూత దశ వరకు పంట బాగానే ఉండటంతో సంతోషపడ్డారు. కానీ మొదటి కాత పడిన కొద్దిరోజులకే మళ్లీ నల్లతామర పురుగు సోకింది. ఇప్పటివరకు 90వేల ఎకరాలకుపైగా వ్యాపించింది. మరింతగా విస్తరిస్తుండటంతో రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. భూమి చదును చేయడం నుంచి విత్తనాల సేకరణ, ఎరువులు, పురుగు మందులదాకా మిర్చి సాగుకోసం ఇప్పటివరకు ఎకరానికి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టారు. సోకిన ఒకట్రెండు రోజుల్లోనే.. నల్లతామర పురుగు సోకితే ఒకట్రెండు రోజుల్లోనే పంటకు తీవ్ర నష్టం జరుగుతోందని రైతులు చెప్తున్నారు. చేనులో పూలన్నీ రాలిపోతున్నాయని.. చెట్టు మోడుబారడం మొదలవుతోందని అంటున్నారు. పంటను రక్షించుకునేందుకు రకరకాల మందులు వాడామని.. పది, పదిహేను రోజుల్లో ఎకరానికి రూ.40 వేలకుపైగా విలువచేసే మందులు పిచికారీ చేసినా లాభం లేదని వాపోతున్నారు. జిల్లాల్లో శాస్త్రవేత్తల పరిశీలన నల్లతామర సోకిన విషయం తెలుసుకున్న ఎన్‌బీఏఐఆర్ శాస్త్రవేత్తలు కె.శ్రీదేవి, రచన, కందన్, సీఐపీఎంసీ శాస్త్రవే త్తలు సునీత, నీలారాణి, రవిశంకర్‌లతోపాటు ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు శ్రీధర్, వెంకటరమణ, ఇతర ఉద్యాన శాస్త్ర వేత్తలు వారం రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మి ర్చిసాగు అధికంగా ఉన్న ఖమ్మం, మహబూబాబాద్, గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, జయశంకర్ భూపా లపల్లి, వరంగల్ జిల్లాలకు వెళ్లి.. గత ఏడాదికి ఇప్పటికి పురుగులో వచ్చిన తేడా, పంటను ఆశించిన తీరును పరి శీలించారు. నల్ల తామర నియంత్రణ కోసం బవేరియా భాసియానా, లెకానీసీలియం లెకానీ, సూడోమోనాస్, బ్యాసిల్లస్, సబ్‌టైలిస్ పౌడర్లను ప్రయోగత్మకంగా రైతుల మిర్చి తోటల్లో పిచికారీ చేయించారు. కీటకనాశని జీవ శిలీంధ్రాలతో ఫలితం నల్ల తామర పురుగు నివారణ కోసం ఎన్‌బీఏఐఆర్ శాస్త్రవేత్త కందన్ నేతృత్వంలో తయారుచేసిన కీటకనాశని జీవ శిలీంధ్రాలు మంచి ఫలితం ఇస్తున్నాయి. కర్ణాటకలోని మిర్చి తోటలపై ప్రయోగాత్మకంగా పిచికారీ చేశాం. తెలంగాణలోనూ అదే రకమైన నల్లతామర పురుగు ఆశించినట్టు నిర్ధారించాం. ఇక్కడా బ్యాలిల్లస్, సూడోమోనాస్ తదితర మందులను పిచికారీ చేయించాం. పంటలు రికవరీ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాం. – కె.శ్రీదేవి, ఎన్‌బీఏఐఆర్ శాస్త్రవేత్త రైతులు జాగ్రత్తలు పాటించాలి తెలంగాణలో మిర్చి అధికంగా సాగుచేసిన ఏడు జిల్లాల్లో పర్యటించాం. పురుగు తీవ్రత గత ఏడాది కన్నా తక్కువగా ఉంది. గత ఏడాది సన్నమిర్చి రకాలకు రాలేదు. కానీ ఇప్పుడు తేజ రకం విత్తనాలకు ఎక్కువగా ఆశిస్తున్నట్టు గుర్తించాం. దీనికి విరుగుడు బ్యాక్టీరియా, శిలీంధ్రాలతో తయారు చేసిన కీటక నాశనులే అని ప్రయోగాల్లో తేలింది. రైతులు విత్తన శుద్ధి, పంట మార్పిడి మొదలైన సస్యరక్షణ చర్యలు కూడా పాటించాలి. – లీలారాణి, సీఐపీఎంసీ శాస్త్రవేత్త -
అవాక్కయ్యే విషయం: ఒక సగం ఆడ.. మరో సగం మగ
Dual Gender Stick Insect That Is Half Male And Half Female: ఈ ఫొటోలో ఉన్నది చార్లీ. మిడతలాంటి కీటకం. గ్రీన్‌బీన్ స్టిక్ ఇన్సెక్ట్ అని పిలుస్తారు. బ్రిటన్‌కు చెందిన లారెన్ గార్ఫీల్డ్ దాన్ని పెంచుకుంటున్నాడు. ఉన్నట్టుండి ఓ రోజు చార్లీ శరీరం రంగు మారడం మొదలైంది. ఇదేమిటా అని శాస్త్రవేత్తలకు చూపిస్తే.. అవాక్కయ్యే విషయం బయటపడింది. ఎందుకంటే చార్లీ ఒక సగం ఆడ కీటకం, మరోసగం మగ కీటకమని గుర్తించారు. సాధారణంగా ఈ రకం కీటకాల్లో మగవి ముదురు గోధుమ రంగులో చిన్నవిగా, ఆడవి లేత ఆకుపచ్చ రంగులో రెండింతలు పెద్దవిగా ఉంటాయి. చార్లీ ఆడకీటకంలా పెద్ద సైజులో ఒకవైపు ఆకుపచ్చ రంగులో ఉండగా, మరోవైపు ముదురు గోధుమ రంగులో మగ కీటకం లక్షణాలు ఉన్నాయి. ఈ తరహా కీటకాల్లో ఈ లక్షణాన్ని గుర్తించడం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు తేల్చడంతో.. పరిశోధనల కోసం లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియానికి ఇచ్చేశాడు. -
చేదు వేపకు.. చెడ్డ రోగం!
సాక్షి, హైదరాబాద్: పురుగులు, కీటకాలను నివారించేందుకు, మరెన్నో సమస్యలకు మందుగా వాడే వేప చెట్లను.. ఓ చిన్న కీటకం, మూడు శిలీంద్రాలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. చెట్లను నిలువునా మాడ్చేస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఏ ఊళ్లో చూసినా వేపచెట్ల కొమ్మలు ఎండిపోతున్నాయి. అప్పటివరకు బాగున్న చెట్లు కూడా.. చిగుళ్లు, ఆకులు, కొమ్మలు వరుసగా ఎండిపోయి నిట్టనిలువుగా మాడిపోయినట్టు కనిపిస్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు రావడంతో.. వ్యవసాయ విశ్వవిద్యాలయం రంగంలోకి దిగింది. వర్సిటీ పరిశోధన విభాగం సంచాలకుడు జగదీశ్వర్ ఆధ్వర్యంలో నిపుణులు టి.కిరణ్‌బాబు, జి.ఉమాదేవి, ఎన్.రామ్‌గోపాల్‌వర్మల బృందం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వేపకొమ్మలు సేకరించి పరిశీలించింది. తెగులు సోకిన భాగాలను ల్యాబ్‌లో పరీక్షించి సమస్యకు కారణాలను గుర్తించింది. వేపచెట్లను కాపాడే చర్యలపై ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. కానీ ప్రభుత్వ పరంగా చర్యలేమీ లేకపోవటంతో రోజురోజుకు వేప చెట్లు మాడిపోతూనే ఉన్నాయి. కీటకం కొరికి.. శిలీంద్రాలు (ఫంగస్) ఆశించి.. వేపకొమ్మల చివరిభాగంలో టిమస్కిటో బగ్ అన్న కీటకం కొరికి రసాన్ని పీల్చడంతో ఈ సమస్య మొదలైందని పరిశోధకులు గుర్తించారు. ఈ కీటకాలు ముందునుంచే ఉన్నా.. దానికితోడుగా కొన్నిరకాల శిలీంద్రాలు వ్యాపించడంతో సమస్య ముదిరిందని తేల్చారు. వేపచెట్లపై టిమస్కిటో బగ్ కొరికేసి రసం పీల్చడంతో ఆ ప్రాంతంలోని చిగుళ్లు ఎండిపోవటం మొదలవుతోంది. అదేచోట కొన్నిరకాల శిలీంద్రాలు పాగా వేసి.. మెల్లగా విస్తరిస్తూ చెట్టు నిలువునా మాడిపోయేలా చేస్తున్నాయి. ఇందులో ‘ఫోమోప్సిస్ అజాడిరెక్టే’ అన్న శిలీంద్రం తీవ్ర విధ్వంసానికి కారణమవుతోందని గుర్తించారు. వ్యవసాయ వర్సిటీ పరిశోధన బృందం చేసిన కల్చర్ టెస్టుల్లో మూడొంతులకుపైగా ఈ శిలీంద్రమే కనిపించింది. ఆ తర్వాత ఫ్యుజేరియం, కర్వులేరియా అనే ఫంగస్‌లు ప్రభావం చూపుతున్నట్టు తేలింది. ఇవి కాకుండా మరో ఏడెనిమిది రకాల ఫంగస్‌లు కనిపించినా.. అవి నామమాత్రంగానే ఉన్నట్టు పరిశోధకులు చెప్పారు. వేప చెట్ల కొమ్మలపై కనిపిస్తున్న జిగురు మచ్చలు ఈ ఫంగస్ల వల్ల ఏర్పడినవేనని తెలిపారు. వాడాల్సిన కీటకనాశనులివీ.. కీటకాలను నిర్మూలించేందుకు.. ప్రతి లీటర్ నీటిలో థయోమెథాక్సమ్ 0.2 గ్రాములు, అసిటామిప్రిడ్ 0.2 గ్రాముల చొప్పున కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. శిలీంద్రాల తెగులును నాశనం చేసేందుకు కార్బండాజిమ్, మ్యాంకోజెబ్‌ల మిశ్రమాన్ని ప్రతి లీటర్‌కు 2.5 గ్రాముల చొప్పున కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. ఆ వేపపుల్లలు వాడొచ్చు శిలీంద్రాలు ఆశించిన వేప చెట్లు ఎండిపోతున్న నేపథ్యంలో.. చాలాచోట్ల వేపపుల్లలతో పళ్లు తోముకునేందుకు జనం జంకుతున్నారు. అయితే వాటి నుంచి మనుషుల ఆరోగ్యానికి ప్రమాదమేమీ లేదని, మాడినంత మేర తొలగించి మిగతా పుల్లలతో పళ్లు తోముకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జామ చెట్లపైనా ప్రభావం ఈ శిలీంద్రాలు వేపకే పరిమితం కాకుండా కొన్ని ఇతర రకాల చెట్లపైనా కనిపిస్తున్నట్టు నిపుణులు తాజాగా గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో జామకాయలపై పెద్దపెద్ద మచ్చలు ఏర్పడుతున్నాయన్న ఫిర్యాదులు వచ్చాయని.. వాటిని పరిశీలించగా ఈ శిలీంద్రాల ప్రభావమేనని తేలిందని అనురాగ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ప్రస్తుతం జామకాయలపైనే ఈ సమస్య ఉందని, ఆ చెట్లపై ఇంకా ప్రభావం కనిపించలేదని పేర్కొన్నారు. మరోవైపు కానుగ చెట్లకు కూడా ఈ సమస్య వస్తోందని ఏజీ వర్సిటీ నిపుణులు చెప్తున్నారు. -
తేనెను జుర్రేసే ప్రత్యేక పురుగు.. దీని నాలుక ఎంత పెద్దదో తెలుసా?
తేనెటీగలు, తుమ్మెదలు, ఇంకా కొన్నిరకాల పురుగులు పూలలో తేనెను జుర్రేస్తూ మజా చేస్తుంటాయి. పూల లోపలికి నాలుక (గొట్టం వంటి ప్రత్యేక నిర్మాణం) చాపి తేనెను పీల్చేస్తాయి. మరి బాగా పెద్దవో, పొడుగ్గానో ఉండే పూలు అయితే ఎలా? అలాంటి పూల నుంచీ తేనెను జుర్రేసే ప్రత్యేకమైన పురుగే.. డార్విన్స్ మోత్ (చిమ్మట). ఆఫ్రికా ఖండం తీరానికి సమీపంలోని మడగాస్కర్ దీవుల్లో ఉండే ఈ పురుగు నాలుక ఎంత పెద్దదో తెలుసా.. ఏకంగా 11.2 అంగుళాలు. ఇంచుమించు ఒక అడుగు పొడవు అన్నమాట. ఆ పురుగు సైజు మాత్రం రెండు, మూడు అంగుళాలే ఉంటుంది. డార్విన్స్ మోత్ ప్రత్యేకతలపై ఇటీవల పరిశోధన చేసిన లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం శాస్త్రవేత్తలు.. దాని నాలుక పొడవును కొలిచి రికార్డు చేశారు. చదవండి: మా నాన్న క్రేజీ.. పొద్దున మాత్రం లేజీ’.. ఐదేళ్ల చిన్నారి ఫన్నీ కవిత వైరల్ చూడక ముందే ఊహించి.. జీవ పరిణామ సిద్ధాంతాన్ని రూపొందించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్‌కు ఈ చిమ్మట పురుగుకు ప్రత్యేక సంబంధం ఉంది. మడగాస్కర్‌లో చెట్లు, మొక్కలను పరిశీలిస్తున్న క్రమంలో డార్విన్‌కు ‘అంగ్రాకమ్ సెస్కీపెడబుల్’గా పిలిచే ఒకరకం ఆర్కిడ్ పూల మొక్క కనబడింది. దాని పూల కాడలు చాలా పొడవుగా ఉండి.. కిందివైపున తేనె (నెక్టార్) ఉన్నట్టు గుర్తించారు. చదవండి: గోల చేయని భార్య! ప్చ్.. నాలుగు రోజులకే విడాకులు ఇలాంటి పూల నుంచి తేనె పీల్చే సామర్థ్యమున్న పురుగులు ఉండి ఉంటాయని, వాటి నాలుక చాలా పొడవుగా ఉంటుందని 1862వ సంవత్సరంలోనే డార్విన్ అంచనా వేశారు. కానీ తర్వాత 40 ఏళ్ల వరకు కూడా ఎవరూ ఆ పురుగులను గుర్తించలేకపోయారు. 1903వ సంవత్సరంలో కొందరు శాస్త్రవేత్తలకు ఈ పురుగు కంటబడింది. దానిని ముందే ఊహించిన డార్విన్ పేరిటే దీనికి ‘డార్విన్స్ మోత్’ అని నామకరణం చేశారు. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
వైరల్: ఆకా లేదంటే పురుగా.. ఆశ్చర్యంగా ఉందే!
‘అరె చూడటానికి అచ్చం ఆకులా ఉందే.. నిజంగా ఆకేనా.. లేదంటే పురుగా’ అని పై ఫోటో చూసి ఆశ్చర్యపోతున్నారా. ఇలాంటి సందేహం కలగడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆకృతిలో ఆకును తలపిస్తూ విచిత్రంగా కనిపిస్తున్న ఇది నిజానికి ఓ పురుగు. ఫిలియం జిగాంటియం అని పిలువబడే ఈ జీవి శరీరం అచ్చం ఆకులా కలిగి ఉంటుంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఆకు పురుగు. దీనికి ఉండే రెండు కాళ్లతో ఆకులాగే కనిపిస్తుంది. చర్మం అంచుల చుట్టూ గోధుమ రంగు మచ్చలతో ఆకుపచ్చ రంగులో ఉంటుంది. తాజాగా కొన్ని ఆకు పురుగులు కదులుతున్న వీడియోను సైన్స్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ షేర్ చేసింది. దీంతో ఈ ఆకు పురుగు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దీనిని చూసిన నెటిజన్లు ఇదేంటో తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతి చెట్టుకు ఆకులుంటాయని అందరికీ తెలుసు. కానీ, చ్చం ఆకుల్లాగానే ఉండే పురుగులు ఉంటాయా అని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే దీనికి మిలియన్ వ్యూస్ రాగా లక్షల్లో కామెంట్లు వచ్చి చేరుతున్నాయి. మరి మీరూ ఈ వీడియోను చూసేయండి ఇక. చదవండి: కళ్ల ముందే కుప్పకూలుతూ.. చావు కోరల్లోకి! View this post on Instagram A post shared by Science by Guff 🧬 (@science) -
26 రైళ్లను ఆపేసిన బుల్లి కీటకం!
క్రమశిక్షణకు మారుపేరైన జపాన్‌లో రైల్వే వ్యవస్థనే ఒక బుల్లి కీటకం అస్తవ్యస్తం చేసేసింది. ఏకంగా 12 వేల మంది ప్రయాణికుల్ని ఇక్కట్లు పాల్జేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే దక్షిణ జపాన్‌లో జేఆర్ క్యాషూ కంపెనీ నడిపే రైల్వే లైన్లలో కొన్నింటికి హఠాత్తుగా మే 30న విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో 26 రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఏకంగా 12 వేల మంది ప్రయాణికులపై ప్రభావం చూపించడంతో కంపెనీ సాంకేతిక బృందం హుటాహుటిన రంగంలోకి దిగింది. రైల్వే వ్యవస్థకు విద్యుత్ సరఫరా చేసే ఒక పరికరం పనిచెయ్యకపోవడంతో ఈ ఘోరం జరిగిందని వారికి అర్థమైంది. ఇంతకీ ఎందుకు పని చెయ్యడం లేదని ఆ పరికరాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒక చిన్న పురుగు కారణమని తేలింది. ఎలా వెళ్లిందో ఏమో మరి గొంగళి పురుగు మాదిరిగా ఉండే అతి చిన్న కీటకం ఆ విద్యుత్ సరఫరా చేసే పరికరంలోకి దూరింది.. దీంతో ఆ పురుగు షాక్ కొట్టి చనిపోవడమే కాదు, షార్ట్ సర్క్యూట్‌కు దారి తీసింది. దీంతో విద్యుత్ సరఫరా ఆగిపోయి రైళ్లు రద్దవడంతో గందరగోళం నెలకొంది. మన దేశంలో రైలు ప్రయాణం అంటే జీవిత కాలం లేటు కానీ, జపాన్‌లో రవాణా వ్యవస్థ ఎంత క్రమ శిక్షణతో ఉంటుందంటే అక్కడ రైలు వచ్చిన టైమింగ్‌తో మన గడియారాలను సరిచేసుకోవచ్చునన్నమాట. అందుకే అంత కలకలం రేగింది. జపాన్‌లో ఇలాంటి తరహా ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని జేఆర్ క్యాషూ కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. -
రైళ్లను ఆపిన నత్త!
టోక్యో : సాంకేతికతకు, సమయపాలనకు చిరునామా జపాన్. ముఖ్యంగా ఇక్కడి రైళ్లు, బస్సులు ఒకటేమిటి ప్రభుత్వ రవాణా వ్యవస్థ మొత్తం సమయానికి అనుగుణంగా నడవాల్సిందే. ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే సంబంధిత రవాణా వ్యవస్థ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన సందర్భాలు సైతం బోలెడు. అలాంటి దేశంలో అనేక రైళ్లు ఎక్కడికక్కడ నిల్చిపోయాయి. దాదాపు 12వేల మంది తమ గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరుకున్నారు. ఇంతకీ అన్ని రైళ్లను ఆపింది ఏంటో తెలుసా.. ఓ నత్త!. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దక్షిణ జపాన్‌లోని క్యూషూ రైల్వే కార్పొరేషన్ పరిధిలోని చోటుచేసుకుంది. మే 30న అనుకోకుండా రైల్వే వ్యవస్థలో ఒక్కసారిగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. కారణమేంటా అని వెతికిన అధికారులు ఎంతో శ్రమ తరవాత చివరకు రైల్వే ట్రాక్‌లకు సమీపంలోని ఓ విద్యుత్తు బాక్స్‌లో నత్త చనిపోయి ఉండడం గమనించారు. అది విద్యుత్ తీగల మధ్యకు వెళ్లడం వల్ల షార్ట్ సర్క్యూట్ సంభవించి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రైళ్లన్నీ స్తంభించిపోయాయి. -
ఐకియా స్టోర్ : నిన్న వెజ్ బిర్యానీ.. నేడు కేక్
సాక్షి, హైదరాబాద్ : వెజ్ బిర్యానీలో గొంగళి పురుగు రేపిన కలకలం సద్దుమణగకముందే ఐకియాలో మరో పురుగు బయటకొచ్చింది. ఈ సారి చాక్లెట్ కేక్‌లో, అది కూడా బతికున్న పురుగు. కిషోర్ అనే కస్టమర్ ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా తెలియజేశాడు. వివరాలు.. కిషోర్ అనే కస్టమర్ ఈ నెల 12న తన కూతురితో కలిసి ఐకియా రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఆ సమయంలో కిషోర్ కూతురు చాక్లెట్ కేక్‌ని ఆర్డర్ చేసింది. తీరా కేక్‌ని తీసుకొచ్చాక చూస్తే దాని మీద ఓ పురుగు పాకుతుంది. ఇది గమనించిన కిషోర్ తన ఆర్డర్ కాపీ, బిల్ పే చేసిన కాపీతో పాటు చాక్లెట్ మీద ఉన్న పురుగును కూడా వీడియో తీసి మున్సిపల్ అధికారులకు, హైదరాబాద్ పోలీస్‌లకు ట్యాగ్ చేశాడు. #Ikeahyderbad I found an insect inside the chocolate cake which came out while my daughter was eating the cake at IKEA store today in Hyderabad. https://t.co/zrQnMX8rOI @TV9Telugu @KTRTRS sir @hydcitypolice @THHyderabad @Abnandhrajyothi pic.twitter.com/9rtQduiiV7 pic.twitter.com/UOqSB72ETs — Kishore2018 (@Kishore20181) September 12, 2018 కానీ వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో రెండు రోజుల క్రితం మరో వీడియోని పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో జీహెచ్ఎంసీ అధికారులు తన ఫిర్యాదు గురించి పట్టించుకోలేదని తెలియజేశాడు. దాంతో స్పందించిన మున్సిపల్ అధికారులు ఈ స్వీడిష్ ఫర్నీచర్ కంపెనీకి 5 వేల రూపాయల జరిమానా విధించారు. ఈ విషయం గురించి ఐకియా అధికారి ఒకరి మాట్లాడుతూ ‘మా రెస్టారెంట్లో ఓ కస్టమర్ ఆర్డర్ చేసిన చాక్లెట్ కేక్‌లో పురుగు వచ్చిందని తెలిసింది. దీని గురించి మేం ఎంతో చింతిస్తున్నాం. అందుకు క్షమించమని కోరుకుంటున్నాం. ఇది అనుకోకుండా జరిగింది. ఇక మీదట ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం’ అని తెలిపారు. గతంలో వెజ్ బిర్యానీలో గొంగళి పురుగు వచ్చినప్పుడు జీహెచ్ఎంసీ ఫుడ్ సెఫ్టీ అధికారులు ఐకియాకు 11, 500 రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసింది. అయితే ఈ సంఘటన తర్వాత ఐకియా ఇక మీదట తన స్లోర్‌లో వెజిటేబుల్ బిర్యానీని అమ్మడం మానేసినట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ‘ఇక మీదట ఐకియా కేక్‌లను కూడా అమ్మడం మానేస్తుందా..?’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
కాయతొలుచు పురుగుపై యుద్ధం
సాక్షి, హైదరాబాద్: కొన్ని జిల్లాల్లో పత్తికి సోకిన గులాబీ రంగు కాయతొలుచు పురుగుపై వ్యవసాయ శాఖ యుద్ధం ప్రకటించింది. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో గులాబీ రంగు పురుగు కనిపించడంతో ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపింది. ఇతర ప్రాంతాలకు, సమీప పంటలకు ఇది సోకకుండా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆయా ప్రాంతాలకు నిఫుణుల బృందాలు వెళ్లినట్లు వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ ‘సాక్షి’కి తెలిపారు. కరపత్రాలు, గోడ పత్రికలు తయారు చేసి విరివిగా ప్రచారం చేస్తున్నట్లు వివరించారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ పురుగు విస్తరించకుండా నిలువరించగలుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఖరీఫ్‌లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 86.25 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగయ్యాయి. అందులో పత్తి విస్తీర్ణమే 44.72 లక్షల ఎకరాలు. ఇంత పెద్ద ఎత్తున పత్తి సాగు కావడం, మరోవైపు గులాబీ రంగు పురుగు ఆశించడంతో వ్యవసాయ శాఖ వర్గాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. డ్రైస్పెల్తో గులాబీ పురుగు.. మే చివరి వారం నుంచి జూన్ మొదటి వారం వరకూ వేసిన పత్తిని గులాబీ రంగు పురుగు పీడిస్తోంది. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో ముందుగా వేసిన పత్తి పంటపై గులాబీ పురుగు దాడి చేస్తోందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా నిర్థారించింది. ఇది ఆందోళనకరంగా పరిణమించిందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇతర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గులాబీ రంగు పురుగు కనిపిస్తోందని అంటున్నారు. దీనివల్ల అనేకచోట్ల పత్తి పంట ప్రశ్నార్థకంగా మారింది. వారం క్రితం వరకు వర్షాలు రాకపోవడం, డ్రైస్పెల్స్ ఏర్పడటం, ఎండలతో వాడిపోయే దశలో ఉండటం వల్ల పత్తిపై గులాబీ రంగు పురుగు దాడి చేసిందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. గతేడాది గుజరాత్లో గులాబీ రంగు పురుగు వల్లే లక్షలాది ఎకరాల్లో పత్తి నాశనమైంది. ఒక సమయంలో ఉత్తర భారతంలోని రైతులను తీవ్రంగా వణికించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ పురుగు విస్తరించకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, ఆ ప్రకారం సమగ్ర నివారణ చర్యలు తీసుకోవాలని విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించడంతో వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. బీటీ టెక్నాలజీ విఫలమైనందునే బీటీ–2 పత్తి విత్తనం గులాబీ రంగు పురుగును తట్టుకునే శక్తి కోల్పోయిందని వ్యవసాయరంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. శాస్త్రవేత్తల సూచనలివీ.. పత్తిని గులాబీ రంగు పురుగు నుంచి రక్షించుకోవడానికి కింది యాజమాన్య పద్ధతులు పాటించాలని శాస్త్రవేత్తలు పలు సూచనలు చేశారు. అవేంటంటే.. ► పంట 45 రోజుల వయస్సు ఉన్నప్పుడు లేదా పూత దశలో ఉన్నప్పుడు ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉధృతిని గమనించాలి. ► లింగాకర్షక బుట్టల్లోని ఎరను ప్రతీ 21 రోజులకోసారి విధిగా మార్చాలి. ► ఫిరమోన్ కెమికల్స్ కంపెనీ లిమిటెడ్ రూపొందించిన లింగాకర్షక బుట్టలు, ఎరలను వాడాలి. ► గులాబీ రంగు పురుగు ఆశించిన గుడ్డి పూలను ఏరి నాశనం చేయాలి. ► పత్తి పంట చుట్టూ బెండగాని, తుత్తురు బెండగాని లేకుండా చూసుకోవాలి. ► దీంతోపాటు శాస్త్రవేత్తల సూచనల మేరకు పలు పురుగు మందులను పిచికారి చేయాలి. -
వానల్లో వ్యాధుల నివారణకు...
ఆయుర్వేద కౌన్సెలింగ్ ఇప్పుడు ఉన్న ముసురు వాతావరణంలో క్రిమికీటకాలు పెరిగి ఎన్నో వ్యాధులు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా నీళ్ల విరేచనాలు వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయుర్వేద విధానంలో వీటికి నివారణ, చికిత్స సూచించండి. - వి. శ్రీనివాసశర్మ, విశాఖపట్నం ఇది ఆషాఢమాసం. వర్షరుతువు. ఈగలు ఎక్కువగా ముసిరే కాలం. జల కాలుష్యానికి పెట్టింది పేరు. కాబట్టి మనం తినే ఆహారపదార్థాలు, తాగే పానీయాలు చాలా పరిశుభ్రంగా ఉండాలి. లేకపోతే వాటి ద్వారానే కడుపులోకి ఇన్ఫెక్షన్లు ప్రవేశిస్తాయి. అంతేకాకుండా ఈ రుతువులో మన ‘జఠరాగ్ని’ సామ్యావస్థలో ఉండదు. కనుక అజీర్ణం సంభవించడానికి అవకాశాలు ఎక్కువ. దీనికితోడు తినుబండారాల్లో వాడే వివిధ రకాల రంగులు, నిల్వ ఉంచడానికి వాడే రసాయనాల్లో కల్తీలు ఎక్కువ. కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేసుకునే వంటకాలు, పానీయాలే తీసుకోవాలి. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. బయట లభించే పదార్థాల జోలికి పోవద్దు. మానవుని జీర్ణకోశ వ్యవస్థని ‘మహాకోష్ఠం’ అంటారు. మన ఆరోగ్యమంతా దీని క్రియా విశేషంపైనే ఆధారపడి ఉంటుంది. దీంట్లో అత్యంత ప్రధానమైనది ‘జఠరాగ్ని’. సక్రమరీతిలో ఆకలివేయడం, తిన్నది జీర్ణమవడం జరిగితే దానిని ‘సమాగ్ని’ అంటారు. దీని శక్తి తగ్గితే ‘మందాగ్ని’ అంటారు. అప్పుడు కలిగే వ్యాధిని ‘అగ్నిమాంద్యం’ అంటారు. మితిమీరిన శక్తి ఉన్నప్పుడు ‘తీక్షా ్ణగ్ని’ అంటారు. ఒకసారి అతిగానూ, వెంటనే మందంగానూ తేడాలు సంభవిస్తే ‘విషమాగ్ని’ అంటారు. సమాగ్ని ఉన్నప్పుడు మన రోగనిరోధకశక్తి బాగుంటుంది. సూక్ష్మక్రిముల వల్ల వచ్చే రోగాల బారి నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ఈ రుతువులో చాలా మంది ఆహార, విహార నియమాలను పాటించకపోవడం వల్ల అజీర్ణం, విరేచనాలు, వాంతులు మొదలైన సమస్యలకు గురవుతారు. కొంతమందిలో వీటితో పాటు జ్వరం, కడుపునొప్పి మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ‘విసూచికా’ అనే వ్యాధికి దారి తీసుస్తుంది. ఇందులో కనిపించే లక్షణాలు కలరా వ్యాధి లక్షణాలను పోలి ఉంటాయి. విసూచికా వ్యాధి లక్షణాలు: వాంతులు, విరేచనాలు, దప్పిక, ఆవులింతలు, కళ్లు తిరగడం, తలనొప్పి, కడుపులోనొప్పి, ఒళ్లంతా సూదులతో గుచ్చినట్లుగా బాధ, ఛాతీలో బిగబట్టినట్లుగా ఉండటం, శరీరం రంగుమారడం, వణుకు, మూర్ఛ. సుశ్రుత సంహితాః శ్లోకం మూర్ఛా అతిసోరో వమథుః పిపాసా శూలో భ్రమ ఉద్వేష్ఠన జృంభదాహాః వైవర్ణ్య కంపౌ హృదయేరుజశ్చ తస్యాం శిరసశ్చ భేదః ...... విసూతీతి నిగద్యతే నివారణ: ప్రతిరోజూ తేలికగా జీర్ణమయ్యే, తాజాగా వండిన, పరిశుభ్రమైన ఆహార ద్రవ్యాల్ని, పానియాలను మితంగా తీసుకోవాలి. మరిగించిన నీరు తాగితే మంచిది. అన్నీ ఇంట్లోనే తయారుచేసుకోవాలి. మనకెల్లప్పుడు ‘సమాగ్ని’ ఉండేట్టు జాగ్రత్తపడాలి. కషాయం: అల్లం, వెల్లుల్లి కషాయం, 30 మిల్లీలీటర్లు (ఆరు చెంచాలు) ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగాలి. చికిత్స: అజీర్ణపు విరేచనాలకు: వాము కషాయం - 30 మిల్లీలీటర్లు - రెండుపూటలా ఇదే బజారులో ‘అజామోదార్క’ అనే ద్రవంగా లభిస్తుంది దాడిమాష్టకచూర్ణం: ఒక చెంచా రెండుపూటలా విసూచికా వ్యాధికి : కర్పూరరస మాత్రలు ఉదయం 2, రాత్రికి 2 లశూనాదివటి (మాత్రలు) లేదా కుటజఘనవటి ఉదయం 1, రాత్రికి 1 ఆనందభైరవీరస (మాత్రలు) ఉదయం 1, రాత్రికి 1 ద్రవాహారం: కొబ్బరినీళ్లు, బార్లీ నీళ్లు, గోధుమజావ, ఉప్పు, కరివేపాకు వేసిన పలుచని మజ్జిగ; ఒక గ్లాసు నీళ్లలో ఒక చెంచా చక్కెర, మూడు చిటికెల ఉప్పు, కొంచెం నిమ్మరసం సలిపి, కొంచెం కొంచెం పదేపదే తాగుతుండాలి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ గుండె సమస్యల నివారణకు... నాకు 35 ఏళ్లు. మా దూరపు బంధువుల్లో ఇద్దరుముగ్గురు కొద్దికాలంలోనే గుండెజబ్బుతో చనిపోయారు. దాంతో నాకు ఆందోళన పెరిగింది. గుండెజబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయగలరు. - సురేశ్‌కుమార్, నిడదవోలు గుండెజబ్బులు ఉన్న కుటుంబ చరిత్ర గలవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ప్రధాన సూచనలివి... మీలా చిన్న వయసు వారైనప్పటికీ ఇప్పట్నుంచే తరచూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయిస్తూ, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహానికి దూరంగా ఉంటూ, డాక్టర్ సలహాల మేరకు కొన్ని మందులు తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకుంటూ ఉండాలి గుండెపోటు రావడానికి డయాబెటిస్ ఒక ప్రధాన కారణం. అందుకే ఆ సమస్య ఉన్నవారు రక్తంలోని చక్కెరను పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవడం తప్పనిసరి. రోజూ క్రమం తప్పకుండా మందులు వాడుతూ, డాక్టర్ సూచన మేరకు వారు సూచించిన వ్యవధిలో క్రమం తప్పకుండా రక్తంలోని చక్కెరలను పరీక్షించుకుంటూ ఉండాలి కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాన్ని బాగా తగ్గించాలి పొగ తాగే అలవాటును పూర్తిగా వదిలేయాలి. అలాగే పొగాకుకు సంబంధించిన ఉత్పాదనలు, వస్తువులను పూర్తిగా మానేయాలి. గుండెజబ్బుల నివారణలో ఇది చాలా ప్రధానం డాక్టర్ సూచనల మేరకు శరీరానికి మరీ శ్రమ కలిగించకుండా చేసే వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాలి మన ఒంటి బరువును పెరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి రక్తపోటును అదుపులో పెట్టుకోవాలి మనం తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఒంటికి అందేలా సమతులాహారం తీసుకోవాలి ఆరోగ్యకరమైన జీవనశైలిని తప్పనిసరిగా పాటించాలి. ఈ కొన్ని జాగ్రత్తలతోనే చాలావరకు గుండెజబ్బులను నియంత్రించవచ్చు. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు తమ డాక్టర్లు సూచించిన మందులను తప్పక వాడుతుండాలి. ఆరోగ్యంలో ఏమాత్రం తేడా ఉన్నట్లు అనిపించినా డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాసిత్పటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
మహిళ కంటిలో కీటకం
- శస్త్ర చికిత్స ద్వారా బయటకు తీసిన వైద్యులు - ఏడాదిగా కంటిలోనే 9 సెం.మీ. వరకు పెరిగిన వైనం సాక్షి, ముంబై: ఓ మహిళ కంటి నుంచి తొమ్మిది సెంటీమీటర్ల పొడవున్న కీటకాన్ని (వానపాము ఆకారంలో) వైద్యులు ఆపరేషన్ ద్వారా బయటకు తీశారు. ఏడాది కాలంగా మహిళ కంటిలోనే ఉన్న కీటకం అప్పటి నుంచి తొమ్మిది సెంటీమీటర్ల పొడవు పెరిగినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం గర్భవతి అయిన సంబంధిత మహిళకు ఎలాంటి హాని జరగకుండా వైద్యులు చికిత్స చేశారు. దక్షిణాఫ్రికాలో అరుదుగా కనిపించే ఈ కీటకాలు మన దేశంలో ఇప్పటి వరకు మూడు లేదా నాలుగు సార్లు మాత్రమే కనిపించినట్లు సమాచారం. కాగా ఆమె పేరు, ఫొటో ప్రచురించడానికి బంధువులు నిరాకరించడంతో చికిత్స చేసిన వైద్యులు వివరాలు వెల్లడించారు. ఏడాది కిందట ఆమె కంటిలో ఏదో కదులుతున్నట్లు అనిపించడంతో కంటి డాక్టర్‌కు చూపించగా ఏమి లేదని చెప్పాడు. అయితే అలాగే జరుగుతుండటంతో ముంబైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి చూపించారు. అయితే కంటిలో ఏదో కదులుతున్నట్లు వైద్యులు గుర్తించినప్పటికీ కచ్చితంగా అది ఏంటో నిర్ధారించలేకపోయారు. తరువాత మాటుంగా గాంధీ నర్సింగ్ హోంలోని సర్జన్ డాక్టర్ దీపక్ గాంధీని బాధితురాలు సంప్రదించింది. సోనోగ్రఫ్రీ చేయగా కుడి కంటిలో తొమ్మిది సెంటీమీటర్ల పొడవైన కీటకం ఉన్నట్లు ఆయన గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి దాన్ని బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని గాంధీ చెప్పారు. కీటకాన్ని ప్రయోగశాలకు పంపామని, అక్కడి నుంచి నివేదిక వస్తే పూర్తి వివరాలు బయటపడతాయని ఆయన అన్నారు. -
ఇది అరిస్తే.. అడవి దద్దరిల్లాల్సిందే..!
అవునట. కీటకం కొంచెం కూత ఘనం అన్నట్లు.. ఇది అడవి దద్దరిల్లిపోయేంత రేంజ్లో శబ్దం చేస్తుందట! చెవులు చిల్లులు పడేలా శబ్దాలు చేసే కీచురాళ్ల గురించి తెలుసు కదా. వాటి వర్గానికి చెందినదేనట ఈ కొత్త జాతి కీటకం కూడా. అయితే ఇది మనముందుండి శబ్దం చేసినా.. మనకు అస్సలు వినపడదు లెండి. ఎందుకంటే.. దీని శబ్దం మనం వినలేనంత ఫ్రీక్వెన్సీలో ఉంటుందట మరి! మనం 20 హెర్ట్జ్ల నుంచి 20 కిలోహెర్ట్జ్‌ల మధ్య ఫ్రీక్వెన్సీల్లో ఉండే ధ్వనినే వినగలుగుతాం. కానీ దీని శబ్దం ఏకంగా 150 కిలోహెర్ట్జ్‌ల వరకూ ఉంటుందట. ఆడ కీటకాలను ఆకర్షించేందుకు మగకీటకాలు ఈ రేంజ్లో పాటలు పాడతాయని... జంతుసామ్రాజ్యంలోనే అత్యధిక ఫ్రీక్వెన్సీతో ప్రేమగీతాలు పాడేవి ఇవేనని చెబుతున్నారు. అందుకే.. ఈ జాతికి ‘సూపర్సోనస్’ అని పేరుపెట్టారు. దక్షిణ అమెరికాలోని అడవుల్లో ఈ కొత్తజాతితోపాటు మరో మూడు కొత్త రకం కీటకాలనూ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అన్నట్టూ.. ఇవి శబ్దాలు చేసేది నోటితో కాదు.. రెక్కలతో. రెక్కలు చాలా చిన్నగా ఉండటంతో ఇవి ఎక్కువగా ఎగరలేవు. కానీ.. ఒక రెక్కతో ఇంకో రెక్కపై ఉండే రంపపుపళ్ల వంటివాటిపై వేగంగా రుద్దుతూ శబ్దం చేస్తాయి. రెక్కలపై ప్రత్యేకంగా ఉండే చిన్న మద్దెలలాంటి నిర్మాణం లౌడ్స్పీకర్లా పనిచేసి శబ్దం తీవ్రతను పెంచుతుంది. ఈ ప్రత్యేకతతోనే ఇవి గబ్బిలాలు, ఇతర జీవుల నుంచీ తప్పించుకుంటాయట. -
ఇంతకీ ఇదేంటి?
అవును.. ఇదేంటి? ఏదో పచ్చ రంగులో ఉన్న పాము. మీ సమాధానం ఇదేగా.. అయితే.. ఇది పాము కాదు.. ఓ గొంగళి పురుగు అని చెబితే.. అవునా అంటూ అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఉత్తర, దక్షిణ అమెరికాలతోపాటు ఆఫ్రికాలో కనిపించే ఈ గొంగళి పురుగును చూసిన వారంతా ఇది పాము అనే భ్రమపడతారు. అయితే.. సరిగ్గా చూస్తే.. అది తప్పని తెలుస్తుంది. చూశారా దానికి తోక కూడా లేదు.. మొత్తం సైజంతా కలిపి అంతే ఉంటుంది. ఈ గొంగళి పురుగును హెమరోప్లేన్స్ ట్రిప్టోలెమస్ అని పిలుస్తారు. -
ఆవిష్కరణం: దోమల బ్యాట్
మనకంటే శక్తిమంతులతోనే కాదు.. చిన్న చిన్న కీటకాలపైనా కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడూ! సాయంత్రమైతే చాలు మనమీద యుద్ధం ప్రకటించేస్తుంటాయి దోమలు. కాయిల్స్ ఉన్నాయి, రెపెలెంట్స్ ఉన్నాయి.. కానీ వాటితో దోమలు చస్తాయన్న గ్యారెంటీ లేదు. అందుకే మనమే ఓ ఆయుధం చేతబట్టి దోమలపై యుద్ధానికి దిగాల్సిన పరిస్థితి! ఆ ఆయుధమే.. ఎలక్ట్రిక్ ఫ్లైస్వాటర్. వాడుక భాషలో దోమల బ్యాట్. దోమ ఉన్న ప్రదేశంలో దాంతో ఓ విసురు విసిరామంటే చాలు.. టప్ మని శబ్ధం.. దోమ పని ఖతం! గత దశాబ్ద కాలంలో ఈ దోమల బ్యాట్ ఇండియాలో బాగా పాపులరయ్యింది. కానీ పాశ్చాత్య దేశాల్లో ఇది వాడుకలోకి వచ్చి మూడు దశాబ్దాలపైనే అయివుంటుంది. అయితే దీనికి వందేళ్ల చరిత్ర ఉంది. 1900 సంవత్సరంలోనే దీనిపై రాబర్ట్ మాంట్‌గోమరీ మొదటిసారి పేటెంట్ పొందారు. దానికి ఆయన ఫ్లై కిల్లర్ అని పేరు పెట్టాడు. తర్వాత ఆ పేటెంటును జాన్ ఎల్.బెన్నెట్‌కు అమ్మేశారు. అయితే, ప్రస్తుతం ఉన్న బ్యాటు తయారీ మాత్రం తొంభైల చివర్లో మొదలైంది. 1995లో తైవాన్‌కు చెందిన త్సాయి ఇ షిహ్ ఈ బ్యాట్ తయారీకి పేటెంట్ సంపాదించాడు. తర్వాత దోమల బ్యాట్ తయారీ ఆరంభమైంది. 2000కల్లా ఇవి మార్కెట్లోకి వచ్చాయి. 2005 నాటికి బాగా ప్రచారంలోకి వచ్చాయి. ఛార్జింగ్ ద్వారా పనిచేసే ఈ బ్యాట్‌లో హ్యాండిల్లో బ్యాటరీ ఉంటుంది. ఎలక్ట్రిక్ తీగలతో నెట్ తయారు చేస్తారు. స్విచ్ ఆన్ చేయగానే వీటిలోకి విద్యుత్ ప్రసరిస్తుంది. ఐతే అది మనుషులకు హాని కలిగించే స్థాయిలో ఉండదు. దోమలు మాత్రం నెట్‌కు తగలగానే ప్రాణాలు వదులుతాయి. ఈ బ్యాట్‌తో దోమల్ని చంపడం పిల్లలతో పాటు పెద్దలకూ సరదానే!