మాంసం చూస్తే ఎవరికైనా తినాలనిపిస్తుంది. ఇంకొంత మందికి ముక్క లేకపోతే ముద్ద దిగదని అంటారు. అయితే కొందరు అమెరికన్లకు మాత్రం మాంసం చూస్తేనే ఒళ్లంతా అలర్జీ వచ్చేసి వాంతులతో వస్తున్నాయట. దీనిపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు చివరికి ఇది ఆల్ఫా – గాల్ సిండ్రోం అని కనుగొన్నారు. అసలు ఆ వ్యాధి ఏంటి, ఇలా ఎందుకు జరుగుతోందంటే..
ఆల్ఫా గాల్ అనేది ఒక ఫుడ్ అలెర్జీ. ఈ సిండ్రోం ఉన్న వారికి మాంసం, లేదా జంతువుల ఉత్పత్తులను ఆహారంగా ఇస్తే అలర్జీకి గురవుతారు. ఇది లోన్ స్టార్ టిక్ అనే కీటకం కుట్టడం వల్ల వ్యాపిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 2010 తర్వాతి నుంచి అమెరికాలో ఆల్ఫా గాలా సిండ్రోం కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గతంలో ప్రభుత్వ విడుదల చేసిన నివేదికలో 100,000 మందికి ఉండగా.. తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆ సంఖ్యను మరింత పెరిగి దాదాపు 450,000 మంది ఈ సిండ్రోం బారిన పడినట్లు పేర్కొన్నారు.
2011 లో పరిశోధకులు మొదటగా లోన్ స్టార్ టిక్ అనే కీటకం కుట్టడం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని కనుగొన్నారు. ఆ ప్రాంతంలోని ఓ ప్రముఖ క్లినిక్ ప్రకారం, ఇటువంటి కేసులు సాధారణంగా దక్షిణ, తూర్పు, మధ్య యునైటెడ్ స్టేట్స్‌లో ఎక్కువగా ఈ వ్యాధి వ్యాపిస్తున్నట్లు తెలిపింది. లాంగ్ ఐలాండ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ ఎరిన్ మెక్‌గింటీ దీని గురించి మాట్లాడుతూ, గత దశాబ్దంలో ఆమె సిండ్రోమ్‌తో సుమారు 900 మందిని చూసిందని చెప్పుకొచ్చారు. ఇది వేగంగా వ్యప్తి చెందుతుందని ఆమె చెప్పారు. జింకల ద్వారా ఈ కీటకం నగరాల సరిహద్దుల్లోకి అక్కడి నుంచి వివిధ మార్గాల్లో జనావాసాల్లోకి వస్తోంది. దీంతో ఈ అలర్జీ బారిన పడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment