జనగామ: జిల్లా కేంద్రంలోని ఏకశిల విద్యా కళాశాల ఆవరణలో అరుదైన కీటకం బుధవారం ప్రత్యక్షమైంది. డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్‌రెడ్డి ఈ కీటకాన్ని గుర్తించారు. వయోలిన్‌ను పోలి ఉన్న ఈ కీటకాన్ని ‘ది వాండరింగ్ వయోలిన్ మాంటిస్’గా పిలుస్తారని ఆయన పేర్కొన్నారు. ఎండిన ఆకు రూపంలో కనిపించే ఈ కీటకం.. సన్నని కర్ర పుల్ల మాదిరి దేహంతో ఉండి పరిసరాల్లో కలిసి పోతోంది.
ఈ కీటకం నేలపై నడుస్తున్న క్రమంలో గాలిలో కదులుతున్న కర్రలా కనిపిస్తోంది. ‘తలను 360 డిగ్రీలు సులభంగా తిప్పగల ఏకై క జీవి.. శత్రువును వెనుక నుంచి కూడా చూడగలదు.. ఒకే చెవి ఉన్నప్పటికీ అద్భుతమైన వినికిడి శక్తి కలిగి ఉంటుంది’ అని రత్నాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మానవ అవాసాల విస్తరణ, పచ్చదనం లోపించడంతో వీటి సంఖ్య తగ్గుతున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment