AP: గిరిజనుడికి చిక్కిన కోటి రూపాయల కీటకం! | Tribal Caught Valuble 'Stag Beetle' In Andhra Pradesh's Anakapalle District | Sakshi
Sakshi News home page

AP: గిరిజనుడికి చిక్కిన కోటి రూపాయల కీటకం!

Published Sat, Aug 17 2024 11:39 AM | Last Updated on Sat, Aug 17 2024 12:28 PM

Tribal Caught Valuble 'Stag Beetle' In Andhra Pradesh's Anakapalle District

సాక్షి,అనకాపల్లిజిల్లా: ఆంధ్రప్రదేశ్‌లోని మాడుగుల నియోజకవర్గం కోనాంలో కోటి రూపాలయ కీటకం ప్రత్యక్షమైంది. అడవికి వెళ్లిన గిరిజనుడికి వింత కీటకం కనిపించడంతో దానిని ఆకులో చుట్టి ఇంటికి తీసుకువచ్చాడు. నిజానికి ఆ కీటకం పేరు స్టాగ్‌బీటిల్‌.  వింత ఆకారంలో ఉండటంతో ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది. 

ప్రపంచంలో అత్యంత అరుదైన కీటకంగా స్టాగ్‌బీటిల్‌కు గుర్తింపు ఉంది. ఔషధ తయారీలో ఈ కీటకాన్ని వాడతారని తెలుస్తోంది. కీటకం విలువ మార్కెట్‌లో కోటి రూపాయలకుపైగా  ఉంటుందని ప్రచారం. అయితే  ఆ గిరిజనుడికి ప్రస్తుతం కీటకాన్ని ఏం చేయాలో తెలియక ఇంటివద్దే ఉంచుకున్నాడు. అడవిలో తిరిగే కీటకానికి ఏం తిండి పెట్టాలో తెలియక దాని ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement