పురుగే కదా అని తీసిపారేయ్యకండి. ఎందుకంటే..? కొన్ని పురుగులు మనం ఊహించనంత ఖరీదైనవిగా కూడా ఉంటాయి. అలాంటి కోవకు చెందిందే ఈ కీటకం. ఈ పురుగు ధర వింటే నోరెళ్లబెడతారు. అంత ధర ఎందుకంటే..?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకాలలో 'స్టాగ్ బీటిల్' ఒకటి. ఒక స్టాగ్ బీటిల్ విలువ ఏకంగా రూ. 75 లక్షలు. ఎందుకుంటే దీన్ని అదృష్ట చిహ్నంగా పరిగణిస్తారట. ఈ కీటకాన్ని ఉంచుకుంటే ఒక్క రోజులనే లక్షాధికారి అవుతారని నమ్ముతారట. ఈ కీటకాలు చెక్కలపై ఆధారపడి జీవించే జీవి. అటవీ పర్యావరణంలో ఇది చాలా ముఖ్య పాత్ర పోషిస్తోంది. లండన్ ఆధారిత నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకారం.. ఈ కీటకాలు 2 నుంచి 6 గ్రాముల మధ్య బరువు ఉంటాయి. సగటు జీవితకాలం 3 నుంచి 7 ఏళ్లు. మగవారి పొడవు 35 నుంచి 75 మిమీ అయితే, ఆడవారు 30 నుంచి 50 మిమీ పొడవు. వీటిని ఔషధ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తారు.
అవి ఎక్కడ ఉంటాయంటే?
స్టాగ్ బీటిల్స్ వెచ్చని, ఉష్ణమండల వాతావరణంలో వృద్ధి చెందుతాయి. చల్లని ఉష్ణోగ్రతలు వీటికి పడదు. ఇవి సహజంగా అడవులలో నివసిస్తాయి. ఎక్కువగా ముళ్లపొదలు, సాంప్రదాయ తోటలు, పార్కులు, తోటలు వంటి పట్టణ ప్రాంతాలలో కూడా కనిపిస్తాయి. ఇవి చనిపోయిన వృక్ష కలపను ఆవాసంగా చేసుకుని జీవిస్తాయి.
ఏమి తింటాయంటే..?
అడల్ట్ స్టాగ్ బీటిల్స్ ప్రధానంగా చెట్ల సాప్ ద్రవాన్ని, కుళ్ళిన పండ్ల నుండి వచ్చే రసం వంటి తీపి ద్రవాలను తింటాయి. లార్వాదశలో ఇవి తీసుకొన్న ఆహారం నుంచి వచ్చే శక్తిపైనే అధికంగా ఆధారపడతాయి. తొలిదశలో ఇవి కలపను తన పదునైన దవడలతో చీల్చి తింటాయి. కేవలం చనిపోయిన మొక్కల కలపనే తింటాయి. అయితే చక్కటి వృక్ష సంపదకు హాని చేయవు. కేవలం మృత వృక్షాలను మాత్రమే ఆహారంగా తీసుకొంటాయి.
(చదవండి: మిస్ సుప్రానేషనల్ 2024 టైటిల్‌ని దక్కించుకున్న ఇండోనేషియా బ్యూటీ!)
Comments
Please login to add a commentAdd a comment