Luxary cars
-
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నాగార్జున
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కొత్తగా తను కొనుగోలు చేసిన లగ్జరీ కారు రిజిస్ట్రేషన్ కోసం ఆయన అక్కడకు రావడంతో భారీగా ఆయన ఫ్యాన్స్ అక్కడకు చేరుకున్నారు. అక్టోబర్ నెలలో ఆయన ఈ కారు కొన్నారు. కొత్త కారు TG9 GT/R4874 రిజిస్ట్రేషన్ కోసం ఫొటో దిగి, సంతకం చేసిన నాగ్.. అక్కడి అధికారులతో కొంత సమయం పాటు సరదాగ మాట్లాడి వెళ్లిపోయారు.నాగార్జున కొత్త కారు టయోటా లెక్సస్‌ను చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇదే మోడల్ కారును నటుడు రామ్ చరణ్ కూడా ఇటీవల కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్లో చాలామంది స్టార్స్ ఈ కారును కొనుగోలు చేశారు. దీంతో ఇప్పుడు టయోటా లెక్స్‌స్ కారు బాగా ట్రెండ్ అవుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 2.5 కోట్లు ఉంటుందని సమాచారం.నాగార్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కుబేర' సినిమాలో ఆయన చాలా కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్- లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ సినిమా 'కూలీ'లో కూడా నాగ్ చాలా ప్రాముఖ్యత ఉన్న రోల్లో కనిపించనున్నారు. త్వరలో ఆయన ఇద్దరి కూమారులలో నాగచైతన్య పెళ్లి తేదీ ఇప్పటికే ఫిక్స్ కాగా.. అఖిల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇలా ఫుల్ బిజీ షెడ్యూల్లో నాగ్ ఉన్నారు. -
థర్డ్ హ్యాండ్ పాత కారు కొన్న స్టార్ హీరో.. ఎందుకు?
సెలబ్రిటీలు చాలామందికి కార్ల, బైక్ పిచ్చి ఉంటుంది. మార్కెట్లోకి కొత్త మోడల్ రావడం లేటు కొనేస్తుంటారు. తెలుగులో తక్కువ గానీ బాలీవుడ్ స్టార్స్ ఇలాంటివి ఏమైనా కొంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలా ఎప్పటికప్పుడు హై ఎండ్ లగ్జరీ కార్లు కొనే బాలీవుడ్ హీరోల్లో కార్తిక్ ఆర్యన్ ఒకడు. ప్రస్తుతం ఇతడి దగ్గర టాప్ ఇంటర్నేషన్ బ్రాండ్ కార్స్ ఉన్నాయి. అలానే గతంలో ఓసారి థర్డ్ హ్యాండ్ కారు కొన్నాడు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయాన్ని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్)'ఓ టైంలో నా దగ్గర ఎలాంటి కారు లేదు. దీంతో ఎలాగైనా సరే కొనలాని అనుకున్నా. రూ.35 వేలు ఖర్చు పెట్టి థర్డ్ హ్యాండ్ కారు కొనుగోలు చేశారు. కష్టం ఎంతైనా సరే జీవితంలో బాగా సెటిలై, ఖరీదైన కార్లు కొనాలని అప్పుడే ఫిక్సయ్యాను. అలా అప్పట్లో సెకండ్ హ్యాండ్ కార్లు చాలా ఉపయోగించాను. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను కొన్న తొలి లగ్జరీ కారు లంబోర్గిని. ప్రస్తుతం నా గ్యారేజీలో రేంజ్ రోవర్, మినీ కూపర్, మెక్ లారెన్ లాంటి కార్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి కార్ల విషయంలో నేను ఫుల్ హ్యాపీ. భవిష్యత్తులో ఇంకెన్ని కొంటానో తెలియదు' అని కార్తిక్ ఆర్యన్ చెప్పుకొచ్చాడు.2011లో 'ప్యార్ కా పంచనామా' సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన కార్తిక్ ఆర్యన్.. కామెడీ, వైవిధ్య చిత్రాలతో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ టైంలో ఇతడు హీరోగా చేసిన 'చందు ఛాంపియన్' హిట్ అయింది. ప్రస్తుతం 'భూల్ భులయ్యా 3' చేస్తున్నాడు. ఇది దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: హీరో నారా రోహిత్ నిశ్చితార్థం ఫిక్సయిందా!) -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం..ఏకంగా ఓ లగ్జరీ కారు ధర..!
పురుగే కదా అని తీసిపారేయ్యకండి. ఎందుకంటే..? కొన్ని పురుగులు మనం ఊహించనంత ఖరీదైనవిగా కూడా ఉంటాయి. అలాంటి కోవకు చెందిందే ఈ కీటకం. ఈ పురుగు ధర వింటే నోరెళ్లబెడతారు. అంత ధర ఎందుకంటే..?ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకాలలో 'స్టాగ్ బీటిల్' ఒకటి. ఒక స్టాగ్ బీటిల్ విలువ ఏకంగా రూ. 75 లక్షలు. ఎందుకుంటే దీన్ని అదృష్ట చిహ్నంగా పరిగణిస్తారట. ఈ కీటకాన్ని ఉంచుకుంటే ఒక్క రోజులనే లక్షాధికారి అవుతారని నమ్ముతారట. ఈ కీటకాలు చెక్కలపై ఆధారపడి జీవించే జీవి. అటవీ పర్యావరణంలో ఇది చాలా ముఖ్య పాత్ర పోషిస్తోంది. లండన్ ఆధారిత నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకారం.. ఈ కీటకాలు 2 నుంచి 6 గ్రాముల మధ్య బరువు ఉంటాయి. సగటు జీవితకాలం 3 నుంచి 7 ఏళ్లు. మగవారి పొడవు 35 నుంచి 75 మిమీ అయితే, ఆడవారు 30 నుంచి 50 మిమీ పొడవు. వీటిని ఔషధ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తారు.అవి ఎక్కడ ఉంటాయంటే?స్టాగ్ బీటిల్స్ వెచ్చని, ఉష్ణమండల వాతావరణంలో వృద్ధి చెందుతాయి. చల్లని ఉష్ణోగ్రతలు వీటికి పడదు. ఇవి సహజంగా అడవులలో నివసిస్తాయి. ఎక్కువగా ముళ్లపొదలు, సాంప్రదాయ తోటలు, పార్కులు, తోటలు వంటి పట్టణ ప్రాంతాలలో కూడా కనిపిస్తాయి. ఇవి చనిపోయిన వృక్ష కలపను ఆవాసంగా చేసుకుని జీవిస్తాయి. ఏమి తింటాయంటే..?అడల్ట్ స్టాగ్ బీటిల్స్ ప్రధానంగా చెట్ల సాప్ ద్రవాన్ని, కుళ్ళిన పండ్ల నుండి వచ్చే రసం వంటి తీపి ద్రవాలను తింటాయి. లార్వాదశలో ఇవి తీసుకొన్న ఆహారం నుంచి వచ్చే శక్తిపైనే అధికంగా ఆధారపడతాయి. తొలిదశలో ఇవి కలపను తన పదునైన దవడలతో చీల్చి తింటాయి. కేవలం చనిపోయిన మొక్కల కలపనే తింటాయి. అయితే చక్కటి వృక్ష సంపదకు హాని చేయవు. కేవలం మృత వృక్షాలను మాత్రమే ఆహారంగా తీసుకొంటాయి.(చదవండి: మిస్ సుప్రానేషనల్ 2024 టైటిల్‌ని దక్కించుకున్న ఇండోనేషియా బ్యూటీ!) -
నాలుగేళ్లకే లగ్జరీ కారు మారుస్తున్నారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాలు 38.9 లక్షల యూనిట్లు రోడ్డెక్కాయి. 2023–24లో ఈ సంఖ్య 40 లక్షల యూనిట్లు దాటుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇందులో లగ్జరీ వాహన విభాగం 45,000 యూనిట్లను నమోదు చేయవచ్చని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో అన్ని బ్రాండ్లవి కలిపి 36,000 యూనిట్ల లగ్జరీ కార్లు అమ్ముడయ్యాయని చెప్పారు. మెర్సిడెస్ బెంజ్‌కు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై తరువాత 10 శాతం వాటాతో అయిదవ స్థానంలో హైదరాబాద్ మార్కెట్ నిలిచిందన్నారు. 4–5 ఏళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టాప్–3 స్థానాన్ని కైవసం చేసుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వినియోగదార్లలో మహిళల వాటా 30 శాతం ఉందన్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు.. మెర్సిడెస్ బెంజ్ ఇండియా ప్రస్తుతం భారత్‌లో 14 మోడళ్లను విక్రయిస్తోంది. దేశీయంగా ఇవి తయారవుతున్నాయి. ఇవి కాకుండా 10 మోడళ్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకుని అమ్ముతోంది. మొత్తం అమ్మకాల్లో వీటి వాటా 3 శాతం ఉంది. దేశవ్యాప్తంగా మెర్సిడెస్ బెంజ్ గత ఆర్థిక సంవత్సరంలో 16,497 యూనిట్లను విక్రయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి ఆశిస్తోంది. టాప్ ఎండ్ మోడళ్లపైనే ఫోకస్ చేస్తున్నట్టు అయ్యర్ తెలిపారు. ‘గతంలో వ్యాపారస్తులు మాత్రమే మా కార్లను కొనేవారు. ఇప్పుడు ఉద్యోగస్తులు సైతం కొంటున్నారు. కస్టమర్లలో వేతన జీవులు 13 శాతం ఉన్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఏటా 12 యూనిట్ల వరకు విక్రయిస్తున్నాం. వీటి ధర రూ.8–13 కోట్ల మధ్య ఉంటుంది. పూర్తిగా తయారైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను జర్మనీ నుంచి భారత్‌కు దిగుమతి చేసుకుంటున్నాం’ అని చెప్పారు. ఈవీల్లో తొలి స్థానంలో.. మెర్సిడెస్ మొత్తం విక్రయాల్లో 3–4 శాతం ఎలక్ట్రిక్ వాహనాల నుంచి సమకూరుతోంది. కంపెనీకి ఈవీ విభాగంలో 8–9 శాతం వాటాతో తెలుగు రాష్ట్రాలు తొలి స్థానంలో ఉంటాయని సంతోష్ తెలిపారు. ‘దేశవ్యాప్తంగా మెర్సిడెస్ బెంజ్ అమ్మకాల్లో ఎస్యూవీ, సెడాన్ విభాగాలు చెరి 50 శాతం ఉంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌యూవీల వాటా ఏకంగా 70 శాతం ఉంది. ఈ మార్కెట్లో రూ.1.5 కోట్లు, ఆపైన ధర కలిగిన టాప్ ఎండ్ లగ్జరీ కార్ల వాటా 25 శాతం ఉంది. వృద్ధి 40 శాతం ఉండడం విశేషం. కొన్ని మోడళ్లకు వెయిటింగ్ పీరియడ్ 24 నెలల వరకు ఉంది. అయినా కస్టమర్లు వేచి చూస్తున్నారు. వినియోగదార్లు లగ్జరీ కారును నాలుగేళ్లకే మారుస్తున్నారు. గతేడాది 3,000 యూనిట్ల పాత కార్లను విక్రయించాం’ అని వివరించారు. -
సింగపూర్‌లో భారీ కుంభకోణం.. రూ.4492 కోట్ల ఆస్తులు స్వాధీనం
సింగపూర్: సింగపూర్ అడ్డాగా చేసుకుని హవాలాకు పాల్పడుతున్న ఒక విదేశీ ముఠా అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టారు సింగపూర్ పోలీసులు. వారి నుంచి బంగ్లాలు, కార్లు, నగదు, నగలు, బంగారు బిస్కెట్లు అన్నీ కలిపి సుమారు 734.32 మిలియన్ సింగపూర్ డాలర్లు(రూ. 4491 కోట్లు) ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు సింగపూర్ పోలీసులు. సింగపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఆర్చార్డ్ రోడ్ షాపింగ్ బెల్ట్ నుండి సెంటోసా రిసార్ట్ ఐలాండ్ వరకు జరిపిన సోదాల్లో సుమారు 400 మంది పోలీసు బలగాలు పాల్గొన్నాయని ఈ ముఠా కోసం నగరమంతా జల్లెడ పట్టామని అన్నారు. ప్రధానంగా తొమ్మిది ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సోదాల్లో 94 ఆస్తులు, 110 మిలియన్ సింగపూర్ డాలర్లు (రూ. 672 కోట్లు) ఉన్న బ్యాంక్ అకౌంట్లు, 50 లగ్జరీ వాహనాలు, 23 మిలియన్ సింగపూర్ డాలర్లు(140 కోట్ల) నగదు కట్టలు, వందలకొద్దీ హ్యాండ్ బ్యాగులు, నగలు బంగారు బిస్కెట్లు.. మొత్తంగా రూ. 4491 కోట్ల ఆస్తులు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఆయా దేశాలకు చెందిన 31 నుండి 44 వయస్సు మధ్యలో ఉన్న పది మంది ముఠాను పట్టుకున్నామని.. వారిని చైనా, కంబోడియా, సిప్రాస్, వణువతు ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించామన్నారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. ఈ ముఠాలో సిప్రాస్ కు చెందిన వ్యక్తి తప్పించుకోబోయి తన బంగ్లా రెండో అంతస్తు నుంచి దూకగా అతడికి స్వల్ప గాయాలయ్యాయని ఆసుపత్రిలో చేర్పించామని చెప్పారు పోలీసులు. ఈ ముఠా ఆన్లైన్లో జూదం, విదేశీ మాఫియా, ఇతర స్కాముల తోపాటు ఇతర క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో సోదాలు నిర్వహించామని పోలీసులు తెలిపారు. సింగపూర్ మానిటరీ అథారిటీ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలిపింది. ఈ ముఠాకి సహకరించిన ఆర్ధిక సంస్థలను ఉపేక్షించేది లేదని తెలిపింది. ఈ సందర్బంగా పోలీసు శాఖలోని వాణిజ్య వ్యవహారాల డైరెక్టర్ డేవిడ్ చ్యు మాట్లాడుతూ మీరు దొరికితే మిమ్మల్ని అరెస్టు చేస్తాం, అక్రమంగా సంపాదించిన మీ ఆస్తులు దొరికితే వాటిని సీజ్ చేస్తామని అన్నారు. 2021 గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 12% మాత్రమే విదేశీ నగదు వృద్ధి చెందగా కేవలం సింగపూర్ లోనే విదేశీ ధన ప్రవాహం 16% వృద్ధి చెందింది. అందుకే సింగపూర్ పోలీసులు అక్రమార్కులపై కొరడా ఝళిపించారు. ఇది కూడా చదవండి: భార్యను చంపిన జడ్జి.. ఇంట్లో 47 తుపాకులు, మందుగుండు సామాగ్రి.. -
సచిన్ ఆస్తుల విలువ ఎంతంటే..?
-
షాకింగ్ ఘటన: జస్ట్ 60 సెకన్లలో 7 కోట్ల కార్లు హాంఫట్
సినిమాలో చూస్తుంటాం అత్యంత ఖరీదైన లగ్జరీ కార్టు కొట్టేయడం. నిజ జీవితంలో కాస్త రిస్క్. కానీ ఈ ఘటన చూస్తే ఇంత సులభంగా కొట్టేయొచ్చా అని నోరెళ్లబెట్టడం మనవంతు అవుతుంది. ఇక్కడొక దొంగల ముఠా కేవలం 60 సెకన్లలో చకచక సుమారు రూ. 7 కోట్లు ఖరీదు చేసే కార్లను కొట్టేశారు. వివరాల్లోకెళ్తే...ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్ కౌంటీలో ఈ హైటెక్ దోపిడి ఘటన చోటు చేసుకుంది. కొంతమంది దొంగలు ఇంగ్లాండ్‌లోని థురోక్ బరో గ్రామంలో బ్రెంట్వుడ్ రోడ్ సమీపంలోని ఓ కాంపౌండ్‌లోకి చోరబడ్డారు. అక్కడ ఉన్న ఐదు లగ్జరీ కార్లను సినిమాలోని హీరోల మాదిరి ఎత్తుకెళ్లారు. ఆ దొంగల్లో ఒక వ్యక్తి గేటు తీసి సాయం చేస్తే మిగతా దొంగలు ఆ కార్లను ఎంచక్కా...డ్రైవ్ చేసుకుంటూ జస్ట్ 60 సెకన్లలో గప్‌చుప్‌గా కొట్టేశారు. సుమారు రూ. ఏడు కోట్లకు పైగా విలువ చేసే మొత్తం ఐదు లగ్జరీ కార్లను ఎత్తుకెళ్లారు. వాటిలో రెండు పోర్ష్లు, మెర్సిడెస్‌లు కాగా, ఒక మేబ్యాక్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అందుకు సంబంధించిన ఘటన మొతం అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డు అవ్వడంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. (చదవండి: వాటే ఐడియా! స్కూటర్ సాయంతో నిర్మాణ పనులు) -
లగ్జరీ కార్లే టార్గెట్! విమానంలో వస్తాడు... దొంగిలించిన కారులో జారుకుంటాడు
బంజారాహిల్స్: ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో 61 లగ్జరీ కార్లు చోరీ చేశాడు.... నాలుగు సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు... అయినా ప్రవర్తన మార్చుకోకుండా ఈ సారి హైదరాబాద్‌పై కన్నేసిన అతను రెండు నెలల్లో అయిదు లగ్జరీ కార్లు తస్కరించి నగర పోలీసులకు సవాల్‌గా మారాడు. ఎట్టకేలకు బెంగళూరు పోలీసులు ఇటీవల ఈ సింగిల్ హ్యాండ్ కార్ల దొంగను పట్టుకోవడంతో గుట్టురట్టయింది. అంతర్రాష్ట్ర కార్ల దొంగ సత్యేంద్రసింగ్ షెకావత్‌ను బంజారాహిల్స్ పోలీసులు ఇక్కడ జరిగిన ఓ కారు దొంగతనం కేసులో కస్టడీకి తీసుకున్నారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది జనవరి 26న షెకావత్ బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని పార్క్‌హయాత్ హోటల్లో కన్నడ నిర్మాత మేఘనాథ్ ఫార్చునర్ కారును దొంగిలించి పరారయ్యాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే దుండిగల్పోలీ స్ స్టేషన్ పరిధిలో ఒకటి, నాచా రం పీఎస్ పరిధిలో ఒక కారు, పేట్‌బషీరాబాద్ పరిధిలో రెండు కార్లు చోరీ చేసి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరు గుతున్నాడు. ఏడాది వ్యవధిలోనే బెంగళూరు, చెన్నై, గుజరాత్, హైదరాబాద్, తదితర ప్రధాన నగరాల్లో 21 లగ్జరీ కార్లను చోరీ చేశాడు. అతడిని అదుపులోకి తీసుకున్న బెంగళూరు పోలీసులు 21 కార్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో హైదరాబాద్‌లో దొంగిలించిన అయిదు కార్లు కూడా ఉన్నాయి. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కూడిన డివైస్‌ను ఉపయోగించి కారు డోర్లు తెరుస్తూ కేబుల్ కనెక్ట్ చేసి ఎంచక్కా వాటిలో దూసుకెళ్లేవాడు. దొంగిలించిన కార్లను తక్కువ ధరకు అమ్మేస్తూ జల్సా చేసేవాడు. పార్క్‌హయత్‌లో కారు దొంగతనం చేసేందుకు అతను విమానంలో వచ్చాడు. అలాగే పేట్బషీరాబాద్లో కార్ల చోరీ సమయంలోనూ విమానంలోనే వచ్చిన షెకావత్ లగ్జరీ కార్ కొట్టేసి అందులోనే పరారయ్యాడు. కార్లు దొంగిలించేందుకు కేవలం జేబులో ఓ డివైస్ పెట్టుకొని ఫ్లైట్ ఎక్కి రయ్‌మంటూ వస్తాడు. కర్ణాటకలో 14, రాజస్థాన్‌లో 1, తమిళనాడులో 1, హైదరాబాద్‌లో అయిదు దొంగతనాలు చేసినట్లు బంజారాహిల్స్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఇప్పటి వరకు మొత్తం 61 కార్లు దొంగిలించి విక్రయించినట్లు తెలిపాడు. (చదవండి: రూ.1,700 కోట్ల హెరాయిన్ పట్టివేత) -
తక్కువ ధరకే లగ్జరీ కార్లు ఇప్పిస్తానని మోసం
బంజారాహిల్స్: లగ్జరీ కార్లను మార్కెట్ ధరలో 30 శాతం తక్కువ ధరకు ఇప్పిస్తానని నమ్మించి మోసగించిన స్పేస్ టైమ్ ఇంటీరియర్స్ డైరెక్టర్ ఆత్మకూరి ఆకాష్, అజయ్, విజయ్ కాంజీలపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసుల సమాచారం మేరకు... జూబ్లీహిల్స్ రోడ్ నం. 82లోని సినార్‌వ్యాలీలో నివసించే వ్యాపారి వి.పి.ఆనంద్‌కు తన స్నేహితుడు దివేష్ ద్వారా ఆత్మకూరి ఆకాష్, అజయ్ పరిచయం అయ్యారు. తాము హైఎండ్ కార్లను 30 శాతం రాయితీతో ఇప్పిస్తామని చెప్పడంతో నమ్మిన ఆనంద్ ఆ మేరకు ఇన్నోవా క్రిస్టా కారును కొనేందుకు ఆసక్తి చూపాడు. రూ. 18 లక్షల విలువ చేసే ఈ కారును రూ. 15 లక్షలకే ఇస్తామని చెప్పడంతో ఆ మేరకు రూ. 10.83 లక్షలు చెల్లించాడు. ఇందుకు సంబంధించిన ఆర్సీని కూడా పంపించాడు. అయితే కారును ఇవ్వడంలో ఆకాష్ విఫలమయ్యాడు. అంతకుముందే ఆయన వంద మందికిపైగా వీవీఐపీలను రాయితీ కార్ల పేరుతో రూ. 60 కోట్ల వరకు మోసగించిన కేసులు పోలీస్ స్టేషన్లో నమోదై ఉన్నాయి. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 406, 420 కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్ అన్‌లాక్ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!) -
ఖరీదైన దళారి.. రూ. 200 కోట్లు.. 20 లగ్జరీ కార్లు
సాక్షి, చెన్నై: కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టులు కావాలా, బదిలీలు చేయించాలా, సీబీఐ కేసుల నుంచి తప్పించాలా.. ఇలా ఒకటేమిటి దేశ రాజధానిలో అన్నిపనులు చక్కబెడుతానంటూ మభ్యపెట్టి రూ.200 కోట్ల లావాదేవీలు నెరపిన చెన్నైకి చెందిన ఖరీదైన దళారీ బండారం బట్టబయలైంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు చెన్నైలోని సుకేష్ చంద్రశేఖర్ అనే దళారి ఇంటిపై సోమవారం చేసిన దాడులతో భారీ మోసాల కోణం వెలుగుచూసింది. వివరాలు.. చీఫ్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుంచి అన్నాడీఎంకే పార్టీ చిహ్నమైన రెండాకుల గుర్తును సాధించి పెడతానని రూ.2 కోట్లు లంచం పుచ్చుకున్న కేసులో అరెస్టయిన సుకేష్ చంద్రశేఖర్‌కు చెందిన చెన్నై కానత్తూరులోని ఇంటిలో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం పెద్దఎత్తున దాడులు నిర్వహంచారు. చదవండి: 'నిన్ను మనసారా ప్రేమించా'.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య నేపథ్యం ఇదీ.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత 2015లో ఆ పార్టీ రెండుగా చీలిపోయింది. ఒక వర్గానికి శశికళ, మరో వర్గానికి ఓ పన్నీర్‌సెల్వం సారథ్యం వహించారు. ఎమ్మెల్యేగా జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్కే నగర్ ఖాళీగా మారడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఉప ఎన్నికల్లో శశికళ వర్గం అభ్యర్థిగా టీటీవీ దినకరన్, పన్నీర్‌సెల్వం అభ్యర్థిగా పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ బరిలోకి దిగారు. రెండాకుల చిహ్నం కోసం ఈసీ వద్ద ఇద్దరూ పోటీపడ్డారు. దీంతో రెండాకుల చిహ్నంపై ఈసీ తాత్కాలిక నిషేధం విధించి ఎవ్వరికీ కేటాయించలేదు. దీంతో రెండాకుల చిహ్నాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న పంతంతో టీటీవీ దినకరన్.. దళారి సుకేష్ చంద్రశేఖర్‌ను కలిసి రూ.50 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అడ్వాన్స్‌గా రూ.2 కోట్లు పుచ్చుకుంటున్న సమయంలో ఢిల్లీలో ఈడీ అధికారులు సుకేష్ చంద్రశేఖర్‌ను 2017లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఆనాటి నుంచి సుకేష్ చంద్రశేఖర్ తీహార్ జైల్లో ఉన్నాడు. ఇదిలా ఉండగా, ఢిల్లీకి చెందిన 16 మంది ఈడీ అధికారులు సోమవారం తెల్లవారుజామున చెన్నై కానత్తూరులోని సుకుష్ చంద్రశేఖర్ ఇంటిపై మెరుపుదాడులు చేసి తనిఖీలు ప్రారంభించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న రూ.70 కోట్ల విలువైన 20 లగ్జరీ కార్లు, కారవాన్, నిందితుడి ఇంటిలోని లాప్‌ట్యాప్, లెక్కల్లో చూపని రూ.60 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. లగ్జరీ కార్లన్నీ చట్ట విరుద్ధంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వాగ్మూలం ఆధారంగానే.. తీహార్ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ వద్ద 10 రోజుల క్రితం ఈడీ అధికారులు విచారణ జరిపారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టర్లు, ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారు, సీబీఐ అధికారుల పేర్లు చెప్పి పనులు, బదిలీలు చేయిస్తానని పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకుల నుంచి సుమారు రూ.200 కోట్లు, ఖరీదైన బహుమతులు పొందినట్లు బయటపడింది. అతనిచ్చిన వాంగ్మూలం ఆధారంగానే చెన్నైలోని ఇంట్లో సోదాలు చేపట్టారు. తనిఖీల అనంతరం ఈడీ అధికారులు ఢిల్లీకి వెళ్లిపోయారు. కాగా రెండాకుల గుర్తు కేటాయింపు కేసు విచారణలో భాగంగా సుకేష్ చంద్రశేఖర్‌ను త్వరలో తీహార్ జైలు ఉంచి చెన్నైకి తీసుకురానున్నట్లు తెలిసింది. చదవండి: వైరల్ వీడియో: కన్నకొడుకు కంటే ఈ కుక్కే నయం..! -
ఆడి.. ఎలక్ట్రిక్ రైడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ దిగ్గజం ఆడి భారత్‌లో ఎలక్ట్రిక్ రైడ్‌కు సిద్ధమైంది. తాజాగా ఈ–ట్రాన్ శ్రేణిలో మూడు రకాల పూర్తి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ప్రవేశపెట్టింది. వీటిలో ఈ–ట్రాన్ 50, ఈ–ట్రాన్ 55, ఈ–ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్–55 మోడళ్లు ఉన్నాయి. ఎక్స్‌షోరూంలో ధర రూ.99.99 లక్షల నుంచి రూ.1.18 కోట్ల వరకు ఉంది. ఈ–ట్రాన్ 55, ఈ–ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్–55 మోడళ్లకు 300 కిలోవాట్ పవర్, 664 ఎన్ఎం టార్క్‌తో డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్స్‌ను బిగించారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.7 సెకన్లలో అందుకుంటాయి. ఇందులోని 95 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ ఒకసారి చార్జింగ్ చేస్తే 359–484 కిలోమీటర్ల వరకు కారు ప్రయాణిస్తుంది. 230 కిలోవాట్ డ్యూయల్ మోటార్‌తో ఈ–ట్రాన్ 50 మోడల్ రూపుదిద్దుకుంది. దీనిలోని 71 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ ఒకసారి చార్జింగ్‌తో వాహనం 264–379 కిలోమీటర్లు వెళ్తుంది. అంతర్జాతీయంగా 2025 నాటికి 20 రకాల ప్యూర్ ఎలక్ట్రిక్, 10 రకాల ప్లగ్–ఇన్ హైబ్రిడ్ మోడళ్లను పరిచయం చేయాలన్నది ఆడి లక్ష్యం. వీటిలో కొన్ని భారత్‌లోనూ అడుగుపెట్టనున్నాయి. -
కరువు కోరల్లో ప్రజలుంటే ప్రభువులకు ఖరీదైన కార్లెందుకు?
సాక్షి, ముంబై: ఒక్కపూట భోజనం నోచుకోని ప్రజలు ఒకవైపుంటే మరో వైపు కోట్ల రూపాయల ఖరీదైన బెంజ్ కార్లుంటాయి. ఇది ప్రజాస్వామ్య వైచిత్రి. కరువు కోరల్లో చిక్కిన రాష్ట్ర ప్రజలు పూట గంజికీ నోచని పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయం అప్పుల ఊబిగా మారి వందలాది మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నిత్యం ప్రజా సంక్షేమం గురించి ప్రకటనలు గుప్పించే పాలక పెద్దలు రాష్ర్ట పర్యటనకు వచ్చే ఢిల్లీ పెద్దల కోసం కోట్ల రూపాయలు వెచ్చించి విలాసవంతమైన కారు కొనుగోలు చేస్తున్నారు. ఏకంగా రెండు కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన బుల్లెట్ ఫ్రూప్ మర్సడీజ్ బెంజ్ కారు అక్టోబర్ మొదటివారంలో ప్రభుత్వ అధీనంలోకి రానుంది. ఇంత ఖర్చు ఎందుకని ప్రశ్నిస్తే ఢిల్లీ ప్రముఖులకు భద్రత కోసమని ప్రభుత్వ పెద్దలు సెలవిస్తున్నారు. ఏదైనా ఒక ప్రజా సంక్షేమ పథకం ప్రవేశపెట్టాలంటే సంవత్సరాలు, నెలలు చర్చోపచర్చలు సాగించే అధికారులు, పాలక వర్గ నాయకమన్యులు ఢిల్లీ పెద్దల కోసం ఒక్క కలం పోటుతో రెండు కోట్ల ప్రజాధనాన్ని చెల్లించేశారు. ఈ విలాసవంతమైన కారు కొనుగోలు కోసం ఎవరితో చర్చలు జరిపారు? ఎవరి అనుమతి తీసుకున్నారో పాలకులకే తెలియాలి. ‘‘ఢిల్లీ నుంచి రాష్ట్రపతి, ఇతర ప్రముఖులు రాష్ట్ర పర్యటనకు వస్తుంటారు. వారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాటా సఫారీలో పర్యటిస్తున్నారు. విదేశీ మంత్రులు, రాష్ట్రపతులు వచ్చినా ఇదే కారులో తిప్పాల్సి వస్తుంది. ఇది బుల్లెట్ ఫ్రూప్ కారే అయినప్పటికీ దీనిపై బాంబు దాడి జరిగినా లేదా భూమిలో క్లైమర్లు అమర్చి పేల్చినా కారులో కూర్చున్న ప్రముఖుల ప్రాణాలకు హాని జరిగే ప్రమాదం ఉంది. అలాగే కారు నేలకు ఎత్తు ఉండడం వలన మన రాష్ట్రపతి వంటివారు ఎక్కాలంటే కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి అనేక అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మర్సడీజ్ బెంజి కారు కొనుగోలు చేయాలని నిర్ణయించాము’’ అని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అన్నారని తెలిసింది. దీంతో అధికారులు వెంటనే ప్రభుత్వ అతిథులు, వీఐపీల కోసం బెంజ్ ఎస్ మోడల్ కారును ఆర్డరు వేశారు. అక్టోబరు మొదటి వారంలో ఈ కారు ప్రభుత్వ వాహనాల కాన్వాయ్‌లోకి వచ్చి చేరనుంది. బెంజ్ కంపెనీకి చెందిన ఎస్ మోడల్ కార్లకు భారీ డిమాండ్ ఉంది. ఈ కారుపై బాంబు దాడి, లేదా భూమిలో క్లైమోర్లు అమర్చి పేల్చివేసేందుకు ప్రయత్నించినా ఈ కారులో కూర్చున్న వీఐపీల ప్రాణాలకు ఎలాంటి హానీ జరగదు. అంతేకాకుండా ఈ కారు టైర్లపై రివాల్వర్‌తో కాల్పులు జరిపిన టైర్లు పేలిపోవు. ప్రస్తుతం ఇలాంటి కార్లు బడా పారిశ్రామిక వేత్తలు, అత్యంత ధనవంతులు తమ వ్యక్తిగత భద్రత కోసం వాడుతున్నారు. అందుకే దేశ, విదేశీ మంత్రులు, వీఐపీల భద్రతకు ఇలాంటి కార్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని కొందరు అధికారులు వివరిస్తున్నారు. డ్రైవర్లకు శిక్షణ తతంగమే... మర్సడీజ్ బెంజ్ కంపెనీకి చెందిన ఈ రాయల్ కారు నడపాలంటే ప్రత్యేక శిక్షణ అవసరమట. ఈ కారు నడిపే విధానం నేర్చుకోవడానికి ఇద్దరు డ్రైవర్లను బెంజ్ కంపెనీ తరఫున జర్మనీకి పంపించింది. గతంలో అమెరికా రాష్ట్రపతి ముంబై పర్యటనకు వచ్చినప్పుడు వెంట అక్కడి నుంచి కారు తెచ్చుకున్నారు. దేశ ప్రధాని, రాష్ట్రపతి ముంబై పర్యటనకు వచ్చినప్పుడు ఇదే పరిస్థితి ఎదురౌతోంది. ఇక నుంచి వీఐపీలు తమవెంట కార్లు తెచ్చుకోవల్సిన అవసరం రాదని అధికారులు సంబరంగా చెబుతున్నారు.