థర్డ్ హ్యాండ్ పాత కారు కొన్న స్టార్ హీరో.. ఎందుకు? | Kartik Aaryan Buys Third Hand Car Once Reasons Why | Sakshi
Sakshi News home page

Karthika Aryan: పాత కారు కొన్నాడు.. ఆ తర్వాత మాత్రం

Published Thu, Oct 10 2024 11:50 AM | Last Updated on Thu, Oct 10 2024 12:44 PM

Kartik Aaryan Buys Third Hand Car Once Reasons Why

సెలబ్రిటీలు చాలామందికి కార్ల, బైక్ పిచ్చి ఉంటుంది. మార్కెట్‌లోకి కొత్త మోడల్ రావడం లేటు కొనేస్తుంటారు. తెలుగులో తక్కువ గానీ బాలీవుడ్ స్టార్స్ ఇలాంటివి ఏమైనా కొంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలా ఎప్పటికప్పుడు హై ఎండ్ లగ్జరీ కార్లు కొనే బాలీవుడ్ హీరోల్లో కార్తిక్ ఆర్యన్ ఒకడు. ప్రస్తుతం ఇతడి దగ్గర టాప్ ఇంటర్నేషన్ బ్రాండ్ కార్స్ ఉన్నాయి. అలానే గతంలో ఓసారి థర్డ్ హ్యాండ్ కారు కొన్నాడు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయాన్ని రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్)

'ఓ టైంలో నా దగ్గర ఎలాంటి కారు లేదు. దీంతో ఎలాగైనా సరే కొనలాని అనుకున్నా. రూ.35 వేలు ఖర్చు పెట్టి థర్డ్ హ్యాండ్ కారు కొనుగోలు చేశారు. కష్టం ఎంతైనా సరే జీవితంలో బాగా సెటిలై, ఖరీదైన కార్లు కొనాలని అప్పుడే ఫిక్సయ్యాను. అలా అప్పట్లో సెకండ్ హ్యాండ్ కార్లు చాలా ఉపయోగించాను. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను కొన్న తొలి లగ్జరీ కారు లంబోర్గిని. ప్రస్తుతం నా గ్యారేజీలో రేంజ్ రోవర్, మినీ కూపర్, మెక్ లారెన్ లాంటి కార్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి కార్ల విషయంలో నేను ఫుల్ హ్యాపీ. భవిష్యత్తులో ఇంకెన్ని కొంటానో తెలియదు' అని కార్తిక్ ఆర్యన్ చెప్పుకొచ్చాడు.

2011లో 'ప్యార్ కా పంచనామా' సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన కార్తిక్ ఆర్యన్.. కామెడీ, వైవిధ్య చిత్రాలతో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ టైంలో ఇతడు హీరోగా చేసిన 'చందు ఛాంపియన్' హిట్ అయింది. ప్రస్తుతం 'భూల్ భులయ్యా 3' చేస్తున్నాడు. ఇది దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుంది.

(ఇదీ చదవండి: హీరో నారా రోహిత్‌ నిశ్చితార్థం ఫిక్సయిందా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement