
టాలీవుడ్ హీరో నారా రోహిత్ పెళ్లికి రెడీ అయ్యాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు కొడుకు అయిన రోహిత్.. 'బాణం' సినిమాతో నటుడిగా మారాడు. అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉన్నాడు. కారణమేంటో తెలీదు గానీ ఇప్పటివరకు ఒంటరిగా ఉండిపోయాడు. తాజాగా పెళ్లి ఫిక్సయినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: రజినీకాంత్ 'వేట్టయన్' ట్విటర్ రివ్యూ)
ఈనెల 13న హైదరాబాద్‌లోనే నిశ్చితార్థం జరగనుంది సమాచారం. కుటుంబ సభ్యులు అందరూ ఈ వేడుకకు హాజరవుతారని తెలుస్తోంది. ఇకపోతే నారా రోహిత్‌కి ప్రస్తుతం 40 ఏళ్లు. అంటే లేటు వయసులో వివాహానికి రెడీ అయ్యాడనమాట. అమ్మాయి ఎవరు? డీటైల్స్ ఏం బయటకు రాలేదు
ఇతడు హీరోగా నటించిన 'సుందరకాండ' అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కొన్నాళ్ల ముందు ట్రైలర్ రిలీజ్ చేశారు. లేటు వయసులో పెళ్లి చేసుకోవడం అనే కాన్సెప్ట్‌పైనే ఈ మూవీ స్టోరీ ఉండటం విశేషం. ఇక నారా రోహిత్ నిశ్చితార్థం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్)