ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో నాగార్జున | Akkineni Nagarjuna Visited Khairatabad RTA Office To Registered His Car, Check Out For More Insights | Sakshi
Sakshi News home page

ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో నాగార్జున

Published Thu, Nov 28 2024 2:25 PM | Last Updated on Thu, Nov 28 2024 2:53 PM

Akkineni Nagarjuna Register His Car In Khairatabad RTA

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున  ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయానికి  వచ్చారు. కొత్తగా తను కొనుగోలు చేసిన లగ్జరీ కారు రిజిస్ట్రేషన్‌ కోసం ఆయన అక్కడకు రావడంతో భారీగా ఆయన ఫ్యాన్స్‌ అక్కడకు చేరుకున్నారు. అక్టోబర్‌ నెలలో ఆయన ఈ కారు కొన్నారు. కొత్త కారు TG9 GT/R4874  రిజిస్ట్రేషన్ కోసం ఫొటో దిగి, సంతకం చేసిన నాగ్‌.. అక్కడి అధికారులతో కొంత సమయం పాటు సరదాగ మాట్లాడి వెళ్లిపోయారు.

నాగార్జున కొత్త కారు టయోటా లెక్సస్‌ను చూసిన ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. ఇదే మోడల్‌ కారును  నటుడు రామ్ చరణ్ కూడా ఇటీవల కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో చాలామంది స్టార్స్‌ ఈ కారును కొనుగోలు చేశారు. దీంతో ఇప్పుడు టయోటా లెక్స్‌స్‌ కారు బాగా ట్రెండ్‌ అవుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 2.5 కోట్లు ఉంటుందని సమాచారం.

నాగార్జున్‌ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కుబేర' సినిమాలో ఆయన చాలా కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌- లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌ సినిమా 'కూలీ'లో కూడా నాగ్‌ చాలా ప్రాముఖ్యత ఉన్న రోల్‌లో కనిపించనున్నారు. త్వరలో ఆయన ఇద్దరి కూమారులలో నాగచైతన్య పెళ్లి తేదీ ఇప్పటికే ఫిక్స్‌ కాగా.. అఖిల్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.  ఇలా ఫుల్‌ బిజీ షెడ్యూల్‌లో నాగ్‌ ఉన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement