Khairtabad RTAs office
-
ఆల్‌నైన్ వేలం అదుర్స్.. 9999 నెంబర్‌కు అన్ని లక్షలా..?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీఏ ఫ్యాన్సీ నెంబర్లపై వాహనదారులు తమ క్రేజ్‌ను చాటుకున్నారు. ఖైరతాబాద్ ఆర్టీఏలో శుక్రవారం ప్రత్యేక నెంబర్లకు నిర్వహించిన ఆన్లైన్ వేలంకు వాహనదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. అన్ని ప్రత్యేక నెంబర్లపైన ఆర్టీఏకు రూ.35,58,778 లభించినట్లు జేటీసీ పాండురంగనాయక్ తెలిపారు. టీఎస్ 09 ఎఫ్.వి 9999 నెంబర్ కోసం జి.రాజశేఖర్‌రెడ్డి అనే వాహనదారుడు ఆన్లైన్ వేలం పోటీలో రూ.4,49,999 చెల్లించి సొంతం చేసుకున్నారు. ‘టీఎస్ 09 ఎఫ్ డబ్ల్యూ 0001’ అనే మరో నెంబర్ కోసం శ్రీనిధి ఎస్టేట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వేలంలో పోటీపడి రూ.4 లక్షలు చెల్లించింది. ‘టీఎస్ 09 ఎఫ్డబ్ల్యూ 0099’ నెంబర్ కోసం వై.బిందురెడ్డి ఆన్లైన్ వేలంలో రూ.3,72,000 చెల్లించి సొంతం చేసుకున్నారు. చదవండి: (Hyderabad: గుడ్‌న్యూస్.. సిటీబస్సు @ 24/7) -
9999 @ రూ.5.12 లక్షలు
- ఫ్యాన్సీ నంబర్లకు భలే డిమాండ్ - ఒక్క రోజులోనే ఆర్టీయేకు రూ.10.52 లక్షల ఆదాయం సాక్షి, సిటీబ్యూరో: ఫ్యాన్సీ నంబర్లపై వాహనదారులు మరోసారి తమ క్రేజ్‌ను చాటుకున్నారు.మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలంలో పలు నంబర్లకు వాహనదారుల నుంచి విశేష స్పందన లభించింది. ‘టీఎస్ 09 ఈఏ 9999’ నంబర్‌ను టెక్ట్రీ సాఫ్ట్వేర్ సంస్థ 5,12,95 రూపాయలకు దక్కించుకుంది. రూ.75.26 లక్షల ఖరీదైన డైమ్లర్ కారు కోసం ఈ నెంబర్ తీసుకుంది. ఆర్ఎన్ ఎంటర్ప్రైజెస్ లక్షా 760 రూపాయలు చెల్లించి జాగ్వార్ వాహనానికి ‘టీఎస్ 09 ఈఏ 0001’ నంబర్‌ను కైవసం చేసుకుంది. రాజేశ్వర్‌రెడ్డి అనే వాహనదారుడు రూ.66 వేలు చెల్లించి ‘టీఎస్09 ఈఏ0666’ నంబర్‌ను సొంతం చేసుకున్నారు. మొత్తంగా మంగళవారం నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా 10 లక్షల 52 వేల 655 రూపాయల ఆదాయం వచ్చినట్టు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ రఘునాథ్ తెలిపారు.