'జిహాదీ జాన్ చనిపోయాడో లేదో తెలియదు'
లండన్: సిరియాలో అమెరికా వైమానిక దళాలు జరిపిన దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది, బ్రిటన్ జాతీయుడు జిహాదీ జాన్ చనిపోయాడో లేదో ఇంకా తెలియదని ఇంగ్లండ్ ప్రధాని డేవిడ్ కామెరూన్ అన్నారు. జిహాదీ జాన్ను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి చేశారని, అయితే ఈ ఆపరేషన్ విజయవంతమయిందో లేదో కచ్చితంగా చెప్పలేమని కామెరూన్ చెప్పారు.
వేలమంది కంఠాలను తెగకోసిన నరరూప రాక్షసుడు జిహాదీ జాన్(మహ్మద్ ఎమ్వాజీ)ని ఎలాగైనా మట్టుపెట్టాలని అమెరికా మిలటరీ సేనలు దాడులు నిర్వహించాయి. జిహాదీ జాన్ ఉన్నట్లుగా భావించిన ప్రాంతాల్లో అమెరికా వైమానిక సంస్థ దాడులు జరిపింది. అయితే, ఈ దాడుల్లో మహ్మద్ ఎమ్వాజీ చనిపోయాడా లేదా అనే విషయంపై మాత్రం పెంటగాన్ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.