Jihadi John
-
2015 నుంచి గొంతులు కోస్తున్నాడు..
న్యూయార్క్ : కేవలం కళ్లు మాత్రమే కనిపించేలాగ ముఖానికి నల్లటి ముసుగు. చేతిలో ఓ పదును తేలిన కత్తి.. చూసేందుకు ముసుగుదొంగలా కనిపించే ఆ వ్యక్తి ఉగ్రవాదుల్లోనే అతి క్రూరమైనవాడు. ఆదేశాలు అందుకున్నదే తడువుగా వీడియో కెమెరాకు పోజిస్తూ అతి దారుణంగా అమాయకుల పీకలను తెంపుతుంటాడు. అలా చేసే వ్యక్తిని 'జిహాదీ జాన్' అంటారు. ఇప్పుడు ఆ జిహాదీ జాన్ మారిపోయాడని సమాచారం. భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు సిద్ధార్థ ధర్ ఇప్పుడు జిహాదీ జాన్‌గా మారిపోయాడని తెలుస్తోంది. బ్రిటన్‌కు చెందిన అతడు ఇస్లాం మతంలోకి మారి అనంతరం ఐసిస్‌లో చేరడంతో అమెరికా తాజాగా అతడిని గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించింది. ప్రపంచవ్యాప్త ఉగ్రవాదుల జాబితాలో సిద్ధార్థను చేర్చింది. ప్రస్తుతం అతడే ఐసిస్‌లో జిహాదీ జాన్‌గా ఉంటూ అమాయకులను అతి దారుణంగా గొంతుకోసి చంపుతున్నాడట. ఇతడి గురించి సంక్షిప్త వివరాలు ఓసారి పరిశీలిస్తే.. సిద్ధార్థ తొలుత ఓ బ్రిటన్ హిందువు. ఇస్లాం మతంలోకి మారాక అతడి పేరును అబు రుమాయ్‌సాగా మార్చుకున్నాడు. ప్రస్తుతం బ్రిటన్ టెర్రరిస్టు ఆర్గనైజేషన్ అల్ ముహాజిరౌన్ అనే విభాగానికి నడిపిస్తున్న వారిలో కీలకంగా పనిచేస్తున్నాడు. బ్రిటన్‌లో ఓ కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన అనంతరం సిరియాకు తన భార్య, పిల్లలతో కలిసి పారిపోయి ఐసిస్‌లో చేరాడు. 2015లో డ్రోన్ దాడిలో మహ్మద్ ఎమ్వాజీ(జిహాదీ జాన్) హతమవడంతో అతడి స్థానంలో సీనియర్ కమాండర్‌గా కొనసాగుతున్నాడు. 2016 నుంచి బందీలుగా ఉగ్రవాదులు పట్టుకున్న వారందరిని గొంతు కోసి చంపిన వ్యక్తి ఇతడే అని అమెరికా తాజాగా గుర్తించింది. -
పీకలు తెగ్గోసే జిహాదీ జాన్ బతికేఉన్నాడా?!
లండన్: కోడిని కోసినదానికంటే సులువుగా, అత్యంత కర్కషంగా మనుషుల పీకలు కోసి, ఆ భయానక దృశ్యాలను వీడియోతీసి ప్రపంచాన్ని గడగడలాడించిన ఐఎస్ ఉగ్రవాది జిహాదీ జాన్ ఇంకా బతికే ఉన్నాడా? అమెరికా వైమానిక దళం ప్రకటించినట్లు డ్రోన్ దాడుల్లో జాన్ చనిపోలేదా? ఉగ్రపీడిత దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్న ఈ వార్తలను ప్రఖ్యాత బీబీసీ ప్రసారం చేసింది. తమ దర్యాప్తులో జిహాదీ జాన్ చనిపోయినట్లు ఆధారాలేవీ లభించలేదని సదరు వార్తా సంస్థ చెబుతోంది. (చదవండి: పీకలు కోసిన జిహాదీ జాన్ ఎవరో తెలుసా...!) బ్రిటన్ జాతీయుడైన మొహమ్మద్ ఎంవాజి.. 2006-2009 మధ్యకాలంలో లండన్ లోని వెస్ట్ మినిస్టర్స్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదివాడు. ఆ తర్వాత కువైట్ లోని ఓ ఐటీ కంపెనీకి సేల్స్ మ్యాన్ గా పనిచేశాడు. ఎప్పుడు చేరాడో సరిగ్గా తెలియరాలేదుకాని కువైట్ నుంచి నేరుగా సిరియా వెళ్లి ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరిపోయాడు. 2014లో ఇతని పేరు ప్రపంచమంతా మారుమోయిపోయింది. బ్రిటన్, జపాన్ లకు చెందిన జర్నలిస్టులతోపాటు చాలా మందిని పీకలుకోసి చంపాడు. అయితే సిరియా సైన్యంతో కలిసి అమెరికా వైమానిక దళం జరిపిన డ్రోన్ దాడుల్లో 2015, నవంబర్ 15న జిహాదీ జాన్ హతమైనట్లు వార్తలు వినవచ్చాయి. అమెరికన్ ఎయిర్ ఫోర్సే కాక ఐఎస్ కూడా అతని మరణాన్ని ధృవీకరించాయి. (చదవండి: 'అవును.. జిహాద్ జాన్‌ను చంపేశారు') తాజా వివాదం తెరపైకి వచ్చిందిలా.. మొమమ్మద్ ఎంవాజి అలియాస్ జిహాదీ జన్ కు సంబంధించిన వివరాలు కావాలని బీబీసీ వార్తా సంస్థ ప్రతినిధులు వెస్ట్ మినిస్టర్స్ యూనివర్సిటీని అడగటంతో తాజా వివాదం తెరపైకి వచ్చింది. ఎంవాజికి సంబంధించిన ఎలాంటి వివరాలు ఇవ్వలేమని, అతడు మరణించినట్లుగానీ, అందుకు సంబంధించిన ఆధారాలుగానీ లేనందున జిహాది జాన్ బతికే ఉన్నట్లు భావిస్తామని, అందుకే అతడి చిరునామా సహా ఇతర వివరాలు చెప్పలేమని వర్సిటీ అధికారులు చెప్పిట్లు బీబీసీ కథనంలో పేర్కొన్నారు. బ్రిటన్ ఇన్షర్మేషన్ కమిషనర్ కార్యాలయాన్ని సంప్రదించగా, వర్సిటీ నిబంధనలను సమర్థించినట్లు బీబీసీ తెలిపింది. అంటే..చనిపోయిన జిహాదీ జాన్ వెస్ట్ మినిస్టర్స్ వర్సిటీ లెక్క ప్రకారం బతికున్నట్లే! (చదవండి: జీహాదీ జాన్..ఫేస్ చూపించాడు) -
జిహాదీ జాన్ ఎప్పటికైనా తిరిగొస్తాడు..!
భారతీయ మూలాలు కలిగిన బ్రిటిష్ పౌరుడు.. కొత్త 'జిహాదీ జాన్' గా పిలుస్తున్న సిద్ధార్థ ధర్ చనిపోయినట్లు తాను నమ్మడం లేదని తాజాగా అతడి సోదరి కోనికా ధర్ తాజాగా బ్రిటిష్ పార్లమెంట్ లో ప్రకటించింది. ఎప్పటికైనా అతడు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడన్న నమ్మకం తమకు ఉందంటోంది. ఐసిస్ ఉగ్రవాదుల్లో జిహాదీ జాన్ గా అవతరించిన సిద్ధార్థ్ అలియాస్ అబు రుమేసహ్ వైమానిక దాడుల్లో చనిపోయినట్లు ఇటీవల ఐఎస్ అధికారిక మేగజైన్ దబిక్ నిర్థారించినప్పటికీ ఆ విషయాన్నిఆమె అంగీకరించడం లేదు. తన సోదరుడు అంత దయలేని వ్యక్తి కాదని, హత్యకు గురై ఉండడంటూ ఆమె భావోద్వేగ ప్రకటన చేసింది. సిద్ధార్థ అలియాస్ అబు రుమేసహ... భార్య, నలుగురు పిల్లలతో సహా 2014లో బ్రిటన్ నుంచి పారిపోయి సిరియాకు వెళ్ళి ఐసిస్ లో చేరాడు. పుట్టుకతో హిందువు అయిన అబు.. వ్యాపారం నిమిత్తం బ్రిటన్ వచ్చి, ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ లో అల్ ముహజిరౌన్ అనే రాడికల్ గ్రూప్ లో చేరాడు. అక్కడినుంచి సిరియా వెళ్ళి ఐసిసితో చేతులు కలిపిన అతడు అనేక దారుణాలకు పాల్పడ్డట్లుగా విడుదలైన వీడియోను అప్పట్లో అతడి సోదరి కోనికా, తల్లి శోభితా ప్రత్యక్షంగా చూశారు. అయితే అతడి గొంతు మాత్రం గుర్తుపట్టేలా లేదని, తమను షాక్ కు గురి చేస్తోందని చెప్పారు. అయితే తాజాగా ఇప్పుడు కోనికా మరోసారి ఆ వీడియోలో వ్యక్తి తన సోదరుడు కాదని, అతడు ఎప్పటికైనా తిరిగి ఇంటి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేసింది. సిద్ధార్థ ఓ ఉదారవాద హిందూ కుటుంబంలో పెరిగాడని.. అతడిది అటువంటి తీవ్రవాద చర్యలకు పాల్పడే మనస్తత్వం కాదని కోనికా చెప్తోంది. అతడు ఎక్కడున్నాడో ఎలాగైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తానని, తన సోదరుడు ఉగ్రవాది కాదని నిరూపిస్తానని అంటోంది. కాగా అతడు హత్యకు గురి కాలేదని ఎలా నిరూపించగలవంటూ ఆమెను కామన్స్ హోం ఎఫైర్స్ కమిటీ ప్రశ్నించగా... తన అన్నను గత సెప్టెంబర్ లో చూశానని, ఆ తర్వాత కొన్నాళ్ళకు అతడు సిరియా వెళ్ళిపోయాడని, అప్పట్నుంచీ అతడితో మాట్లాడేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించామని, కానీ రెండుసార్లు మాత్రం అతడు సమాధానం ఇచ్చాడని చెప్తోంది. అయితే మొదటిసారి అతన్ని టీవీలో చూసినప్పుడు మాత్రం అబూ ఎవరు? అని గుర్తించలేకపోయానంది. అతడిని ఐసిస్ కు సంబంధించిన వ్యక్తులు ప్రేరేపించి ఉండొచ్చని, తన మాటలు సాధారణ ప్రజలు నమ్మకపోయినా.. అతడు తన సోదరుడని వక్కాణిస్తోంది. సిరియాలో వారు నివసించే అవకాశం లేదు కనుక తన సోదరుడి కుటుంబం బంధించబడి ఉంటుందని.... అతడి ఇంగ్లీషు భాషను బట్టి బ్రిటిష్ ప్రధాని అతడే తన సోదరుడనడం సరికాదని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
'అవును.. జిహాద్ జాన్‌ను చంపేశారు'
-
'అవును.. జిహాద్ జాన్‌ను చంపేశారు'
బీరుట్: బ్రిటన్‌కు చెందిన ఉగ్రవాది 'జిహాదీ జాన్'ను అమెరికా సైన్యం హతమార్చినట్టు వచ్చిన వార్తలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ధ్రువీకరించింది. గత నవంబర్‌లో సిరియాలోని రక్కాలో డ్రోన్ దాడిలో అతను చనిపోయినట్టు వెల్లడించింది. ఈ దాడి చేసింది తామేనని, జిహాది జాన్‌ను హతమార్చామని అప్పట్లో అమెరికా సైన్యం ప్రకటించగా, ఇప్పుడు ఐఎస్ సంస్థ ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. నవంబర్ 12న రక్కా నగరంలో జిహాదీ జాన్ ప్రయాణిస్తున్న కారుపై జరిగిన డ్రోన్ దాడిలో అతను అక్కడిక్కడే చనిపోయినట్టు ఐఎస్ సంస్థ వెల్లడించింది. జిహాదీ జాన్ పూర్తిగా నల్లటి దుస్తులు ధరించి, తన ముఖానికి ముసుగు ధరించి, బందీల తలలను కిరాతకంగా నరికివేసినప్పటి భయంకర దృశ్యాలను చిత్రీకరించిన వీడియోలు గతంలో వెలుగుచూశాయి. మహమ్మద్ ఎమ్వాజి అలియాస్ జిహాదీ జాన్.. కువైట్‌లో ఇరాక్ సంతతి కుటుంబంలో జన్మించాడు. 1993లో అతని కుటుంబం బ్రిటన్‌కు వలసవెళ్లింది. కంప్యూటర్ ప్రోగామర్ అయిన ఎమ్వాజీ ఐఎస్‌లో చేరాక తన పేరును జిహాదీ జాన్‌గా మార్చుకున్నాడు. 2014లో జిహాద్ జాన్.. ఐఎస్‌కు బందీగా పట్టుబడిన అమెరికా జర్నలిస్టు జేమ్స్ ఫోలే తలను నరికి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత మరికొంతమంది బందీలను ఇదే రీతిలో చంపాడు. అమెరికా, బ్రిటన్ సేనలు జిహాదీ జాన్‌ను లక్ష్యంగా చేసుకుని హతమార్చాయి. -
‘జిహాదీ జాన్’ హతం!
పాశ్చాత్య బందీలకు శిరచ్ఛేదం చేస్తూ నరరూప రాక్షసుడిగా పేరొందిన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) మిలిటెంట్ మహమ్మద్ఎంవాజీ (27) అలియాస్ ‘జిహాదీ జాన్’ సిరియాలో అమెరికా గురువారం జరిపిన ద్రోన్ దాడిలో హతమైనట్లు తెలుస్తోంది. ఎంజావీ హతమై ఉండొచ్చని బ్రిటన్ వర్గాలు కూడా పేర్కొన్నాయి. -
'జిహాదీ జాన్ చనిపోయాడో లేదో తెలియదు'
లండన్: సిరియాలో అమెరికా వైమానిక దళాలు జరిపిన దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది, బ్రిటన్ జాతీయుడు జిహాదీ జాన్ చనిపోయాడో లేదో ఇంకా తెలియదని ఇంగ్లండ్ ప్రధాని డేవిడ్ కామెరూన్ అన్నారు. జిహాదీ జాన్‌ను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి చేశారని, అయితే ఈ ఆపరేషన్ విజయవంతమయిందో లేదో కచ్చితంగా చెప్పలేమని కామెరూన్ చెప్పారు. వేలమంది కంఠాలను తెగకోసిన నరరూప రాక్షసుడు జిహాదీ జాన్(మహ్మద్ ఎమ్వాజీ)ని ఎలాగైనా మట్టుపెట్టాలని అమెరికా మిలటరీ సేనలు దాడులు నిర్వహించాయి. జిహాదీ జాన్ ఉన్నట్లుగా భావించిన ప్రాంతాల్లో అమెరికా వైమానిక సంస్థ దాడులు జరిపింది. అయితే, ఈ దాడుల్లో మహ్మద్ ఎమ్వాజీ చనిపోయాడా లేదా అనే విషయంపై మాత్రం పెంటగాన్ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. -
'జిహాదీ జాన్'పై అమెరికా బాంబుల వర్షం!
వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌కు సంబంధించిన కరడుగట్టిన ఉగ్రవాది జిహాదీ జాన్(మహ్మద్ ఎమ్వాజీ) అంతు చూసేందుకు అమెరికా బయలుదేరింది. వేలమంది కంఠాలను తెగకోసిన ఆ నరరూప రాక్షసుడిని ఎలాగైనా మట్టుపెట్టాలని అమెరికా మిలటరీ సేనలు దాడులు నిర్వహించాయి. గుట్టుచప్పుడు కాకుండా జిహాదీ జాన్ ఉన్నట్లుగా భావించిన ప్రాంతాల్లో అమెరికా వైమానిక సంస్థ దాడులు జరిపింది. ఈ మేరకు పెంటగాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ దాడుల్లో మహ్మద్ ఎమ్వాజీ చనిపోయాడా లేదా అనే విషయంపై మాత్రం అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 'ఆపరేషన్ (దాడులు) జరిపిన ప్రాంతంలో పరిస్థితిని ప్రస్తుతం అంచనా వేస్తున్నాం. జిహాదీ జాన్ మృతిపై ఇంకా వివరాలు తెలియలేదు. తెలిస్తే తప్పకుండా ఆ విషయాలు తెలియజేస్తాం' అని పెంటగాన్ అధికారిక ప్రకటన తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రభావం అధికంగా ఉండే రఖా అనే ప్రాంతంలో ఈ దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది. జిహాదీ జాన్ ఒక దేశం అని కాకుండా అన్ని దేశాలకు చెందిన బందీలను పశువులను వధించినట్లు వధించాడు. కువైట్ లోని ఇరాక్ కుటుంబంలో జన్మించిన ఎమ్వాజీ లండన్ లో కంప్యూటర్ ప్రోగ్రామర్ గా పనిచేసి అనంతరం ప్రపంచంలోనే అతి క్రూరమైన ఉగ్రవాదిగా మారాడు. -
జీహాదీ జాన్..ఫేస్ చూపించాడు..
ఎడారి కంటే కఠినాత్ముడు.. కోడిని కోసిన దానికంటే సులువుగా మనుషుల పీకలు తెగ్గోస్తాడు. ఇస్లామిక్ తీవ్రవాదం పేరుతో ప్రపంచాన్ని వణికించడంలో ఇరానియన్లు, సిరియన్ల కంటే ముందుంటాడు. బ్రిటన్ జాతీయుడైన వాడి అసలు పేరు మహమ్మద్ ఎమ్వాజీ. కానీ సహచరులు, మీడియా పిలిచే ముద్దు పేరు.. జీహాదీ జాన్. అమెరికన్ జర్నలిస్టులు జేమ్స్ ఫోలే, స్టీవెన్ సోల్టో.. బ్రిటిష్ స్వచ్ఛంద సేవకులు డేవిడ్ హెయినెస్, అలెన్ హెన్నింగ్.. జపనీస్ జర్నలిస్ట్ కెంజీ గోటో.. ఇలా లెక్కకు మించి ఐఎస్ఐఎస్కు బందీలుగా చిక్కిన విదేశీయులను అత్యంత కర్కశంగా పీకలు కోసి చంపిన ఆ నల్ల ముసుగు ఉగ్రవాది జీహాదీ జాన్ ముఖం ప్రపంచానికి తెలిసిపోయింది. ఐఎస్ఐఎస్ ఆదివారం విడుదల చేసిన తాజా వీడియోలో జీహాదీ జాన్ ముఖం స్పష్టంగా కనిపించింది. మొత్తం 1.17 నిమిషాల నిడివిగల వీడియోలో ట్రక్కును పేల్చుతున్న దృశ్యాలతోపాటు జీహాదీ జాన్ మాటలు కూడా రికార్డయ్యాయి. 'నేను.. మహమ్మద్ ఎమ్వాజీని. త్వరలోనే లండన్ తిరిగొస్తా.. అక్కడ కూడా తలల నరికివేతను కొనసాగిస్తా' అంటూ తనదైన బ్రిటిష్ యాసలో జీహాదీ జాన్ హెచ్చరికలు పంపాడు. కెమెరా లెన్స్‌ను తదేకంగా చూస్తూ అతను ఈ మాటలు చెప్పాడు. జీహాదీ జాన్ ముఖం ప్రపంచానికి తెలియడంతో అతడి మూలాలను వెలికితీసే పనిలో పడ్డారు లండన్ పోలీసులు. బ్రిటన్ జాతీయుడిని అత్యంత కర్కశంగా హత్య చేసిన తర్వాత జీహాదీ జాన్‌ను ఎలాగైనా సరే మట్టుబెట్టాలని బ్రిటన్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. -
గబ్బర్ సింగ్ లా 'జిహాది జాన్'
లండన్: ఇస్లామిక్ రాజ్యం పేరిట సిరియా, ఇరాక్లలో అల్లకల్లోలం సృష్టిస్తున్న ‘జిహాది జాన్’ బందీలను భయభ్రాంతులను చేసేందుకు అప్పుడప్పుడు ‘షో’లే చిత్రంలోని గబ్బర్ సింగ్‌లాంటి పాత్ర కూడా ధరిస్తాడని అతని చెర నుంచి విముక్తుడైన స్పానిష్ పాత్రికేయుడు జావియర్ ఎస్పినోవా ద్వారా తెలుస్తోంది. ఆయన కథనం ప్రకారం ఓ రోజు జిహాది జాన్ చెరసాలలోని ఓ గదిలో పాత్రికేయుడు జావియర్ను మోకాళ్లపై కూర్చోబెట్టారు. ఇంతలో గుబురు గడ్డెంగల జిహాది జాన్, మధ్యయుగంలో ముస్లిం సైనికులు ఉపయోగించినటువంటి వెండి పిడిగల బారుడు కరవాలంతో గదిలోకి ప్రవేశించాడు. జావియర్ మెడపై తన కరవాలాన్ని పెట్టి సుతిమెత్తగా గీస్తూ ‘ఎలా వుందీ...చల్లగా ఉందికదూ! నీకలా అనిపించడం లేదా? ఇదే నీ మెడకాయనుకోస్తే నీకెంత బాధ కలుగుతుందో ఊహించగలవా,.ఊహు.. ఊహించనంత బాధ కలుగుతుంది’ అంటూ జిహాదీ జాన్ భయభ్రాంతులకు గురిచేశాడు. ఆ తర్వాత కరవాలాన్ని సహచరుడికిచ్చి చేతిలోకి పిస్టల్ తీసుకొని జావియర్ తలపైన గురిపెట్టి గబ్బర్ సింగ్లాగా ‘క్లిక్...క్లిక్...క్లిక్’ మూడుసార్లు పిస్టల్ ట్రిగ్గర్ నొక్కాడు. అందులో బుల్లెట్లు లేకపోవడంతో జావియర్‌కు ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత స్పానిష్ ప్రభుత్వంతో చేసుకొన్న ఒప్పందం ప్రకారం జావియర్ను జిహాది జాన్ ప్రాణాలతో వదిలిపెట్టాడు. జాన్ చెరలో ఆరు నెలలపాటు తాను అనుభవించిన బాధను ‘ది సండే టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జావియర్ వెల్లడించారు. 2013లో టర్కీ సరిహద్దులోకి వెళుతున్న జావియర్ను జిహాది జాన్ అనుచరులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఏడాదికాలంగా ఎంతోమంది బందీల కుత్తుకలను కత్తిరించి, వాటి తాలూకు వీడియోలను సామాజిక వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తున్న నరరూప రాక్షసుడు జిహాది జాన్ అసలు పేరు అదికాదు. అతినికి బందీలు పెట్టిన నిక్‌నేమ్ అది. అసలు పేరు మొహమ్మద్ జాసిమ్ అబ్దుల్ కరీమ్. బ్రిటన్ జాతీయుడు. పుట్టింది కువైట్‌లో. ఆరవ ఏటనే అతని తల్లిదండ్రులు బ్రిటన్ వెళ్లి స్థిరపడడంతో అతను బ్రిటన్ జాతీయుడయ్యాడు. బీఎస్సీ ఆనర్స్ చదివిన జాన్ తన 21వ ఏట కువైట్కెళ్లి ఇక్కడ ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. మంచి పనివంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఏమైందో ఏమోగానీ అ తర్వాత సిరియా వెళ్లి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్లో కలిసిపోయాడు. అమెరికా జర్నలిస్ట్ స్టీవెన్ సాట్లాస్ గొంతుకోసి చంపిన వీడియో దృశ్యాన్ని 2014, సెప్టెంబర్ రెండవ తేదీన ‘యూట్యూబ్’లో అప్లోడ్ చేయడం ద్వారా జిహాది జాన్ గురించి ప్రపంచానికి తెల్సింది. అదే ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన జిహాది జాన్‌ను ఎప్బీఐ గుర్తించింది. అతను స్కూల్లో చదివిన నాటి ఫొటోలను కూడా విడుదల చేసింది. ఇప్పుడు ఆ ఉగ్రవాదిని పట్టుకోవడం కోసం బ్రిటన్, అమెరికాలతోపాటు వాటి మిత్ర దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. -
జిహాదీ జాన్‌కు యాంగర్ థెరపీ..
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కు చెందిన కరడు గట్టిన ఉగ్రవాది జిహాదీ జాన్‌కు అతడు చదువుకున్న పాఠశాలలోని ఉపాధ్యాయులు కోపాన్ని నియంత్రించుకునే థెరపీ (యాంగర్ థెరపీ) ఇచ్చారట. నిరంతరం అతడు తోటి విద్యార్థులతో అనవసరంగా గొడవపడుతుండటం చూసి ఈ థెరపీని ఇచ్చినట్లు లండన్‌లోని క్వీన్స్ పార్క్‌లోగల క్వింటిన్ కినాస్తోన్ పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఈ పాఠశాలలో అతడు సెకండరీ ఎడ్యుకేషన్ చదివాడు. జిహాదీ జాన్ విజయాన్ని అందుకునేందుకు నిరంతరం తపించేవాడని, నిజంగా లవ్ లీ, లవ్ లీ, లవ్ లీ బాయ్ అని వారన్నారు. అందరిని చాలా బాగా గౌరవించేవాడని, తనకొచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని సంపాధించుకుని పాఠశాల వెలుపల అడుగు పెట్టాడని చెప్పారు. కొన్ని సంవత్సరాల తర్వాత అతడు క్రూరంగా హత్యలు చేయడం చూసి షాక్‌కు గురైనట్లు తెలిపారు. బ్రిటన్, అమెరికాతోపాటు పలు దేశాల్లోని వారిని బంధీలుగా పట్టుకెళ్లి క్రూరంగా జిహాదీ జాన్ హతమారుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలె అతడి అసలు పేరు మహమ్మద్ ఎంమ్వాజీ అని తెలిసింది. -
జిహాదీ జాన్ నాక్కావాలి..
నిత్యం మారణకాండతో భయోత్సాతానికి గురిచేసే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది జిహాదీ జాన్(మహ్మద్ ఎమ్వాజీ) తనకు ప్రాణాలతో కావాలని బ్రిటన్‌కు చెందిన డేవిడ్ హెయిన్స్ భార్య డ్రాగానా హెయిన్ కోరింది. డేవిడ్ హెయిన్స్ జిహాదీ జాన్ చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. అంతేకాదు ఆ హత్య చేసిన వీడియోను కూడా జిహాదీ జాన్ పంపించాడు. దీంతో ఆమె తీవ్ర బాధలో కూరుకుపోయింది. కొత్తగా జిహాదీ జాన్ అసలు పేరు తెలియడంతో అతడి వల్ల నష్టపోయిన పలుకుటుంబాలు ఇప్పుడు అతడి చావును కోరుకుంటున్నాయి. 'జిహాదీ జాన్‌ను ప్రాణాలతో పట్టుకోవాలి. అప్పుడు మాత్రమే అతడి వల్ల నష్టపోయిన కుటుంబాలకు మీరు మంచి చేసినవాళ్లవుతారు. ఎందుకంటే అతడు సైన్యం దాడుల్లో చనిపోతే గౌరవ మరణాన్ని పొందినట్లవుతాడు. అలా కాకుండా కటకటాల్లో పెట్టి మరణశిక్ష విధించాలి' అని ఆమె ఆవేధన వ్యక్తం చేశారు. -
పీకలు కోసిన జిహాదీ జాన్ ఎవరో తెలుసా...!
-
పీకలు కోసిన జిహాదీ జాన్ ఎవరో తెలుసా...!
'జిహాదీ జాన్'.. ఈ పేరు వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది.. నిలువునా పీకలు తెంచడం అతడికి ఎడమచేతి పని. ఇతడు చేసే హత్యాకాండ అంతా ఇంతా కాదు. పూర్తిగా నల్లటి దుస్తులు, ముసుగు ధరించి, కొంచెం కళ్లు, ముక్కు చివరి భాగం కనిపించేలా ఉండి ఎడమ చేతిలో పదునైన కత్తితో ఎప్పుడూ అమాయకులను బందీలుగా పట్టుకెళ్లి పీకలు తెగకోస్తూంటాడు. ఇప్పటివరకు ఇతడి పేరు కానీ, వివరాలు కానీ ఎవరికీ తెలియదు.. అయితే చివరికి ఇతడు లండన్‌కు చెందిన వ్యక్తి అని, బాగా చదువుకున్నవాడని, ఉన్నత కుటుంబీకుడని తెలిసింది. అతడి స్నేహితులు, మరికొందరు సన్నిహితుల ద్వారా పేరు 'మహమ్మద్ ఎంవాజీ' అని స్పష్టమైనట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. మహమ్మద్ ఎంవాజీ కువైట్‌లో జన్మించి బ్రిటన్‌లో పెరిగాడు. తల్లిదండ్రులతో కలసి లండన్‌లో ఉంటూ కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. 2012లో సిరియా మొత్తం పర్యటించిన ఇతడు చివరికి ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థలో చేరాడు. అప్పటి నుంచి తన బెదిరింపు వీడియోలతో, క్రూరమైన నరమేధంతో ప్రపంచ దేశాలను నిత్యం భయోత్సాతానికి గురిచేయడం మొదలుపెట్టాడు. ఇతడి చేతిలో ఎంతోమంది అమెరికన్లు, బ్రిటిషర్లు, సిరయన్లు బందీలుగా మారి ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాలకు కూడా బెదిరింపు వీడియోలు పంపించాడు. -
'ఆ జీహాదీ జాన్ జాడను పసిగట్టండి'
లండన్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు తమ దేశ పౌరుడైన అలెన్ హెన్నింగ్ను బందీగా పట్టుకొని శిరచ్ఛేదం చేయడాన్ని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తీవ్రంగా పరిగణించారు. ముఖానికి ముసుగు ధరించి అలెన్‌ను శిరచ్ఛేదం చేసిన ఉగ్రవాది ‘జీహాదీ జాన్’ జాడ పసిగట్టాల్సిందిగా తమ గూఢచార సంస్థల అధిపతులను ఆదేశించారు. అతని ఉనికిని పసిగడితే అతన్ని హతమార్చేందుకు లేదా బందీగా పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలను పంపుతానని దేశ ప్రధాన గూఢచార సంస్థలైన ఎంఐ5, ఎంఐ6, జీసీహెచ్‌క్యూ చీఫ్‌లతో శనివారం జరిపిన భేటీలో కామెరాన్ చెప్పారు. ఐఎస్ ఉగ్రవాదులు మరో బ్రిటన్ పౌరుడికి శిరచ్ఛేదం చేసిన సంగతి తెలిసిందే. ఓ బ్రిటిష్ పౌరుడిని తలనరికి ఆ దృశ్యాలున్న వీడియోను శుక్రవారం ఇంటర్నెట్లో పెట్టారు. బ్రిటన్‌కు చెందిన అలెన్ హెన్నింగ్ అనే టాక్సీడ్రైవర్ ఓ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రవూల్లో పాలుపంచుకోవడానికి దాదాపు ఏడాది కిందట సిరియా వెళ్లాడు. అతడిని బందీగా పట్టుకున్న ఐఎస్ మిలిటెంట్లు, దారుణంగా నరికి చంపారు. తవుపై దాడులకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపినందుకు ప్రతీకారంగా ఆ దేశ పౌరులను ఇలా శిక్షిస్తున్నట్టు వీడియోలో పేర్కొన్నారు.