ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కు చెందిన కరడు గట్టిన ఉగ్రవాది జిహాదీ జాన్కు అతడు చదువుకున్న పాఠశాలలోని ఉపాధ్యాయులు కోపాన్ని నియంత్రించుకునే థెరపీ (యాంగర్ థెరపీ) ఇచ్చారట. నిరంతరం అతడు తోటి విద్యార్థులతో అనవసరంగా గొడవపడుతుండటం చూసి ఈ థెరపీని ఇచ్చినట్లు లండన్లోని క్వీన్స్ పార్క్లోగల క్వింటిన్ కినాస్తోన్ పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఈ పాఠశాలలో అతడు సెకండరీ ఎడ్యుకేషన్ చదివాడు.
జిహాదీ జాన్ విజయాన్ని అందుకునేందుకు నిరంతరం తపించేవాడని, నిజంగా లవ్ లీ, లవ్ లీ, లవ్ లీ బాయ్ అని వారన్నారు. అందరిని చాలా బాగా గౌరవించేవాడని, తనకొచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని సంపాధించుకుని పాఠశాల వెలుపల అడుగు పెట్టాడని చెప్పారు. కొన్ని సంవత్సరాల తర్వాత అతడు క్రూరంగా హత్యలు చేయడం చూసి షాక్కు గురైనట్లు తెలిపారు. బ్రిటన్, అమెరికాతోపాటు పలు దేశాల్లోని వారిని బంధీలుగా పట్టుకెళ్లి క్రూరంగా జిహాదీ జాన్ హతమారుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలె అతడి అసలు పేరు మహమ్మద్ ఎంమ్వాజీ అని తెలిసింది.
జిహాదీ జాన్కు యాంగర్ థెరపీ..
Published Sat, Feb 28 2015 4:47 PM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM
Advertisement