పీకలు కోసిన జిహాదీ జాన్ ఎవరో తెలుసా...! | do you know who is jihadi john? | Sakshi
Sakshi News home page

పీకలు కోసిన జిహాదీ జాన్ ఎవరో తెలుసా...!

Published Thu, Feb 26 2015 7:40 PM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM

పీకలు కోసిన జిహాదీ జాన్ ఎవరో తెలుసా...!

పీకలు కోసిన జిహాదీ జాన్ ఎవరో తెలుసా...!

'జిహాదీ జాన్'.. ఈ పేరు వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది.. నిలువునా పీకలు తెంచడం అతడికి ఎడమచేతి పని. ఇతడు చేసే హత్యాకాండ అంతా ఇంతా కాదు. పూర్తిగా నల్లటి దుస్తులు, ముసుగు ధరించి, కొంచెం కళ్లు, ముక్కు చివరి భాగం కనిపించేలా ఉండి ఎడమ చేతిలో పదునైన కత్తితో ఎప్పుడూ అమాయకులను బందీలుగా పట్టుకెళ్లి పీకలు తెగకోస్తూంటాడు. ఇప్పటివరకు ఇతడి పేరు కానీ, వివరాలు కానీ ఎవరికీ తెలియదు.. అయితే చివరికి ఇతడు లండన్కు చెందిన వ్యక్తి అని, బాగా చదువుకున్నవాడని, ఉన్నత కుటుంబీకుడని తెలిసింది. అతడి స్నేహితులు, మరికొందరు సన్నిహితుల ద్వారా పేరు 'మహమ్మద్ ఎంవాజీ' అని స్పష్టమైనట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.

మహమ్మద్ ఎంవాజీ కువైట్లో జన్మించి బ్రిటన్లో పెరిగాడు. తల్లిదండ్రులతో కలసి లండన్లో ఉంటూ కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో డిగ్రీ పూర్తి చేశాడు. 2012లో సిరియా మొత్తం పర్యటించిన ఇతడు చివరికి ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థలో చేరాడు. అప్పటి నుంచి తన బెదిరింపు వీడియోలతో, క్రూరమైన నరమేధంతో ప్రపంచ దేశాలను నిత్యం భయోత్సాతానికి గురిచేయడం మొదలుపెట్టాడు. ఇతడి చేతిలో ఎంతోమంది అమెరికన్లు, బ్రిటిషర్లు, సిరయన్లు బందీలుగా మారి ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాలకు కూడా బెదిరింపు వీడియోలు పంపించాడు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement