mohammed emwazi
-
పీకలు తెగ్గోసే జిహాదీ జాన్ బతికేఉన్నాడా?!
లండన్: కోడిని కోసినదానికంటే సులువుగా, అత్యంత కర్కషంగా మనుషుల పీకలు కోసి, ఆ భయానక దృశ్యాలను వీడియోతీసి ప్రపంచాన్ని గడగడలాడించిన ఐఎస్ ఉగ్రవాది జిహాదీ జాన్ ఇంకా బతికే ఉన్నాడా? అమెరికా వైమానిక దళం ప్రకటించినట్లు డ్రోన్ దాడుల్లో జాన్ చనిపోలేదా? ఉగ్రపీడిత దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్న ఈ వార్తలను ప్రఖ్యాత బీబీసీ ప్రసారం చేసింది. తమ దర్యాప్తులో జిహాదీ జాన్ చనిపోయినట్లు ఆధారాలేవీ లభించలేదని సదరు వార్తా సంస్థ చెబుతోంది. (చదవండి: పీకలు కోసిన జిహాదీ జాన్ ఎవరో తెలుసా...!) బ్రిటన్ జాతీయుడైన మొహమ్మద్ ఎంవాజి.. 2006-2009 మధ్యకాలంలో లండన్ లోని వెస్ట్ మినిస్టర్స్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదివాడు. ఆ తర్వాత కువైట్ లోని ఓ ఐటీ కంపెనీకి సేల్స్ మ్యాన్ గా పనిచేశాడు. ఎప్పుడు చేరాడో సరిగ్గా తెలియరాలేదుకాని కువైట్ నుంచి నేరుగా సిరియా వెళ్లి ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరిపోయాడు. 2014లో ఇతని పేరు ప్రపంచమంతా మారుమోయిపోయింది. బ్రిటన్, జపాన్ లకు చెందిన జర్నలిస్టులతోపాటు చాలా మందిని పీకలుకోసి చంపాడు. అయితే సిరియా సైన్యంతో కలిసి అమెరికా వైమానిక దళం జరిపిన డ్రోన్ దాడుల్లో 2015, నవంబర్ 15న జిహాదీ జాన్ హతమైనట్లు వార్తలు వినవచ్చాయి. అమెరికన్ ఎయిర్ ఫోర్సే కాక ఐఎస్ కూడా అతని మరణాన్ని ధృవీకరించాయి. (చదవండి: 'అవును.. జిహాద్ జాన్‌ను చంపేశారు') తాజా వివాదం తెరపైకి వచ్చిందిలా.. మొమమ్మద్ ఎంవాజి అలియాస్ జిహాదీ జన్ కు సంబంధించిన వివరాలు కావాలని బీబీసీ వార్తా సంస్థ ప్రతినిధులు వెస్ట్ మినిస్టర్స్ యూనివర్సిటీని అడగటంతో తాజా వివాదం తెరపైకి వచ్చింది. ఎంవాజికి సంబంధించిన ఎలాంటి వివరాలు ఇవ్వలేమని, అతడు మరణించినట్లుగానీ, అందుకు సంబంధించిన ఆధారాలుగానీ లేనందున జిహాది జాన్ బతికే ఉన్నట్లు భావిస్తామని, అందుకే అతడి చిరునామా సహా ఇతర వివరాలు చెప్పలేమని వర్సిటీ అధికారులు చెప్పిట్లు బీబీసీ కథనంలో పేర్కొన్నారు. బ్రిటన్ ఇన్షర్మేషన్ కమిషనర్ కార్యాలయాన్ని సంప్రదించగా, వర్సిటీ నిబంధనలను సమర్థించినట్లు బీబీసీ తెలిపింది. అంటే..చనిపోయిన జిహాదీ జాన్ వెస్ట్ మినిస్టర్స్ వర్సిటీ లెక్క ప్రకారం బతికున్నట్లే! (చదవండి: జీహాదీ జాన్..ఫేస్ చూపించాడు) -
'అవును.. జిహాద్ జాన్‌ను చంపేశారు'
-
'అవును.. జిహాద్ జాన్‌ను చంపేశారు'
బీరుట్: బ్రిటన్‌కు చెందిన ఉగ్రవాది 'జిహాదీ జాన్'ను అమెరికా సైన్యం హతమార్చినట్టు వచ్చిన వార్తలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ధ్రువీకరించింది. గత నవంబర్‌లో సిరియాలోని రక్కాలో డ్రోన్ దాడిలో అతను చనిపోయినట్టు వెల్లడించింది. ఈ దాడి చేసింది తామేనని, జిహాది జాన్‌ను హతమార్చామని అప్పట్లో అమెరికా సైన్యం ప్రకటించగా, ఇప్పుడు ఐఎస్ సంస్థ ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. నవంబర్ 12న రక్కా నగరంలో జిహాదీ జాన్ ప్రయాణిస్తున్న కారుపై జరిగిన డ్రోన్ దాడిలో అతను అక్కడిక్కడే చనిపోయినట్టు ఐఎస్ సంస్థ వెల్లడించింది. జిహాదీ జాన్ పూర్తిగా నల్లటి దుస్తులు ధరించి, తన ముఖానికి ముసుగు ధరించి, బందీల తలలను కిరాతకంగా నరికివేసినప్పటి భయంకర దృశ్యాలను చిత్రీకరించిన వీడియోలు గతంలో వెలుగుచూశాయి. మహమ్మద్ ఎమ్వాజి అలియాస్ జిహాదీ జాన్.. కువైట్‌లో ఇరాక్ సంతతి కుటుంబంలో జన్మించాడు. 1993లో అతని కుటుంబం బ్రిటన్‌కు వలసవెళ్లింది. కంప్యూటర్ ప్రోగామర్ అయిన ఎమ్వాజీ ఐఎస్‌లో చేరాక తన పేరును జిహాదీ జాన్‌గా మార్చుకున్నాడు. 2014లో జిహాద్ జాన్.. ఐఎస్‌కు బందీగా పట్టుబడిన అమెరికా జర్నలిస్టు జేమ్స్ ఫోలే తలను నరికి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత మరికొంతమంది బందీలను ఇదే రీతిలో చంపాడు. అమెరికా, బ్రిటన్ సేనలు జిహాదీ జాన్‌ను లక్ష్యంగా చేసుకుని హతమార్చాయి. -
జీహాదీ జాన్..ఫేస్ చూపించాడు..
ఎడారి కంటే కఠినాత్ముడు.. కోడిని కోసిన దానికంటే సులువుగా మనుషుల పీకలు తెగ్గోస్తాడు. ఇస్లామిక్ తీవ్రవాదం పేరుతో ప్రపంచాన్ని వణికించడంలో ఇరానియన్లు, సిరియన్ల కంటే ముందుంటాడు. బ్రిటన్ జాతీయుడైన వాడి అసలు పేరు మహమ్మద్ ఎమ్వాజీ. కానీ సహచరులు, మీడియా పిలిచే ముద్దు పేరు.. జీహాదీ జాన్. అమెరికన్ జర్నలిస్టులు జేమ్స్ ఫోలే, స్టీవెన్ సోల్టో.. బ్రిటిష్ స్వచ్ఛంద సేవకులు డేవిడ్ హెయినెస్, అలెన్ హెన్నింగ్.. జపనీస్ జర్నలిస్ట్ కెంజీ గోటో.. ఇలా లెక్కకు మించి ఐఎస్ఐఎస్కు బందీలుగా చిక్కిన విదేశీయులను అత్యంత కర్కశంగా పీకలు కోసి చంపిన ఆ నల్ల ముసుగు ఉగ్రవాది జీహాదీ జాన్ ముఖం ప్రపంచానికి తెలిసిపోయింది. ఐఎస్ఐఎస్ ఆదివారం విడుదల చేసిన తాజా వీడియోలో జీహాదీ జాన్ ముఖం స్పష్టంగా కనిపించింది. మొత్తం 1.17 నిమిషాల నిడివిగల వీడియోలో ట్రక్కును పేల్చుతున్న దృశ్యాలతోపాటు జీహాదీ జాన్ మాటలు కూడా రికార్డయ్యాయి. 'నేను.. మహమ్మద్ ఎమ్వాజీని. త్వరలోనే లండన్ తిరిగొస్తా.. అక్కడ కూడా తలల నరికివేతను కొనసాగిస్తా' అంటూ తనదైన బ్రిటిష్ యాసలో జీహాదీ జాన్ హెచ్చరికలు పంపాడు. కెమెరా లెన్స్‌ను తదేకంగా చూస్తూ అతను ఈ మాటలు చెప్పాడు. జీహాదీ జాన్ ముఖం ప్రపంచానికి తెలియడంతో అతడి మూలాలను వెలికితీసే పనిలో పడ్డారు లండన్ పోలీసులు. బ్రిటన్ జాతీయుడిని అత్యంత కర్కశంగా హత్య చేసిన తర్వాత జీహాదీ జాన్‌ను ఎలాగైనా సరే మట్టుబెట్టాలని బ్రిటన్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. -
పీకలు కోసిన జిహాదీ జాన్ ఎవరో తెలుసా...!
-
పీకలు కోసిన జిహాదీ జాన్ ఎవరో తెలుసా...!
'జిహాదీ జాన్'.. ఈ పేరు వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది.. నిలువునా పీకలు తెంచడం అతడికి ఎడమచేతి పని. ఇతడు చేసే హత్యాకాండ అంతా ఇంతా కాదు. పూర్తిగా నల్లటి దుస్తులు, ముసుగు ధరించి, కొంచెం కళ్లు, ముక్కు చివరి భాగం కనిపించేలా ఉండి ఎడమ చేతిలో పదునైన కత్తితో ఎప్పుడూ అమాయకులను బందీలుగా పట్టుకెళ్లి పీకలు తెగకోస్తూంటాడు. ఇప్పటివరకు ఇతడి పేరు కానీ, వివరాలు కానీ ఎవరికీ తెలియదు.. అయితే చివరికి ఇతడు లండన్‌కు చెందిన వ్యక్తి అని, బాగా చదువుకున్నవాడని, ఉన్నత కుటుంబీకుడని తెలిసింది. అతడి స్నేహితులు, మరికొందరు సన్నిహితుల ద్వారా పేరు 'మహమ్మద్ ఎంవాజీ' అని స్పష్టమైనట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. మహమ్మద్ ఎంవాజీ కువైట్‌లో జన్మించి బ్రిటన్‌లో పెరిగాడు. తల్లిదండ్రులతో కలసి లండన్‌లో ఉంటూ కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. 2012లో సిరియా మొత్తం పర్యటించిన ఇతడు చివరికి ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థలో చేరాడు. అప్పటి నుంచి తన బెదిరింపు వీడియోలతో, క్రూరమైన నరమేధంతో ప్రపంచ దేశాలను నిత్యం భయోత్సాతానికి గురిచేయడం మొదలుపెట్టాడు. ఇతడి చేతిలో ఎంతోమంది అమెరికన్లు, బ్రిటిషర్లు, సిరయన్లు బందీలుగా మారి ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాలకు కూడా బెదిరింపు వీడియోలు పంపించాడు.